Skip to content
View in the app

A better way to browse. Learn more.

NFDB

A full-screen app on your home screen with push notifications, badges and more.

To install this app on iOS and iPadOS
  1. Tap the Share icon in Safari
  2. Scroll the menu and tap Add to Home Screen.
  3. Tap Add in the top-right corner.
To install this app on Android
  1. Tap the 3-dot menu (⋮) in the top-right corner of the browser.
  2. Tap Add to Home screen or Install app.
  3. Confirm by tapping Install.

AP Tourism

Featured Replies

  • 3 weeks later...
  • Replies 232
  • Views 15.4k
  • Created
  • Last Reply

Top Posters In This Topic

Most Popular Posts

  • srikanthnarne
    srikanthnarne

    Roller coaster park / Disney lanti parks em ravatleda? Coastal side. It will boost tourism.  reliance /ambani batch start chesthe better emo kada. Manchi scope vuntundi  or Ee US batch tarif

  • sonykongara
    sonykongara

  • sonykongara
    sonykongara

Posted Images

  • 2 weeks later...
  • The title was changed to AP Tourism
  • 1 month later...
  • 3 weeks later...
  • 2 weeks later...
  • Author

అరకు, బాపట్ల, గండికోటలో టెంట్‌ సిటీలు

పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రాధాన్యమిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ విధానాల అమలుకు ఉపక్రమించింది.

Eenadu icon
By Andhra Pradesh News DeskUpdated : 09 Jun 2025 07:50 IST
Ee
Font size
 
 
 
 
3 min read
 
 

రూ.50 కోట్లతో అందుబాటులోకి 150 గదులు!
వాటిలో స్టార్‌ హోటళ్ల తరహాలో సౌకర్యాలు
ఏపీటీడీసీ, ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో అభివృద్ధి

ap080625main3a.webp

గుజరాత్‌లోని కెవాడియాలో అభివృద్ధి చేసిన టెంట్‌ సిటీ 

ఈనాడు, అమరావతి: పర్యాటకులు అధికంగా సందర్శించే ప్రాంతాల్లో వసతుల కల్పనకు రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) ప్రాధాన్యమిస్తోంది. ఇతర రాష్ట్రాల్లో విజయవంతమైన ఉత్తమ విధానాల అమలుకు ఉపక్రమించింది. ఆ క్రమంలో అరకు, గండికోట, సూర్యలంకలో ప్రయోగాత్మకంగా మూడు టెంట్‌ సిటీలను    అభివృద్ధి చేయనుంది. అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలో, మిగిలిన రెండుచోట్లా ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో వీటి ఏర్పాటుకు టెండర్లు పిలవనున్నారు. తద్వారా 150 గదులు పర్యాటకులకు అందుబాటులోకి రానున్నాయి. ఇందుకోసం  రూ.50 కోట్లకుపైగా ఖర్చు చేయనున్నారు.

పెరగనున్న గదుల లభ్యత

రాష్ట్రంలో పర్యాటకుల కోసం స్టార్‌ హోటళ్లలో ఇప్పుడున్న 11,700 గదుల లభ్యతను 2028 నాటికి 50 వేలకు పెంచాలన్న సీఎం ఆదేశాలతో ఏపీటీడీసీ ప్రత్యేక కార్యాచరణ చేపట్టింది. కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వివిధ ప్రైవేటు సంస్థలు  రూ.12,565 కోట్లతో హోటళ్లు, రిసార్ట్‌ల ఏర్పాటుకు ముందుకొచ్చాయి. వీటిద్వారా 8,073 గదులు అందుబాటులోకి వస్తాయని అంచనా. విశాఖపట్నం, విజయవాడ, తిరుపతిలో హోటళ్ల ఏర్పాటుకు ప్రైవేటు సంస్థలు ఆసక్తి చూపుతున్నాయి. ఇతర దర్శనీయ ప్రాంతాల్లో పర్యాటకులకు సదుపాయాల కల్పనకు ‘హోం స్టే’ విధానాన్ని రూపొందించారు. పర్యాటకులు సొంతిళ్లలో ఉన్నామన్న అనుభూతి కలిగేలా వివిధ గ్రామాల్లో 1,842 పాత ఇళ్లను గుర్తించి వాటిని ఆధునికీకరిస్తున్నారు.

టెంట్‌ సిటీల అభివృద్ధి ఇలా..

