Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Quantum Computing Valley In Amaravati

Featured Replies

  • Author

పాన్‌ ఐఐటీ.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇన్నోవేషన్‌ ఇంజిన్‌

ABN , Publish Date - Oct 03 , 2026 | 12:17 AM

ఒక రాష్ట్రాన్ని మార్చేది కేవలం భారీ పెట్టుబడులు కాదు. ఆ పెట్టుబడులకు దారితీసే ఆలోచనలు, ఆ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచే పరిశోధన, ఆ ఆవిష్కరణలను పరిశ్రమలుగా తీర్చిదిద్దే సమర్థ వ్యవస్థ.

పాన్‌ ఐఐటీ.. రాష్ట్ర భవిష్యత్తుకు ఇన్నోవేషన్‌ ఇంజిన్‌

ఒక రాష్ట్రాన్ని మార్చేది కేవలం భారీ పెట్టుబడులు కాదు. ఆ పెట్టుబడులకు దారితీసే ఆలోచనలు, ఆ ఆలోచనలను ఆవిష్కరణలుగా మలిచే పరిశోధన, ఆ ఆవిష్కరణలను పరిశ్రమలుగా తీర్చిదిద్దే సమర్థ వ్యవస్థ. ప్రపంచ ఆర్థిక వ్యవస్థ వేగంగా మారుతున్న ప్రస్తుత సమయంలో ఒక రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించేది కేవలం సహజ వనరులు మాత్రమే కాదు.. జ్ఞానం, నైపుణ్యం, సాంకేతికత, ఆవిష్కరణ సామర్థ్యం. అందుకే ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి ప్రయాణంలో పాన్‌ ఐఐటీ వంటి మేధో వేదికకు ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

నేడు విజయవాడలో జరగనున్న పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ ఈ దిశగా ఒక ముఖ్యమైన ప్రయత్నం. దేశ విదేశాల్లో ఉన్న ఐఐటీ పూర్వ విద్యార్థులు, పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులు, సాంకేతిక నిపుణులు, పరిశోధకులు, విద్యావేత్తలు, పాలసీ రూపకర్తలను ఒకే వేదికపైకి తీసుకురావడం దీని ప్రధాన ఉద్దేశం. వారి అనుభవం, పరిజ్ఞానం, పరిచయాలు, పెట్టుబడి సామర్థ్యాన్ని ఏపీ అభివృద్ధికి అనుసంధానం చేయడం ద్వారా కొత్త అవకాశాలను సృష్టించవచ్చు.

అమెరికాలో స్టాన్‌ఫోర్డ్‌ విశ్వవిద్యాలయం చుట్టూ ఏర్పడిన పరిశోధన, పరిశ్రమ వాతావరణం సిలికాన్‌ వ్యాలీకి బలమైన పునాది వేసింది. జర్మనీలోని ఫ్రాన్‌హోఫర్‌ సంస్థలు పరిశోధనను పరిశ్రమ అవసరాలతో అనుసంధానం చేసి సాంకేతికతను వాణిజ్యీకరణ దిశగా తీసుకెళ్తున్నాయి. ఇజ్రాయెల్‌ స్టార్టప్‌ వ్యవస్థ, సింగపూర్‌ పరిశోధన– పరిశ్రమ అనుసంధానం, తైవాన్‌ సెమీకండక్టర్‌ పర్యావరణం కూడా నాలెడ్జ్‌ ఆర్థిక శక్తిగా ఎలా మారుతుందో చూపిస్తున్నాయి.

ABN Whatsapp


ఈ నమూనాల నుంచి రాష్ట్రం నేర్చుకోవాల్సిన ప్రధాన విషయం ఒక్కటే. ప్రతిభను ఒకచోట చేర్చడం మాత్రమే కాదు.. ఆ ప్రతిభను రాష్ట్రాభివృద్ధి అవసరాలతో అనుసంధానం చేయాలి. రాష్ట్రంలోని సమస్యలకు ఐఐటీలు, పరిశోధన సంస్థలు, పరిశ్రమలు కలిసి పరిష్కారాలు చూపే విధానం రావాలి. కొత్త ఆలోచనలు ప్రోటోటైప్‌లుగా మారాలి. ప్రోటోటైప్‌లు స్టార్టప్‌లుగా మారాలి. స్టార్టప్‌లకు పెట్టుబడులు రావాలి. అవి పరిశ్రమలుగా ఎదిగి ఉపాధి కల్పించాలి. ఆ ఉపాధి, ఉత్పాదకత చివరకు... రాష్ట్ర ఆర్థిక వృద్ధికి బాట వేయాలి అనే వ్యవస్థ రాష్ట్రంలో ఏర్పడాలి. ఇదే నిజమైన ఇన్నోవేషన్‌ ఎకోసిస్టమ్‌.

దేశం కూడా ఇదే దిశగా అడుగులు వేస్తోంది. ఇండియా ఏఐ మిషన్‌, నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌, రీసెర్చ్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ వంటి కార్యక్రమాల ద్వారా కృత్రిమ మేధస్సు, క్వాంటమ్‌, డీప్‌టెక్‌, రోబోటిక్స్‌, సెమీకండక్టర్లు, బయోటెక్నాలజీ, మెడికల్‌ డివైజెస్‌ వంటి రంగాల్లో పరిశోధన, ప్రైవేట్‌ పెట్టుబడులకు ప్రాధాన్యం పెరుగుతోంది. ఈ జాతీయ అవకాశాలను రాష్ట్ర అవసరాలతో అనుసంధానం చేసుకోవడం కీలకం. ఈ నేపథ్యంలో అమరావతిలో ఏఐ, క్వాంటమ్‌ రంగాలకు ప్రత్యేక యూనివర్సిటీ క్యాంపస్‌ ఏర్పాటుకు ఎన్‌ఐఈఎల్‌ఐటీ, రాష్ట్రం మధ్య జరిగిన ఒప్పందం కూడా ప్రాధాన్యం సంతరించుకుంది. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ ఏఐ/ఎంఎల్‌, సైబర్‌ సెక్యూరిటీ, హై పెర్ఫార్మెన్స్ కంప్యూటింగ్‌, క్వాంటమ్‌ కమ్యూనికేషన్‌, క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌, ఏఐ–క్వాంటమ్‌ రీసెర్చ్‌, ఇండస్ట్రీ లింక్‌డ్‌ సెంటర్స్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌, డీప్‌టెక్‌ ఇంక్యుబేషన్‌ వంటి రంగాలను ఒకే పరిధిలోకి తీసుకురావాలనే ఆలోచన భవిష్యత్‌ సాంకేతిక అవసరాలకు అనుగుణంగా ఉంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో ఐబీఎంతో భాగస్వామ్యం, క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ మౌలిక వసతుల ఏర్పాటుకు జరుగుతున్న ప్రయత్నాలు కూడా ఈ దిశలోనే ఉన్నాయి.


