November 26, 2025Nov 26 Author అదిరింది.. మంగళగిరి రైల్వేస్టేషన్ By Andhra Pradesh Dist. DeskUpdated : 26 Nov 2025 09:30 IST Ee Font size 1 min read తుది దశకు ఆధునికీకరణ పనులు ఆకట్టుకునేలా ఇలా.. మంగళగిరి గ్రామీణం, మంగళగిరి, న్యూస్‌టుడే: రాజధాని అమరావతికి ముఖ ద్వారంగా ఉన్న మంగళగిరి రైల్వేస్టేషన్ నూతన హంగులు సంతరించుకుంటోంది. రాష్ట్రం నలుమూలల నుంచి రాజధానికి వచ్చే ప్రయాణికులకు ఇక్కటి సంస్కృతి, సంప్రదాయాలు కళ్లకు కట్టినట్టుగా చూపించేందుకు చిత్రాలు, బొమ్మలతో తీర్చిదిద్దారు. స్వాగత ద్వారం నుంచి లోపలి వెళ్లే మార్గంతోపాటు ఆవరణ పచ్చదనంతో కళకళలాడుతోంది. విశాలమైన పార్కింగ్ సౌకర్యం కల్పించారు. ‘అమృత్ భారత్’ పథకంలో భాగంగా రూ.12.06 కోట్లతో చేస్తున్న పనులు తుది దశకు చేరుకున్నాయి. వృద్ధులు, దివ్యాంగులకు లిఫ్ట్ సౌకర్యం, ఇతర అధునాతన సౌకర్యాలు కల్పించారు. అన్ని విభాగాలను పూర్తిస్థాయిలో ఆధునికీకరించారు. రెండు ఫ్లాట్‌ఫాంలు ఉండగా.. నాలుగుకు పెంచారు. ప్రయాణికుల కోసం ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మించారు. ప్రస్తుతం 36 రైళ్లకు హాల్ట్ ఉంది. భవిష్యత్తులో మరిన్ని రైళ్లు నిలిపేలా ఏర్పాట్లు చేస్తున్నారు. రాజధాని అమరావతిలో ఉద్యోగుల కోసం సికింద్రాబాద్ నుంచి ఓ రైలు ప్రత్యేకంగా నడుపుతున్నారు. రాజధానిలో అతి పెద్ద రైల్వే స్టేషన్‌గా మంగళగిరి స్టేషన్‌ను తీర్చిదిద్దుతున్నారు. జనవరి నాటికి పూర్తి చేసి రంగులతో తీర్చిదిద్దిన మెట్లు
February 10Feb 10 Author నృసింహ సన్నిధికి మహర్దశ By Andhra Pradesh Dist. DeskUpdated : 10 Feb 2026 06:47 IST Ee Font size 1 min read ‘ప్రసాద్’ పథకంలో అభివృద్ధికి ప్రణాళిక రూ.140 కోట్ల అంచనాతో డీపీఆర్ మంత్రి నారా లోకేశ్ చొరవ తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే మంత్రి నారా లోకేశ్ చొరవతో ప్రసిద్ధ మంగళగిరి శ్రీపానకాల లక్ష్మీనృసింహస్వామి ఆలయానికి మహర్దశ రానుంది. కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన ‘ప్రసాద్’ పథకంలో ఆలయ అభివృద్ధికి సంబంధించి డీపీఆర్‌ను సిద్ధం చేస్తున్నారు. దాదాపు రూ.140 కోట్లతో ఈ పనులు చేపట్టాలని సంకల్పించారు. ఇందుకుగానూ దేవాదాయశాఖ కమిషనర్‌ను ప్రత్యేకాధికారిగా నియమించారు. ఈ పథకంలో సింహాచలం, అన్నవరం, శ్రీశైలం, అమరావతి ఆలయాలను ఇప్పటికే చేర్చారు. వారసత్వ సంపదను, గత వైభవం దెబ్బతినకుండా ఉన్న ఆలయాలను అదే రీతిలో కొనసాగిస్తూ దేశం నలుమూలల నుంచి నృసింహుని దర్శించుకునే భక్తులకు సకల సౌకర్యాలు కల్పించేందుకు పలు అంశాలను పొందుపరిచారు. సంబంధిత సమాచారాన్ని కేంద్రానికి పంపారు. చిన్నచిన్న మార్పులతో డీపీఆర్ పూర్తిచేసి టెండర్లు ఆహ్వానానికి కసరత్తు చేస్తున్నారు. ప్రతిపాదిత అంశాలు ఇలా.. కొండ శిఖర భాగాన గండాలయస్వామి ఆలయ అభివృద్ధితోపాటు నేరుగా కొండపైకి వెళ్లేందుకు రోప్‌వే కొండపై పార్కింగ్, ఉద్యానవనాలు ఏర్పాటు దిగువ భాగాన భక్తుల సౌకర్యార్థం వసతి గదుల నిర్మాణం, కొండపై శిఖరాన 18 అడుగుల ఎత్తులో ‘మంగళగిరి’ అనే పేరుతో అక్షరాలు. దేవాలయానికి వెళ్లే మార్గంలోని పోలీసులు క్వార్టర్స్ స్థలాన్ని ఆలయానికి తీసుకుని భక్తులు సౌకర్యార్థం అభివృద్ధి చేయడం ఆలయ ప్రాశస్త్యం, చారిత్రక అంశాలతో మ్యూజియం ఎయిమ్స్ రహదారి నుంచి పానకాలస్వామి కొండపైకి మరో ఘాట్‌రోడ్డు నిర్మాణం అసంపూర్తిగా నిలిచిన పడమర గాలిగోపురం నిర్మాణం పూర్తి చేయడం
Create an account or sign in to comment