June 25, 2025Jun 25 4 hours ago, TDP_2019 said: Quantam computing valley Jan nunchi start avvali ante already construction start aipovali. emi lekunda Jan 2026 ki ela chestharu May be steel structure emo... Not tall buildings... But construction eppudu start cheyyabothunnaro oka update vasthe idea vachiddi.. Lnt kabatti quick gane vuntadi Pani..
June 25, 2025Jun 25 4 hours ago, Siddhugwotham said: Quantum Computing Drone Technology AI ee maatalu tagginchaali Babu gaaru speech lo.... Avanni Jarigee panulu kaadu. He is obsessed by these new technologies.
June 25, 2025Jun 25 40 minutes ago, ramntr said: May be steel structure emo... Not tall buildings... But construction eppudu start cheyyabothunnaro oka update vasthe idea vachiddi.. Lnt kabatti quick gane vuntadi Pani.. L&T is partner in this project. Vaalla pani infrastructure build cheyyatam. Steel Structure aa, some tower aaa edaina kaani aa work asalu eppudu start avuthayooo telikunda Jan nunchi start antunte ela possible anipisthundhi. Proper clarity ledu deeni meeda
June 26, 2025Jun 26 Author ఈ నెల 30 న క్వాంటం డిక్లరేషన్! By Andhra Pradesh News DeskPublished : 26 Jun 2025 05:26 IST Ee Font size 4 min read రాష్ట్రానికి ‘గేమ్ ఛేంజర్’ అవుతుందన్న నిపుణులు అమరావతిలో అత్యంత వేగవంతమైన కంప్యూటర్ విజయవాడలో క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్ హాజరైన ఐబీఎం, ఎల్‌టీఐ మైండ్‌ట్రీ ప్రతినిధులు విజయవాడ-అమరావతి క్వాంటం వ్యాలీ, క్వాంటం టెక్నాలజీపై నిర్వహించిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న కాటమనేని భాస్కర్. చిత్రంలో నేషనల్ క్వాంటం మిషన్ సభ్యులు ఈనాడు, అమరావతి: జాతీయ, అంతర్జాతీయ భాగస్వాములతో ఈ నెల 30న విజయవాడలో నిర్వహించే సదస్సుల్లో ప్రభుత్వం ‘అమరావతి క్వాంటం డిక్లరేషన్’ను ప్రకటించనుంది. క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం వ్యాలీ ద్వారా అందుబాటులోకి వచ్చే సాంకేతికతపై మీడియాకు అవగాహన కల్పించేందుకు విజయవాడలో బుధవారం ‘క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్‌షాప్’లో ఐబీఎం, ఎల్‌టీఐ మైండ్ ట్రీ, ఐటీ రంగ నిపుణులు ఈ విషయాన్ని వెల్లడించారు. సాంకేతికరంగంలో నిపుణులు, పరిశ్రమలు, ప్రభుత్వ ప్రతినిధులు అందించే సూచనల ఆధారంగా డిక్లరేషన్ తయారుచేస్తామని.. ఎండ్ యూజర్స్‌కు కూడా ఇందులో భాగస్వామ్యం కల్పిస్తామని వారు పేర్కొన్నారు. ‘క్వాంటం హార్డ్‌వేర్, సెన్సింగ్, ఇన్నోవేషన్‌పై రౌండ్‌టేబుల్ చర్చలు ఉంటాయి. క్వాంటం స్టార్టప్ ప్రదర్శన ఏర్పాటుచేస్తున్నాం. ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు హాజరవుతారు. అనంతరం ఐబీఎం, టీసీఎస్, అమెరికా కాన్సుల్ జనరల్, నీతి ఆయోగ్ సంస్థల ప్రతినిధుల నుంచి అందిన సూచనలను క్రోడీకరించి క్వాంటం డిక్లరేషన్ తయారు చేస్తాం. క్వాంటం వ్యాలీ అనేది రాష్ట్రానికి గేమ్ ఛేంజర్ టెక్నాలజీ కాబోతోంది’ అని అభిప్రాయపడ్డారు. క్లాసికల్ కంప్యూటర్ కంటే వేల రెట్ల వేగం ‘ప్రస్తుతం మనం వినియోగిస్తున్న క్లాసికల్ కంప్యూటర్ల కంటే వేల రెట్ల వేగంతో క్వాంటం కంప్యూటర్ పనిచేస్తుంది. గత 30-40 ఏళ్లుగా క్వాంటం కంప్యూటింగ్‌పై పరిశోధనలు జరుగుతున్నాయి. 2030 నాటికి ఇది విస్తృతంగా వినియోగంలోకి వస్తుంది. క్వాంటం కంప్యూటింగ్ చాలా వేగంతో.. కచ్చితత్వంతో పనిచేస్తుంది. నిమిషాలు.. గంటల్లో పరిశోధన, ఉత్పత్తులను రూపొందించే అవకాశం ఉంటుంది. క్వాంటం విప్లవాన్ని అందిపుచ్చుకునేందుకు రాష్ట్రానికి అన్ని అవకాశాలూ ఉన్నాయి. రాష్ట్రంలోని యువతకు సాంకేతికంగా ఎంతో గుర్తింపు ఉంది. ఐబీఎం, గూగుల్, మైక్రోసాఫ్ట్ సంస్థలు దీనిపై పనిచేస్తున్నాయి. సమీప భవిష్యత్తులో క్వాంటం టెక్నాలజీ ఊహించనంత వేగంగా జనజీవితంలో భాగం కానుంది. ఈ దృష్ట్యా ప్రస్తుతం చాలా సంస్థలు అత్యంత భద్రమైన క్వాంటం క్రిప్టోగ్రఫీకి మారుతున్నాయి.’ పి.ఎస్.ప్రద్యుమ్న, సీఎం కార్యదర్శి అమరావతిలో.. 156 క్యూబిట్స్ క్వాంటం సిస్టం-2 ‘దేశంలోనే అత్యంత వేగవంతమైన ‘156 క్యూబిట్స్ క్వాంటం సిస్టం-2’ క్వాంటం కంప్యూటర్‌ను ఐబీఎం సంస్థ అమరావతి క్వాంటం వ్యాలీలో ఏర్పాటుచేస్తుంది. జపాన్, కెనడా, అమెరికా, చైనా లాంటి దేశాల్లోనే ప్రస్తుతం క్వాంటం కంప్యూటర్లు ఉన్నాయి. ఐటీ రంగానికే కాకుండా ఫార్మా, వ్యవసాయం, సైబర్ సెక్యూరిటీ, ఫైనాన్స్, ఆరోగ్య రంగాల్లో విప్లవాత్మక పాత్రను క్వాంటం కంప్యూటింగ్ పోషిస్తుంది. విద్యార్థులు, పరిశోధకులు, పరిశ్రమలు దీన్ని వినియోగించుకోవచ్చు. ఐటీ రంగం మాదిరే పెద్దఎత్తున హైఎండ్ ఉపాధి అవకాశాలు వస్తాయి. అమరావతిలో ఏర్పాటుచేసే రతన్‌టాటా ఇన్నోవేషన్ హబ్ అంకుర సంస్థలకు మంచి అవకాశాలు కల్పిస్తాయి. అమరావతిలో 50 ఎకరాల్లో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీ.. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ, సెమికండక్టర్లు, రక్షణ, సాంకేతికతల కేంద్రంగా రూపుదిద్దుకుంటుంది. ఐబీఎం బ్యాక్ ఎండ్‌లో సేవలు అందిస్తే.. ఫ్రంట్ ఎండ్‌లో టీసీఎస్ క్లాసికల్ కంప్యూటర్ సేవలను అందిస్తుంది. క్వాంటం కంప్యూటర్ ఉన్న భవనంలో -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించాలి. ఆ భవనాల నిర్మాణానికి ఎల్ అండ్ టి సంస్థ సహకారాన్ని తీసుకుంటున్నాం.’ కాటమనేని భాస్కర్, ఐటీ శాఖ కార్యదర్శి అమరావతి క్వాంటం వ్యాలీతో కలిసి పనిచేస్తాం ‘ఐబీఎం ఇప్పటికే 1,000 క్యూబిట్ సిస్టమ్‌ను అభివృద్ధి చేసింది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో క్వాంటం కంప్యూటింగ్ సంస్థలు పరిశోధనలు సాగిస్తున్నాయి. విద్యార్థులు, పరిశ్రమలు అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీ సేవలు వినియోగించుకునే అవకాశం ఉంది. ఔషధాల పరిశోధన, ఈవీ బ్యాటరీలు, బిన్ ప్యాకింగ్, కార్గో డెలివరీ, రూట్ ఆప్టిమైజేషన్ వంటి అంశాల్లో క్వాంటం కంప్యూటింగ్ సాంకేతికత ఉపయోగపడుతుంది. స్టాక్ మార్కెట్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో టెక్నాలజీ విస్తృతసేవలు అందిస్తోంది. ప్రపంచానికి ఉపయోగపడే క్వాంటం కంప్యూటింగ్ అందించాలన్నదే జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యం. అమరావతిలో ఏర్పాటుచేసే క్వాంటం వ్యాలీతో కలిసి పనిచేయడం ద్వారా మంచి అప్లికేషన్లు.. ఆల్గరిథంలను అభివృద్ధి చేయాలన్నదే ఆలోచన.’ ప్రొఫెసర్ అనిల్ ప్రభాకర్ (ఐఐటీ మద్రాస్), నేషనల్ క్వాంటం మిషన్ సభ్యుడు, టీసీఎస్ సలహాదారు స్టార్లింగ్ కంప్యూటింగ్ తెస్తాం ‘ఐబీఎం సంస్థ 2029 నాటికి స్టార్లింగ్ అనే భారీ స్థాయి క్వాంటం కంప్యూటింగ్ సిస్టంను రూపొందిస్తోంది. సమీప భవిష్యత్తులో క్వాంటం కంప్యూటింగ్ వినియోగం.. పెట్టుబడులు విస్తృతంగా పెరగనున్నాయి. లాజిస్టిక్స్, స్పేస్, ఔషధరంగం, విద్య, వైద్యం, ఫైనాన్షియల్, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో క్వాంటం కంప్యూటింగ్ కీలకంగా మారుతుంది. అమరావతిలో లాజికల్ క్యూబిట్స్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయబోతున్నాం. అమరావతిలో క్వాంటం వ్యాలీ టెక్ పార్కు ఏర్పాటు దేశంలో ఓ కీలక పరిణామంగా మారుతుంది.’ డాక్టర్ అమిత్ సింఘే, ఐబీఎం సంస్థ డైరెక్టర్ దేశంలోనే మొదటి క్వాంటం వ్యాలీ ‘దేశంలోనే తొలి పూర్తిస్థాయి క్వాంటం వ్యాలీ అమరావతిలో ఏర్పాటవుతుంది. జాతీయ క్వాంటం మిషన్ లక్ష్యాలకు అనుగుణంగా ఇది పనిచేస్తుంది. రిస్క్ ఎనాలిసిస్, వాతావరణమార్పు, క్రిప్టోగ్రఫీ ఆప్టిమైజేషన్ లాంటి అంశాలకు క్వాంటం కంప్యూటింగ్ టెక్నాలజీ విస్తరిస్తోంది. బ్యాంకులు, ఆర్థిక సంస్థల ద్వారా జరిగే లావాదేవీల పర్యవేక్షణ, వరుససంఖ్యల జారీ లాంటి అంశాలలో సాంకేతికత ఉపయోగపడుతుంది. లాజిస్టిక్స్, సప్లై చైన్, మాన్యుఫాక్చరింగ్, హెల్త్‌కేర్, రోబోటిక్స్ అంశాల్లో క్వాంటం, ఏఐ టెక్నాలజీల గురించి ప్రస్తుతం చర్చ జరుగుతోంది.’ విజయరావు, ఎల్‌టీఐ మైండ్ ట్రీ ప్రతినిధి
June 26, 2025Jun 26 Author quantum computer ni minus 270 degrees celsius daggra unchali anta deni kavalasina ecosystem veru ga untundi.