అయితే ఇలాంటి ప్రాజెక్టులు, సంస్థలు ఏర్పడితేనే సరిపోదు. వాటి చుట్టూ పరిశోధన, పెట్టుబడి, పరిశ్రమ, స్టార్టప్‌ వ్యవస్థ ఏర్పడాలి. ఒక ఆలోచనకు నిధులు దొరకాలి. ఒక పరిశోధనకు పరిశ్రమ భాగస్వామ్యం కావాలి. ఒక స్టార్టప్‌కు మార్కెట్‌ దొరకాలి. ఒక విద్యార్థికి ప్రపంచస్థాయి మెంటార్‌ లభించాలి. ఒక పరిశ్రమకు అవసరమైన నైపుణ్యం రాష్ట్రంలోనే అందుబాటులో ఉండాలి. అప్పుడే మేధస్సు ఆర్థిక విలువగా మారుతుంది. పాన్‌ ఐఐటీని ఈ మొత్తం వ్యవస్థకు అనుసంధానించే వేదికగా మలచాల్సిన అవసరం ఇక్కడ కనిపిస్తుంది. కేవలం ఏడాదికి ఒకసారి జరిగే సదస్సుగా కాకుండా, పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌, గ్లోబల్‌ ఐఐటీ మెంటార్‌ నెట్‌వర్క్‌, డీప్‌టెక్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ప్లాట్‌ఫామ్‌ పరిశ్రమలతో అనుసంధానమైన పరిశోధన కేంద్రాలు వంటి శాశ్వత వ్యవస్థలు ఏర్పడితే దాని ప్రభావం మరింత విస్తరించవచ్చు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలలోని వివిధ రంగాలకు ఈ మేధోశక్తిని అనుసంధానం చేయవచ్చు.

ప్రపంచం ఇప్పుడు ఏఐ, క్వాంటమ్‌, సెమీ కండక్టర్స్‌, రోబోటిక్స్‌, బయోటెక్నాలజీ, స్పేస్‌టెక్‌, గ్రీన్‌ ఎనర్జీ వంటి రంగాల్లో కొత్త పోటీని చూస్తోంది. రేపటి ఆర్థిక శక్తి ఈ సాంకేతిక రంగాల్లోనే రూపుదిద్దుకోనుంది. ఈ పోటీలో నిలబడాలంటే భౌతిక మౌలిక వసతులతో పాటు మేధో మౌలిక వసతులు కూడా నిర్మించాలి. పరిశోధనకు ప్రాధాన్యం ఇవ్వాలి. యువత నైపుణ్యాలను పెంచాలి. ఆవిష్కరణలకు పెట్టుబడులు అందించాలి. విద్యాసంస్థలు, పరిశ్రమల మధ్య దూరాన్ని తగ్గించాలి. అందుకే పాన్‌ ఐఐటీని మరో సదస్సుగా చూడకూడదు. వికసిత్‌ భారత్‌–2047 లక్ష్యానికి అనుగుణంగా జ్ఞానాధారిత, సాంకేతికంగా శక్తిమంతమైన, ఆవిష్కరణలకు నిలయమైన రాష్ట్రంగా తీర్చిదిద్దే దీర్ఘకాలిక వేదికగా మలచాలి. ప్రపంచ ఐఐటీ మేధస్సును రాష్ట్ర భవిష్యత్తుతో అనుసంధానం చేయగలిగితే.. పాన్‌ ఐఐటీ ఒక కార్యక్రమంగా కాక, రాష్ట్ర భవిష్యత్తును నడిపించే ఇన్నోవేషన్‌ ఇంజిన్‌గా రూపుదిద్దుకుంటుంది.

- సి.వి. శ్రీధర్

డైరెక్టర్, ఆంధ్రప్రదేశ్ క్వాంటమ్‌ మిషన్

Edited by sonykongara

  • Replies 1k
  • Views 50k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Game Changer dorikindhi CBN ki.. it will take a generation for AP people to understand what impact it will make to its economy and lives.. Tata + CBN.. has potential to create wonders

  • sonykongara
    sonykongara

    Ayana cheyyalani anukunnadi cheyyalani chusthadu, odipothe opdipotadu kani prayathnam apadu.

  • sonykongara
    sonykongara

    Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane..

Posted Images

  • Author

ఫిబ్రవరి 3న క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

Eenadu icon

By Andhra Pradesh News TeamPublished : 03 Oct 2026 19:13 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

126179179_03102026babu-1a.webp

విజయవాడ: విదేశాల్లో ఉన్న ఐటీ నిపుణుల్లో 35 శాతం మంది భారతీయులేనని, దేశ ప్రగతికి సమాజంలో తెలివైన వారంతా కలిసి రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు Chandrababu) పిలుపునిచ్చారు. విజయవాడ అంబేడ్కర్‌ కళావేదికలో జరుగుతున్న పాన్‌ ఐఐటీ ఆంధ్రప్రదేశ్‌ సమ్మిట్‌ (Pan IIT Summit)లో కొత్త ఆవిష్కరణలు, స్టార్టప్‌లను పరిశీలించిన అనంతరం సీఎం మాట్లాడారు.

అమరావతిలోనే మొట్టమొదటి క్వాంటమ్‌ కంప్యూటర్‌ వస్తుంది. వచ్చే ఏడాది ఫిబ్రవరి 3న క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఆవిష్కరిస్తాం. దేశంలోని ప్రతి చోటుకూ అమరావతి నుంచే క్వాంటమ్‌ కంప్యూటర్‌ సరఫరా చేస్తాం. సైబరాబాద్‌ ప్లస్‌గా అమరావతి మారుతుంది. దేశంలోనే అత్యున్నత నగరంగా నిర్మిస్తాం. ఐటీ విషయంలో సిలికాన్‌ వ్యాలీ కంటే మెరుగ్గా మారుతుంది. టెలికామ్‌ వ్యవస్థలో గతంలో అనేక సమస్యలు ఉండేవి. టెలికామ్‌ విప్లవ ఫలాలు ఇప్పుడు అందరూ అందుకుంటున్నారు. భారతీయులు అత్యంత తెలివైన వాళ్లని ప్రపంచం మొత్తానికి తెలుసు. ప్రపంచంలోనే అత్యధిక వేతనం అందుకునేది తెలుగువాళ్లే. ఐటీ మేధావులతో అనేక గంటలపాటు చర్చించా. దేశంలో అనేక మార్పులను దగ్గరుండి చూశా. 1995 తర్వాత హైదరాబాద్‌కు ఐటీ తెచ్చాం. అప్పుడు తీసుకున్న చర్యలతో హైదరాబాద్‌ గొప్ప నగరంగా మారింది. దేశానికి సరైన సమయంలో.. సరైన వ్యక్తి ప్రధానిగా ఉన్నారు. వాటర్‌ గ్రిడ్‌ ఉంటే మనదేశానికి ఎదురే లేదు. దేశంలోని ప్రధానమైన 5 నదులు కలపాలని కోరుకుంటున్నా’’ అని సీఎం అన్నారు. 

