May 21, 20251 yr Author క్వాంటం వ్యాలీ ప్రాజెక్టు ఏర్పాటుపై రాష్ట్రప్రభుత్వం.. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో కుదుర్చుకున్న మూడు అవగాహన ఒప్పందాలను ధ్రువీకరించేందుకు చేసిన ప్రతిపాదనకు ఆమోదం
May 31, 20251 yr Author 90లలో ఐటీని ప్రోత్సహించాను. ఇప్పుడు ఏఐతో క్వాంటం కంప్యూటింగ్‌ను ప్రోత్సహిస్తున్నాం. టీసీఎస్, ఐబీఎం, ఎల్‌అండ్‌టీల సంయుక్త ఆధ్వర్యంలో వచ్చే జనవరికి అమరావతిలో క్వాంటం కంప్యూటింగ్ వ్యాలీ ఏర్పాటుచేస్తున్నాం. మీ వ్యాపారాల ఉత్తమ ఫలితాల కోసం దీన్ని ఉపయోగించుకోవాలని ఆహ్వానిస్తున్నా.
May 31, 20251 yr Author అమరావతిలో క్వాంటమ్ పార్కు ఎంఓయూ ఖరారు అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నలాజికల్ పార్కు (టెక్ పార్క్) ఏర్పాటుకు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఎల్ అండ్ టీ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. By Andhra Pradesh News DeskPublished : 31 May 2025 04:46 IST Ee Font size 1 min read ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం ఈనాడు, అమరావతి: అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ టెక్నలాజికల్ పార్కు (టెక్ పార్క్) ఏర్పాటుకు ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్), ఎల్ అండ్ టీ సంస్థలతో కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని (ఎంఓయూ) ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దేశంలోనే మొదటి క్వాంటమ్ కంప్యూటింగ్ హబ్‌ను అమరావతిలో ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. 2026 జనవరి 1న దీన్ని ప్రాంభించనున్నట్లు ప్రకటించింది. ఆయా సంస్థలతో ఒప్పందం కుదుర్చుకోవడం ద్వారా రాష్ట్రంలో క్వాంటమ్ పర్యావరణ వ్యవస్థ ఏర్పాటుకు అవకాశం ఉంటుందని ప్రభుత్వం భావిస్తోంది. ఎంఓయూ ప్రకారం.. ఐబీఎం సంస్థ అడ్వాన్స్‌డ్ క్వాంటమ్ కంప్యూటింగ్‌కు సంబంధించిన మౌలిక సదుపాయాలను క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కులో కల్పిస్తుంది. అత్యంత శక్తిమంతమైన ఐబీఎం 156 క్యూబిట్ ‘క్వాంటమ్ సిస్టం టూ’ను అందుబాటులోకి తెస్తుంది. దీనివల్ల క్వాంటమ్ నైపుణ్యం, పరిశోధన సహకారం, విద్యా వనరులు పొందేందుకు వీలుంటుంది. టీసీఎస్‌తో ఒప్పందం ద్వారా.. సమగ్ర క్వాంటమ్ కంప్యూటింగ్ సేవలు, పరిష్కార సేవలకు సహకారం అందుతుంది. క్వాంటమ్ సామర్థ్యాలను క్లాసికల్ కంప్యూటింగ్ వ్యవస్థలతో అనుసంధానించడానికి టీసీఎస్ తన విస్తృత పరిశోధన, నెట్‌వర్క్, హైబ్రిడ్ కంప్యూటింగ్ వ్యూహాలను ఉపయోగిస్తుంది. ఆరోగ్య సంరక్షణ, ఆర్థిక, తయారీ రంగాలతో సహా వివిధ ఆవిష్కరణలు, ప్రజావసరాలకు అనుగుణంగా క్వాంటమ్ ఎనేబుల్డ్ అప్లికేషన్లు అభివృద్ధి చేస్తుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో శిక్షణ, విద్యా సహకారం అందిస్తుంది. ఎల్‌అండ్‌టీతో ఒప్పందం ద్వారా.. ఆ సంస్థ ప్రాజెక్టు ఇంజినీరింగ్ నైపుణ్యం, నిర్వహణపై దృష్టి పెడుతుంది. ఈ రంగంలో కొత్త స్టార్టప్‌లు తీసుకురావడానికి విస్తృతమైన నెట్‌వర్క్‌ను వినియోగించుకొనే అవకాశం ఉంటుంది.
