March 22Mar 22 Author అమరావతికి ‘క్వాంటమ్’ కళ By Andhra Pradesh News DeskPublished : 22 Mar 2026 04:19 IST Ee Font size 4 min read చురుగ్గా భవన నిర్మాణ పనులు 44 అంతస్తుల టవర్లు రెండు నిర్మించనున్న ప్రభుత్వం డిసెంబరు నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు మేధాటవర్స్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల్లో శిక్షణ, టెస్టింగ్ కోసం రిఫరెన్స్ ఫెసిలిటీ ఇప్పటికే ఐదు స్టార్టప్‌లు రాక... వచ్చే రెండు నెలల్లో మరో 25 ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిని దేశంలోనే మొదటి క్వాంటమ్ టెక్నాలజీ హబ్‌గా తీర్చిదిద్దే దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ ఏడాది నవంబరు లేదా డిసెంబరు నాటికి ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన క్వాంటమ్ కంప్యూటర్‌ని అమరావతిలో ఏర్పాటు చేయబోతున్నారు. కేవలం క్వాంటమ్ కంప్యూటర్లను ఏర్పాటు చేయడమే కాకుండా, అమరావతిలోనే క్వాంటమ్ కంప్యూటర్లను తయారు చేసి...విదేశాలకు ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ పనిచేస్తోంది. క్వాంటమ్ కంప్యూటింగ్‌తో పాటు, క్వాంటమ్ సెక్యూరిటీ, సెన్సింగ్, మెటీరియల్ రంగాలకు సంబంధించిన అన్ని టెక్నాలజీలకు అమరావతి క్వాంటమ్ వ్యాలీని హబ్‌గా మార్చాలన్నది యోచన. ఈ నాలుగు రంగాలకు సంబంధించిన స్టార్టప్, భాగస్వామ్య కంపెనీలను అమరావతికి ఆహ్వానిస్తున్నారు. ఇప్పటికే ఐదు స్టార్టప్‌లు కార్యకలాపాలు ప్రారంభించాయి. వచ్చే రెండు నెలల్లో మరో 20-25 స్టార్టప్ కంపెనీలు ఇక్కడికి వచ్చే అవకాశం ఉంది. వాటికి ప్రస్తుతానికి గన్నవరంలోని మేధాటవర్స్‌లో చోటు కల్పిస్తున్నారు. అమరావతిలో క్వాంటమ్ వ్యాలీకి ప్రభుత్వం 50 ఎకరాలు కేటాయించింది. దానిలో రెండు ఎకరాల్లో రూ.137 కోట్లతో నిర్మిస్తున్న అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) పనులు చురుగ్గా జరుగుతున్నాయి. జీ+1 విధానంలో, 40 వేల చ.అడుగులు నిర్మితప్రాంతంతో దీన్ని కడుతున్నారు. వచ్చే సెప్టెంబరు లేదా అక్టోబరు నాటికి నిర్మాణం పూర్తి చేయాలన్నది లక్ష్యం. ఏక్యూసీసీ భవనం అనేక విశేషాల సమాహారం. క్వాంటమ్ కంప్యూటర్‌కు అత్యంత స్థిరమైన వాతావరణం ఉండాలి. వాహనాలు వెళ్లేటప్పుడు ఏర్పడే వైబ్రేషన్ల ఫ్రీక్వెన్సీ గరిష్ఠంగా 70-80 హెర్ట్జ్ ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసిన ప్రాంతంలో ఆ స్థాయి వైబ్రేషన్లు కూడా ఉండటానికి వీల్లేదు. 2-100 హెర్ట్జ్ ఫ్రీక్వెన్సీ వైబ్రేషన్లు ఉన్నా... క్వాంటమ్ కంప్యూటర్‌పై ప్రభావంపడని విధంగా ఏక్యూసీసీ భవనాన్ని నిర్మిస్తున్నారు. దీని కోసం వైబ్రేషన్ ఐసొలేటర్లను జర్మనీ నుంచి తెప్పిస్తున్నారు. క్వాంటమ్ కంప్యూటర్ లోపల మాత్రం -273 డిగ్రీల ఉష్ణోగ్రత నిర్వహించాలి. ఇది అంతరిక్షంలో కంటే తక్కువ ఉష్ణోగ్రత. అంత తక్కువ ఉష్ణోగ్రతను నిర్వహించేందుకు డైల్యూషన్ రిఫ్రిజరేటర్లను వాడతారు. ఈ భవన నిర్మాణం పూర్తయ్యాక దానిలో ఐబీఎం సంస్థ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేస్తుంది. కొన్ని ముఖ్యమైన స్టార్టప్‌లకు కూడా ఈ భవనంలో చోటు కల్పిస్తారు. రెండు టవర్లకు త్వరలో టెండర్లు అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏక్యూసీసీ భవనంతో పాటు..44 అంతస్తుల టవర్లు ఎనిమిది నిర్మించాలన్నది ప్రతిపాదన. వాటిలో రెండు టవర్లను సీఆర్‌డీఏ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిర్మించనుంది. మొత్తం 8 టవర్లలో కలిపి 90 లక్షల చదరపు అడుగుల నిర్మిత ప్రాంతం అందుబాటులోకి తేవాలని, మొత్తం 88 వేల మందికి ఉద్యోగావకాశాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. ఏక్యూసీసీ భవనంలో ఐబీఎం సంస్థ ప్రపంచంలోనే అత్యాధునిక, అత్యంత వేగవంతమైన ప్రాసెసర్‌తో కూడిన క్వాంటమ్ కంప్యూటర్‌ని ఏర్పాటు చేయనుంది. 156 క్యూబిట్స్ క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటుకు ఐబీఎం సంస్థతో మొదట ఒప్పందం జరిగింది. భవన నిర్మాణం అనుకున్న సమయానికంటే ఆలస్యమవడంతో, ఈ ఏడాది కాలంలో ఐబీఎం మరింత అత్యాధునిక క్వాంటమ్ ప్రాసెసర్‌ను తయారు చేసింది. ‘క్యూబిట్ లోపల ఒక ఆర్కిటెక్చర్ ఉంటుంది. ఎన్ని బిట్స్ ఒకదానికి ఒకటి కనెక్ట్ అవుతాయన్నదాన్నిబట్టి ప్రాసెసర్ వేగం ఆధారపడి ఉంటుంది. ఐబీఎం ఇప్పుడు తయారు చేస్తున్న 120 క్యూబిట్స్ ప్రాసెసర్‌లో...ఎక్కువ క్యూబిట్స్ కనెక్ట్ చేస్తున్నారు. అది అత్యంత అధునాతనమైంది. అమరావతిలో దాన్నే ఏర్పాటు చేస్తామని చెబుతున్నారు’ అని అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ సి.వి.శ్రీధర్ ‘ఈనాడు’కి తెలిపారు. ఎస్‌ఆర్‌ఎం, మేధాటవర్స్‌లో చిన్న క్వాంటమ్ కంప్యూటర్లు గన్నవరంలోని మేధాటవర్స్, ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటీల్లో క్వాంటమ్ రిఫరెన్స్ ఫెసిలిటీలను ఏర్పాటు చేయనున్నారు. మేధాటవర్‌లో ఏప్రిల్ 14న ప్రారంభిస్తారు. రిఫరెన్స్ ఫెసిలిటీలో చిన్నస్థాయి క్వాంటమ్ కంప్యూటర్లు ఉంటాయి. వాటిని క్వాంటమ్ కంప్యూటర్ విడిభాగాల (కాంపొనెంట్స్) టెస్టింగ్, హార్డ్‌వేర్‌లో శిక్షణ కోసం వినియోగిస్తారు. మేధాటవర్స్ మొదటి అంతస్తులో క్యూబిటెక్ సంస్థ రిఫరెన్స్ ఫెసిలిటీ ఏర్పాటు చేస్తుండగా, ఎస్‌ఆర్‌ఎం సంస్థ సొంతగా నెలకొల్పుతోంది. మేధాటవర్స్‌లోని మూడు, నాలుగు అంతస్తుల్లో ప్రస్తుతానికి క్వాంటమ్ వ్యాలీ మిషన్ కార్యాలయంతో పాటు, స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేయనున్నారు. ఇతర క్వాంటమ్ టెక్నాలజీ సంస్థలతోను సంప్రదింపులు అమరావతిలో ఐబీఎం ఏర్పాటు చేయనున్న క్వాంటమ్ కంప్యూటర్ సూపర్ కండక్టింగ్ టెక్నాలజీతో పనిచేస్తుంది. ప్రపంచంలో మరికొన్ని సంస్థలు న్యూట్రల్ ఆటమ్, అయాన్‌ట్రాప్, ఫొటానిక్ వంటి టెక్నాలజీలతో పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్లను అభివృద్ధి చేశాయి. వాటితోనూ సంప్రదింపులు జరుపుతున్నామని, ఆ సంస్థలు ముందుకొస్తే... ఆయా టెక్నాలజీలతో పనిచేసే క్వాంటమ్ కంప్యూటర్లను