Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag

Featured Replies

  • Replies 338
  • Views 24.9k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • 4 weeks later...
  • Author

విశాఖ దశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు

 

Eenadu icon
By Andhra Pradesh Dist. TeamPublished : 13 Oct 2025 05:55 IST
Ee
Font size
 
 
 
 
1 min read
 
 

సమీక్షలో మంత్రి నారా లోకేశ్‌

121025VSC-2a.webp

ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షిస్తున్న మంత్రి నారా లోకేష్‌

వన్‌టౌన్, న్యూస్‌టుడే: విశాఖ దశదిశ మారేలా అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలని రాష్ట్ర విద్య, ఐటీశాఖల మంత్రి నారా లోకేశ్‌ ప్రజాప్రతినిధులు, అధికారులను ఆదేశించారు. ఆదివారం నగర పర్యాటనకు వచ్చిన ఆయన ఉత్తరాంధ్ర జిల్లాల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులతో కలెక్టరేట సమావేశ మందిరంలో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘విశాఖపట్నం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలతో కూడిన ప్రాంతీయ ఎకానమీ జోన్‌ ఏర్పాటుపై చర్చించారు.

  • బెంగళూరు, పుణెలాంటి నగరాల్లో వలె విశాఖలో ట్రాఫిక్‌ సమస్యలు లేకుండా చూడాలి. అందుకు తగ్గట్టుగా రహదారులను విస్తారంగా అభివృద్ధి చేయాలి. 
  • 30ఏళ్ల భవిష్యత్తును ఊహించి అభివృద్ధి ప్రణాళికలు రూపొందించాలి. ప్రజాప్రతినిధులు, అధికారుల మధ్య సమన్వయంతో కూడిన మేధోపరమైన చర్చ జరగాలి. 
  • కూటమి నాయకులు, అధికారులు సరైన విధంగా ఆలోచించి, ప్రజలకు ఆమోదయోగ్యమైన నిర్ణయాలు తీసుకోవాలి. అలాగే రానున్న రోజుల్లో విశాఖ రీజియన్‌లో ఐటీ పార్కులు ఏర్పాటు చేయడానికి అనువైన భూనిధిని సిద్ధం చేయాలి.’ అని నారా లోకేశ్‌ ఆదేశించారు.
  • వివిధ ఐటీ కంపెనీలు, అతి పెద్ద స్టీల్‌ప్లాంటు రాబోతున్నాయి. తద్వారా యువతకు 5లక్షల ఉద్యోగాలు వచ్చేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.

కార్యక్రమంలో ఐటీ కార్యదర్శి కాటమనేని భాస్కర్, తూర్పు, పశ్చిమ ఎమ్మెల్యేలు వెలగపూడి రామకృష్ణబాబు, గణబాబు, నగర మేయర్‌ పీలా శ్రీనివాసరావు, ఎన్టీఆర్‌ వైద్య సేవ ట్రస్టు ఛైర్మన్‌ సీతంరాజు సుధాకర్, ఏపీ గ్రోవర్స్‌ ఆయిల్స్, సీడ్స్‌ కార్పొరేషన్‌ ఛైర్మన్‌ గండి బాబ్జీ, విశాఖ, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల కలెక్టర్లు హరేంధిరప్రసాద్, విజయకృష్ణన్, రాంసుందర్‌రెడ్డి, స్వప్నిల్‌ దినకర్‌ పుండర్కర్, వీఎంఆర్‌డీఏ కమిషనర్‌ కె.ఎస్‌. విశ్వనాథన్, జేసీ కె.మయూర్‌ అశోక్, తదితరులు పాల్గొన్నారు. 

