June 25Jun 25 Author తిరుపతి, విశాఖలో పర్యాటక వైభవం!By Andhra Pradesh News DeskPublished : 25 Jun 2026 05:04 ISTEeFont size2 min readసమగ్ర గమ్యస్థానాలుగా అభివృద్ధికి రూ.1,000 కోట్ల కేటాయింపు‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్’లో ఎంపికకు అవకాశంఈనాడు, అమరావతి: రాష్ట్ర పర్యాటక రంగంలో కీలక ముందడుగు పడనుంది. తిరుపతి, విశాఖ నగరాలను సమగ్ర పర్యాటక గమ్యస్థానాలుగా అభివృద్ధి చేసే విషయాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్’ కార్యక్రమంలో ఈ రెండు నగరాలను ఎంపిక చేసే అవకాశం ఉంది. ఒక్కో నగరంలో 50-100 ఎకరాల విస్తీర్ణంలో పర్యాటకాభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం ఐదేళ్లలో రూ.500 కోట్ల చొప్పున అందించనుంది. ఈ మేరకు త్వరలో అధికారిక ప్రకటన వెలువడనుంది. దేశంలో పర్యాటక రంగాన్ని మిషన్ మోడ్‌లో అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. స్వదేశ్ దర్శన్ 2.0 పథకంలో ‘ఛాలెంజ్ బేస్డ్ డెస్టినేషన్ డెవలప్‌మెంట్’ ఉప పథకాన్ని ప్రవేశపెట్టింది. పోటీ పద్ధతిలో దేశవ్యాప్తంగా 50 పర్యాటక గమ్యస్థానాలను ఎంపిక చేసి అభివృద్ధి చేయనుంది. దేశీయ, విదేశీ పర్యాటకులకు మెరుగైన సదుపాయాలు, కొత్త అనుభవాలు, భద్రత, ఆహార సదుపాయం, డిజిటల్ సేవలన్నీ ఒకచోట సమగ్ర ప్యాకేజీగా అందించాలన్నది పథకం ప్రధాన ఉద్దేశం. తిరుపతి, విశాఖ నగరాల్లో పర్యాటక సమగ్రాభివృద్ధికి ప్రతిపాదనలు కేంద్రానికి వెళ్లాయి. తిరుపతిలో ఇప్పటికే 50-60 ఎకరాల భూమిని ఒకే ప్రాంతంలో గుర్తించారు. విశాఖలోనూ 50 ఎకరాల ఖాళీ భూమిని గుర్తించే పనిలో అధికారులు ఉన్నారు. ఐదు అంశాలకు ప్రాధాన్యంగోవా రోడ్ మ్యాప్‌లో పేర్కొన్న ఐదు కీలకాంశాలైన గ్రీన్ టూరిజం, డిజిటలైజేషన్, నైపుణ్యాభివృద్ధి, పర్యాటక ఎంఎస్‌ఎంఈలు, డెస్టినేషన్ మేనేజ్‌మెంట్‌లకు కేంద్రం నిధులు ఇవ్వనుంది. ఇదే విషయాన్ని రాష్ట్రాలకు జారీ చేసిన మార్గదర్శకాల్లో పేర్కొంది. ఈ మేరకు రెండు నగరాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ అధికారిక ప్రకటన తర్వాత సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్)లను రాష్ట్రం నుంచి పంపనున్నారు. పర్యాటకాభివృద్ధిలో స్థానికుల భాగస్వామ్యాన్ని కీలకాంశంగా కేంద్రం పేర్కొంది. స్థానిక అవసరాలు, ఆశయాలు, సాంస్కృతిక విలువలు దృష్టిలో పెట్టుకుని అభివృద్ధి ఉండాలని కేంద్రం సూచించింది. ప్రైవేట్ రంగ భాగస్వామ్యాన్ని కూడా ప్రోత్సహించాలని పేర్కొంది.ప్రధాన లక్ష్యాలివిపర్యాటక కేంద్రాలను సుస్థిర గమ్యస్థానాలుగా తీర్చిదిద్దడంపర్యాటకులకు సంపూర్ణ అనుభవం కల్పించడంపోటీ విధానం ద్వారా నాణ్యమైన అభివృద్ధి సాధించడంప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యాన్ని పెంపొందించడంస్థానిక ఉపాధి, ఆర్థికాభివృద్ధికి ఊతమివ్వడం
