July 6, 2025Jul 6 Author AP Govt: క్వాంటమ్‌తో నవశకం ABN , Publish Date - Jul 06 , 2025 | 03:17 AM భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ పరిశ్రమను భారత్ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీతో దేశ... క్వాంటమ్ వ్యాలీతో సరికొత్త విప్లవానికి నాంది క్వాంటమ్ పరిశ్రమను శాసించే దిశగా ఏపీ వైద్య, సాంకేతిక రంగాల్లో చరిత్రాత్మక మార్పులు ఈ టెక్నాలజీతో మారనున్న దేశ ముఖచిత్రం జాతీయ క్వాంటమ్ మిషన్ లక్ష్యాలు క్వాంటమ్ టెక్నాలజీలో పరిశోధన, అభివృద్ధిని ప్రోత్సహించడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిందే జాతీయ క్వాంటమ్ మిషన్ (ఎన్‌క్యూఎం). 2023 నుంచి 2031 వరకూ కొనసాగే ఈ మిషన్ కోసం కేంద్రం మొత్తం రూ.6వేల కోట్లకుపైగా ఖర్చు చేయనుంది. ఈ మిషన్‌లో భాగంగానే ఏపీలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనున్నారు. ఈ మిషన్ లక్ష్యాలు ఏమిటంటే.. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్ రంగాల్లో పరిశోధన, అభివృద్ధిని వేగవంతం చేయడం. క్వాంటమ్ టెక్నాలజీలో స్వయం సమృద్ధిని సాధించడం. క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో అంతర్జాతీయంగా భారత్‌ను అగ్రగామిగా నిలబెట్టడం. (అమరావతి - ఆంధ్రజ్యోతి) భారత్‌లో ఇప్పుడు ఎక్కడ చూసినా క్వాంటమ్ కంప్యూటింగ్ పేరు మార్మోగిపోతోంది. భవిష్యత్తులో క్వాంటమ్ పరిశ్రమను భారత్ శాసించబోతుందా.. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్‌లో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ వ్యాలీతో దేశ, రాష్ట్ర ముఖచిత్రమే మారనుందా..? అనే ప్రశ్నలకు అవుననే సమాధానం వినిపిస్తోంది. దేశంలోనే మొట్టమొదటి క్వాంటమ్ వ్యాలీని అమరావతిలో ఏర్పాటు చేయాలని ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని గేమ్ చేంజర్‌గా నిపుణులు అభివర్ణిస్తున్నారు. ఈ క్వాంటమ్ వ్యాలీ అందుబాటులోకి వస్తే టెక్నాలజీ రంగంలో ఎన్నో విప్లవాత్మక మార్పులు జరిగే అవకాశం ఉందని చెబుతున్నారు. మన దేశ సైబర్ సెక్యూరిటీ వ్యవస్థ ఎవరూ ఛేదించలేనంత పటిష్ఠంగా మారుతుందని, వైద్య రంగంలో నయంకాని ఎన్నో రోగాలకు వ్యాక్సిన్లు, మందులు అందుబాటులోకి వస్తాయని, వాతావరణంలోని మార్పులను, ప్రకృతి వైపరీత్యాలను కూడా ముందే పసిగట్టవచ్చని, దేశ రక్షణ కోసం శక్తిమంతమైన ఆయుధాలను అభివృద్ధి చేయవచ్చని చెబుతున్నారు. అయితే ఇవన్నీ.. ఒక్క క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో ఎలా సాధ్యమవుతాయో.. వివరంగా తెలుసుకుందాం. క్వాంటమ్ కంప్యూటర్ తయారీ.. 