Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Aerospace & Defence Industrial Corridors

Featured Replies

  • Replies 117
  • Views 7.3k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

  • Adani Group, Brazil's Embraer finalize Dholera for setting up aircraft assembly line Adani Group, Brazil's Embraer finalise Dholera for setting up aircraft assembly line - The Economic Times e adani g

  • sonykongara
    sonykongara

Posted Images

  • 2 weeks later...
  • Author

ఏపీలో రక్షణరంగ పరిశ్రమలు ఏర్పాటు చేయండి

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 26 Jul 2025 05:25 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

రక్షణ మంత్రికి తెదేపా ఎంపీల బృందం వినతి

ap260725main32a.webp

కేంద్ర మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌కు వినతిపత్రం అందిస్తున్న తెదేపా ఎంపీలు లావు శ్రీకృష్ణదేవరాయలు, దగ్గుమళ్ల ప్రసాదరావు, మాగుంట శ్రీనివాసులురెడ్డి

ఈనాడు, దిల్లీ: ఏపీలో విస్తృతంగా అందుబాటులో ఉన్న భూముల్లో రక్షణరంగ పరిశ్రమలు ఏర్పాటుచేయాలని తెదేపా ఎంపీల బృందం రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ను కోరింది. తెదేపా పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు నేతృత్వంలో ఎంపీలు మాగుంట శ్రీనివాసులురెడ్డి, దగ్గుమళ్ల ప్రసాద్‌లు శుక్రవారం ఇక్కడ రాజ్‌నాథ్‌ను కలిసి ఈ మేరకు వినతిపత్రం సమర్పించారు. ఇప్పటికే ముఖ్యమంత్రి చంద్రబాబు మే 19వ తేదీన కేంద్రానికి దీనిపై లేఖరాసినట్లు ఆయనకు గుర్తుచేశారు. జగ్గయ్యపేట-దొనకొండల మధ్య అందుబాటులో ఉన్న 6వేల ఎకరాల్లో మిసైల్, ఆయుధ ఉత్పత్తులు, లేపాక్షి-మడకశిర మధ్య 10 వేల ఎకరాల్లో విమానాలు, రక్షణ ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులు, విశాఖపట్నం-అనకాపల్లి మధ్య 3 వేల ఎకరాల్లో నౌకాపరికరాలు, ఆయుధాల పరీక్ష కేంద్రాలు, కర్నూలు-ఓర్వకల్లు మధ్య 4 వేల ఎకరాల్లో డ్రోన్లు, రోబోటిక్స్, అధునాతన పరికరాల ఉత్పత్తి కేంద్రాలు ఏర్పాటుచేయాలని కోరారు. తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీఓ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ నెలకొల్పాలని విజ్ఞప్తిచేశారు. అలాగే పాలసముద్రంలో రూ.2,400 కోట్లతో తలపెట్టిన బెల్‌ వ్యూహాత్మక సముదాయం, నెల్లూరులో 60వేల టన్నుల వార్షిక సామర్థ్యంతో అల్యూమినియం ఎల్లాయ్‌ ప్లాంట్‌ ఏర్పాటును ముందుకు తీసుకెళ్లాలని కోరారు. లేపాక్షి-మడకశిర మధ్య అడ్వాన్స్డ్‌ మీడియం కంబాట్‌ ఎయిర్‌క్రాఫ్ట్‌ (ఏఎంసీఏ) ఎంఆర్‌ఓ, అసెంబ్లీ ప్లాంట్, విశాఖపట్నంలో నేవల్‌ సెజ్‌ ఏర్పాటుచేయాలని విజ్ఞప్తిచేశారు. ఈ ప్రాజెక్టులన్నీ ఆత్మనిర్భర్‌ భారత్‌ విజన్‌కు అనుసంధానంగా ఉన్నందున వాటిని కార్యరూపంలో పెట్టేందుకు కేంద్రం చర్యలు తీసుకోవాలని కోరారు. దీనివల్ల ఆంధ్రప్రదేశ్‌ పారిశ్రామికాభివృద్ధితోపాటు ఉద్యోగాల కల్పన సాధ్యమవుతుందని రాజ్‌నాథ్‌సింగ్‌కు విజ్ఞప్తిచేశారు.