సమ్మిట్‌లో భాగంగా ‘స్వర్ణాంధ్ర విజన్‌ కోసం ఆవిష్కరణలకు ఊతం’ థీమ్‌తో సదస్సు నిర్వహించారు. ఐటీ సమ్మిట్‌లో దేశంలోని ప్రముఖ ఐఐటీల డైరెక్టర్లతో సీఎం సమావేశమయ్యారు. ఖరగ్‌పూర్‌, తిరుపతి, జమ్మూ, హైదరాబాద్‌, ధన్‌బాద్‌, వారణాసి, భువనేశ్వర్‌ ఐఐటీల డైరెక్టర్లు హాజరయ్యారు. రాష్ట్రంలో సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ల ఏర్పాటు, ఐఐటీల నుంచి సాంకేతికత బదిలీ, పట్టణీకరణలో డీప్‌టెక్‌ వినియోగం వంటి అంశాలపై చర్చించారు.

  • Author

మరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి మరో అడుగు.. క్యూ-శివ కంప్యూటర్ల ఆవిష్కరణ

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:39 PM

విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శనివారం ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్‌ సంస్థ క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు.

అమరావతిలో క్వాంటమ్ టెక్నాలజీకి మరో అడుగు.. క్యూ-శివ కంప్యూటర్ల ఆవిష్కరణ

AP CM Chandrababu Naidu

విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో నిర్వహించిన పాన్ ఐఐటీ అమరావతి సమ్మిట్‌లో కీలక ఘట్టాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) ఈరోజు (శనివారం) ఆవిష్కరించారు. క్యూబిట్ ఫోర్స్‌ సంస్థ క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్ కంప్యూటర్లను ఆవిష్కరించారు. మినీ టెస్టింగ్ క్యాంటమ్ కంప్యూటర్ ల్యాబ్‌లుగా క్యూ- క్వాంటమ్ కంప్యూటర్లు ఉపయోగపడనున్నాయి. 4 కెల్విన్ ప్రాసెసర్ - సృష్టిని కూడా సీఎం ఆవిష్కరించారు.

ABN Whatsapp


మేకిన్ అమరావతి కాన్సెప్టుతో క్యూ శివ కంప్యూటర్లు..

క్యాంటమ్ శివ కంప్యూటర్ల తయారీలో కీలకంగా వ్యవహరించిన చండీగఢ్ యూనివర్సిటీ, క్యూబిట్ ఫోర్స్ ప్రతినిధులను సీఎం చంద్రబాబు అభినందించారు. మేకిన్ అమరావతి కాన్సెప్టుతో క్యూ శివ కంప్యూటర్లను రూపొందించారు. క్యాంటమ్ శివ కంప్యూటర్ల తయారీకి అవసరమైన కాంపొనెంట్లల్లో కొన్ని మచిలీపట్నంలో లభిస్తాయని క్యూబిట్ సంస్థ సీఈఓ వెంకటసుబ్రమణ్యం తెలిపారు. ప్రపంచంలో కేవలం రెండు, మూడు చోట్ల మాత్రమే లభించే కాంపోనెంట్లు మచిలీపట్నంలో దొరుకుతాయని క్యూబిట్ సీఈఓ వివరించారు. తమకు సీఎం చంద్రబాబు ఇచ్చిన సహాకారాన్ని మరిచిపోలేమని క్యూబిట్ సీఈఓ చెప్పుకొచ్చారు. అనంతరం క్యూబిట్ సంస్థ ప్రతినిధులతో కలిసి ముఖ్యమంత్రి చంద్రబాబు సెల్ఫీ దిగారు.

Edited by sonykongara

  • Author

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Oct 03 , 2026 | 06:51 PM

అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు.

ఫిబ్రవరి 3న అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్ ఆవిష్కరిస్తాం: సీఎం చంద్రబాబు

AP CM Chandrababu Naidu

విజయవాడ, అక్టోబరు 3 (ఆంధ్రజ్యోతి): అమరావతి నుంచి తొలి క్వాంటమ్ కంప్యూటర్‌ను వచ్చే ఏడాది ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరిస్తామని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) పేర్కొన్నారు. అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని ఆకాంక్షించారు. భారతదేశంలో ఎవరైనా క్వాంటమ్ గురించి ప్రస్తావిస్తే అది అమరావతి మాత్రమే అవ్వాలని కోరుకున్నారు. తాను ఐటీ ప్రారంభించినప్పుడు.. ప్రతి ఒక్కరూ తనను చూసి ఎగతాళి చేసేవారని పేర్కొన్నారు. పరిజ్ఞానం లేని సమాజం, సెల్‌ఫోన్ల గురించి తాను మాట్లాడుతున్నానని కొంతమంది అనే వారని అన్నారు. ఈరోజు (శనివారం) అంబేడ్కర్ కళావేదికలో పాన్ ఐఐటీ ఏపీ సమ్మిట్ 2026లో సీఎం చంద్రబాబు, వివిధ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా సీఎం ప్రసంగించారు.

క్వాంటమ్ వ్యాలీ గురించి అందరు మాట్లాడాలి..

నేడు ఐటీ టెక్నాలజీలో భారతీయుల్లో 33శాతం లేదా 35శాతం మంది తెలుగు వారే ఉన్నారని... అది ఐటీ బలమని సీఎం చంద్రబాబు వివరించారు. 25 సంవత్సరాల్లో అది మన ట్రాక్ రికార్డ్ అని ఉద్ఘాటించారు. ఐటీని మనం స్వీకరించామని.. అది ప్రారంభ దశ.. ఈ రోజు ఐఏ, క్వాంటమ్ దశ అని చెప్పుకొచ్చారు. నిన్నటి వరకు మనం సిలికాన్ వ్యాలీ గురించి మాట్లాడుకుంటున్నామని.. ఈ రోజు లేదా రేపటి నుంచి మనం క్వాంటమ్ వ్యాలీ గురించి అందరు మాట్లాడాలని, అది అమరావతి గురించి మాత్రమే ఉండాలని ఆకాంక్షించారు.


మొదట క్వాంటమ్ కంప్యూటింగ్‌ ఏర్పాటులో కొంత ఆలస్యం..

