Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

Vizag

Featured Replies

  • Replies 390
  • Views 30k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

Posted Images

  • Author

రాంబిల్లి - భోగాపురం మధ్య సెమీ రింగ్‌ రోడ్‌

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 16 May 2026 06:22 IST

Ee

Font size

2 min read

gg-pref.gif

అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాల పరిధిలో 102 కి.మీ. మార్గం
రూ.4,450 కోట్ల నిర్మాణ వ్యయం

ap150526main20a.webp

ప్రతిపాదిత సెమీ రింగ్‌ రోడ్డు నమూనా

ఈనాడు, విశాఖపట్నం: భావి రవాణా అవసరాల దృష్ట్యా అనకాపల్లి, విశాఖ, విజయనగరం జిల్లాలను కలుపుతూ సెమీ రింగ్‌ రోడ్డు నిర్మించాలని ప్రభుత్వం ప్రణాళిక సిద్ధం చేస్తోంది. అనకాపల్లి జిల్లా రాంబిల్లి మండలం నుంచి విజయనగరం జిల్లాలోని భోగాపురం విమానాశ్రయాన్ని అనుసంధానించేలా 102 కిలోమీటర్ల మేర ఈ మార్గాన్ని 4, 6, 8 వరుసలతో నిర్మిస్తారు. ఈ రోడ్డులోకి ఎక్కడపడితే అక్కడ వాహనాలు ప్రవేశించలేవు. నిర్దేశిత ప్రవేశ, నిష్క్రమణ పాయింట్ల వద్ద మాత్రమే అనుమతి ఉంటుంది. ఉత్తరాంధ్రలో ఈ తరహా ప్రాజెక్టు.. ఇదే మొదటిది.  వాహన రద్దీ నియంత్రణ కోసం విశాఖ చుట్టూ రింగ్‌ రోడ్డు నిర్మించాలని తొలుత అనుకున్నప్పటికీ, భౌగోళిక అవరోధాలతో సాధ్యం కాదని తేలింది. దాని స్థానంలో సమీప జిల్లాలను కలుపుతూ అర్ధ చంద్రాకృతిలో సెమీ రింగ్‌ రోడ్డు ఎలైన్‌మెంట్‌ ఖరారు చేశారు. విశాఖ మహాప్రాంత అభివృద్ధి సంస్థ (వీఎంఆర్‌డీఏ) ఆధ్వర్యంలో చేపడుతున్న ఈ ప్రాజెక్టుకు డీపీఆర్‌ తయారీ బాధ్యతను గత డిసెంబర్‌లో ఓ కన్సల్టెన్సీకి అప్పగించారు. ఈ నెలాఖరుకల్లా డీపీఆర్‌ సిద్ధం కానుంది. విశాఖ పరిసర ప్రాంతాల్లో వచ్చే 50 ఏళ్లలో జరగనున్న విస్తరణ ఆధారంగా ఈ ప్రాజెక్టు రూపొందించారు.


భూసేకరణ.. లేదంటే సమీకరణ

ప్రాజెక్టు నిర్మాణానికి రూ.4,449 కోట్లవుతుందని అంచనా. 12,114 ఎకరాలు సేకరించాల్సి ఉంటుంది. ఇందులో 8వేల ఎకరాలు ప్రైవేటు వ్యక్తులవి. ఇప్పటికే ట్రాఫిక్, సామాజిక, పర్యావరణ అంచనాలపై అధ్యయనం పూర్తయింది.. ప్రాజెక్టును వచ్చేనెల 15 నాటికల్లా పట్టాలెక్కించాలని మంత్రి నారాయణ ఆదేశించినట్లు సమాచారం. భూసేకరణ కష్టమైతే భూసమీకరణకు అధికారులు యోచిస్తున్నారు.

మూడు జిల్లాల్లో ఈ మండలాల్లో

విజయనగరం: భోగాపురం, డెంకాడ, కొత్తవలస

విశాఖ: భీమిలి, పద్మనాభం

అనకాపల్లి: కె.కోటపాడు, చోడవరం, అనకాపల్లి, కశింకోట, మునగపాక, అచ్యుతాపురం, ఎలమంచిలి, రాంబిల్లి.