 
  • 1 month later...
  • Author

ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ డిపో

ABN , Publish Date - Sep 19 , 2025 | 12:07 AM

 

మూరుమూల ఏజెన్సీ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి.

ఏజెన్సీ ప్రాంతంలో ఆయుధ డిపో
వంకా వారిగూడెం– దాట్లవారిగూడెం గ్రామాల మధ్య ఆయుధ డిపో ఏర్పాటు చేసే ప్రదేశం

 

గిరిజన ప్రాంత అభివృద్ధిపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల దృష్టి

జీలుగుమిల్లి మండలం వంకా వారిగూడెం పరిసరాల్లో 1166 ఎకరాల సేకరణ

రూ.2వేల కోట్లతో నేవీ ఆయుధాల డిపో

10 వేల మందికి ఉపాధి అవకాశాలు

గిరిజన యువతకు ప్రయోజనం

భూ సేకరణపై డ్రోన్‌ సర్వే

గ్రామసభల్లో గిరిజనులతో చర్చ

జీలుగుమిల్లి, సెప్టెంబరు 18(ఆంధ్రజ్యోతి): మూరుమూల ఏజెన్సీ ప్రాంతంలో నేవీ ఆయుధ డిపో ఏర్పాటుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు శ్రీకారం చుట్టాయి. ఆయుధ డిపో ఏర్పాటుతో పోలవరం నియోజకవర్గం పలు రంగాల్లో అభివృద్ధిపథంలో దూసుకుపోతుందని ఈ ప్రాంతవాసులు భావిస్తున్నారు. గత ప్రభుత్వం హయాంలోనే నేవీ ఆయుధ డిపో వంకవారిగూడెం పంచాయతీ పరిధిలో ఏర్పాటు చేసేందుకు కేంద్రం ప్రతిపాదించింది. వంకవారిగూడెం, పంచాయితీ పరిధి లో గ్రామాల్లో సుమారు 1166.55 ఎకరాల సేకరణకు జిల్లా ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకున్నారు. ఇప్ప టికే పలుసార్లు వంకవారిగూడెం, దాట్లవారిగూడెం, మడకంవారిగూడెం గ్రామాల్లో కుటుంబాల సంఖ్య, భూముల స్థితిగతులుపై రెవెన్యు అధికారులు సర్వేతో పాటు డ్రోన్‌ సర్వే సైతం పూర్తి చేశారు. సంబంధిత భూసేకరణ వివరాలపై నేవీ డిపో సంబంధిత విశాఖపట్నం అధికారులతో ఏలూరు ఎంపీ పుట్టా మహేశ్‌ కుమార్‌ చర్చించారు. ఆయా అంశాలపై స్ధానిక ఎమ్మెల్యే చిర్రి బాలరాజు నేవీ డిపో ఏర్పాటుకు ఎటువంటి అడ్డంకులు లేకుండా ఇప్పటికే పలుసార్లు స్ధానిక గిరిజనులతో గ్రామసభల్లో చర్చించారు.

అభివృద్ధికి బాట

ఆయుధ డిపో ఏర్పాటుతో గిరిజన ప్రాంత అభివృద్ధికి బాట పడుతుందని, కేంద్రం రాష్ట్ర ప్రభు త్వాలు వేగంగా ముందుకు సాగేందుకు ప్రజా ప్రతినిధులు కృషి చేస్తున్నారు. ఈ ప్రాంత యువతకు భవిష్యత్‌లో ఉపాధి అవకాశాలు మెరుగవుతాయని స్థానికులు ఆశాభావంతో ఉన్నారు. ఆయుధ డిపో ఏర్పాటు చర్యలతో అందరి దృష్టి జీలుగుమిల్లి మండల అభివృద్ధిపై పడింది. ఈ ప్రాంతంలో సాంకేతిక ప్రగతి తో ఉపాధి అవకాశాలు మెండుగా రానున్నాయ ని, సుమారు పదివేల మందికి ఉపాధి అవకాశాలు వచ్చే వీలుందని ఎంపీ మహేశ్‌కుమార్‌ ప్రజలకు తెలియ జేశారు. నేవీ ఆయుధ డిపో ఏర్పాటుచేస్తే సరిహద్దు తెలంగాణ ప్రాంతం అశ్వారావుపేట, సత్తుపల్లి వరకు మరోపక్క మెట్టప్రాంతమైన జంగారెడ్డిగూడెం మరింత అభివృద్ధి చెందే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు.