‘ఒక రోజు ఐఐటీ మద్రాస్ డైరెక్టర్ కామకోటి నాకు ఫోన్ చేశారు. సార్, ఒక ఆఫర్ ఉందని... IBM భారతదేశానికి క్వాంటమ్‌‌ను తీసుకురావాలనుకుంటోంది. ఇది అమెరికాలో అందుబాటులో ఉంది. భారత ప్రభుత్వం అంగీకరిస్తే, మనం దీన్ని చేపట్టవచ్చని చెప్పారు. వెంటనే నేను కేంద్రప్రభుత్వం ద్వారా విచారించాను. ఎవరూ ముందుకు రాకముందు, నేను దీని గురించి మాట్లాడటం ప్రారంభించాను. నా కోసం కొన్ని పోటీలు వచ్చాయి. మన రాష్ట్రం ఎందుకు కాకూడదు? అన్నట్లుగా దీని ఏర్పాటులో కొంత ఆలస్యం జరిగింది. ఆ మార్గంలో వెళ్లకుండా, నేను IBMతో నా మార్గాన్ని మార్చుకుని, TCS, L&Tతో చర్చించాను. మాకు ముగ్గురు భాగస్వాములు ఉన్నారు. ఒక నెల్లోనే మేము ఒక అవగాహనకు వచ్చి ఈ భాగస్వామ్యాన్ని నిర్మించగలిగాం. ఆ తర్వాత అమరావతికి క్వాంటమ్ కంప్యూటింగ్ రాబోతోందని ప్రకటించాం. ఫిబ్రవరి 3వ తేదీన మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను, మొదటి క్వాంటమ్ కంప్యూటర్ అమరావతి నుంచి పనిచేయడం ప్రారంభిస్తుంది’ అని సీఎం చంద్రబాబు తెలిపారు.


క్వాంటమ్ సిస్టమ్‌లకు క్యూశివ అని పేరు పెట్టారు..

‘ఈ రోజు మనం అమరావతిలోనే తయారు చేసిన 5 క్వాంటమ్ సిస్టమ్‌‌లను ప్రారంభిస్తున్నాం. ఈ 5 క్వాంటమ్ సిస్టమ్‌లకు క్యూశివ అని పేరు పెట్టారు. అక్కడే హార్డ్‌వేర్, ఇంటిగ్రేషన్, వాలిడేషన్, ఆర్కిటెక్చర్ వీటన్నింటికీ సంబంధించిన క్వాంటమ్ సిస్టమ్‌ను మనం ఇక్కడ చేయగలుగుతున్నాం. మీరు అమెరికాలోని IBM నుంచి క్వాంటమ్ కంప్యూటర్‌ను తీసుకువస్తున్నారు, చాలా మంచిది. మనం ఎందుకు స్వయంగా తయారు చేయకూడదు? అది అసాధ్యమా? అని నేను మొదటిసారిగా అడిగాను. అది ప్రేరణగా నిలిచింది. వారు కలిసి పనిచేశారు. ఆ తర్వాత వారు విభిన్న భాగస్వాములను, ఈకోసిస్టమ్ భాగస్వాములను తీసుకువచ్చారు. మేధా టవర్స్‌లో క్యూశివ నుంచి 5 సిస్టమ్‌లు సిద్ధమయ్యాయి. రెండేళ్ల వ్యవధిలో అమరావతి నుంచే క్వాంటమ్ కంప్యూటర్‌ను పూర్తి చేయబోతున్నామని వారు నాకు అవగాహన కల్పించారు. మనం భారతదేశంలో ప్రతి ఒక్కరికీ సరఫరా చేయొచ్చు, అవసరమైతే క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి కూడా చేసుకోవచ్చు’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు

Edited by sonykongara

  • Author

విజయవాడ: అమరావతిని డీప్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా పాన్‌ ఐఐటీ (Pan IIT Summit) ఆంధప్రదేశ్‌ సమ్మిట్‌ కీలక డిక్లరేషన్‌కు వేదికైంది. సీఎం చంద్రబాబు (Chandrababau) నేతృత్వంలో విడుదలైన డిక్లరేషన్‌పై ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అల్యుమిని ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారు. అమరావతిలో శాశ్వత ‘పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌’ ఏర్పాటు చేసి.. డీప్‌టెక్‌ అభివృద్ధికి నోడల్‌ సంస్థగా పనిచేయాలని నిర్ణయించారు.

స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్‌ ఐఐటీ అమరావతి వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 23 ఐఐటీలు, 25 ఇన్నోవేషన్‌ హబ్‌ల నుంచి డీప్‌టెక్‌ టెక్నాలజీలను గుర్తించి ఏపీలో ఉత్పత్తులు, కంపెనీలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ ఛైర్స్‌ ఏర్పాటు, 100 మంది గ్లోబల్‌ ఐఐటీ మెంటార్ల నెట్‌వర్క్‌తో స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడం, 2030 నాటికి కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్‌-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్‌-డిఫెన్స్‌, హెల్త్‌, అగ్రిటెక్‌, బ్లూ వాటర్‌ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా డీప్‌టెక్‌ పాలసీ ప్యాకేజీని అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలను పాన్‌ ఐఐటీ ఎకోసిస్టంతో అనుసంధానం చేసి.. అమరావతిని టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌, డీప్‌టెక్‌ పరిశోధనల కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిక్లరేషన్‌లో నిర్ణయించారు.

  • Author

పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌’ ఏర్పాటు.. సమ్మిట్‌ కీలక డిక్లరేషన్‌

Eenadu icon

By Andhra Pradesh News TeamPublished : 03 Oct 2026 20:03 IST

Ee

Font size

1 min read

gg-pref.gif

126179191_03102026babu2a.webp

విజయవాడ: అమరావతిని డీప్‌టెక్‌ హబ్‌గా తీర్చిదిద్దేలా పాన్‌ ఐఐటీ (Pan IIT Summit) ఆంధప్రదేశ్‌ సమ్మిట్‌ కీలక డిక్లరేషన్‌కు వేదికైంది. సీఎం చంద్రబాబు (Chandrababau) నేతృత్వంలో విడుదలైన డిక్లరేషన్‌పై ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అల్యుమిని ఇండియా ప్రతినిధులు సంతకాలు చేశారు. అమరావతిలో శాశ్వత ‘పాన్‌ ఐఐటీ అమరావతి కౌన్సిల్‌’ ఏర్పాటు చేసి.. డీప్‌టెక్‌ అభివృద్ధికి నోడల్‌ సంస్థగా పనిచేయాలని నిర్ణయించారు.

స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్ల పాన్‌ ఐఐటీ అమరావతి వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించారు. 23 ఐఐటీలు, 25 ఇన్నోవేషన్‌ హబ్‌ల నుంచి డీప్‌టెక్‌ టెక్నాలజీలను గుర్తించి ఏపీలో ఉత్పత్తులు, కంపెనీలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ ఛైర్స్‌ ఏర్పాటు, 100 మంది గ్లోబల్‌ ఐఐటీ మెంటార్ల నెట్‌వర్క్‌తో స్టార్టప్‌లకు మార్గనిర్దేశం చేయడం, 2030 నాటికి కనీసం 50 స్టార్టప్‌లను ఇంక్యుబేట్‌ చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. క్వాంటమ్‌-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్‌-డిఫెన్స్‌, హెల్త్‌, అగ్రిటెక్‌, బ్లూ వాటర్‌ ఎకానమీ రంగాల్లో పెట్టుబడులను ఆకర్షించేలా డీప్‌టెక్‌ పాలసీ ప్యాకేజీని అమలు చేయనున్నారు. రాష్ట్రంలోని 10 విశ్వవిద్యాలయాలను పాన్‌ ఐఐటీ ఎకోసిస్టంతో అనుసంధానం చేసి.. అమరావతిని టెక్నాలజీ ట్రాన్స్‌ఫర్‌, స్టార్టప్‌ ఎకోసిస్టమ్‌, డీప్‌టెక్‌ పరిశోధనల కేంద్రంగా అభివృద్ధి చేయాలని డిక్లరేషన్‌లో నిర్ణయించారు.

