December 2, 2025Dec 2 Author Visakhapatnam: విశాఖ సిగలో మరో అందం By Andhra Pradesh News DeskPublished : 02 Dec 2025 05:09 IST Ee Font size 1 min read కైలాసగిరిపై గాజు వంతెన ప్రారంభం గాజు వంతెన పైనుంచి వ్యూ ఇలా.. విశాఖపట్నం (విశాలాక్షినగర్), న్యూస్‌టుడే: గాజు వంతెనతో విశాఖలో పర్యాటకం మరింత అభివృద్ధి చెందుతుందని ఎంపీ శ్రీభరత్ అన్నారు. కైలాసగిరిపై వీఎంఆర్‌డీఏ, సాయి మోక్ష షిప్పింగ్ అండ్ లాజిస్టిక్స్, భారత్‌మాత వెంచర్స్ (ఆర్జే ఎడ్వంచర్స్) సంయుక్తంగా రూ.7 కోట్ల వ్యయంతో నిర్మించిన గాజు వంతెనను సోమవారం ఆయన ప్రారంభించారు. కార్యక్రమంలో వీఎంఆర్‌డీఏ ఛైర్మన్ ఎంవీ ప్రణవ్ గోపాల్, కమిషనర్ తేజ్‌భరత్‌లు మాట్లాడుతూ సముద్ర మట్టానికి 1,020 అడుగుల ఎత్తున, 40 ఎంఎం మందం గల గాజుతో ఈ వంతెనను నిర్మించామన్నారు. దేశంలోనే అతి పెద్దదైన ఈ గాజు వంతెనకు ఒకే సారి 100 మందిని మోయగలిగే సామర్థ్యం ఉన్నప్పటికీ భద్రత దృష్ట్యా 40 మందిని మాత్రమే అనుమతిస్తామన్నారు. ఉదయం 10 నుంచి సాయంత్రం 7 గంటల వరకు ప్రవేశం ఉంటుందని, రుసుం ఒకరికి (పిల్లలకు, పెద్దలకు) రూ.300గా నిర్ణయించామన్నారు. 10 నిమిషాల పాటు వంతెన పైనుంచి పచ్చని కొండలు, సాగరతీర అందాలు వీక్షించవచ్చని వివరించారు. కార్యక్రమంలో నగర మేయర్ పీలా శ్రీనివాసరావు, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్‌డీఏ సంయుక్త కమిషనర్ రమేష్, తదితరులు పాల్గొన్నారు. కింద నుంచి చూస్తే గాజు వంతెన ఇలా గాజు వంతెనపై ఎంపీ శ్రీభరత్, ఎమ్మెల్యే వెలగపూడి రామకృష్ణబాబు, వీఎంఆర్డీఏ ఉన్నతాధికారులు
Create an account or sign in to comment