November 30, 20241 yr Author ఏపీకి మరింత సాయం చేయండి గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హావ్‌లాక్ బ్రిడ్జి, పుష్కర్‌ఘాట్ల అభివృద్ధికి సుమారు రూ.180 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్‌కు తెదేపా నేత, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ధన్యవాదాలు తెలిపారు. Published : 30 Nov 2024 05:31 IST అరసవల్లి సూర్యదేవాలయాన్ని ప్రసాద్‌స్కీంలో చేర్చండి కేంద్ర మంత్రి శెఖావత్‌కు తెదేపా ఎంపీల వినతి కేంద్రమంత్రి శెఖావత్‌కు ధన్యవాదాలు తెలుపుతున్న కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు. చిత్రంలో ఎంపీలు నాగరాజు, శ్రీభరత్, జీహెచ్‌ఎం బాలయోగి, దగ్గుమళ్ల ప్రసాదరావు ఈనాడు, దిల్లీ: గండికోట, అఖండ గోదావరి ప్రాజెక్టులో భాగంగా హావ్‌లాక్ బ్రిడ్జి, పుష్కర్‌ఘాట్ల అభివృద్ధికి సుమారు రూ.180 కోట్లు మంజూరు చేసినందుకు కేంద్ర పర్యాటక మంత్రి గజేంద్రసింగ్ శెఖావత్‌కు తెదేపా నేత, కేంద్రమంత్రి రామ్మోహన్‌నాయుడు ధన్యవాదాలు తెలిపారు. అరసవల్లి సూర్య దేవాలయాన్ని ప్రసాద్ స్కీంలో చేర్చి నిధులివ్వడంతోపాటు, విశాఖ, అరకు, అమలాపురం, కాకినాడ, రాయలసీమల్లోని పర్యాటక ప్రాంతాల అభివృద్ధికి సాయం చేయాలని కోరారు. ఏపీని ప్రధాన పర్యాటక కేంద్రంగా మార్చాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆలోచనలు కార్యరూపం దాల్చేలా చేయూతనివ్వాలని విజ్ఞప్తి చేశారు. ఏపీకి మరిన్ని నిధులు ఇవ్వాలని కోరారు. మంత్రి రామ్మోహన్‌నాయుడు శుక్రవారం ఇక్కడ తెదేపా ఎంపీలు దగ్గుమళ్ల ప్రసాదరావు, శ్రీభరత్, జీహెచ్‌ఎం బాలయోగి, బస్తిపాటి నాగరాజులతో కేంద్రమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు. డిసెంబర్ 6, 7, 8 తేదీల్లో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి కృష్ణాకర్ణాటక ఉత్సవాలను నిర్వహిస్తున్నాయని రామ్మోహన్‌నాయుడు చెప్పారు. కర్ణాటక సంగీతంలో ఆంధ్రప్రదేశ్ పాత్ర చాటిచెప్పడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని తెలిపారు. సింహాచలం, అన్నవరం దేవస్థానాల అభివృద్ధికి మరింత సహకారం అందించాలని శెఖావత్‌ను కోరినట్లు రామ్మోహన్‌నాయుడు వెల్లడించారు.
December 10, 20241 yr Author అమరావతి: వచ్చే ఐదేళ్ల (2024-29) పాటు ఆంధ్రప్రదేశ్ టూరిజం (AP Tourism) పాలసీని రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది. వచ్చే ఐదేళ్లకు పర్యాటక పాలసీ అమల్లో ఉండేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర ఆర్థిక వృద్ధి, ఉపాధి కల్పన తదితర అంశాలే లక్ష్యంగా నూతన విధానం అమల్లోకి వస్తుందని స్పష్టం చేసింది. రాష్ట్రంలో పర్యాటక ప్రాజెక్టులకు సంబంధించి మౌలిక సదుపాయాలు కల్పించడమే లక్ష్యంగా కొత్త విధానం ఉంటుందని పేర్కొంది. ఎకో టూరిజం, క్రూయిజ్ టూరిజం, బీచ్ సర్క్యూట్‌లు, బ్యాక్ వాటర్ టూరిజాన్ని ప్రోత్సహించేలా ఈ నూతన విధానం ఉండనుందని ప్రభుత్వం పేర్కొంది. ఈ రంగాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేలా టూరిజం పాలసీ ఉంటుందని చెప్పింది. పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక హోదా కల్పించడం, రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను మరింత అభివృద్ధి చేయడం, విదేశీ పర్యాటకులను ఆకర్షించేలా రాష్ట్ర ప్రభుత్వం ఈ పాలసీని రూపొందించింది.
December 11, 20241 yr Author New tourism policy: పర్యాటక రంగంలో కొత్త పుంతలు పర్యాటకరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చింది. By Andhra Pradesh News DeskUpdated : 11 Dec 2024 07:17 IST మూలధన పెట్టుబడులపై భారీగా రాయితీలు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే ఇతర ప్రోత్సాహకాలూ వర్తింపు కొత్త పర్యాటక విధానంపై మార్గదర్శకాలు జారీచేసిన ప్రభుత్వం ఈనాడు, అమరావతి: పర్యాటకరంగంలో పెద్దఎత్తున పెట్టుబడులు ఆకర్షించడమే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కొత్త పర్యాటక విధానం తీసుకొచ్చింది. మంత్రివర్గం ఆమోదం పొందిన నూతన విధానంపై ప్రభుత్వం మంగళవారం జీఓ విడుదల చేసింది. పారిశ్రామిక హోదా కల్పించడంతోపాటు ఎంఎస్‌ఎంఈలకు ఇచ్చే రాయితీలను పర్యాటక రంగానికీ ప్రభుత్వం వర్తింపజేసింది. పీపీపీ విధానంలో రాష్ట్రంలోని తీర ప్రాంతాన్ని, ఇతర ఆధ్యాత్మిక, సందర్శనీయ ప్రాంతాలను పర్యాటకంగా అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు రూపొందించి పెట్టుబడులు ఆహ్వానించింది. ఇతర రాయితీలిలా.. స్టాంపు డ్యూటీ, భూముల బదిలీపై చెల్లించాల్సిన సుంకం పూర్తిగా మినహాయింపు భూములు/భవనాలు/షెడ్లు లీజు కోసం చేసే రిజిస్ట్రేషన్లపై స్టాంపు డ్యూటీ మినహాయింపు. తనఖా, తాకట్టుపై చేసే ఖర్చు తిరిగి చెల్లింపు. ఇది అన్ని కేటగిరీలకూ వర్తిస్తుంది. భూముల బదలాయింపునకు రెవెన్యూ, పట్టణ స్థానిక సంస్థలకు చెల్లించాల్సిన రుసుములు పూర్తిగా మినహాయింపు పర్యాటక ప్రాజెక్టులకు పారిశ్రామిక విద్యుత్తు టారిఫ్ వర్తింపు ప్రాజెక్టు ప్రారంభించిన తేదీ నుంచి ఐదేళ్లపాటు విద్యుత్తు సుంకం మినహాయింపు క్వాలిటీ సర్టిఫికేషన్‌పై జాతీయస్థాయి వరకు రూ.2 లక్షలు, అంతర్జాతీయ స్థాయి సర్టిఫికేషన్‌పై రూ.10 లక్షల వరకు రాయితీ వర్తింపు. రూ.51 కోట్లు, ఆపైన పెట్టుబడులకు రాయితీ వర్తించదు. ఏడేళ్లపాటు జీఎస్‌టీ పూర్తిగా మినహాయింపు (గరిష్ఠంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు) భారీ, మెగా, అల్ట్రా మెగా ప్రాజెక్టుల పెట్టుబడుల ఆధారంగా 7 నుంచి 15 ఏళ్లపాటు జీఎస్‌టీ మినహాయింపు ఇచ్చే అంశంపై ప్రభుత్వం అప్పటికప్పుడు నిర్ణయం తీసుకుంటుంది. (గరిష్ఠంగా మూలధన పెట్టుబడి కింద చేసే ఖర్చుకు సమానంగా మినహాయింపు) కోటి పెట్టుబడికి ఒక వ్యక్తికి ఉపాధి కల్పించే నిష్పత్తి ఆధారంగా అదనపు ప్రోత్సాహకం. ఏ కేటగిరీకి ఎంత ప్రోత్సాహకం ఇవ్వాలనేదానిపై ప్రభుత్వం తదుపరి నిర్ణయం తీసుకోనుంది.
