October 31Oct 31 Author The Times of IndiaAmaravati set to leapfrog in quantum computing race; faci...Amaravati is set to cross a key milestone in India’s quantum computing journey by Oct-end, when the Andhra Pradesh govt hands over the Quantum Computer Centre building to IBM, which can then start mov
November 3Nov 3 Author అమరావతిలో 120 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్By Andhra Pradesh News DeskPublished : 03 Nov 2026 04:29 ISTEeFont size4 min readదక్షిణాసియాలోనే తొలి, అత్యాధునిక కంప్యూటర్ 10 నుంచి ఇన్‌స్టలేషన్ ప్రారంభించనున్న ఐబీఎం ఫిబ్రవరి 3న ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు
November 4Nov 4 Author క్వాంటమ్ కంప్యూటింగ్‌లో భారత్‌దే భవితBy Editorial TeamPublished : 04 Nov 2026 01:42 ISTEeFont size4 min readక్వాంటమ్ కంప్యూటింగ్ విషయంలో భారత్ వేగంగా అడుగులు వేస్తోంది. ఇప్పటికే అత్యధిక క్వాంటమ్ స్టార్టప్‌లు ఉన్న దేశాల సరసన చేరింది. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రోత్సాహకాలను ఉపయోగించుకుని ప్రైవేటు రంగం మరిన్ని పెట్టుబడులతో ముందుకు రావాల్సిన అవసరముందని ఐబీఎం ఇండియా, దక్షిణాసియా చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(సీటీవో) డాక్టర్ అమిత్ సింఘీ పేర్కొన్నారు. అమరావతి క్వాంటమ్ వ్యాలీతో ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ మౌలిక వసతులు ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలవగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఐబీఎం రీసెర్చ్ ఇండియా, ఏఐ ఫర్ జీ, సాఫ్ట్‌వేర్ ఇన్నోవేషన్ ల్యాబ్ డైరెక్టర్‌గానూ వ్యవహరిస్తున్న సింఘీతో ‘ఈనాడు’ ప్రతినిధి బెజవాడ వెంకటేశ్వర్లు ఇంటర్వ్యూ...అమెరికా, చైనా, ఐరోపా దేశాలతో పోలిస్తే ప్రస్తుతం క్వాంటమ్ కంప్యూటింగ్‌లో భారత్ ఏ స్థాయిలో ఉంది? ఈ రంగంలో అంతర్జాతీయ శక్తిగా ఎదగడానికి మన దేశం చేయాల్సిందేమిటి?క్వాంటమ్ టెక్నాలజీకి సంబంధించి ప్రత్యేక వ్యూహం కలిగిన అతికొద్ది దేశాల్లో భారత్ ఒకటి. నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా దేశీయ క్వాంటమ్ వ్యవస్థకు విధానపరమైన సహకారం లభించనుంది. తద్వారా దీర్ఘకాలిక సామర్థ్యాలు అందివస్తాయి. అమరావతి క్వాంటమ్ వ్యాలీలోని ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2తో అత్యంత శక్తిమంతమైన క్వాంటమ్ కంప్యూటింగ్ వసతులు ఉన్న దేశాల్లో ఒకటిగా భారత్ నిలవగలదు. అయితే ఇండియా తన విజ్ఞానాన్నీ, పరిశోధనలనూ... వ్యాపారులకూ సమాజానికీ ప్రయోజనం చేకూర్చేలా, సమస్యలను పరిష్కరించేలా ఉపయోగించాలి. పరిశోధన-అభివృద్ధికి పెద్దపీట వేసి, అంతర్జాతీయ స్థాయిలో పోటీనిచ్చేలా మేధో సంపత్తి(ఐపీ)ని సృష్టించుకోవాలి. అందుకుగాను పరిశోధకులు, స్టార్టప్‌లు కలిసి కొత్త అల్గారిథమ్‌లు, సాఫ్ట్‌వేర్ అప్లికేషన్స్‌ను అభివృద్ధి చేయాలి.క్వాంటమ్ కంప్యూటింగ్ ద్వారా ఎప్పటి నుంచి ప్రయోజనాలను ఆశించవచ్చు? వాణిజ్య వినియోగానికి అడ్డంకులేంటి?క్వాంటమ్ కంప్యూటింగ్ ప్రస్తుతం సంప్రదాయ కంప్యూటర్లకు సాధ్యంకాని క్లిష్టమైన సమస్యలను పరిశోధించే దశలో ఉంది. ఈ టెక్నాలజీ వాణిజ్యపరంగా అందుబాటులోకి రావడానికి మరికొంత సమయం పట్టొచ్చు. ముఖ్యంగా హార్డ్‌వేర్, ఎర్రర్ కరెక్షన్, అల్గారిథమ్‌లలో పురోగతి సాధించడంపై ఇది ఆధారపడి ఉంటుంది. ఐబీఎంలో క్వాంటమ్ కంప్యూటర్ల సామర్థ్యాన్ని పెంచి, లోపాలను తగ్గించే వ్యవస్థలను అభివృద్ధి చేస్తున్నాం. పరిశ్రమలు, పరిశోధనలకు ఉపయోగపడే అంశాలపై పనిచేస్తున్నాం. మన దేశంలో పరిశోధనా ఫలితాలను ఆచరణాత్మక పరిష్కారాలుగా తీర్చిదిద్దడమే ప్రధాన సవాలు. ఇందుకు ప్రత్యేక నైపుణ్యాలు ఉన్న శాస్త్రవేత్తలు, వ్యాపార నిపుణుల సంఖ్య పెరగాలి. దీర్ఘకాలిక నిధులు, మౌలిక వసతులు, మార్కెట్ ఆధారిత వాణిజ్యీకరణకు స్పష్టమైన మార్గాలను రూపొందించుకోవాల్సి ఉంది. క్వాంటమ్ రంగం వ్యాపార సంస్థలు, స్టార్టప్‌లకు ఎలాంటి పెట్టుబడి అవకాశాలను సృష్టించగలదు?క్వాంటమ్ సాంకేతికతల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు కేంద్రం, రాష్ట్రాలు పలు చర్యలు తీసుకుంటున్నాయి. ముఖ్యంగా నేషనల్ క్వాంటమ్ మిషన్ ద్వారా స్టార్టప్‌లకు మద్దతు లభిస్తుంటే, పరిశోధన-అభివృద్ధి-వినూత్నత(ఆర్‌డీఐ) ఫండ్ ద్వారా డీప్‌టెక్ సంస్థలకు దీర్ఘకాలిక పెట్టుబడి అవకాశాలు ఏర్పడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్వాంటమ్ వ్యాలీని అభివృద్ధి చేయడంతో పాటు స్టార్టప్‌లకు ప్రోత్సాహకాలు అందజేస్తోంది. ప్రైవేటు రంగం వీటిని సద్వినియోగం చేసుకుని వెంచర్, ఆర్‌అండ్‌డీ, పరిశోధన వాణిజ్యీకరణలో మరింత చురుగ్గా పెట్టుబడులు పెట్టాలి. పరిశ్రమలు, విద్యాసంస్థల మధ్య సహకారాన్ని పెంచి మార్కెట్ అవసరాలను తీర్చే ఉత్పత్తులను తీసుకురావాలి. తద్వారా కొత్త వ్యాపార అవకాశాలు అందివస్తాయి.దేశీయ క్వాంటమ్ రంగానికి అవసరమైన పరిశోధన, సామర్థ్యాల పెంపు, స్టార్టప్‌ల అభివృద్ధికి ఐబీఎం ఎలాంటి కృషి చేస్తోంది?