April 15Apr 15 Author క్వాంటమ్ కంప్యూటర్.. మేడిన్ అమరావతిBy Andhra Pradesh News DeskPublished : 15 Apr 2026 04:11 ISTEeFont size6 min readఐబీఎం నుంచి వచ్చేసరికల్లా తయారుచేయాలిక్వాంటమ్ టెక్నాలజీలో ఇక స్వావలంబనఐటీకి సిలికాన్ వ్యాలీ... ఇకపై క్వాంటమ్‌కు అమరావతి లక్ష్యం నిర్దేశించిన సీఎం చంద్రబాబు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, మేధా టవర్స్‌లో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రారంభంఎస్ఆర్ఎం యూనివర్సిటీలో క్వాంటమ్ మిషన్‌ను ఆవిష్కరించిన సీఎం చంద్రబాబు. చిత్రంలో కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్, తిరుపతి ఐఐటీ డైరెక్టర్ సత్యనారాయణ, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేవీబీ రెడ్డి, ఏపీ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్, క్యూబిట్ ఫోర్స్ వ్యవస్థాపకుడు వెంకట సుబ్రమణియం, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రో ఛాన్స్‌లర్ సత్యనారాయణన్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వీసీ సతీష్కుమార్ఈనాడు, అమరావతి: ఐబీఎం సంస్థ వచ్చే డిసెంబరులో అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుచేసే నాటికి.. అలాంటి కంప్యూటర్‌నే పూర్తి దేశీయ పరిజ్ఞానంతో ఇక్కడే తయారుచేయాలని అమరావతి క్వాంటమ్ మిషన్ ప్రతినిధులు, శాస్త్రవేత్తలకు ముఖ్యమంత్రి చంద్రబాబు లక్ష్యం నిర్దేశించారు. క్వాంటమ్ పరిశోధనలకు నిధుల కొరత లేదని, ప్రభుత్వం నుంచి పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో భారత్ స్వావలంబన సాధించాలని, భవిష్యత్తులో ఏ అప్లికేషన్ కోసమూ ఎవరిపైనా ఆధారపడకూడదని ఆయన స్పష్టం చేశారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీలో, గన్నవరంలోని మేధాటవర్స్‌లోనూ ఏర్పాటుచేసిన దేశంలోనే మొదటి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్‌ని ఆయన మంగళవారం ప్రారంభించి, జాతికి అంకితం చేశారు. ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో నిర్వహించిన కార్యక్రమంలో చంద్రబాబు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు. ‘‘దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన క్వాంటమ్ కంప్యూటర్లతో రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటుచేయడం క్వాంటమ్ టెక్నాలజీ రంగంలో మన దేశం వేసిన పెద్ద ముందడుగు. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం, రాజ్యాంగ నిర్మాత అంబేడ్కర్ జయంతి రోజున మనం వీటిని ప్రారంభించడం గొప్ప విషయం. దేశీయ పరిజ్ఞానంతో క్వాంటమ్ కంప్యూటర్లు తయారు చేయగలమని నిరూపించాం. ఇది ప్రారంభం మాత్రమే. ఈ పక్రియను వేగవంతం చేయండి. అత్యాధునిక కంప్యూటర్లను తయారుచేయండి’’ అన్నారు. ఇప్పటివరకు ఐటీలో నూతన ఆవిష్కరణలకు అమెరికాలోని సిలికాన్ వ్యాలీ కేంద్రంగా ఉందని, ఇకపై క్వాంటమ్ ఆవిష్కరణల కోసం అందరూ అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీ వైపు చూస్తారని పేర్కొన్నారు. క్వాంటమ్, ఏఐ, సెమీకండక్టర్ల లాంటివి ఇకపై భారత్ అభివృద్ధి ప్రయాణంలో అంతర్భాగాలని సీఎం తెలిపారు. అమరావతి క్వాంటమ్ మిషన్‌కి సంపూర్ణ సహకారం అందిస్తున్న ప్రధాని నరేంద్రమోదీకి కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సీఎం అన్నారు. ‘‘టెక్నాలజీని లోతుగా అర్థం చేసుకునే నాయకులు తక్కువగా ఉంటారు. ప్రధాని మోదీ అలాంటి కొద్దిమందిలో ఒకరు. క్వాంటమ్ కంప్యూటింగ్, సెమీకండక్టర్ రంగాల్లో భారత్ వేగంగా పురోగమిస్తోందంటే దానికి ఆయన దార్శనికతే కారణం’’ అని చంద్రబాబు కొనియాడారు.క్వాంటమ్ మిషన్‌ను పరిశీలిస్తున్న సీఎంఅప్పుడు ఐటీలో.. ఇప్పుడు క్వాంటమ్‌లో... మనకు తిరుగులేదుదేశంలోనే తొలి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్ ఏర్పాటు ఆంధ్రప్రదేశ్‌కు గర్వకారణమని సీఎం పేర్కొన్నారు. ఒకప్పుడు ఐటీని అందిపుచ్చుకోవడంలో తెలుగునేల నిర్ణయాత్మక పాత్ర పోషించిందని, ఇప్పుడు క్వాంటమ్ విప్లవంలోనూ అలాంటి పాత్రకు సిద్ధమైందని ఆయన పేర్కొన్నారు. ‘‘పారిశ్రామిక రంగానికి విద్యుత్, డిజిటల్ యుగానికి ఇంటర్నెట్ లాగే.. ఆధునిక ఆవిష్కరణలకు క్వాంటమ్ టెక్నాలజీ ప్రధానం. క్వాంటమ్ సాంకేతికతలో స్వావలంబన సాధించే దేశాలే భవిష్యత్తును శాసిస్తాయి. భారతీయ పరిశోధకులు, పరిశ్రమలు క్వాంటమ్ హార్డ్‌వేర్‌ను పరీక్షించేందుకు అమరావతి క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ప్రధాన కేంద్రాలవుతాయి’’ అని సీఎం పేర్కొన్నారు. ‘‘ఈ రోజు ప్రారంభించినవి పూర్తిస్థాయి క్వాంటమ్ హార్డ్‌వేర్ టెస్ట్‌బెడ్స్. కొత్తగా తయారుచేసిన క్వాంటమ్ కాంపొనెంట్స్ వ్యాలిడేషన్, బెంచ్‌మార్కింగ్, సర్టిఫికేషన్ ప్రక్రియలను ఇక్కడ నిర్వహించవచ్చు. భారత్ ఇక క్వాంటమ్ టెక్నాలజీలను అధ్యయనం చేయడానికే పరిమితం కాదని, వాటిని తయారుచేయడం, పరీక్షించడం, రిఫైన్ చేయడం లాంటి ప్రక్రియల్లో దూసుకెళుతుందనడానికి నిదర్శనం’’ అని తెలిపారు. ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేసిన 1ఎస్ క్వాంటమ్ కంప్యూటర్ పరిశోధనలకు, మేధా టవర్స్‌లోని 1క్యూ కంప్యూటర్ పరిశ్రమలకు ప్రధానంగా ఉపయోగపడతాయని తెలిపారు. ‘‘ఆంధ్రప్రదేశ్ ఇకపై ఆధునిక టెక్నాలజీలను వినియోగించుకోవడానికే పరిమితం కాదు. వాటి ఆవిష్కరణ, నిర్మాణం, ప్రొడక్ట్స్ తయారీ ఇక్కడే జరుగుతుంది. వాటిని ఎగుమతి చేస్తుంది. ఈ బృహత్ లక్ష్యంలో క్వాంటమ్ టెక్నాలజీ కీలకపాత్ర పోషిస్తుంది. ఔషధాలను కనుక్కోవడం, మెటీరియల్ సైన్స్, సురక్షితమైన కమ్యూనికేషన్ల వ్యవస్థల రూపకల్పన, రక్షణరంగ సిమ్యులేషన్లు, వాతావరణ మోడళ్ల లాంటి రంగాల్లో క్వాంటమ్ టెక్నాలజీ అద్భుతాలు చేస్తుంది’’ అని తెలిపారు. ఒక చిన్న ఆలోచనతో ఈ ప్రయాణం మొదలైంది‘‘ఎవరు ఏ కొత్త ఆలోచనతో వచ్చినా దానిపై లోతుగా దృష్టిపెట్టడం నాకు అలవాటు. ఒకరోజు మద్రాస్ ఐఐటీ డైరెక్టర్ కామకోటి ఫోన్ చేసి.. క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో విస్తృత