అమరావతిలో ఏర్పాటు చేస్తామని శ్రీధర్ తెలిపారు. అంతర్జాతీయ నిపుణులు కలసి ఏర్పాటు చేసిన క్యూబిట్‌ఫోర్స్ భవిష్యత్తులో అమరావతి నుంచి క్వాంటమ్ కంప్యూటర్లను ఎగుమతి చేయాలన్న లక్ష్యంతో ప్రపంచంలోని ప్రముఖ కంపెనీల్లో పనిచేస్తున్న కొందరు క్వాంటమ్ టెక్నాలజీ నిపుణులు కలసి క్యూబిట్‌ఫోర్స్ కంపెనీ ఏర్పాటు చేశారు. ఇది అమరావతి కేంద్రంగానే పనిచేయనుంది. క్వాంటమ్ హార్డ్‌వేర్, మాన్యుఫ్యాక్చరింగ్ ఎకోసిస్టమ్‌ను ఈ కంపెనీ అభివృద్ధి చేస్తుంది.
March 31Mar 31 Author The HinduA.P. CM unveils plan to position Amaravati as quantum har...A.P. CM unveils plans for Amaravati to become a global quantum hardware hub, fostering innovation and technology by 2030.
March 31Mar 31 Author Made in Amaravati’ Quantum Hardware Push Gains MomentumAndhra Pradesh aims to become one of the world’s top five global quantum hubs by 2030By : MD IlyasUpdate: 2026-03-31 16:36 GMTChief Minister N Chandrababu Naidu addressing at the Round Table on Quantum Hardware Manufacturing Eco System by Amaravati Quantum Valley at the Secretariat on Tuesday. Photo BY ARRANGEMENT.Vijayawada: Chief Minister N. Chandrababu Naidu on Tuesday outlined an ambitious vision to transform Amaravati into a global hub for quantum computing, asserting that the state is leveraging a “first-mover advantage” in cutting-edge technologies to drive future growth.Naidu said Andhra Pradesh is positioning itself at the forefront of next-generation technology with an ambitious push to develop a “Made in Amaravati” quantum hardware ecosystem.Addressing a roundtable meeting at the secretariat on the quantum hardware production ecosystem in Amaravati Quantum Valley, the Chief Minister said the state has aligned itself with the National Quantum Mission and taken the lead in establishing the Amaravati Quantum Valley (AQV). The Amaravati Quantum Valley would provide a new direction to the nation and act as a catalyst for technological progress, he said.Naidu called upon industry leaders, researchers and policymakers to chart a clear roadmap for indigenous production of quantum computing equipment within the next two years.The meeting was attended by national quantum mission director JBV Reddy, state quantum mission director C.V. Sridhar, IBM director Amit Singhi, and representatives from institutions such as CDAC, CDOT, DRDO, NSTL and BARC, along with industry players and leading academicians.The Chief Minister said the government aims to transform Andhra Pradesh into one