October 4Oct 4 Author చీకటి కోనేరు.. నూతన శోభతో అలరారుBy Andhra Pradesh Dist. DeskUpdated : 04 Oct 2026 05:28 ISTEeFont size1 min read మంత్రి లోకేశ్ చొరవతో సుందరీకరణఆలయం ఎదుట చీకటి కోనేరు ఇలా....మంగళగిరి టౌన్, న్యూస్‌టుడే: ఒకప్పుడు పిచ్చి మొక్కలు, ఆక్రమణలతో నిండిన మంగళగిరిలోని చీకటి కోనేరు మంత్రి నారా లోకేశ్ చొరవతో సుందరీకరణకు నోచుకుంది. నృసింహస్వామి ఆలయం వద్ద ఒకప్పుడు కొనేరు ఉందని కూడా ఇతర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు తెలిసేది కాదు. తాజాగా రూ.10 లక్షలతో చీకటి కోనేరును సుందరీకరించారు. దీనికి విశిష్టమైన చరిత్ర ఉంది. నృసింహ స్వామి ఆలయంలో 11 అంతస్తుల గాలిగోపురం ఎదురుగా ఉన్న దీనిని వందేళ్ల క్రితం తవ్వారని చరిత్రకారుల మాట. అలాంటి కోనేరు ప్రస్తుతం నూతన శోభలో అలరారుతోంది. కోనేటిలో ఉన్న చెత్తను తొలగించి శుభ్రపరిచారు.దాని చుట్టూ ఇనుప గ్రిల్స్, టైల్స్‌తో ఫ్లోరింగ్ వేసి అందంగా ఆధునికీకరించారు. ఆలయానికి వచ్చిన భక్తులు కొద్దిసేపు సేద తీరేందుకు అవసరమైన సిమెంటు బల్లలను ఏర్పాటు చేశారు. ఆహ్లాదాన్ని పంచేందుకు పచ్చటి మొక్కలు నాటారు. దశాబ్దాల నాటి చీకటి కోనేరు విశిష్టత భక్తులకు తెలిసేలా తీర్చిదిద్దారు. ఈమేరకు పూర్తయిన పనులను ఆలయ సహాయ కమిషనర్ కోగంటి సునీల్ కుమార్ శనివారం పాలకమండలి సభ్యులతో కలిసి పరిశీలించి భక్తులను అనుమతించారు.
Create an account or sign in to comment