  • Author

Chandrababu Naidu calls on IITians to unite for nation building, pitches Quantum Valley in Amaravati

Addressing the PanIIT summit, Naidu outlined initiatives spanning startups, research, quantum computing, education and technology across Andhra Pradesh.

By PTI

Updated - October 03, 2026 at 09:51 PM.

| Vijayawada

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu at the Pan-IIT Andhra Pradesh Summit 2026 in Vijayawada on Saturday, October 3, 2026.

Andhra Pradesh Chief Minister N Chandrababu Naidu at the Pan-IIT Andhra Pradesh Summit 2026 in Vijayawada on Saturday, October 3, 2026. | Photo Credit: RAO GN

Chief Minister N Chandrababu Naidu on Saturday called on IIT graduates to unite for the country, as the southern state and PanIIT inked a plethora of deals, including establishing a PanIIT Amaravati Council.

PanIIT is an alumni network of five lakh IIT graduates.

The chief minister underscored that he needs the creative and innovative ideas and also sometimes disruptive thought process of the IITians.

“For nation building, all IITians can unite together. We will network together. Wherever you are, think of your country for five minutes or 10 minutes or one hour,” said Naidu, addressing the valedictory session of the two-day PanIIT summit.

“If five-lakh brilliant IIT brains are with me, then I can imagine what I can do,” Naidu stressed.

Industry, startups and deep tech

The deals inked by PanIIT and the southern state include setting up 10 industry chairs in Andhra Pradesh varsities, 100-mentor startup network and others.

The other agreements include-transferring technology from IITs, deep tech policy package and others. Naidu also announced the Amaravati PanIIT Declaration.

The Chief Minister noted that PanIIT Amaravati World Council will be set up in the greenfield capital city of Amaravati and the establishment of a Rs 500-crore PanIIT Amaravati Deep Tech Venture Fund.

Following a meeting with venture capitalists earlier in the day, the CM promised to match their funding to startups in the southern state if they bring capital and mentors.

Amaravati to get IIT Research Park

Naidu said an IIT Research Park will be established in Amaravati and underscored that the premier institutes will mentor state varsities and set up Centres of Excellence (CoE) in each university.

The CM said a student exchange programme will be instituted and announced that AI and entrepreneurship skills will be taught from class 6 onwards in Andhra Pradesh.

Further, Naidu launched five Q-Shiva quantum computers made in Amaravati and released Shrusti processor and a children’s book to kindle interest in quantum computing.

Naidu pitches Quantum Valley in Amaravati

Observing that everybody talks about the Silicon Valley now, the CM emphasised that everybody should talk about the Quantum Valley in Amaravati from tomorrow, adding that the “first” quantum computer will start functioning from the greenfield capital city on February 3, 2027.

Naidu said Indians are capable and “we have to work with consensus,” as he listed out the industrial and technological initiatives of Andhra Pradesh, which encompass a space city, drone city, defence corridor, aerospace corridor and others at various places in the state.

He underlined that the state is planning for semiconductors in a big way in Tirupati and underscored that “we have achieved so many things, we have to achieve many things.”

  • Author

పాన్‌ ఐఐటీ శాశ్వత కౌన్సిల్‌.. అమరావతిలో ఏర్పాటు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 06:14 IST

Ee

Font size

4 min read

gg-pref.gif

రాష్ట్ర వర్సిటీలు, ఐఐటీల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్‌
100 మంది ఐఐటీ దిగ్గజాలతో గ్లోబల్‌ మెంటార్‌ నెట్‌వర్క్‌
రూ.500 కోట్లతో పాన్‌ఐఐటీ వెంచర్‌ఫండ్‌ 
వచ్చే ఏడాది ఆరో తరగతి నుంచి ఏఐ పాఠాలు
సీఎం చంద్రబాబు వెల్లడి 
పాన్‌ ఐఐటీ సమిట్‌లో 5 క్వాంటమ్‌ కంప్యూటర్ల ఆవిష్కరణ

031026APMAIN-5a.webp

పాన్‌ ఐఐటీ సమిట్‌ సందర్భంగా ఏర్పాటు చేసిన స్టాల్‌లో ఆక్సి ఏరోస్పేస్‌ రూపొందించిన డ్రోన్‌పై సంతకం చేస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు 

ఈనాడు, అమరావతి: అమరావతిలో పాన్‌ ఐఐటీ శాశ్వత కౌన్సిల్‌ ఏర్పాటు కానుందని, ఇది ప్రపంచంలోనే అతిపెద్ద అకడమిక్‌ నెట్‌వర్క్‌ అవుతుందని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా కలిపి ఈ కౌన్సిల్‌ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు. దేశంలోని 23 ఐఐటీల నుంచి పెద్ద ఎత్తున ఐఐటీయన్లు అమరావతికి రావడమే రాష్ట్రానికి బ్రాండ్‌ ఇమేజ్‌ అని తెలిపారు. విజయవాడలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కళావేదికలో శనివారం నిర్వహించిన పాన్‌ ఐఐటీ ఏపీ సమిట్‌-2026 ముగింపు కార్యక్రమం, విలేకర్ల సమావేశంలో సీఎం మాట్లాడారు. 

క్యూ-శివ పేరుతో రూపొందించిన ఐదు క్వాంటమ్‌ కంప్యూటర్లు, 4కెల్విన్‌ ప్రాసెసర్, క్వాంటమ్‌పై రాసిన పుస్తకాన్ని సీఎం ఆవిష్కరించారు. ఆయన ప్రసంగంలోని ముఖ్యాంశాలివీ.. 

పరిశ్రమ, విద్యా సంస్థలు, ప్రభుత్వం కలిసి.. 

పరిశ్రమ, విద్యాసంస్థలు, ప్రభుత్వం కలిసికట్టుగా స్వర్ణాంధ్ర లక్ష్యాన్ని సాధించాలి. వెంచర్‌ఫండ్‌ కార్పస్‌ను స్టార్టప్‌ల ప్రోత్సాహం కోసం ఇవ్వనున్నట్లు ప్రకటించడం సంతోషంగా ఉంది. స్పీడ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ ద్వారా ప్రభుత్వం నుంచి పూర్తి సహకారం ఉంటుంది. ఐఐటీయన్ల అత్యుత్తమ మేధస్సుతో అమరావతి ప్రపంచ విజ్ఞాన కేంద్రంగా తయారవుతుంది. ఇక నుంచి ఏటా పాన్‌ ఐఐటీ అమరావతి సమిట్‌ ఏర్పాటు చేసి, వివిధ అంశాలపై చర్చిద్దాం. సాంకేతికతను సమర్థంగా వినియోగించుకుంటే అభివృద్ధి లక్ష్యాలను వేగంగా చేరుకోగలం. ఏఐ వినియోగంతో రాష్ట్రంలో జీఎస్టీ ఆదాయాన్ని 18 శాతం పెంచగలగడమే ఇందుకు నిదర్శనం. ఏపీని దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దేలా పాన్‌ఐఐటీ మేధస్సు సహకారం అందిస్తుందని ఆకాంక్షిస్తున్నా.

