July 1, 2025Jul 1 Author అమరావతి.. ప్రపంచానికి మార్గదర్శి By Andhra Pradesh News DeskUpdated : 01 Jul 2025 06:38 IST Ee Font size 4 min read క్వాంటమ్ డిక్లరేషన్ లక్ష్యాలు ప్రకటించిన చంద్రబాబు ఓ స్టాల్‌లో వివరాలను తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ ఈనాడు, అమరావతి: అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా 2030 నాటికి రూ.5 వేల కోట్ల ఎగుమతులు సాధించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్దేశించుకుంది. వర్క్‌షాప్‌లో ‘అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్’ను సీఎం చంద్రబాబు ప్రకటించారు. ‘‘క్వాంటమ్ టెక్నాలజీలో అమరావతిని ‘ప్రపంచానికి మార్గదర్శి (లైట్ హౌస్)’గా తీర్చిదిద్దాలన్నది మా లక్ష్యం. క్వాంటమ్, డీప్ టెక్నాలజీలో దేశానికి భవిష్యత్ లక్ష్యాలను ఈ డిక్లరేషన్ నిర్దేశిస్తుంది. 2026 నుంచి అమరావతిలో వరల్డ్ క్వాంటమ్ ఎక్స్‌పోను నిర్వహిస్తుంది’ అని అందులో పేర్కొన్నారు. ప్రధాన లక్ష్యాలు అమరావతిలో 2026 జనవరి 1 నాటికి క్వాంటం సిస్టమ్ టూను ఐబీఎం సంస్థ ఏర్పాటు చేస్తుంది. 2026 జనవరి నాటికి 100 క్వాంటం అల్గారిథమ్‌లను పరీక్షించే సామర్థ్యానికి చేరుకోవాలి. 2028 జనవరి నాటికి 1,000 అల్గారిథమ్స్, 2029 జనవరి నాటికి 1,000 ఎఫెక్టివ్ క్యూబిట్స్ సామర్థ్యాన్ని సాధించాలి. మూడు క్వాంటమ్ కంప్యూటర్లను 2027 జనవరి నాటికి ఏర్పాటు చేయాలి. 2030 నాటికి ఏటా రూ.5 వేల కోట్ల ఎగుమతులు లక్ష్యం. 2027 నాటికి దేశంలో 100, రాష్ట్రంలో 20 విశ్వవిద్యాలయాల్లో క్వాంటమ్ టెక్నాలజీలో అండర్ గ్రాడ్యుయేషన్, పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లను అందించాలి. త్వరలో క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించనున్న ఇస్రో -ప్రొఫెసర్ అజయ్‌కుమార్ సూద్, కేంద్ర ప్రభుత్వ శాస్త్రీయ సలహాదారు ఇస్రో త్వరలో క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించబోతోంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగం స్వరూపాన్నే అది మార్చేస్తుంది. క్వాంటమ్ సాంకేతికత అతి త్వరలోనే అనేక రంగాల్లో విప్లవాత్మక మార్పులు తేబోతోంది. మరో రెండు మూడేళ్లలో క్వాంటమ్, ఏఐ సాంకేతికతలు అనుసంధానమవుతాయి. ప్రపంచగతిని మార్చే ఇలాంటి విప్లవాత్మక టెక్నాలజీల ఆవిష్కరణలకు అమరావతిలో ఏర్పాటయ్యే క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా మారుతుంది. క్వాంటమ్ కంప్యూటర్లు విధ్వంసకర శక్తులకూ అందుబాటులోకి వస్తున్నాయి. అందువల్ల ‘పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ (పీక్యూసీ)’ని వేగంగా అభివృద్ధి చేయాలి. భారత్ నుంచే ఆ ప్రయత్నం జరగాలి. ఇంజినీరింగ్ కళాశాలల్లో క్వాంటమ్ టీచింగ్ ల్యాబ్స్ -ప్రొఫెసర్ అభయ్ కరందీకర్, కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి క్వాంటమ్ కంప్యూటింగ్‌లో సామర్థ్యం పెంపునకు ఇంజినీరింగ్ కళాశాలలు, సాంకేతిక విద్యా సంస్థలు, ఇతర సంస్థల్లో టీచింగ్ ల్యాబ్స్ ఏర్పాటు చేస్తాం. క్వాంటమ్ టెక్నాలజీ ప్రోగ్రామ్స్ ప్రారంభిస్తాం. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం ఈ రంగంలో సామర్థ్యాల పెంపు, నూతన ఆవిష్కరణలకు పరిమితం కాదు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో కొలాబరేషన్స్‌కు అది దోహదం చేస్తుంది. 11 లక్షల మంది విద్యార్థులకు క్వాంటమ్ టెక్నాలజీ కోర్సులు -కె.మధుమూర్తి, ఛైర్మన్, ఏపీ ఉన్నత విద్యా మండలి విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచే క్వాంటమ్ టెక్నాలజీని భాగం చేసినప్పుడే ఈ రంగంలో నాయకుల్ని తయారు చేయగలుగుతాం. వివిధ కోర్సుల్లో క్వాంటమ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌లను భాగం చేస్తాం. ఇంజినీరింగ్‌తో పాటు సంప్రదాయ కోర్సుల కరిక్యులమ్‌లోను క్వాంటమ్ టెక్నాలజీని ప్రవేశపెట్టాలి. 11 లక్షల మంది విద్యార్థులకు 2025-26 విద్యా సంవత్సరం నుంచే దీన్ని అమలు చేసేందుకు ముసాయిదా ప్రణాళిక సిద్ధం చేశాం. అమరావతి క్వాంటమ్‌వ్యాలీ జాతి సంపద -వి.