  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author

51.88 చ.కి.మీ.ల్లో ‘వైజాగ్‌ బే సిటీ’

Eenadu icon

By Andhra Pradesh News DeskPublished : 07 Jul 2026 05:40 IST

Ee

Font size

3 min read

gg-pref.gif

ప్రముఖ సంస్థల పెట్టుబడుల్ని ఆహ్వానించాలి
6 నెలల్లో అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్ల మాస్టర్‌ప్లాన్లు  
మూడు నగరాల్లో అంతర్జాతీయ క్రీడా పోటీలకు ప్రణాళికలు
సమీక్షలో సీఎం చంద్రబాబు ఆదేశాలు

AP06072026main-5a.webp

ఎకనమిక్‌ రీజియన్లపై సమీక్షిస్తున్న సీఎం చంద్రబాబు

ఈనాడు, అమరావతి: విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో 51.88 చదరపు కి.మీ. విస్తీర్ణంలో ‘వైజాగ్‌ బే సిటీ’ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు సూచించారు. ఇక్కడ 3,291 ఎకరాల ప్రభుత్వ భూమి ఉందని, పెట్టుబడులకు ప్రముఖ సంస్థల్ని ఆహ్వానించాలని సూచించారు. తీరప్రాంత పర్యాటకం, గ్లోబల్‌ బిజినెస్‌- ఇన్నోవేషన్‌ ఎకో సిస్టమ్, గ్లోబల్‌ టాలెంట్‌- ఎలైట్‌ లివింగ్‌ అనే అంశాలకు ఇక్కడ ప్రాధాన్యమివ్వాలని సీఎం నిర్దేశించారు. విశాఖ, అమరావతి, తిరుపతి ఎకనమిక్‌ రీజియన్లపై చంద్రబాబు సోమవారం సచివాలయంలో సమీక్షించారు. అమరావతి, తిరుపతి మాస్టర్‌ప్లాన్లను ఆరు నెలల్లోగా సిద్ధం చేసి.. ముసాయిదాను ప్రజలు, ప్రజాప్రతినిధులకు అందుబాటులో ఉంచి అభిప్రాయాలు తీసుకోవాలని చెప్పారు. రెండు నెలల్లో డిస్ట్రిక్ట్‌ ఎకనమిక్‌ ప్రొఫైల్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్లు తమ ప్రాంతాన్ని ఏ రంగాల్లో అభివృద్ధి చేసే అవకాశం ఉందో ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అమరావతి, తిరుపతి, విశాఖలో ప్రైవేటు భాగస్వామ్యంతో క్రీడానగరాల్ని అభివృద్ధి చేయాలని, అక్కడ అంతర్జాతీయ క్రీడా పోటీల నిర్వహణకు ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. సమీక్షలో సీఎం ఏమన్నారంటే.. 

లింగాలలో అత్యధిక తలసరి ఆదాయం  

  • ఉద్యాన పంటల సాగు ద్వారా రూ.7.30 లక్షలతో తలసరి ఆదాయంలో సరికొత్త రికార్డు సృష్టించిన కడప జిల్లా లింగాల మండలాన్ని స్ఫూర్తిగా తీసుకుని రాయలసీమను గ్లోబల్‌ హార్టికల్చర్‌ హబ్‌గా తీర్చిదిద్దాలి. 

  • లింగాల మండలంలో ప్రజల తలసరి ఆదాయం పారిశ్రామికాభివృద్ధి చెందిన ప్రాంతాల కంటే అధికంగా ఉండటంపై అధ్యయనం చేయాలి.

  • ఉద్యాన పంటలు, ఆహారశుద్ధి పరిశ్రమలతో సీమ స్థితిగతులే మారిపోతాయనడానికి లింగాల నిదర్శనం. 

  • తిరుపతి ఎకనమిక్‌ రీజియన్‌ పురోగతికి ఉద్యాన రంగమే గ్రోత్‌ ఇంజిన్‌ అవుతుంది. మాస్టర్‌ప్లాన్‌లో ఈ రంగానికి అత్యధిక ప్రాధాన్యమివ్వాలి. 