031026APMAIN-5b.webp

పాన్‌ ఐఐటీ సదస్సు వేదికపై ముఖ్యమంత్రి చంద్రబాబు. చిత్రంలో ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్, ఐఐటీ అలుమ్నీ ఛైర్మన్‌ ప్రభాత్‌కుమార్, ఐఐటీ తిరుపతి డైరెక్టర్‌ సత్యనారాయణ తదితరులు

50 లక్షల మంది ఏఐ నిపుణుల్ని అందిస్తాం

ప్రధాని మోదీ లక్ష్యానికి అనుగుణంగా ఏపీ నుంచి 50 లక్షల మంది ఏఐ నిపుణులను అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. వచ్చే ఏడాది నుంచి పాఠశాలల్లో ఆరో తరగతి నుంచే ఏఐ సిలబస్‌ తీసుకొస్తాం. ఏఐతో పాటు ఆంత్రప్రెన్యూర్‌ నైపుణ్యాలు నేర్పిస్తాం. ఐఐటీలు, రాష్ట్ర విశ్వవిద్యాలయాల మధ్య విద్యార్థుల ఎక్స్ఛేంజ్‌ కార్యక్రమాన్ని    అమలు చేస్తాం. కొన్ని రోజులు రాష్ట్ర వర్సిటీల్లో, మరికొన్ని రోజులు ఐఐటీలో చదువుతారు. దీనికయ్యే ఖర్చులో ప్రభుత్వం 50% భరిస్తుంది. ఐఐటీ సిలబస్‌ను ఉన్నత విద్యలో అమలు చేస్తారు. దీంతో విద్యార్థుల నైపుణ్యం మరింత పెరుగుతుంది. అధ్యాపకులకు ఐఐటీయన్లు శిక్షణ ఇస్తారు. ఐఐటీయన్ల ఆలోచనలు సద్వినియోగం చేసుకుంటే రాష్ట్రాభివృద్ధి మరో స్థాయికి వెళ్తుంది. 

రెండేళ్లలో కమర్షియల్‌ క్వాంటమ్‌ కంప్యూటర్లు

వచ్చే ఏడాది ఫిబ్రవరి నుంచి అమరావతిలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ ఆపరేషన్స్‌ మొదలవుతాయి. ఐబీఎం- టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంయుక్తంగా ఏర్పాటు చేస్తున్న క్వాంటమ్‌ కంప్యూటర్‌ అమరావతి నుంచి ఆపరేట్‌ అవుతుంది. 156 క్యూబిట్‌ క్వాంటమ్‌ సిస్టమ్‌ వచ్చేలోగానే అమరావతిలో క్వాంటమ్‌ టెక్నాలజీకి అవసరమైన మౌలిక వసతులు సిద్ధమవుతాయి. క్యూ-శివ లాంటి మినీ క్వాంటమ్‌ కంప్యూటర్లు సైతం అందుబాటులోకి వచ్చాయి. క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరికరాలు, క్వాంటమ్‌ కంప్యూటర్లు ఎగుమతి చేసే స్థాయికీ ఎదుగుతాం. వచ్చే రెండేళ్లలో కమర్షియల్‌ క్వాంటమ్‌ కంప్యూటర్లను ఉత్పత్తి చేస్తామని క్వాంటమ్‌ సంస్థలు చెబుతున్నాయి. సైబరాబాద్‌ ప్లస్‌గా, నెట్‌ జీరో గ్రీన్‌ ఎనర్జీ, 50% పచ్చదనంతో అమరావతి నిర్మాణం చేపడుతున్నాం. జాతి నిర్మాణంలో ఐఐటీయన్లు అంతా భాగమవుతున్నారు. వికసిత్‌ భారత్, స్వర్ణాంధ్ర లక్ష్యాలను చేరుకునేలా ఐఐటీయన్లు సహకరించాలి. ఇప్పుడిక సిలికాన్‌ వ్యాలీ గురించి కాదు.. అమరావతిలోని క్వాంటమ్‌ వ్యాలీ గురించి ప్రపంచం చర్చించుకుంటుంది’ అని తెలిపారు.


పాన్‌ ఐఐటీ డిక్లరేషన్‌ విడుదల 

అనంతరం పాన్‌ఐఐటీ అమరావతి సమిట్‌ డిక్లరేషన్‌ను ముఖ్యమంత్రి చంద్రబాబు విడుదల చేశారు. 

  • అమరావతిలో ఏపీ ప్రభుత్వం-పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా ఆధ్వర్యంలో శాశ్వత పాన్‌ఐఐటీ కౌన్సిల్‌ ఏర్పాటు. డీప్‌టెక్‌ అభివృద్ధికి నోడల్‌ సంస్థగా పాన్‌ఐఐటీ అమరావతి కౌన్సిల్‌ 

  • స్టార్టప్‌లు, ఆవిష్కరణలు, పెట్టుబడులకు ఊతమిచ్చేలా రూ.500 కోట్లతో పాన్‌ఐఐటీ అమరావతి వెంచర్‌ ఫండ్‌ ఏర్పాటు

  • రాష్ట్రంలో విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థల్లో పరిశ్రమల భాగస్వామ్యంతో 10 ఇండస్ట్రీ చైర్లు ఏర్పాటు

  • స్టార్టప్‌లు, ఔత్సాహికులకు మార్గనిర్దేశం చేసేందుకు 100 మంది ఐఐటీ దిగ్గజాలతో గ్లోబల్‌ మెంటార్‌ నెట్‌వర్క్‌ ఏర్పాటు. 2030 నాటికి రాష్ట్రంలో కనీసం 50 స్టార్టప్‌లు, ఇంక్యుబేషన్‌ కేంద్రాలు ఏర్పాటు చేసేలా ప్రణాళిక  

  • ఐఐటీల నుంచి రాష్ట్ర విశ్వవిద్యాలయాలు, విద్యా సంస్థలకు టెక్నాలజీ బదిలీ. ఇందులో భాగంగా వర్సిటీల్లో ఎక్స్‌లెన్స్‌ సెంటర్లు, ఇంక్యుబేషన్‌ సెంటర్ల ఏర్పాటు  

  • డీప్‌టెక్‌ పాలసీ ప్యాకేజీలో భాగంగా క్వాంటమ్‌-ఏఐ, సెమీకండక్టర్లు, స్పేస్‌-డిఫెన్స్, హెల్త్, అగ్రిటెక్‌లాంటి రంగాల్లో పెట్టుబడులు ఆకర్షించేలా చర్యలు. 