1990 నుంచి 2000 మధ్యలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఐటీ సెక్టార్‌లో ఎవరూ ఊహించిన అభివృద్ధిని అందుకుంది. అయితే ఈసారి ఐటీ పరిశ్రమకు బదులుగా క్వాంటమ్ ఇండస్ట్రీలో ఆ అభివృద్ధిని తీసుకురావాలని ప్రస్తుత ప్రభుత్వం భావిస్తోంది. దీనికోసం అమరావతిలోని 50 ఎకరాలలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కోసం ఇప్పటికే భూమిని కేటాయించింది. అయితే ఈ క్వాంటమ్ వ్యాలీని ముందుకు నడిపించేది క్వాంటమ్ కంప్యూటర్. ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థలు కలిసి త్వరలోనే భారతదేశపు చరిత్రలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేయబోతున్నాయి. క్వాంటమ్ సిస్టమ్-2గా భావిస్తున్న ఇది 156 క్యూబిట్ల సామర్థ్యం ఉండే హెరాన్ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. క్వాంటమ్ టెక్నాలజీ అంటే ఏమిటి..? క్వాంటమ్ టెక్నాలజీ అనేది భౌతికశాస్త్రం, ఇంజనీరింగ్ విభాగాల కలయిక. ప్రస్తుతం మనం వాడే సాధారణ కంప్యూటర్ల కన్నా సూపర్ కంప్యూటర్స్ చాలా పవర్‌ఫుల్‌గా పనిచేస్తాయి. కానీ.. ఆ సూపర్ కంప్యూటర్ల కన్నా లక్షల రెట్లు ఎక్కువ సామర్థ్యంతో పనిచేసేవే ఈ క్వాంటమ్ కంప్యూటర్లు. దీనికి కారణం మనం వాడే సాధారణ కంప్యూటర్ల బైనరీ మీద ఆధారపడి పనిచేస్తే.. ఇవి క్వాంటమ్ మెకానిక్స్ సూత్రాల ఆధారంగా పనిచేస్తాయి. బైనరీ సిస్టమ్‌లో 0, 1 అనే రెండు బిట్స్ ఉంటాయి. ఇక్కడ జీరో అంటే ఆఫ్ అని.. వన్ అంటే ఆన్ అని అర్థం. అదే క్వాంటమ్ కంప్యూటర్స్‌లో మాత్రం క్వాంటమ్ బిట్స్ ఉంటాయి. వీటినే క్యూబిట్స్ అని కూడా అంటారు. ఈ క్యూబిట్స్ ప్రత్యేకత ఏమిటంటే.. ఇవి ఒకేసారి జీరోగానూ, వన్‌గానూ ఉండగలవు. దీనినే క్వాంటమ్ ఫిజిక్స్‌లో క్వాంటమ్ సూపర్ పొజిషన్ అని అంటారు. ఈ సూపర్ పొజిషన్ సాయంతో సాధారణ కంప్యూటర్‌లో రెండు బిట్లు చేసే పనినే క్వాంటమ్ కంప్యూటర్‌లో ఒక బిట్ మాత్రమే పూర్తి చేయగలదు. ఇలా క్యూబిట్స్ సంఖ్య పెరిగేకొద్దీ కంప్యూటర్ ప్రాసెసింగ్ పవర్ అనేది విపరీతంగా పెరుగుతుంది. రెండు క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ నాలుగు పాజిబుల్ వ్యాల్యూ్‌సని కనుక్కోగలిగితే 20 క్యూబిట్స్ ఉన్న కంప్యూటర్ 10 లక్షల కన్నా ఎక్కువ వ్యాల్యూ్‌సని గుర్తించగలదు. తయారీ అంత ఈజీ కాదు నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా ఇటీవల బెంగళూరుకు చెందిన క్యూపై ఏఐ అనే కంపెనీ భారతదేశపు మొట్టమొదటి క్వాంటమ్ కంప్యూటర్‌ను తయారు చేసింది. ఇది 25 సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ సహాయంతో పనిచేస్తుంది. ఇక అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ కంప్యూటర్ అయితే.. 156 క్యూబిట్‌ల ప్రాసెసింగ్ పవర్‌తో పనిచేయనుంది. అందుకే దీన్ని భారతదేశపు అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటర్ అని పిలుస్తున్నారు. ప్రస్తుతం అమెరికాలో ఆల్గరిథమ్స్‌ను రాయడానికి ఏ హార్డ్‌వేర్‌ను అయితే ఉపయోగిస్తున్నారో ఇది కూడా ఆ విభాగంలోకే వస్తుంది. అలాగే ఈ క్వాంటమ్ కంప్యూటర్ల డిజైన్ కూడా మనం రోజూ వాడే సాధారణ కంప్యూటర్లతో పోలిస్తే చాలా విభిన్నంగా ఉంటుంది. ఈ సిస్టమ్ మొత్తాన్నీ కూడా ఒక సీల్డ్ బాక్స్‌లో పెడతారు. క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేయడం అంత ఈజీ కాదు. ఎందుకంటే ఇప్పుడు మనం వాడే సాధారణ కంప్యూటర్లలో ట్రాన్సిస్టర్లు కదలకుండా ఫిక్స్‌డ్‌గా ఉంటాయి. క్వాంటమ్ కంప్యూటర్లలో అలాకాదు. ఇక్కడ పార్టికల్స్ అనేవి ఎప్పుడూ కదులుతూనే ఉంటాయి. కాబట్టి చిన్న వైబ్రేషన్ వచ్చినా.. టెంపరేటచర్‌లో చిన్న తేడా వచ్చినా.. రేడియేషన్ పెరిగినా.. ఇలా చిన్న అంతరాయం ఎదురైనా ఇవి మైక్రో సెకన్లలోనే తమ క్వాంటమ్‌లను కోల్పోతాయి. అప్పుడు ఈ ప్రాజెక్టు కోసం పెట్టిన ఖర్చంతా వృథా అవుంతుంది. కాబట్టే వీటిని బయటి ప్రపంచంతో సంబంధం లేనటువంటి ఒక ప్రత్యేమైన ఆపరేటింగ్ రూమ్స్‌లో ఉంచుతారు. అలాగే -273 డిగ్రీల చల్లటి వాతావరణం మధ్యలో వీటిని ఏర్పాటు చేస్తారు. దీనికోసమే ఈ కంప్యూటర్‌ని ఒక సీల్డ్ బాక్సులో భద్రపరుస్తారు. కాబట్టి క్వాంటమ్ కంప్యూటర్ దాని పూర్తిసామర్థ్యంతో పనిచేయాలంటే ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. విప్లవాత్మక మార్పులు క్వాంటమ్ కంప్యూటర్ ఎన్నో కాలిక్యులేషన్స్‌ని చేయడం ద్వారా అసాధ్యం అనుకున్న ప్రాజెక్టులను సుసాధ్యం చేయగలదు. ఇది చూపించే సొల్యూషన్స్‌తో కొత్త వ్యాక్సిన్లను, ఔషధాలను కనుగొనేందుకు సహాయపడగలదు. భవిష్యత్తులో రాబోయే ప్రకృతి విపత్తులను వంద ు కచ్చితత్వంతో అంచనా వేయగలదు. అలాగే స్టాక్ మార్కెట్‌లో రిస్క్‌ను తగ్గించడం, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) వంటి కొత్త టెక్నాలజీని