May 31, 20251 yr Author అమరావతిలో క్వాంటం పార్క్.. ఉత్తర్వులు జారీ అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్‌లో ఐబీఎం.. 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది.
May 31, 20251 yr 31 minutes ago, sonykongara said: అమరావతిలో క్వాంటం పార్క్.. ఉత్తర్వులు జారీ అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్‌లో ఐబీఎం.. 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది. Jet speed program
May 31, 20251 yr Author అమరావతిలో క్వాంటం వ్యాలీ.. ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. By Andhra Pradesh News TeamPublished : 31 May 2025 13:02 IST Ee Font size 1 min read అమరావతి: అమరావతిలో క్వాంటం వ్యాలీ పార్క్ ఏర్పాటుపై ఏపీ ఐటీ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. క్యాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ ఎంవోయూను ర్యాటిఫై చేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. దీని నిర్మాణానికి మూడు సంస్థలతో ఏపీ ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. టీసీఎస్, ఎల్‌అండ్‌టీ, ఐబీఎం సంస్థలు దీన్ని నిర్మించనున్నాయి. క్వాంటం పార్క్‌లో ఐబీఎం.. 156 క్యూబిట్ క్వాంటం సిస్టం-2ను ఏర్పాటు చేయనుంది. టీసీఎస్ క్వాంటం కంప్యూటింగ్ సర్వీసెస్, సొల్యూషన్స్ సేవలు, క్వాంటంపై పరిశోధన, హైబ్రిడ్ కంప్యూటింగ్ స్ట్రాటజీస్ అందించనుంది. క్లెంట్ నెట్‌వర్క్, స్టార్టప్‌ల నిర్వహణకు ఇంజినీరింగ్ నైపుణ్యాలను ఎల్‌అండ్‌టీ అందించనుంది. 2026 జనవరి 1 నాటికి క్వాంటం వ్యాలీ టెక్నాలజీ పార్క్ సిద్ధం కానుంది edo chinnadi kadithe no use. iconic building kattali.
June 5, 20251 yr Author 1 minute ago, sonykongara said: ABN gadu sollu puku gadu, designs ayithe vachayi edi ki doraka amaravati pic petteadu
June 5, 20251 yr Author క్వాంటం కంప్యూటింగ్‌లో దేశంలోనే ప్రత్యేక గుర్తింపు తెచ్చేలా, ఈ రంగంలో రాష్ట్రానికి అంతర్జాతీయ పెట్టుబడులు తీసుకొచ్చేలా.. ఏపీ క్వాంటం మిషన్ స్థాపనకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. భారత జాతీయ క్వాంటం మిషన్‌లో భాగంగా అమరావతిలో క్వాంటం వ్యాలీ స్థాపించి, క్వాంటం కంప్యూటింగ్, కృత్రిమమేధ, సైబర్ సెక్యూరిటీ రంగాల్లో పరిశోధనలను ముందుకు తీసుకెళ్లేందుకు ఇది దోహడపడనుంది. ప్రపంచ పరిశోధకులను ఆకర్షించేలా.. ‘‘క్వాంటం వ్యాలీ స్థాపించి ఐఐటీ మద్రాస్, టీసీఎస్, ఐబీఎం వంటి సంస్థలతో కలిసి పనిచేసి, అంతర్జాతీయ పరిశోధకులను ఆకర్షించి, అంతర్జాతీయ పెట్టుబడులు రాష్ట్రానికి తీసుకురావాలనేది లక్ష్యం. క్వాంటం వ్యాలీ అభివృద్ధికి సీఆర్‌డీఏ ద్వారా 50 ఎకరాలు కేటాయించారు. ఇక్కడ ఐబీఎం తమ ‘156-క్యూబిక్ క్వాంటం సిస్టమ్ 2’ని నెలకొల్పనుంది. ఈ నెలలో క్వాంటం సమిట్ నిర్వహిస్తారు. ఈ రంగంలో ఏపీ మొదటిస్థానంలో నిలిచేలా చూడనున్నారు.
