navayuvarathna Posted April 27 Posted April 27 ‘బాలయ్యకు కోపం ఎక్కువబ్బా.. ఫ్యాన్స్ ను కొడతాడు.. బూతులు మాట్లాడతాడు’.. ఇలా హీరో బాలకృష్ణ గురించి తరచూ ఇలాంటి నెగెటివ్ కామెంట్స్ వినిపిస్తుంటాయి. కానీ బయటకు కనిపించినా బాలయ్య మనసు బంగారం లాంటిదని ఆయన గురించి బాగా తెలిసిన వాళ్లు చెబుతుంటారు. కష్టాల్లో ఉన్నవారికి నేనున్నానంటూ సాయం చేస్తుంటారీ నందమూరి హీరో. అందులో భాగంగానే బసవ తారకం ఆస్పత్రి ద్వారా ఎంతో మందికి చికిత్సఅందిస్తున్నారు. అలాగే అభిమానులు కష్టాల్లో ఉండే అడిగి మరీ సాయం చేస్తుంటారు. తాజాగా ఆయన మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నారు. వివరాల్లోకి వెళితే.. ఇటీవల విడుదలైన పదో తరగతి ఫలితాల్లో తూర్పుగోదావరి జిల్లా అన్నదేవరపేటకు చెందిన దివ్యాంగురాలు లావణ్య లక్ష్మి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయ్యింది. ఇందులో గొప్పే ముందీ అనుకుంటున్నారా? ఆ అమ్మాయి పూర్తిగా దివ్యాంగురాలు. అన్నీ మంచం పైనే. ఇతరుల సాయం లేకుండా ఒక చిన్న పని కూడా చేయలేని దీన స్థితి. అయితేనేం చదువుకోవాలన్న ఆకాంక్ష ముందు ఆ కష్టాలన్నీ పక్కకెళ్లిపోయాయి. దృఢ సంకల్పంతో పదో తరగతి పరీక్షలు రాసి ఫస్ట్ క్లాస్ లో ఉత్తీర్ణురాలైంది. 345 మార్కులు సాధించి ఔరా అనిపించింది. దీంతో అందరూ ఈ దివ్యాంగురాలిని తెగ మెచ్చుకుంటున్నారు.
navayuvarathna Posted April 27 Posted April 27 ఈ క్రమంలోనే లావణ్య లక్ష్మి గురించి తెలుసుకున్న బాలయ్య ఫోన్ చేసి మరీ ఆమెను అభినందించారు. ‘చాలా సంతోషంగా ఉందమ్మా.. చాలా గర్వంగా ఉంది. 345 మార్కులు రావడం చాలా సంతోషంగా ఉంది. నీకేమీ లోటు ఉండదు. భగవంతుడికి ఒక ఛాలెంజ్ విసిరి, ఈ ఘనత సాధించినందుకు చాలా గర్వంగా ఉంది చెల్లెమ్మా’ అంటూ ఆప్యాయంగా పలకరించాడు బాలయ్య. దీంతో లావణ్య ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. బాలయ్య ఫోన్ చేయడంపై లావణ్య లక్ష్మి మాట్లాడుతూ ‘నాకు ఫోన చేసి అభినందించిన బాలకృష్ణ సార్‌కి థ్యాంక్స్’ అని ఎమోషనల్ అయ్యింది. అంతకు ముందు మంత్రి లోకేష్ కూడా లావణ్యను అభినందించారు. అలాగే మాజీ మంత్రి, టీడీపీ నేత జవహర్ కూడా లక్ష్మీ ఇంటికి వెళ్లి మరీ అభినందనలు తెలిపారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో తెగ వైరలవుతోంది. ముఖ్యంగా బాలయ్య ఫ్యాన్స్ ఈ వీడియోను తెగ షేర్ చేస్తున్నారు’ జై బాలయ్య.. ఇదిరా మా బాలయ్య’ అంటూ ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఇక సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నారు బాలయ్య.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.