Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Aerospace & Defence Industrial Corridors

Featured Replies

  • Replies 117
  • Views 7.3k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • sonykongara
    sonykongara

  • Adani Group, Brazil's Embraer finalize Dholera for setting up aircraft assembly line Adani Group, Brazil's Embraer finalise Dholera for setting up aircraft assembly line - The Economic Times e adani g

  • sonykongara
    sonykongara

Posted Images

  • 1 month later...
  • 2 weeks later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

CM Chandrababu: లేపాక్షి - ఓర్వకల్లు మధ్య యాపిల్‌ ఎలక్ట్రానిక్‌ సిటీ

హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవాలో ఉన్న లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల సంస్థ యాపిల్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ సిటీ రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 24 May 2025 05:20 IST
Ee
Font size
 
 
 
 
6 min read
 
 

మూడు నెలల్లో పనులు ప్రారంభం
హైటెక్‌ పరికరాల తయారీ కేంద్రంగా రాయలసీమ
ముఖ్యమంత్రి చంద్రబాబు వెల్లడి
2027 మార్చికల్లా పోలవరం పూర్తిచేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు స్పష్టీకరణ

ap230525main5a.webp

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌కు జ్ఞాపికను అందజేస్తున్న సీఎం చంద్రబాబు.. చిత్రంలో ఎంపీ కలిశెట్టి

ఈనాడు, దిల్లీ: హైదరాబాద్‌-బెంగళూరు పారిశ్రామిక నడవాలో ఉన్న లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో ప్రముఖ ఎలక్ట్రానిక్‌ పరికరాల సంస్థ యాపిల్‌ ఆధ్వర్యంలో ఎలక్ట్రానిక్‌ సిటీ రానున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రకటించారు. రాష్ట్ర అంశాలపై శుక్రవారం దిల్లీలో పలువురు కేంద్రమంత్రులతో పాటు, యాపిల్‌ సంస్థ ఎండీ, ఇతర ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ సంస్థల యజమానులతో చర్చించిన తర్వాత విలేకర్లతో మాట్లాడుతూ ఆయన ఈ విషయం వెల్లడించారు. ‘‘ఈ రోజు యాపిల్‌ ఎండీతో పాటు ఇతర ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తి సంస్థల యజమానులతో సమావేశం అయ్యాము. బెంగళూరు-హైదరాబాద్‌ కారిడార్‌లో లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో ఎలక్ట్రానిక్‌ సిటీ నిర్మించడానికి వాళ్లు సిద్ధంగా ఉన్నారు. దీనిపై ఎంఓయూ చేసుకుంటాం. మూడు నెలల్లో ఈ సిటీ నిర్మాణ పనులు ప్రారంభించాలని చెప్పాం. భూకేటాయింపులు ఖరారు చేసి ముందడుగు వేస్తాం. ఎలక్ట్రానిక్‌ సిటీ కన్సార్షియంలో యాపిల్‌తో పాటు ఉత్పత్తిదారులంతా ఉంటారు. ఈ సిటీకి మౌలిక వసతులు కల్పించే బాధ్యత ప్రభుత్వానిది.

ap230525main5b.webp

కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్‌కు వేంకటేశ్వరస్వామి విగ్రహాన్ని బహుకరిస్తున్న సీఎం చంద్రబాబు

ఉద్యోగాల కల్పన, అభివృద్ధి బాధ్యత ఆ సంస్థలది. లేపాక్షి-ఓర్వకల్లు మధ్యలో విస్తృతస్థాయిలో పరిశ్రమలు వస్తాయి. సమీపంలో బెంగళూరు, పుట్టపర్తి, ఓర్వకల్లు, హైదరాబాద్‌ విమానాశ్రయాలు, మరోవైపు కృష్ణపట్నం పోర్టు ఉండటం దీనికి సానుకూలం. వీటి మధ్యలో మరో విమానాశ్రయం వచ్చే అవకాశం ఉంది. అందువల్ల ఇక్కడ రక్షణరంగ సంస్థలు చాలా వస్తాయి. ఓర్వకల్లులో సైన్యంతో పాటు వాణిజ్య అవసరాలకు తగ్గ డ్రోన్లు తయారు చేస్తాం. దీన్ని దేశానికి ఒక హబ్‌గా సిద్ధం చేస్తున్నాం’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. ఈ సందర్భంగా ఆయన వివిధ మంత్రులతో జరిగిన సమావేశాల వివరాలను వెల్లడించారు. ‘‘రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌కు రాష్ట్రానికి సంబంధించిన వివిధ డిమాండ్లు విన్నవించాను. అవి..