of the world’s top five global quantum hubs by 2030. He emphasised the need to build a comprehensive ecosystem in Amaravati, encompassing advanced infrastructure, hardware manufacturing capabilities, algorithm development, and a vibrant startup culture supported by biofoundries and cutting-edge research initiatives.Highlighting the state’s “first-mover advantage”, the CM drew parallels with the IT revolution, noting how early investments helped create a strong knowledge economy. He said Andhra Pradesh is now focusing on developing a skilled workforce in quantum technologies through collaborations with global firms like IBM and academic institutions. Emerging technologies would soon enable citizen-centric services such as AI doctors, AI tutors and AI agronomists.Naidu announced that India’s first open quantum computer would be launched in Amaravati on April 14, making it accessible to students and researchers for testing and experimentation. Officials said the facility, being developed with support from industry and academia, would significantly boost innovation and research in the sector.More than 30 quantum technology companies participated in the roundtable, with 15 already signing MoUs with the state government. Seven firms have begun operations at Medha Towers in Vijayawada, where a temporary quantum mission office is already functional.The Chief Minister reiterated that reducing dependence on imports and building domestic capabilities in quantum hardware, cryogenics, photonics and advanced algorithms remains a key priority, envisioning Amaravati as a future-ready, globally competitive and highly liveable city driven by advanced technologies.
March 31Mar 31 Author Deccan Chronicle‘Made in Amaravati’ Quantum Hardware Push Gains MomentumAndhra Pradesh aims to become one of the world’s top five global quantum hubs by 2030
April 4Apr 4 Author క్వాంటమ్‌తో కొత్త కళ!By Andhra Pradesh News DeskUpdated : 04 Apr 2026 05:44 ISTEeFont size4 min readడిసెంబరు నాటికి అత్యాధునిక కంప్యూటర్ ఏర్పాటు అమరావతిలో క్వాంటమ్-ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ పరిశ్రమల అవసరాల కోసం యూజ్ కేసులు మూడేళ్లలో 100 క్వాంటమ్ అల్గారిథమ్స్.. 