రవాణా సౌకర్యాలు మెరుగు

కేంద్రం ద్వారా సత్తుపల్లి–కొవ్వూరు రైల్వేలైన్‌, గ్రీన్‌ ఫీల్డ్‌ హైవే రూటుకు సమీపంగా ఏర్పాటు చేస్తారని, టి.నరసాపురం మండల సమీపంలో రైల్వే లైన్‌ రానుందనే విషయం చర్చకు వస్తోంది. దీంతో టి.నరసాపురం మండలం నుంచి జీలుగుమిల్లి వచ్చే రహదారుల రూపు రేఖలు పూర్తిగా మారనున్నాయం టున్నారు. ఇప్పటికే జీలుగుమిల్లి నుంచి వయా బుట్టాయగూడెం పట్టిసీమ ఎన్‌హెచ్‌ 365 బీబీ రోడ్డు విస్తరణ పనులు ప్రారంభించడం గమనార్హం. దీంతో పాటు పోలవరం ప్రాంతం పర్యాటక అభివృద్ది మిళి తమై ఉందంటున్నారు. ఈ ప్రాంతంలో 2వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తే అందుకు తగ్గట్టుగా వారికి కావాల్సిన నిత్యావసరాలు, ఆహారం ఇతర అవసరాలు తీర్చేందుకు హోటళ్లు, ఆస్పత్రులు, వ్యాపార లావా దేవీలు సాగించే క్రమంలో మాల్స్‌ ఏర్పాటు కావచ్చని భావిస్తున్నారు. సమీపంలో స్థానికంగా గిరిజనులు జీవనం సాగించేందుకు అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తామని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజాప్రతినిధుల ద్వారా సందేశం ఇస్తున్నాయి. అదే సమయంలో గిరిజన సంఘాల నుంచి ఆయుధ డిపో ఏర్పాటుపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. గిరిజనుల జీవనం, పర్యావరణ ముప్పుపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గిరిజనులకు అవగాహన కల్పించేందుకు అధికారులు గ్రామసభలు నిర్వహించారు.

గిరిజనులకు ఇబ్బందులు ఉండవు

ఆయుధ డిపో ఏర్పాటుపై అనేక అపోహలు న్నా యని, గిరిజనులకు ఎటువంటి లోటు రానివ్వబో మని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు. గిరిజనుల అభిప్రాయాలకు తగ్గట్టు ప్రయోజనాలు కల్పిస్తా మని హామీ ఇస్తున్నారు. గత ఏడాది జరిగిన గ్రామసభల్లో పలువురు ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చారు. ప్రభుత్వం నుంచి ఆర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అమలు, గిరిజనుల జీవన విధానానికి ఎటువంటి నష్టం జరగకుండా 18 ఏళ్లు నిండిన వారికి ప్యాకేజీ, ఉద్యోగ అవకాశాల కల్పనకు చర్యలు తీసుకుంటా మన్నారు. రోడ్డు రవాణా సౌకర్యాలు అనువుగా మారనున్నాయి. 33 ఎకరాల్లో మాత్రమే నేవీ ఆయుధ డిపో నిర్మాణాలు జరుగుతాయని, ఆయా గిరిజన కుటుంబాలకు పూర్తి పరిహారం చెల్లించిన అనంతరమే నేవీ డిపో ఏర్పాటు పనులు జరుగు తాయని ప్రజాప్రతినిధులు చెబుతున్నారు.

  • 2 weeks later...
2 hours ago, sonykongara said:

defence.jpggaruda.jpg

baaga vyathirekatha vasthundemo kadha anna, ila company laki land acquisition chesthunte, anni chotla. 
assala ekkada AP lo prabuthva bhoomulu laevu . em pettalanna land acquistion cheyyali. em chestharu inka. Eluru dheeni anti anamaata.