అవకాశాలున్నాయని, ఐబీఎం భారత్‌లో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేయలనుకుంటోందని తెలిపారు. ఐబీఎంలో పనిచేస్తున్న వెంకట్ సుబ్రమణియంని సంప్రదించగా.. భాగస్వాములు దొరికితే తమకు అభ్యంతరం లేదని చెప్పారు. టీసీఎస్, ఎల్‌అండ్‌టీతో మాట్లాడితే వాళ్లూ సరేనన్నారు. ప్రధాని అనుమతి కోరితే ఆయనా ప్రోత్సహించారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ ప్రయాణం అలా మొదలైంది’’ అని సీఎం వివరించారు. డిసెంబరు నాటికి అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవనం సిద్ధమవుతుందని, ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేస్తుందని తెలిపారు. క్వాంటమ్ కంట్రోలర్ వివరాలు తెలుసుకుంటున్న సీఎం చంద్రబాబుక్వాంటమ్ కంప్యూటర్‌ను పరిశీలించిన సీఎంఎస్ఆర్ఎం యూనివర్సిటీలో ఏర్పాటుచేసిన క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీని ప్రారంభించిన అనంతరం... అక్కడి క్వాంటమ్ కంప్యూటర్‌ను సీఎం పరిశీలించారు. అది ఎలా పనిచేస్తుందో క్యూబిట్ ఫోర్స్ సంస్థ వ్యవస్థాపకుడు వెంకట్ సుబ్రమణియం వివరించారు. అనంతరం మేధాటవర్స్‌లోని రిఫరెన్స్ ఫెసిలిటీని వర్చువల్‌గా సీఎం ప్రారంభించారు. క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్‌ని ఏర్పాటుచేసిన వెంకట్ సుబ్రమణియం, క్యూబిటెక్ సంస్థ వ్యవస్థాపకుడు పృథ్వి, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ ప్రో ఛాన్స్‌లర్ సత్యనారాయణన్, వైస్ ఛాన్స్‌లర్ సతీష్‌కుమార్‌లను అభినందించారు. కేంద్రప్రభుత్వ శాస్త్ర సలహాదారు అజయ్‌కుమార్ సూద్ దిల్లీ నుంచి వర్చువల్‌గా పాల్గొన్నారు. కేంద్ర శాస్త్ర, సాంకేతిక శాఖ కార్యదర్శి అభయ్ కరాందికర్, తిరుపతి, మద్రాస్ ఐఐటీ డైరెక్టర్లు సత్యనారాయణ, కామకోటి, అమరావతి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు.కేవలం 8 నెలల్లోనే సాధించాంఅమరావతిలో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీస్ ఏర్పాటుచేయాలన్న ఆలోచన మొగ్గతొడిగాక.. ఎనిమిది నెలల్లోనే ఆచరణలోకి తెచ్చామని సీఎం తెలిపారు. ‘‘నేను అమరావతిలో క్వాంటమ్ కంప్యూటర్ తయారు చేయాలని చెప్పినప్పుడు... ఎవరి నుంచీ తగిన స్పందన లేదు. క్వాంటమ్ హార్డ్‌వేర్ తయారీదారులు, శాస్త్రవేత్తలతో సమావేశం నిర్వహించాక.. 4 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ రూపొందించడానికి కనీసం రెండేళ్లు పడుతుందన్నారు. ఇంకా వేగంగా చేయాలని చెబితే.. ప్రపంచ క్వాంటమ్ దినోత్సవం నాటికి సిద్ధం చేస్తామని చెప్పారు. మీ అందరిలో సామర్థ్యం ఉంది. చేయగలం అని గట్టిగా అనుకుంటే సాధిస్తారు. అదే స్ఫూర్తితో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేనాటికి.. అలాంటి కంప్యూటరే ఇక్కడ సిద్ధం చేయాలని కోరుతున్నాను. శాస్త్రవేత్తలు, విద్యావేత్తలు, మేధావులు ఆలోచించండి. ఇప్పుడు మన దగ్గర ‘ప్రూఫ్ ఆఫ్ కాన్సెప్ట్’ ఉంది. దాన్ని పెద్దస్థాయిలో చేయడమే మీ పని’’ అని చంద్రబాబు పేర్కొన్నారు.