January 23, 20251 yr Author అలలపై తేలుదాం.. వెన్నెల్లో విహరిద్దాం! వెన్నెల రాత్రుల్లో కుటుంబసభ్యులతో కలిసి బోటు షికారు చేయాలని ఉందా..! అలల ఊయలపై తేలియాడుతూ కలల వీధుల్లో విహరించాలనుకుంటున్నారా..విందును ఆస్వాదిస్తూ.. అయినవారితో ఆహ్లాదం పంచుకోవాలనుందా.. By Andhra Pradesh News DeskPublished : 23 Jan 2025 05:46 IST Ee Font size నదులు, జలాశయాల్లో రాత్రి వేళల్లోనూ బోట్లు పర్యాటకులు ఉండేలా ఏర్పాట్లు సౌకర్యాలు కల్పిస్తున్న యంత్రాంగం రాష్ట్రంలో ఐదుచోట్ల ఈ సేవలు అందించేలా ప్రణాళికలు ఈనాడు - అమరావతి కోనసీమ జిల్లా దిండిలో నడుపుతున్న బోటు వెన్నెల రాత్రుల్లో కుటుంబసభ్యులతో కలిసి బోటు షికారు చేయాలని ఉందా..! అలల ఊయలపై తేలియాడుతూ కలల వీధుల్లో విహరించాలనుకుంటున్నారా.. విందును ఆస్వాదిస్తూ.. అయినవారితో ఆహ్లాదం పంచుకోవాలనుందా.. అయితే.. మీ కోసమే ప్రభుత్వం ప్రత్యేకంగా చొరవ తీసుకుంటోంది. కేరళలోని అలెప్పీలో బోటు షికారు మాదిరిగా సౌకర్యాలు కల్పించేందుకు కంకణం కట్టుకుంది. రాష్ట్రంలోని పలు నదులు, తీరప్రాంతాల్లో సకల సౌకర్యాలతో పర్యాటక బోట్లు సిద్ధం చేస్తోంది. ప్రైవేటు రంగంలో వీటిని ప్రోత్సహిస్తోంది. ఫలితంగా పర్యాటకరంగానికి నూతనోత్సాహం తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తోంది. బోట్లు తిప్పేందుకు ముందుకొచ్చేవారి కోసం రాష్ట్ర పర్యాటకాభివృద్ధి సంస్థ ఆసక్తి వ్యక్తీకరణ బిడ్లనూ ఆహ్వానించింది. పొడవైన తీర ప్రాంతం రాష్ట్రానికి గొప్ప వరం. గోదావరి, కృష్ణా, పెన్నా, నాగావళి, వంశధార సహా సుమారు 25 నదులు రాష్ట్రంలో ఉన్నాయి. వీటిని వినియోగించుకుని పర్యాటకరంగాన్ని అభివృద్ధి చేసేలా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందిస్తోంది. ఇందులో భాగంగానే ఐదుచోట్ల సమస్త సదుపాయాలున్న బోట్లు నడపాలని నిర్ణయించింది. కోనసీమ జిల్లా దిండిలో ఇదివరకే రెండుబోట్లు ప్రారంభించింది. గోదావరి వశిష్ట పాయలో పగలు బోట్లు తిప్పి సాయంత్రం 6 గంటల తర్వాత హరిత రిసార్ట్ వద్ద నిలిపివేస్తోంది. ప్రస్తుతం ఒక్కబోటునే రాత్రి బసకు వినియోగిస్తున్నారు. రెండో బోటుకు మరమ్మతులు చేయాల్సి ఉంది. కొత్తగా ప్రవేశపెట్టే బోట్లలో కొన్నింటిని రాత్రి