  •  జగ్గయ్యపేట-దొనకొండ క్లస్టర్‌లో అందుబాటులో ఉన్న 6వేల ఎకరాల్లో క్షిపణులు, ఆయుధ సామగ్రి ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుచేయాలి.
  • లేపాక్షి-మడకశిర మధ్య అందుబాటులో ఉన్న 10వేల ఎకరాల్లో సైనిక, పౌరవిమానాల తయారీ, రక్షణరంగ ఎలక్ట్రానిక్‌ పరికరాల తయారీ, ఏరోస్పేస్‌ ఎకోసిస్టం ఏర్పాటుచేయాలి.
  • విశాఖపట్నం-అనకాపల్లి క్లస్టర్‌లో నౌకారంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి, ఆయుధాల పరీక్ష కేంద్రం ఏర్పాటుచేయాలి.
  • కర్నూలు-ఓర్వకల్లు మధ్య 4వేల ఎకరాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నందున అక్కడ సైనిక డ్రోన్లు, రోబోటిక్స్, ఆధునిక రక్షణ పరికరాల తయారీ కేంద్రం ఏర్పాటుచేయాలి.
  • కేంద్ర ప్రభుత్వ రంగంలోని రక్షణ పరిశ్రమల ద్వారా ఆంధ్రప్రదేశ్‌లో వాటి క్లస్టర్లు ఏర్పాటుచేయాలి.
  • అనంతపురం జిల్లా పాలసముద్రంలోని భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ను వేగంగా పూర్తిచేయాలి.
  • మిధాని-నాల్కో ఆధ్వర్యంలో నెల్లూరులో 60 లక్షల టన్నుల వార్షిక ఉత్పత్తి సామర్థ్యంతో అల్యూమినియం ఉత్పత్తి ప్లాంట్‌ను త్వరగా ప్రారంభించాలి.
  • ఏపీలో ఆర్మీ కంటోన్మెంట్‌ ఏర్పాటుచేయాలి. దక్షిణాదిలో తెలంగాణ, తమిళనాడు, కర్ణాటకల్లో ఉన్నా ఏపీలో లేదు. అందువల్ల కంటోన్మెంట్‌ ఏర్పాటుచేయాలి.
  • కొత్తగా సైనిక్‌ స్కూళ్లు ఇవ్వాలి.
  • తిరుపతి ఐఐటీలో డీఆర్‌డీఓ సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ ఏర్పాటుచేయాలి.

ap230525main5c.webp 

రైల్వే మంత్రి అశ్వినీ వైష్ణవ్‌తో సీఎం చంద్రబాబు.. చిత్రంలో కేంద్ర మంత్రులు రామ్మోహన్‌నాయుడు, చంద్రశేఖర్‌

72 గిగావాట్ల హరిత ఇంధనం..

పునరుత్పాదక ఇంధనశాఖ మంత్రి ప్రహ్లాద్‌ జోషికి... రాష్ట్రంలో 72 గిగావాట్ల హరిత ఇంధనం ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్న విషయాన్ని చెప్పాను. ఈ విద్యుత్తు సరఫరా కోసం రూ.28,346 కోట్ల గ్రీన్‌ ఎనర్జీ కారిడార్‌ ఏర్పాటుచేయాలని కోరగా ఆయన అంగీకరించారు. సోలార్‌ రూఫ్‌టాప్‌ పథకం కింద 35 లక్షల కుటుంబాలకు సౌర విద్యుత్తు యూనిట్లు ఇవ్వాలనుకుంటున్నాం. దీనికి అనుమతులు రాగానే ప్రతి అసెంబ్లీ నియోజకవర్గంలో 10వేల సూర్యఘర్‌ యూనిట్లు ఇస్తాం. ఇందులో ఎస్సీ, ఎస్టీల ఇళ్లపై ఉచిత సౌర విద్యుత్తు యూనిట్లు ఏర్పాటుచేస్తాం. బీసీలకు కేంద్రం ఇచ్చే సబ్సిడీకి అదనంగా రూ.20వేలు సమకూరుస్తాం. మరోవైపు పీఎం కుసుమ్‌ కింద ఫీడర్‌ స్థాయిలో 2వేల మెగావాట్ల సౌర విద్యుత్తు ఉత్పత్తి చేయడానికి అనుమతి ఇచ్చారు. దీంతో ఏపీ గ్రీన్‌ఎనర్జీ హబ్‌గా తయారవుతుంది.

స్పేస్‌ సిటీకి చేయూతనివ్వండి

కేంద్ర శాస్త్రసాంకేతిక శాఖ మంత్రి జితేంద్రసింగ్‌ను కలిసి శ్రీహరికోట వద్ద స్పేస్‌సిటీ ఏర్పాటుకు చేయూతనివ్వాలని కోరాను. శ్రీహరికోట రాకెట్‌ ప్రయోగ కేంద్రం సమీపంలోనే 2వేల ఎకరాల్లో క్లస్టర్‌ ఏర్పాటుచేసి ప్రైవేటు ఉపగ్రహాల తయారీ, ప్రయోగ కేంద్రాన్ని నిర్మిస్తాం. తిరుపతి ఐఐటీ, ఐఐఎస్‌ఈఆర్‌లో విజ్ఞానధార పథకం కింద సాఫిస్టికేటెడ్‌ ఎనలిటికల్‌ ఇన్‌స్ట్రుమెంట్‌ ఫెసిలిటీ, నేషనల్‌ సూపర్‌ కంప్యూటర్‌ మిషన్‌ ఏర్పాటుచేయాలని కోరాను. విశాఖ మెడ్‌టెక్‌ జోన్‌లో బయోరిడ్జ్‌ స్కీం ఏర్పాటుచేయాలని విజ్ఞప్తి చేశాను. ఆంధ్రప్రదేశ్‌లో సీఎస్‌ఐఆర్‌ ల్యాబ్‌లు ఏర్పాటుచేయాలని కోరాను. ఈ ల్యాబ్‌లు లేని ఏకైక రాష్ట్రం ఆంధ్రప్రదేశ్‌ అని చెప్పినప్పుడు ఆయన వెంటనే మంజూరుచేస్తామని చెప్పారు. 

