May 12May 12 Author ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కు డిఫెన్స్ పరిశ్రమ రాబోతోంది. ఈ నెల 15న పుట్టపుర్తిలో అమ్‌కా (అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్) ప్రాజెక్టుకు రక్షణశాఖ శంకుస్థాపన చేయబోతోంది. ప్రాథమికంగా రూ.15వేల కోట్ల పెట్టుబడితో మొదలయ్యే ఈ కేంద్రం అంతిమంగా రూ.1-2 లక్షల కోట్ల పెట్టుబడుల స్థాయికి చేరుతుంది. ఏరోస్పేస్ రంగంలో ఆసక్తి ఉన్న వారు పెట్టుబడులు పెట్టడానికి ఇది మంచి సమయం.
May 14May 14 Author ఫైటర్ జెట్.. మేడిన్ ఆంధ్రా..!ABN , Publish Date - May 14 , 2026 | 05:43 AMభవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నెముకగా నిలిచే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనుంది.శ్రీసత్యసాయి జిల్లాలో అతిపెద్ద ఏరోస్పేస్ సెంటర్ఏఎంసీఏ ఉత్పత్తి కేంద్రానికి రేపు పుట్టపర్తిలో శంకుస్థాపనహాజరుకానున్న రక్షణ మంత్రి రాజ్‌నాథ్, చంద్రబాబుపుట్టపర్తి, మే 13(ఆంధ్రజ్యోతి): భవిష్యత్తులో భారత వైమానిక పోరాటానికి వెన్నెముకగా నిలిచే అధునాతన యుద్ధ విమానాల ఉత్పత్తి కేంద్రంగా శ్రీసత్యసాయి జిల్లా ఖ్యాతి గడించనుంది. తొలిదశలో రూ.15 వేల కోట్లు పెట్టుబడితో పుట్టపర్తిలో అత్యాధునిక ఐదో తరం అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్స్ (ఏఎంసీఏ) తయారీ కేంద్రం ఏర్పాటుకు రంగం సిద్ధమైంది. డీఆర్‌డీవో ఆధ్వర్యంలో ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ) చేపడుతున్న ఈ భారీ ప్రాజెక్టుకు రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్, ముఖ్యమంత్రి చంద్రబాబు శుక్రవారం శంకుస్థాపన చేయనున్నారు. దీనికోసం అన్ని ఏర్పాట్లూ పూర్తయ్యాయి. పుట్టపర్తిలోని సత్యసాయి విమానాశ్రయం రన్ వేకి అనుసంఽధానంగా బ్రహ్మణపల్లికి వెళ్లే రహదారి నుంచి పుట్టపర్తి-కోడూరు జాతీయ రహదారి మీదుగా బీడుపలి వరకూ ఈ పరిశ్రమ కోసం భూములు కేటాయించారు. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థలైన ఏరోనాటికల్ డెవల్‌పమెంట్ ఏజెన్సీ (ఏడీఏ), డీఆర్‌డీవో ఈ పరిశ్రమ ఏర్పాటు చేస్తున్నాయి. ఇక్కడ స్వదేశీయంగా అభివృద్ధి చేసిన ఐదోతరం అడ్వాన్స్‌డ్ మీడియం కాంబాట్ కంబాట్ ఎయిర్‌క్రా్‌ఫ్టలను ఉత్పత్తి చేస్తారు. భారత వైమానిక, నౌకాదళాం కోసం వీటిని తయారు చేస్తున్నారు. యుద్ధ విమానాల అసెంబ్లింగ్, ఆన్‌గ్రౌండ్ టెస్టింట్‌ను ఇక్కడే నిర్వహిస్తారు. 2029 నాటికి ప్రయోగ నమూనాలను అందుబాటులోకి తీసుకురావాలని రక్షణ శాఖ లక్ష్యంగా పెట్టుకుంది.