April 16Apr 16 Author Amaravati: క్వాంటమ్ వ్యాలీ.. వడివడిగాABN , Publish Date - Nov 06 , 2025 | 03:57 AMరాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి.జనవరి 1న ప్రారంభోత్సవానికి సన్నాహాలు50 వేల మంది విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణవీరిలో 3 వేల మందికి అత్యున్నత శిక్షణ.. 100 మంది ఉన్నతపరిశోధకుల తయారీ.. శాశ్వత టాలెంట్ హబ్ ఏర్పాటే లక్ష్యంటీచింగ్ ల్యాబ్‌లపై 108 సంస్థల ప్రతిపాదనలు197 వర్సిటీల్లో శిక్షణ పొందిన 1,056 మంది ఫ్యాకల్టీ సిద్ధంఅమరావతి, నవంబరు 5 (ఆంధ్రజ్యోతి): రాజధాని అమరావతిలో క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీ వడివడిగా రూపుదిద్దుకుంటోంది. వచ్చే ఏడాది జనవరి 1న దీని ప్రారంభోత్సవానికి పెద్దఎత్తున సన్నాహాలు జరుగుతున్నాయి. పరస్పర సహకారం, గ్లోబల్ భాగస్వామ్యం ప్రాతిపదికన పలు అంతర్జాతీయ సాంకేతిక సంస్థలు జాతీయ స్థాయిలో తొలి క్వాంటమ్ కంప్యూటింగ్ ఎకోసిస్టమ్‌ను అభివృద్ధి చేసేలా కార్యాచరణ అమలు చేస్తున్నట్లు ప్రభుత్వ వర్గాలు బుధవారం ఓ ప్రకటనలో వెల్లడించాయి. అంతర్జాతీయ స్థాయిలో తొలి ఐదు క్వాంటమ్ హబ్‌లలో అమరావతి క్వాంటమ్ వ్యాలీ ఒకటిగా నిలుస్తుందని తెలిపాయి. రాష్ట్రం సంపూర్ణంగా క్వాంటమ్ సేవలను అందించే కేంద్రంగా మారుతుందని విశ్వాసం వ్యక్తంచేశాయి. సెమీకండక్టర్ల తయారీ, వినియోగం, కృత్రిమ మేధ ఆధారిత సేవలు, భవిష్యత్ తరాలకు ఏఐ/ఎంఎల్, సైబర్ సెక్యూరిటీ, ఆర్‌ఎఫ్ ఇంజనీరింగ్, క్వాంటమ్ మెటీరియల్స్‌లో రాష్ట్ర విద్యార్థులను నిపుణులుగా తీర్చిదిద్దడమే క్వాంటమ్ వ్యాలీ ఉద్దేశం.భాగస్వామ్య సంస్థ.. ప్రాజెక్టులివీ..అమెరికాకు చెందిన విసెర్ సంస్థ అమరావతిలో క్వాంటమ్ ట్యాలెంట్ హబ్‌ను నెలకొల్పుతుంది. 50 వేల మంది విద్యార్థులకు శిక్షణ ఇస్తుంది. 100 మంది అత్యున్నత స్థాయి పరిశోధకులను తయారుచేస్తుంది.ఎన్‌వీఐడీఐఏ సంస్థ ఏఐ, క్వాంటమ్ సిమ్యులేషన్ ప్లాట్‌ఫాంలను సమీకృతం చేస్తుంది. రాజధానిలో హైబ్రిడ్ సూపర్ కంప్యూటింగ్ స్టోరేజ్‌ను నిర్మిస్తుంది.ఏడబ్ల్యూఎస్ సంస్థ అమరావతి ఏడబ్ల్యూఎస్ యాక్సిలరేటర్‌ను ప్రారంభిస్తుంది. 