June 10, 20251 yr Author Amaravati: సిలికాన్ వ్యాలీకి దీటుగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ! క్వాంటమ్ మిషన్‌పై ఈ నెల 30న విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్ యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. By Andhra Pradesh News DeskPublished : 10 Jun 2025 04:36 IST Ee Font size 2 min read రూ.4 వేల కోట్లతో రెండుదశల్లో పూర్తి క్వాంటమ్ మిషన్‌పై సీఎం చంద్రబాబు సమీక్ష ఈనాడు: అమరావతి: క్వాంటమ్ మిషన్‌పై ఈ నెల 30న విజయవాడలో వర్క్‌షాప్ నిర్వహించనున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. దీనికి ఐటీ, ఫార్మా, ఆగ్రో, హెల్త్ యూనివర్సిటీలు, కాలేజీలు, స్టార్టప్ కంపెనీల ప్రతినిధులు, ఇన్నోవేటర్లను ఆహ్వానించనున్నట్లు పేర్కొన్నారు. ఏపీ స్టేట్ క్వాంటమ్ మిషన్‌పై సచివాలయంలో ఐటీ రంగ నిపుణులతో సీఎం సోమవారం సమీక్షించారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఎకో సిస్టం అభివృద్ధికి వారి నుంచి అభిప్రాయాలు తీసుకున్నారు. ‘అమెరికాలోని సిలికాన్ వ్యాలీలా అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రత్యేక గుర్తింపు పొందాలి. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ భవనం ఐకానిక్‌గా నిలిచినట్లు.. అమరావతిలో నిర్మించే క్వాంటమ్ వ్యాలీ టవర్ ప్రత్యేకంగా నిలవాలి’ అని సీఎం పేర్కొన్నారు. రూ. 4 వేల కోట్లతో చేపట్టే క్వాంటమ్ మిషన్ కోసం ప్రత్యేకంగా డైరెక్టర్‌ను నియమించనున్నట్లు వెల్లడించారు. 2027 నాటికి తొలిదశ క్వాంటమ్ మిషన్ మొదటి దశను 2027 నాటికి పూర్తి చేయాలని లక్ష్యంగా నిర్దేశించినట్లు సీఎం పేర్కొన్నారు. రెండో దశను 2030 నాటికి పూర్తి చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. ‘మొదటి దశలో మౌలిక వసతులు, ఎడ్యుకేషన్-రీసెర్చ్, పైలట్ ప్రోగ్రాంలు ఉంటాయి. రెండో దశలో రాష్ట్రాన్ని గ్లోబల్ లీడర్‌షిప్‌గా తీర్చిదిద్దడం, వాణిజ్యం, ఎగుమతి సామర్థ్యాలు పెంపొందించుకోవడం వంటి అంశాలకు ప్రాధాన్యం ఇస్తాం. క్వాంటమ్ ఆధారిత పబ్లిక్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ను నెలకొల్పడంలో పైలట్ రాష్ట్రంగా ఏపీ వ్యవహరిస్తోంది. క్వాంటమ్ మిషన్‌కు ఐబీఎం సారథ్యం వహిస్తుంది’ అని సీఎం పేర్కొన్నారు. క్వాంటమ్ ఇన్నోవేషన్ హబ్‌గా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడం, జాతీయ క్వాంటమ్ మిషన్‌లో భాగస్వామ్యం, నాలెడ్జ్ ఎకానమీ బలోపేతం చేయడాన్ని క్వాంటమ్ మిషన్ విజన్‌గా అధికారులు పేర్కొన్నారు. రాష్ట్ర క్వాంటమ్ మిషన్ ఎజెండా, కార్యాచరణను వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, కమ్యూనికేషన్, సెన్సింగ్-మెట్రాలజీ, మెటీరియల్స్-డివైజ్‌లపై ప్రధానంగా దృష్టి పెట్టనున్నట్లు సీఎంకు వివరించారు. సీఎం నేతృత్వంలో కమిటీ క్వాంటమ్ మిషన్ పర్యవేక్షణకు ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. ‘నా నేతృత్వంలో కమిటీ పనిచేస్తుంది. ఐటీ శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఐటీ, ఆర్థికశాఖల కార్యదర్శులు, మిషన్ డైరెక్టర్, పలువురు నిపుణులు కమిటీలో ఉంటారు’ అని పేర్కొన్నారు.
