sonykongara Posted March 27 Author Posted March 27 మంగళగిరికి భూగర్భ విద్యుత్తు వెలుగులు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి (ఎంటీఎంసీ)లో భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు విద్యుత్తుశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరం వేగంగా విస్తరిస్తున్న వేళ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. By Andhra Pradesh Dist. DeskPublished : 27 Mar 2025 05:47 IST Ee Font size 2 min read రూ.785 కోట్లతో ప్రతిపాదనలు ఈనాడు - అమరావతి: మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ పరిధి (ఎంటీఎంసీ)లో భూగర్భ విద్యుత్తు లైన్ల ఏర్పాటుకు విద్యుత్తుశాఖ ప్రతిపాదనలు సిద్ధం చేసింది. నగరం వేగంగా విస్తరిస్తున్న వేళ భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా వీటిని రూపొందించింది. మంగళగిరి నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి నారా లోకేశ్ ప్రత్యేక చొరవతో ప్రగతికి బాటలు వేస్తున్నారు. ఇందుకు అనుగుణంగా మౌలిక వసతుల కల్పనపై ప్రభుత్వం దృష్టి పెట్టింది. భూగర్భ విద్యుత్తు లైన్లకు రూ. 785 కోట్లు అవసరమని అంచనా. రీవ్యాంప్డ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీమ్ (ఆర్‌డీఎస్‌ఎస్) ద్వారా రుణం తీసుకుంటారు. కేంద్రం సూచించిన ఏజెన్సీ ప్రాజెక్టు సాంకేతిక అంశాలపై అధ్యయనం చేస్తోంది. 15 రోజుల్లో నివేదిక ఇవ్వనుంది. ఆర్‌డీఎస్‌ఎస్ రుణం మంజూరైతే ఏడాదిన్నర వ్యవధిలో పనులు పూర్తి చేసేలా విద్యుత్తుశాఖ కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేసింది. ఎందుకంటే... ప్రస్తుత వ్యవస్థలో స్తంభాలు, తీగలకు అడ్డుగా ఉన్న చెట్లను నరికేస్తున్నారు. భారీవర్షాలు, ఈదురుగాలులకు స్తంభాలు నేలవాలి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఒక్కోసారి తీగలు తెగిపడి ప్రాణం మీదకు తెస్తున్నాయి. రహదారి పక్కనే ఉన్న స్తంభాలను వాహనాలు ఢీకొడుతున్నాయి. ప్రకృతి విపత్తుల సమయాల్లో విద్యుత్తు వ్యవస్థ దెబ్బతింటోంది. వీటన్నిటికీ పరిష్కారమార్గంగానే భూగర్భ లైన్ల ప్రాజెక్టు పట్టాలెక్కుతోంది. సింగిల్‌ఫేజ్ సర్వీసులకు లైన్లు ఎంతైనా పెంచుకోవచ్చు. వీధి దీపాలకు ప్రత్యేక లైను ఉంటుంది. 410 కిలోమీటర్ల తీగలు అవసరమని అంచనా. ఎంటీఎంసీ పరిధిలో ప్రస్తుతం 68 వేల కనెక్షన్లున్నాయి. 15% అదనంగా 90 వేల కనెక్షన్ల వరకు ఇబ్బంది లేకుండా లైన్లు ఉంటాయి. 15 ఏళ్ల వరకు లైన్లు పెంచాల్సిన అవసరం ఉండదు. 33కేవీ లైన్లు: 159 కి.మీ. 11 కేవీ: 227 కి.మీ. ఎల్‌టీ లైను: 2వేల కి.మీ. ఎలా వేస్తారంటే.... 33కేవీ, 11కేవీ, ఎల్‌టీ లైన్లు భూగర్భంలో ఒకే డక్‌లో ఏర్పాటు చేస్తారు. డక్‌పై సర్వీసు ఫిల్లర్స్ ఉంటాయి. వీటి నుంచి వినియోగదారులకు సరఫరా ఇస్తారు.- ఇందుకవసరమైన తీగలను డిస్కం సమకూరుస్తుంది. 33 కేవీ లైన్లు ఒకేసారి రెండు వేస్తారు. సాంకేతిక కారణాలతో లైనులో అంతరాయం ఏర్పడితే ప్రత్యామ్నాయంగా మరో లైను వాడతారు. 33 కేవీ నుంచి 11కేవీకి 11కేవీ నుంచి 500కేవీఏ నియంత్రికలకు విద్యుత్తు పంపి.. అక్కడి నుంచి ఎల్‌టీ లైన్ల ద్వారా సర్వీసు ఫిల్లర్స్‌కు సరఫరా చేసి సర్వీసులకు అందిస్తారు. సరఫరాలో ఇబ్బందులుంటే ఫాల్ట్ లోకేటర్ పరికరం ద్వారా గుర్తించి అక్కడ తవ్వి సరిచేస్తారు. Mobile GOM 1