ఐఐటీ మద్రాస్‌తో కలిసి ‘ఎన్‌పీటీఈఎల్’ ద్వారా ‘ఇంట్రొడక్షన్ టు క్వాంటమ్ కంప్యూటింగ్’ కోర్సును ఐబీఎం అందిస్తోంది. బిట్స్‌పిలానీ గోవా క్యాంపస్ పరిశోధకులు ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌తో ‘హైఎనర్జీ ఫిజిక్స్’లో మంచి ఫలితాలు సాధించారు. ప్రపంచ ‘క్వాంటమ్ అడ్వాంటేజ్ ట్రాకర్’లో ఇండియా నుంచి నమోదైన తొలి ఫలితమిదే. అమరావతిలో ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌ను ఏర్పాటు చేయడం వల్ల దేశానికి ఒనగూడే ప్రయోజనాలేంటి? ముందుగా ఏయే రంగాల్లో మార్పులు వస్తాయంటారు? అమరావతిలోని ‘ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్-2’ ద్వారా పరిశోధకులు, విద్యాసంస్థలు, స్టార్టప్‌లు అత్యాధునిక క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యవస్థను వాడి అల్గారిథమ్‌లను అభివృద్ది చేసి పరీక్షించగలుగుతారు. తద్వారా జపాన్ వంటి దేశాల మాదిరిగా మన దగ్గర కూడా విస్తృతమైన పరిశోధన-ఆవిష్కరణ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవచ్చు. ఏపీ ప్రభుత్వం, ఐఐటీ-మద్రాస్, ఐఐటీ-తిరుపతి కలిసి అమరావతిలో ‘క్వాంటమ్ ఇన్నోవేషన్ సెంటర్’ను అభివృద్ధి చేస్తున్నాయి. పరిశోధకులు, విద్యార్థులు, డెవలపర్లకు సాంకేతిక సహకారం అందించి, మార్గదర్శనం చేయడం ద్వారా ప్రయోజనకరమైన ప్రాజెక్టులను ప్రోత్సహించాలన్నది దీని లక్ష్యం. అయితే మొదట జీవశాస్త్రాలు, ఆవిష్కరణలు, మెటీరియల్ సైన్స్, ఆర్థిక సేవలు, ఇంధనం, లాజిస్టిక్స్ రంగానికి అవసరమైన అప్లికేషన్లను అందించవచ్చు. క్రమంగా పరిశోధనా సామర్థ్యాలను పెంచుకుని, ప్రయోజనకరమైన పరిష్కారాలను అభివృద్ధి చేసుకోవచ్చు.2030 నాటికి ప్రపంచ క్వాంటమ్ కంప్యూటింగ్ రంగంలో భారత్ పాత్ర ఎలా ఉండనుంది? అందుకోసం ఎలాంటి మౌలిక వసతులు, పారిశ్రామిక సహకారం అవసరమవుతాయి?ప్రస్తుతం మన దగ్గర కంపెనీలు ఇంకా క్వాంటమ్ టెక్నాలజీ ఉపయోగాలను అర్థం చేసుకునే దశలోనే ఉన్నాయి. కానీ, నాలుగైదు ఏళ్లలో క్వాంటమ్ అల్గారిథమ్స్, క్వాంటమ్ ఇన్ఫర్మేషన్ సైన్స్, అప్లికేషన్ డిస్కవరీ వంటి అంశాల్లో భారత్ నాయకత్వ స్థాయికి చేరే అవకాశం కనిపిస్తోంది. ఎందుకంటే, ఇవి విస్తృతమైన పరిశోధనలకు ఆస్కారం ఉన్న రంగాలు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవడానికి సాంకేతిక నిపుణులు, శాస్త్రవేత్తలు, పరిశ్రమల మద్దతు, పెట్టుబడులు పెరగాలి. వీటితోపాటు విద్యాసంస్థలూ స్టార్టప్‌ల భాగస్వామ్యమూ కీలకమే.
