January 28Jan 28 Author ఏపీలో విమాన తయారీ కేంద్రం? By Andhra Pradesh News DeskUpdated : 28 Jan 2026 03:40 IST Ee Font size 2 min read ఉమ్మడి ‘అనంత’ జిల్లాలో ఏర్పాటుకు ప్రభుత్వం ప్రయత్నం భూములు కేటాయించేందుకు సంసిద్ధత ప్రాజెక్టు దక్కించుకునేందుకు ఏపీ, గుజరాత్ పోటీ ఈనాడు, అమరావతి: రాష్ట్రానికి విమానాల తయారీ కేంద్రం తీసుకొచ్చేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. దీన్ని ఉమ్మడి అనంతపురం జిల్లాలో ఏర్పాటు చేయించాలని యోచిస్తోంది. బ్రెజిల్‌కు చెందిన విమానాల తయారీ సంస్థ ఎంబ్రాయెర్‌తో అదానీ ఏరోస్పేస్ ఒప్పందాన్ని కుదుర్చుకుంది. ఈ మేరకు దేశంలో విమానాల తయారీ కేంద్రాన్ని బ్రెజిల్ సంస్థ ఏర్పాటు చేయనుంది. వ్యాపార, వాణిజ్య, సైనిక విమానాలు, విమానాల విడిభాగాల తయారీలో ఎంబ్రాయెర్‌కు గుర్తింపుఉంది. దేశంలో చిన్న, మధ్యస్థాయి ప్రయాణికుల విమానాల తయారీ యూనిట్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసే అవకాశం ఉందని సమాచారం. ఈ ప్రాజెక్టు కోసం ఆంధ్రప్రదేశ్‌తో పాటు గుజరాత్ పోటీ పడుతున్నాయి. ఏపీలో విమానాల తయారీ ప్రధాన ప్రాజెక్టు లేదా అనుబంధ ప్రాజెక్టును ఏర్పాటు చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. పరిశ్రమ ఏర్పాటుకు అవసరమైన భూములు ఇచ్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే సంసిద్ధత తెలిపింది. ఈ పరిశ్రమ ద్వారా రాష్ట్రానికి రూ.వేల కోట్ల పెట్టుబడులు వచ్చే అవకాశం ఉంది. దీనిపై వచ్చే నెలలో పూర్తి స్పష్టత వచ్చే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. ‘అనంత’లో ఎందుకంటే.. అనంతపురం జిల్లాలో వేల ఎకరాల భూములు అందుబాటులో ఉన్నాయి. అవి బెంగళూరుకు సమీపంలో ఉండటం కలిసొస్తుంది. ఈ ప్రాంతాన్ని విమానాల తయారీ కేంద్రంగా అభివృద్ధి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అందుకు అనుగుణంగా బెంగళూరుకు చెందిన సరళ ఏవియేషన్స్ ఎలక్ట్రికల్ వర్టికల్ టేకాఫ్‌కు ల్యాండింగ్ విమానాల తయారీ కేంద్రం ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే అనుమతులు ఇచ్చింది. ఆ సంస్థ 6 సీటర్ల విమానాల తయారీ కేంద్రాన్ని రూ.1,300 కోట్ల పెట్టుబడితో ఏర్పాటు చేయనుంది. 500 ఎకరాల్లో ‘స్కై ఫ్యాక్టరీ’ని అభివృద్ధి చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా 2029 నాటికి ఎయిర్ ట్యాక్సీలను అందుబాటులోకి తీసుకురావాలన్నది లక్ష్యం. ఇదే ప్రాంతంలో ఖాళీగా భూములున్నాయి. వాటిని విమానాల తయారీ కేంద్రం కోసం కేటాయించేలా ప్రతిపాదించినట్లు తెలిసింది. లేపాక్షి భూములైనా సరే.. శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్‌పోస్టు దగ్గర లేపాక్షి నాలెడ్జ్ హబ్‌కు కేటాయించిన 8,844 ఎకరాల భూములను కలుపుకొని 20 వేల ఎకరాల్లో భారీ పారిశ్రామిక పార్కు అభివృద్ధికి ప్రభుత్వం ప్రతిపాదించింది. దీనికోసం ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ పరిధిలో ఉన్న భూములను వెనక్కు తీసుకునేందుకు చేసిన ప్రయత్నాలు కొలిక్కి వచ్చినట్లు సమాచారం. మరోవైపు చుట్టుపక్కల మండలాల్లో ఇప్పటికే భూసేకరణ ప్రక్రియ మొదలుపెట్టింది. అందులో విమానాల తయారీ ప్రాజెక్టుకు భూములు కేటాయించేలా ప్రతిపాదించింది. ఈ భూములు జాతీయ రహదారి, బెంగళూరు దేవనహళ్లి అంతర్జాతీయ విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం కలిసొస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. కంపెనీ ప్రతినిధి బృందం ప్రాధాన్యం ఆధారంగా భూములు కేటాయిస్తామని అధికారులు చెబుతున్నారు.
