May 10, 20251 yr Author జులైలోగా హంద్రీనీవా విస్తరణ హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సాకారమైతే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. By Andhra Pradesh News DeskUpdated : 10 May 2025 06:36 IST Ee Font size 4 min read ఆ నెల 10న నేనే వచ్చి నీరు విడుదల చేస్తా ఈ ప్రాజెక్టు పూర్తయితే రాయలసీమలో 6.02 లక్షల ఎకరాలకు సాగునీరు సీఎం చంద్రబాబు వెల్లడి వైకాపా ప్రభుత్వం రూపాయి కూడా ఖర్చు పెట్టలేదని ధ్వజం ఉరవకొండ నియోజకవర్గంలో పనుల పరిశీలన అధికారులతో కలిసి హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు ఈనాడు - అనంతపురం, న్యూస్‌టుడే- ఉరవకొండ: హంద్రీ నీవా సుజల స్రవంతి ప్రాజెక్టు సాకారమైతే రాయలసీమ రతనాల సీమగా మారుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టు విస్తరణ పనులను జులైలోగా పూర్తి చేస్తామని ప్రకటించారు. 770 కిలోమీటర్ల పొడవుతో ఆసియాలోనే అతి పెద్దదైన హంద్రీ నీవాకు ఎన్టీఆర్ శ్రీకారం చుడితే.. తాను ముందుకు తీసుకెళ్లానన్నారు. గతంలో బచావత్ అవార్డు కింద కేటాయింపులున్న ప్రాంతానికి మాత్రమే నీరు అందించేవారని.. మిగులు జలాలు వాడుకునే హక్కును గుర్తించి హంద్రీ నీవా, గాలేరు-నగరి పథకాలకు శ్రీకారం చుట్టింది తెదేపానే అని గుర్తు చేశారు. ముఖ్యమంత్రి శుక్రవారం అనంతపురం జిల్లా ఉరవకొండ నియోజకవర్గ పరిధిలోని వజ్రకరూరు మండలం ఛాయాపురం వద్ద హంద్రీ నీవా విస్తరణ పనులను పరిశీలించారు. అక్కడే ప్రజావేదికపై మాట్లాడారు. ‘ఒకప్పుడు అనంతపురం జిల్లాలో వేరుసెనగ తప్ప మరో పంట కనిపించేది కాదు. 10 సార్లు పంట పెడితే రెండుసార్లే చేతికొచ్చేది. అలాంటి పరిస్థితుల్లో మొట్టమొదటగా తెదేపా ప్రభుత్వం రైతులకు నష్టపరిహారం అందించింది. డ్రిప్ విధానం తీసుకొచ్చాక చాలామంది రైతులు ఉద్యాన పంటల సాగులో బ్రహ్మాండంగా రాణిస్తున్నారు. ఇక్కడి రైతులకు నీరందిస్తే బంగారం పండించగలరు. అందుకే హంద్రీ నీవాకు అత్యంత ప్రాధాన్యమిచ్చి, బడ్జెట్‌లో నిధులు కేటాయించాం. మొదటి ఫేజ్‌లో 10 మీటర్ల నుంచి 16.5 మీటర్లకు వెడల్పు చేయడంతో పాటు రెండో ఫేజ్‌లో లైనింగ్ చేపట్టాం. వెడల్పు, విస్తరణ కారణంగా కాలువ సామర్థ్యం 3,850 క్యూసెక్కులకు పెరుగుతుంది. 5 నెలల్లో పనులు పూర్తి చేయాలన్నది లక్ష్యం. వచ్చే నెలాఖరుకు మొదటి దశ పనులు పూర్తి చేస్తాం. జులై 10న మళ్లీ నేనే వచ్చి నీరు విడుదల చేస్తా. దీంతోపాటు సముద్రంలోకి వృథాగా పోతున్న గోదావరి నీటిని రాయలసీమకు తరలించేందుకు పోలవరం- బనకచర్ల ప్రాజెక్టు చేపడతాం. దీనికి రూ.81 వేల కోట్లు అవసరం. అయినా వెనకడుగు వేయకుండా ముందుకెళ్తున్నాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. రూ.3,873 కోట్లతో పనులు హంద్రీ నీవాలో 554 కి.మీ. మేర లైనింగ్, వెడల్పు పనులకు మొత్తం రూ.3,873 కోట్లు కేటాయించినట్లు ముఖ్యమంత్రి చెప్పారు. ఫేజ్-1లో రూ.696 కోట్లు, ఫేజ్-2లో రూ.1,256 కోట్లతో పనులు చేపట్టామన్నారు. పుంగనూరు బ్రాంచ్ కాలువకు రూ.480 కోట్లు, కుప్పం బ్రాంచ్ కాలువకు రూ.197 కోట్లు కేటాయించి పనులు చేపట్టామన్నారు. పనులు పూర్తయితే ఫేజ్-1లో కర్నూలు జిల్లాలో 77,094 ఎకరాలు, నంద్యాలలో 2,906 ఎకరాలు, అనంతపురంలో 1.18 లక్షల ఎకరాలు, ఫేజ్-2లో అనంతపురం జిల్లాలో 33,617 ఎకరాలు, శ్రీసత్యసాయి జిల్లాలో 1.93 లక్షల ఎకరాలు, వైఎస్సార్ జిల్లాలో 37,500 ఎకరాలు, చిత్తూరులో 1.40 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతుందని తెలిపారు. మొత్తంగా 6.02 లక్షల ఎకరాలు సస్యశ్యామలం అవుతాయన్నారు. వైకాపా ప్రభుత్వం ఐదేళ్లలో హంద్రీ నీవాకు రూపాయి కూడా ఖర్చు చేయలేదని సీఎం విమర్శించారు. అభివృద్ధితో పాటు పెద్దఎత్తున సంక్షేమం అందిస్తున్నట్లు చంద్రబాబు చెప్పారు. 