ap230525main5d.webp

కేంద్ర మంత్రి సీఆర్‌ పాటిల్‌ను సన్మానిస్తున్న ముఖ్యమంత్రి చంద్రబాబు


రాజీ పడకుండా పోలవరం పనులు

ల్‌శక్తి శాఖ మంత్రి సీఆర్‌ పాటిల్‌కు పోలవరం పనుల పురోగతి గురించి చెప్పాను. 2027 మార్చి నాటికి పనులు పూర్తిచేయాలని ఆలోచిస్తున్నట్లు తెలిపాను. నిర్మాణ వేగంలో గానీ, నాణ్యతలో గానీ రాజీపడకుండా పనులు చేపడుతున్నట్లు చెప్పాను. అంతర్జాతీయ నిపుణుల ఆధ్వర్యంలో పనులు సాగిస్తున్నట్లు వెల్లడించాను. తెలుగుజాతికి వరమైన ఈ ప్రాజెక్టును గత ప్రభుత్వం ధ్వంసం చేసింది. రూ.400 కోట్లతో నిర్మించిన డయాఫ్రం వాల్‌ గత  ప్రభుత్వ చేతకానితనం వల్ల కుంగిపోవడంతో ఇప్పుడు రూ.900 కోట్లతో కొత్త డయాఫ్రంవాల్‌ నిర్మించాల్సి వస్తోంది. మేం ఏ మాత్రం నిర్లక్ష్యం చేయకుండా కొనసాగించి 2027 మార్చికల్లా జాతికి అంకితం చేస్తాం. షెడ్యూల్‌ కంటే ముందుగానే ఈ ప్రాజెక్టు నిర్మాణం పూర్తిచేయాలన్నది మా లక్ష్యం. విభజన చట్టం ప్రకారం పూర్తిస్థాయిలో నీరు నిల్వచేస్తాం. అందుకు అవసరమైన సహాయ, పునరావాస పనులకు కేంద్రం నిధులు ఇస్తుంది.

  • ఆంధ్రప్రదేశ్‌ను కరవురహితంగా మార్చేందుకు ప్రతిపాదించిన పోలవరం-బనకచర్లను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలో హామ్‌ విధానంలో చేపడదామని కేంద్ర జల్‌శక్తి, ఆర్థిక మంత్రులకు చెప్పాను. రూ.80వేల కోట్ల విలువైన ఈ ప్రాజెక్టు ద్వారా గోదావరి నుంచి బనకచర్లకు 200 టీఎంసీల నీళ్లు మళ్లించాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీనివల్ల రాయలసీమ, దక్షిణాంధ్రకు నీరు ఇవ్వడానికి వీలవుతుంది. ఇది ఎవ్వరికీ వ్యతిరేకం కాదు. మిగులు నీటిని మాత్రమే వాడుకుంటాం. ఇందులో జలవివాదాలు లేవు కాబట్టి వేరే రాష్ట్రానికి అభ్యంతరం ఉండాల్సిన అవసరం లేదు. సముద్రంలో పోయే నీటిని వాడుకోబోతున్నాం. దీనికి కేంద్రం త్వరగా అనుమతులు మంజూరు చేస్తే వెంటనే పనులు ప్రారంభిస్తాం. గోదావరిలో గత వందేళ్లలో సగటున ఏటా 2వేల టీఎంసీలు సముద్రంలోకి పోతోంది. అందులో 200 టీఎంసీలు తీసుకుంటాం. అందరితో మాట్లాడి ఈ నీటిని వాడుకుంటాం. దీనిపై అందరితో మాట్లాడతానని కేంద్ర జల్‌శక్తి మంత్రి హామీ ఇచ్చారు. 
  • ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్‌కు రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల గురించి చెప్పాను. దీన్నుంచి బయటపడటానికి కొంత సమయం పడుతుంది కాబట్టి ఆదుకోవాలని కోరాను. పూర్వోదయ పథకం కింద నిధులు ఇవ్వాలని విజ్ఞప్తి చేశాను. కేంద్రం నుంచి రావాల్సిన బకాయిలను ఇప్పించాలని కోరాను. పోలవరం-బనకచర్ల ప్రాజెక్టు ఆర్థిక స్వరూపం గురించి వివరించి కేంద్రం నుంచి సాయం అందించాలని విజ్ఞప్తి చేశాను’’ అని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వెల్లడించారు.
  • Author

రక్షణ, ఏరోస్పేస్‌ రంగాల అభివృద్ధికి రాష్ట్రంలో ఐదు కారిడార్లు

రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఐదు రక్షణ కారిడార్లను గుర్తించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 25 May 2025 05:28 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

రక్షణ పరిశోధన, అభివృద్ధికి కేంద్రంగా తిరుపతి
మంత్రి నారా లోకేశ్‌ వెల్లడి

ఈనాడు, అమరావతి: రాష్ట్రంలో రక్షణ, ఏరోస్పేస్‌ పరిశ్రమల అభివృద్ధికి సీఎం చంద్రబాబు నాయకత్వంలో ఐదు రక్షణ కారిడార్లను గుర్తించినట్లు విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్‌ తెలిపారు. ‘ఆపరేషన్‌ సిందూర్‌’ విజయంలో వీర సైనికులు, స్వదేశీ పరిజ్ఞానంతో తయారుచేసిన రక్షణ పరికరాలు దేశానికి గర్వకారణంగా నిలిచాయని ‘ఎక్స్‌’ వేదికగా శనివారం పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో స్వదేశీ రక్షణ ఉత్పత్తుల్ని మరింతగా అభివృద్ధి చేయాల్సిన సమయం వచ్చిందని స్పష్టం చేశారు. ‘‘జగ్గయ్యపేట-దొనకొండ హబ్‌ (ఆరు వేల ఎకరాలు), లేపాక్షి-మడకశిర హబ్‌ (పదివేల ఎకరాలు), విశాఖపట్నం-అనకాపల్లి హబ్‌ (మూడువేల ఎకరాలు), కర్నూలు-ఓర్వకల్లు హబ్‌ (నాలుగు వేల ఎకరాలు)లను రక్షణ కారిడార్లుగా గుర్తించాం. తిరుపతిని రక్షణ పరిశోధన, అభివృద్ధికి కేంద్రంగా మారుస్తాం. ప్రధాని మోదీ మార్గదర్శకత్వంలో ఈ కారిడార్లు దేశ రక్షణ, ఏరోస్పేస్‌ సామర్థ్యాల్ని బలోపేతం చేస్తాయి. ప్రజలకు ఉద్యోగావకాశాలు పెంచుతాయి’’ అని లోకేశ్‌ తెలిపారు.