50వేల మంది యువత, మహిళలకు ఏడబ్ల్యూఎస్ బ్రాకెట్ ద్వారా సర్టిఫికెట్లు జారీచేస్తుంది.క్వాంట్రోలాక్స్ సంస్థ రూ.25 కోట్లతో ‘విద్యాకర్’ ప్లాట్‌ఫాంను నిర్మిస్తుంది. ఇది ఓపెన్-ఆర్కిటెక్చర్ బెంచ్‌మార్క్ సిస్టమ్.పీక్యూ స్టేషన్ సంస్థ టెస్ట్‌బెడ్, డెమోల్యాబ్‌లతో కూడిన పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ హబ్‌ను నెలకొల్పుతుంది.ఈ సంస్థల సహకారంతో 50వేల మందికిపైగా విద్యార్థులకు మౌలిక క్వాంటమ్ నైపుణ్యాల్లో శిక్షణ ఇవ్వడం, వీరిలో 3వేల మందికి అత్యున్నత శిక్షణ, గ్లోబల్ పరిశోధన, అభివృద్ధికి 100మంది ఉన్నత పరిశోధకులను సన్నద్ధం చేయడం.. జాతీయ క్వాంటమ్ మిషన్, రాష్ట్ర క్వాంటమ్‌వ్యాలీకి ఉపకరించేలా శాశ్వత క్వాంటమ్ ట్యాలెంట్ హబ్ ఏర్పాటు లక్ష్యమని వెల్లడించాయి. 108 టీచింగ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు 108 సంస్థల నుంచి 134 ప్రతిపాదనలు, ఆల్గోరిథమ్ పరిశోధనకు 55 సంస్థల నుంచి 84 ప్రతిపాదనలు అందాయి. 197 వర్సిటీల్లో శిక్షణపొందిన 1,056మంది ఫ్యాకల్టీ సభ్యులు సిద్ధంగా ఉన్నారు. 137 కాలేజీల నుంచి 1,127 హ్యాకథాన్ ఆలోచనలు తీసుకున్నారు. ఇందులో 3 వేల మందికిపైగా విద్యార్థులు పాలుపంచుకున్నారు’ అని వివరించాయి. దిమిరా (ఐఐటీ-బోంబే), ఇండ్‌రోబో, రియలిస్టిక్, క్వాంట్రోల్ స్పియర్, క్యూరియం వంటి స్టార్ట్‌పలు భారత తొలి క్వాంటమ్ సప్లయ్-చైన్ జిల్లా కోసం కంట్రోల్ ఎలకా్ట్రనిక్స్, వైరింగ్ వ్యవస్థలు, యాంప్లిఫయర్లను అభివృద్ధి చేస్తున్నాయి. క్యుబిట్స్ నుంచి చిప్‌ల వరకు ప్రతి లేయర్‌ను అమరావతిలో డిజైన్ చేసి తయారుచేస్తాయి. ‘ఒక్క ఏడాదిలోనే భావన నుంచి అమలు స్థాయికి.. విజన్ నుంచి విలువైన భాగస్వామ్యాల వరకు ఏపీ ఎదిగింది’ అని రాష్ట్ర ఐటీ-ఎలకా్ట్రనిక్స్ శాఖ వర్గాలు తెలిపాయి. ‘వ్యవస్థల స్థాపన, పరికరాల తయారీ, విద్యార్థులకు శిక్షణ, టెక్నాలజీ ఎగుమతులు తదుపరి అధ్యాయం. డీఆర్‌డీవోతో భాగస్వామ్యం నుంచి క్వాంటమ్ ఫ్యాబ్ ప్రతిపాదన వరకు.. ఫిజిత్సుతో జాయింట్ వెంచర్, పాస్కల్ సభ అభివృద్ధి నుంచి వైజర్ ప్రారంభం దాకా ప్రతి కార్యాచరణా భారత క్వాంటమ్ ఫౌండేషన్‌కు ఒక్కో ఇటుకరాయిలాంటిది. 2030నాటికి అమరావతి కేవలం క్వాంటమ్ కంప్యూటర్లనే గాక యావత్ పరిశ్రమకే కేంద్రంగా ఆవిర్భవిస్తుంది’ అని పేర్కొన్నాయి. భారత్.. ప్రపంచం కోసం భవిష్యత్‌ను నిర్మించే క్రమంలో ఏపీ నిర్మాణ కేంద్రంగా మారుతుందని తెలిపాయి.
