Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Tourism

Featured Replies

  • Replies 232
  • Views 15.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • srikanthnarne
    srikanthnarne

    Roller coaster park / Disney lanti parks em ravatleda? Coastal side. It will boost tourism.  reliance /ambani batch start chesthe better emo kada. Manchi scope vuntundi  or Ee US batch tarif

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

Posted Images

  • Author

peru-palemam.jpg

వి‘హారం’లో.. పచ్చందాల తీరం!

 

Eenadu icon
By Andhra Pradesh Dist. DeskPublished : 09 Sep 2025 05:53 IST
Ee
Font size
 
 
 
 
2 min read
 
 

పశ్చిమకు పర్యాటక శోభ
త్వరలో రెండు ప్రాజెక్టుల పునరుద్ధరణ

tpg08092025-4a.webp

పునఃప్రారంభం కానున్న వలంధర రేవు

పాలకొల్లు, న్యూస్‌టుడే: జీవ వైవిద్యానికి మారుపేరైన కొల్లేరు.. ఉప్పుటేరు.. 60 కిలోమీటర్ల పైగా విస్తరించిన వశిష్ఠ గోదావరి తీరం.. అంతకుమించిన ప్రకృతి సౌందర్యంతో అలరారే పేరుపాలెం బీచ్‌ ఉమ్మడి పశ్చిమలో పర్యాటకానికి సహజసిద్ధ వనరులు. వీటిని సద్వినియోగం చేసుకొంటే 2029 నాటికి పర్యాటక రంగంలో 3 లక్షల మందికి ఉపాధి అవకాశాలు కల్పించాలన్న కూటమి ప్రభుత్వ లక్ష్యంలో పశ్చిమ కీలకంగా పాత్ర పోషించనుంది. ఈ దిశగా ఇప్పుడిప్పుడే అడుగులు పడుతున్నాయి.

పూర్వ వైభవం దిశగా..

ఆకివీడు మండలం దుంపగడపలో ఉన్న కాటన్‌ పార్కును పబ్లిక్‌- ప్రయివేటు భాగస్వామ్యంతో పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు రంగం సిద్ధమైంది. ఇక్కడ గతంలో ఉండే రెస్టారెంట్‌ను పునఃప్రాంభించడంతో పాటు ఉప్పుటేరులో బోటింగ్‌ను అందుబాటులోకి తేనున్నారు. ఈ నెల 15 తర్వాత పనులు ప్రారంభించి అత్యాధునికి వసతులతో రెస్టారెంట్, చిన్నారులకు పార్కు, ఫంక్షన్‌ హాలును అందుబాటులోకి తీసుకురానున్నారు. నరసాపురం వలంధర రేవులో ఉన్న రెస్టారెంట్‌ను ఇప్పుడు ప్రయివేటుకు లీజుకు ఇచ్చారు. ఇక్కడ గ్రిల్స్‌ ఏర్పాటుతో పాటు చిన్నచిన్న మరమ్మతులు చేసి నదీ విహారానికి పడవలను ఏర్పాటు చేయనున్నారు. ఈ నెల 25 నుంచి ఇవి అందుబాటులోకి తీసుకురానున్నారు.

tpg08092025-4b.webp

పేరుపాలెంలో సముద్ర తీరం 

గృహాల్లో ఆతిథ్యం

నరసాపురం సమీప ప్రాంతాలైన పీచుపాలెం, సీతారామపురం, లక్ష్మణేశ్వరం గ్రామాల్లో పర్యాటకులు బసచేసేందుకు(హోం స్టే)  అనువైన 18 ఇళ్లు ఎంపిక చేశారు. వాటి యజమానులకు ఇటీవలే కోనసీమ జిల్లా దిండిలో తొలి విడత శిక్షణ ఇచ్చారు. వచ్చిన పర్యాటకులను ఆహ్వానించడం, ఆన్‌లైన్‌ లావాదేవీలు, వివిధ పర్యాటక యాప్‌ సమన్వయంతో సేవలందించడంపై కార్యశాల నిర్వహించారు. దీంతో నరసాపురం ప్రాంతంలో 18 మంది కుటుంబాలకు ఉపాధి అవకాశాలు ఏర్పడ్డాయి. కాళ్ల, ఉండి, పోడూరు మండలాల్లో ఎంపిక చేసిన గృహాల యజమానులకు రెండో విడతలో భీమవరంలో కార్యశాల ఏర్పాటు చేయనున్నారు. ఈ అంశంపై జిల్లా పర్యాటకశాఖ అధికారి అడబాల వెంకట అప్పారావు స్పందిస్తూ దుంపగడప, నరసాపురంలలో పర్యాటక ప్రాజెక్టులను లీజుకు ఇచ్చామని.. ఇవి త్వరలోనే అందుబాటులోకి వస్తాయని పేర్కొన్నారు.

 
 
  • 2 weeks later...
  • Author

హౌస్‌బోట్లు వచ్చేస్తున్నాయ్‌!