  • గుజరాత్‌లోని కెవాడియా, ఉత్తర్‌ప్రదేశ్‌లోని అయోధ్య తరహాలో రాష్ట్రంలో పర్యాటకులు అత్యధికంగా సందర్శించే అరకు, గండికోట, సూర్యలంక బీచ్‌లో టెంట్‌ సిటీల ఏర్పాటు ప్రతిపాదనలను ప్రభుత్వం ఇటీవల ఆమోదించింది. అరకులో ఏపీటీడీసీ ఆధ్వర్యంలోని రిసార్ట్‌ల్లో వసతులు అరకొరగా ఉన్నందున అక్కడ పది ఎకరాల్లో టెంట్‌ సిటీ ఏర్పాటుచేసి 50 గదులు అభివృద్ధి చేయనున్నారు. ఇందుకు రూ.18 కోట్లకు పైగా వెచ్చించనున్నారు.
  • గండికోటలో పది ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో టెంట్‌ సిటీ రూపుదిద్దుకోనుంది. ఇక్కడ 60 గదులు అందుబాటులోకి రానున్నాయి. సాస్కీ పథకంలో రూ.78 కోట్లతో గండికోటను అభివృద్ధి చేసే పనులు ఇటీవలే ప్రారంభమయ్యాయి. ఇవి పూర్తయ్యాక సందర్శకుల సంఖ్య పెరగవచ్చని అంచనా.
  • రాష్ట్రంలో విశాఖలోని ఆర్కే బీచ్‌ తర్వాత పర్యాటకులు ఎక్కువగా సందర్శించేది బాపట్ల జిల్లాలోని సూర్యలంక బీచ్‌. ఇక్కడ ఏపీటీడీసీకి చెందిన రిసార్ట్‌లు ఉన్నా, వసతులు అంతంతమాత్రమే. వారాంతాల్లో గదులు దొరకడం లేదు. ఇక్కడ పది ఎకరాల్లో ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో 50 గదులు అందుబాటులోకి వచ్చేలా టెంట్‌ సిటీలు అభివృద్ధి చేయనున్నారు.

కెవాడియా, అయోధ్యలో ప్రత్యేకతలివి..

  • కెవాడియాలో రెండు టెంట్‌ సిటీలు ఉన్నాయి. వీటిలో స్టార్‌ హోటళ్ల తరహాలో సదుపాయాలు కల్పించారు. ప్రపంచంలోనే ఎత్తైన విగ్రహంగా రికార్డులకెక్కిన సర్దార్‌ పటేల్‌ విగ్రహాన్ని చూసేందుకు కెవాడియాకు వెళ్లేవారిలో అత్యధికులు ఈ టెంట్‌ సిటీల్లో ఉండేందుకే ప్రాధాన్యమిస్తుంటారు. అహ్మదాబాద్‌లోనూ టెంట్‌ సిటీలకు సందర్శకుల ఆదరణ బాగుంది.
  • అయోధ్యలో అనేకచోట్ల టెంట్‌ సిటీలు ఏర్పాటుచేసి సందర్శకులకు వసతి కల్పిస్తున్నారు. ప్రైవేటు రంగంలో వీటి ఏర్పాటును అక్కడి ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. అయోధ్యలో రామమందిరం ప్రతిష్ఠాపన సమయంలో నిత్యం దాదాపు 80వేల మంది భక్తులకు టెంట్‌ సిటీల్లోనే బస కల్పించింది.

‘రాష్ట్రంలో హోటళ్లు, రిసార్ట్‌ల్లో గదుల సంఖ్య 50 వేలకు పెరగాలి. స్థానికులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే పర్యాటకుల కోసం దర్శనీయ ప్రాంతాల్లో అన్ని వసతులూ కల్పించాలి. వచ్చినరోజే తిరిగి వెళ్లిపోవాలన్న ఆలోచన పర్యాటకుల్లో రాకూడదు. రెండు, మూడు రోజులైనా ఉండాలనుకుంటేనే పర్యాటక రంగం అభివృద్ధి చెందినట్లు. ఆ మేరకు ఏర్పాట్లు చేయాలి.’

పర్యాటక శాఖపై ఫిబ్రవరి 14న సమీక్షలో సీఎం చంద్రబాబు

  • 3 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • 2 weeks later...
  • Author
  •  
  •  
  •  
  •  
  •  

యాత్రి నివాస్‌ సిద్ధం

ABN , Publish Date - Aug 08 , 2025 | 01:00 AM

 

దాదాపుగా రెండేళ్ల తరువాత విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటకులకు వసతి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది.

