May 3, 20251 yr Finally amt ki one good it real estate is materializing after hcl in 1st term... Hope it brings good number of jobs...
May 3, 20251 yr Author Amaravati: రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ అమరావతి కేంద్రంగా 2026 జనవరి ఒకటి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. By Andhra Pradesh News DeskUpdated : 03 May 2025 06:25 IST Ee Font size 2 min read అమరావతిలో దేశంలోనే మొదటి అత్యాధునిక వ్యాలీ టెక్ పార్కు ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ సంస్థలతో ప్రభుత్వ ఒప్పందం ‘క్వాంటమ్ సిస్టం-2’ని ఏర్పాటు చేయనున్న ఐబీఎం క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ ప్రతినిధులతో ఒప్పంద పత్రాలను మార్చుకుంటున్న రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు ఈనాడు, అమరావతి: అమరావతి కేంద్రంగా 2026 జనవరి ఒకటి నుంచి క్వాంటమ్ కంప్యూటింగ్ కార్యకలాపాలు ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. దేశంలోనే మొదటి అత్యాధునిక క్వాంటమ్ వ్యాలీ టెక్ పార్కును అమరావతిలో నిర్మించనున్నట్లు ప్రకటించారు. అందులో భాగంగా ఐబీఎం సంస్థ 156 క్యూబిక్ హెరాన్ ప్రాసెసర్‌తో ‘క్వాంటమ్ సిస్టం-2’ని నెలకొల్పుతుందన్నారు. ఉండవల్లిలోని సీఎం నివాసంలో శుక్రవారం ఐబీఎం, టాటా కన్సల్టెన్సీ సర్వీసెన్ (టీసీఎస్), లార్సన్ అండ్ టూబ్రో (ఎల్‌అండ్‌టీ) సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ ‘ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీతో జరిగిన ఒప్పందం దేశానికే చరిత్రాత్మకం. సాంకేతిక రంగంలో కృత్రిమ మేధ (ఏఐ), క్వాంటమ్ కంప్యూటింగ్ వంటి కొత్త అవకాశాలను అందిపుచ్చుకోవడం ముఖ్యం. క్వాంటమ్ కంప్యూటింగ్ భవిష్యత్ పాలనకు, ఆవిష్కరణలకు పునాది అవుతుంది. అందుకే అమరావతిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దాలని నిర్ణయించాం. అమెరికాలోని సిలికాన్ వ్యాలీ తరహాలో అమరావతిని తీర్చిదిద్దాలని ఐబీఎం, టీసీఎస్ సంస్థలకు సూచించా’ అని సీఎం పేర్కొన్నారు. దేశంలో క్వాంటమ్ ప్రయాణానికి ఐబీఎం క్వాంటమ్ సిస్టం-2 ఏర్పాటు కీలక మలుపు కానుందని అభిప్రాయపడ్డారు. ‘హైదరాబాద్‌లో హైటెక్ సిటీని 15 నెలల్లో నిర్మించిన అనుభవాన్ని గుర్తుంచుకోవాలి. అదే స్ఫూర్తితో తక్కువ సమయంలోనే క్వాంటమ్ వ్యాలీని నిర్మించాలి. ఇప్పటికే ఎల్‌అండ్‌టీ సంస్థకు స్థలాన్ని కేటాయించాం. అందులో మౌలిక వసతులను వేగంగా అభివృద్ధి చేయాలి. నిర్మాణ పురోగతి, వ్యవస్థ అభివృద్ధి పర్యవేక్షణకు రెండు ప్రత్యేక కమిటీలను ఏర్పాటుచేస్తాం. ఈ ప్రాజెక్టు గురించి ప్రధానికి మోదీకి త్వరలో వివరిస్తాం’ అని చంద్రబాబు తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విస్తృత ఉపయోగాలు రాష్ట్ర ప్రభుత్వంతో టీసీఎస్ కలిసి పనిచేయడం వల్ల క్వాంటమ్ ఆల్గరిథం అభివృద్ధి వేగవంతం అవుతుందని ఐబీఎం క్వాంటమ్ ఉపాధ్యక్షుడు జే గాంబెట్టా అభిప్రాయపడ్డారు. క్వాంటమ్, క్లాసికల్ సిస్టమ్‌లను కలిపి హైబ్రిడ్ కంప్యూటింగ్ ద్వారా జీవశాస్త్రం, మెటీరియల్స్, క్రిప్టోగ్రఫీ వంటి రంగాల్లో మంచి ఫలితాలు సాధించవచ్చని టీసీఎస్ సీటీఓ డాక్టర్ హారిక్ విన్ పేర్కొన్నారు. సీఎం చంద్రబాబు నేతృత్వంలో రాష్ట్రంలో డిజిటల్ గవర్నెన్స్‌కు టీసీఎస్ బీజం వేసిందని ఆ సంస్థ ప్రతినిధులు రాజన్న, సీవీ శ్రీధర్‌లు తెలిపారు. కో-ఇన్ నెట్‌వర్క్ ద్వారా 17 రాష్ట్రాల్లో 43 కేంద్రాలకు ప్రత్యక్షంగా లబ్ధి చేకూరుతుందని చెప్పారు. ఈవీ బ్యాటరీల నుంచి ఆర్థిక వ్యవస్థ వరకు క్వాంటమ్ కంప్యూటింగ్‌తో విస్తృత ఉపయోగాలు ఉంటాయని ఐబీఎం ఉపాధ్యక్షుడు స్కాట్ క్రౌడర్ వెల్లడించారు. తాజాగా కుదిరిన ఒప్పందంతో అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు తొలి అడుగు పడిందని వివరించారు.
May 3, 20251 yr Author Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane..