  • Author

Visakhapatnam: 20వేల ఎకరాలతో గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌

 

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 26 Oct 2025 06:28 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

నీతి ఆయోగ్‌ వీఈఆర్‌ ప్రాజెక్టులో భాగంగా అడుగులు
2047 నాటికి ట్రిలియన్‌ డాలర్లకు చేరుకునేలా లక్ష్యం
మంత్రి లోకేశ్‌ ఆదేశాలతో సిద్ధం చేస్తున్న ప్రణాళికలు

261025brk125196099a.webp

ఈనాడు, విశాఖపట్నం: గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌కు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఇటీవల విశాఖ పర్యటనలో మంత్రి లోకేశ్‌ విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి జిల్లాలను కలిపి ఎకనమిక్‌ జోన్‌గా చేయాలని తెలిపారు. నాలుగు జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలివ్వడంతో 20వేల ఎకరాల భూసేకరణకు ప్రణాళిక సిద్ధం చేస్తున్నారు. విశాఖలో 3-5వేల ఎకరాలు, మిగిలిన మూడు జిల్లాల నుంచి 15వేల ఎకరాల ప్రభుత్వ, ప్రైవేటు భూములను సేకరించాలని చూస్తున్నారు. ఇవి జాతీయరహదారికి అనుసంధానం అయ్యేలా మౌలిక వసతులు ఎలా అభివృద్ధి చేయాలనేదానిపై సమగ్ర ప్రణాళికలకు సిద్ధమవుతున్నారు.

విశాఖను దేశంలోనే ఒక ముఖ్యమైన ఆర్థికకేంద్రంగా అభివృద్ధి చేయాలన్న లక్ష్యమే ఎకనమిక్‌ జోన్‌కు శ్రీకారం చుట్టింది. విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ (వీఈఆర్‌) పేరుతో ఓ ప్రాజెక్టును నీతి ఆయోగ్‌ తీసుకొచ్చింది. ఇందులో విశాఖ, విజయనగరం, శ్రీకాకుళం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యంతో కలిపి మొత్తం 8 జిల్లాలుంటాయి.

లక్ష్యం ఇదీ

ప్రస్తుతం ఈ ప్రాంత జీడీపీ 49 బిలియన్‌ డాలర్లుగా ఉంది. 2032 నాటికి 120 బిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దాలని వీఈఆర్‌ ప్రాజెక్టులో లక్ష్యంగా పెట్టారు. 2032 నాటికి ఈ ప్రాజెక్టు ద్వారా 20లక్షల ఉద్యోగాలు వస్తాయని అంచనా. ఆర్థిక రాజధానిగా విశాఖను తీర్చిదిద్దడానికి కూటమి ప్రభుత్వం ఇప్పటికే ప్రత్యేక ప్రణాళికలు రచిస్తోంది. వీటిని దృష్టిలో పెట్టుకునే సిఫి డేటాసెంటర్‌ భూమిపూజకు విశాఖ వచ్చిన మంత్రి లోకేశ్‌ ‘2047 నాటికి రాష్ట్రాన్ని 2.4 ట్రిలియన్‌ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయాలంటే గ్రేటర్‌ విశాఖ జోన్‌ ఆర్థిక అభివృద్ధి ఒక ట్రిలియన్‌ డాలర్లకు చేరుకోవాలని లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం’ అని మీడియాకు తెలిపారు.

ఏడింటిపై ప్రత్యేక దృష్టి

గ్రేటర్‌ విశాఖ ఎకనమిక్‌ జోన్‌ అభివృద్ధికి నీతి ఆయోగ్‌ ఏడు ప్రధాన అంశాలపై దృష్టిసారించింది. అవి.. 

  • పోర్టుల ద్వారా వాణిజ్యాన్ని ప్రోత్సహించడం 
  • ఐటీ హబ్‌లు, ఇన్నోవేషన్‌ సెంటర్లు అభివృద్ధి చేయడం 
  • ఆగ్రో ప్రాసెసింగ్‌ పరిశ్రమలు, వ్యవసాయంపై దృష్టిపెట్టడం 
  • పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడం 
  • పెరుగుతున్న జనాభాకు తగ్గట్టు ఆరోగ్య సదుపాయాల కల్పన 
  • మౌలిక వసతుల ప్రణాళిక, నగరం.. పట్టణాల అభివృద్ధి 
  • రోడ్లు, రైల్వే, పోర్టుల్లాంటి మౌలికవసతుల అభివృద్ధిలో పెట్టుబడులు పెట్టడం (77 కి.మీ. విశాఖ మెట్రో, కొనసాగుతున్న నాలుగు, కొత్తవి ఏడు రైల్వే ప్రాజెక్టులు, పోర్టులను అనుసంధానం చేసేలా 9 కొత్త రహదారి ప్రాజెక్టులు)
 

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.