  • పూర్వోదయ పథకంలో రూ.40 వేల కోట్లు, ప్రైవేట్‌ పెట్టుబడులు మరో రూ.60 వేల కోట్లతో ఉద్యాన రంగానికి ఊతం లభిస్తుంది. 

  • రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత ప్రోత్సహించేందుకు ప్రణాళికతో పనిచేయాలి. 

  • రాయలసీమలో ఖనిజ సంపద నుంచి హార్టికల్చర్‌ వరకు.. పుణ్యక్షేత్రాల నుంచి పర్యాటక ప్రాంతాల వరకు ఎన్నో అనుకూలతలున్నాయి. అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రజలు కలిసి పనిచేస్తే పెద్దఎత్తున పెట్టుబడులు వస్తాయి. యువతకు ఉపాధి లభిస్తుంది.

  • సూర్యలంక బీచ్‌ అభివృద్ధికి మాస్టర్‌ప్లాన్‌ సిద్ధం చేయాలి. నీ విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌లో మొత్తం 49 ప్రాజెక్టులు రాగా 18 గ్రౌండ్‌ అయ్యాయి. మిగిలిన 12 త్వరలో గ్రౌండ్‌ చేయాలి. ప్రణాళిక దశలో ఉన్న 19 ప్రాజెక్టుల్ని త్వరితగతిన పట్టాలెక్కించాలి. నీ వచ్చే 3 నెలల్లో లక్ష చదరపు అడుగుల్లో ఇంటర్నేషనల్‌ కన్వెన్షన్‌ సెంటర్, హోటళ్లు, ఐటీ ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి.


కొల్లేరు సరస్సును అభివృద్ధి చేయాలి

  • అరకు- పాడేరు- విశాఖను పర్యాటక సర్కిల్‌గా తయారు చేయాలి. పోర్టులు, ఫిషింగ్‌ హార్బర్లతో విశాఖ ఎకనమిక్‌ రీజియన్‌ను అభివృద్ధి చేయాలి.

  • వెల్‌నెస్‌ సెంటర్లకు ప్రత్యేకంగా భూ కేటాయింపులు చేయాలి.

  • అమరావతి రీజియన్‌లో కొల్లేరు సరస్సును అభివృద్ధి చేయాలి.


ప్రజాసమస్యలపై రియల్‌టైమ్‌లో స్పందించాలి

ప్రజల సమస్యలు, ఇబ్బందులపై రియల్‌టైమ్‌లో స్పందించాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులకు నిర్దేశించారు. వేగంగా స్పందించడం వల్ల ప్రజలకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. విశాఖలో సముద్రంలో బోటు మునిగి మత్స్యకారులు గల్లంతైన ఘటనలో తక్షణ స్పందనగా ఏయే విభాగాలు ఎలా స్పందించాలన్నదే కీలకమని అన్నారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్‌ కేంద్రంలో పురపాలక, పంచాయతీరాజ్, హోం, ఎక్సైజ్‌ తదితర శాఖల అధికారులతో సమీక్షలో సీఎం మాట్లాడారు. ‘సీఎస్‌ అధ్వర్యంలో బహుళ శాఖల సమన్వయ సమావేశం జరగాలి. చిత్తూరు జిల్లాలో సంతృప్తి స్థాయిని ఏఐ విధానంలో నమోదు చేస్తున్నాం. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటిస్తే ప్రజాభిప్రాయం నేరుగా తెలుస్తుంది. ప్రజా ఫిర్యాదుల విభాగంలో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలి. అన్ని ప్రభుత్వ శాఖలూ అవేర్‌ 2.0 ద్వారా ఏ మేరకు ఫలితాలు వచ్చాయో విశ్లేషించాలి’ అని పేర్కొన్నారు. 

గిరిజన ప్రాంతాల్లోనూ అన్న క్యాంటీన్లు 

గిరిజన ప్రాంతాల్లో అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసేందుకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు. ‘మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో పేరుకున్న 23 లక్షల టన్నుల చెత్తను మూడు నెలల్లోగా తొలగించాలి. దీనిపై ప్రజాప్రతినిధులూ దృష్టి పెట్టాలి’ అని చంద్రబాబు దిశానిర్దేశం చేశారు. 

  • 2 weeks later...
  • 2 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.