 

  • 3 weeks later...
  • 3 weeks later...
  • Author

ఏరోస్పేస్‌ గ్రోత్‌ కారిడార్‌గా శ్రీసత్యసాయి జిల్లా

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 19 Nov 2025 06:08 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

విమానాశ్రయానికి దగ్గరగా ఉండటం, స్థలం లభ్యత, ప్రభుత్వ విధానాలు అనుకూలతలు
ఆ ప్రాంతం బెంగళూరుకు దీటుగా అభివృద్ధి చెందుతుంది 
‘ఈనాడు’తో జేకే మైనీ సంస్థ ఎండీ గౌతమ్‌ మైనీ వెల్లడి 
ఈనాడు - అమరావతి 

AP181125main-5a.webp

దేశ వైమానిక పరిశ్రమల రంగానికి కేంద్రంగా ఉన్న బెంగళూరులో స్థలం కొరత, వ్యయాలు భారీగా పెరిగిపోవడం, రద్దీ లాంటి కారణాలతో విస్తరణ కష్టంగా మారిందని, ఇప్పుడు పెద్ద పరిశ్రమలన్నీ దానికి సమీపంలోని శ్రీసత్యసాయి జిల్లాపై దృష్టిపెడుతున్నాయని రేమండ్‌ గ్రూప్‌నకు చెందిన జేకే మైనీ ప్రెసిషన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ ఎండీ గౌతమ్‌ మైనీ తెలిపారు. మరో 10-15 ఏళ్లలో ఆ ప్రాంతం బెంగళూరుకు దీటుగా ఏరోస్పేస్‌ గ్రోత్‌ కారిడార్‌గా అభివృద్ధి చెందుతుందని ఆయన పేర్కొన్నారు. రేమండ్‌ గ్రూప్‌ శ్రీసత్యసాయి జిల్లా టేకులోడు వద్ద ఏరోస్పేస్‌ పరికరాల తయారీ కర్మాగారం, అనంతపురం జిల్లా గుడిపల్లిలో వాహనాల విడిభాగాల తయారీ కేంద్రం, రాప్తాడులో అపెరల్‌ పార్క్‌ ఏర్పాటుకు ఇటీవల విశాఖలో పెట్టుబడిదారుల సదస్సులో శంకుస్థాపన చేసిన సందర్భంగా ఆయన ‘ఈనాడు’తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఈ మూడు పరిశ్రమలపై రేమండ్‌ గ్రూప్‌ సుమారు రూ.1,200 కోట్ల పెట్టుబడి పెడుతోంది. 

బెంగళూరులో హెచ్‌ఏఎల్‌ ఉండటంతో ప్రపంచంలోని అగ్రశ్రేణి వైమానిక కంపెనీలన్నీ అక్కడ కార్యకలాపాలు ప్రారంభించాయి. 60% పరిశ్రమ అక్కడే విస్తరించింది. ఇప్పుడు అక్కడ భారీ ఎత్తున విస్తరణకు వెళ్లలేని పరిస్థితులున్నాయి. అందువల్ల ఇప్పుడు మేం శ్రీ సత్యసాయి జిల్లాలో ఏరోస్పేస్‌ పరిశ్రమ ఏర్పాటుచేస్తున్న ప్రాంతం అత్యంత అనుకూలంగా కనిపించింది. బెంగళూరు విమానాశ్రయం నుంచి గంటన్నర ప్రయాణ దూరంలో ఉండటం, తక్కువ ధరలో, ఎక్కువ భూములు అందుబాటులో ఉండటం, రాష్ట్రప్రభుత్వం నుంచి అందుతున్న సహకారం, ఇస్తున్న ప్రోత్సాహకాలతో త్వరలో ఈ ప్రాంతంలో బెంగళూరును తలపించేలా ఏరోస్పేస్‌ కారిడార్‌ అభివృద్ధి చెందే అవకాశం ఉంది. 

ఈ రంగంలో అభివృద్ధికి ఆకాశమే హద్దు

ఏరోస్పేస్‌ రంగం అత్యంత వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా డిమాండ్‌కు తగ్గట్టు ఉత్పత్తి లేదు. ‘చైనా ప్లస్‌’ పాలసీలో భాగంగా అగ్రశ్రేణి కంపెనీలు ఇతర దేశాలవైపు చూస్తున్నాయి. భారత్‌కు ఇది మంచి అవకాశం. మన దేశం ఇక వినియోగదారుగా మిగిలిపోదు. సాంకేతికంగా చాలా బలంగా ఉన్నాం. ప్రపంచానికి నాణ్యమైన ఉత్పత్తుల్ని అందించగలం. ఇక్కడ వేగం చాలా ముఖ్యం. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఏరోస్పేస్‌ రంగంలో ఒక్కసారిగా ఉత్పత్తి పెంచేయడం సాధ్యం కాదు. ఫ్యాక్టరీ ఏర్పాటుకు అనుమతులు పొందేందుకు రెండేళ్లు పడుతోంది. ప్రతి విడిభాగం తయారీకీ అనుమతులు తీసుకోవాలి. ఈ ఎకోసిస్టమ్‌ను వేగవంతం చేయడంపై ప్రభుత్వాలు దృష్టిపెట్టాలి.