యాత్రి నివాస్‌ సిద్ధం

 

  • అందుబాటులోకి హరిత హోటల్‌

  • రెండేళ్ల తరువాత అందుబాటులోకి హరిత హోటల్‌

  • రూ.12.5 కోట్లతో ఆధునికీకరణ

  • 42 ఏసీ రూమ్‌లు, బార్‌, రెస్టారెంట్‌, మీటింగ్‌ హాల్‌

  • బుకింగ్స్‌ ప్రారంభం

 

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

దాదాపుగా రెండేళ్ల తరువాత విశాఖపట్నంలో ఆంధ్ర ప్రదేశ్‌ పర్యాటక అభివృద్ధి సంస్థ (ఏపీటీడీసీ) పర్యాటకులకు వసతి సౌకర్యం అందుబాటులోకి తీసుకువచ్చింది. గత వైసీపీ ప్రభుత్వం చేపట్టిన చర్యల కారణంగా విశాఖపట్నం వచ్చే పర్యాటకులకు ఎటువంటి వసతి కల్పించలేని దుస్థితి ఏర్పడింది. రుషికొండలో సముద్రతీరాన అందమైన హరిత రిసార్ట్స్‌ ఉండేవి. నాటి సీఎం జగన్‌ మోహన్‌రెడ్డి పర్యాటకులకు స్టార్‌ హోటల్‌ నిర్మిస్తామంటూ మాయమాటలు చెప్పి దానిని కూలగొట్టారు. అక్కడ సొంత కుటుంబం నివాసం కోసం రూ.450 కోట్లతో ప్యాలెస్‌ నిర్మించుకున్నారు. అది ఎందుకూ కొరగాకుండా పోయింది. ఎంవీపీ కాలనీలో అప్పుఘర్‌ వద్ద హరిత హోటల్‌ (యాత్రీ నివాస్‌) ఉండేది. దానిని మరమ్మతుల పేరుతో 2023 ఆగస్టులో మూసేశారు. అప్పటి నుంచి విశాఖపట్నం వచ్చే పర్యాటకులు ప్రైవేటు హోటళ్లలోనే దిగాల్సి వచ్చింది. ఇలా రెండేళ్లు నడిచింది. యాత్రీ నివాస్‌ ఆధునికీకరణ పనులను ఆరు కోట్ల రూపాయల అంచనాతో ప్రారంభించి రూ.12.5 కోట్లకు తీసుకువెళ్లారు. అప్పటి ఏపీటీడీసీ ఇంజనీరింగ్‌ అధికారులు అనూహ్యంగా ఖర్చు పెంచేశారు. దానిపై అనేక విచారణలు చేపట్టారు. ఎట్టకేలకు కాంట్రాక్టర్‌కు బిల్లులు చెల్లిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో మిగిలిన పనులు పూర్తిచేసి అప్పగించారు.

ఆఽధునిక వసతులతో

ఆధునికీకరించిన యాత్రీ నివాస్‌లో 42 ఏసీ రూమ్‌లు ఉన్నాయి. ఏసీ సూట్‌, ఏసీ డీలక్స్‌, ఏసీ ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌లుగా విభజించారు. ఎగ్జిక్యూటివ్‌ రూమ్‌ రూ.3920కే ఇస్తున్నారు. ఏసీ డీలక్స్‌లో నలుగురు ఉంటే రూ.5,600 తీసుకుంటున్నారు. ఉండే మనుషులను బట్టి టారిఫ్‌ నిర్ణయిస్తున్నారు. రెస్టారెంట్‌, బార్‌, సమావేశ మందిరం వంటి వసతులు సమకూర్చారు. దీనిని పర్యాటక శాఖా మంత్రితో ప్రారంభింపజేయాలని యోచిస్తున్నారు. ఈలోగా పర్యాటకులు ఎవరైనా వచ్చి ఉంటామంటే...తాత్కాలికంగా రూమ్‌లు అద్దెకు ఇస్తున్నారు. ఆన్‌లైన్‌లో ఏపీటీడీసీ వెబ్‌సైట్‌లోకి వెళ్లి బుక్‌ చేసుకోవచ్చు. వారం, పది రోజుల్లో దీనిని అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉందని పర్యాటక శాఖ వర్గాలు చెబుతున్నాయి.

  • 2 weeks later...

Create an account or sign in to comment

Recently Browsing 0

  • No registered users viewing this page.

Account

Navigation

Search

Search

Configure browser push notifications

Chrome (Android)
  1. Tap the lock icon next to the address bar.
  2. Tap Permissions → Notifications.
  3. Adjust your preference.
Chrome (Desktop)
  1. Click the padlock icon in the address bar.
  2. Select Site settings.
  3. Find Notifications and adjust your preference.