sonykongara Posted March 28 Author Posted March 28 మురుగు కనబడదు మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2056 నాటికి 5.63 లక్షల మంది నివసిస్తారన్న అంచనాతో అధికారులు యూజీడీ ప్రణాళిక రూపొందించారు. By Andhra Pradesh Dist. DeskPublished : 28 Mar 2025 04:19 IST Ee Font size 2 min read మంగళగిరిలో యూజీడీ రూ. 1,275 కోట్లతో ప్రతిపాదన ఈనాడు - అమరావతి దోమల నిలయంగా మంగళగిరిలోని మురుగుకాలువ మంగళగిరి-తాడేపల్లి నగరపాలక సంస్థ (ఎంటీఎంసీ)లో భూగర్భ మురుగునీటి పారుదల వ్యవస్థ (యూజీడీ) ఏర్పాటుకు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. 2056 నాటికి 5.63 లక్షల మంది నివసిస్తారన్న అంచనాతో అధికారులు యూజీడీ ప్రణాళిక రూపొందించారు. ప్రాథమిక అంచనాల ప్రకారం రూ. 1,275 కోట్లు అవసరమని తేల్చారు. విజయవాడ, అమరావతికి అనుసంధానంగా ఉండడంతో ప్రాధాన్యం పెరిగింది. ఐటీ కంపెనీలు, వాణిజ్య సంస్థలు ఏర్పాటు కావడంతో నగరం వేగంగా విస్తరిస్తోంది. ప్రాజెక్టు ఎందుకంటే... ఎంటీఎంసీలో ఉత్పన్నమవుతున్న మురుగునీరు శుద్ధి కాకుండానే నేరుగా గుంటూరువాహిని, బకింగ్‌హామ్‌కాలువ, కృష్ణా నదిలో పలుచోట్ల కలుస్తోంది. దీనికి అడ్డుకట్ట వేయాల్సి ఉంది. మురుగునీటి శుద్ధి ప్లాంట్లు ఏర్పాటు చేసి నీటిని శుద్ధి చేశాక విడుదల చేయడం వల్ల ఉపరితల జలాలు కలుషితం కాకుండా ఉంటాయి. ఈ నీటిని మొక్కల పెంపకానికి ఉపయోగించుకోవచ్చు. నగరం పరిశుభ్రంగా ఉంటుంది. దోమల బెడద తగ్గుతుంది. హైబ్రీడ్ యాన్యుటీ కింద 50%, సీఆర్డీఏ నుంచి 25%, అర్బన్ ఛాలెంజ్ ఫండ్ కింద కేంద్రం నుంచి 25% నిధులు సమకూర్చాలని యంత్రాంగం నిర్ణయించింది. స్పష్టత వచ్చాక ప్రాజెక్టు పట్టాలెక్కుతుంది. వికేంద్రీకరణతో శుద్ధి ప్లాంట్లు మంగళగిరి-తాడేపల్లి ఎత్తుపల్లాలు, కొండప్రాంతాలు, కాలువలతో భౌగోళికంగా భిన్నంగా ఉంటుంది. ప్రభుత్వ స్థలాలు పరిమితంగా అందుబాటులో ఉన్నందున మురుగునీటిని ఒకే ప్రాంతానికి పంపి అక్కడ శుద్ధి చేయడం కాకుండా.. 20 చోట్ల ఎస్టీపీలు ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఎక్కడికక్కడ 1 ఎంఎల్‌డీ సామర్థ్యంతో ప్లాంట్లు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకు సవివర ప్రాజెక్టు నివేదిక తయారు చేయనున్నారు. ఎంటీఎంసీ విస్తీర్ణం: 194.41 చదరపు కిలోమీటర్లు 2041 నాటికి మురుగునీరు రోజుకు 49 మిలియన్ లీటర్లు ఉంటుందని అంచనా. మురుగునీటి ప్రవాహాన్ని 20 జోన్లుగా విభజించి ఎస్టీపీలు నిర్మిస్తారు. మొత్తం 540 కిలోమీటర్ల మేర మురుగుప్రవాహ లైన్లు ఉంటాయి. 21 వేల మ్యాన్‌హోల్స్ నిర్మిస్తారు.