5వేల మందిని నిపుణులుగా తీర్చిదిద్దడం లక్ష్యం100 స్టార్టప్ కంపెనీల ఏర్పాటుఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో వచ్చే నవంబరు/డిసెంబరుకు క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడంతో పాటు.. క్వాంటమ్, ఏఐ టెక్నాలజీల పరిశోధనలు, అల్గారిథమ్స్, యూజ్ కేసుల రూపకల్పనలో రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలపాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అమరావతి క్వాంటమ్ వ్యాలీ(ఏక్యూవీ) ఆధ్వర్యంలో ‘క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్ (క్యూఏఐసీ)’ను ఏర్పాటు చేస్తోంది. వచ్చే మూడేళ్లలో 100 క్వాంటమ్-ఏఐ అల్గారిథమ్స్, యూజ్ కేసులు అభివృద్ధి చేయడం, 5 వేల మంది విద్యార్థుల్ని క్వాంటమ్ అల్గారిథమ్స్ రాయడంలో నిపుణులుగా తీర్చిదిద్దడం, క్వాంటమ్ టెక్నాలజీపై 600 మందికిపైగా అధ్యాపకులకు శిక్షణ ఇవ్వడం, 100 స్టార్టప్‌లు ప్రారంభమయ్యేలా చూడటం, 100 పత్రాల ప్రచురణ, వందకుపైగా పేటెంట్‌లు సాధించడం, 50కి పైగా పరిశ్రమలతో భాగస్వామ్యం క్యూఏఐసీ ప్రధాన లక్ష్యాలు.దీనికి నలుగురు నుంచి ఆరుగురు సభ్యులతో సలహా కమిటీ ఉంటుంది. అందులో పరిశ్రమలు, స్టార్టప్‌లు, విద్యాసంస్థల నిపుణుల్ని సభ్యులుగా నియమిస్తారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీ మిషన్ డైరెక్టర్ అధ్యక్షతన గవర్నింగ్ కౌన్సిల్ ఏర్పాటవుతుంది. దానిలో ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలల ప్రొఫెసర్లు, ఐబీఎం సంస్థ ప్రతినిధులు, రాష్ట్రంలోని 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్ నుంచి నలుగురు ప్రతినిధులు సభ్యులుగా ఉంటారు. ప్రస్తుతం గన్నవరంలోని మేధాటవర్స్ నుంచి, అమరావతిలో క్వాంటమ్ వ్యాలీ భవన నిర్మాణం పూర్తయ్యాక అక్కడి నుంచి ఇన్నోవేషన్ సెంటర్ పనిచేస్తుంది. ఏడాదికి 365 గంటల క్వాంటమ్ క్రెడిట్స్ఐబీఎం వంటి సంస్థలు క్వాంటమ్ కంప్యూటర్లను వినియోగించుకున్నందుకు నిమిషానికి ఇంత మొత్తమని ఛార్జీ వసూలు చేస్తాయి. ప్రస్తుతం ఒకేసారి 5,400 నిమిషాల సమయం కొనుగోలు చేస్తే.. ఐబీఎం నిమిషానికి 48 డాలర్లు వసూలు చేస్తోంది. ఏడాదిలోగా ఆ సమయాన్ని వాడేసుకోవాలి. 10 నిమిషాలు.. 20 నిమిషాలు.. ఇలా తక్కువ సమయం కావాలనుకున్న వారి నుంచి నిమిషానికి 96 డాలర్లు చొప్పున వసూలు చేస్తోంది. ఇలా నిమిషాల లెక్కన కేటాయించే సమయాన్ని క్వాంటమ్ క్రెడిట్స్ అంటారు. అమరావతిలో ఏర్పాటు చేసే 133 క్యూబిట్ హెరాన్ ప్రాసెసర్ క్వాంటమ్ కంప్యూటర్‌కూ ఐబీఎం ఇవే ధరల్ని నిర్ణయించే అవకాశముంది. అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటర్‌ను రోజుకు గంట చొప్పున ఉచితంగా వాడుకునేందుకు.. అమరావతి క్వాంటమ్ వ్యాలీ(ఏక్యూవీ)కి ఐబీఎం అవకాశమివ్వాలన్నది ఒప్పందంలో భాగం. ఐబీఎం ఉచితంగా ఇచ్చిన ఆ క్వాంటమ్ క్రెడిట్స్‌ను.. ‘క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ సెంటర్’ రూపొందించిన అల్గారిథమ్స్‌ను రన్ చేసేందుకు, యూజ్ కేసులను సిద్ధం చేసేందుకు వినియోగిస్తారు. ఐబీఎం ఉచితంగా ఇచ్చే సమయాన్ని వినియోగించుకుంటూ, ఇంకా అవసరమైతే క్వాంటమ్ క్రెడిట్స్‌ను కొంటారు.