June 8Jun 8 Author దేశ రక్షణకు మన అస్త్రాలుBy Andhra Pradesh News DeskPublished : 08 Jun 2026 03:46 ISTEeFont size2 min readదుత్తలూరులో ఆత్మాహుతి డ్రోన్ల తయారీరూ.1,000 కోట్ల పెట్టుబడితో పరిశ్రమను ఏర్పాటు చేయనున్న అనంత్ టెక్నాలజీస్రెండు దశల్లో పూర్తి చేసేలా ప్రతిపాదన300 ఎకరాలను గుర్తించిన ప్రభుత్వంఈనాడు - అమరావతిక్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్లు (లాయిటరింగ్ మునిషన్ల) వంటివి త్వరలోనే రాష్ట్రంలో తయారు కానున్నాయి. అనంత్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా దుత్తలూరులో రూ.1,000 కోట్లతో క్షిపణులు, ఆత్మాహుతి డ్రోన్ల తయారీ, అసెంబ్లింగ్, ఇంటిగ్రేషన్, టెస్టింగ్ సదుపాయాల పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 300 ఎకరాల భూమి అవసరమని ప్రతిపాదించగా, ప్రభుత్వం ఇప్పటికే భూమిని గుర్తించింది. ఈ పరిశ్రమ ద్వారా 750 మందికి ఉపాధి కల్పించనున్నట్లు అనంత్ టెక్నాలజీస్ పేర్కొంది. రెండు దశల్లో యూనిట్‌ను సంస్థ అభివృద్ధి చేయనుంది. యూనిట్ ఏర్పాటుకు ప్రతిపాదించిన ప్రాంతానికి 29 కిలోమీటర్ల దూరంలోని గండిపాలెం రిజర్వాయర్ నుంచి రోజుకు 75 కిలో లీటర్ల నీరు కేటాయించాలని.. జాతీయ రహదారి 565 నుంచి ప్రాజెక్టు వరకు అప్రోచ్ రోడ్డు నిర్మించాలని ఆ సంస్థ ప్రభుత్వాన్ని కోరింది. మొదటి దశలో రూ.300 కోట్లతో అభివృద్ధి చేయనుంది. దీని ద్వారా 200 మందికి ఉపాధి అవకాశాలు కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. రెండో దశను రూ.700 కోట్లతో చేపట్టి.. 550 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపింది. భూసేకరణ పూర్తిచేసి.. అనుమతులు ఇచ్చినప్పటి నుంచి మొదటి దశను 24 నెలల్లో.. రెండో దశను 48 నెలల్లో పూర్తి చేయనున్నట్లు సంస్థ ప్రతిపాదనల్లో వివరించింది.ఉత్పత్తి సామర్థ్యంకాలపరిమితి ముగిసిపోతున్న/ పాతబడిన క్షిపణులను పరిశీలించి.. వాటిలో దెబ్బతిన్న విడిభాగాలను మార్చడం (మిసైల్ రీఫర్బిష్‌మెంట్), అధునాతన సాంకేతికతతో అప్‌గ్రేడ్ చేయడం ద్వారా వాటిని మళ్లీ పూర్తిస్థాయి వినియోగంలోకి తెచ్చే ప్రక్రియను ఈ సంస్థ నిర్వహిస్తుంది. మొదటి దశలో ఏటా 150, రెండో దశలో ఏటా 550 క్షిపణులను రీఫర్బిష్‌మెంట్ చేయనున్నట్లు తెలిపింది.రక్షణ రంగంలో సాంకేతిక విప్లవానికి ప్రతీకగా నిలిచే అధునాతన ఆయుధాల్లో ‘లాయిటరింగ్ మునిషన్స్’ అత్యంత కీలకమైనవి. వీటిని ‘ఆత్మాహుతి డ్రోన్లు’గా పిలుస్తారు. ఇది ఒక క్షిపణి, డ్రోన్ కలయికగా పనిచేస్తుంది. ఇలాంటి వాటిని రెండు దశల్లో కలిపి ఏటా 4,000 వరకు ఉత్పత్తి చేయాలన్నది సంస్థ లక్ష్యం.కొత్త క్షిపణుల అనుసంధానం (న్యూ మిసైల్ ఇంటిగ్రేషన్) కింద రెండో దశలో ఏటా 1,100 వరకు అభివృద్ధి చేయనున్నట్లు సంస్థ ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనల్లో పేర్కొంది.