రాజన్న టీసీఎస్ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్ సర్వీసెస్ విభాగం అధ్యక్షుడు అమరావతిలో ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్ వ్యాలీ కేవలం ‘కంప్యూటింగ్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్లాట్‌ఫాం’ మాత్రమే కాదు. అది జాతి సంపద. పరిశోధన, అభివృద్ధి రంగాల్లో భారతదేశాన్ని నాయకత్వ స్థానంలోకి తీసుకెళ్లే గొప్ప వేదిక. భౌతికశాస్త్రం, కంప్యూటింగ్, ఇంజినీరింగ్, కృత్రిమ మేధ, మెటీరియల్ సైన్సెస్.. ఇలా వివిధ రంగాల మధ్య పరిశోధనలకు అది అనుసంధాన కేంద్రంగా నిలుస్తుంది. క్వాంటమ్ రంగంలో పరిశోధనలకు, అకడమిక్ ఎకోసిస్టమ్ అభివృద్ధికి అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ మైలురాయిగా నిలుస్తుంది. మార్కెట్ విలువ 10 వేల కోట్ల డాలర్లు -ఎంవీ సతీష్, ఎల్ అండ్ టీ సంస్థ సీఎండీకి సలహాదారు,ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యుడు క్వాంటమ్ కంప్యూటింగ్ మార్కెట్ విలువ 10 వేల కోట్ల డాలర్లుగా మెకిన్సే సంస్థ అంచనా వేసింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది శుభవార్త. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీపై చేస్తున్న వ్యయం రూ.6 వేల కోట్లు. తదుపరి డిజిటల్ విప్లవం క్వాంటమ్ సాంకేతికతే! ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచీ ఈ రాష్ట్రంతో మా సంస్థకు అనుబంధం కొనసాగుతోంది. చంద్రబాబు చొరవతోనే హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించాం. ఆ తర్వాత హైటెక్స్ ఎగ్జిబిషన్ సెంటర్‌లోను భాగస్వాములయ్యాం. క్వాంటమ్ రంగానికి వస్తే... మౌలిక వసతుల భాగస్వామిగా వ్యవహరిస్తూ క్వాంటమ్ వ్యాలీలు, క్వాంటమ్ డేటా సెంటర్లు వంటివి నిర్మించే సామర్థ్యం మాకుంది. క్వాంటమ్ సైన్స్‌ని సిలబస్‌లో భాగం చేయాలి -కె.ఎన్.సత్యనారాయణ, డైరెక్టర్, ఐఐటీ తిరుపతి క్వాంటమ్ కంప్యూటింగ్ రంగానికి అవసరమైన నిపుణత కలిగిన మానవ వనరుల్ని అభివృద్ధి చేయడంపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విద్య, శిక్షణ కార్యక్రమాల్ని ప్రత్యేకంగా రూపొందించాలి. క్వాంటమ్ సైన్స్‌ని పాఠ్యాంశాల్లో భాగంగా చేర్చాలి. మా ఐఐటీలో క్వాంటమ్ సైన్స్ అండ్ టెక్నాలజీని ప్రతి విద్యార్థికి తప్పనిసరి కోర్ కోర్సుగా చేశాం. సివిల్, మెకానికల్, కంప్యూటర్ సైన్స్... ఇలా విభాగం ఏదైనా ఈ కోర్సు మాత్రం తప్పనిసరి.
July 1, 2025Jul 1 Author Minister Lokesh: క్వాంటమ్ వ్యాలీ కేంద్రంగా లక్షకు పైగా నైపుణ్య ఉద్యోగాలు By Andhra Pradesh News DeskPublished : 01 Jul 2025 04:48 IST Ee Font size 2 min read ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ ఈనాడు-అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అనుగుణంగా.. అమరావతిని ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ మ్యాప్‌లో నిలబెడతామని ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్ హామీ ఇచ్చారు. ‘రాబోయే కొన్నేళ్లలో ప్రపంచ క్వాంటమ్ లక్ష్యాలకు ఆంధ్రప్రదేశ్ మేధో రాజధానిగా నిలవబోతోంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ద్వారా లక్షకు పైగా నైపుణ్య ఉద్యోగాలను సృష్టించడంతోపాటు.. 50 యూనికార్న్‌లను ప్రోత్సహిస్తాం. పీహెచ్‌డీ, ఫెలోషిప్‌లు, ఇంటర్న్‌షిప్‌లను అందిస్తాం’ అని పేర్కొన్నారు. క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో భాగంగా మంత్రి లోకేశ్ మాట్లాడుతూ.. ‘అమరావతిలో కేవలం టెక్నాలజీ ఏర్పాటు చేయడం కాదు. భవిష్యత్తును నిర్దేశించే మానవ మూలధనాన్ని నిర్మిస్తున్నాం. ఆవిష్కర్తలు, స్టార్టప్‌లకు ఆంధ్రప్రదేశ్‌ను లాంచ్‌పాడ్‌గా తయారు చేస్తాం. ఇందులో ప్రపంచస్థాయి నాయకులు, పెట్టుబడిదారులు భాగస్వాములు కావాలి’ అని కోరారు. ‘ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్, ప్రపంచస్థాయి భాగస్వాములతో కలిసి పనిచేస్తున్నాం. ఐబీఎం, టీసీఎస్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర తదితర అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ఎకో సిస్టమ్ అభివృద్ధి చేస్తాం. 156 క్యూబిట్స్‌తో కూడిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2కి అమరావతి క్వాంటమ్ వ్యాలీ కేంద్రం కాబోతోంది. ఈ ప్రయాణంలో మనం ప్రపంచానికి మార్గదర్శులుగా నిలవాలి’ అని లోకేశ్ పిలుపునిచ్చారు. అప్పుడు నేను ఏడో తరగతి ‘సాంకేతిక విప్లవంలో మొదటి అధ్యాయమైన ఐటీకి చంద్రబాబు ప్రోత్సాహం ఇచ్చినప్పుడు నేను ఏడో తరగతిలో ఉన్నా.. ఆయన ఐటీలో ఏమి సాధించే ప్రయత్నం చేస్తున్నారో అప్పట్లో అర్థం కాలేదు. కానీ భవిష్యత్తును చూడటానికి, అమలు చేయడానికి అలాంటి దార్శనికుడు అవసరం’ అని లోకేశ్ పేర్కొన్నారు. చంద్రబాబు చెప్పినప్పుడు.. 99% మందికి అర్థం కాలేదు ‘క్వాంటమ్ టెక్నాలజీ గురించి సీఎం చంద్రబాబు తొలుత మాట్లాడినప్పుడు గదిలో ఉన్న 99% మందికి ఆయన ఏం చెబుతున్నారో అర్థం కాలేదు. అక్కడున్న అందరిలోనూ గందరగోళమే. కార్నెగీ మిలన్ యూనివర్సిటీలో డిగ్రీ, స్టాన్‌ఫోర్డ్‌లో ఎంబీయే చదివి, ప్రపంచబ్యాంక్‌లో రెండేళ్లు పనిచేసిన నేను కూడా ఆశ్చర్యపోయాను. తర్వాత చాట్‌జీపీటీలో వెదికాం’ అని లోకేశ్ చెప్పారు.