January 28Jan 28 6 hours ago, Yaswanth526 said: Gujarat vs AP fight going for Aircraft Manufacturing Hope we get it
March 25Mar 25 On 1/28/2026 at 11:26 AM, Yaswanth526 said:Gujarat vs AP fight going for Aircraft ManufacturingHope we get it bro @Yaswanth526 emina update unda deni meeda? news kooda ekkada raledhu.
March 25Mar 25 28 minutes ago, Bollu said:bro @Yaswanth526 emina update unda deni meeda? news kooda ekkada raledhu. Edited March 25Mar 25 by Yaswanth526
April 30Apr 30 Author ఏపీలో పెట్టుబడులకు టైటాన్ గ్రూప్ ఆసక్తి.. మంత్రి జనార్దన్‌రెడ్డితో ప్రతినిధుల భేటీBy Andhra Pradesh News TeamPublished : 30 Apr 2026 17:33 ISTEeFont size1 min readఅమరావతి: మంత్రి బీసీ జనార్దన్‌రెడ్డితో టైటాన్ డిఫెన్స్ గ్రూప్ ప్రతినిధులు భేటీ అయ్యారు. టైటాన్ డిఫెన్స్ సిస్టమ్స్ లిమిటెడ్ ఛైర్మన్, సీఈవో కె.గిరికుమార్, సంస్థ ప్రతినిధులు సచివాలయంలో మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా రాష్ట్రంలో పెట్టుబడులకు ఆసక్తి చూపారు. కర్నూలు ఎయిర్‌పోర్టులో ఎమ్ఆర్‌వో, సిమ్యులేషన్ సెంటర్ల ఏర్పాటు, నంద్యాల జిల్లాలో డిఫెన్స్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ స్థాపనకు ఆసక్తి వ్యక్తం చేశారు. ఏవియేషన్, ఏరోస్పేస్, డిఫెన్స్, మైనింగ్ వంటి బహుళ రంగాల్లో తమ సంస్థకు ఉన్న అనుభవాన్ని ప్రతినిధులు వివరించారు.ప్రస్తుతం ఏపీలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం ఉందని టైటాన్ సంస్థ ప్రతినిధులకు మంత్రి తెలిపారు. రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చే సంస్థలకు ప్రభుత్వం తరఫున పూర్తి స్థాయిలో సహకారం అందిస్తామని వెల్లడించారు. సుస్థిర పాలనపై విశ్వాసంతోనే రాష్ట్రానికి పెట్టుబడులు వెల్లువెత్తుతున్నాయని చెప్పారు
May 5May 5 Author రాష్ట్రంలో రూ.లక్ష కోట్లతో యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టుBy Andhra Pradesh News DeskPublished : 05 May 2026 05:47 ISTEeFont size1 min read15న పుట్టపర్తిలో సీఎం శంకుస్థాపన!ఈనాడు, అమరావతి: శ్రీసత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో ఐదో తరం(ఫిఫ్త్ జనరేషన్) స్టెల్త్ యుద్ధ విమానాల తయారీ ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. ఈ ప్రాజెక్టు, దాని అనుబంధ పరిశ్రమల ద్వారా సుమారు రూ.లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా. దీనికి ఈ నెల 15న సీఎం చంద్రబాబు శంకుస్థాపన చేసే అవకాశం ఉంది. గతంలో రక్షణమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ను సీఎం కలిసి ఏపీలో ఎడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్‌ల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరిన సంగతి విదితమే. దేశీయ ఎడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్(ఏఎంసీఏ)లు సుమారు 140 ఇక్కడ తయారుకానున్నాయి. కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ డిఫెన్స్ రీసెర్చ్, డెవలప్‌మెంట్ ఆర్గనైజేషన్(డీఆర్‌డీవో) దీన్ని ఏర్పాటుచేస్తోంది. ఏఎంసీఏకు అవసరమైన సిస్టమ్స్ డిజైన్, టెస్టింగ్, మాడ్యూల్స్ అసెంబ్లింగ్‌ను బెంగళూరుకు చెందిన ఏరోనాటికల్ డెవలప్‌మెంట్ ఏజెన్సీ(ఏడీఏ)లో పూర్తి చేయనున్నారు. అక్కడి నుంచి శ్రీసత్యసాయి జిల్లాలో ఉన్న పుట్టపర్తికి మాడ్యూళ్లను తరలించాలన్నది ప్రతిపాదన. పుట్టపర్తిలో విమానాలనమూనాల తుది అసెంబ్లింగ్, ఆన్‌గ్రౌండ్ టెస్టింగ్‌లను నిర్వహించనున్నారు.