June 10, 20251 yr Author Amaravati Quantum Valley: అమరావతికి క్వాంటమ్ వ్యాలీ కీలకం ABN , Publish Date - Jun 10 , 2025 | 03:45 AM అమరావతి క్వాంటమ్ వ్యాలీకి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అంత పేరు తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో... సిలికాన్ వ్యాలీ తరహా గుర్తింపు.. 30న బెజవాడలో వర్క్‌షాపు: బాబు అధికారులకు చంద్రబాబు ఆదేశాలు అమరావతి, జూన్ 9 ( ఆంధ్రజ్యోతి): అమరావతి క్వాంటమ్ వ్యాలీకి అమెరికాలోని సిలికాన్ వ్యాలీ అంత పేరు తీసుకురావాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో క్వాంటమ్ కంప్యూటింగ్ మిషన్‌పై ఐటీ నిపుణులతో ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించారు. ఈ నెల 30న విజయవాడలో క్వాంటమ్ మిషన్‌పై వర్క్‌షాపును నిర్వహిస్తున్నట్టు చంద్రబాబు వెల్లడించారు. ముఖ్యమంత్రి అధ్యక్షన క్వాంటమ్ మిషన్ పనిచేస్తుందని చంద్రబాబుకు అధికారులు తెలిపారు. వారు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా కార్యాచరణను గురించి వివరించారు. క్వాంటమ్ ఇన్నొవేషన్ హబ్‌గా రాష్ట్రాన్ని నిలపడం, జాతీయ క్వాంటమ్ మిషన్‌లో భాగస్వామ్యం కావడం, నాలెడ్జ్ ఎకానమీని బలోపేతం చేయడం క్వాంటమ్ కంప్యూటింగ్ ముఖ్యోద్దేశమని అధికారులు వివరించారు. క్వాంటమ్ కంప్యూటింగ్, క్వాంటమ్ కమ్యూనికేషన్, క్వాంటమ్ సెన్సింగ్, మెట్రాలజీ, క్వాంటమ్ మెటీరియల్స్, డివైజ్‌లపై ప్రధానంగా దృష్టి పెడతున్నామని సీఎంకు అధికారులు వివరించారు. ఏపీ క్వాంటమ్ మిషన్ రెండు దశల్లో పనిచేస్తుందన్నారు. 2025-26 తొలి దశగానూ.. 2027-30 మలిదశగానూ చేపడతామన్నారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌కు ఐబీఎం సారథ్యం వహిస్తుందని తెలిపారు.