June 29, 2025Jun 29 అమరావతిలో ప్రతిష్టాత్మకంగా ఏర్పాటు చేయనున్న క్వాంటం వ్యాలీపై సోమవారం జరగనున్న నేషనల్ వర్క్‌షాప్‌లో పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ ఐటీ సంస్థల ప్రతినిధులకు సీఎం చంద్రబాబు గారు తన నివాసంలో డిన్నర్ ఇచ్చారు. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో ఈ పార్కును ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని సీఎం వివరించారు. రాగి సంగటి నుండి క్వాంటమ్ డిన్నర్ దాకా: నాయుడు దూరదృష్టి! మధ్యాహ్నం రాగి సంగటి, దానిపై పెరుగు. స్పూన్‌తో ఆరగిస్తూ సాధారణ రాజకీయ సమావేశం. అదే చంద్రబాబు నాయుడు. కానీ అదే నాయుడు.. రాత్రికి ప్రపంచ దిగ్గజాలతో క్వాంటమ్ జాతక రాత్రికి వేదికయ్యారు! ఒకే రోజులో ఆయనే, ఈ సాధారణ, అసాధారణ కలయికకు నిదర్శనం. అమరావతిలోని ముఖ్యమంత్రి నివాసం. ఈ ఆదివారం రాత్రి ఇక్కడ జరిగింది కేవలం విందు కాదు, భవిష్యత్తుకు బీజాంకురం! క్వాంటమ్ శాస్త్రజ్ఞులు, ప్రపంచ ఐటీ దిగ్గజాలు, భారతీయ మేధోనేతలు... అందరూ ఒకే గొడుగు కింద, ఒక డిన్నర్ టేబుల్ చుట్టూ! IBM నుండి మైక్రోసాఫ్ట్, AT&T నుండి వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ దాకా... ఆ టేబుల్ మీద ఉన్న ప్రతి ఒక్కరూ ఆయా రంగాల్లో అంతర్జాతీయంగా పేరు ప్రఖ్యాతులున్న వారే. అసలు అతిథుల జాబితా చూస్తేనే ఆశ్చర్యమేస్తుంది. మైక్రోసాఫ్ట్, IBM, AT&T, అమెజాన్, HCL, TCS వంటి టెక్ దిగ్గజాలు. భారత్ బయోటెక్, డాక్టర్ రెడ్డీస్ ల్యాబ్స్, అస్ట్రాజెనెకా వంటి ఆరోగ్య రంగ నాయకులు. IITల ప్రొఫెసర్లు, కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సలహాదారులు... వారందరితో అమరావతి భవిష్యత్ భౌతిక శాస్త్రానికి, గణితానికి గర్భగుడి అవుతుందా? అనిపించే స్థాయిలో చర్చలు సాగాయి. క్వాంటమ్ వ్యాలీ కాన్సెప్ట్ ఇప్పుడు ఆరంభ దశలో ఉన్నా, దానికి వచ్చే రోజుల్లో గ్లోబల్ ఫోకస్ ఖాయమనేలా దిగ్గజాలతో గుమికూడిన రాత్రి ఇది. ఇది ఓ రాజకీయ కార్యక్రమం కాదు, భవిష్యత్ భారతదేశాన్ని క్వాంటమ్ శక్తిగా తయారుచేసే ఆలోచనల సమ్మేళనం. సాంకేతికతకు వేదికగా మారుతున్న ఆంధ్రప్రదేశ్. ఈ డిన్నర్ పిండివంటల ఆరగింపుల కోసం కాదు. ఇక్కడ చర్చలు జరిగినవి డేటా ప్రాసెసింగ్, భావి క్వాంటమ్ గురించిన కుతూహల విషయాలపై. స్పూన్లు, ఫోర్కుల ధ్వనుల కంటే చప్పట్లే ఎక్కువగా మారుమోగాయి. ప్రపంచాన్ని మెప్పిస్తున్న నాయుడు, అక్కడ తినేది ఊహకు అందని రేపటి భవిష్యత్తు కోసం... జీవితాన్ని పొడిగించుకోడానికి తినే అత్యంత సాధారణ ఆహారమే. ఆ రాగి సంగటి వెనుక ఉన్న ఆ సాధారణత్వం, క్వాంటమ్ డిన్నర్ వెనుక ఉన్న ఆ దూరదృష్టి - ఇదే చంద్రబాబు నాయుడు!
June 30, 2025Jun 30 Author క్వాంటమ్ కంప్యూటింగ్‌ను అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు By Andhra Pradesh News TeamPublished : 30 Jun 2025 13:08 IST Ee Font size 1 min read విజయవాడ: క్వాంటమ్ కంప్యూటింగ్ (Quantum computing)ను మనం అందిపుచ్చుకోవాలని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) పిలుపునిచ్చారు. ప్రభుత్వంతో కలిసి వచ్చిన టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీకి ఆయన అభినందనలు తెలిపారు. ఈ మూడు సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటమ్ పార్కు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నేషనల్ వర్క్‌షాప్ నిర్వహించారు. దీనికి ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లాడారు. ‘‘నేను తొలిసారి సీఎం అయినప్పుడు ఐటీ పరిశ్రమ విస్తరిస్తోంది. మైక్రోసాఫ్ట్ వ్యవస్థాపకుడు బిల్‌గేట్స్‌ను కలిసి ఐటీ విస్తరణపై చర్చించా. పీపీపీ మోడల్‌లో హైటెక్‌సిటీ కట్టాలని ఎల్‌అండ్‌టీని కోరా. తర్వాత ఆ సంస్థ బెంగళూరు, గురుగ్రామ్‌లోనూ ఐటీ భవనాలు కట్టింది. భవిష్యత్తులో భారత్ అతిపెద్ద ఐటీ హబ్‌గా మారుతుందని ఆనాడే చెప్పా. ఉమ్మడి ఏపీలో ఇంజినీరింగ్ కళాశాలలు అనేకం వచ్చేలా చూశా. రాజధాని ప్రాంతానికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయి. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తాం. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నాం. అమరావతికి రావాలని స్టార్టప్ కంపెనీలను ఆహ్వానిస్తున్నాం’’ అని చంద్రబాబు వివరించారు.