November 4Nov 4 Author అమరావతిలో 120 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్By Andhra Pradesh News DeskPublished : 03 Nov 2026 04:29 ISTEeFont size4 min readదక్షిణాసియాలోనే తొలి, అత్యాధునిక కంప్యూటర్ 10 నుంచి ఇన్‌స్టలేషన్ ప్రారంభించనున్న ఐబీఎం ఫిబ్రవరి 3న ప్రధాని చేతుల మీదుగా ఆవిష్కరించేందుకు ఏర్పాట్లు ఏక్యూసీసీ భవనంఈనాడు, అమరావతి: దిగ్గజ సంస్థ ఐబీఎం రూపొందించిన 120 క్యూబిట్ క్వాంటమ్ కంప్యూటర్ అతి త్వరలోనే అమరావతి క్వాంటమ్ వ్యాలీలో ఏర్పాటవుతోంది. ఇది సూపర్ కండక్టింగ్ క్యూబిట్స్ టెక్నాలజీతో రూపొందించిన క్వాంటమ్ కంప్యూటర్లలో అత్యాధునికమైనది.. ఆసియాలోనే మొదటిది కావడం విశేషం. అమరావతి క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్ (ఏక్యూసీసీ) భవనంలో ఈ కంప్యూటర్ ఇన్‌స్టలేషన్ ప్రక్రియను ఐబీఎం సంస్థ ఈ నెల 10వ తేదీ నుంచి ప్రారంభిస్తోంది. జనవరి 15 నాటికి ఆ ప్రక్రియ పూర్తవుతుంది. దాన్ని ఫిబ్రవరి 3వ తేదీన ఆవిష్కరించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాని నరేంద్ర మోదీని ముఖ్యఅతిథిగా ఆహ్వానించనుంది.ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్ టెస్టింగ్ ప్రక్రియలన్నీ న్యూయార్క్‌లో పూర్తి చేశారు. అమెరికా నుంచి కంప్యూటర్ భాగాలు బెంగళూరులోని ఐబీఎం గోదాముకు చేరుకున్నాయి. అక్కడి నుంచి అమరావతికి తరలిస్తున్నారు. దానిలోని క్రయోస్టాట్ (అత్యంత చల్లని వాతావరణం సృష్టించి క్యూబిట్‌లను స్థిరంగా ఉంచేది) వంటి పరికరాలు చిన్న విమానాల్లో పట్టకపోవడంతో, రోడ్డు మార్గంలో తీసుకు రానున్నారు. ఐబీఎం, టీసీఎస్ కలిసి ఈ కంప్యూటర్‌ను ఏర్పాటు చేస్తున్నాయి. దీనికయ్యే ఖర్చు సుమారు రూ.1,000 కోట్లు.చిన్న ప్రకంపనలూ కంప్యూటర్‌కు చేరకుండా..50 ఎకరాల్లో అభివృద్ధి చేస్తున్న అమరావతి క్వాంటమ్ వ్యాలీలో... ఏక్యూసీసీ భవనాన్ని రెండు ఎకరాల విస్తీర్ణంలో జీ+1 విధానంలో ఎల్ అండ్ టీ సంస్థ నిర్మిస్తోంది. 80 శాతం పనులు పూర్తయ్యాయి. దానిలో క్వాంటమ్ కంప్యూటర్ ఏర్పాటు చేసే ల్యాబ్‌ను ఈ నెల 9కి ఐబీఎంకి అప్పగిస్తారు. చుట్టుపక్కల ప్రాంతాల్లో తీవ్రస్థాయి ప్రకంపనలు వచ్చినా..