July 1, 2025Jul 1 Author BM: 2029కల్లా మూడో క్వాంటమ్ కంప్యూటర్ ABN , Publish Date - Jul 01 , 2025 | 05:42 AM మూడో క్వాంటమ్ కంప్యూటర్‌ను 2029 నాటికి అందుబాటులోకి తెస్తామని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ చెప్పారు. సాంకేతికతలో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం Video Player is loading. Pause Mute Remaining Time -10:19 ‘ఆంధ్రజ్యోతి’తో ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): మూడో క్వాంటమ్ కంప్యూటర్‌ను 2029 నాటికి అందుబాటులోకి తెస్తామని ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్ చెప్పారు. ఇప్పటికే క్వాంటమ్ కంప్యూటింగ్‌ను బ్యాంకులు, పేటీఎం వంటి ఆర్థిక సంస్థలు వినియోగిస్తున్నాయని ‘ఆంధ్రజ్యోతి’తో చెప్పా రు. సాంకేతికతలో రాష్ట్రానికి సంపూర్ణ సహకారం అందిస్తామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో సంప్రదాయ సాఫ్ట్‌వేర్ రంగం తీవ్రంగా నష్టపోతుందన్న ఆందోళన ఉందన్న ప్రశ్నకు.. కొత్త సాంకేతిక నైపుణ్యం వస్తున్నప్పుడు ఇలాంటి ఆందోళనలు తప్పవని బదులిచ్చారు. ప్రస్తుతం రెండో క్వాంటమ్ కంప్యూటర్‌ను ఐబీఎం రూపొందించిందని.. 2029 నాటికి అత్యంత వేగవంతమైన మూడో క్వాంటమ్ కంప్యూటర్‌ను సిద్ధం చేస్తామన్నారు.
July 1, 2025Jul 1 Author Quantum Computing:భావి యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్‌తోనే..సబ్‌మెరైన్ల నిర్వహణ కూడా: వక్తలు ABN , Publish Date - Jul 01 , 2025 | 05:38 AM ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు.. అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ సింధూర్’ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు. భవిష్యత్‌లో యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతిక సహకారంతోనే ముందుకు సాగుతాయని తెలిపారు. విజయవాడ వర్క్‌షాపులో క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్‌పై జరిగిన చర్చాగోష్ఠిలో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక నైపుణ్య సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. భారీ ఆర్థిక లావాదేవీలు .. డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుల సేవలు, ఔషధాల నమూనాలు, విద్య, వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు వేగవంతం కానున్నాయని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ హెడ్ డాక్టర్ వెంకట ఎల్.సుబ్రహ్మణ్యం చెప్పారు. Advertisement: 0:13 Close Player భవిష్యత్ యుద్ధాలన్నీ మానవ రహిత క్షిపణులు, డ్రోన్ల సహకారంతోనే జరుగుతాయని విశాఖ ఎన్‌ఎ్‌సటీఎల్-డీఆర్‌డీవో శాస్త్రవేత సాజీ వీఎఫ్ వెల్లడించారు. డ్రోన్ల సహకారంతో శత్రుదేశ స్థావరాలు, ఆయుధాల ధ్వంసం, సైనికులపైనా పైచేయి సాధించేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు.
July 1, 2025Jul 1 Author Home » Andhra Pradesh » 1 Lakh Jobs in 5 Years from Amaravati Quantum Valley Nara Lokesh: ఐదేళ్లలో లక్ష ఉద్యోగాలు ABN , Publish Date - Jul 01 , 2025 | 02:40 AM రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ..దక్షిణాసియాలోనే మొదటిది ఇక్కడ 50కి పైగా యూనికార్న్‌ల అభివృద్ధి చంద్రబాబు సాంకేతిక విప్లవంలో ఇది సెకండ్ చాప్టర్ క్వాంటమ్ వర్క్‌షాపులో మంత్రి లోకేశ్ అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ దక్షిణాసియాలోనే మొదటిదని ఐటీ, విద్య, ఆర్టీజీఎస్ శాఖల మంత్రి లోకేశ్ వెల్లడించారు. ఇందులో ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. 50కి పైగా యూనికార్న్‌లు అభివృద్ధి చేస్తామన్నారు. ఈ వ్యాలీ చంద్రబాబు సాంకేతిక విప్లవంలో సెకండ్ చాప్టర్‌గా పేర్కొన్నారు. సోమవారం విజయవాడలో క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షా్‌పలో ఆయన మాట్లాడారు. వచ్చే జనవరి 1న ప్రారంభించే ఈ క్వాంటమ్ వ్యాలీకి అనుబంధంగా.. ఆలోచనలను ఆవిష్కరణలుగా.. ఆవిష్కరణలను పరిశ్రమలుగా మార్చే ఎకో సిస్టమ్‌ను అభివృద్ధి చేస్తామని చెప్పారు. ఇది ఒకరోజు కార్యక్రమం కాదని.. నిరంతర కొనసాగుతుందని.. దీనికి అమరావతి కేంద్ర బిందువుగా ఉంటుందని అన్నారు. క్యూబిక్ ఆర్కిటెక్చర్ నుంచి క్రయోఎలకా్ట్రనిక్స్ వరకూ.. అల్గారిథం అభివృద్ధి నుంచి క్వాంటమ్ సామర్థ్యాన్ని అభివ్దృద్ధి చేస్తామని వెల్లడించారు. దేశంలో అత్యంత అభివృద్ధి చెందిన ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2 త్వరలోనే అమరావతిలో అందుబాటులోకి వస్తుందని, ఇది చాలా గర్వించదగ్గ విషయమని చెప్పారు. ఆసియాలో మొట్టమొదటి క్వాంటమ్ ప్రమాణాల టెస్ట్‌టెట్ ను ఎన్సీఎల్, ఐఈఈఈ, ఏడబ్ల్యుఎస్, సీయూక్ భాగస్వామ్యంతో నిర్వహిస్తామని వెల్లడించారు. ఐబీఎం, టీసీఎల్, హెచ్‌సీఎల్, టెక్ మహీంద్ర వంటి అగ్రగామి సంస్థల సహకారంతో క్వాంటమ్ స్టార్టప్ ఎకోసిస్టమ్ అభివృద్ధి చేస్తామన్నారు. ప్రధాని మోదీ ప్రకటించిన జాతీయ క్వాంటమ్ మిషన్‌కు అనుసంధానంగా గ్లోబల్ భాగస్వామ్యంతో వ్యాలీ పార్కును నిర్మిస్తామన్నారు. ఐఐటీలు, ఐఐఎస్, టోక్యో వర్సిటీల సహకారంతో విద్యార్థుల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతిక నైపుణ్యాన్ని వృద్ధి చేస్తామన్నారు. ఆంధ్రప్రదేశ్ మేధో రాజధానిగా ఆవిర్భవిస్తోందని లోకేశ్ అన్నారు. సీఎం చంద్రబాబులాంటి నాయకుడు ఉండడం అదృష్టంగా పేర్కొన్నారు. విజన్ అంటే ఇప్పుడు వెలాసిటీ, ఇన్నోవేషన్, గ్లోబల్ రేస్‌లో చేరడం కాదని.. మనమే దారిచూపాలని అన్నారు.