యూనిట్ ప్రత్యేకతలుహై-ఎనర్జీ మెటీరియల్, మందుగుండు సామగ్రి తయారీలో అధునాతన సామర్థ్యాలతో ఉత్పత్తులు. దేశ రక్షణ రంగ తయారీ ఎకోసిస్టమ్‌లో ఏపీని కీలకంగా తీర్చిదిద్దుతుంది.ఏపీలో ఎనర్జైటిక్స్, రక్షణ రంగ తయారీ క్లస్టర్‌ను ఏర్పాటు చేయడానికి ఇది యాంకర్ పరిశ్రమగా ఉపయోగపడుతుంది.క్షిపణులు, రాకెట్లు, అంతరిక్ష ప్రయోగాలకు సంబంధించిన సప్లై చైన్‌ను బలోపేతం చేస్తుంది. రక్షణ రంగ ముడిపదార్థాల తయారీలో పారిశ్రామిక అభివృద్ధిని వేగవంతం చేస్తుంది.
June 16Jun 16 Adani Group, Brazil's Embraer finalize Dholera for setting up aircraft assembly lineAdani Group, Brazil's Embraer finalise Dholera for setting up aircraft assembly line - The Economic Timese adani gadu free ga kavali ante AP ki, edina benifit cheyali ante Gujarat ki. mesedi ikkada palu ichedi akkada laga undi vedava xxxxx.
July 20Jul 20 Author రెక్క విప్పుతున్న విమాన రంగంBy Andhra Pradesh News DeskUpdated : 20 Jul 2026 06:13 ISTEeFont size3 min readఏరోస్పేస్, రక్షణ రంగ పరిశ్రమలకు ఎర్రతివాచీరాష్ట్రానికి ఏడాదిలో రూ.27,610 కోట్ల పెట్టుబడులుభారత్ ఫోర్జ్, డీఆర్‌డీవో, బీడీఎల్ తదితర సంస్థల రాకఈనాడు - అమరావతిఏరోస్పేస్.. రక్షణ రంగ పరిశ్రమల హబ్‌గా రాష్ట్రం ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. ఆయా సంస్థలకు అవసరమైన ఎకోసిస్టమ్‌ను కల్పించడానికి రాష్ట్ర వ్యాప్తంగా ఆరు క్లస్టర్లను ప్రభుత్వం అభివృద్ధి చేస్తోంది. వాటిలో ఎయిర్‌క్రాఫ్ట్ కాంపోనెంట్స్, క్షిపణులు, మందుగుండు సామగ్రి, అంతరిక్ష పరిశోధన, నేవల్, ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్, అన్‌మ్యాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఇప్పటికే రూ.27,610 కోట్ల పెట్టుబడులతో 24 దిగ్గజ సంస్థల ఏర్పాటుకు ప్రభుత్వం 2025-26లో అనుమతులిచ్చింది. వాటి ద్వారా సుమారు 21,349 మందికి ఉపాధి లభిస్తుందని అంచనా. అనుమతులిచ్చిన వాటిలో మెజారిటీ సంస్థలు నిర్మాణ పనులను ప్రారంభించాయి. రాబోయే రెండు మూడేళ్లలో అవి ఉత్పత్తి ప్రారంభిస్తాయని అంచనా. ఏరోస్పేస్ రంగంలో పెట్టుబడుల ఆకర్షణ కోసం ఏరోస్పేస్, డిఫెన్స్ పాలసీ 4.0 ద్వారా రూ.లక్ష కోట్ల పెట్టుబడులను ఆకర్షించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా ఉంది.