ఎంపిక చేసిన ప్రొఫెసర్లతో... క్యూఏఐసీలో రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ, ప్రైవేటు యూనివర్సిటీలు, కళాశాలలకు చెందిన ఎంపిక చేసిన అధ్యాపకుల్ని, స్టార్టప్ కంపెనీల్ని, రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 380 క్వాంటమ్ ఇన్నోవేషన్ సెల్స్ నుంచి కొందరు ప్రతినిధుల్ని భాగస్వాముల్ని చేస్తున్నారు. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఫిజిక్స్, మేథమేటిక్స్, కెమిస్ట్రీ ఇలా వివిధ విభాగాల ప్రొఫెసర్లను నియమిస్తున్నారు. వారితో ఇటీవల ఒక వర్క్‌షాప్ నిర్వహించారు. ఇన్నోవేషన్ సెంటర్ ఆధ్వర్యంలో పనిచేసే ప్రొఫెసర్లకు... ప్రభుత్వ సంస్థలు, పరిశ్రమలు తీసుకొచ్చిన సమస్యల్ని (ప్రాబ్లం స్టేట్‌మెంట్స్) ఇచ్చి వాటికి వారి విద్యార్థులతో కలిసి పరిష్కారం కనుగొని, యూజ్ కేసులు రూపొందించాలని సూచిస్తారు. మొదట చిన్న అల్గారిథమ్ రాసి, దాన్ని సంప్రదాయ కంప్యూటర్లలో సిములేటర్‌పై రన్ చేస్తారు. ఫలితం బాగుంటే... పూర్తిస్థాయి అల్గారిథమ్‌ను క్వాంటమ్ కంప్యూటర్‌పై రన్ చేస్తారు. ప్రొఫెసర్లకు క్వాంటమ్ క్రెడిట్స్ ప్రొవైడ్ చేయడంతో పాటు, టెక్నాలజీల్లో వారికి శిక్షణ ఇస్తారు. ఆయా యూనివర్సిటీలు, కళాశాలల్లో క్వాంటమ్ ల్యాబ్‌ల ఏర్పాటుకు సహకరిస్తారు. ప్రొఫెసర్ల ద్వారా విద్యార్థులకు శిక్షణనిచ్చి, వారు స్టార్టప్‌లు ఏర్పాటు చేసేలా ప్రోత్సహిస్తారు. మొత్తంగా క్వాంటమ్ టెక్నాలజీలకు సంబంధించి పూర్తి ఎకోసిస్టంను రాష్ట్రంలో నెలకొల్పుతారు.108 అంబులెన్స్‌లకు యూజ్‌కేస్ వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం, రవాణా, మెటీరియల్ సైన్స్, ఆర్థిక... వంటి ప్రాధాన్య రంగాలకు 100 క్వాంటమ్-ఏఐ అల్గారిథమ్స్, యూజ్ కేసులు సిద్ధం చేయబోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు రంగాలు, పరిశ్రమల సమస్యలకు అల్గారిథమ్ రాసి... క్వాంటమ్ కంప్యూటర్ ద్వారా పరిష్కారం కనుగొంటే దాన్ని యూజ్ కేస్ అంటారు.108 అంబులెన్స్ వాహనాలను ఏ ప్రాంతాల్లో మోహరిస్తే ప్రజలకు మరింత వేగంగా, మెరుగ్గా సేవలందించవచ్చో ఒక యూజ్ కేస్ తయారు చేయాలని ఎన్టీఆర్ వైద్య సేవా ట్రస్ట్ కోరింది. గడచిన మూడేళ్లలో ఎన్ని కాల్స్ వచ్చాయి, ఫోన్ వచ్చిన ఎంత సేపట్లో (సగటున) అంబులెన్స్ ఆ ప్రాంతానికి చేరుతోంది, అంబులెన్స్ ఆసుపత్రికి చేరేసరికి బెడ్‌లు సిద్ధంగా ఉంటున్నాయా? డాక్టర్లు అందుబాటులో ఉంటున్నారా? వంటి వివరాలన్నీ తీసుకుని... ఇన్నోవేషన్ సెంటర్ యూజ్ కేసు తయారు చేస్తుంది.ప్రపంచంలో ఎక్కడికైనా మనమే అందించాలికేవలం క్వాంటమ్ కంప్యూటర్‌ను తెచ్చి అమరావతిలో పెట్టేస్తే ప్రయోజనం ఉండదు. దాన్ని వాడుకుని మనం లబ్ధి పొందేందుకు అవసరమైన ఎకోసిస్టం, సామర్థ్యాలను అభివృద్ధి పరచాలి. అధ్యాపకుల్ని, విద్యార్థుల్ని సిద్ధంచేయాలి. ప్రపంచంలో ఎక్కడ క్వాంటమ్ సేవలు అవసరమైనా మనమే అందించే స్థాయికి ఎదగాలి. అమరావతికి క్వాంటమ్ కంప్యూటర్ వచ్చేనాటికి కనీసం 25 అల్గారిథమ్స్‌తో సిద్ధంగా ఉండాలన్నది మా లక్ష్యం.సీవీ శ్రీధర్, మిషన్ డైరెక్టర్, అమరావతి క్వాంటమ్ వ్యాలీ
Create an account or sign in to comment