తయారు చేయడం, రవాణాలో ఖర్చుతక్కువయ్యే మార్గాలను కనుగొనడంలో సహాయపడగలదు. సైబర్ సెక్యూరిటీ, కమ్యూనికేషన్, రక్షణ రంగం, క్రిప్టోగ్రఫీ.. ఇలా ఎన్నో రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ విప్లవాత్మక మార్పులు తీసుకురాగలదు. అగ్రదేశాల సరసన చేరేలా.. ఇలాంటి క్వాంటమ్ టెక్నాలజీపై అమెరికా, చైనా, ఫ్రాన్స్, కెనడా, ఫిన్లాండ్ వంటి అతికొద్ది దేశాలు మాత్రమే పనిచేస్తున్నాయి. ఈ క్రమంలో క్వాంటమ్ టెక్నాలజీతో ప్రపంచ దేశాలను తనవైపు తిప్పుకొనే దిశగా భారత్ అడుగులు వేస్తోంది. దీనికోసం చేపట్టిన నేషనల్ క్వాంటమ్ మిషన్‌లో భాగంగా అమరావతిలో నిర్మించబోయే క్వాంటమ్ వ్యాలీ 2026 జనవరి 1 నాటికి అందుబాటులోకి వస్తుందని చెబుతున్నారు. కంప్యూటర్ నిర్మాణంతోపాటు, డేటా సెంటర్లు, రిసెర్చ్ ఇంక్యుబేటర్లు, టెక్ పార్కులను నిర్మించనున్నారు. ప్రపంచాన్ని ప్రభావం చేయను న్న క్వాంటమ్ ఇండస్ట్రీలోకి అమెరికా, చైనా వంటి దేశాలు దీటుగా భారత్ అడుగుపెట్టడం.. అదికూడా అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయనుండడం సరికొత్త విప్లవానికి నాంది పలకనుందని విశ్లేషకులు భావిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్‌కు 7 సెకన్లు చాలు క్వాంటమ్ వ్యాలీతో అద్భుతాలు ఆవిష్కారమవుతాయి. దీనికి క్వాంటమ్ కంప్యూటరే కారణం. వీటిలో ఉండే అసాధారణ కంప్యూటింగ్ పవర్ ప్రపంచంలోని ఎంతటి క్లిష్టమైన సమస్యనైనా సరే పరిష్కరించగలుగుతుంది. ఎందుకంటే ప్రస్తుతం మన దగ్గరున్న ఎంతగొప్ప సూపర్ కంప్యూటర్ అయినా సరే ఒక సమస్య వచ్చిందంటే.. దాన్ని పరిష్కరించడానికి ఒక్కో సమాధానాన్ని ఒకదాని తర్వాత ఒకటి సరిచూసుకుంటూ వెళ్తుంది. దీనికి చాలా సమయం పడుతుంది. కానీ, క్వాంటమ్ కంప్యూటర్స్ మాత్రం దాని క్వాంటమ్ సెర్చ్‌లో సరైన సమాధానం కోసం కోటానుకోట్ల మార్గాలను ఒకేసారి అన్వేషించి వాటిలో నుంచి సరైన సమాధానాన్ని పసిగడుతుంది. ఉదాహరణకు ఒక బలమైన పాస్‌వర్డ్‌ను క్రాక్ చేయడానికి ఇప్పుడున్న సూపర్ కంప్యూటర్లకు కొన్ని సంవత్సరాలు పడితే.. క్వాంటమ్ కంప్యూటర్ మాత్రం దానికి ఉన్న ప్రాసెసింగ్ స్పీడ్‌తో ఈ పాస్‌వర్డ్‌ను కేవలం ఏడు సెకన్లలోనే క్రాక్ చేస్తుంది. ఇది ప్రపంచంలోని ఎంత స్ట్రాంగ్ పాస్‌వర్డ్‌నైనా సరే కొన్ని సెకన్లలోనే క్రాక్ చేయగలదు. కానీ, ఇది సృష్టించే ఎన్‌స్ర్కిప్షన్‌ను బ్రేక్ చేయాలంటే మాత్రం శత్రుదేశ హ్యాకర్లకు ఒక జీవిత కాలం సరిపోదు.