 
  • The title was changed to Aerospace & Defence Industrial Corridors
  • Author

Space parks: అంతరిక్షం.. అందిపుచ్చుకుందాం!

అంతరిక్షం అవకాశాల గని. వాటిని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది.

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 05 Jun 2025 05:42 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

రాష్ట్రంలో 2 స్పేస్‌ పార్కుల ఏర్పాటుకు ప్రణాళికలు 
శ్రీహరికోట సమీపంలో, లేపాక్షి వద్ద ఏర్పాటుకు యోచన 
ఇప్పటికే కేంద్ర మంత్రితో చర్చించిన సీఎం చంద్రబాబు

శ్రీహరికోట, న్యూస్‌టుడే: అంతరిక్షం అవకాశాల గని. వాటిని అందిపుచ్చుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇప్పటికే ఈ రంగంలో శ్రీహరి కోట ఓ వెలుగు వెలుగుతుంటే.. దాన్ని విశ్వవ్యాప్తం చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకుంది. రాష్ట్రంలో మరో రెండుచోట్ల అంతరిక్ష పార్కుల ఏర్పాటు దిశగా ప్రణాళికలు వేస్తోంది. ఇప్పటికే దీనిపై ముఖ్యమంత్రి చంద్రబాబు కేంద్ర మంత్రి జితేందర్‌ సింగ్‌తో చర్చించారు. 

ప్రస్తుతం అంతరిక్ష కేంద్రం ఉన్న శ్రీహరికోట సమీపంలోనే ఒక పార్కు, అనంతపురం జిల్లాలోని లేపాక్షిలో మరోటి ఏర్పాటు చేయాలని చూస్తున్నారు. వీటిని దృష్టిలో ఉంచుకునే ఇస్రో మాజీ అధిపతి డాక్టర్‌ సోమనాథ్‌ను ప్రభుత్వ సలహాదారుగా నియమించారు. ఆయన ఆధ్వర్యంలోనే అంతరిక్ష రంగంపై ప్రభుత్వ పెద్దలు అడుగులు వేస్తున్నారు. శ్రీహరికోట దగ్గర్లో వాహక నౌకలతోపాటు కీలకమైన ప్రొపెలెంట్‌ లాజిస్టిక్‌ తయారీ చేపట్టాలని లక్ష్యం పెట్టుకున్నారు. లేపాక్షి వద్ద ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయనున్నారు.

జాప్యం లేని ప్రయోగాల కోసం.. 

తిరుపతి జిల్లాలోని శ్రీహరికోటలో రాకెట్‌ కేంద్రం ఉన్నప్పటికీ అందుకు కావాల్సిన సామగ్రి తమిళనాడు, కర్ణాటక, కేరళ తదితర ప్రాంతాల నుంచి తీసుకొస్తున్నారు. అక్కడ నుంచి శ్రీహరికోటకు తీసుకొచ్చేందుకు ఎక్కువ సమయం పడుతోంది. ప్రయోగాలూ ఆలస్యమవుతున్నాయి. వీటిన్నింటినీ దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రంలోనే అంతరిక్ష పరిశ్రమలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రయత్నిస్తోంది. ఈ విషయం కేంద్ర మంత్రితో చర్చించగా.. ఆయన కూడా సానుకూలంగా స్పందించినట్లు తెలిసింది.

నూతన పాలసీతో..

తమిళనాడు, గుజరాత్, కర్ణాటకలు తమ సొంత అంతరిక్ష పాలసీల రూపకల్పనలో ముందు వరుసలో ఉన్నాయి. ఇండియన్‌ నేషనల్‌ స్పేస్‌ ప్రమోషన్‌ అండ్‌ ఆథరైజేషన్‌ సెంటర్‌(ఇన్‌స్పేస్‌) కూడా ఈ ప్రాంతాల్లో వాహకనౌకలు, ఉపగ్రహాలు, సాధారణ పరికరాల తయారీపై దృష్టి కేంద్రీకరించాయి. గుజరాత్‌ ఉపగ్రహాలు, పేలోడ్‌లపై, తమిళనాడు వాహకనౌకలపై దృష్టి పెట్టాయి. కర్ణాటక ఇప్పటికే ఇస్రోకు సంబంధించిన కార్యకలాపాలకు కేంద్ర బిందువుగా మారింది. దేశంలోనే ఏకైక స్పేస్‌ పోర్టు ఉన్న ఆంధ్రప్రదేశ్‌కు మాత్రం రావాల్సినంత గుర్తింపు ఇంకా రాలేదు. అందుకే ముఖ్యమంత్రి ప్రతిష్ఠాత్మకంగా తీసుకొని నూతన పాలసీతో ముందుకు తీసుకెళ్లేందుకు ప్రయత్నం చేస్తున్నారు.