sonykongara Posted May 31 Author Posted May 31 మంగళగిరిలో ‘గోల్డ్‌హబ్’ ఏర్పాటుకు అడుగులు గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘గోల్డ్‌హబ్’ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. By Andhra Pradesh News DeskPublished : 31 May 2025 04:43 IST Ee Font size 1 min read భూములిచ్చేందుకు రైతుల అంగీకారం అంగీకార సంతకాలు చేస్తున్న రైతులు తాడేపల్లి, మంగళగిరి, న్యూస్‌టుడే: గుంటూరు జిల్లా మంగళగిరిలో ‘గోల్డ్‌హబ్’ ఏర్పాటు దిశగా వేగంగా అడుగులు పడుతున్నాయి. ఆభరణాల తయారీలో ముంబయి, కోల్‌కతా, కోయంబత్తూర్ వంటి నగరాలకు దీటుగా ఇక్కడ ‘గోల్డ్‌హబ్’ పేరుతో దేశంలోనే అతిపెద్ద జెమ్స్ అండ్ జ్యువెలరీ పార్క్ ఏర్పాటు చేసి, స్వర్ణకారుల భవిష్యత్తు మారుస్తామని ఎన్నికల సమయంలో మంత్రి లోకేశ్ హామీ ఇచ్చారు. ఆ హామీ సాకారం దిశగా అడుగులు పడుతున్నాయి. ఇందుకోసం మంగళగిరి, పెదవడ్లపూడి మధ్య అవసరమైన భూములపై అధికారులు దృష్టిసారించారు. ఆయా భూముల రైతులతో మంగళగిరి మండలం ఆత్మకూరు జడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో శుక్రవారం రెవెన్యూ అధికారులు సమావేశమయ్యారు. 180 మంది రైతులు సుమారు 76 ఎకరాలను భూ సమీకరణకు ఇచ్చేందుకు అంగీకారం తెలిపి సంతకాలు చేశారు. వీరిలో చిన్న, సన్నకారు కర్షకులే ఎక్కువగా ఉన్నారు. భూములిచ్చిన వారికి ఎన్ని గజాలు అభివృద్ధి ప్లాట్ల కింద ఇస్తారు..? తదితర వివరాలను తర్వాతి సమావేశాల్లో వెల్లడిస్తామని అధికారులు చెప్పారు. కార్యక్రమంలో తెనాలి సబ్‌కలెక్టర్ సంజనాసింహ, మంగళగిరి తహసీల్దార్ దినేష్ రాఘవేంద్ర తదితరులు పాల్గొన్నారు
Recommended Posts
Create an account or sign in to comment
You need to be a member in order to leave a comment
Create an account
Sign up for a new account in our community. It's easy!
Register a new accountSign in
Already have an account? Sign in here.
Sign In Now