July 6, 2025Jul 6 For me, This is the only exciting project for amaravathi. Chuddam how fast this would get into reality
July 6, 2025Jul 6 4 hours ago, Siddhugwotham said: అమరావతిలో నిర్మిస్తున్న " క్వాంటం వ్యాలీ" MOU తో పాటు ఒక లక్ష కోట్లు GST కడుతోంది. మొదటి సంవత్సరం లో 5 లక్షల కోట్లు జిఎస్టి కట్టే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఎన్ని లక్షల కోట్లు GST కట్టనున్నదో అంచనా వేయలేమని నిపుణులు తెలియజేశారు. దాదాపు 6 నుంచి 10 లక్షల జీఎస్టీ కట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు. idhi mari ardham pardham lekunda undhae... ee kaaki GSt lekkalu Edited July 6, 2025Jul 6 by AndhraBullodu
July 6, 2025Jul 6 Author 1 hour ago, AndhraBullodu said: idhi mari ardham pardham lekunda undhae... ee kaaki GSt lekkalu
July 7, 2025Jul 7 21 hours ago, AndhraBullodu said: idhi mari ardham pardham lekunda undhae... ee kaaki GSt lekkalu
July 7, 2025Jul 7 Author Quantum Valley: 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి.. డిక్లరేషన్‌కు ఆమోదం By Andhra Pradesh News TeamUpdated : 07 Jul 2025 13:59 IST Ee Font size 1 min read అమరావతి: క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్‌ను ఏపీ ప్రభుత్వం ఆమోదించింది. జూన్ 30న విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో చేసిన డిక్లరేషన్‌కు ఆమోదం లభించింది. ఈ మేరకు ఐటీ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్ ఉత్తర్వులు జారీ చేశారు. అమరావతిని క్వాంటమ్ గేట్ వే హబ్‌గా అభివృద్ధి చేయడమే లక్ష్యంగా “అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్”ను రూపొందించారు. క్వాంటమ్ పరిశోధన, ఆవిష్కరణ, అభివృద్ధి, మౌలిక సదుపాయాలు, అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటమ్ బెడ్‌గా క్వూ-చిప్-ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటమ్ కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో ప్రభుత్వం వెల్లడించింది. 2026లో ప్రారంభమయ్యే అమరావతి క్వాంటమ్ అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని నిర్ణయించారు. (Andhra Pradesh
July 7, 2025Jul 7 Author Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ ఉత్తర్వులు జారీ ABN , Publish Date - Jul 07 , 2025 | 01:21 PM Amaravati Quantum Valley Declaration: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్‌ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. Amaravati Quantum Valley Declaration అమరావతి, జులై 7: అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్ (Amaravati Quantum Valley Declaration) ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు జీవో ఆర్టీ నెంబర్ 23ను ఐటీ ఎలక్ట్రనిక్స్ అండ్ కమ్యూనికేషన్ శాఖ కార్యదర్శి భాస్కర్ కాటమనేని ఈరోజు (సోమవారం) జారీ చేశారు. జూన్ 30న విజయవాడలో ‘అమరావతి క్వాంటం వ్యాలీ వర్క్‌షాప్’ను నిర్వహించినట్టు ఉత్తర్వుల్లో వెల్లడించారు. ఈ వర్క్‌షాప్ ద్వారా ప్రభుత్వ, పరిశ్రమ, విద్యా సంస్థలు, స్టార్టప్‌లు కలిసి కొత్త టెక్నాలజీని సమన్వయంతో పనిచేసే దిశగా చర్చలు జరిగాయన్నారు. అమరావతిని గ్లోబల్ క్వాంటం టెక్నాలజీ హబ్‌గా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో ‘అమరావతి క్వాంటం వ్యాలీ డిక్లరేషన్’ను జూన్ 30న ప్రభుత్వం ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ డిక్లరేషన్‌పై నేడు అధికారిక ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ ఉత్తర్వుల ద్వారా క్వాంటం పరిశోధన, ఆవిష్కరణ, ప్రతిభ అభివృద్ధి, మౌలిక సదుపాయాలు అంతర్జాతీయ భాగస్వామ్యాలకు ప్రాధాన్యం ఇవ్వనునట్టు వెల్లడించారు. దేశంలోనే అతి పెద్ద క్వాంటం బెడ్‌గా క్వూ - చిప్ - ఇన్‌ను వచ్చే 12 నెలల్లో అమరావతిలో ఏర్పాటు చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 2035 నాటికి ప్రపంచ క్వాంటం కేంద్రంగా అమరావతి అభివృద్ధే లక్ష్యమని ఉత్తర్వుల్లో తెలిపారు. 2026లో ప్రారంభం అయ్యే అమరావతి క్వాంటం అకాడమీ ద్వారా శిక్షణ, ఫెలోషిప్‌లు అందజేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవి కూడా చదవండి
July 8, 2025Jul 8 Author Nara Lokesh: మరో ఆరు నెలల్లోనే అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ: మంత్రి లోకేశ్ By Andhra Pradesh News TeamPublished : 08 Jul 2025 13:43 IST Ee Font size 1 min read బెంగుళూరు: మరో ఆరు నెలల్లో సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయనున్నట్టు ఏపీ మంత్రి నారా లోకేశ్ తెలిపారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్వాంటమ్ టెక్నాలజీ వంటి అధునాతన సాంకేతిక రంగాల్లో శరవేగంగా అభివృద్ధి చెందుతోన్న ఆంధ్రప్రదేశ్‌లో గ్లోబల్ కేపబిలిటీ సెంటర్లపై పెట్టుబడులు పెట్టాలని కోరారు. దేశంలో పేరెన్నికగన్న దిగ్గజ జీసీసీ సంస్థల ప్రతినిధులతో కలిసి మంత్రి లోకేశ్ బెంగుళూరు మాన్యత ఎంబసీ బిజినెస్ పార్కులో రోడ్ షో నిర్వహించారు. ‘‘ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆంధ్రప్రదేశ్ వైపు చూస్తోంది. రాష్ట్రంలో పెట్టుబడులకు ఇదే సరైన సమయం. టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో దేశంలోనే తొలిసారిగా ఏపీ రాజధాని అమరావతిలో మరో ఆరు నెలల్లోనే క్వాంటమ్ వ్యాలీ ఆవిష్కృతం కాబోతోంది. ఇది భారత్ సాంకేతిక విప్లవంలో గేమ్ ఛేంజర్‌గా నిలుస్తుంది. మరోవైపు విశాఖ మహానగరం ఐటీ హబ్‌గా తయారవుతోంది. విజనరీ లీడర్ చంద్రబాబు నేతృత్వంలో ప్రస్తుతం ఏపీలో ఇన్వెస్టర్స్ ఫ్రెండ్లీ విధానాలు అమలు చేస్తున్నాం. దేశంలో మరే రాష్ట్రం ఇవ్వని విధంగా రాయితీలు అందజేస్తున్నాం. అధునాతన సాంకేతికతలకు నిలయంగా మారుతున్న ఏపీలో పెట్టుబడులు పెట్టాలి’’ అని మంత్రి లోకేశ్ విజ్ఞప్తి చేశారు.
July 11, 2025Jul 11 Author Quantum Valley: ప్రపంచంలోనే మేటి భవనం! By Andhra Pradesh News DeskUpdated : 11 Jul 2025 06:43 IST Ee Font size 3 min read ఐకానిక్‌గా అమరావతి ‘క్వాంటమ్’ వ్యాలీ 40 వేల చదరపు అడుగుల్లో నిర్మాణం గాలి చొరబడని విధంగా ‘ఐసొలేషన్’ ఈనాడు - అమరావతి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనాన్ని ఐకానిక్‌గా నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఆ భవన ఆకృతి ప్రపంచంలో ఎక్కడా లేనంత ప్రత్యేకంగా ఉండాలని.. ‘క్వాంటమ్ వ్యాలీ’ ఆకృతి గురించి ప్రపంచం మాట్లాడుకునే స్థాయిలో ఉండాలని సీఎం చంద్రబాబు అధికారులకు సూచించారు. ఇప్పటికే సీఎం రెండుసార్లు అధికారులతో చర్చించారు. మరో వారంలో నమూనా ఎంపిక కొలిక్కి తేవాలని ప్రభుత్వం భావిస్తోంది. 