June 25Jun 25 Author https://lh3.googleusercontent.com/pw/AP1GczO79iRJ_ap-QNB1475fjNjGf7MrwrU29PSbd3QUHXT1Ci22vJzMpHeVBIzlL7UGReQYFi0x9LMH7_OHxjW9Y1p_1LAaTpTCWtFE5S1QrzlxIJD8fTQ6=w2400
July 1Jul 1 Author ప్రకృతి అందాలు అదనపు సొబగులు!By Andhra Pradesh News DeskPublished : 01 Jul 2026 05:15 ISTEeFont size3 min readరూ.172 కోట్లతో గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులతో ఆధునిక హంగులుసెప్టెంబరు నెలాఖరుకు పర్యాటకులకు అందుబాటులోకిరాజమహేంద్రవరంలో కొనసాగుతున్న పుష్కర ఘాట్ అభివృద్ధి పనులుఈనాడు, అమరావతి: అద్భుత ప్రకృతి అందాలకు ప్రతీకగా నిలిచిన గండికోట, అఖండ గోదావరి పర్యాటక ప్రాంతాలు అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చెందుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం సాస్కీ పథకం కింద కేటాయించిన రూ.172.35 కోట్లతో ఆ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాలు, సందర్శకులకు సౌకర్యాలు, పర్యాటక ఆకర్షణలు సిద్ధమవుతున్నాయి. గత రెండేళ్లలో 70% మేర పనులు పూర్తయ్యాయి. మిగిలినవి సెప్టెంబరు నెలాఖరుకల్లా పూర్తి చేయనున్నారు.దేశ గ్రాండ్ కాన్యన్‌గా పేరొందిన గండికోట అందాలను పర్యాటకులు దగ్గర నుంచి వీక్షించేలా సాస్కీ పథకంలో రూ.77.91 కోట్లతో ప్రభుత్వం అభివృద్ధి పనులు చేపడుతోంది. గండికోట నుంచి పెన్నా లోయ(గార్జ్) వరకు 3 కి.మీ. మార్గంలో మొత్తం 5 వ్యూ పాయింట్లు అభివృద్ధి చేస్తున్నారు.రోడ్డు మధ్యలో రెయిలింగ్ ద్వారా కిందకు దిగి బోటింగ్ చేయొచ్చు. పెన్నా నదిలో నుంచి మైలవరం డ్యాం వరకు బోట్లు నడపనున్నారు.గండికోట లోపలి ప్రత్యేకతలు తెలుసుకునేలా.. జమ్మలమడుగు మండలం గండికోట వద్ద పెన్నా లోయ అందాల వీక్షణకు ఏర్పాటుచేసిన వ్యూ పాయింట్ గండికోట లోపల మరో 2 కిలోమీటర్ల మేర నడక మార్గం (ట్రెయిల్) అభివృద్ధి చేస్తున్నారు. ఈ మార్గంలో రంగనాథస్వామి, మాధవరాయస్వామి ఆలయాలు, మసీదు, రాజుల కాలం నాటి కట్టడాలు చూడొచ్చు. గండికోట ప్రత్యేకతలపై యాంఫీ థియేటర్‌లో డిజిటల్ స్క్రీన్లపై వీడియోలు ప్రదర్శించనున్నారు. సమావేశాలు, సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు వెయ్యి మంది కూర్చునే సామర్థ్యంగల ఓపెన్ ఎయిర్ ఆడిటోరియం నిర్మిస్తున్నారు.