May 4, 20251 yr Author Quantum Leap in Amaravati: క్వాంటమ్ తో కొత్త శకం ABN , Publish Date - May 04 , 2025 | 03:53 AM అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుతో భవిష్యత్ టెక్నాలజీకి గడప తీసి పెట్టింది. ఐబీఎం, టీసీఎస్, ఎల్‌అండ్‌టీ భాగస్వామ్యంతో అమరావతి టెక్ రంగంలో అగ్రగామిగా ఎదుగుతోంది దేశంలో తొలి క్వాంటమ్ వ్యాలీ అమరావతిలోనే అతిపెద్ద, అత్యాధునిక ఐబీఎం సిస్టం-2 ఏర్పాటు టెక్ వరల్డ్‌లో సంచలనంగా ప్రభుత్వ ఒప్పందం రాష్ట్రంవైపు అంతర్జాతీయ టెక్ నిపుణుల చూపు నాలెడ్జ్ ఎకానమీకి కేరాఫ్‌గా మారనున్న ఏపీ రాజధాని 10 వేల కోట్ల నుంచి 15 వేల కోట్ల దాకా పెట్టుబడులు క్వాంటమ్ టెక్నాలజీతో ప్రయోజనాలెన్నో.. అత్యంత వేగంగా సమాచారం, డేటా విశ్లేషణ అంతర్జాతీయ టెక్ దిగ్గజం... ఐబీఎం! అదే స్థాయిలో పేరుపొందిన టీసీఎస్! ఈ సంస్థలతో రాష్ట్ర ప్రభుత్వం కుదుర్చుకున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ ఒప్పందం... టెక్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తోంది. భారత దేశంలోనే తొలి ‘క్వాంటమ్ వ్యాలీ’ ఆంధ్రప్రదేశ్‌లో... అది కూడా అమరావతిలో ఏర్పాటవుతోందన్న వార్త అంతర్జాతీయ మీడియా దృష్టినీ ఆకర్షించింది. భవిష్యత్ టెక్నాలజీ అవకాశాలను అందిపుచ్చుకునేలా... జనవరి 1వ తేదీనే రాజధానిలో క్వాంటమ్ వ్యాలీ ప్రారంభం కానుంది. నిర్మాణ బాధ్యతలను ఎల్‌అండ్‌టీ చేపడుతోంది. అసలు ఏమిటీ క్వాంటమ్ వ్యాలీ? టెక్నాలజీపరంగా ఎందుకు కీలకం? అమరావతికి, ఆంధ్రప్రదేశ్‌కు ఒనగూరే ప్రయోజనం ఏమిటి? ‘ఆంధ్రజ్యోతి’ అందిస్తున్న ప్రత్యేక కథనం... క్వాంటమ్ టెక్నాలజీ అధునాతన సాంకేతిక అంశం కావడంతో దీనిపై ప్రజల్లో అవగాహన కల్పించాలని.. సామాన్యులకు అర్థమయ్యేలా క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోజనాలను తెలపాలని ప్రభుత్వం భావిస్తోంది. హైదరాబాద్‌లో హైటెక్ సిటీ నిర్మించిన ఎల్‌అండ్‌టీ సంస్థే అమరావతిలోక్వాంటమ్ వ్యాలీ నిర్మాణాలను డిజైన్ చేస్తోంది. అత్యాధునిక ఐబీఎం ప్రాసెసర్‌కు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా చేసేలా చర్యలు చేపడతారు. (అమరావతి- ఆంధ్రజ్యోతి) క్వాంటమ్ టెక్నాలజీతో త్వరలో మరో సాంకేతిక విప్లవం రాబోతోంది. దేశంలో ఆ టెక్నాలజీకి అమరావతి తొలి వేదిక కాబోతోంది. శుక్రవారం అమరావతి పనుల పునఃప్రారంభ సమయంలోనే దీనికి కూడా ముందడుగు పడింది. 2026 జనవరి ఒకటో తేదీన క్వాంటమ్ వ్యాలీని ప్రారంభించేందుకు ప్రపంచ టెక్ దిగ్గజాలు ఐబీఎం, టీసీఎస్‌తో పాటు ఇంజనీరింగ్ దిగ్గజం ఎల్‌అండ్‌టీతో రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకుంది. అత్యాధునిక 156 క్యూబిట్ హెరాన్ క్వాంటమ్ ప్రాసెసర్ కలిగిన అతిభారీ క్వాంటమ్ సిస్టమ్ 2ను దేశంలోనే తొలిసారిగా ఐబీఎం సంస్థ అమరావతిలో ఏర్పాటు చేయబోతోంది. దీంతో నాలెడ్జి ఎకానమీకి కేరాఫ్ గా అమరావతి మారబోతోందంటూ విశ్లేషణలు వెలువడ్డాయి. విజ్ఞాన, వాణిజ్య కేంద్రంగా అమరావతి క్వాంటమ్ వ్యాలీ రూపుదిద్దుకోబోదని టెక్ పండితులు భావిస్తున్నారు. రూ.10వేల కోట్ల నుంచి రూ.15వేల కోట్ల వరకు పెట్టుబడులు వచ్చే అవకాశం ఉందని లెక్కలు వేస్తున్నారు. ఒకప్పుడు హైదరాబాద్‌లో జీనోమ్ వ్యాలీకి రూపకల్పన చేసిన చంద్రబాబు... ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీతో అమరావతిని కొత్త ‘టెక్’ రెక్కలు తొడుగుతున్నారని పేర్కొంటున్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ డిజైన్ ప్రత్యేకంగా ఉండబోతోందని రాష్ట్ర ఐటీ శాఖ ఉన్నతాధికారులు వివరించారు. క్వాంటమ్ టెక్నాలజీ అంటే.. భౌతిక శాస్త్ర ప్రకారం క్వాంటమ్ అంటే అతి సూక్ష్మ పరిమాణం. క్వాంటమ్ ఫిజిక్స్‌లో ఉన్న సిద్ధాంతాలు, లక్షణాలు ఉపయోగించి రూపొందించిన ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీ. సాంకేతిక విప్లవంలో క్వాంటమ్ కంప్యూటింగ్ ఇప్పుడిప్పుడే తొలి అడుగులు వేస్తోంది. అభివృద్ధి చెందుతున్న ఈ టెక్నాలజీ భవిష్యత్‌లో అద్భుతాలు సృష్టించబోతోంది. అత్యంత శక్తివంతమైన ప్రస్తుత కంప్యూటర్ల సామర్థ్యానికి మించి క్వాంటమ్ టెక్నాలజీ కంప్యూటర్లు పనిచేస్తాయి. సంప్రదాయ కంప్యూటర్లు పరిష్కరించలేని సంక్లిష్ట సమస్యలను క్వాంటమ్ మెకానిక్స్‌ను ఉపయోగించి పరిష్కరించవచ్చు. క్వాంటమ్ కంప్యూటింగ్ టెక్నాలజీలో క్వాంటమ్ హార్డ్‌వేర్, క్వాంటమ్ ఆల్గొరిథమ్స్‌తో పాటు వివిధ శ్రేణులు ఉంటాయి. క్వాంటమ్ ఫిజిక్స్ ప్రయోజనాలను పుణికిపుచ్చుకున్న క్వాంటమ్ కంప్యూటర్స్.... ప్రస్తుతమున్న అత్యాధునిక కంప్యూటర్లకంటే వేగంగా, సులువుగా జటిలమైన సమస్యలను పరిష్కరించగలవు. ఇవి ఎంత పెద్ద డేటా అయినా చిటికెలో విశ్లేషిస్తాయి. ఒక క్లాసికల్ కంప్యూటర్ ఏదైనా సమస్య పరిష్కరించడానికి రోజులకొద్దీ సమయం తీసుకుంటే... అదే సమస్యను క్వాంటమ్ కంప్యూటర్లు నిమిషాల్లో సాల్వ్ చేయగలవు. నాలుగు సూత్రాలు... సబ్ ఆటమిక్ పార్టికల్స్ అధ్యయనాన్ని క్వాంటమ్ మెకానిక్స్ అని కూడా పిలుస్తారు. ఇది ప్రత్యేకమైన, ప్రాథమిక సహజమైన సూత్రాలను వెల్లడిస్తుంది. సూపర్ పొజిషన్, ఎన్‌టాంగిల్‌మెంట్, డీకొహెరెన్స్, ఇంటర్‌ఫియరెన్స్ అనే ముఖ్యమైన నాలుగు సూత్రాల ఆధారంగా క్వాంటమ్ కంప్యూటింగ్ పనిచేస్తుంది. 1. సూపర్ పొజిషన్: ఒక క్వాంటమ్ పార్టికల్ లేదా వ్యవస్థ ఒకే స్థితిలో ఉండటం కాకుండా, బహుళ అవకాశాల కలయిక స్థితిలో ఉంటుంది. 2. ఎన్‌టాంగిల్‌మెంట్: సాధారణ సంభావ్యత అనుమతించేవాటి కన్నా ఎన్‌టాంగిల్‌మెంట్ ప్రాసె్‌సలో పలు క్వాంటమ్ పార్టికల్స్ అనుసంధానమై బలంగా రూపొందుతాయి. 3. డీకొహెరెన్స్: ఈ స్థితిలో క్వాంటమ్ పార్టికల్స్, సిస్టం క్షయం అయ్యి, నశించి లేదా మారి క్లాసికల్ ఫిజిక్స్ ద్వారా కొలవదగ్గ ఏక స్థితిలోకి వస్తాయి. 4. ఇంటర్‌ఫియరెన్స్: అనుసంధానమైన క్వాంటమ్ స్థితులు ఒకదానిపై ఒకటి ప్రభావం చూపుతాయి. అంతేగాక ఎక్కువ లేదా తక్కువ సంభావ్యతను నిర్మిస్థాయి. క్యూబిట్ అంటే.. ప్రస్తుతం మనం ఉపయోగించే క్లాసికల్ కంప్యూటర్లు 0, 1 అనే బైనరీ బిట్స్‌పై ఆధారపడి పనిచేస్తాయి. ఈ రూపంలోనే సమాచారాన్ని నిల్వ చేయడం లేదా విశ్లేషించడం చేస్తాయి. ఇక్కడ బిట్ విలువ సున్నా లేదా ఒకటి!. క్వాంటమ్ టెక్నాలజీలో ఇలాంటి బిట్‌ను క్యూబిట్ అని పిలుస్తారు. ఈ క్యూబిట్ సాధారణ బిట్‌కు భిన్నంగా ఒకే సమయంలో సున్నా లేదా ఒకటిగా వ్యవహరించగలదు. అదే విధంగా డేటాను నిల్వ చేయగలదు. సూపర్ పొజిషన్‌లో క్యూబిట్స్ అనుసంధానమైనపుడు క్వాంటమ్ టెక్నాలజీ విపరీతమైన వేగంతో పనిచేస్తుంది. ఒకేసారి రెండు క్యూబిట్లు నాలుగు రకాల సమాచారాన్ని లెక్కించగలవు. అలాగే నాలుగు క్యూబిట్లు 16 రకాల అంశాలను విశ్లేషించగలవు. అందుకే ఇది ఊహాతీమైన వేగంతో పనిచేస్తుంది. ఈ కంప్యూటర్లలో మరో విశేషం కూడా ఉంది. క్లాసికల్ కంప్యూటర్ల డేటాను క్వాంటమ్ సిస్టమ్‌లు విశ్లేషించగలవు కానీ, క్వాంటమ్ డేటాను క్లాసికల్ కంప్యూటర్లు యాక్సెస్ చేయలేవు. సమస్యలను పరిష్కరించడానికి ఈ టెక్నాలజీని అభివృద్ధి చేయడానికి ప్రపంచ దిగ్గజ సంస్థలు ముందుకొస్తున్నాయి. ఐబీఎం, మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్ లాంటి సంస్థలు క్వాంటమ్ టెక్నాలజీపై భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. 