156 క్యూబిట్‌ల క్వాంటమ్ టూ కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఐబీఎం సంస్థ డీపీఆర్‌ను ప్రభుత్వానికి అందించింది. ప్రపంచంలో ఉన్న ప్రముఖ సంస్థలను అమరావతి క్వాంటమ్ వ్యాలీకి తీసుకువచ్చేందుకు అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. ‘కంపెనీలు, స్టార్టప్‌లు.. పరిశోధనలు నిర్వహించే సంస్థలు, క్వాంటం హార్డ్‌వేర్ సంస్థలు, విశ్వవిద్యాలయాలకు ప్రభుత్వం భూములు కేటాయిస్తుంది’ అని ఒక అధికారి తెలిపారు. క్వాంటమ్ భవనమే.. ఒక ప్రత్యేకత క్వాంటమ్ వ్యాలీలో కంప్యూటర్ పరిశోధన.. అభివృద్ధి కేంద్రాన్ని ఐబీఎం సంస్థ ఏర్పాటు చేయనుంది. ఇందుకోసం 40,000 చదరపు అడుగుల విస్తీర్ణం ఉన్న భవనాన్ని నిర్మిస్తుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఫోటాన్ (కాంతి కణం) ఆధారంగా పనిచేస్తుంది. ఈ దృష్ట్యా ప్రత్యేకమైన భద్రతతో కూడిన వాతావరణం ఉండాలి. ఆ కంప్యూటర్ ఉన్న గదిలోకి వెంట్రుక మందం ఖాళీ నుంచి గాలి వెళ్లినా.. వేవ్స్ (తరంగాలు) తగిలినా ప్రాసెసర్‌పై ప్రభావం పడి వచ్చే ఫలితం మారిపోతుంది. కంప్యూటర్ ఏర్పాటుచేసే గది చుట్టూ గోడలు నిర్మిస్తూ.. ఐసొలేట్ చేసుకుంటూ వస్తారు. బయటి నుంచి కాంతి, శబ్దాలు చొరబడకుండా ఇన్సులేషన్ ఉంటుంది. ఇలాంటి కొన్ని లేయర్ల నిర్మాణాల తర్వాత క్వాంటమ్ కంప్యూటర్ ఉండే ప్రాంతం ఉంటుంది. అందులో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించేలా ఏర్పాట్లు చేస్తారు. కంప్యూటర్‌లో వినియోగించే ప్రతి చిన్న విడి భాగానికి ఒక శాస్త్రవేత్త ఉంటారు. క్వాంటమ్ ఫిజిక్స్, క్వాంటమ్ సెన్సింగ్ వంటి వివిధ సాంకేతికతల మేళవింపుతో క్వాంటమ్ కంప్యూటర్ తయారవుతుంది. ఇక్కడి నుంచే క్లౌడ్ ద్వారా ప్రపంచం మొత్తానికి క్వాంటమ్ సేవలను సంస్థ అందిస్తుంది. ఐబీఎం తయారు చేసే క్వాంటమ్ కంప్యూటర్‌లో వినియోగించే సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ డిజైన్ల తయారీ అనుబంధ యూనిట్లకు కూడా స్పేస్‌ను కేటాయించనున్నారు. 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలు మొత్తం వ్యాలీలో దశల వారీగా 90 లక్షల చదరపు అడుగుల్లో మౌలిక సదుపాయాలను కల్పించాలన్నదే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ మాదిరే ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో డెవలపర్లు భవనాలను నిర్మించి.. వివిధ కంపెనీలకు స్పేస్ లీజుకు ఇస్తారు. దీనికి ముందుకు వచ్చే సంస్థలకు ప్రభుత్వం భూములను ఇస్తుంది. అందులో నిర్మించే భవనాల ఆకృతులను మాత్రం ప్రభుత్వం ఎంపిక చేసిన రీతిలోనే ఉండాలనే నిబంధన విధించనుంది. అలా ప్రపంచంలోనే ప్రత్యేకంగా క్వాంటమ్ వ్యాలీని తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. అంతర్జాతీయ ప్రమాణాల ప్రకారం ఒక ఉద్యోగికి సగటున 150 చదరపు అడుగుల విస్తీర్ణం అవసరం. అలా ప్రభుత్వం నిర్దేశించిన విస్తీర్ణంలో సుమారు 60 వేలమంది నిపుణులు పనిచేసేలా మౌలిక సదుపాయాలను ఇక్కడ అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఆలోచన.
Create an account or sign in to comment