July 1, 2025Jul 1 Author Amaravati: గ్లోబల్ గేట్‌వేగా అమరావతి వ్యాలీ ABN , Publish Date - Jul 01 , 2025 | 02:35 AM అమరావతిలో ప్రారంభమయ్యే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ 2035 నాటికి ప్రపంచ లైట్ హౌస్‌గా మారుతుందని జాతీయ వర్క్‌షాపు పేర్కొంది. క్వాంటమ్ టెక్నాలజీని అత్యాధునిక కంప్యూటేషన్‌కు బదలాయిస్తూ. 2035 నాటికి ప్రపంచ లైట్ హౌస్! స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలు డిక్లరేషన్‌కు వర్క్‌షాపు ఆమోదం అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): అమరావతిలో ప్రారంభమయ్యే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ 2035 నాటికి ప్రపంచ లైట్ హౌస్‌గా మారుతుందని జాతీయ వర్క్‌షాపు పేర్కొంది. క్వాంటమ్ టెక్నాలజీని అత్యాధునిక కంప్యూటేషన్‌కు బదలాయిస్తూ.. అమరావతి వ్యాలీని గ్లోబల్ గేట్‌వేగా మార్చాలని.. పెట్టుబడులు పెట్టేందుకు స్టార్ట్‌పలకు ప్రోత్సాహకాలివ్వాలని తీర్మానించింది. ఈ మేరకు డిక్లరేషన్‌ను ఆమోదించింది. క్వాంటమ్ కంప్యూటింగ్ అండ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ సెన్సింగ్ అండ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ మెటీరియల్ అండ్ చిప్స్, కెపాసిటీ బిల్డింగ్, సాండర్డైజేషన్, స్టార్ట్ అప్ ఇన్నోవేషన్ ఎకో సిస్టమ్‌పై వర్క్‌షాపులో విస్తృతంగా చర్చ జరిగింది. వ్యాలీ ప్రారంభమయ్యే 2026 జనవరి 1న 100 క్వాంటమ్ ఆల్గారిథమ్‌లను పరీక్షిస్తారు. 2027 జనవరి 1నాటికి మూడు క్వాంటమ్ కంప్యూటర్లు క్యూబిట్ టెక్నాలజీతో, సూపర్ కండక్టింగ్ సర్క్యూట్‌తో అందుబాటులోకి వస్తాయి. 2028 జనవరి 1న 1,000 కొత్త అల్గారిథమ్స్‌ను పరీక్షిస్తారు. 2029 జనవరి 1వ తేదీనాటికి 1,000 క్యూబిట్స్ క్వాంటమ్ సామర్థ్యానికి చేరుకుంటాయి. అలాగే అమరావతిలో అకాడమీని స్థాపించాలని నిర్ణయించారు. ఇందులో ఇంటిగ్రేటెడ్ పీహెచ్‌డీ కోర్సులు ఉంటాయి. 20 యూనివర్సిటీల్లో టెక్నికల్ సర్టిఫికేషన్ కోర్సులను ప్రవేశపెడతారు.
July 1, 2025Jul 1 Author Home » Andhra Pradesh » Quantum Computing to Drive Future Wars and Submarine Operations Quantum Computing:భావి యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్‌తోనే..సబ్‌మెరైన్ల నిర్వహణ కూడా: వక్తలు ABN , Publish Date - Jul 01 , 2025 | 05:38 AM ఆపరేషన్ సింధూర్ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు.. అమరావతి, జూన్ 30 (ఆంధ్రజ్యోతి): ‘ఆపరేషన్ సింధూర్’ పేరు చెబితే.. హైదరాబాద్ డీఆర్‌డీవో గుర్తుకొస్తుందని పలువురు వక్తలు అన్నారు. భవిష్యత్‌లో యుద్ధాలన్నీ క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతిక సహకారంతోనే ముందుకు సాగుతాయని తెలిపారు. విజయవాడ వర్క్‌షాపులో క్వాంటమ్ కంప్యూటింగ్ అల్గారిథమ్స్‌పై జరిగిన చర్చాగోష్ఠిలో కేంద్ర ప్రభుత్వ సాంకేతిక నైపుణ్య సంస్థల ప్రతినిధులు మాట్లాడారు. భారీ ఆర్థిక లావాదేవీలు .. డిజిటల్ చెల్లింపులు, బ్యాంకుల సేవలు, ఔషధాల నమూనాలు, విద్య, వైద్యరంగంలో క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు వేగవంతం కానున్నాయని ఐబీఎం క్వాంటమ్ కంప్యూటింగ్ హెడ్ డాక్టర్ వెంకట ఎల్.సుబ్రహ్మణ్యం చెప్పారు. భవిష్యత్ యుద్ధాలన్నీ మానవ రహిత క్షిపణులు, డ్రోన్ల సహకారంతోనే జరుగుతాయని విశాఖ ఎన్‌ఎ్‌సటీఎల్-డీఆర్‌డీవో శాస్త్రవేత సాజీ వీఎఫ్ వెల్లడించారు. డ్రోన్ల సహకారంతో శత్రుదేశ స్థావరాలు, ఆయుధాల ధ్వంసం, సైనికులపైనా పైచేయి సాధించేందుకు క్వాంటమ్ కంప్యూటింగ్ పరిజ్ఞానం ఉపయోగపడుతుందని తెలిపారు.