June 30, 2025Jun 30 Author అమరావతిని అధునాతన సాంకేతిక కేంద్రంగా మారుస్తాం: నారా లోకేశ్ By Andhra Pradesh News TeamPublished : 30 Jun 2025 13:29 IST Ee Font size 1 min read విజయవాడ: అమరావతికి అనేక ఐటీ సంస్థలు వస్తున్నాయని మంత్రి నారా లోకేశ్ (Nara Lokesh) అన్నారు. విజయవాడలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీపై నిర్వహించిన నేషనల్ వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడారు. అధునాతన సాంకేతిక కేంద్రంగా అమరావతిని మారుస్తామన్నారు. క్వాంటమ్ టెక్నాలజీపై మరింత దృష్టి పెడుతున్నామని చెప్పారు. అమరావతికి రావాలని స్టార్టప్ సంస్థలను ఆహ్వానిస్తున్నట్లు చెప్పారు. చంద్రబాబు విజనరీ లీడర్‌షిప్ గురించి అందరికీ తెలుసని.. ఆయన ఎప్పుడూ సాంకేతికతకు పెద్దపీట వేస్తారని పేర్కొన్నారు. వర్క్‌షాప్‌నకు వచ్చిన ఐటీ, ఎంఎన్‌సీ కంపెనీల ప్రతినిధులకు లోకేశ్ కృతజ్ఞతలు తెలిపారు. (Andhra Pradesh News)
June 30, 2025Jun 30 Author క్వాంటమ్ కంప్యూటింగ్‌లో అద్భుతాలు చేయొచ్చు By Andhra Pradesh News DeskPublished : 30 Jun 2025 05:19 IST Ee Font size 4 min read శిక్షణకు దేశ విదేశీ నిపుణులను ఆహ్వానించాలి కొత్త నగరమైనందున అమరావతికి అనుకూలతలెన్నో ‘ఈనాడు’ ముఖాముఖిలో కంప్యూటింగ్ రంగ నిపుణుడు, ఎఫ్ట్రానిక్స్ కంపెనీ అధినేత రామకృష్ణ ఈనాడు - అమరావతి హైఎండ్ టెక్నాలజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయొచ్చు. మన పిల్లల మేధో సంపత్తిని ఇక్కడే వాడుకోవచ్చు. విదేశీసంస్థలు, నిపుణులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేసుకొని వెళ్లిపోతే, మనకు దక్కేది తక్కువే. మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడే అభివృద్ధి చెందాలంటే ఆల్గరిథమ్స్ రాసే నిపుణుల్ని తయారుచేయాలి. అమెరికాలోని సిలికాన్ వ్యాలీని తలపించేలా అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా అభివృద్ధి చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇప్పటికే ప్రకటించారు. దీనిపై ఈ నెల 30న జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో కార్యశాల నిర్వహించి, ‘క్వాంటమ్ వ్యాలీ డిక్లరేషన్’నూ వెల్లడించనున్నారు. ఐబీఎం, టీసీఎస్ తదితర ఐటీ దిగ్గజ సంస్థలు ఇందులో భాగస్వాములవుతున్నాయి. క్వాంటమ్ కంప్యూటింగ్ సాంకేతికతతో ఉపయోగాలేంటి? రాష్ట్రానికి చేకూరే ప్రయోజనాలేంటి? దీని ఫలితాలను అందిపుచ్చుకోవాలంటే ఏం చేయాలి అన్న సందేహాలను కంప్యూటింగ్ రంగంలో విశేష అనుభవశాలి, ఎఫ్ట్రానిక్స్ కంపెనీ అధినేత, సీఐఐ ఏపీ ఛాప్టర్ పూర్వ అధ్యక్షుడు డి.రామకృష్ణ ‘ఈనాడు’ ముఖాముఖిలో నివృత్తి చేశారు. ఆయన 1983లో మద్రాస్ ఐఐటీలో ఎంటెక్ పూర్తిచేసి, 1985లో సొంత కంపెనీ ప్రారంభించారు. సంక్లిష్ట లెక్కలు.. క్షణాల్లో! నేడు అందరం యూపీఐ పేమెంట్స్ చేస్తున్నాం. క్యూఆర్ కోడ్ స్కాన్ చేసి, ఎంత డబ్బు చెల్లించాలో నమోదుచేస్తే, ఆ సమాచారం మీ బ్యాంకు ఖాతాకు వెళ్లి, అక్కడి నుంచి అవతలి వ్యక్తి బ్యాంకు ఖాతా తెలుసుకుని, మీ బ్యాంకు నుంచి ఆ బ్యాంకు ఖాతాకు సెకన్లలో సొమ్ము జమైపోతుంది. ఇలా సొమ్ము బదిలీ కావడం వెనక సంక్లిష్టమైన కంప్యూటింగ్ ప్రక్రియ ఉంటుంది. వేల కంప్యూటర్లు పనిచేస్తాయి. ప్రస్తుతం 2-3 గిగా హెర్ట్జ్ స్పీడ్‌తో పనిచేసే కంప్యూటర్లున్నాయి. కాలిక్యులేషన్స్‌లో సంక్లిష్టతలు పెరిగేకొద్దీ, కంప్యూటర్ స్పీడ్ పెరిగాలి. వీటికి పరిష్కారమే క్వాంటమ్ కంప్యూటింగ్. పరమాణువులో కేంద్రకం చుట్టూ తిరిగే ఎలక్ట్రాన్ల ప్రవర్తన ఆధారంగా (క్వాంటమ్ మెకానిక్స్) క్వాంటమ్ కంప్యూటర్లు రూపొందాయి. సంప్రదాయ కంప్యూటర్లలో కొన్నేళ్ల సమయం పట్టే కాలిక్యులేషన్స్‌ను క్వాంటమ్ కంప్యూటర్స్‌లో నిమిషాల్లోనే చేయొచ్చు. నైపుణ్యాల పెంపే కీలకం క్వాంటం కంప్యూటర్లను సాధారణ కంప్యూటర్లలా వాడేయలేం. వీటికి మైనస్ 273 డిగ్రీల సెల్సియస్ ఉష్ణోగ్రత కావాలి. బయటి నుంచి ఏ తరంగాలూ రాకూడదు. ఆల్గరిథమ్స్ రాసేందుకు ఎంతో నైపుణ్యం కావాలి. గణిత, భౌతికశాస్త్రాలతో పాటు సంబంధిత రంగాలపై లోతైన పరిజ్ఞానం ఉండాలి. ప్రస్తుతం కొత్త ఔషధాల్ని కనిపెట్టడం, రవాణా, ఏఐ, ఎన్‌క్రిప్షన్ వంటి కొన్ని అంశాల ఆల్గరిథమ్స్ ఉన్నాయి. క్యాన్సర్‌కు కొత్తమందు కనిపెట్టేందుకు ఎన్ని కాంబినేషన్లకు అవకాశముందో కాలిక్యులేట్ చేయడానికి సాధారణ కంప్యూటర్లలో కొన్నేళ్లు పడితే, క్వాంటమ్ కంప్యూటర్లలో నిమిషాల్లో పూర్తిచేయొచ్చు. మిగతా రంగాల ఆల్గరిథమ్స్ కూడా సిద్ధమైతే అద్భుతాలు చేయొచ్చు. సినిమాల్లో గ్రాఫిక్స్, ఎడిటింగ్‌లకు ఆల్గరిథమ్స్ సిద్ధమైతే వేగం పెరిగి, ఖర్చు తగ్గుతుంది. కొత్త ఆల్గరిథమ్స్ రాసే స్థాయికి మనం ఎదిగినప్పుడే దాని ప్రయోజనాలు పొందగలం. చంద్రబాబు క్వాంటమ్ వ్యాలీ ప్రకటించినందున దాన్ని