  • Author

అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్‌ క్యాంపస్‌

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 04 Oct 2026 05:18 IST

Ee

Font size

4 min read

gg-pref.gif

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్‌ క్యాంపస్‌ను ఏర్పాటు చేయాల్సిందిగా ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారని, త్వరలోనే అది ఆచరణలోకి వస్తుందని ఆ సంస్థ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ కేఎన్‌ సత్యనారాయణ తెలిపారు. విజయవాడలో శనివారం పాన్‌ ఐఐటీ సదస్సు ప్రారంభోత్సవంలో సత్యనారాయణ మాట్లాడుతూ దీనిపై ఇప్పటికే కేంద్ర విద్యాశాఖ మంత్రి లేఖ రాసినట్టు తెలిపారు. అమరావతి బ్రాంచ్‌ క్యాంపస్‌.. ఇతర ఐఐటీలకు యాంకర్‌ సంస్థగా ఉంటుందని, రాష్ట్రానికి, పాన్‌ ఐఐటీకి మధ్య అనుసంధానానికి దోహదం చేస్తుందన్నారు. అమరావతిలో తిరుపతి ఐఐటీ బ్రాంచ్‌కు స్థలం కేటాయింపు, అవసరమైన అనుమతులకు వెంటనే చర్యలు తీసుకోవాలని సీఎం ఆదేశించినట్టు ఐటీ శాఖ కార్యదర్శి కాటమనేని భాస్కర్‌ తెలిపారు. 


స్టూడెంట్‌ ట్యూటర్‌ బాట్‌ తీసుకొస్తున్నాం

ప్రొఫెసర్‌ వి.కామకోటి, డైరెక్టర్, మద్రాస్‌ ఐఐటీ

031026APMAIN-12a.webp

ఏఐ రంగంలో ఆంధ్రప్రదేశ్‌ యాంకర్‌ పాయింట్‌గా మారుతుంది. ప్రతి విద్యార్థి వినియోగించేలా ‘స్టూడెంట్‌ ట్యూటర్‌ బాట్‌’ తయారు చేస్తున్నాం. బోధనలో ఏఐని సమర్థంగా వినియోగించుకోవడంపై ఉపాధ్యాయులకు శిక్షణ ఇస్తున్నాం. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఆధ్వర్యంలో వచ్చే ఏడాదికి 100 క్వాంటమ్‌ యూజ్‌ కేసులు సిద్ధం చేస్తాం. ఇక్కడకు డిసెంబరులో ఐబీఎం క్వాంటమ్‌ కంప్యూటర్‌ వస్తుంది. 


అమరావతిని అర్‌అండ్‌డీ హబ్‌గా చేయండి

డా.శరత్‌కుమార్‌ షరాఫ్, సీఎండీ, టెక్నోక్రాఫ్ట్‌ గ్రూప్‌

031026APMAIN-12b.webp

ఐఐటీ పూర్వ విద్యార్థుల కోసం ఆంధ్రప్రదేశ్‌లో ప్రత్యేకంగా ఒక ఇండస్ట్రియల్‌ ఎస్టేట్‌ను ఏర్పాటు చేయండి. వారు అక్కడ పరిశ్రమలు, కన్సల్టేషన్, ఐటీ, రీసెర్చ్‌ వంటి విభాగాలు ఏర్పాటు చేస్తారు. పూర్వ విద్యార్థులు యూనిట్‌లు స్థాపించేలా మేం కృషి చేస్తాం. ఏపీ ప్రభుత్వం, పాన్‌ ఐఐటీ కలసి అమరావతిని దేశంలోనే అతి పెద్ద విద్య, ఆర్‌అండ్‌డీ కేంద్రంగా చేయాలి. అప్పుడు దేశానికి ఏపీ గ్రోత్‌ ఇంజిన్‌ అవుతుంది. 


ఏపీ నాయకత్వం వహించాలి

ఆనంద్‌కుమార్, ఎండీ, ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్‌ ఇండియా 

031026APMAIN-12c.webp

సెమీకండక్టర్‌ రంగంలోని ప్రతిభావంతుల్లో 20 శాతానికిపైగా భారత్‌లో ఉన్నారు. భారతదేశ సెమీకండక్టర్‌ మిషన్‌ (ఐఎస్‌ఎం) 1.0 తర్వాత ఇప్పుడు 2.0 నడుస్తోంది. ఈ రంగంలో మనం ఇప్పుడిప్పుడే అడుగులు వేస్తున్నాం. దీనికి కొత్త నైపుణ్యాలు కావాలి. విద్యాసంస్థలు, పరిశ్రమలు కలిస్తే ప్రపంచస్థాయి నిపుణుల్ని తయారుచేయొచ్చు. భారత సెమీకండక్టర్‌ విప్లవానికి ఏపీ సారథ్యం వహించాలి. 


ప్రభుత్వానికి స్పష్టత, స్థిరత్వం ఉండాలి

అరవింద్‌ బన్సల్, సీఈఓ, కంటిన్యూమ్‌ గ్రీన్‌ ఎనర్జీ 

031026APMAIN-12d.webp

ఎక్కడ స్పష్టమైన చట్టాలు, విధానాలు ఉంటాయో అక్కడికే పెట్టుబడులు వస్తాయి. గతంలో పవన విద్యుత్‌ విధానంలోని ఒక పేరాపై నెలకొన్న సందిగ్ధత వల్ల పదేళ్ల పాటు పెట్టుబడులు నిలిచిపోయిన పరిస్థితిని చూశాం. కాబట్టి ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతి నిబంధన, నియంత్రణకు కారణం వివరించాలి. పెట్టుబడికి రిస్క్‌ ఉండదన్న భరోసా ఇవ్వగలగాలి. దాని ముందు ప్రోత్సాహకాలు, రాయితీలు పెద్ద విషయం కాదు. డేటాసెంటర్లకు అవసరమైన విద్యుత్‌లో 80-90 శాతం పునరుత్పాదక ఇంధనం, స్టోరేజీ నుంచి వాడేలా నిబంధన తేవాలి. 


సిలికాన్‌ వ్యాలీ టు డీప్‌టెక్‌ వ్యాలీ

ప్రభాత్‌కుమార్, ఛైర్మన్, పాన్‌ ఐఐటీ అలుమ్ని ఇండియా

031026APMAIN-12e.webp

ఐఐటీల పూర్వ విద్యార్థులు అమెరికాలోని సిలికాన్‌ వ్యాలీలో అనేక అద్భుత విజయాలు సాధించారు. వారిలో అనేకమంది తెలుగువారున్నారు. వారంతా ఇప్పుడు సొంత రాష్ట్రానికి రావాల్సిన సమయం వచ్చింది. అందుకే నేను ‘సిలికాన్‌ వ్యాలీ నుంచి అమరావతి డీప్‌టెక్‌ వ్యాలీ’ అని పిలుపునిస్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న క్వాంటమ్‌ వ్యాలీ పెద్ద ముందడుగు.