2035 కల్లా క్వాంటమ్ కంప్యూటింగ్ ఇండస్ట్రీ 1.3 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని అంచనా. మరో హైటెక్ సిటీగా అమరావతి బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీతో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటుకు రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడం ప్రజారాజధాని పునఃనిర్మాణానికి శుభసూచకమని ఏపీ బయో డైవర్సిటీ బోర్డు ఛైర్మన్ నీలాయపాలెం విజయకుమార్ హర్షం వ్యక్తం చేశారు. దీంతో అమరావతి మరో హైటెక్ సిటీగా మారేందుకు అవకాశం ఉందన్నారు. శనివారం టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. 2026 జనవరి నుంచి యావత్ ప్రపంచం అమరావతి వైపు చూస్తుందన్నారు. ఇప్పటికే గూగుల్, నాసా లాంటి ప్రఖ్యాత సంస్థల్లో క్వాంటమ్ కంప్యూటింగ్‌ను వినియోగిస్తున్నారని చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌లు ఏడు మాత్రమే ఉన్నాయని, ఆసియాలో ఇంతవరకు ఆ టెక్నాలజీపై పరిశోధనే చేయలేదన్నారు. అలాంటిది దేశంలోనే తొలిసారిగా అమరావతి ద్వారా ఆసియాకు క్వాంటమ్ టెక్నాలజీని చంద్రబాబు పరిచయం చేస్తున్నారని చెప్పారు. దేశంలో ఏ సీఎం కూడా క్వాంటమ్ టెక్నాలజీపై మాట్లాడిన దాఖలాలు లేవన్నారు. దూరదృష్టి కల సీఎం కాబట్టే చంద్రబాబు క్వాంటమ్ టెక్నాలజీపై మాట్లాడటమే కాదు రాజధానిని క్వాంటమ్ వ్యాలీగా తీర్చిదిద్దనున్నారని కొనియాడారు. 17 రాష్ట్రాల్లో 43 పరిశోధనా కేంద్రాల ద్వారా దీనిని అనుసంధానం చేస్తారని తెలిపారు. అమరావతిలో 50 ఎకరాల విస్తీర్ణంలో క్వాంటమ్ వ్యాలీని ప్రారంభిస్తున్నారని వెల్లడించారు. క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగాలు విస్తృత శ్రేణిలో క్వాంటమ్ టెక్నాలజీ వినియోగంతో వివిధ రంగాల్లో విప్లవాత్మకమైన మార్పులు వస్తాయి. ఏఐ, సైబర్ సెక్యూరిటీ, ఔషధరంగం, ఆర్థిక సేవలు, మెటీరియల్ సైన్స్ తదితర రంగాల్లో అనూహ్య పురోగతి కనిపిస్తుంది. క్లాసికల్ కంప్యూటర్ టెక్నాలజీకి లేని సామర్థ్యం దీనికి ఉండటంతో ఆప్టిమైజేషన్, క్రిప్టోగ్రఫీ, మెషీన్ లెర్నింగ్ మరింత మెరుగవుతుంది. దీనివల్ల ఏఐ పనులు మరింత వేగంగా, సమర్థవంతంగా నిర్వహించవచ్చు. క్వాంటమ్ కీ డిస్ట్రిబ్యూషన్ ద్వారా సమాచారం హ్యాక్ చేయలేని విధంగా మారుతుంది. అత్యంత భద్రంగా సమాచార నిల్వ, మార్పిడి జరుగుతుంది. అణు స్థాయిలో రసాయన చర్యలను విశ్లేషించడం ద్వారా కొత్త మందులను వేగంగా అభివృద్ధి చేయవచ్చు. మార్కెట్ అంచనా, పోర్టిఫోలియో ఆప్టిమైజేషన్ వంటి క్లిష్టమైన సమస్యలను వేగంగా పరిష్కరించవచ్చు. వాతావరణ మార్పులు, వాటి అంచనాలు మరింత కచ్చితంగా విశ్లేషించవచ్చు. క్వాంటమ్ టెక్నాలజీతో విస్తృత డేటా విశ్లేషణలో పెరిగే వేగం కారణంగా పాలనలో కూడా వేగం పెరుగుతుంది. ఉదాహరణకు.. రాష్ట్రాన్ని ఒక యూనిట్‌గా తీసుకుని ఎంతమందికి క్యాన్సర్ వ్యాధి వచ్చే అవకాశాలు ఉన్నాయి, ఎంతమందిలో రోగ నిరోధక శక్తి ఉంది అనే విషయం క్షణాల్లో తెలుసుకోవచ్చు. పంటలకు సోకే క్రిమికీటకాలు, వాటి ప్రభావం, నివారణపైనా రాష్ట్రస్థాయిలో అధ్యయనం చేసేందుకు వీలు కలుగుతుంది. భారీ బహిరంగ సభల్లో పది లక్షల మంది హాజరైనా ఒక్కొక్కరినీ గుర్తింవచ్చు. ట్రాఫిక్ నియంత్రణ కూడా సలువు అవుతుంది.
May 4, 20251 yr 18 hours ago, sonykongara said: Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane.. still 4 years to go...