ఇప్పటికే శ్రీసిటీలో రాకెట్‌ పరిశ్రమలు

శ్రీసిటీలో ఇప్పటికే రాకెట్‌ ప్రయోగాలకు సంబంధించిన వీఆర్‌వీ (తయారీ: స్వదేశీ ద్రవ హైడ్రోజన్‌ నిల్వ ట్యాంక్‌), డానియేల్‌ ఇండియా (మొబైల్‌ లాంచ్‌ పెడెస్టల్స్‌ బిల్డర్లు), రోటోలోక్‌ (ఘన ఇంధన ఇంజిన్ల కోసం వాల్వులు), టీహెచ్‌కే ఇండియా(చంద్రయాన్‌-3లో వినియోగించిన లీనియర్‌ మోషన్‌ గైడ్‌లు), నోవా ఎయిర్‌(ద్రవ ఆక్సిజన్‌ సరఫరా), వాల్‌ మెట్‌ ఇంజినీరింగ్‌(ఏరోస్పేస్‌ గ్రేడ్‌ మిశ్రమ లోహాల ప్రాసెసర్లు), సిద్ధార్థ లాజిస్టిక్స్‌(సున్నితమైన ఇస్రో పేలోడ్‌ లాజిస్టిక్‌లు) సంబంధించిన పరిశ్రమలున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలో ఆంధ్రా షుగర్స్‌ ప్రొపెలెంట్‌ యూనిట్‌ ఉంది. వీరు ఇస్రోకు ఎప్పటి నుంచో రాకెట్‌ ఇంధనం (ఎంఎంహెచ్, యూడీఎంహెచ్‌)ను సరఫరా చేస్తున్న విషయం తెలిసిందే.

  • 2 weeks later...
  • Author

రూ.30 వేల కోట్ల పెట్టుబడులే లక్ష్యం

రక్షణరంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ‘డిఫెన్స్‌ పాలసీ’ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 16 Jun 2025 04:16 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

15 వేల ఎకరాలు.. నాలుగు నోడ్‌లు
త్వరలో నూతన డిఫెన్స్‌ పాలసీ!
రాష్ట్ర ప్రభుత్వ ప్రణాళిక
ఈనాడు - అమరావతి

ap150625main4a.webp

రక్షణరంగ పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం నూతన ‘డిఫెన్స్‌ పాలసీ’ తీసుకురాబోతోంది. ఈ పాలసీ ద్వారా రాబోయే ఐదేళ్లలో సుమారు రూ.30 వేల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని నిర్దేశించింది. ఈ మేరకు త్వరలో నూతన పాలసీని ప్రభుత్వం అధికారికంగా ప్రకటించనుంది. ఈ రంగంలో పెట్టుబడులతో వచ్చే పరిశ్రమల కోసం సుమారు 15వేల ఎకరాలను సేకరించాలని ప్రభుత్వం లక్ష్యంగా నిర్ణయించింది. దేశంలో రెండు రక్షణరంగ పరిశ్రమల కారిడార్‌లను కేంద్రం అభివృద్ధి చేస్తోంది. ఇప్పటికే వాటిని ఇతర రాష్ట్రాలకు కేటాయించింది. ఈ రంగంలో మరో కారిడార్‌ను కేంద్రం అనుమతించే అవకాశం లేదు. దీంతో కారిడార్‌లకు ప్రత్యామ్నాయంగా డిఫెన్స్‌ నోడ్‌ (ప్రత్యేక ప్రాంతాలను)లను అభివృద్ధి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ పాలసీ ద్వారా ఎలక్ట్రానిక్స్, డిఫెన్స్, ఏరోస్పేస్‌ రంగాలకు సంబంధించిన పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా మౌలిక సదుపాయాలను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ ఉద్దేశం.

రాష్ట్రంలో నాలుగు రక్షణ రంగ పారిశ్రామిక నోడ్‌ల అభివృద్ధికి నూతన పాలసీలో మార్గదర్శకాలను ప్రభుత్వం సిద్ధం చేసినట్లు అధికారులు చెబుతున్నారు. జాతీయ రహదారికి అనుసంధానంగా వాటిని అభివృద్ధి చేయడం వల్ల పెట్టుబడులు వేగంగా వచ్చే అవకాశం ఉందని పేర్కొంటున్నారు. అనంతపురం జిల్లా లేపాక్షి నుంచి కర్నూలు జిల్లా ఓర్వకల్లు మధ్య భారీ నోడ్‌ను అభివృద్ధి చేయాలని భావిస్తున్నారు. దీన్ని జాతీయ రహదారికి అనుసంధానంగా ఏర్పాటు చేయనున్నారు. బెంగళూరుకు దగ్గరగా ఉన్న ప్రాంతం కావడంతో రక్షణరంగ పరిశ్రమల ఏర్పాటుకు దిగ్గజ సంస్థలను ఆకర్షించే అవకాశం ఉంటుందన్నది ప్రభుత్వ ఆలోచన. 

  • నెల్లూరు- దొనకొండ మధ్య మరో నోడ్‌ అభివృద్ధికి అధికారులు ప్రతిపాదించారు. దొనకొండ దగ్గర భారీ విస్తీర్ణంలో ప్రభుత్వ భూములు అందుబాటులో ఉన్నాయి. త్వరలో అందుబాటులోకి రానున్న రామాయపట్నం పోర్టుకు దగ్గరగా నోడ్‌ను అభివృద్ధి చేయడం వల్ల ఎగుమతులకు అవకాశం ఉంటుందన్నది అధికారుల ఆలోచన. 
  • విశాఖపట్నం దగ్గర మరో నోడ్‌ను అభివృద్ధి చేయాలన్నది ప్రభుత్వ యోచన. ఇందుకోసం కనీసం 2వేల ఎకరాలను సేకరించాలని భావిస్తున్నారు.
  • జగ్గయ్యపేట దగ్గర మరో డిఫెన్స్‌ నోడ్‌ను అధికారులు ప్రతిపాదించారు. అక్కడ సుమారు 2వేల ఎకరాలను ఇప్పటికే గుర్తించినట్లు   అధికారులు చెబుతున్నారు.