July 1, 2025Jul 1 Very happy to see that we are launching a new technology era instead of replicating a bangalore or hyderabad model.. am sure both b’lore and hyd will lag behind after 10years
July 2, 2025Jul 2 Author కొంతమందికి క్వాంటం కంప్యూటర్ గురించి అసలు తెలియదు... కాబట్టి తెలిసిన కొంచం ఇన్ఫో ఇస్తున్న: క్వాంటం కంప్యూటర్ అంటే సాధారణ కంప్యూటర్లలాగా బిట్స్ (0, 1)తో కాకుండా, క్వాంటం మెకానిక్స్ ప్రిన్సిపుల్స్ మీద పనిచేసే సూపర్ ఫాస్ట్ కంప్యూటర్. క్యూబిట్ అంటే క్వాంటం ఇన్ఫర్మేషన్ యొక్క బేసిక్ యూనిట్, కానీ ఇది బైనరీ ప్రాసెసర్లలాగా సిలికాన్ ట్రాన్సిస్టర్స్ మీద ఆధారపడదు... ఇవి ఎలక్ట్రాన్ స్పిన్ లాంటి ఫిజికల్ సిస్టమ్‌ల మీద బిల్ట్ అవుతాయి. సాధారణంగా జీరో లేదా వన్ అయ్యే బదులు, క్యూబిట్ క్వాంటం మెకానిక్స్‌లోని సూపర్‌పొజిషన్ అనే ప్రాపర్టీ వల్ల ఒకేసారి అనేక వాల్యూస్‌ని రిప్రజెంట్ చేయగలదు. ఇంకో ముఖ్యమైన ఫీచర్ ఏంటంటే, క్వాంటం ప్రపంచంలోని ఎంటాంగిల్‌మెంట్. దీనివల్ల అనేక క్యూబిట్స్ ఫిజికల్ ప్రాపర్టీస్‌ని స్పేస్‌లో ఇన్‌స్టంట్‌గా షేర్ చేసుకోగలవు. ఇది డ్రగ్ డిస్కవరీ, AI, మెటీరియల్స్ రీసెర్చ్, వాతావరణ ప్రిడిక్షన్ లాంటి సంక్లిష్ట కాలిక్యులేషన్స్‌ని ఊహించనంత స్పీడ్‌లో చేయగలదు. మన ఆంధ్రప్రదేశ్‌లో అమరావతిలో సెటప్ చేస్తున్న క్వాంటం వ్యాలీలో IBM క్వాంటం సిస్టమ్ టూ (156-క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్) ఇండియాలోనే అతి పెద్ద క్వాంటం కంప్యూటర్‌గా ఉంటుంది.. ఇతర దేశాల్లో క్వాంటం కంప్యూటర్ ఉపయోగం: 1. అమెరికా (USA): USలో నేషనల్ క్వాంటం ఇనిషియేటివ్ యాక్ట్ 2018లో పాస్ అయ్యింది. ఇది క్వాంటం రీసెర్చ్‌ని బూస్ట్ చేయడానికి బిలియన్ డాలర్స్ ఇన్వెస్ట్ చేస్తోంది. పెర్ఫార్మెన్స్: Google, IBM లాంటి కంపెనీలు USలో క్వాంటం కంప్యూటర్లను డెవలప్ చేస్తున్నాయి. Google 2019లో "సైకమోర్" క్వాంటం కంప్యూటర్‌తో క్వాంటం సుప్రీమసీ సాధించింది, అంటే సూపర్‌కంప్యూటర్‌కి 10,000 సంవత్సరాలు పట్టే టాస్క్‌ని 200 సెకండ్స్‌లో సాల్వ్ చేసింది. ఇన్నోవేషన్స్: US డిపార్ట్‌మెంట్ ఆఫ్ ఎనర్జీ క్వాంటం యూజర్ ఎక్స్‌పాన్షన్ ఫర్ సైన్స్ అండ్ టెక్నాలజీ (QUEST) ప్రోగ్రామ్‌తో క్వాంటం టెక్‌ని రీసెర్చ్‌లో వాడుతోంది. ఇది మెడికల్, ఎనర్జీ, డిఫెన్స్ రంగాల్లో అప్లికేషన్స్ కోసం వర్క్ చేస్తోంది. 2.చైనా: చైనా 2016లో మిసియస్ అనే క్వాంటం కమ్యూనికేషన్ శాటిలైట్‌ని లాంచ్ చేసింది. ఇది గ్రౌండ్ స్టేషన్స్, శాటిలైట్స్ మధ్య సెక్యూర్ క్వాంటం కమ్యూనికేషన్ లింక్స్‌ని డెమో చేసింది. పెర్ఫార్మెన్స్: చైనా క్వాంటం క్రిప్టోగ్రఫీలో లీడర్‌గా ఉంది. వాళ్లు క్వాంటం కీ డిస్ట్రిబ్యూషన్ (QKD) టెక్నాలజీతో హ్యాక్ చేయలేని కమ్యూనికేషన్స్ సెటప్ చేశారు. ఇన్నోవేషన్స్: చైనా క్వాంటం కంప్యూటర్ "జియుజాంగ్" 2020లో క్లాసికల్ సూపర్‌కంప్యూటర్ కంటే 100 ట్రిలియన్ రెట్లు వేగంగా ఒక టాస్క్‌ని సాల్వ్ చేసింది, దీన్ని "క్వాంటం అడ్వాంటేజ్" అంటారు. 