May 4, 20251 yr నిన్నో నిశ్శబ్ద అంకురార్పణ ఆంధ్రాలో జరిగింది. ఇది అమరావతి గురించి కాదు. కానీ అదిప్పుడు అంతర్జాతీయ మీడియా మరియు మ్యాగజైన్ల ముఖ్యాంశాలుగా మారాయి. స్టాక్ మార్కెట్లలో సదరు స్టాక్స్ ను కూడా ప్రభావితం చేసింది. (Global Media and Magazine Headlines): The New York Times: "India Steps into Quantum Race with IBM and TCS Partnership in Andhra Pradesh" The Wall Street Journal: "IBM, Tata Consultancy to Build India's First Quantum Computing Tech Park" Reuters: "IBM and TCS Join Forces to Establish Quantum Hub in Southern India" Financial Times: "India Aims to Become Quantum Powerhouse with Ambitious Tech Park Project" Nature: "Quantum Leap for India: New Tech Park to House Advanced IBM System" Science Magazine: "India Bets Big on Quantum Computing with Landmark Investment" TechCrunch: "IBM and TCS Team Up to Bring Quantum Computing to Andhra Pradesh" The Verge: "India's First Quantum Valley Tech Park to Feature IBM's Latest Quantum Computer" MIT Technology Review: "India's Quantum Ambition Takes Shape with New Tech Park" The Economist: "India's Quantum Quest: A Bold Move into the Future of Computing" క్వాంటం కల సాకారమవుతోందా? ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం! ఒక ఊహ... ఒక అద్భుతం... ఒక సరికొత్త సాంకేతిక విప్లవం! మన కళ్ల ముందే ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే - క్వాంటం కంప్యూటింగ్! ఇది కేవలం ఒక సాంకేతికత కాదు... ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి! రియాక్షన్స్ అన్లీష్డ్ : టెక్ ప్రపంచం సంభ్రమాశ్చర్యాలు: ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహం: ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో IBM మరియు TCS షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగాయి. సోషల్ మీడియాలో టెక్కీల కేరింతలు: సోషల్ మీడియాలో ఈ వార్త ఒక తుఫానులా వ్యాపించింది. క్వాంటం ఆంధ్రప్రదేశ్ అంటూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రపంచంలోని మూడు దిగ్గజ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలు - IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు లార్సెన్ & టూబ్రో (L&T) - మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి! ఈ ప్రకటన నిన్న చంద్రబాబు సమక్షంలోనే మే 2, 2025న ఉదయం వెలువడింది. ఇది కలకాదు. అవును... మీరు వింటున్నది నిజమే! టీసీఎస్, ఐబీఎంలు కూడా వారి కంపెనీల వెబ్సైట్లలో పెట్టారు. అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్! ఇది కేవలం ఒక భవనం కాదు... ఇది భవిష్యత్తు తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతోంది! ఈ టెక్ పార్క్‌ను జనవరి 1, 2026న దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇందులో కొలువుదీరబోయే ఆ అద్భుత యంత్రం ఏమిటో తెలుసా? IBM యొక్క సరికొత్త సృష్టి - IBM క్వాంటం సిస్టమ్ టూ! ఏకంగా 156 క్యూబిట్ల హెరాన్ క్వాంటం ప్రాసెసర్‌తో ఇది భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతోంది! సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు! క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో TCS తన మేధోశక్తిని ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ టెక్ పార్క్‌లోని శాస్త్రవేత్తలకు IBM యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది! ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని L&T పర్యవేక్షిస్తుంది, తద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటం కలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు సృష్టించబడతాయి, ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడకు తరలివస్తారు, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. GST నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు, ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది! ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక రాష్ట్రం కాదు... ఇది క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది! జనవరి 1, 2026 కోసం ఎదురుచూద్దాం... చరిత్ర సృష్టించబడబోతోంది! ఇలాగే ఓ రోజు సైలెంట్ గా నాయుడు పాతికేళ్ల క్రితం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ అంటే నవ్వుకొన్నారు. కట్ చేస్తే కరోనా సమయంలో ఆ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమే పడిగాపులు గాస్తూ ఎగబడి కొని వేయించుకొంది. అమరావతి కూడా క్వాటం వ్యాలీగా మారితీరుతుంది. మారే వరకు నాయుడు వదిలిపెట్టరు
