Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Quantum Computing Valley In Amaravati

Featured Replies

  • Replies 801
  • Views 37.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Game Changer dorikindhi CBN ki.. it will take a generation for AP people to understand what impact it will make to its economy and lives.. Tata + CBN.. has potential to create wonders

  • sonykongara
    sonykongara

    Ayana cheyyalani anukunnadi cheyyalani chusthadu, odipothe opdipotadu kani prayathnam apadu.

  • sonykongara
    sonykongara

    Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane..

Posted Images

  • Author

క్వాంటమ్‌’తో భవిష్యత్తు భేష్‌!

ABN , Publish Date - Apr 13 , 2026 | 04:50 AM

భవిష్యత్‌కు భరోసానిచ్చే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధనలకు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ వేదిక కానుంది. క్వాంటమ్‌ కంప్యూటర్‌ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెబుతున్నారు.

‘క్వాంటమ్‌’తో భవిష్యత్తు భేష్‌!

  • ప్రకృతి విపత్తులకు చక్కని పరిష్కారం

  • అంతుచిక్కని సమస్యలను తీర్చే మార్గం

  • మానవాళి మనుగడకు దివ్యౌషధం

  • రేపు క్వాంటమ్‌ రిఫరెన్సు ఫెసిలిటీ ప్రారంభం

  • ప్రపంచం ముందుకు స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్‌

  • గ్లోబల్‌ లీడర్‌గా అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ

  • (అమరావతి-ఆంధ్రజ్యోతి)

భవిష్యత్‌కు భరోసానిచ్చే క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ పరిశోధనలకు అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ వేదిక కానుంది. క్వాంటమ్‌ కంప్యూటర్‌ ప్రకృతి విపత్తులకు పరిష్కారం చూపుతుందని ఈ రంగంలో నిష్ణాతులు చెబుతున్నారు. కరోనా సమయంలో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ అందుబాబులో ఉండిఉంటే.. ఆ మహమ్మారిని అంతమొందించే పరిష్కారం చిటికెలో దొరికేదని చెబుతున్నారు. జీవన ప్రమాణాలను పెంచడంలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ అద్భుతంగా పనిచేస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. రోగాలకు కారణాలను లిప్తపాటులో గుర్తించి వాటిని నివారించే ఔషధాల తయారీకి సహకరిస్తుందని, మానవాళి మనుగడకు దివ్యౌషధంలా మారుతుందని చెబుతున్నారు. ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్‌ కంప్యూటర్‌ దినోత్సవం సందర్భంగా... క్వాంటమ్‌ రిఫరెన్సు ఫెసిలిటీ సెంటర్‌ ఇక్కడ ఏర్పాటు చేసేందుకు రంగం సిద్ధమైంది. క్వాంటమ్‌ కంప్యూటర్లు తయారు కావాలంటే టెస్ట్‌ బెడ్‌లు కావాలి. వాటినే రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ అంటారు. భారత్‌లో ఇప్పటివరకూ అవి ఎక్కడా లేవు. దేశంలోనే తొలిసారిగా అమరావతిలోనే ప్రారంభం కానున్నాయి. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటు చేస్తున్న దేశంలోని మొట్టమొదటి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌బెడ్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం ప్రారంభించనున్నారు.

Group%2011.svg


ప్రముఖ సంస్థల తోడ్పాటుతో..

ఎస్‌ఆర్‌ఎంలో ఏర్పాటు చేయనున్న క్వాంటమ్‌ కంప్యూటర్‌ను క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థ అధిపతి ఎల్‌. వెంకట సుబ్రహ్మణ్యంరూపొందించారు. ఎలకా్ట్రనిక్స్‌ విభాగంలో డాక్టరేట్‌ చేసిన వెంకట్‌కు క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో అపార అనుభవం ఉంది. ప్రస్తుతం క్వాంటమ్‌ ఇండియా లీడర్‌ సంస్థకు సేవలందిస్తున్నారు. ఐబీఎం మాస్టర్‌ ఇన్వెంటర్‌గా ప్రఖ్యాతిగాంచిన వెంకట్‌.. అమరావతి క్వాంటమ్‌ కంప్యూటింగ్‌లో సేవలందించాలని కోరిన వెంటనే ఆ దిశగా ఆలోచన చేశారు. దేశంలోని ప్రఖ్యాత సంస్థల తోడ్పాటుతో స్వదేశీ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారు చేశారు. దీనికోసం రూ.14కోట్ల దాకా వ్యయం అయినట్టు వెంకట్‌ వెల్లడించారు. మరోవైపు క్యూబీటెక్‌ స్మార్ట్‌ సొల్యూషన్‌కు చెందిన పినాక పృధ్వీ మెకానికల్‌ ఇంజనీరింగ్‌ చేశారు. హార్డ్‌వేర్‌ రంగంలోని పరిజ్ఞానంతో క్వాంటమ్‌ కంప్యూటింగ్‌ తయారీ, నిర్వహణపై దృష్టిసారించారు. క్యూబిటెక్‌ రూపొందించిన ఈ క్వాంటమ్‌ కంప్యూటర్‌ను గన్నవరం మేథా టవర్స్‌ వద్ద పరిశోధనా సౌలభ్యం కోసం ఉంచారు. క్వాంటమ్‌ కంప్యూటర్‌ అందుబాటులోకి వస్తే.. వైద్యరంగంలో పరిశోధనలు చేసేందుకు.. పరిష్కార మార్గాలు గుర్తించేందుకు ఉపయోగపడుతుందని నేషనల్‌ క్వాంటమ్‌ మిషన్‌ సభ్యుడు, సీనియర్‌ శాస్త్రవేత్త ప్రవీణ్‌ కుమార్‌ తెలిపారు. సంప్రదాయ కంప్యూటర్లతో పోలిస్తే దీని పనితీరు వేరుగా ఉంటుందన్నారు. రూ.14కోట్లతోనే క్వాంటమ్‌ కంప్యూటర్‌ను తయారుచేసిన అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ కి అప్పుడే విదేశాల నుంచి ఆఫర్లు వస్తున్నాయి. ఆ టెక్నాలజీ తమకు కావాలంటూ జర్మనీ తదితర దేశాలు కోరుతున్నాయని సాంకేతిక రంగ నిపుణుడు ఒకరు వివరించారు.