కొలువుదీరనున్న దిగ్గజ సంస్థలుఅనకాపల్లిలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రూ.489 కోట్లు, సాగర్ డిఫెన్స్ రూ.45 కోట్ల పెట్టుబడులతో యూనిట్ల ఏర్పాటు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో క్షిపణులు, యామ్యునిషన్ తయారీ కేంద్రాలను ప్రోత్సహించేలా మౌలిక సదుపాయాల కల్పన. కృష్ణా జిల్లాలో రూ.840 కోట్ల పెట్టుబడితో ఐకామ్ డిఫెన్స్ ఎక్స్‌ప్లోజివ్స్ తయారీ సంస్థకు అనుమతులు. కర్నూలు జిల్లాలో ఆల్గోబొటిక్స్, డ్రోగో, ల్యాట్రిక్స్, సెన్స్‌ఇమేజ్, జేడీకే ఫ్లై సంస్థలు రూ.407 కోట్ల పెట్టుబడులతో యూనిట్ల ఏర్పాటు.శ్రీసత్యసాయి జిల్లాలో కేంద్ర ప్రభుత్వరంగ సంస్థ డీఆర్‌డీవో పుట్టపర్తి వద్ద అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ) ప్రాజెక్టు, భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజీస్ సిస్టమ్ లిమిటెడ్, హెచ్‌ఎఫ్‌సీఎల్, జేకే మణి, భారత్ ఎలక్ట్రానిక్స్, ఆస్ట్రోబేస్ స్పేస్ వంటి సంస్థలు రూ.21,210 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు అనుమతులు. అనంతపురం జిల్లాలో సరళ్ ఏవియేషన్, స్పేస్‌ఫీల్డ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ రూ.376.83 కోట్ల పెట్టుబడులతో తయారీ యూనిట్లు.తిరుపతి జిల్లా స్పేస్ సిటీలో ఎథర్నల్ ఎక్స్‌ప్లోరేషన్, స్కైరూట్ సంస్థల రాకెట్ లాంఛింగ్, లాంచ్ వెహికల్ తయారీ పరిశ్రమలు. ప్రకాశం జిల్లాలో భారత్ డైనమిక్స్ లిమిటెడ్ రూ.978 కోట్ల పెట్టుబడులతో ఎయిర్‌క్రాఫ్ట్ కాంపోనెంట్స్ తయారీ యూనిట్. చిత్తూరు జిల్లాలో రూ.159 కోట్లతో పయనీర్ క్లీన్ ఎనర్జీస్ ఎయిర్‌క్రాఫ్ట్ తయారీ కేంద్రం.నెల్లూరు జిల్లాలో రూ.1,765 కోట్ల పెట్టుబడులతో రక్షణ రంగానికి అవసరమైన క్షిపణులు, ఎక్స్‌ప్లోజివ్స్, మందుగుండు, మారిటైం రంగాలకు చెందిన ప్రాజెక్టుల ఏర్పాటుకు అనంత్ టెక్నాలజీస్, ప్రీమియర్ ఎక్స్‌ప్లోజివ్స్, అనడ్రోన్ సిస్టమ్స్, సాగర్ డిఫెన్స్ సంస్థలకు అనుమతులు.వ్యూహాత్మకంగా ఆరు క్లస్టర్ల ఏర్పాటుఏరోస్పేస్, రక్షణ రంగాల్లోని ప్రభుత్వ, ప్రైవేట్ సంస్థల పెట్టుబడుల ఆకర్షణకు ప్రభుత్వం రాష్ట్రంలో 23 వేల ఎకరాల్లో క్లస్టర్లను అభివృద్ధి చేస్తోంది. బెంగళూరు, చెన్నై, హైదరాబాద్ నగరాలకు అనుసంధానంగా ఈ క్లస్టర్లు ఉండేలా.. రాష్ట్రంలోని ప్రాంతాలను వ్యూహాత్మకంగా ఎంపిక చేసింది.తిరుపతి జిల్లా రౌతుసురమాలలో 2,500 ఎకరాల్లో స్పేస్ సిటీ ఏర్పాటుతో పాటు పరిశోధన, అభివృద్ధి హబ్‌గా తీర్చిదిద్దాలని నిర్ణయం.ప్రకాశం జిల్లా దొనకొండ వద్ద ఎయిర్‌క్రాఫ్ట్ విడిభాగాల తయారీ ఎకోసిస్టమ్ అభివృద్ధి.విశాఖపట్నం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ జిల్లాల్లో 3,000 ఎకరాల్లో నౌకాయాన రంగ పరిశ్రమల క్లస్టర్.ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో 3,000 ఎకరాల్లో క్షిపణులు, మందుగుండు తయారీ పరిశ్రమల క్లస్టర్.కర్నూలు జిల్లాలో 600 ఎకరాల్లో అన్‌మ్యాన్డ్ డ్రోన్ల తయారీ పరిశ్రమల క్లస్టర్.శ్రీసత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల క్లస్టర్.