అమరావతి టేకాఫ్‌ అవుతున్న విమానం

సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి

రాజధాని అమరావతిలో నిర్మించే భవనాలు, రహదారులు, ప్రధాన మౌలిక వసతులు ‘హార్డ్‌వేర్‌’ అయితే.. ఆపరేటింగ్‌ సిస్టమ్‌ ‘డీప్‌ టెక్‌’ అని సీఆర్‌డీఏ అదనపు కమిషనర్‌ రాహుల్‌కుమార్‌రెడ్డి తెలిపారు. పాన్‌ ఐఐటీ సదస్సులో ఆయన అమరావతిపై ప్రజంటేషన్‌ ఇచ్చారు. ‘‘అమరావతిలో ఇంజినీరింగ్‌ అద్భుతాల నిర్మాణం జరుగుతోంది. యూనికార్న్‌లు, సీఎక్స్‌ఓలు వాటి సొల్యూషన్స్‌ని, ప్రొటోటైప్‌లను పరీక్షించుకోవడానికి, పెట్టుబడులు పెట్టడానికి ఇది అత్యంత అనువైన ప్రాంతం. క్వాంటమ్‌ టెక్నాలజీ, ఏఐ, డేటా ఎనలిటిక్స్‌ వంటి ఆధునిక సాంకేతికతలను అమరావతి పరిపాలన, మౌలిక సదుపాయాల కల్పనలో వినియోగిస్తున్నాం. రాజధాని నడిబొడ్డున 50 ఎకరాల్లో క్వాంటమ్‌ వ్యాలీ నిర్మిస్తున్నాం. రోబోటిక్స్, సెమీకండక్టర్ల తయారీ, ఆరోగ్య రంగం, మాలిక్యులర్‌ సైన్సెస్‌ వంటి 100 యూజ్‌ కేసుల కోసం అమరావతి క్వాంటమ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ కాంప్లెక్స్‌ను రూపొందిస్తున్నాం’’ అని తెలిపారు. అమరావతి టేకాఫ్‌ అవుతున్న విమానం వంటిదని, ఈ అవకాశాన్ని వదులుకోవద్దని పాన్‌ ఐఐటీ ప్రతినిధులు, పెట్టుబడిదారులు, స్టార్టప్‌ సంస్థలకు ఆయన విజ్ఞప్తి చేశారు.

  • Author

క్వాంటమ్‌ వ్యాలీలో పెట్టుబడులకు అనుమతి

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 06 Oct 2026 06:05 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు-అమరావతి: అమరావతి క్వాంటమ్‌ వ్యాలీలో పెట్టుబడులు పెట్టేందుకు ఆసక్తి చూసిన వివిధ సంస్థలకు అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఏపీ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పాలసీ 2025-30 కింద వాటికి ప్రోత్సాహకాలు ఇచ్చేందుకు సమ్మతించింది. అనుమతులు పొందిన సంస్థలు, వాటిద్వారా లభించే ఉపాధి అవకాశాల వివరాలివీ..

  • క్వాంటమ్‌ వ్యాలీలో రూ.35 కోట్ల పెట్టుబడితో క్లౌడ్‌ బేస్డ్‌ క్వాంటమ్‌ యాజ్‌ ఏ సర్వీస్‌ సొల్యూషన్స్‌తో కలిసి పరిశోధన, తయారీ, హైబ్రిడ్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ తయారు చేసే క్వాంటమ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటుకు ట్రైక్వాంటా ల్యాబ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌కు అనుమతిచ్చింది. దీనిద్వారా 175 మందికి ఉన్నతస్థాయి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ తన ప్రతిపాదనల్లో పేర్కొంది. 

  • క్వాంటమ్‌ కోడ్‌ ఆన్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.167 కోట్ల పెట్టుబడులతో క్వాంటమ్‌ ఏఐ డ్రివెన్‌ బయో టెక్నాలజీ ఇన్నోవేషన్‌ క్యాంపస్‌ ఏర్పాటుకు అనుమతి. ఈ సంస్థ ద్వారా 126 మందికి ఉన్నతస్థాయి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

  • క్వాన్‌ఫ్లుయెన్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.5 కోట్లతో ఫొటోనిక్స్‌ బేస్డ్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అండ్‌ ఆప్టిమైజేషన్‌ కంపెనీ ఏర్పాటుకు అనుమతి. దీనిద్వారా 30 మందికి ఉపాధి.

  • సృష్టి క్వాంటమ్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.100 కోట్ల పెట్టుబడితో డీప్‌ టెక్నాలజీ పరిశోధన, అభివృద్ధి కేంద్రం; అడ్వాన్స్‌డ్‌ క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ హార్డ్‌వేర్‌ తయారీ యూనిట్‌ల ఏర్పాటుకు అనుమతి. 500 మందికి ఉన్నతస్థాయి ఉపాధి అవకాశాలు దక్కనున్నాయి.

  • వెరిడేటా హెల్త్‌ ఇన్‌కార్పొరేషన్‌ రూ.4.5 కోట్ల పెట్టుబడులతో గ్లోబల్‌ ఇంజినీరింగ్‌ హబ్‌ ఏర్పాటుకు అనుమతి. 50 మందికి ఉపాధి.

  • ఆరోహక్‌ టెక్నాలజీస్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.62 కోట్ల పెట్టుబడులతో అడ్వాన్స్‌ రిసెర్చ్‌ కోసం ఫొటోనిక్స్‌ క్వాంటమ్‌ రిసెర్చ్‌ అండ్‌ ఇన్నోవేషన్‌ సెంటర్‌ ఏర్పాటు. 300 మందికి ఉన్నతస్థాయి ఉపాధి అవకాశాలు.

  • ఫొటాన్‌కోర్‌ సిస్టమ్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ రూ.9 కోట్ల పెట్టుబడితో ‘ఫొటాన్‌ క్యూ’ తయారీకి సంబంధించి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ ఇంటిగ్రేషన్‌ ఫెసిలిటీ ఏర్పాటుకు అనుమతి. 45 ఉన్నతస్థాయి ఉద్యోగావకాశాలు.

డెలాయిట్‌తో ఒప్పందం

రాష్ట్రంలో ఐటీ పెట్టుబడుల కార్యకలాపాలను సులభతరం చేసేందుకు డెలాయిట్‌ టచ్‌ తొమాట్సు ఇండియా ఎల్‌ఎల్‌పి ద్వారా 8 మంది కన్సల్టింగ్‌ రిసోర్సెస్‌ నియామకానికి రూ.3.34 కోట్ల వ్యయంతో భాగస్వామ్య ఒప్పందం చేసుకునేందుకు ఐటీ విభాగానికి ప్రభుత్వం అనుమతిచ్చింది.


Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.