అందిపుచ్చుకోవాలన్న జిజ్ఞాస యువతలో ఉండాలి. దక్షిణ కొరియా అనుభవపాఠం హైఎండ్ టెక్నాలజీలో ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టి, శిక్షణ ఇస్తే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా చేయొచ్చు. మన పిల్లల మేధోసంపత్తిని ఇక్కడే వాడుకోవచ్చు. ఇంజినీరింగ్, బీఎస్సీ కంప్యూటర్స్‌లో ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్‌ను సబ్జెక్ట్‌గా ప్రవేశపెడుతోంది. అప్లికేషన్ ఆధారిత’ విద్యావిధానాన్ని ప్రోత్సహించాలి. ప్రాబ్లమ్ సాల్వింగ్ సామర్థ్యాలు పెంపొందించాలి. ఈ రంగంలో నిపుణులు ప్రపంచంలో ఎక్కడున్నా రప్పించి, మంచి వేతనాలిచ్చి యువతకు శిక్షణ ఇప్పించాలి. ఒకప్పుడు జపాన్ నుంచి దక్షిణ కొరియాకు ప్రతి శుక్రవారం నిపుణులతో నాలుగు విమానాలు వెళ్లేవి. వారు రెండు రోజులపాటు అక్కడ శిక్షణ ఇచ్చి, మళ్లీ ఆదివారం జపాన్ చేరుకునేవారు. దక్షిణకొరియా.. నేడు కొన్ని సాంకేతికతల్లో లీడర్. మన దగ్గరా అలాంటి ప్రయత్నం జరగాలి. సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా.. వర్సిటీలు విదేశీసంస్థలు, నిపుణులు వచ్చి ఇక్కడ ప్రాజెక్టులు చేసుకొని వెళ్లిపోతే, మనకు దక్కేది తక్కువే. మొత్తం ఎకోసిస్టమ్ ఇక్కడే అభివృద్ధి చెందాలంటే ఆల్గరిథమ్స్ రాసే నిపుణుల్ని తయారుచేయాలి. క్వాంటమ్ కంప్యూటింగ్‌ను వినియోగించగల రంగాల కంపెనీలను రప్పించాలి. అమరావతిలో విట్, ఎస్‌ఆర్‌ఎం, అమృతతో పాటు చుట్టుపక్కల విజ్ఞాన్, కేఎల్, పీబీ సిద్ధార్థ తదితర యూనివర్సిటీలున్నాయి. వీటిని డ్రగ్ డిస్కవరీ, లాజిస్టిక్స్ వంటి రంగాల్లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్‌లుగా అభివృద్ధి చేయొచ్చు. అమరావతి కొత్తగా నిర్మిస్తున్న నగరం కాబట్టి, అనుకూలతలు ఎక్కువ. బెంగళూరు, హైదరాబాద్‌లా ట్రాఫిక్ సమస్యలు, భూముల కొరత వంటి సవాళ్లు లేవు. యువత ఎక్కువగా ఉన్నందున కొద్ది ప్రయత్నంతో నిపుణులను తయారుచేయొచ్చు.
June 30, 2025Jun 30 Author నేడు విజయవాడలో క్వాంటమ్ వ్యాలీపై వర్క్‌షాప్ By Andhra Pradesh News DeskPublished : 30 Jun 2025 05:06 IST Ee Font size 1 min read పాల్గొనేందుకు వచ్చిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు ప్రముఖులకు సీఎం చంద్రబాబు విందు విందు సందర్భంగా దిగ్గజ ప్రైవేటు సంస్థల ప్రతినిధులతో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: అమరావతి క్వాంటమ్ వ్యాలీపై సోమవారం విజయవాడలోని ఓ హోటల్‌లో రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్ నిర్వహించనుంది. ఇందులో పాల్గొనేందుకు ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ కంపెనీల ప్రతినిధులు, కేంద్ర ప్రభుత్వంలోని ఉన్నతాధికారులు పలువురు విజయవాడకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు ఉండవల్లిలోని తన నివాసంలో ఆదివారం రాత్రి వారికి విందు ఇచ్చారు. ఆయా కంపెనీల ప్రతినిధులతో క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంపై చర్చించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సహకారంతో దేశంలోనే మొదటి పార్కును ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని వివరించారు. టీసీఎస్ ప్రెసిడెంట్, గ్లోబల్ హెడ్ (టెక్నాలజీ సాఫ్ట్‌వేర్ అండ్ సర్వీసెస్) వి.రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్‌కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్‌వర్మ, భారత్ బయోటెక్ మేనేజింగ్ డైరెక్టర్ సుచిత్ర కె.ఎల్ల, హైదరాబాద్‌లోని అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జె.బి.వి.రెడ్డి, ఆస్ట్రాజెనెకా ఎండీ ప్రవీణ్‌రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్ర సాంకేతిక మంత్రిత్వ శాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రధాన శాస్త్రీయ సలహాదారు అజయ్‌కుమార్ సూద్ తదితర ప్రముఖులు ఈ విందుకు హాజరయ్యారు. వీరితో పాటు అమెజాన్, హెచ్‌సీఎల్, ఎల్‌అండ్‌టీ, ఐఐటీ మద్రాస్, ఐఐటీ తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
June 30, 2025Jun 30 Author తొమ్మిది జాతీయ మిషన్లలో క్యాంటం టెక్నాలజీ విప్లవం ఒకటి అని, అందుకే నేషనల్ క్యాంటం మిషన్ ఏర్పాటు అయిందని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి జితేంద్ర సింగ్ వెల్లడించారు. అమరావతి క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్‌కు వీడియో కాన్ఫరెన్సు ద్వారా ఆయన హాజరయ్యారు. ఏపీ ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. దేశంలోని నాలుగు ప్రాంతాల్లో పరిశోధనా కేంద్రాలను ఏర్పాటు చేశామని తెలిపారు. 17 రాష్ట్రాల్లో 152 సంస్థలు ఈ క్వాంటం సాంకేతికతపై పనిచేస్తున్నాయన్నారు. ఏఐసీసీటీఈ ద్వారా బీటెక్ క్వాంటం టెక్నాలజీలో అందిస్తున్నట్లు వివరించారు.