పర్యాటకుల వసతికి ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో టెంట్ సిటీ ఏర్పాటు చేస్తున్నారు. హెరిటేజ్ టూరిజం కేంద్రంగా హేవ్‌లాక్ వంతెనరాజమహేంద్రవరం హేవ్‌లాక్ వంతెనపై పర్యాటకులు నడిచి వెళ్లేలా కొత్త ఏర్పాట్లు..రాజమహేంద్రవరం వద్ద గోదావరి నదిపై నిర్మించిన తొలి రైలు వంతెన హేవ్‌లాక్ బ్రిడ్జిని ప్రముఖ పర్యాటక ఆకర్షణగా తీర్చిదిద్దే పనులు వేగంగా చేస్తున్నారు. సాస్కీ పథకంలో రూ.99.44 కోట్లతో అఖండ గోదావరి పేరుతో పనులు చేపడుతున్నారు. 125 ఏళ్ల నాటి వారసత్వ వంతెనను హెరిటేజ్ టూరిజం కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నారు. వంతెన నుంచి గోదావరి మధ్యలోని ద్వీపానికి వెళ్లేందుకు ప్రత్యేకంగా రెయిలింగ్ కడుతున్నారు. ద్వీపంలో విద్యుత్తు, ఆర్వో ప్లాంట్, ఇతర మౌలిక వసతులు కల్పిస్తున్నారు. 125 ఎకరాల విస్తీర్ణంలోని ద్వీపంలో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యంతో వెల్‌నెస్ సెంటర్లు, రిసార్ట్‌లు ఏర్పాటు చేయించి గోదావరి పుష్కరాల నాటికి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దనున్నారు.రాజమహేంద్రవరంలోని పుష్కర ఘాట్ అభివృద్ధి పనులు పెద్దఎత్తున చేపడుతున్నారు. ఇక్కడ రోజూ జలహారతి ఇచ్చేలా ప్రణాళికలు రూపొందించారు. నిడదవోలులోని కోట సత్తెమ్మ అమ్మవారి ఆలయం అభివృద్ధి, కడియపు లంక నర్సరీ వద్ద ‘ఎకో టూరిస్ట్ ఎక్స్‌పీరియన్స్ సెంటర్’ ఏర్పాటు వంటి పనులు చేపడుతున్నారు.
July 27Jul 27 Author తనివి‘తీర’ చూసేలా..By Andhra Pradesh News DeskPublished : 27 Jul 2026 04:13 ISTEeFont size2 min readరుషికొండ బాటలో మరో ఆరు బీచ్‌లు‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపునకు సర్కారు సన్నాహాలువిశాఖ రుషికొండ బీచ్‌లో పర్యాటకుల కోలాహలంఈనాడు, అమరావతి: విదేశీ పర్యాటకులను మరింత ఆకర్షించేలా ప్రభుత్వం మరో ఆరు బీచ్‌లకు ‘బ్లూ ఫ్లాగ్’ గుర్తింపు కోసం సన్నాహాలు చేస్తోంది. అవసరమైన మౌలిక సదుపాయాల కల్పనతోపాటు పరిశుభ్రత, భద్రత, పర్యావరణ పరిరక్షణకు చర్యలు చేపడుతోంది. నెల రోజుల్లో పనులు పూర్తిచేసి బ్లూ ఫ్లాగ్ గుర్తింపునకు ప్రతిపాదించనుంది. రాష్ట్రంలో విశాఖలోని రుషికొండ బీచ్‌కు మాత్రమే బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంది. ఇప్పుడు కాకినాడ జిల్లాలో ఎన్టీఆర్ బీచ్, శ్రీకాకుళం జిల్లా బారువ, పశ్చిమగోదావరి జిల్లా పేరుపాలెం, కృష్ణా జిల్లా హంసలదీవి, బాపట్ల జిల్లాలో రామాపురం, సూర్యలంక బీచ్‌లను బ్లూ ఫ్లాగ్ గురింపునకు వీలుగా సర్కారు తీర్చిదిద్దుతోంది. స్వదేశీ దర్శన్ పథకంలో సూర్యలంక బీచ్‌ను అభివృద్ధి చేస్తోంది. మిగిలిన చోట్ల వివిధ ప్రైవేట్ సంస్థలు కార్పొరేట్ సామాజిక బాధ్యత(సీఎస్‌ఆర్) కింద అందిస్తున్న నిధులతో పనులు చేపడుతోంది.బ్లూ ఫ్లాగ్ బీచ్‌లతో ప్రయోజనాలుప్రపంచ స్థాయిలో.. సురక్షిత, పరిశుభ్రతతో కూడిన పర్యావరణ అనుకూలమైన తీరప్రాంతాలను ‘బ్లూ ఫ్లాగ్’ బీచ్‌లు అని పిలుస్తారు. ఇవి విదేశీ పర్యాటకులను ఆకర్షిస్తాయి. దేశీయ పర్యాటకులూ పెద్దసంఖ్యలో వస్తారు. తద్వారా పర్యాటక ఆదాయం పెరుగుతుంది. హోటళ్లు, రెస్టారెంట్లు, స్థానిక వ్యాపారాల ఆదాయం అధికమవుతుంది. స్థానిక యువతకు పర్యాటకం, గైడింగ్, వాటర్ స్పోర్ట్స్, హోటల్ రంగాల్లో ఉద్యోగాలు లభిస్తాయి. పర్యాటకులకు భద్రత మెరుగ్గా ఉంటుంది. దేశంలో ప్రస్తుతం 18 బీచ్‌లకు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు ఉంది. బ్లూ ఫ్లాగ్ అనేది ప్రపంచవ్యాప్తంగా బీచ్‌లకు ఇచ్చే అత్యున్నత పర్యావరణ గుర్తింపు. సముద్ర జలాల నాణ్యత, పరిశుభ్రమైన ఇసుక తీరం, శిక్షణ పొందిన లైఫ్‌గార్డ్‌లు, ప్రథమ చికిత్స కేంద్రాలు, మౌలిక వసతులు, ప్రమాద హెచ్చరిక బోర్డులు, వ్యర్థాల శాస్త్రీయ నిర్వహణ, జీవవైవిధ్య పరిరక్షణ, పర్యావరణంపై అవగాహన వంటి సుమారు 33 ప్రమాణాలు పాటించిన బీచ్‌లకే ఈ గుర్తింపు లభిస్తుంది. డెన్మార్క్‌లోని ఫౌండేషన్ ఫర్ ఎన్విరాన్‌మెంటల్ ఎడ్యుకేషన్ (ఎఫ్‌ఈఈ) బ్లూ ఫ్లాగ్ సర్టిఫికెట్ జారీ చేస్తుంది.వైకాపా హయాంలో ఓసారి జెండా పీకేశారు..వైకాపా ప్రభుత్వ నిర్వాకంతో ఒకసారి రుషికొండ బీచ్‌కు బ్లూ ఫ్లాగ్ గుర్తింపు రద్దయ్యింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రత్యేక దృష్టి సారించి పర్యాటకులకు అన్ని సౌకర్యాలు కల్పించటంతో బీచ్ పూర్వవైభవం సంతరించుకుంది. 2020 అక్టోబర్‌లో రుషికొండ బీచ్‌కు తొలిసారి బ్లూ ఫ్లాగ్ గుర్తింపు లభించింది. నిర్దేశించిన ప్రమాణాలు బీచ్‌లో పాటించలేదనే కారణంతో ఆ తర్వాత రద్దయ్యింది. పర్యాటకులకు మౌలిక వసతులు, భద్రత చర్యలు వంటివి కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన కల్పించటంతో 2025 మార్చిలో మళ్లీ బ్లూ ఫ్లాగ్ గుర్తింపు పునరుద్ధరణకు నోచుకుంది.
Create an account or sign in to comment