3. కెనడా : కెనడా క్వాంటం కెనడా స్ట్రాటజీతో 2016 నుంచి క్వాంటం రీసెర్చ్‌లో ఇన్వెస్ట్ చేస్తోంది... వాళ్లు క్వాంటం ఎన్‌క్రిప్షన్ అండ్ సైన్స్ శాటిలైట్ (QEYSSat) మిషన్‌ని రన్ చేస్తున్నారు. పెర్ఫార్మెన్స్: కెనడాలో స్టార్టప్స్, వెంచర్ క్యాపిటల్ ఎకోసిస్టమ్ క్వాంటం టెక్‌లో గ్లోబల్ లీడర్‌గా ఉంది. D-Wave అనే కంపెనీ క్వాంటం అనీలింగ్ సిస్టమ్స్‌ని కమర్షియల్‌గా వాడుతోంది. ఇన్నోవేషన్స్: కెనడా క్వాంటం సెన్సార్స్, సెక్యూరిటీ టెక్నాలజీస్‌లో ఫోకస్ చేస్తోంది, ఇవి హెల్త్‌కేర్, డిఫెన్స్‌లో ఉపయోగపడతాయి
July 2, 2025Jul 2 Author క్వాంటం కంప్యూటర్ వస్తే ఆంధ్రాలో ఉండే కొన్ని ఉపయోగాలు: 1. పాలన (Governance)రియల్-టైమ్ డేటా అనలిటిక్స్: క్వాంటం కంప్యూటర్లు పెద్ద ఎత్తున డేటాని వేగంగా అనలైజ్ చేయగలవు. సెక్యూరిటీ: క్వాంటం క్రిప్టోగ్రఫీతో గవర్నమెంట్ డేటా మరింత సెక్యూర్ అవుతుంది. హ్యాకింగ్ రిస్క్ తగ్గుతుంది. వెల్ఫేర్ అప్లికేషన్స్ ప్రాసెసింగ్ స్పీడ్, ఫ్రాడ్ డిటెక్షన్ అక్యురసీ ఇంప్రూవ్ అవుతుంది, దీనివల్ల గవర్నమెంట్ ఫండ్స్ మిస్యూజ్ తగ్గించొచ్చు. వరదల సమయంలో రియల్-టైమ్ డేటాతో రెస్క్యూ ఆపరేషన్స్ మరింత వేగంగా ప్లాన్ చేయొచ్చు. 2. సర్వీస్ సెక్టార్ లాజిస్టిక్స్ & సప్లై చైన్: క్వాంటం అల్గారిథమ్స్ రూట్ ఆప్టిమైజేషన్, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ లాంటివి సులభం చేస్తాయి. ఉదాహరణకు, ఆంధ్రప్రదేశ్‌లో పోర్టులు, షిప్పింగ్ ఇండస్ట్రీలు ఈ టెక్‌తో ఎఫిషియంట్‌గా రన్ అవుతాయి. ఫైనాన్షియల్ సర్వీసెస్: బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్‌స్టిట్యూషన్స్‌లో రిస్క్ అనలిసిస్, ఫ్రాడ్ డిటెక్షన్ క్వాంటంతో ఫాస్ట్ అవుతాయి. 3. టెక్నాలజీAI & మెషిన్ లెర్నింగ్: క్వాంటం కంప్యూటర్లు AI మోడల్స్‌ని ఆప్టిమైజ్ చేసి, ఎనర్జీ కన్సమ్ప్షన్ తగ్గిస్తాయి. ఆంధ్రప్రదేశ్‌లో స్టార్టప్‌లు, టెక్ కంపెనీలు ఈ టెక్‌తో ఇన్నోవేటివ్ సొల్యూషన్స్ క్రియేట్ చేయొచ్చు. క్వాంటం సిమ్యులేషన్స్: కొత్త సాఫ్ట్‌వేర్, అల్గారిథమ్స్ డెవలప్ చేయడానికి క్వాంటం టెక్ సాయం చేస్తుంది. 4. మెడికల్ రంగం డ్రగ్ డిస్కవరీ: క్వాంటం కంప్యూటర్లు మాలిక్యూల్స్ బిహేవియర్‌ని సిమ్యులేట్ చేసి, కొత్త ఔషధాల డెవలప్‌మెంట్‌ని స్పీడప్ చేస్తాయి. ఉదాహరణకు, క్యాన్సర్ డ్రగ్స్ రీసెర్చ్‌లో ఇవి చాలా హెల్ప్ అవుతాయి. డయాగ్నోస్టిక్స్: క్వాంటం సెన్సార్స్ మెడికల్ ఇమేజింగ్‌ని మెరుగుపరుస్తాయి. పిల్లలకు, disability ఉన్నవాళ్లు, వయసు ఎక్కువ ఉన్నవాళ్లు స్కానింగ్ సమయంలో స్టిల్‌గా ఉండనవసరం లేకుండా డయాగ్నోసిస్ చేయొచ్చు. ఇతర రంగాలు: వ్యవసాయం: క్వాంటం టెక్‌తో వాతావరణ మోడలింగ్, క్రాప్ ఆప్టిమైజేషన్ సులభం అవుతాయి. ఆంధ్రప్రదేశ్‌లో అగ్రి-టెక్ కంపెనీలు దీన్ని వాడొచ్చు. ఎనర్జీ: క్వాంటం కంప్యూటర్లు ఎనర్జీ ఆప్టిమైజేషన్, క్లీన్ ఎనర్జీ సొల్యూషన్స్‌లో సాయం చేస్తాయి. ఉదాహరణకు, EV బ్యాటరీ డెవలప్‌మెంట్. డిజాస్టర్ మేనేజ్‌మెంట్: సునామీ, వరదల లాంటి డిజాస్టర్స్‌ని ముందే ప్రిడిక్ట్ చేయడానికి క్వాంటం అప్లికేషన్స్ ఉపయోగపడతాయి.