June 30, 2025Jun 30 Author CM Chandrababu: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలి: సీఎం చంద్రబాబు ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని ఏపీ సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని, శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని తెలిపారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని సీఎం చంద్రబాబు తెలిపారు. AP CM Chandrababu అమరావతి: క్వాంటమ్ కంప్యూటింగ్‌ను మనం అందిపుచ్చుకోవాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సూచించారు.1990లలో ఇంటర్నెట్ వల్ల ప్రపంచం ఓ గ్లోబల్ విలేజ్‌గా మారిందని ఉద్ఘాటించారు. ఐటీపై ఆలోచన చేస్తే చాలదు... దానికి ఎకోసిస్టమ్ క్రియేట్ చేయాలని చెప్పుకొచ్చారు. ఇప్పడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారిందని వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్‌లో ఇవాళ(సోమవారం) వర్క్‌షాప్ నిర్వహించారు. ఈ వర్క్‌షాప్‌లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. 1995 టెక్నాలజీ రివెల్యూషన్‌ను ఇండియా పొందిందని, దానిలో తన పాత్రా ఉందని గుర్తుచేసుకున్నారు సీఎం చంద్రబాబు. ఏపీకి ఎన్నో అడ్వాంటేజీలు ఉన్నాయని.. శ్రీహరికోట రాకెట్ లాంచింగ్ ఇక్కడే ఉందని సీఎం చంద్రబాబు చెప్పారు. ఏరోస్పేస్ రంగంలో ప్రైవేట్ పెట్టుబడులకు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిందని అన్నారు. ఏపీ గ్రీన్ ఎనర్జీలో చాలా బలంగా ఉందని తెలిపారు. 1989లో కుప్పం నుంచి పోటీచేస్తూ ఒక పబ్లిక్ మీటింగ్‌లో తాను ఎలక్ట్రానిక్ ఎక్సేంజ్ తెస్తానని చెప్పానని.. అయితే ఆ విషయంతో తన ప్రత్యర్థులు తప్పుపట్టారని గుర్తుచేశారు. ప్రభుత్వ సేవలన్నీ ఆగస్టు 15వ తేదీ నాటికి వాట్సాప్ చాట్ బోట్ ద్వారానే నిర్వహిస్తామని స్పష్టం చేశారు. జనవరి ఒకటోవ తేదీ నాటికి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ అమరావతి నుంచి ప్రారంభమవుతుందని ప్రకటించారు. టాప్ ఏఐ యూసేజ్‌లో చైనా, యూఎస్, ఇండియా మాత్రమే ముందు ఉన్నాయని వివరించారు. టీసీఎస్ మనతో ముందు నుంచీ ట్రావెల్ చేస్తోందని.. ఇప్పుడు డేటాలింక్‌పై పనిచేస్తోందని వెల్లడించారు సీఎం చంద్రబాబు. ఐటీపై ఆలోచన చేస్తే చాలదు.. ‘నిజానికి క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ప్రమోట్ చేయాలనుకున్నాం. దీనిపై ముఖ్యమైన వ్యక్తులను ఆహ్వానించాలనుకున్నాం. ఆ సమయంలోనే భారత ప్రభుత్వం క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్‌ను అనౌన్స్ చేసింది. వెంటనే కామకోటి మా వద్దకు వచ్చి ఈ విషయం చెప్పారు. వెంటనే నేను కేంద్ర ప్రభుత్వాన్ని అడిగా... వారు ఓకే చెప్పారు. ఎలా ముందుకెళ్లాలనీ అడిగాం. ఈ రంగంలో మరింతమంది ముందుకు రావాలి. ఎకో సిస్టంను టీసీఎస్, ఐబీఎం, ఎల్ అండ్ టీ ద్వాారా చేయగలిగాం. ఐటీపై ఆలోచన చేస్తే చాలదు. దానికి ఎకోసిస్టం క్రియేట్ చేయాలి. ఐటీని నేను 1983-84లోనే అప్లైడ్ చేశాను. లోకేష్ పుట్టిన సమయం అది. దానిలో భాగంగా నేను అమెరికా వెళ్లా. మైక్రోసాఫ్ట్‌తోపాటు అన్ని నగరాలు తిరిగి ప్రయత్నం చేశా. బ్రిటిష్ వాళ్లు మన కోహినూర్ డైమెండ్‌ను తీసుకుపోయినా.. ఇక్కడ ఇంగ్లీష్ వదిలి వెళ్లారు. నేను అమెరికా నుంచి తిరిగి రాగానే అనేక ఇంజనీరింగ్ కాలేజ్‌లు ప్రారంభించి ఐటీ ఎడ్యూకేషన్‌ను పెంచా. ఇప్పుడు హైదరాబాద్ ప్యూచరిస్టిక్ టెక్నాలజీలకు వేదికగా మారింది. మేము గర్వంగా చెబుతున్నాం మేము మీదేశానికి సేవ చేస్తున్నామంటూ అమెరికన్ కాన్సులెట్ జనరల్‌తో చెప్పారు. గతంలో ఎక్కువ బిల్లు వస్తుందని అమెరికాలో లోకేష్ ఉన్నప్పుడు ఫోన్ చేయలేకపోయా. దీంతో ఇతర దేశాల్లో పరిణామాలు చూసి సెల్‌ఫోన్ తేవాలని చెప్పా. అయితే అప్పట్లో పేదరికం గురించి మాట్లాడేవారు...సెల్‌ఫోన్ ఎలా అన్నారు. ఇప్పడు భర్త లేకుండా భార్య, భార్య లేకుండా భర్త జీవించగలుగుతున్నారు. అయితే వీరిద్దరూ సెల్ లేకుండా ఉండలేకపోతున్నారు’ అంటూ సీఎం చంద్రబాబు చమత్కరించారు.