రోజుకో కొత్త భాగం తయారుచేస్తున్నాం 

విమానాల ఇంజిన్ల విడిభాగాల తయారీలో మాకు 21 ఏళ్ల అనుభవం ఉంది. బెంగళూరులో మాకు 16 యూనిట్లు ఉన్నాయి. ప్రస్తుతం 800కి పైగా విడి భాగాలను ఎగుమతి చేస్తున్నాం. మా కంపెనీలో రోజూ ఒక కొత్త భాగాన్ని అభివృద్ధి చేస్తున్నాం. విస్తరణకు ఇది సరైన సమయమని భావించి ఆంధ్రప్రదేశ్‌కు వచ్చాం.

మరిన్ని పరిశ్రమలు వస్తాయి

శ్రీసత్యసాయి జిల్లాలో ఏర్పాటుచేస్తున్న మొదటి ఏరోస్పేస్‌ పరిశ్రమ మాదే. ఆ రంగంలోని మిగతా పెద్ద కంపెనీలన్నీ క్రమంగా అక్కడికి వచ్చేందుకు అవసరమైన ఎకోసిస్టమ్, మౌలిక వసతులు త్వరలోనే అభివృద్ధి చెందుతాయి. ఆంధ్రప్రదేశ్‌కు మొత్తం ఏరోస్పేస్‌ వాల్యూ చైన్‌ తీసుకువస్తాం. వైమానిక యంత్రాల విడిభాగాల తయారీతో పాటు అసెంబ్లింగ్, సబ్‌ అసెంబ్లింగ్‌ చేస్తాం. జేకే మైనీ గ్లోబల్‌ ఏరోస్పేస్‌ లిమిటెడ్, జేకే మైనీ ప్రెసిషన్‌ టెక్నాలజీ లిమిటెడ్‌ పరిశ్రమలు పక్కపక్కనే ఏర్పాటుచేస్తున్నాం. వివిధ రంగాలకు అవసరమైన హై ప్రెసిషన్‌ మెషీన్లనూ అక్కడ రూపొందిస్తాం. 

2027 చివరినాటికి ఉత్పత్తి ప్రారంభిస్తాం 

మేం ఏర్పాటుచేయబోయే ఏరోస్పేస్‌ పరిశ్రమలో 2027 సంవత్సరం చివరినాటికి ఉత్పత్తి ప్రారంభించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు కోరారు. ఆ లక్ష్యానికి కట్టుబడి ఉన్నాం. ఆటోమోటివ్, ఏరోస్పేస్‌ పరిశ్రమల్లో ప్రత్యక్షంగా 4వేల మందికి ఉపాధి కల్పిస్తాం. ఏరోస్పేస్‌ రంగానికి చాలా భారీ ఎకో సిస్టమ్‌ కావాలి. గేజ్‌మేకర్స్, ఫిక్చర్‌ మేకర్స్, ప్యాకేజింగ్, టూల్స్, కన్జ్యూమబుల్స్, ఆయిల్స్, మెయింటెనెన్స్‌ ఇలా చాలా కావాలి. వాటిని మా రిజిస్టర్డ్‌ వెండర్స్‌కు సబ్‌కాంట్రాక్ట్‌కు ఇస్తాం. మా ఫ్యాక్టరీకి అనుబంధంగా హీట్‌ ట్రీట్‌మెంట్, క్యాస్టింగ్, ఫోర్జింగ్‌ వంటి ఎంఎస్‌ఎంఈ యూనిట్‌ల ఏర్పాటుకు విస్తృత అవకాశాలుంటాయి. పరోక్షంగా వేలమందికి ఉపాధి లభిస్తుంది. మాకు అవసరమైన నిపుణులకు సొంతంగా శిక్షణ ఇస్తున్నాం. దాన్ని ఆంధ్రప్రదేశ్‌ యూనిట్‌కూ విస్తరిస్తాం.

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.