July 25, 20251 yr Author జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్‌ను మోడల్‌గా నిర్మించాలి By Andhra Pradesh News DeskUpdated : 25 Jul 2025 06:24 IST Ee Font size 1 min read అధికారులతో మంత్రి లోకేశ్ అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేశ్ తాడేపల్లి, న్యూస్‌టుడే: దేశంలోనే అత్యుత్తమంగా మంగళగిరిలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్కును నిర్మించాలని మంత్రి నారా లోకేశ్ సూచించారు. ఉండవల్లి నివాసంలో జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్‌పై అధికారులతో ఆయన గురువారం సమీక్ష నిర్వహించారు. టాప్-20 జ్యువెలరీ సంస్థల యూనిట్లు ఇందులో స్థాపించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఏటా నాలుగువేల మందికి ఆభరణాల తయారీలో శిక్షణ ఇచ్చేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు. మంగళగిరిలో ఏర్పాటు చేయనున్న జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్‌తోపాటు కేంద్ర ప్రభుత్వ సహకారంతో కామన్ ఫెసిలిటీ సెంటర్ నిర్మాణాన్ని త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. ఆభరణాల తయారీ యూనిట్లు, రిటైల్ షాపులు స్థాపించేలా అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. ఉడుపిలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ జేమ్స్ అండ్ జ్యువెలరీ (ఐఐజీజె) పనితీరును అధ్యయనం చేయాలని అధికారులకు సూచించారు. మంగళగిరిలో యువతకు నైపుణ్య శిక్షణ అందించే మోడల్ కెరీర్ సెంటర్ (ఎంసీసీ)ను త్వరితగతిన ఏర్పాటు చేయాలన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ సీఈవో గణేష్‌కుమార్ స్పందిస్తూ పార్క్‌లో సెంటర్ ఆఫ్ ఎక్స్‌లెన్స్, కామన్ ఫెసిలిటీ సెంటర్, ఇండస్ట్రియల్ జోన్, కమర్షియల్ అండ్ రిటైల్ జోన్, మాన్యుఫ్యాక్చరింగ్ జోన్, రెసిడెన్షియల్ ఇన్‌ఫ్రా జోన్లు అంతర్భాగాలుగా ఉంటాయని వివరించారు. మంగళగిరిలో ఇప్పటివరకు చేపట్టిన మూడు జాబ్ ఫెయిర్లకు 1170 మంది యువకులు హాజరుకాగా 453 మందికి ఉద్యోగాలు లభించాయని అధికారులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
November 10, 2025Nov 10 Author అంతర్జాతీయ విద్యా ప్రమాణాలతో ‘లీప్’ పాఠశాల By Andhra Pradesh News DeskPublished : 10 Nov 2025 05:49 IST Ee Font size 1 min read మంత్రి లోకేశ్ చొరవతో శరవేగంగా పనులు నిర్మాణంలో ఉన్న పాఠశాల ముఖద్వారం తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: ఆకట్టుకునే పాఠశాల భవనాలు, ఆహ్లాదపరిచే ప్రాంగణాలు, అద్భుత ప్రయోగశాలలు, అంతర్జాతీయ ప్రమాణాలతో విద్యాబోధన ఇవన్నీ ఒకేచోట అందేలా విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవ చూపుతున్నారు. ‘లెర్నింగ్ ఎక్స్‌లెన్స్ ఇన్ ఏపీ’(లీప్) పేరుతో నూతన ప్రయోగానికి నడుం కట్టారు. ఇందుకోసం గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నిడమర్రు జడ్పీ ఉన్నత పాఠశాలను పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేశారు. ఐదెకరాల విస్తీర్ణంలో 22 గదులతో ఉన్న ఈ పాఠశాల భవనాలను రూ.14 కోట్ల వ్యయంతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దుతున్నారు. ఇందులో భాగంగా జీ+1 భవనానికిపైన మరో అంతస్తు ఏర్పాటుచేసి ఇండోర్ స్టేడియం, యాంఫీ థియేటర్ ఏర్పాటు చేస్తున్నారు. ప్రాంగణంలో వాకింగ్, రన్నింగ్ ట్రాక్, క్రీడా మైదానం, అంతర్గత రోడ్లు తదితర పనులను వేగంగా నిర్వహిస్తున్నారు. ఇండోర్ గేమ్స్ కోసం షెడ్డు ఏర్పాటు చేస్తున్నారు. పాఠశాల నిర్మాణం ‘యూ’ ఆకారంలో ఉండేలా డిజైన్ చేశారు. రానున్న ఐదేళ్లలో విద్యావ్యవస్థలో తీసుకురావాల్సిన మార్పులతో ‘లీప్’ పాఠశాల రూపొందుతోంది. ఇక్కడ ప్రాథమిక విద్య నుంచి ప్రాథమికోన్నత స్థాయి వరకూ బోధన చేపట్టాలని నిర్ణయించారు. డిజిటల్ అక్షరాస్యత 21వ శతాబ్దపు స్కిల్స్‌తో కూడిన విద్యా ప్రమాణాలను ప్రవేశ పెట్టనున్నారు. డిజిటల్ అక్షరాస్యత, 21వ శతాబ్దపు స్కిల్స్‌తో కూడిన విద్యా ప్రమాణాలను ఇక్కడ ప్రవేశ పెట్టనున్నారు. ‘లీప్’ కార్యక్రమంతో ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు దీటుగా తయారు చేయాలని ప్రభుత్వం సంకల్పించింది.
Create an account or sign in to comment