 

Eenadu icon
By Andhra Pradesh News DeskPublished : 08 Oct 2025 06:05 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

పగలు జల విహారం... రాత్రి వాటిలోనే బస
రాష్ట్రంలో 4 చోట్ల నడిపేందుకు సంస్థల ఆసక్తి 
సంక్రాంతికల్లా అందుబాటులోకి 

image.png

హౌస్‌ బోటును సిద్ధం చేస్తున్న సిబ్బంది

ఈనాడు, అమరావతి: కుటుంబసభ్యులు, స్నేహితులతో కలిసి... పగలంతా అలలపై ఆనంద విహారం... రాత్రయ్యేసరికి నదీ జలాలపైనే నచ్చిన ఆహారం తింటూ సంతోషాలు నిండిన బస... ఆహా భలేఉంది కదూ! ఇందుకు వేదికలుగా నిలిచే హౌస్‌బోట్లు అందుబాటులోకి రానున్నాయి. కేరళలో ఎక్కువగా కనిపించే హౌస్‌బోట్‌ పర్యాటకాన్ని రాష్ట్ర ప్రజలకు మరింత చేరువ చేసే చర్యలు మొదలయ్యాయి. ప్రభుత్వ, ప్రైవేట్‌ భాగస్వామ్యంలో గండికోట, సూర్యలంక, రాజమహేంద్రవరం, భవానీ ఐలాండ్‌లలో సంక్రాంతి నాటికి ఐదు హౌస్‌బోట్లు ప్రారంభం కానున్నాయి. అడ్వెంచర్‌ టూరిజంలో భాగంగా వీటిని నడిపేందుకు కేరళతోపాటు రాష్ట్రానికి చెందిన కొన్ని ప్రైౖవేట్‌ సంస్థలు ముందుకొచ్చాయి. రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థతో ఒప్పందం చేసుకున్నాయి. పదిచోట్ల హౌస్‌బోట్లు నడపాలని అధికారులు ప్రతిపాదించారు. నదులు, జలాశయాలు, సముద్ర బ్యాక్‌వాటర్‌లో బోట్ల నిర్వహణ సాధ్యాసాధ్యాల పరిశీలన తర్వాత తొలిదశలో నాలుగు చోట్ల నడపాలని నిర్ణయించారు. 

నలుగురు ప్రయాణించొచ్చు

ఒక్కోమార్గంలో 20-30 కిలోమీటర్ల దూరం చొప్పున బోట్లను నడపనున్నారు. మధ్యాహ్నం 2 గంటలకు బోటు బయలుదేరితే మరుసటి రోజు ఉదయం 11 గంటలకు తిరిగొచ్చేలా చూస్తారు. రాత్రి బోటులోనే భోజనం, వసతి కల్పిస్తారు. ఒక్కోదానిలో నలుగురు ప్రయాణించొచ్చు.

హౌస్‌బోట్లు నడిపేందుకు ముందుకొచ్చిన సంస్థలకు ‘రాష్ట్ర పర్యాటక విధానం 2024-29’ ప్రకారం విద్యుత్తు రాయితీ, ఏడేళ్ల వరకు ఎస్‌జీఎస్‌టీ తిరిగి చెల్లింపు, ఇతరత్రా సబ్సిడీలను ప్రభుత్వం అందించనుంది.

దిండిలో డబుల్‌ బెడ్‌రూం లగ్జరీ హౌస్‌బోట్లు!

కోనసీమలో దిండి నుంచి డబుల్‌ బెడ్‌రూం లగ్జరీ హౌస్‌బోట్లు నడిపేందుకు ప్రైవేట్‌ ఆపరేటర్లను పర్యాటకాభివృద్ధి సంస్థ ఆహ్వానిస్తోంది. పర్యాటకాభివృద్ధి సంస్థ గతంలో ఇక్కడ రెండు హౌస్‌బోట్లు ప్రారంభించింది. 


ఆ నాలుగూ ఇవే... 

గండికోట జలాశయం - మైలవరం డ్యాం:  గండికోట జలాశయంలో బోటు బయలు దేరి గండికోట, అగస్థేశ్వరం మీదుగా మైలవరం డ్యాం చేరుతుంది. మార్గమధ్యంలో గండికోట అందాలతోపాటు అగస్థేశ్వరంలో శివాలయ దర్శనం చేసుకోవచ్చు. మళ్లీ అదే మార్గంలో బోటు తిరుగు పయనమవుతుంది.

సూర్యలంక-నిజాంపట్నం : సూర్యలంక నుంచి బయలుదేరి మడ అడవుల మీదుగా నిజాంపట్నం వరకు బోటు వెళుతుంది. అక్కడే రాత్రి బస చేయవచ్చు. సూర్యోదయ సమయంలో నిజాంపట్నంలో తిరిగి బయలుదేరుతుంది. సూర్యోదయంతో పాటు మడ అడవుల నుంచి గండుపిల్లులు బయటకు వచ్చి నీటిలో చేపలను వేటాడటం వంటి దృశ్యాలను చూడొచ్చు.

రాజమహేంద్రవరం - ధ]వళేశ్వరం (2 బోట్లు): రాజమహేంద్రవరంలోని పద్మావతి, సరస్వతి ఘాట్‌ల నుంచి బోట్లు బయలుదేరతాయి. పిచ్చుకలంక, బ్రిడ్డిలంకల మీదుగా ధవళేశ్వరం వెళతాయి. గోదావరి అందాలను తిలకిస్తూ, పలు లంకల మీదుగా తిరిగి అదే మార్గంలో బోట్లు వెనక్కి వస్తాయి.

విజయవాడ భవానీ ద్వీపం: బెర్మ్‌ పార్కు నుంచి బోటు బయలుదేరి భవానీ ద్వీపం చుట్టూ తిరిగి పవిత్ర సంగమం వరకు వెళుతుంది. తర్వాత ప్రకాశం బ్యారేజీ వరకు వస్తుంది. భవానీ ఐలాండ్‌ వద్ద యాంకర్‌ పాయింట్‌ పెట్టి బోటును రాత్రి నిలిపివేస్తారు. అందులో పర్యాటకులు బస చేయవచ్చు. ఉదయం మళ్లీ బయలుదేరి తిరిగి బెర్మ్‌ పార్కుకు బోటు చేరుతుంది.

  • 2 weeks later...
  • 2 weeks later...
  • 4 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.