ఫ్లైట్ టెస్టింగ్ కాంప్లెక్స్, శాస్త్రవేత్తల కోసం నివాస ప్రాంతాలు, ప్రొడక్షన్ ఫెసిలిటీ కేంద్రం ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వం డీఆర్‌డీవోకు 600 ఎకరాలను కేటాయించింది. ఈకేంద్రాన్ని ఏడీఏ ప్రైవేటుభాగస్వామ్యంతో నిర్మించనుంది. ఏఎంసీఏ అభివృద్ధి, తయారీ కోసం టాటా ఎడ్వాన్స్‌డ్ సిస్టమ్స్, ఎల్‌అండ్‌టీ, భారత్ ఫోర్జ్ కంపెనీల సహకారాన్ని తీసుకోవాలని భావిస్తున్నారు. ప్రాజెక్టుకు అనుబంధంగా యూనిట్లు ఏర్పాటు కానున్నాయి. వీటికోసం ప్రాజెక్టుకు సమీపంలోనే మరో 400 ఎకరాలను ప్రభుత్వం అందుబాటులో ఉంచనుంది.
May 5May 5 Author ఫైటర్ జెట్స్.. మేడిన్ ఏపీABN , Publish Date - May 05 , 2026 | 04:22 AMఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మన దేశ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది.పుట్టపర్తిలో యుద్ధ విమాన తయారీ ప్లాంట్600 ఎకరాల్లో ఏర్పాటుకు డీఆర్‌డీవో ప్రతిపాదనరూ.లక్ష కోట్ల పెట్టుబడి పెట్టే అవకాశంప్లాంట్లో 140 ఎయిర్‌క్రా్‌ఫ్టల తయారీప్రాజెక్టుకు రాష్ట్ర ప్రభుత్వం ఆమోదంఅమరావతి, మే 4(ఆంధ్రజ్యోతి): ఏరోస్పేస్, రక్షణ రంగాల్లో భారీ పెట్టుబడులతో ఏపీ దూసుకుపోతోంది. రాష్ట్రంలో మన దేశ ఐదో తరం స్టెల్త్ ఫైటర్ జెట్ల తయారీకి రంగం సిద్ధమవుతోంది. ఈ యుద్ధవిమానాల తయారీ కేంద్రాన్ని శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 600 ఎకరాల్లో ఏర్పాటు చేస్తారు. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను రక్షణశాఖకు చెందిన రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ (డీఆర్‌డీవో) రాష్ట్ర ప్రభుత్వానికి అందజేసింది. ఈ ప్రతిపాదనలపై రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్ శాఖ సూత్రప్రాయంగా ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో ఏరో అండ్ డిఫెన్స్ పాలసీని ఐటీ అండ్ ఎలకా్ట్రనిక్స్ శాఖ రూపొందించింది. రాయలసీమలోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్ పరికరాల తయారీ రంగానికి ప్రాధాన్యం ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధం కావడంతో పాటు.. ప్రతిష్ఠాత్మక జెట్ విమానాల తయారీ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తామంటూ ముందుకు రావడంతో రాష్ట్ర ఎలకా్ట్రనిక్స్ శాఖ వెంటనే ఆమోదం తెలిపింది. పుట్టపర్తి కేంద్రంలో డీఆర్‌డీవో దాదాపు 140 అడ్వాన్స్‌డ్ మీడియం కంబాట్ ఎయిర్‌క్రాఫ్ట్ (ఏఎంసీఏ)లను తయారు చేస్తుంది. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు రూ. లక్ష కోట్ల పెట్టుబడులు వస్తాయని కేంద్ర ప్రభుత్వవర్గాలు వెల్లడించాయి. ఏడాది క్రితం సీఎం ఢిల్లీ వెళ్లినపుడు రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌తో సమావేశమయ్యారు. యుద్ధ విమాన తయారీ కేంద్రం స్థాపనపై అప్పట్లో వారి మధ్య చర్చ జరిగింది.
Create an account or sign in to comment