Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Quantum Computing Valley In Amaravati

Featured Replies

  • Replies 801
  • Views 37.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • Game Changer dorikindhi CBN ki.. it will take a generation for AP people to understand what impact it will make to its economy and lives.. Tata + CBN.. has potential to create wonders

  • sonykongara
    sonykongara

    Ayana cheyyalani anukunnadi cheyyalani chusthadu, odipothe opdipotadu kani prayathnam apadu.

  • sonykongara
    sonykongara

    Paytm batch, Pink gorre lu, Pilla sainiklu ,BJYCP andaru gukka batti edusthunaru inka emi kakundane..

Posted Images

  • Author

అమరావతి క్వాంటం వ్యాలీలో 3 సంస్థల ఏర్పాటుకు ప్రోత్సాహక బోర్డు గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చింది

  • Author

మరో ముందడుగు

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 09 Apr 2026 04:33 IST

Ee

Font size

4 min read

అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లు
14న ప్రారంభించనున్న సీఎం చంద్రబాబు
భవిష్యత్తులో క్వాంటమ్‌ కంప్యూటర్లు, విడిభాగాలు
రాజధానిలో తయారు చేయాలన్నది లక్ష్యం

ap80426main1a.webp

ఈనాడు, అమరావతి: రాష్ట్ర రాజధాని అమరావతిని ప్రపంచస్థాయి క్వాంటమ్‌ హబ్‌గా తీర్చిదిద్దాలన్న లక్ష్యం దిశగా కీలకమైన ముందడుగు పడింది. దేశంలోనే తొలి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లు అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, విజయవాడలోని మేధాటవర్స్‌లోనూ ఏర్పాటవుతున్నాయి. భారత్‌ క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ (బీక్యూఆర్‌ఎఫ్‌)గా వ్యవహరిస్తున్న వీటిని ఈ నెల 14న ప్రపంచ క్వాంటమ్‌ దినోత్సవం సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రారంభిస్తారు. ఈ రెండుచోట్ల దేశీయ పరిజ్ఞానంతో తయారుచేసిన రెండు చిన్న క్వాంటమ్‌ కంప్యూటర్లను ఏర్పాటు చేస్తున్నారు. క్వాంటమ్‌ వ్యాలీ ఆలోచన మొగ్గతొడిగాక, ఆ రంగంలో విశేష నైపుణ్యం ఉన్న దేశ, విదేశీ నిపుణులతో స్టార్టప్‌ కంపెనీగా ఏర్పాటైన క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థ ఈ క్వాంటమ్‌ కంప్యూటర్లను రూపొందించింది. వాటిలో వినియోగించిన కీలకమైన హార్డ్‌వేర్‌ను ప్రముఖ ప్రభుత్వరంగ రక్షణ, శాస్త్రసాంకేతిక పరిశోధన సంస్థలతో పాటు, ప్రైవేటు సంస్థలు తయారుచేశాయి. టీఐఎఫ్‌ఆర్‌ ముంబయి, ఐఐఎస్‌సీ బెంగళూరు, డీఆర్‌డీఓ డీవైఎస్‌ఎల్‌ పుణె, ఆంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, క్యూట్‌ ఎలక్ట్రానిక్స్, దిమిరా సంస్థలు హార్డ్‌వేర్‌ను అందజేశాయి. ఎస్‌ఆర్‌ఎంలో క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థ స్వయంగా అమరావతి 1ఎస్‌ పేరుతో కంప్యూటర్‌ ఏర్పాటు చేస్తుండగా, ఆ సంస్థ తయారుచేసిన మరో కంప్యూటర్‌ను మేధాటవర్స్‌లో క్యూబిటెక్‌ సంస్థ అమరావతి 1క్యూ పేరుతో ఏర్పాటుచేస్తోంది. అమరావతి క్వాంటమ్‌ వ్యాలీ ఆలోచన 2025 ఆగస్టులో మొదలవగా... ఎనిమిది నెలల రికార్డు సమయంలో రెండు క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ ఏర్పాటుచేయడం విశేషం.