July 2, 2025Jul 2 Author ఆంధ్రప్రదేశ్‌లో క్వాంటం వ్యాలీ టెక్ పార్క్‌లో సెటప్ అవుతున్న క్వాంటం కంప్యూటర్ రాష్ట్రాన్ని గ్లోబల్ టెక్ హబ్‌గా ఎలా మారుస్తోంది? ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు మాట్లాడుతూ, "మన ఆంధ్రప్రదేశ్‌లో IBM సిస్టమ్ క్వాంటం కంప్యూటర్‌తో ఒక సరికొత్త ఈకోసిస్టమ్ బిల్డ్ అవుతోంది. ఇది రీసెర్చ్, ఇన్నోవేషన్, జాబ్స్ క్రియేట్ చేస్తూ, ఇండియాని ఫ్యూచర్ టెక్‌లో లీడర్‌గా నిలబెడుతుంది. చైనా, అమెరికా లాంటి దేశాలు క్వాంటం రేసులో ముందున్నాయి, కానీ మనం ఆంధ్రప్రదేశ్ నుంచి స్టార్ట్ చేసి, ప్రపంచ దృష్టిని మనవైపు తిప్పుతున్నాం. TCS, L&T, IBM లాంటి గ్లోబల్ జెయింట్స్‌తో కలిసి, మన యూత్‌కి స్కిల్స్ ఇచ్చి, లక్షలాది ఉద్యోగాలు తెస్తున్నాం. ఇది మన రాష్ట్రం గర్వించదగ్గ క్షణం!"
July 2, 2025Jul 2 Author నిన్న అనౌన్స్ చేసిన క్వాంటం మిషన్ లో మైక్రోసాఫ్ట్ కూడా జాయిన్ అవబోతోంది అని న్యూస్ వచ్చింది !! నిజంగా ఇది నిజమైతే దేశానికే #ఆంధ్రప్రదేశ్ ఒక ఐకాన్ గా నిలబడుతుంది !! అయితే... 2014 -19 మధ్యలో నేను ఈ Microsoft Azure పేరు చాలాసార్లు విన్నాను ! ఇవాళ ఈ న్యూస్ విన్నాక... ఒకసారి దీని గురించి తెలుసుకోవాలని అనిపించింది ! దీని గురించిన వివరాలు మీ కోసం : Azure Quantum అనేది మైక్రోసాఫ్ట్ అభివృద్ధి చేసిన ఒక క్లౌడ్ ఆధారిత ఫ్లాట్‌ఫారమ్, ఇది క్వాంటం కంప్యూటింగ్ మరియు క్వాంటం టెక్నాలజీ అభివృద్ధికి సంబంధించిన సేవలను అందిస్తుంది. ఈ ఫ్లాట్‌ఫారమ్ డెవలపర్లు, పరిశోధకులు మరియు సంస్థలు క్వాంటం కంప్యూటింగ్ సామర్థ్యాలను అన్వేషించడానికి మరియు వాటిని ఉపయోగించడానికి సహాయపడుతుంది. Azure Quantum యొక్క కొన్ని ముఖ్య లక్షణాలు ఇలా ఉన్నాయి:క్వాంటం హార్డ్‌వేర్ యాక్సెస్: Azure Quantum వివిధ భాగస్వాములైన క్వాంటం హార్డ్‌వేర్ ప్రొవైడర్ల (ఉదా., IonQ, Quantinuum, మరియు Photonic) ద్వారా క్వాంటం కంప్యూటర్లకు యాక్సెస్ అందిస్తుంది. ఇది వినియోగదారులు క్వాంటం సిమ్యులేటర్లు మరియు నిజమైన క్వాంటం హార్డ్‌వేర్‌పై ప్రోగ్రామ్‌లను అమలు చేయడానికి అనుమతిస్తుంది. క్వాంటం సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్: ఇది Q# అనే క్వాంటం ప్రోగ్రామింగ్ భాషను అందిస్తుంది, దీనితో డెవలపర్లు క్వాంటం అల్గారిథమ్‌లను రూపొందించవచ్చు. ఈ ఫ్లాట్‌ఫారమ్ క్వాంటం డెవలప్‌మెంట్ కిట్ (QDK) మరియు ఇతర ఓపెన్-సోర్స్ సాధనాలను కూడా అందిస్తుంది. హైబ్రిడ్ కంప్యూటింగ్: Azure Quantum క్లాసికల్ మరియు క్వాంటం కంప్యూటింగ్‌ను ఏకీకృతం చేస్తుంది, దీనివల్ల వినియోగదారులు మైక్రోసాఫ్ట్ Azure యొక్క క్లౌడ్ సేవలతో క్వాంటం సొల్యూషన్‌లను అనుసంధానించవచ్చు. ఇది క్వాంటం మరియు సాంప్రదాయ కంప్యూటింగ్ మధ్య సమన్వయాన్ని సులభతరం చేస్తుంది. అప్లికేషన్ రంగాలు: Azure Quantum క్వాంటం కంప్యూటింగ్‌ను ఉపయోగించి కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్, క్రిప్టోగ్రఫీ, ఆప్టిమైజేషన్, మరియు మెషిన్ లెర్నింగ్ వంటి రంగాలలో సమస్యలను పరిష్కరించడానికి సహాయపడుతుంది. మైక్రోసాఫ్ట్ యొక్క క్వాంటం పరిశోధన: మైక్రోసాఫ్ట్ టోపోలాజికల్ క్వాంటం కంప్యూటింగ్‌పై దృష్టి సారిస్తోంది, ఇది స్థిరమైన మరియు స్కేలబుల్ క్వాంటం కంప్యూటర్లను నిర్మించడానికి ఒక వినూత్న విధానం. ఈ పరిశోధనలో భాగంగా, Azure Quantum భవిష్యత్తులో అధునాతన క్వాంటం సామర్థ్యాలను అందించగలదు. ప్రస్తుతం, Azure Quantum ఇంకా అభివృద్ధి దశలో ఉంది, మరియు ఇది క్వాంటం టెక్నాలజీని వాణిజ్య రంగంలో మరియు పరిశోధనలో విస్తరించడానికి ఒక ముఖ్యమైన వేదికగా పనిచేస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లోని క్వాంటం వ్యాలీ మిషన్‌తో మైక్రోసాఫ్ట్ సంభాషణలలో ఉన్నట్లు కొన్ని వార్తలు సూచిస్తున్నాయి !!