రక్షణరంగ పెట్టుబడుల దిశగా అడుగులు

  • నవరత్నాల్లో ఒకటిగా ఉన్న భారత్‌ ఎలక్ట్రానిక్స్‌ లిమిటెడ్‌ శ్రీసత్యసాయి జిల్లా పాలసముద్రం దగ్గర డిఫెన్స్‌ సిస్టం ఇంటిగ్రేటెడ్‌ కాంప్లెక్స్‌ను రూ.1,400 కోట్ల పెట్టుబడులతో ఏర్పాటు చేయనుంది. దీనికి అవసరమైన భూములను ప్రభుత్వం ఇప్పటికే ఆ సంస్థకు అప్పగించింది. రాడార్, వెపన్‌ ఇంటిగ్రేషన్, టెస్టింగ్‌ కేంద్రాన్ని ఆ సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయనుంది. 
  • భారత్‌ ఫోర్జ్‌ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్‌ సిస్టమ్స్‌ లిమిటెడ్‌ శ్రీసత్యసాయి జిల్లా మడకశిరలో డిఫెన్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది. ఆ సంస్థ రెండు దశల్లో రూ.2,400 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. క్షిపణులు, వార్‌హెడ్స్‌ తయారీ యూనిట్‌ ఏర్పాటు కోసం వెయ్యి ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. 
  • మడకశిరలో రక్షణ రంగానికి సంబంధించి ఆర్టిలరీ మందుగుండు సామగ్రి షెల్, టీఎన్‌టీ ఫిల్లింగ్, మల్టీమోడ్‌ హ్యాండ్‌ గ్రనేడ్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ యూనిట్‌ ఏర్పాటుకు మీడియా మ్యాట్రిక్స్‌ వరల్డ్‌వైడ్‌ లిమిటెడ్‌ సంస్థ రూ.1,197 కోట్ల పెట్టుబడులు పెట్టేందుకు ఇప్పటికే ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకుంది.
  • Author

రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ: సీఎం చంద్రబాబు

ABN , Publish Date - Jun 23 , 2025 | 08:48 PM

 

రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు ఏపీ కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని ఏపీ సీఎం చంద్రబాబు సూచించారు. ఆపరేషన్ సిందూర్‌‌లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు.

CM Chandrababu: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన  ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ: సీఎం చంద్రబాబు
AP CM Nara Chandrababu Naidu

 

అమరావతి: రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన ఆవిష్కరణలకు కేంద్రంగా ఏపీ ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Nara Chandrababu Naidu) సూచించారు. రక్షణ, అంతరిక్ష రంగంలో ఏపీలో భారీగా పెట్టుబడులు పెట్టి ఆకట్టుకునేలా చేయాలని కోరారు. ఈ మేరకు ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ ఉండాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. ఏపీ సచివాలయంలో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పాలసీ 4.0 (2025-2030)పై ముఖ్యమంత్రి ఇవాళ(సోమవారం) సమీక్ష సమావేశం నిర్వహించారు. నూతనంగా తీసుకువచ్చే పాలసీ ద్వారా వచ్చే ఐదేళ్లలో రూ.50 వేల కోట్ల నుంచి లక్ష కోట్ల రూపాయల వరకు పెట్టుబడులను ఆకర్షించాలని అధికారులకు సీఎం చంద్రబాబు లక్ష్యాన్ని నిర్దేశించారు.

 
ABN ఛానల్ ఫాలో అవ్వండి
 

రక్షణ, ఏరోస్పేస్ రంగంలో నూతన సాంకేతికత, నవీన ఆవిష్కరణలకు ఏపీ కేంద్రంగా మారేలా ప్రయత్నించాలని సీఎం చంద్రబాబు సూచించారు. ఆపరేషన్ సిందూర్‌‌లో భారతదేశం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించిందని అన్నారు. రానున్న రోజుల్లో టెక్నాలజీ ప్రధాన పాత్ర పోషిస్తోందని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. ఈ తరహా సాంకేతికతను రక్షణ పరంగా వినియోగించుకోవడంతో పాటు వాణిజ్య స్థాయిలో ఉత్పత్తి చేసి, దైనందిన జీవితంలో కూడా ఉపయోగపడేలా తీర్చిదిద్దాలని సూచించారు. దేశరక్షణ, అంతర్గత శాంతి భద్రతలకు సంబంధించి భవిష్యత్‌లో విస్తృత అవకాశాలు ఉన్నాయని... ఈ రంగాల్లో పరిశ్రమల ఏర్పాటుకు నూతన పాలసీ దోహదపడాలని సీఎం సూచించారు. నేషనల్ సెక్యూరిటీకి ప్రాధాన్యం ఇచ్చేలా పలు మార్పులను ముఖ్యమంత్రి సూచించారు. ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ సలహాదారు సతీష్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఈ సమీక్షకు హాజరై పలు సూచనలు చేశారు.