May 4, 20251 yr 6 minutes ago, Nfan from 1982 said: నిన్నో నిశ్శబ్ద అంకురార్పణ ఆంధ్రాలో జరిగింది. ఇది అమరావతి గురించి కాదు. కానీ అదిప్పుడు అంతర్జాతీయ మీడియా మరియు మ్యాగజైన్ల ముఖ్యాంశాలుగా మారాయి. స్టాక్ మార్కెట్లలో సదరు స్టాక్స్ ను కూడా ప్రభావితం చేసింది. (Global Media and Magazine Headlines): The New York Times: "India Steps into Quantum Race with IBM and TCS Partnership in Andhra Pradesh" The Wall Street Journal: "IBM, Tata Consultancy to Build India's First Quantum Computing Tech Park" Reuters: "IBM and TCS Join Forces to Establish Quantum Hub in Southern India" Financial Times: "India Aims to Become Quantum Powerhouse with Ambitious Tech Park Project" Nature: "Quantum Leap for India: New Tech Park to House Advanced IBM System" Science Magazine: "India Bets Big on Quantum Computing with Landmark Investment" TechCrunch: "IBM and TCS Team Up to Bring Quantum Computing to Andhra Pradesh" The Verge: "India's First Quantum Valley Tech Park to Feature IBM's Latest Quantum Computer" MIT Technology Review: "India's Quantum Ambition Takes Shape with New Tech Park" The Economist: "India's Quantum Quest: A Bold Move into the Future of Computing" క్వాంటం కల సాకారమవుతోందా? ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం! ఒక ఊహ... ఒక అద్భుతం... ఒక సరికొత్త సాంకేతిక విప్లవం! మన కళ్ల ముందే ఆవిష్కృతం కాబోతోంది. విశ్వంలోని అత్యంత సంక్లిష్టమైన రహస్యాలను ఛేదించే శక్తి మన ముంగిట నిలవబోతోంది. అదే - క్వాంటం కంప్యూటింగ్! ఇది కేవలం ఒక సాంకేతికత కాదు... ఇది భవిష్యత్తును మార్చేసే ఒక శక్తి! రియాక్షన్స్ అన్లీష్డ్ : టెక్ ప్రపంచం సంభ్రమాశ్చర్యాలు: ఈ ప్రకటన వెలువడగానే ప్రపంచవ్యాప్తంగా టెక్ దిగ్గజాలు సంభ్రమాశ్చర్యాలకు గురయ్యాయి. స్టాక్ మార్కెట్‌లో ఉత్సాహం: ఈ ప్రకటన వెలువడిన వెంటనే స్టాక్ మార్కెట్‌లో IBM మరియు TCS షేర్లు స్వల్పంగా పెరిగాయి. ఇన్వెస్టర్లు ఈ దీర్ఘకాలిక పెట్టుబడిని ఒక సువర్ణావకాశంగా భావిస్తున్నారు. క్వాంటం టెక్నాలజీ భవిష్యత్తులో తిరుగులేని శక్తిగా ఎదుగుతుందనే నమ్మకంతో కొనుగోళ్లు పెరిగాయి. సోషల్ మీడియాలో టెక్కీల కేరింతలు: సోషల్ మీడియాలో ఈ వార్త ఒక తుఫానులా వ్యాపించింది. క్వాంటం ఆంధ్రప్రదేశ్ అంటూ తమ ఆనందాన్ని, గర్వాన్ని వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులు, యువత ఈ పరిణామాన్ని తమ భవిష్యత్తుకు ఒక గొప్ప అవకాశంగా భావిస్తున్నారు. ప్రపంచంలోని మూడు దిగ్గజ టెక్నాలజీ మరియు ఇంజనీరింగ్ సంస్థలు - IBM, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) మరియు లార్సెన్ & టూబ్రో (L&T) - మన రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వచ్చాయి! ఈ ప్రకటన నిన్న చంద్రబాబు సమక్షంలోనే మే 2, 2025న ఉదయం వెలువడింది. ఇది కలకాదు. అవును... మీరు వింటున్నది నిజమే! టీసీఎస్, ఐబీఎంలు కూడా వారి కంపెనీల వెబ్సైట్లలో పెట్టారు. అమరావతిలో రూపుదిద్దుకోబోతోంది భారతదేశపు మొట్టమొదటి క్వాంటం వ్యాలీ టెక్ పార్క్! ఇది కేవలం ఒక భవనం కాదు... ఇది భవిష్యత్తు తరాల పరిశోధనలకు, ఆవిష్కరణలకు ఒక వ్యాలీ కాబోతోంది! ఈ టెక్ పార్క్‌ను జనవరి 1, 2026న దేశానికి అంకితం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. మరి ఇందులో కొలువుదీరబోయే ఆ అద్భుత యంత్రం ఏమిటో తెలుసా? IBM యొక్క సరికొత్త సృష్టి - IBM క్వాంటం సిస్టమ్ టూ! ఏకంగా 156 క్యూబిట్ల హెరాన్ క్వాంటం ప్రాసెసర్‌తో ఇది భారతదేశపు సాంకేతిక చరిత్రలో ఒక సంచలనం సృష్టించబోతోంది! సామాన్య కంప్యూటర్లు తలమునకలయ్యే లెక్కలను ఇది క్షణాల్లో పూర్తి చేయగలదు! క్లిష్టమైన సమస్యలకు క్వాంటం పరిష్కారాలను కనుగొనడంలో, వైద్యం నుండి తయారీ వరకు వివిధ రంగాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకురావడంలో TCS తన మేధోశక్తిని ఉపయోగించనుంది. అంతేకాదు, ఈ టెక్ పార్క్‌లోని శాస్త్రవేత్తలకు IBM యొక్క శక్తివంతమైన క్లౌడ్ క్వాంటం కంప్యూటర్లను అందుబాటులోకి తీసుకురానుంది! ఈ టెక్ పార్క్ యొక్క మౌలిక సదుపాయాల అభివృద్ధిని L&T పర్యవేక్షిస్తుంది, తద్వారా అత్యాధునిక సాంకేతికతకు అనుగుణంగా అన్ని హంగులు ఉంటాయి. మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ క్వాంటం కలను నిజం చేయడానికి అహర్నిశలు కృషి చేస్తోంది. అమరావతిని క్వాంటం కంప్యూటింగ్ టెక్ పార్కును ప్రపంచ పటంలో ఒక ప్రత్యేక స్థానంలో నిలబెట్టాలనే దృఢ సంకల్పంతో ఉంది. దీని ద్వారా వేలాది అత్యాధునిక ఉద్యోగాలు