July 24Jul 24 Author రాష్ట్రంలో ఎఫ్‌టీవో ఏర్పాటుకు నాట్స్ ఏరోస్పేస్ ఆసక్తిBy Andhra Pradesh News DeskPublished : 24 Jul 2026 06:38 ISTEeFont size1 min readమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసిన సంస్థ ప్రతినిధిమంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో చర్చిస్తున్న జీజీఎఫ్ ఆస్ట్రా ఎనలిటికా సీఈవో, డైరెక్టర్ సాయిప్రసాద్, టెక్ డైరెక్టర్ సాయివిజ్ఞాన్‌రెడ్డి, ఆపరేషన్ డైరెక్టర్ టీఎస్ కిరణ్ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో నాగార్జునసాగర్/కర్నూలు విమానాశ్రయాల్లో ఫ్లైట్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్(ఎఫ్‌టీవో) ఏర్పాటు చేసేందుకు దిల్లీకి చెందిన నాట్స్ ఏరోస్పేస్ ఆసక్తి వ్యక్తం చేసింది. ఆ సంస్థ ప్రతినిధి అథిరాజ్ సింగ్ చావ్లా గురువారం రాష్ట్ర సచివాలయంలో మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డిని కలిసి చర్చించారు. రాబోయే ఐదేళ్లలో రూ.100 కోట్ల పెట్టుబడితో 100 మందికి ఉపాధి కల్పించనున్నట్లు తెలిపారు. ట్రైనింగ్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల సంఖ్య 6 నుంచి 20కి పెంచేలా ఎఫ్‌టీవోను అభివృద్ధి చేస్తామని మంత్రికి వివరించారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలని, సంస్థకు సహకరిస్తామని మంత్రి సానుకూలంగా స్పందించారు. రూ.400 కోట్ల పెట్టుబడులతో..కర్నూలు డ్రోన్ సిటీలో రూ.400 కోట్ల పెట్టుబడులతో డ్రోన్ క్లస్టర్ ఏర్పాటుకు హైదరాబాద్‌కు చెందిన జీజీఎఫ్ ఆస్ట్రా ఎనలిటికా ఆసక్తి వ్యక్తంచేసింది. ఆ సంస్థ సీఈవో, డైరెక్టర్ సాయిప్రసాద్, టెక్ డైరెక్టర్ సాయివిజ్ఞాన్‌రెడ్డి, ఆపరేషన్ డైరెక్టర్ టీఎస్ కిరణ్‌లు మంత్రి జనార్దన్‌రెడ్డిని సచివాలయంలో కలిసి పెట్టుబడి ప్రతిపాదనపై చర్చించారు. ‘యూనిట్ ఏర్పాటుకు 100 ఎకరాలు అవసరం. రానున్న గోదావరి పుష్కరాల్లో డ్రోన్ ఆధారిత సేవలు అందిస్తాం’ అని మంత్రికి వారు వివరించారు. పూర్తిస్థాయి ప్రతిపాదనలతో రావాలని సంస్థ ప్రతినిధులకు మంత్రి సూచించారు.
Create an account or sign in to comment