అవి క్వాంటమ్ కంప్యూటర్‌కు చేరకుండా ల్యాబ్‌ను నిర్మించారు. ఈ ల్యాబ్‌కు 30 మీటర్ల లోతు వరకు పైల్స్ ఫౌండేషన్ వేయడంతో పాటు, 24 ప్రత్యేక స్ప్రింగ్ ఐసోలేటర్లు ఏర్పాటు చేశారు. భవిష్యత్తులో ఈ భవనం సమీపం నుంచి మెట్రో రైలు వెళ్లినా, చుట్టుపక్కల ప్రాంతాల్లో బహుళ అంతస్తుల భవనాల పునాదుల కోసం తవ్వకాలు జరిపినా.. ఆ ప్రకంపనలేవీ క్వాంటమ్ కంప్యూటర్‌కు చేరవు. క్వాంటమ్ కంప్యూటర్ పనిచేసేటప్పుడు దాన్ని చిన్న ప్రకంపనలు తాకినా ఫలితాల్లో తేడాలు వస్తాయి. అందుకే ఇంత కట్టుదిట్టమైన ఏర్పాటు చేశారు. ఏక్యూసీసీ భవనాన్ని 50 వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మిస్తున్నారు. దానిలో క్వాంటమ్ కంప్యూటర్, ఏఐ ల్యాబ్ 3 వేల చ.అడుగుల విస్తీర్ణంలో ఉంటుంది. ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌ను బయటి నుంచి సందర్శకులు చూసేలా చుట్టూ ప్రత్యేక టెక్నాలజీతో తయారు చేసిన గ్లాస్‌ను ఏర్పాటు చేస్తారు. పారదర్శకంగా ఉండే ఆ గ్లాస్‌ను ఒక్క బటన్ నొక్కి కలర్ గ్లాస్‌గా మార్చొచ్చు. అప్పుడు ల్యాబ్‌లో ఉన్నవేవీ బయటకు కనిపించవు.భారతదేశ పరిశోధన సంస్థలకు ప్రత్యేక క్లౌడ్అమరావతి క్వాంటమ్ మిషన్‌తో ఐబీఎం ఒప్పందం చేసుకునేనాటికి ఆ సంస్థ తయారు చేసిన 156 క్యూబిట్ కంప్యూటరే అత్యంత శక్తిమంతమైంది. దాన్నిగానీ లేదా భవిష్యత్తులో మరింత అత్యాధునిక కంప్యూటర్‌ను రూపొందిస్తే దాన్ని అమరావతిలో ఏర్పాటు చేస్తామని ఐబీఎం చెప్పింది. ప్రస్తుతం ఆ సంస్థ 120 క్యూబిట్‌లతో మరింత శక్తిమంతమైన కంప్యూటర్‌ను తయారు చేసి అమరావతికి పంపిస్తోంది. అమరావతిలోని క్వాంటమ్ కంప్యూటర్‌ను ప్రపంచంలో ఎక్కడున్నవారైనా క్లౌడ్ ద్వారా వినియోగించుకోవచ్చు. భారతదేశ శాస్త్ర, సాంకేతిక, పరిశోధన సంస్థలు, యూనివర్సిటీలు, పరిశోధకులు, సంస్థల డేటా భద్రత కోసం ప్రత్యేక సావరిన్ క్లౌడ్‌ను అభివృద్ధి చేస్తున్నారు. ప్రభుత్వరంగ సంస్థలైన సీడాక్, సీడాట్, ఎన్‌ఎస్‌టీఎల్, ఐసీఎంఆర్, నేషనల్ ఫిజికల్ ల్యాబొరేటరీస్ వంటివి ఐబీఎం క్వాంటమ్ కంప్యూటర్‌ను వినియోగించుకుంటాయి. పంజాబ్ నేషనల్ బ్యాంక్, హెచ్‌డీఎఫ్‌సీ వంటి బ్యాంకులు... వాటికి అవసరమైన పోస్ట్ క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ సేవల కోసం ఇప్పటికే ఇక్కడ కార్యాలయాలు ఏర్పాటు చేశాయి. సంవత్సరానికి 365 గంటలు ఉచితంఒప్పందంలో భాగంగా..రోజుకు 60 నిమిషాల చొప్పున, సంవత్సరంలో 365 గంటలు క్వాంటమ్ కంప్యూటర్‌ను రాష్ట్ర ప్రభుత్వం ఉచితంగా వాడుకునే వెసులుబాటును ఐబీఎం ఇస్తోంది. వీటిని క్వాంటమ్ క్రెడిట్స్‌గా వ్యవహరిస్తారు. సాధారణంగా క్వాంటమ్ కంప్యూటర్‌ను వినియోగించకోవాలంటే ఐబీఎం సంస్థకు నిమిషానికి 96 డాలర్ల (రూ.9 వేలకుపైగా) చొప్పున చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం ఆ క్రెడిట్స్‌ను రాష్ట్రంలోని వివిధ యూనివర్సిటీలు, సంస్థలకు కేటాయిస్తుందని అమరావతి క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ సీవీ శ్రీధర్ తెలిపారు. ‘అమరావతి క్వాంటమ్ అండ్ ఏఐ ఇన్నోవేషన్ నెట్‌వర్క్‌లో 400 కాలేజీలు ఇప్పటికే భాగస్వాములయ్యాయి. 