సృష్టించబడతాయి, ప్రపంచ నలుమూలల నుండి మేధావులు ఇక్కడకు తరలివస్తారు, భారీగా పెట్టుబడులు రాష్ట్రానికి రానున్నాయి. GST నిర్వహణ నుండి ఖచ్చితమైన జనాభా లెక్కల విశ్లేషణ వరకు, ప్రతి రంగంలోనూ క్వాంటం టెక్నాలజీ ఒక కొత్త శకానికి నాంది పలుకుతుందని ప్రభుత్వం విశ్వసిస్తోంది! ఆంధ్రప్రదేశ్ ఇక కేవలం ఒక రాష్ట్రం కాదు... ఇది క్వాంటం విప్లవానికి కేంద్రం కాబోతోంది! జనవరి 1, 2026 కోసం ఎదురుచూద్దాం... చరిత్ర సృష్టించబడబోతోంది! ఇలాగే ఓ రోజు సైలెంట్ గా నాయుడు పాతికేళ్ల క్రితం హైదరాబాద్ జీనోమ్ వ్యాలీ అంటే నవ్వుకొన్నారు. కట్ చేస్తే కరోనా సమయంలో ఆ వ్యాలీలోని భారత్ బయోటెక్ వ్యాక్సిన్ కోసం ప్రపంచమే పడిగాపులు గాస్తూ ఎగబడి కొని వేయించుకొంది. అమరావతి కూడా క్వాటం వ్యాలీగా మారితీరుతుంది. మారే వరకు నాయుడు వదిలిపెట్టరు Game Changer dorikindhi CBN ki.. it will take a generation for AP people to understand what impact it will make to its economy and lives.. Tata + CBN.. has potential to create wonders
May 6, 20251 yr Author నేషనల్ క్వాంటమ్ మిషన్ సౌజన్యంతో L&T, IBM, IIT మద్రాస్, TCS సంస్థల సహకారంతో అమరావతిలో ఏర్పాటు కానున్న "క్వాంటమ్ వ్యాలీ" కి 50 ఎకరాల భూమి కేటాయింపు
May 13, 2025May 13 Author Quantum Valley: క్వాంటమ్ వ్యాలీ.. అవకాశాల గని! ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ ఈ సాంకేతికతకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కేంద్రం. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. By Editorial DeskPublished : 13 May 2025 01:24 IST Ee Font size 4 min read ఏపీ రాజధాని అమరావతిలో ఏర్పాటవుతున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ ఈ సాంకేతికతకు సంబంధించి దేశంలోనే మొట్టమొదటి కేంద్రం. ఐబీఎం, టీసీఎస్ వంటి దిగ్గజ సంస్థల భాగస్వామ్యంతో 156 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నారు. అనేక రంగాల్లో అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను ఏకకాలంలో పరిష్కరించే సామర్థ్యం దీనికుంది. అసలు క్వాంటమ్ టెక్నాలజీ ప్రత్యేకత ఏంటి? నేడు జన జీవితాలు సాంకేతికతపైనే అధికంగా ఆధారపడి ఉన్నాయి. ప్రస్తుతం ఉపయోగిస్తున్న కంప్యూటర్లు జటిలమైన సమస్యలను త్వరగా పరిష్కరించలేకపోతున్నాయి. దానివల్ల అరుదైన వ్యాధులకు మందుల తయారీ, సమాచార భద్రత, అంతరిక్ష పరిశోధనలు వంటి రంగాల్లో కాలయాపన తప్పడంలేదు. అందుకే ప్రపంచమంతా ఇప్పుడు అధునాతన క్వాంటమ్ టెక్నాలజీ వైపు చూస్తోంది. ఎంతటి సంక్లిష్ట గణాంకాలనైనా ఇది చిటికెలో పరిష్కరిస్తుంది. శక్తిమంతమైన ఈ సాంకేతికతపై కెనడా, చైనా, జపాన్, జర్మనీ వంటి దేశాలు ఇప్పటికే పెద్దయెత్తున పెట్టుబడులు పెట్టాయి. పైచేయి సాధిస్తున్నాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ‘క్వాంటమ్ వ్యాలీ’ ఏర్పాటవుతుండటం విశేషం. మన పరిశోధనలను జోరెత్తించడానికీ, యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికీ, దేశానికి ఉజ్జ్వల భవిష్యత్తును అందించడానికీ ఇది కీలకమవుతుంది. కొత్త ఆశలు మనందరికీ తెలిసిన సాధారణ కంప్యూటర్లు ఒక సమయంలో ఒక పనినే చేస్తాయి. ఆ సమయంలో బైనరీ విలువలైన ‘0’ లేదా ‘1’ అనే యూనిట్ల(బిట్స్)లో ఏదో ఒకదాన్ని మాత్రమే ప్రాసెస్ చేస్తుంటాయి. అందువల్ల సంక్లిష్టమైన గణాంకాలను ఇవి వేగంగా పూర్తిచేయలేవు. ఈ తరుణంలో అందుబాటులోకి వచ్చిన క్వాంటమ్ కంప్యూటింగ్‌పై కొత్త ఆశలు చిగురిస్తున్నాయి. ఇది ప్రధానంగా క్వాంటమ్ ఫిజిక్స్ భావనలపై ఆధారపడి పనిచేస్తుంది. ఇందులో బిట్స్‌కు బదులు ‘క్విబిట్స్’ అనే యూనిట్లు ఉంటాయి. ఒక క్విబిట్ ఒకేసారి 0 గానీ, 1 గానీ కాకుండా... రెండూ కలిపిన స్థితిలో ఉండగలదు! దీన్ని ‘సూపర్ పొజిషన్’ అంటారు. దీనివల్ల, ఏకకాలంలో అనేక గణాంకాలను పూర్తిచేయడం సాధ్యపడుతుంది. ఒక క్విబిట్ స్థితి మరొక క్విబిట్ మీద ప్రభావం చూపగలదు. దీన్నే ‘ఎంటాంగిల్‌మెంట్’ అంటారు. ఇది గణన సామర్థ్యాలను మరింతగా పెంచుతుంది. సాధారణ కంప్యూటర్ ఒక లెక్కను పరిష్కరించడానికి ఒక్కో మార్గాన్నీ వెతుకుతుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఒకేసారి అన్ని మార్గాల్లో పరిష్కార మార్గాల కోసం అన్వేషిస్తుంది. వందల రెట్ల వేగంతో పనిచేస్తూ అసాధారణ గణాంకాల్ని అతి తక్కువ సమయంలోనే పరిష్కరిస్తుంది. ఎన్నో ప్రయోజనాలు... ‘క్వాంటమ్ వ్యాలీ’ మన జీవితాలను మరింతగా మెరుగుపరచడానికి దోహదపడుతుంది. పరిశోధనలను త్వరితగతిన పూర్తిచేసి క్యాన్సర్, అల్జీమర్స్ వంటి సంక్లిష్ట వ్యాధులకు కొత్త ఔషధాలను తయారు చేయడానికి తోడ్పడుతుంది. క్వాంటమ్ కమ్యూనికేషన్ అత్యంత సురక్షితమైనది. ఇతరులు హ్యాక్ చేయడానికి వీల్లేకుండా సందేశాలు పంపుకోవడం వీలవుతుంది కాబట్టి, దేశ భద్రతకు అత్యంత కీలకమవుతుంది. క్వాంటమ్ అల్గారిథమ్‌లను ఉపయోగించి బ్యాంకులు, ఆర్థిక సంస్థల లావాదేవీల్లో జరిగే మోసాలను ఇట్టే పసిగట్టవచ్చు. క్వాంటమ్ కంప్యూటర్లు డేటాను సున్నితంగా విశ్లేషించి, చక్కటి క్లైమేట్ మోడల్స్‌ను తయారు చేస్తాయి. దీనివల్ల వర్షాభావ పరిస్థితులు, తుపానులు, వాతావరణ మార్పులపై ముందస్తు హెచ్చరికలు సాధ్యమవుతాయి. అన్నదాతలు నేల స్వభావాన్ని తెలుసుకుని, మేలైన విత్తనాలను ఎంపిక చేసుకోవడానికి సైతం ఈ టెక్నాలజీ సాయపడుతుంది. మరోవైపు, క్వాంటమ్ పరిశోధన రంగం వేగం పుంజుకుంటుంది. ఈ సాంకేతిక నిపుణులకు అంతర్జాతీయ స్థాయిలో కెరీర్ అవకాశాలు అందివస్తాయి. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో నక్షత్రాల స్థితిగతులు, గ్రహాల గమనాలను వేగంగా లెక్కించడం; అంతరిక్ష ప్రయోగాలను మరింత కచ్చితత్వంతో నిర్వహించడం వీలవుతుంది. ప్రపంచ దేశాలకు దీటుగా... భవిష్యత్ పరిశోధనలకూ, సాంకేతిక ప్రతిభా పాటవాలను ప్రదర్శించడానికీ క్వాంటమ్ రంగం కీలకమవుతుందని ధనిక దేశాలు గుర్తించాయి. కెనడాలోని వాటర్లూ నగరంలో ఉన్న ‘ఇన్‌స్టిట్యూట్ ఫర్ క్వాంటమ్ కంప్యూటింగ్’ ప్రపంచంలోనే ప్రముఖ క్వాంటమ్ పరిశోధనాలయాల్లో ఒకటి. అక్కడి విద్యార్థులు, శాస్త్రవేత్తలు స్టార్టప్‌లతో కలిసి నూతన ఆవిష్కరణలపై దృష్టి పెడుతున్నారు. క్వాంటమ్ కమ్యూనికేషన్ రంగంలో చైనాయే ముందంజలో ఉంది. ‘మికియస్’ అనే మొట్టమొదటి క్వాంటమ్ ఉపగ్రహాన్ని ప్రయోగించి, భూమ్మీద అత్యంత సురక్షితంగా డేటాను బట్వాడా చేసి చూపించింది. జర్మనీ, జపాన్ దేశాల్లోనూ క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రయోగశాలలు ఆరంభమయ్యాయి. ఈ క్రమంలోనే అమరావతిలో ఏర్పాటవుతున్న ‘క్వాంటమ్ వ్యాలీ’ ప్రపంచ క్వాంటమ్ పటంలో ప్రత్యేక స్థానాన్ని ఆక్రమించగలదు. ఇది పరిశోధన కేంద్రమే కాదు- విద్య, పరిశ్రమ, స్టార్టప్‌ల భాగస్వామ్యంతో అంతర్జాతీయ స్థాయిలో క్వాంటమ్ ఆధారిత పరిష్కారాలను కనుగొనే వేదికగా మారగలదు. భవిష్యత్ టెక్నాలజీలో ఏపీ అగ్రస్థానాన్ని సాధించేందుకు ఇది బలమైన ముందడుగు అవుతుంది! జాతీయ మిషన్‌కి అనుగుణంగా... భారత్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం 2023లో క్వాంటమ్ మిషన్‌ను ఆరంభించింది. ఇందుకోసం రూ.6వేల కోట్లు కేటాయించింది. 2030 వరకు కొనసాగే ఈ మిషన్ ద్వారా పరిశోధన-అభివృద్ధిలో స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్షిస్తోంది. ఈ మిషన్ నాలుగు కీలక అంశాలపై దృష్టి పెడుతోంది. మొదటిది: అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించడం(క్వాంటమ్ కంప్యూటింగ్). రెండోది: సమాచారాన్ని అత్యంత భద్రంగా పంపించే పద్ధతుల్ని అభివృద్ధి చేయడం(క్వాంటమ్ కమ్యూనికేషన్). మూడోది: భూ లోతుల పరిశోధన, ఆరోగ్య పరికరాల కొలతల్లో టెక్నాలజీ(క్వాంటమ్ సెన్సింగ్, మీట్రాలజీ)ని వినియోగించడం. నాలుగోది: కొత్త తరహా పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడం(క్వాంటమ్ మెటీరియల్స్, డివైసెస్). ఈ నేపథ్యంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ పెద్దసంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు. పరిశోధనలకు ప్రేరణ ఇవ్వడంతోపాటు గ్లోబల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి మార్గాలను తెరవగలదు. క్వాంటమ్ రంగంలో స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు కూడా ఏర్పాటవుతాయి.
May 13, 2025May 13 Author జాతీయ మిషన్‌కి అనుగుణంగా... భారత్‌ను సాంకేతిక రంగంలో ప్రపంచస్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతో కేంద్రం 2023లో క్వాంటమ్ మిషన్‌ను ఆరంభించింది. ఇందుకోసం రూ.6వేల కోట్లు కేటాయించింది. 2030 వరకు కొనసాగే ఈ మిషన్ ద్వారా పరిశోధన-అభివృద్ధిలో స్వయంప్రతిపత్తి కలిగిన దేశంగా ఎదగాలని భారత్ లక్షిస్తోంది. ఈ మిషన్ నాలుగు కీలక అంశాలపై దృష్టి పెడుతోంది. మొదటిది: అత్యంత సంక్లిష్టమైన గణాంకాలను వేగంగా పరిష్కరించడం(క్వాంటమ్ కంప్యూటింగ్). రెండోది: సమాచారాన్ని అత్యంత భద్రంగా పంపించే పద్ధతుల్ని అభివృద్ధి చేయడం(క్వాంటమ్ కమ్యూనికేషన్). మూడోది: భూ లోతుల పరిశోధన, ఆరోగ్య పరికరాల కొలతల్లో టెక్నాలజీ(క్వాంటమ్ సెన్సింగ్, మీట్రాలజీ)ని వినియోగించడం. నాలుగోది: కొత్త తరహా పదార్థాలతో అధునాతన పరికరాలను అభివృద్ధి చేయడం(క్వాంటమ్ మెటీరియల్స్, డివైసెస్). ఈ నేపథ్యంలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ పెద్దసంఖ్యలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించగలదు. పరిశోధనలకు ప్రేరణ ఇవ్వడంతోపాటు గ్లోబల్ ప్రాజెక్టుల్లో భాగస్వామ్యానికి మార్గాలను తెరవగలదు. క్వాంటమ్ రంగంలో స్టార్టప్‌లు, పరిశోధనా కేంద్రాలు, ఇన్నోవేషన్ క్లస్టర్లు కూడా ఏర్పాటవుతాయి.
Create an account or sign in to comment