July 1, 2025Jul 1 Author అమరావతిలో క్వాంటమ్ సేవలు By Andhra Pradesh News DeskUpdated : 01 Jul 2025 06:40 IST Ee Font size 7 min read జనవరి నుంచి అందుబాటులోకి కంప్యూటర్ ఏర్పాటే కాదు.. ఎకోసిస్టంనూ అభివృద్ధి చేస్తాం జాతీయ, అంతర్జాతీయ సంస్థలు అందిపుచ్చుకోవాలి ప్రభుత్వ సేవలకూ అనుసంధానం చేస్తాం ‘క్వాంటమ్ డిక్లరేషన్’పై సీఎం చంద్రబాబు ప్రకటన విజయవాడలో దిగ్గజ సంస్థలతో వర్క్‌షాప్ విజయవాడలో నిర్వహించిన క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు ఈనాడు, అమరావతి: అమరావతిలో వచ్చే ఏడాది జనవరి నుంచి క్వాంటమ్ కంప్యూటర్ పనిచేయడం ప్రారంభమవుతుందని సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో క్వాంటమ్ వ్యాలీని రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేస్తోందని తెలిపారు. క్వాంటమ్ వ్యాలీ విధివిధానాలపై జాతీయ, అంతర్జాతీయ నిపుణులతో విజయవాడలో సోమవారం రాష్ట్ర ప్రభుత్వం వర్క్‌షాప్ నిర్వహించింది. ఐటీ, ఫార్మా, వాణిజ్య, నిర్మాణ రంగాలకు చెందిన దిగ్గజ సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ ప్రొటోటైప్‌ను ఐబీఎం సంస్థ ప్రదర్శించింది. కొత్త స్టార్టప్‌లను సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ పరిశీలించారు. నిపుణుల సూచనలను క్రోడీకరించి ‘అమరావతి క్వాంటమ్ డిక్లరేషన్’ను ముఖ్యమంత్రి ప్రకటించారు. అనంతరం మాట్లాడుతూ ‘కేవలం క్వాంటమ్ వ్యాలీ ప్రారంభించడం కాదు, అవసరమైన ఎకోసిస్టం తీసుకొస్తాం. 2026 ఆగస్టు 15 నాటికి 100 యూజ్ కేస్‌లు (ఏ సమస్యలను సమర్థంగా పరిష్కరించవచ్చో గుర్తించడం) తీసుకురావాలన్నది లక్ష్యం. ఈ విషయంలో ఇబ్బందులుంటే ప్రభుత్వం పరిష్కారం చూపుతుంది. భాగస్వామ్య పక్షాలకు నేనిచ్చే భరోసా ఇది. అమరావతిని క్వాంటమ్ టెక్నాలజీకి కేంద్రంగా తీర్చిదిద్దడమే లక్ష్యం. అంతర్జాతీయ కంపెనీలు ఈ అవకాశాన్ని జారవిడుచుకుంటే.. అది పెద్ద తప్పిదం అవుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. అమరావతిలో ఏర్పాటు చేయనున్న ఐబీఎం క్వాంటమ్ సిస్టం నమూనా వద్ద సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేశ్. చిత్రంలో ఏపీ ఉన్నత విద్యామండలి ఛైర్మన్ మధుమూర్తి, హైదరాబాద్‌లో అమెరికా కాన్సుల్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, టీసీఎస్ ప్రెసిడెంట్ రాజన్న, కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం కార్యదర్శి అభయ్ కరందీకర్, ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, ఐబీఎం ఇండియా ఎండీ సందీప్ పటేల్, ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ ప్రొఫెసర్ కామకోటి తదితరులు ఎకోసిస్టం అభివృద్ధి కీలకం ఒక మెషీన్‌ను తీసుకొచ్చి పెట్టి, క్వాంటమ్ కంప్యూటింగ్ వచ్చేసిందని చెప్పడం ప్రభుత్వ ఉద్దేశం కాదని సీఎం పేర్కొన్నారు. ‘నేను పాలసీ రూపొందించడం వరకే పరిమితం. ఎకోసిస్టం అభివృద్ధికి నిపుణుల((( అభిప్రాయాలు కీలకం. టీసీఎస్ సహకారంతో రాష్ట్రంలోని అన్ని రికార్డులను డేటాలేక్‌కు అనుసంధానిస్తున్నాం. వ్యక్తిగత డేటా, ఆధార్ అథెంటికేషన్, ఫ్యామిలీ యూనిట్‌గా ప్రతి ఇంటినీ జియోట్యాగింగ్ చేస్తున్నాం. ఉష్ణోగ్రతలు, తేమ శాతం, వర్షపాతం, పిడుగులు పడే సమాచారం, భూగర్భ జలమట్టం, రిజర్వాయర్లలో నీటి నిల్వలు, నేలలో తేమ, పంట దిగుబడుల అంచనాలు వంటి 42 పారామీటర్లలో రియల్‌టైం డేటా అందుబాటులో ఉంది. వాటిని క్వాంటమ్ కంప్యూటింగ్‌తో అనుసంధానించి, అంతిమ ఫలితాలు అందుకోవాలి. ఫార్మారంగంలోనూ తక్కువ సమయంలో విస్తృత పరిశోధనలు చేసి ఫలితాలు రాబట్టవచ్చ’ని సీఎం వివరించారు. స్టార్టప్‌లకు కూడా విస్తృత అవకాశాలున్నాయని పేర్కొన్నారు. అమరావతిలో ఐకానిక్ భవనం నిర్మించాలని అడిగిన వెంటనే ఎల్‌అండ్‌టీ సంస్థ అంగీకరించిందని గుర్తుచేశారు. అమరావతి సహా ఐదు ప్రాంతాల్లో రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్‌లు ఏర్పాటు చేస్తున్నట్లు చంద్రబాబు వెల్లడించారు. క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌నకు హాజరైన వివిధ సంస్థల ప్రతినిధులు ఎప్పటికప్పుడు అందిపుచ్చుకుంటేనే. నేడు అన్నీ అవసరాలకు సెల్‌ఫోన్ ఒక సాధనమైంది. కృత్రిమ మేధ ఇప్పటికే పూర్తిస్థాయిలో వినియోగంలోకి వచ్చింది. ఇకపై క్వాంటమ్ విప్లవం రాబోతున్నందున క్వాంటమ్ వ్యాలీ, డీప్ టెక్నాలజీపై దృష్టి పెట్టాలి. స్పేస్ టెక్నాలజీలో ప్రైవేటు పెట్టుబడులకు కేంద్రం అనుమతించింది. శ్రీహరికోటలో ఉపగ్రహ ప్రయోగ కేంద్రం ఉండటం వల్ల ఏపీకి అవకాశాలు వస్తాయి. అంతరిక్ష రంగంలో పెట్టుబడులను అందిపుచ్చుకోవడానికి స్పేస్ సిటీని ఏర్పాటు చేస్తున్నాం. డ్రోన్‌ల వినియోగ విస్తృతి దృష్ట్యా డ్రోన్ సిటీని ఏర్పాటు చేస్తున్నామ’ని చంద్రబాబు వివరించారు. ఆగస్టు 15 నాటికి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పూర్తిస్థాయిలో పౌరసేవలు అందిస్తామన్నారు. ఐటీ మంత్రి లోకేశ్.. ఆ రంగంపై తనకున్న అవగాహనతో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను ముందుకు తీసుకెళ్లాలని ఆకాంక్షించారు. అమరావతికి అత్యాధునిక క్వాంటమ్ సిస్టమ్-2 తెస్తున్నాం -సందీప్ పటేల్, ఐబీఎం ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ ఎండీ క్వాంటమ్ సాంకేతికతపై భారతదేశంలో ఇంత భారీ స్థాయిలో సదస్సు జరగడం ఇదే మొదటిసారి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్ హబ్‌ను ఏర్పాటు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు దార్శనికతకు అభినందనలు. ఐబీఎం అత్యంత అధునాతన క్వాంటమ్ సిస్టమ్-2 కంప్యూటర్‌ని అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. భారతదేశానికి క్వాంటమ్ సిస్టమ్స్ వస్తే... ఇక్కడి ఐటీ నిపుణులు, సాఫ్ట్‌వేర్ డెవలపర్లు ప్రపంచస్థాయి ప్రమాణాలతో క్వాంటమ్ అల్గారిథమ్‌లు రాయగలుగుతారు. అప్పుడు భారతదేశంతో పాటు, మొత్తం ప్రపంచం ఎదుర్కొంటున్న సమస్యలకు ఇక్కడి నుంచే పరిష్కారం దొరుకుతుంది. 