 
 

మిగతా రాష్ట్రాల కంటే ఈ రంగంలోని ఎంఎస్ఎంఈలను ప్రత్యేకంగా ప్రోత్సహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు స్పష్టం చేశారు. ఇందుకోసం ఏడాదికి ప్రత్యేకంగా రూ.100 కోట్లతో కార్పస్ ఫండ్ ఏర్పాటు చేయడంతో పాటు, లాజిస్టిక్స్ సబ్సిడీ వంటివి నూతన పాలసీలో పొందుపర్చాలని సీఎం సూచించారు. ఎంఎస్ఎంఈలను బలోపేతం చేయాలని, అనుంబంధ పరిశ్రమల్లో ఉత్పత్తుల నాణ్యతలో బెంచ్‌మార్క్ ఉండేలా చూడాలని కోరారు. అలాగే మార్కెటింగ్, బ్రాండింగ్ ముఖ్యమని... వన్ ఫ్యామిలీ, వన్ ఎంట్రప్రెన్యూర్ ఆశయం సాకారం కావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు తెలిపారు. విశాఖపట్నం- శ్రీకాకుళంలో నావల్ క్లస్టర్.... జగ్గయ్యపేట- దొనకొండ ప్రాంతంలో మిస్సైల్, ఆయుధాల ఉత్పత్తులు.... కర్నూలు- ఓర్వకల్లులో మానవ రహిత విమానాలు, డ్రోన్ల తయారీ... లేపాక్షి- మడకశిర క్లస్టర్‌లో ఏరోస్పేస్, ఎలక్ట్రానిక్స్.... పరిశ్రమలకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలని, తిరుపతిని రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ హబ్‌గా తీర్చిదిద్దాలని, అలాగే డీఆర్డీవో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్ నెలకొల్పాలని ముఖ్యమంత్రి సూచించారు. మరోవైపు మడకశిర క్లస్టర్‌లో భారత్ ఫోర్జ్, ఎంఎండబ్ల్యూ సంస్థలు పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధంగా ఉన్నాయని, త్వరలోనే శంకుస్థాపన చేయనున్నాయని ముఖ్యమంత్రి అధికారులకి వివరించారు.

 

జాతీయ రక్షణ ఉత్పత్తుల విలువ ఏడాదికి రూ.1.27 లక్షల కోట్లు ఉండగా, ఇందులో రక్షణ రంగానికి చెందిన ప్రభుత్వ రంగా సంస్థల వాటా 73 శాతం కలిగి ఉన్నాయని వివరించారు. 21 శాతం విలువైన ఉత్పత్తులు ప్రైవేట్ రంగం నుంచి వస్తున్నాయని వెల్లడించారు. మిగిలిన 7 శాతం ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంలో ఉత్పత్తి అవుతున్నాయని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు. అయితే, ప్రస్తుతం ఏపీలో ఏరో స్పేస్ అండ్ డిఫెన్స్ క్లస్టర్‌లో 23 సంస్థలు, రూ.22 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాయి. దీంతో 17 వేల మందికి ఉపాధి లభించింది. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు కొండపల్లి శ్రీనివాస్, టీజీ భరత్, వాణిజ్య, పరిశ్రమల శాఖ కార్యదర్శి యువరాజ్, తదితరులు పాల్గొన్నారు.

  • Author

ఏరోస్పేస్‌-డిఫెన్స్‌’ పాలసీ-4.0 ప్రకటించిన ఏపీ ప్రభుత్వం

 

Eenadu icon
By Andhra Pradesh News TeamPublished : 27 Jun 2025 21:51 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

27062025ap1-a.webp

అమరావతి: ఏరో స్పేస్‌, రక్షణ విభాగాల్లో రాష్ట్రాన్ని అగ్రస్థానంలో నిలపడమే లక్ష్యంగా ఏపీ ఏరోస్పేస్‌, రక్షణ విధానం-4.0ను రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. 2025-2030 మధ్య అమల్లో ఉండేలా సరికొత్త విధానాలతో పాలసీని అమల్లోకి తెచ్చింది. ఏరో స్పేస్, రక్షణ విభాగాల్లో MSMEలు, స్టార్టప్‌లు, భారీ సంస్థలు ఏర్పాటు చేయాలనే లక్ష్యంతో ఈ మేరకు చర్యలు తీసుకుంటున్నట్లు ఆదేశాల్లో తెలిపింది. ఏరో స్పేస్, రక్షణ విభాగ క్లస్టర్‌ల కోసం రాష్ట్రంలో పలుచోట్ల యూనిట్లు ఏర్పాటు చేయనున్నట్లు తెలిపింది. రాష్ట్రానికి రూ.లక్ష కోట్ల కొత్త పెట్టుబడులు రాబట్టడమే లక్ష్యమని తెలిపిన ప్రభుత్వం.. దీనికోసం హబ్ అండ్ స్పోక్ మోడల్‌లో సబ్-సెక్టార్ కేంద్రీకృత MSME పార్కులను పెద్దఎత్తున అభివృద్ధి చేయనున్నట్లు  తెలిపింది.

రాష్ట్రవ్యాప్తంగా ఏరోస్పేస్, డిఫెన్స్ హబ్‌ల ఏర్పాటు కోసం ప్రభుత్వం 23వేల ఎకరాలు గుర్తించిందని పాలసీలో తెలిపింది. ఏపీఐఐసీ కోసం ప్రభుత్వ నోడల్ ఏజెన్సీ, పార్కులను అభివృద్ది చేస్తున్నట్లు తెలిపింది. వీటిలో అప్రోచ్ రోడ్, విద్యుత్ కనెక్టివిటీ, నీటి కనెక్టివిటీ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది. పార్కుల ఏర్పాటు, అభివృద్ది కోసం ప్రైవేట్, ప్రభుత్వ భూములను అనుమతిస్తున్నట్లు తెలిపింది. పెట్టుబడిదారులకు సత్వరం అనుమతులు ఇచ్చేలా సింగిల్ డెస్క్ అప్రువల్ మెకానిజాన్ని అమలు చేయనున్నట్లు పాలసీలో ప్రభుత్వం తెలిపింది. పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే వారికి ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనున్నట్లు ప్రకటించిన  సర్కారు.. ఆ వివరాలను పాలసీలో పొందుపర్చింది. వచ్చే ఐదేళ్లలో ఈ రంగంలో లక్ష మందికి ఉపాధి అవకాశాలు సృష్టిస్తామని ప్రభుత్వం తెలిపింది. జీవో జారీ చేసిన తేదీ నుంచి ఐదేళ్లు లేదా కొత్త పాలసీ ప్రకటించే వరకు ఆదేశాలు అమల్లో ఉంటాయని తెలిపింది. పాలసీ కింద ఇప్పటికే మంజూరు చేసిన ఏదైనా ప్రయోజనం, రాయితీని తగ్గించేది లేదని స్పష్టం చేసింది. ఈ మేరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శి ఎన్.యువరాజ్ ఉత్తర్వులు జారీ చేశారు.