క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ తయారీకి ఊతం

అమరావతిలో అత్యాధునిక క్వాంటమ్‌ కంప్యూటర్ల ఏర్పాటుతో పాటు, రాబోయే రోజుల్లో పూర్తిస్థాయి క్వాంటమ్‌ కంప్యూటర్లను, విడిభాగాల్ని అక్కడే తయారుచేసి ఎగుమతి చేయాలన్నది ప్రభుత్వ సంకల్పం. గత ఏడాది సెప్టెంబరు 9న హార్డ్‌వేర్‌ విడిభాగాల తయారీదారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. క్వాంటమ్‌ విడిభాగాల టెస్టింగ్, వ్యాలిడేషన్, బెంచ్‌మార్కింగ్, సర్టిఫికేషన్‌ కోసం రిఫరెన్స్‌ సదుపాయాలు కావాలని వారు కోరారు. అమరావతిలో రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ను కల్పించాలన్న నిర్ణయం అప్పుడే జరిగింది. ఈ సదుపాయాలు రావడంతో అమరావతిలోనే క్వాంటమ్‌ పరికరాలు తయారుచేసేందుకు దేశంలోని పలు సంస్థలు ముందుకొచ్చే అవకాశం ఉంది. అమరావతి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ హబ్‌గా మారుతుంది. మన దేశంలో ప్రస్తుతం కొన్ని సంస్థలు క్వాంటమ్‌ విడిభాగాలు తయారుచేస్తున్నా, ప్రాసెసర్ల వంటివాటిని టెస్టింగ్‌ కోసం విదేశాలకు పంపాల్సి వస్తోంది. అక్కడ ఆరేడు నెలల సమయం పడుతోంది. అమెరికా వంటి కొన్ని దేశాలైతే వాటి టెస్టింగ్‌ సదుపాయాల్లో బయటి దేశాలకు అనుమతే ఇవ్వడం లేదు. అమరావతి రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌తో... క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ తయారీ రంగంలో భారత్‌ పెద్ద ముందడుగు వేస్తుంది.

దేశంలో ఎక్కడివారైనా వాడుకోవచ్చు

అమరావతిలో ఏర్పాటుచేస్తున్న రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ను కేవలం క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్టింగ్‌ కోసమే కాకుండా, దేశంలోని పరిశోధకులు, స్టార్టప్‌ కంపెనీలు, పరిశ్రమలు, యూనివర్సిటీలు, విద్యార్థులు వినియోగించుకోవచ్చు. క్వాంటమ్‌ టెక్నాలజీని ఇంత వరకు పాఠ్యపుస్తకాల్లో చదివి, సిమ్యులేటర్లపైనే ప్రయోగాలు చేస్తున్న విద్యార్థులు... ఇకపై నేరుగా క్వాంటమ్‌ కంప్యూటర్లపై ప్రయోగాలు చేయవచ్చు. ఎస్‌ఆర్‌ఎం, మేధాటవర్స్‌లో ఏర్పాటు చేస్తున్న రిఫరెన్స్‌ ఫెసిలిటీల్లో... 111 క్యూబిట్స్‌ వరకు క్వాంటమ్‌ ప్రాసెసర్‌లను పరీక్షించవచ్చు. రాబోయే పదేళ్లలో మిలియన్‌ క్యూబిట్స్‌ వరకు టెస్టింగ్‌ సదుపాయాన్ని అభివృద్ధి చేయాలని క్యూబిట్‌ ఫోర్స్‌ లక్ష్యంగా పెట్టుకుంది. 

క్రయోజెనిక్‌ డైల్యూషన్‌ రిఫ్రిజిరేటర్‌ తయారీ మేలు మలుపు 

  • క్వాంటమ్‌ కంప్యూటర్లలో ప్రాసెసర్లు ఎంత కీలకమో, డైల్యూషన్‌ క్రయోజెనిక్‌ రిఫ్రిజిరేటర్లూ అంతే కీలకం. క్వాంటమ్‌ కంప్యూటర్లలో -273 డిగ్రీల సెల్సియస్‌ ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు డైల్యూషన్‌ రిఫ్రిజరేటర్లను వినియోగిస్తారు. వీటిలో హీలియం-3, హీలియం-4 వాయువుల్ని వాడతారు. అమరావతి రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌లో ఏర్పాటుచేస్తున్న కంప్యూటర్లలో హీలియం-4 వాయువుల్ని వినియోగించారు. దానితో ఉష్ణోగ్రతను -269 నుంచి -272 డిగ్రీల వరకు తగ్గించవచ్చు. హీలియం-3 వాయువు చాలా అరుదుగా దొరుకుతుంది. మన దేశంలోని రక్షణరంగ పరిశోధన సంస్థల దగ్గరే అందుబాటులో ఉంది.   

  • అమరావతి క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ కోసం తయారు చేసిన క్రయోజెనిక్స్, ప్రిసిషన్, ఎలక్ట్రానిక్స్‌ సిస్టమ్స్, క్వాంటమ్‌ గ్రేడ్‌ ఫ్యాబ్రికేషన్‌ పరికరాలు, సదుపాయాలు కేవలం క్వాంటమ్‌ కంప్యూటర్ల తయారీకే కాకుండా, రక్షణ, ఆరోగ్య, సెమీకండక్టర్‌ తయారీ వంటి రంగాలకూ ఉపయోగపడతాయని నిపుణులు చెబుతున్నారు.