July 4, 2025Jul 4 Author క్వాంటం కంప్యూటింగ్ గురించి . . . ఒక ఫేస్బుక్ మిత్రుడి పోస్టు యథాతధంగా Quantum computing... ఈ పదం నేను ఒక మూడేళ్ల క్రితం విన్నాను.... మన రాష్ట్రంలో ఈ పదం ఒక విప్లవం లా ఉంది ఇప్పుడు.... దానికి రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ మన రాష్ట్రంలోనే రాబోతుంది.. కానీ దాంట్లో ఉద్యోగాలు రావాలి అంటే ఏం చెయ్యాలి? Quantum computing లో ఏ ఏ జాబ్స్ ఉండొచ్చు అనే దాని మీద ఒక పోస్ట్.... అసలు Quantum computing అంటే ఏంటి? క్వాంటం కంప్యూటింగ్ (Quantum Computing) అనేది సాంకేతిక రంగంలో అత్యాధునికమైన మరియు శక్తివంతమైన కంప్యూటింగ్ విధానం. ఇది సంప్రదాయ కంప్యూటర్ల కన్నా బహుళ రెట్లు వేగంగా మరియు సమర్థవంతంగా గణనల్ని చేయగలదు. ఇది క్వాంటం భౌతిక శాస్త్రం (Quantum Physics) లోని సూత్రాలపై ఆధారపడుతుంది... 1. Drug Discovery & Molecular Simulation Simulating molecules and chemical reactions accurately (e.g., caffeine, proteins). Predicting how new drugs will interact with the human body. Helps pharma companies design better medicines faster. Example: Roche & IBM are using quantum computing for Alzheimer’s drug research. 2. Cryptography & Cybersecurity Breaking classical encryption: Quantum computers can break current RSA and ECC encryption algorithms using Shor’s Algorithm. Building new encryption: Quantum-safe (post-quantum) cryptography is being developed to protect data in the quantum future. 3. Finance & Risk Management Portfolio optimization Risk modeling Fraud detection Predictive financial modeling using quantum machine learning Example: JPMorgan Chase is exploring quantum algorithms for financial modeling. 4. Logistics & Supply Chain Optimization Route optimization for delivery (e.g., FedEx, DHL) Inventory management Solving combinatorial problems like the Traveling Salesman Problem 5. Artificial Intelligence & Machine Learning Speeding up training of AI models Quantum neural networks Improved pattern recognition, image processing, and natural language processing Example: Google is exploring quantum advantage in AI models. 6. Climate Modeling & Weather Forecasting Modeling complex weather systems and climate patterns Simulating environmental impacts faster and more accurately 7. Material Science Discovering new materials with unique properties Designing lightweight and super-strong materials (e.g., for aerospace, batteries) 8. Fundamental Physics & Quantum Research Simulating high-energy physics, black holes, and quantum gravity Understanding the building blocks of the universe better 9. Manufacturing & Process Optimization Predicting equipment failures Enhancing quality control Improving factory floor efficiency using quantum simulations 10. Defense & Space Applications Secure satellite communication using quantum key distribution (QKD) Solving defense optimization problems Satellite orbit and trajectory prediction Skills Needed 1. Basic Quantum Physics Understand what a qubit, superposition, and entanglement mean. Learn how quantum gates (like Hadamard, X, CNOT) work. 2. Linear Algebra Know how to use vectors and matrices. Basics like eigenvalues, matrix multiplication, etc. Important because quantum states are represented using vectors. 3. Python Programming Write basic Python code. Learn to use libraries like NumPy and Qiskit (for quantum programming). 4.Quantum Programming Tools Qiskit – by IBM (easy to start) Cirq – by Google PennyLane – for quantum machine learning These tools help you create and test quantum circuits. 5.Basic Algorithms (Optional but Good to Know) Shor’s algorithm – for breaking encryption. Grover’s algorithm – for faster searching. Quantum Fourier Transform (QFT) 6. Cloud Computing (for DevOps/Cloud Engineers) AWS Braket, Azure Quantum, IBM Quantum Cloud. Deploy and run quantum programs from the cloud. 7. Soft Skills Problem-solving: Think logically and creatively. Communication: Explain complex ideas simply. Teamwork: Work with physicists, engineers, and developers. Bonus Skills (Role-Specific) If you're from Electronics: Learn about superconducting circuits, cryogenics, and signal processing. If you're from Math: Focus on quantum algorithms and complexity theory. If you're from Cloud/DevOps: Use your cloud skills to run and scale quantum workloads.
July 4, 2025Jul 4 50 acres icharu, oka 1000 jobs vasthayemo, but anthakantey revenue vasthundhi Because all income goes to company hq, what benefits does amaravathi gets And land bank undha if need more land in future for companies which will come to Amaravathi with this project success (if succeeded)
July 5, 2025Jul 5 3 hours ago, N sainyam said: 50 acres icharu, oka 1000 jobs vasthayemo, but anthakantey revenue vasthundhi Because all income goes to company hq, what benefits does amaravathi gets And land bank undha if need more land in future for companies which will come to Amaravathi with this project success (if succeeded) $s of Exports out of valley is what matters for state. Hyd or B’lore lo kuda revenue company hq ke kadha velledhi, is it anything different?
July 5, 2025Jul 5 2 hours ago, Flash said: $s of Exports out of valley is what matters for state. Hyd or B’lore lo kuda revenue company hq ke kadha velledhi, is it anything different? $ of exports goes to company only employment and then subsequent revenue generation is what matters in Hyderabad and Bengaluru. But does amaravathi will get any benefits other than jobs.
July 5, 2025Jul 5 1 hour ago, N sainyam said: $ of exports goes to company only employment and then subsequent revenue generation is what matters in Hyderabad and Bengaluru. But does amaravathi will get any benefits other than jobs. More companies.. more jobs
July 6, 2025Jul 6 అమరావతిలో నిర్మిస్తున్న " క్వాంటం వ్యాలీ" MOU తో పాటు ఒక లక్ష కోట్లు GST కడుతోంది. మొదటి సంవత్సరం లో 5 లక్షల కోట్లు జిఎస్టి కట్టే అవకాశం ఉందని నిపుణులు తెలుపుతున్నారు. ఒక సంవత్సరం తర్వాత ఎన్ని లక్షల కోట్లు GST కట్టనున్నదో అంచనా వేయలేమని నిపుణులు తెలియజేశారు. దాదాపు 6 నుంచి 10 లక్షల జీఎస్టీ కట్టే అవకాశం ఉందని నిపుణులు తెలిపారు.
Create an account or sign in to comment