  • Author

రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి!

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 28 Jun 2025 04:27 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

అంతరిక్ష, రక్షణ రంగ పాలసీ విధానాలు ఖరారు
ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వం

ఈనాడు, అమరావతి: రూ.లక్ష కోట్ల పెట్టుబడులు.. లక్ష మందికి ఉపాధి లక్ష్యంగా ‘ఏరోస్పేస్‌.. డిఫెన్స్‌’ పాలసీ 4.0’ను ప్రభుత్వం తీసుకొచ్చింది. పాలసీ విధివిధానాలను ఖరారు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. నౌకల నిర్మాణం.. అంతరిక్ష రంగానికి సంబంధించిన ఉపకరణాల తయారీ కేంద్రంగా రాష్ట్రాన్ని తీర్చిదిద్దడమే లక్ష్యంగా పేర్కొంది. ఈ రంగంలో పెరుగుతున్న అవసరాలు.. సవాళ్లను పరిష్కరించేందుకు ఆధునిక మౌలిక సదుపాయాలను కల్పించడం.. నైపుణ్య అభివృద్ధిని ప్రోత్సహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. విద్యాసంస్థలు, పరిశ్రమలు, పరిశోధన సంస్థల మధ్య సమన్వయం కల్పించడమే లక్ష్యమని పేర్కొంది. ఎంఎస్‌ఎంఈలు, స్టార్టప్‌లకు, భారీ పరిశ్రమల ఏర్పాటుకు అనువైన వాతావరణాన్ని రాష్ట్రంలో కల్పించనున్నట్లు తెలిపింది. 


లక్ష్యాలు

  • అంతరిక్ష, రక్షణ రంగాల్లో యాంకర్‌ యూనిట్లను గుర్తించడం.
  • రూ.లక్ష కోట్ల పెట్టుబడుల ఆకర్షణ.
  • హబ్‌ అండ్‌ స్పోక్‌ విధానంలో ఎంఎస్‌ఎంఈ పార్కుల అభివృద్ధిపై దృష్టి.
  • ఐదేళ్లలో లక్ష మందికి ఉపాధి కల్పన.
  • వినూత్న సాంకేతికతల ఆవిష్కరణ కోసం సెంటర్‌ ఆఫ్‌ ఎక్స్‌లెన్స్‌ (సీవోఈ) కేంద్రాల ఏర్పాటు.

ప్రోత్సాహకాలు

  • సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు కేంద్ర ప్రభుత్వం (ఎంఎస్‌ఎంఈల పెట్టుబడుల ఆధారంగా కేటగిరీలు నిర్దేశించింది) మార్గదర్శకాల మేరకు పెట్టుబడి మొత్తం ఆధారంగా కేటగిరీలుగా గుర్తింపు.
  • రూ.125 కోట్ల నుంచి రూ.500 కోట్ల వరకు భారీ పరిశ్రమల కేటగిరీగా పరిగణించి.. ప్రోత్సాహకాల చెల్లింపు.
  • రూ.500 కోట్ల కంటే ఎక్కువ పెట్టుబడి పెట్టే సంస్థలను లార్జ్‌ కేటగిరీగా గుర్తింపు.
  • సాంకేతిక బదిలీ కోసం చేసే ఖర్చులో 50 శాతం రాయితీ.. గరిష్ఠంగా రూ.కోటి.
  • వినియోగించే విద్యుత్‌పై యూనిట్‌కు రూపాయి రాయితీ.. 5 ఏళ్ల పాటు వర్తింపు.
  • ప్రత్యేక కేటగిరీ కింద ఏర్పాటు చేసే పరిశ్రమలకు విద్యుత్‌ రాయితీ యూనిట్‌కు రూ.1.50 చొప్పున.. 5 ఏళ్ల పాటు చెల్లింపు.
  • భారీ, మెగా పరిశ్రమలకు చెల్లించే రాయితీలను ప్రత్యేకంగా ప్రభుత్వం పేర్కొంది. 

విద్యార్థులు.. అంకుర సంస్థలకు

  • స్టార్టప్‌ గ్రాంటు కింద.. వినూత్న ఆవిష్కరణల ఆలోచనలతో వచ్చే అంకుర సంస్థలకు తొలుత రూ.2 లక్షల నుంచి రూ.15 లక్షల వరకు దశల వారీగా అందించాలని నిర్ణయం
  • మహిళలు/బీసీ/ఎస్సీ/ఎస్టీ/మైనారిటీ/దివ్యాంగులకు.. రూ.20 లక్షల వరకు గ్రాంటుగా ప్రభుత్వం అందిస్తుంది. 
  • వాటితో పాటు సీడ్‌ ఫండ్, మార్కెట్‌ మద్దతు, వడ్డీ రాయితీ, ప్రదర్శనలకు హాజరయ్యేందుకు అయ్యే ఖర్చులు, పేటెంట్‌ కోసం చేసే ఖర్చులు, జీఎస్‌టీ తిరిగి చెల్లింపు.

ap270625main49b.webp

 
 
 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.