June 25, 20251 yr Author సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటం వ్యాలీ! సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. By Andhra Pradesh News DeskPublished : 25 Jun 2025 04:47 IST Ee Font size 1 min read నేడు విజయవాడలో వర్క్‌షాప్ సాంకేతికతలకు ప్రత్యేకంగా అమరావతిలోని క్వాంటం వ్యాలీని తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ప్రతిపాదన సిద్ధం చేసింది. రాష్ట్ర సాంకేతిక రంగంలో ‘గేమ్ ఛేంజర్’ అవుతుందని ప్రభుత్వం చెబుతోంది. అమెరికాలోని ‘సిలికాన్ వ్యాలీ’ని మించి.. దేశంలోనే మొదటి సాంకేతిక వ్యాలీగా దీన్ని తీర్చిదిద్దాలన్నది సీఎం చంద్రబాబు ఆలోచన. 1990లలో ఐటీ విప్లవాన్ని అందిపుచ్చుకున్నట్లే.. ఇప్పుడు క్వాంటం ఇన్నోవేషన్ గ్లోబల్ హబ్ ఏర్పాటు ద్వారా ‘ఫస్ట్-మూవర్’ ప్రయోజనాలను అందిపుచ్చుకోవాలన్నది ఆయన ఆలోచన. రాజధాని అమరావతిలో ప్రత్యక్షంగా.. పరోక్షంగా భవిష్యత్తులో 15 లక్షల మందికి ఉపాధి అవకాశాలు వస్తాయని ప్రభుత్వ అంచనా. దీని ఏర్పాటు కోసం అమరావతిలో 50 ఎకరాలు కేటాయించింది. బుధవారం ‘క్వాంటం మిషన్’ పేరిట విజయవాడలో నిపుణులతో వర్క్‌షాప్ నిర్వహించనుంది. రూ.4,000 కోట్లతో సాంకేతికతల ప్రత్యేకతగా టవర్‌ను నిర్మించేందుకు ప్రణాళిక రూపొందించింది. 2026 జనవరి 1న వ్యాలీని ప్రారంభించనున్నట్లు సీఎం ఇప్పటికే ప్రకటించారు. ఈ దార్శనికపత్రాన్ని ‘ఈనాడు’ సంపాదించింది.
June 25, 20251 yr Author Quantum Valley: సిలికాన్ వ్యాలీని తలపించేలా క్వాంటం వ్యాలీ! కెనడాలోని వాటర్లూ క్వాంటం వ్యాలీ విద్యా పరిశోధన, స్టార్టప్‌లపై దృష్టి పెట్టింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రధాన క్వాంటమ్ కంపెనీలకు నిలయం. కానీ, కేంద్రీకృత హబ్ కాదు. By Andhra Pradesh News DeskUpdated : 25 Jun 2025 06:41 IST Ee Font size 4 min read అమరావతిలో రూ.4,000 కోట్లతో ఏర్పాటు వచ్చే ఏడాది జనవరిలో ప్రారంభం 15 లక్షల ఉపాధి అవకాశాలు అంకురాల నుంచి వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ వరకు.. కెనడాలోని వాటర్లూ క్వాంటం వ్యాలీ విద్యా పరిశోధన, స్టార్టప్‌లపై దృష్టి పెట్టింది. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ ప్రధాన క్వాంటమ్ కంపెనీలకు నిలయం. కానీ, కేంద్రీకృత హబ్ కాదు. చైనా జాతీయ హెఫీ ల్యాబ్స్ పెద్ద ఎత్తున ఉన్నా.. అవి రక్షణ ఆధారితమైనవి. ఇతర రంగాలకు సంబంధించి ప్రాధాన్యత లేదు. అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటం వ్యాలీ డీప్‌టెక్ హబ్‌గా దీన్ని తీర్చిదిద్దేలా ప్రభుత్వం ప్రణాళిక రూపొందించింది. క్వాంటం కంప్యూటింగ్, అడ్వాన్స్‌డ్ ఏఐ, సెమీకండక్టర్స్, రక్షణ సాంకేతికతల కేంద్రంగా తీర్చిదిద్దబోతోంది. బహుళజాతి సంస్థలు, స్టార్టప్‌లు, ప్రముఖ అంతర్జాతీయ విద్యా సంస్థలను భాగస్వామ్యం చేయనుంది. పాలనలోనూ క్వాంటం టెక్నాలజీ అమలుకు శ్రీకారం చుట్టబోతోంది. బెంగళూరు, హైదరాబాద్ వంటి ఐటీ సాఫ్ట్‌వేర్ సేవలకు భిన్నంగా.. కటింగ్-ఎడ్జ్ పరిశోధన, హార్డ్‌వేర్ తయారీ, వినూత్న సాంకేతికతల ఆవిష్కరణలకు అమరావతిలోని క్వాంటం వ్యాలీ కేంద్రం కానుందని ప్రభుత్వం చెబుతోంది. 15 లక్షల ఉద్యోగాలు డీప్‌టెడ్ వ్యాలీ ద్వారా ప్రత్యక్షంగా, పరోక్షంగా 15 లక్షల ఉన్నతస్థాయి ఉద్యోగాలు వచ్చే అవకాశం ఉందని ప్రభుత్వ అంచనా. ఉపాధి అవకాశాలు ఉండే రంగాలు.. క్వాంటం సైంటిస్టులు/రీసెర్చర్లు క్వాంటం సాఫ్ట్‌వేర్ ఇంజినీర్లు క్వాంటం హార్డ్‌వేర్ ఇంజినీర్లు క్వాంటం-అవేర్ డేటా సైంటిస్టులు/ఎంఎల్ ఇంజినీర్లు సైబర్‌సెక్యూరిటీ నిపుణులు డొమైన్ నిపుణులు సిస్టమ్ ఇంజినీర్లు, కమర్షియలైజేషన్ ప్రొఫెషనల్స్ ఏరోస్పేస్, రక్షణ రంగాల పెట్టుబడులకు కేంద్రం ఏరోస్పేస్, రక్షణరంగ తయారీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక జోన్‌లుగా వ్యాలీని అభివృద్ధి చేయడంపై సీఎం దృష్టిపెట్టారు. తద్వారా ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీలో దిగ్గజ సంస్థలైన హెచ్‌ఏఎల్ వంటివాటి పెట్టుబడుల ఆకర్షణకు అవకాశం ఉంటుంది. ఇస్రో టెస్టింగ్ ల్యాబ్.. డీఆర్‌డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ ఏర్పాటు కోసం ప్రభుత్వం సంప్రదింపులు జరుపుతోంది. గ్లోబల్ మార్కెట్‌ను అందిపుచ్చుకునేలా.. క్వాంటం కంప్యూటింగ్ మార్కెట్ 2024లో 71.4 మిలియన్ డాలర్ల నుంచి 2035 నాటికి 500 మిలియన్ డాలర్లకు చేరనుందని అంచనా. ఈ అవకాశాన్ని అందిపుచ్చుకుని.. దేశాన్ని గ్లోబల్ క్వాంటం లీడర్‌గా తీర్చిదిద్దడం ద్వారా గ్లోబల్ మార్కెట్‌లో అధిక వాటాను పొందే అవకాశం ఉంటుందన్నది ఆలోచన. దీర్ఘకాలిక లక్ష్యాలు అమరావతిలో ఏర్పాటుచేసే పార్కు జాతీయ క్వాంటం మిషన్‌లో భాగం కానుంది. 2023-24 నుంచి 2030-31 మధ్య (8 ఏళ్లలో) రూ.6,003.65 కోట్లను జాతీయ క్వాంటం మిషన్ ఖర్చు చేయనుంది. అందులో మెజారిటీ వాటాను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తోంది. క్వాంటం వ్యాలీ.. ముఖ్య విభాగాలు క్వాంటం వ్యాలీ టెక్ పార్క్: ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సంస్థల సహకారంతో అమరావతిలో క్వాంటం వ్యాలీని ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. దేశంలోనే అత్యంత వేగవంతమైన క్వాంటం కంప్యూటర్ 156-క్యూబిట్ క్వాంటం సిస్టమ్-2ను ఐబీఎం ఇక్కడ ఏర్పాటుచేస్తుంది. ఎల్ అండ్ టి మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేస్తే.. క్వాంటం కంప్యూటింగ్ సేవలు, హైబ్రీడ్ కంప్యూటింగ్ సొల్యూషన్‌లను టీసీఎస్ అందించనుంది. హెల్త్‌కేర్, ఫైనాన్స్, తయారీ రంగాలలో క్వాంటం సామర్థ్యాలను టీసీఎస్ అనుసంధానం చేస్తుంది. ఎకడమిక్ ఇంటిగ్రేషన్: రాష్ట్రంలోని అన్ని విశ్వవిద్యాలయాల్ల్లో క్వాంటం కంప్యూటింగ్ కోర్సులు ప్రవేశపెట్టాలని ఉన్నత విద్యామండలి ఆదేశించింది. 