4,000 మంది ప్రొఫెసర్లు, విద్యార్థులు 100 యూజ్ కేసెస్‌పై పనిచేస్తున్నారు. వారు రూపొందించిన ఆల్గారిథిమ్స్ టెస్ట్ చేయడం కోసం క్వాంటమ్ కంప్యూటర్‌ను వినియోగించుకుంటారు’ అని శ్రీధర్ తెలిపారు. రెండు టవర్లలో 20 వేల వర్క్‌స్టేషన్లు క్వాంటమ్ వ్యాలీలో కొత్తగా నిర్మించే రెండు 49 అంతస్తుల టవర్లను 2028 సెప్టెంబరు నాటికి అందుబాటులోకి తేవాలన్నది లక్ష్యం. ఈ రెండు టవర్లలో 14 కంపెనీలు ఏర్పాటవుతాయి. ఒక్కో కంపెనీకి మూడు అంతస్తుల చొప్పున లీజుకు ఇస్తారు. సుమారు 20 వేల వర్క్ స్టేషన్లు, క్వాంటమ్ విడిభాగాల అసెంబ్లింగ్‌కు కొంత ప్రాంతం, పార్కింగ్, యుటిలిటీ ఏరియా వంటివి ఈ భవనాల్లో వస్తాయి.
Wednesday at 02:50 PM5 days 40 minutes ago, sonykongara said:T1 and T2 kuda 6 floors annaru avi kuda complete avuthaaya?
Wednesday at 05:11 PM5 days Author 2 hours ago, Yaswanth526 said:T1 and T2 kuda 6 floors annaru avi kuda complete avuthaaya?48 floors . works start ayyayi
Wednesday at 05:18 PM5 days 6 minutes ago, sonykongara said:48 floors . works start ayyayi48 floors ki environmental approval time pattudhi ani initial ga 6 floors ani edo start chesaru please check and confirm
Wednesday at 07:02 PM5 days Author 1 hour ago, Yaswanth526 said:48 floors ki environmental approval time pattudhi ani initial ga 6 floors ani edo start chesaru please check and confirmAh post vesina athanu naku telusu bro ade emi undadu 48 floors ne.
13 hours ago13 hr Author పల్నాడులో క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్స్‌టైల్ పార్కులులింగాపురం వద్ద రూ.2,417 కోట్లతో 252 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పార్కును నిర్మించనుంది. దక్షిణాసియాలో మొదటి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఇదే కానుంది. క్వాంటమ్ అల్గారిథమ్స్/సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అండ్ ప్రాసెసర్ ఇంజినీర్లు, క్రయోజెనిక్స్, ఫొటోనిక్స్, పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ రంగాల్లో 3,198 మందికి ఉపాధి దొరకనుంది.
Create an account or sign in to comment