April 16Apr 16 Author https://investmentguruindia.com/newsdetail/amaravati-quantum-valley-to-position-india-as-next-gen-technology-leader436570
April 18Apr 18 Author క్వాంటమ్ వ్యాలీలో సంస్థల ఏర్పాటుకు అనుమతిBy Andhra Pradesh News DeskPublished : 18 Apr 2026 05:30 ISTEeFont size1 min readఈనాడు, అమరావతి: అమరావతి క్వాంటమ్ వ్యాలీలో హార్డ్‌వేర్, కాంపోనెంట్స్ తయారీ కేటగిరిలో క్యూఏఐజీ ప్రైవేట్ లిమిటెడ్ పరిశోధన కేంద్రం ఏర్పాటుకు అనుమతిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. క్వాంటమ్ కంప్యూటింగ్ పాలసీ కింద హార్డ్‌వేర్ అండ్ కాంపోనెంట్ మాన్యుఫ్యాక్చర్ కేటగిరీ కింద ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతించింది. ఆ సంస్థ పరిశోధన మరియు అభివృద్ధి, క్వాంటమ్ కంప్యూటింగ్ కమ్యూనికేషన్, సెన్సింగ్ తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయనుంది. నీ క్వాంటమ్ కంప్యూటింగ్ అప్లికేషన్స్ కేటగిరి కింద హెచ్‌పీసీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ సెటప్, ఆఫీస్ స్పేస్‌ను సెంటర్ ఫర్ డెవలప్‌మెంట్ ఆఫ్ అడ్వాన్స్‌డ్ కంప్యూటింగ్ (సి-డాక్)కు కేటాయించేందుకు అనుమతిస్తూ ఉత్తర్వులిచ్చింది. ఏపీ క్వాంటమ్ పాలసీ నిబంధన మేరకు ప్రోత్సాహకాలు చెల్లించేందుకు అనుమతించింది.
April 24Apr 24 Author క్వాంటమ్ వ్యాలీలో జంట టవర్లుBy Andhra Pradesh News DeskPublished : 24 Apr 2026 05:30 ISTరూ.1,208 కోట్లతో నిర్మాణంసీఆర్డీఏ సమావేశంలో ఆమోదంఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలోని క్వాంటమ్ వ్యాలీలో సీఆర్‌డీఏ రూ.1,208.41 కోట్లతో ట్విన్ టవర్లు నిర్మించనుంది. గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో జరిగిన సీఆర్‌డీఏ సమావేశం ఈ ప్రతిపాదనకు ఆమోదం తెలిపింది.
Create an account or sign in to comment