2025-26 విద్యా సంవత్సరం నుంచి ఆంధ్ర విశ్వవిద్యాలయం క్వాంటం కంప్యూటింగ్‌లో మేజర్, మైనర్ డిగ్రీ ప్రోగ్రాంలను అందిచనుంది. దీనివల్ల క్వాంటం ఇండస్ట్రీకి నైపుణ్యం ఉన్న మానవవనరులను అందించేందుకు చర్యలు దోహదపడనున్నాయి. ప్రభుత్వ రంగ అప్లికేషన్లు: ప్రజలకు మరింత వేగంగా సేవలు అందించేందుకు పాలనలో క్వాంటం సాంకేతికతను ప్రభుత్వం వినియోగించనుంది. దేశంలోనే మొదటి క్వాంటం గవర్నెన్స్ ఫ్రేమ్‌వర్క్ మన నుంచే అందబోతోంది. అంతర్జాతీయ వర్సిటీల సహకారం అమరావతిలో ఏర్పాటు కానున్న డీప్‌టెక్ రీసెర్చ్ పార్క్‌కు ఎకడమిక్‌గా సహకరించేందుకు అమెరికాకు చెందిన పర్డ్యూ విశ్వవిద్యాలయం, జపాన్‌కు చెందిన యూనివర్సిటీ ఆఫ్ టోక్యోలు అంగీకరించాయి. ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాల సహకారం కోసం అధికారులు సంప్రదింపులు జరుపుతున్నారు. స్మార్ట్ సిటీ ఫీచర్లు అమరావతి స్మార్ట్ సిటీ ప్రణాళికలో భాగంగా క్వాంటం వ్యాలీ రూపొందుతోంది. ఇందులో స్మార్ట్ సిటీ ఫీచర్లు ఉన్నాయి. ఏఐ-ఆధారిత ట్రాఫిక్ మేనేజ్‌మెంట్ సిస్టమ్స్, గ్రీన్ ఎనర్జీ గ్రిడ్స్, కాలుష్య నియంత్రణ కోసం క్యాంపస్‌లో విద్యుత్ వాహనాలను వినియోగించేలా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. మొత్తంగా వ్యాలీని హై-టెక్, ఎకో ఫ్రెండ్లీ ఇన్నోవేషన్ హబ్‌గా తీర్చిదిద్దాలన్నది ప్రభుత్వ ఆలోచన. అమరావతి పరిధిలో గ్రీన్ ఎనర్జీ వినియోగించేలా ప్రణాళిక రూపొందించింది. ఈనాడు-అమరావతి
June 25, 20251 yr Quantam computing valley Jan nunchi start avvali ante already construction start aipovali. emi lekunda Jan 2026 ki ela chestharu
June 25, 20251 yr Author 12 minutes ago, TDP_2019 said: Quantam computing valley Jan nunchi start avvali ante already construction start aipovali. emi lekunda Jan 2026 ki ela chestharu naku ade ardam kavatam ledu
June 25, 20251 yr Quantum Computing Drone Technology AI ee maatalu tagginchaali Babu gaaru speech lo....
June 25, 20251 yr Author 12 minutes ago, Siddhugwotham said: Quantum Computing Drone Technology AI ee maatalu tagginchaali Babu gaaru speech lo.... okay
Create an account or sign in to comment