  • క్రయోజెనిక్‌ సిస్టమ్స్‌ను ఎంఆర్‌ఐ మెషీన్లు, స్పేస్‌ అప్లికేషన్లలో వినియోగిస్తారు. ప్రెసిషన్‌ ఎలక్ట్రానిక్స్‌... డిఫెన్స్‌ సెన్సింగ్, రాడార్‌ సిస్టమ్స్, అడ్వాన్స్‌డ్‌ ఇన్‌స్ట్రుమెంటేషన్‌కు ఉపయోగపడుతుంది.

  • క్వాంటమ్‌గ్రేడ్‌ ఫ్యాబ్రికేషన్‌ సదుపాయాలను... సెమీకండక్టర్ల తయారీ, డీప్‌టెక్‌ ఇండస్ట్రియల్‌ అప్లికేషన్లలో వినియోగిస్తారు.


ప్రముఖ సంస్థల తలోచేయి

  • దేశంలోని ఆరు నగరాలకు చెందిన సంస్థలు తయారుచేసిన క్వాంటమ్‌ విడిభాగాల్ని అమరావతికి తీసుకొచ్చి... వాటిని క్యూబిట్‌ ఫోర్స్‌ సంస్థ అసెంబుల్‌ చేస్తోంది.

  • వాటికి కావలసిన ప్రాసెసర్‌లను టీఐఎఫ్‌ఆర్‌ ముంబయి, ఐఐఎస్‌సీ బెంగళూరు తయారు చేశాయి.

  • పుణెలోని డీఆర్‌డీవో ల్యాబ్‌ క్వాంటమ్‌ కంట్రోల్‌ ఎలక్ట్రానిక్స్‌ను అందజేసింది. 

  • ఆంబర్‌ ఎంటర్‌ప్రైజెస్, క్యూబిట్‌ఫోర్స్‌ సంస్థలు..అత్యంత కీలకమైన డైల్యూషన్‌ రిఫ్రిజిరేటర్లను తయారుచేశాయి. 

  • క్యూట్‌ ఎలక్ట్రానిక్స్‌ సంస్థ ప్రిసిషన్‌ కరెంట్‌ అండ్‌ వోల్టేజ్‌ సోర్సెస్‌ను అందజేసింది.

  • దిమిరా సంస్థ ఫ్లెక్స్‌ కేబుళ్లు, క్రయోజెనిక్‌ వైరింగ్‌ను సమకూర్చింది.

  • సిస్టమ్‌ ఇంటిగ్రేషన్, అసెంబ్లింగ్, టెస్టింగ్‌ బాధ్యతలను క్యూబిట్‌ ఫోర్స్‌ నిర్వహిస్తోంది.

  • Author

క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌లోనూ ముందుండాలన్నదే లక్ష్యం

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 10 Apr 2026 05:34 IST

Ee

Font size

2 min read

అమరావతిలో పూర్తిస్థాయి క్వాంటమ్‌ ఎకోసిస్టమ్‌
ఎస్‌ఆర్‌ఎం, మేధాటవర్స్‌లో దేశంలోనే తొలి క్వాంటమ్‌ టెస్ట్‌బెడ్‌లు
ఐదేళ్లలో 45 లక్షల మందికి శిక్షణ
ముఖ్యమంత్రి కార్యదర్శి ప్రద్యుమ్న వెల్లడి