క్వాంటమ్‌ ఫెసిలిటీతో ఏపీలో టెక్‌ శకం

రేపు వన్‌ ఎస్‌, వన్‌ క్యూ క్వాంటమ్‌ టెస్ట్‌ బెడ్స్‌ ఆవిష్కరణ

అమరావతి, మంగళగిరి, ఏప్రిల్‌ 12(ఆంధ్రజ్యోతి): అమరావతి వేదికగా భారత క్వాంటమ్‌ విప్లవం ప్రారంభం కానుంది. ప్రపంచ క్వాంటమ్‌ దినోత్సవం సందర్భంగా 14న క్వాంటమ్‌ రిఫరెన్స్‌ పెసిలిటీ ఏర్పాటు కానుంది. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీలో ఏర్పాటు చేసిన వన్‌ ఎస్‌ క్వాంటమ్‌ టెస్ట్‌ బెడ్స్‌ను ప్రత్యక్షంగానూ.. గన్నవరంలోని మేధా టవర్స్‌లో ఏర్పాటుచేసిన వన్‌ క్యూ క్వాంటమ్‌ టెస్ట్‌ బెడ్స్‌ను సీఎం చంద్రబాబు వర్చువల్‌గా ప్రారంభిస్తారు. కాగా, సీఎం పర్యటన నేపథ్యంలో గుంటూరు జిల్లా జేసీ అశుతోశ్‌ శ్రీవాత్సవ ఎస్‌ఆర్‌ఎం వర్సిటీని సందర్శించారు. క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ ప్రారంభం అనంతరం జరిగే సభలోనూ సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. దీంతో ఈ రెండు వేదికలను జేసీ పరిశీలించారు.


  • Author

దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌.. ప్రారంభించిన సీఎం చంద్రబాబు

Eenadu icon

By Andhra Pradesh News TeamUpdated : 14 Apr 2026 14:57 IST

Ee

Font size

1 min read

140426cbnquantum1aa.webp

అమరావతి: దేశంలోనే తొలి క్వాంటం ఫెసిలిటీ సెంటర్‌ను సీఎం చంద్రబాబు ఆవిష్కరించారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ, గన్నవరం మేధాటవర్స్‌లో ఏర్పాటు చేసిన క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను ఎస్‌ఆర్‌ఎం వర్సిటీ నుంచి ఆయన ప్రారంభించారు. 1ఎస్‌, 1క్యూ క్వాంటం టెస్ట్‌బెడ్స్‌ను సీఎం జాతికి అంకితం చేశారు. దీంతో దేశంలోనే క్వాంటం టెస్ట్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ కలిగిన తొలి రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌ నిలిచింది.

దీనికి టాటా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫండమెంటల్‌ రీసెర్చ్‌ సహకారం అందించింది. ఈ కార్యక్రమానికి నేషనల్‌ క్వాంటం మిషన్‌ సభ్యులు సహా ఐఐటీ ప్రొఫెసర్లు, క్వాంటం రంగ శాస్త్రవేత్తలు, క్వాంటం ఇన్నోవేషన్‌ స్టార్టప్‌ల ప్రతినిధులు, రీసెర్చ్‌ స్కాలర్లు, నిపుణులు హాజరయ్యారు. ఏపీలోని వివిధ వర్సిటీలు, కాలేజీల నుంచి వర్చువల్‌గా వీక్షించేలా ఏర్పాట్లు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.5 లక్షల మంది విద్యార్థులు ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నారు.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.