2029 నాటికి రెండో తరం క్వాంటమ్ కంప్యూటర్ .. -స్కాట్ క్రౌడర్, వైస్ ప్రెసిడెంట్, ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ విభాగం క్వాంటమ్ మెకానిక్స్‌ని అభివృద్ధి చేసి వందేళ్లయింది. దాని వల్ల ఎంఆర్‌ఐ మెషీన్లు, లేజర్లు, సెమీకండక్టర్లను ఆవిష్కరించగలిగాం. మానవ సమాజంపై పెను ప్రభావం చూపిన దాన్ని తొలి క్వాంటమ్ విప్లవంగా భావిస్తే... ఇప్పుడు క్వాంటమ్ కంప్యూటింగ్ వల్ల రెండో విప్లవం రాబోతోంది. సంప్రదాయ కంప్యూటర్లు చేయలేని అనేక సంక్లిష్ట సమస్యలకు క్వాంటమ్ కంప్యూటర్‌లు పరిష్కారం చూపుతాయి. ముఖ్యంగా రసాయనశాస్త్ర ప్రయోగాల్లో అత్యంత కచ్చితత్వంతో అనేక నూతన ఆవిష్కరణలు చేయగలుగుతాం. దీనికి మరింత ఆధునిక క్వాంటమ్ కంప్యూటర్లతోపాటు అల్గారిథమ్‌లు అవసరమవుతాయి. అమరావతిలో ఏర్పాటు చేయబోతున్న క్వాంటమ్ వ్యాలీ ఆ దిశగా కీలకంగా మారబోతోంది. 2029 నాటికి ఐబీఎం స్టార్లింగ్ పేరుతో రెండోతరం క్వాంటమ్ కంప్యూటర్‌ని అందుబాటులోకి తేబోతోంది. క్వాంటమ్ కాంపొనెంట్స్ రంగంలో పరిశోధనలు పెరగాలి -ప్రొఫెసర్ కామకోటి, డైరెక్టర్, ఐఐటీ మద్రాస్ వివిధ రంగాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ వినియోగానికి సంబంధించి అల్గారిథమ్‌ల రూపకల్పన, మానవ వనరులకు శిక్షణ ఇవ్వడంతో పాటు, క్వాంటమ్ కాంపొనెంట్స్ అభివృద్ధిపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. పరిశోధనలు పెరగాలి. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ అభివృద్ధికి మద్రాస్ ఐఐటీ నుంచి సంపూర్ణ సహకారం ఉంటుంది. క్వాంటమ్ సాంకేతికత అభివృద్ధికి ఇది రోడ్‌మ్యాప్ -జెన్నిఫర్ లార్సన్, అమెరికా కాన్సుల్ జనరల్, హైదరాబాద్ అమరావతిలో క్వాంటమ్ వ్యాలీని ఏర్పాటు చేయడం ద్వారా ఈ రంగాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రోడ్‌మ్యాప్‌ను ఏర్పాటు చేస్తోంది. శాస్త్రసాంకేతిక రంగాల్లో పరిశోధన, అభివృద్ధికి సంబంధించి భారత్, అమెరికాలు కొన్ని దశాబ్దాలుగా పరస్పరం సహకరించుకుంటున్నాయి. భారత ప్రధాని మోదీ, అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫిబ్రవరిలో ప్రకటించిన అమెరికా-ఇండియా ట్రస్ట్.. క్వాంటమ్ టెక్నాలజీ అభివృద్ధి విషయంలో పరస్పర సహకారానికి తోడ్పడుతుంది. ప్రముఖులకు సీఎం సన్మానం ఈనాడు, అమరావతి: క్వాంటమ్ వ్యాలీ వర్క్‌షాప్‌లో పాల్గొన్న ప్రముఖులను సీఎం చంద్రబాబు వేదికపైకి పిలిచి ప్రత్యేకంగా సన్మానించారు. ఆయా రంగాల్లో వారు సాధించిన ప్రగతిని ప్రస్తావించారు. భారత్ బయోటెక్ సంస్థ ఔషధాల తయారీకి సంబంధించి పరిశోధనలు చేస్తుందని.. ఆ సంస్థ క్వాంటమ్ సాంకేతికత వినియోగించడం వల్ల త్వరితగతిన పరిశోధన పూర్తవుతుందని సీఎం పేర్కొన్నారు. పరిశోధనలకు చేసే ఖర్చు కూడా తగ్గుతుందని అన్నారు. సన్మానం అందుకున్న వారిలో.. సుచిత్ర ఎల్లా, సహ వ్యవస్థాపకురాలు, జేఎండీ భారత్ బయోటెక్. అనిల్ శర్మ, గ్లోబల్ హెడ్, టీసీఎస్ కో ఇన్నోవేషన్ నెట్‌వర్క్. రాజీవ్‌కుమార్, ఎండీ, మైక్రోసాఫ్ట్ ఇండియా డెవలప్‌మెంట్ సెంటర్-ఐడీసీ. అమితాబ్ ఘోశల్ వైస్‌ప్రెసిడెంట్, ఇండియా ఆపరేషన్స్- ఎల్3హ్యారిస్ టెక్నాలజీస్. శ్రీధర్ సిధు, కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ బ్లాకింగ్ అండ్ టాకిలింగ్ ఏటీ అండ్ టీ. నీలేష్ బిన్‌వాలె, జీఎం, ఎండీ, వీపీ ఇంజినీరింగ్ ప్యాటర్న్ ఇండియా. మనీష్ వర్మ, హెడ్, ఇండియా ఇన్నోవేషన్ సెంటర్, వార్నర్ బ్రోస్ డిస్కవరి. ఫణిమిత్ర, గ్లోబల్ చీఫ్ డిజిటల్ అండ్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్, డాక్టర్ రెడ్డీస్ అమిత్ సింఘీ, డైరెక్టర్ ఐబీఎం రీసెర్చ్ ఇండియా అండ్ సీటీఓ, ఐబీఎం ఇండియా అండ్ సౌత్ ఏసియా రాహుల్ శర్మ, ఎండీ, యూఎస్‌ఐబీసీ. ఎయిర్ మార్షల్ డీసీ కుమారియా, మాజీ వైస్ చీఫ్ ఆఫ్ ఇండియన్ ఎయిర్‌ఫోర్స్, మిలిటరీ అడ్వయిజర్ టు ఏఐ సిస్టమ్స్ ఇండియా, స్కాట్ క్రౌడర్, వైస్ ప్రెసిడెంట్ ఐబీఎం క్వాంటమ్ అడాప్షన్ విభాగం. వి.రాజన్న, ప్రెసిడెంట్, టెక్నాలజీ అండ్ సాఫ్ట్‌వేర్ సర్వీసెస్, టీసీఎస్.. తదితరులు ఉన్నారు.
Create an account or sign in to comment