100426apmain19a.webp

ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో క్వాంటమ్‌ సాఫ్ట్‌వేర్‌తో పాటు, హార్డ్‌వేర్‌ విడిభాగాల తయారీ, నైపుణ్య శిక్షణ, పరిశోధనలకు పూర్తిస్థాయి ఎకోసిస్టమ్‌ అభివృద్ధి చేయనున్నట్టు ముఖ్యమంత్రి కార్యదర్శి పీఎస్‌ ప్రద్యుమ్న తెలిపారు. ‘‘సాఫ్ట్‌వేర్‌ రంగంలో తెలుగువారు అద్భుతాలు చేశారు. కానీ హార్డ్‌వేర్‌లో వెనుకబడ్డాం. క్వాంటమ్‌ విషయంలో ఆ లోపం జరగకూడదన్నది సీఎం ఉద్దేశం. అందుకే క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ విడిభాగాల తయారీ సైతం అమరావతిలోనే జరగాలని నిర్దేశించారు. క్వాంటమ్‌ కంప్యూటర్లు తయారు చేయాలంటే టెస్ట్‌బెడ్‌లు కావాలి. వాటినే రిఫరెన్స్‌ ఫెసిలిటీస్‌ అంటారు. ఇప్పటివరకు దేశంలో అవెక్కడా లేవు. అమరావతిలో ఇప్పుడు మనం ప్రారంభిస్తున్నాం’’ అని ఆయన తెలిపారు. అమరావతిలోని ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ, గన్నవరంలోని మేధాటవర్స్‌లో ఏర్పాటుచేస్తున్న దేశంలోనే మొదటి క్వాంటమ్‌ హార్డ్‌వేర్‌ టెస్ట్‌ బెడ్‌లను ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 14న ప్రారంభిస్తారని వివరించారు. 80%పైగా దేశీయంగా తయారుచేసిన హార్డ్‌వేర్‌ విడిభాగాలతో రూపొందించిన రెండు చిన్న క్వాంటమ్‌ కంప్యూటర్లను ఆ రెండు చోట్లా ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం, మేధాటవర్స్‌లో వాటి అసెంబ్లింగ్‌ ప్రక్రియను మార్చి 30న ప్రారంభించారని చెప్పారు. శుక్రవారం ఆయన ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీ వైస్‌ఛాన్స్‌లర్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్, హార్డ్‌వేర్‌ టెస్ట్‌బెడ్‌లు ఏర్పాటుచేయనున్న క్యూబిట్‌ఫోర్స్‌ వ్యవస్థాపకుడు వెంకట్, క్యూబిటెక్‌ సంస్థ సీఈఓ పృథ్వి, రాష్ట్ర సమాచార, పౌర సంబంధాలశాఖ కమిషనర్‌ విశ్వనాథన్‌లతో కలసి విలేకర్లతో మాట్లాడారు. 

ఐదేళ్లలో 45 లక్షల మందికి శిక్షణ 

అమరావతిలో వివిధ సంస్థల భాగస్వామ్యంతో క్వాంటమ్‌ కోర్సుల్లో పెద్ద ఎత్తున శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు ప్రద్యుమ్న తెలిపారు. 10 లక్షల మందికి ఐబీఎం, 35 లక్షల మందికి వైజర్‌ సంస్థలు శిక్షణ ఇస్తాయన్నారు. చెన్నై ఐఐటీ నిర్వహిస్తున్న అడ్వాన్స్డ్‌ కోర్సులో 2.04 లక్షల మంది నమోదు చేసుకుంటే, వారిలో 1.04 లక్షల మంది తెలుగువారే ఉన్నారని తెలిపారు.

ఎస్‌ఎఆర్‌ఎంలో డైమండ్‌ క్యూబిట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ 

దేశంలోనే క్వాంటమ్‌ కంప్యూటర్‌ కలిగిన మొదటి యూనివర్సిటీగా ఎస్‌ఆర్‌ఎం చరిత్ర సృష్టిస్తోందని వైస్‌ఛాన్స్‌లర్‌ సీహెచ్‌ సతీష్‌కుమార్‌ తెలిపారు. ‘‘మా యూనివర్సిటీలో క్వాంటమ్‌ కంప్యూటర్‌ అసెంబ్లింగ్‌లో మా విద్యార్థులూ భాగస్వాములయ్యారు. ఇతర ప్రాంతాల నుంచి విద్యార్థులు వచ్చి క్వాంటమ్‌ కంప్యూటర్‌ని ఆసక్తిగా చూస్తున్నారు. యూనివర్సిటీలో క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీతో పాటు డైమండ్‌ క్యూబిట్‌ రీసెర్చ్‌ ల్యాబ్‌ పెడుతున్నాం. ఎన్‌విడియా ఏఐ ల్యాబ్, ఫ్యాబ్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేస్తున్నాం. అంతర్జాతీయ ప్రమాణాలతో మానవ వనరుల్ని అభివృద్ధి చేసేందుకు ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎమర్జింగ్‌ టెక్నాలజీస్‌ ఏర్పాటు చేయనున్నాం’’ అని వివరించారు.


ఇది ప్రారంభమే

‘‘ఇంత పెద్ద దేశంలో క్వాంటమ్‌ రంగ పరిణామాలన్నీ అమరావతిలోనే శరవేగంగా జరుగుతున్నాయి. సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్, నైపుణ్యాభివృద్ధి.. ఇలా క్వాంటమ్‌ రంగానికి సంబంధించి పూర్తి ఎకోసిస్టమ్‌ ఇక్కడ అభివృద్ధి చెందుతోంది. యూనివర్సిటీలు భాగస్వాములవుతున్నాయి. క్వాంటమ్‌ రిఫరెన్స్‌ ఫెసిలిటీ ఒక ప్రారంభం మాత్రమే. 2026లో మరిన్ని అద్భుతాలు జరగబోతున్నాయి’’ అని వెంకట్‌ తెలిపారు.

వెంకట్, క్వాంటమ్‌ నిపుణుడు, క్యూబిట్‌ ఫోర్స్‌ వ్యవస్థాపకుడు

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.