63 లక్షల మందికి రూ.4 వేల నుంచి రూ.15 వేల వరకు పింఛన్లు అందిస్తున్నామన్నారు. పింఛన్లకే ఏటా రూ.33 వేల కోట్లు ఖర్చు చేస్తున్నామని తెలిపారు. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇస్తున్నామని.. సిలిండర్లకు బదులుగా ఖాతాలో నగదు జమ చేసే ఆలోచనలో ఉన్నామని చంద్రబాబు వెల్లడించారు. హంద్రీ నీవా కాలువ విస్తరణ పనులను పరిశీలిస్తున్న సీఎం చంద్రబాబు, మంత్రులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు, తదితరులు ప్రకటించిన గంటలోనే జీవో తెచ్చారు: పయ్యావుల హంద్రీ నీవా విస్తరణ పనులు సీఎం చంద్రబాబు పుణ్యమే అని ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ పేర్కొన్నారు. 2014లో చంద్రబాబు సీఎం అయిన తర్వాత పామిడి వచ్చారని.. అక్కడే హంద్రీ నీవా విస్తరణ చేపడుతున్నట్లు ప్రకటించారన్నారు. సమావేశం ముగిసిన గంటలోనే జీవో విడుదల చేసిన ఘనత ఆయనదేనన్నారు. అప్పట్లోనే 37 శాతం పనులు పూర్తి చేశామన్నారు. అధికారంలోకి వస్తే మూడు నెలల్లోనే పనులు మొదలుపెడతామని ఉరవకొండలో జలదీక్ష చేసిన జగన్.. సీఎం అయ్యాక గంపెడు మట్టి కూడా తీయలేదని ధ్వజమెత్తారు. వైకాపా ప్రభుత్వం రాష్ట్రంలో జలవనరుల రంగాన్ని విధ్వంసం చేసిందని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ధ్వజమెత్తారు. రాయలసీమలో సాగునీటి పథకాలకు తెదేపా ప్రభుత్వం రూ.12,441 కోట్లు వెచ్చిస్తే.. వైకాపా ప్రభుత్వం రూ.2,011 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందన్నారు. హంద్రీనీవా పథకం విద్యుత్తు బిల్లులను కూడా చెల్లించకుండా బకాయి పెట్టిందని మండిపడ్డారు. దేశాన్ని రక్షించే శక్తి మోదీకే ఉంది పాకిస్థాన్ తీరుతో దేశంలో యుద్ధ వాతావరణం నెలకొందని చంద్రబాబు పేర్కొన్నారు. ఉగ్రవాదులు భార్యాబిడ్డల ఎదుటే పౌరులను చంపారని.. అందుకు ప్రతి చర్యగా ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత ఆర్మీ ఉగ్ర స్థావరాలపై దాడి చేసి ఉగ్రవాదులను హతమార్చిందన్నారు. దేశాన్ని రక్షించే శక్తి ప్రధాని మోదీకి తప్ప ఇంకొకరికి లేదని స్పష్టం చేశారు. అంతకుముందు కశ్మీర్‌లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్ ఆత్మ శాంతించాలని సీఎం, మంత్రులు, సభకు హాజరైన వారందరూ మౌనం పాటించారు.
May 13, 20251 yr https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/projects-can-only-be-sustained-if-they-receive-funding/1702/125085834
May 15, 20251 yr https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/national-dam-safety-authority-dissatisfied-on-srisailam-project/1702/125086998
May 19, 20251 yr https://www.deccanchronicle.com/southern-states/andhra-pradesh/andhra-pradesh-no-funds-for-irrigation-works-except-weed-removal-1879784
May 21, 20251 yr https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/poor-maintenance-of-irrigation-projects-in-andhra-pradesh/1702/125090736
May 24, 20251 yr https://www.eenadu.net/telugu-news/andhra-pradesh/general/1702/125092841 scrap polavaram banakacharla, build polavaram somasila
July 8, 20251 yr On 7/4/2025 at 11:11 AM, narens said: eeyanaku edo oka manchi post ivvali.. Baagaa maatlaadathaadu. TDP spokesperson padhavi ivvaali. Tv debates ki pampaali
Create an account or sign in to comment