కూడా నడపాలని అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. ఒక్కో బోటులో రెండుగదులు ఉంటాయి. రెస్టారెంట్, వినోద కార్యక్రమాలూ ఉంటాయి. ఒకటి, రెండు రోజులపాటు బోటులోనే ప్రయాణించేలా అధికారులు సౌకర్యాలు కల్పించి, అందుకు తగినట్లు ప్యాకేజీలు రూపొందిస్తున్నారు. ఎక్కడెక్కడ అంటే.. విజయవాడ భవానీ ద్వీపం నుంచి కృష్ణా, గోదావరి పవిత్ర సంగమం వరకు కొత్తగా బోటు నడపనున్నారు. పర్యాటకులు మార్గమధ్యలో కొన్ని ప్రసిద్ధ ఆలయాలను సందర్శించొచ్చు. బెర్మ్ పార్కు నుంచి భవానీద్వీపం వరకు ప్రస్తుతం బోట్లు నడుపుతున్నారు. పాపికొండలకు వెళ్లే పర్యాటకులు ఒకటి, రెండు రోజులపాటు బోటులోనే ఉండేలా ఏర్పాట్లు చేయనున్నారు. గండిపోచమ్మ నుంచి పర్యాటకాభివృద్ధి సంస్థ ప్రస్తుతం ఒక బోటు నడుపుతోంది. కోనసీమ జిల్లాలో సముద్ర తీరప్రాంతం అంతర్వేది నుంచి బోటు నడపనున్నారు. పర్యాటకులు పగలు, రాత్రి బోటులోనే ఉండేలా ప్యాకేజీ రూపొందించనున్నారు. ప్రస్తుతానికి ప్రైవేటు సంస్థల ఆధ్వర్యంలో బోట్లు నడుస్తున్నాయి. వైఎస్సార్ జిల్లాలో గండికోట అందాలను తిలకించేలా ఆధునిక బోటు ప్రవేశపెట్టారు. ఇందులో రాత్రి విడిది చేయొచ్చు. మైలవరం రిజర్వాయర్ నుంచి గండికోట కెనాల్ వరకు బోటు నడుపుతారు. ప్రస్తుతం ఇక్కడ రెండుబోట్లు ఉన్నాయి. వాటిలో సదుపాయాలు కల్పించాల్సి ఉంది. అల్లూరి జిల్లా చింతపల్లి మండలంలో తాజంగి జలాశయంలో బోటు నడపనున్నారు. లంబసింగి సందర్శనకు వచ్చే వారు తాజంగి జలాశయాన్ని సందర్శిస్తున్నారు.
February 13, 20251 yr Author ఏపీలో టూరిజం ఐల్యాండ్‌ల అభివృద్ధికి నిర్ణయం: సీఎం చంద్రబాబు అమరావతి: సచివాలయంలో పర్యటక శాఖపై సమీక్షించిన సీఎం చంద్రబాబు పర్యటక అభివృద్ధికి స్పష్టమైన కార్యాచరణ సిద్ధం చేయాలని ఆదేశం పర్యటక రంగంలో 20 శాతం వృద్ధిరేటు ఉండాలన్న సీఎం యువతకు ఉపాధి కల్పించే దిశగా చర్యలు తీసుకోవాలన్న సీఎం రాష్ట్రంలో టూరిజం ఐల్యాండ్‌ల అభివృద్ధికి నిర్ణయం: సీఎం చంద్రబాబు Edited February 13, 20251 yr by sonykongara
February 19, 20251 yr Author రాష్ట్రంలో బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏర్పాటుకు కేంద్ర మంత్రి హామీ దేశంలో ఏర్పాటు చేయనున్న బుద్ధిస్ట్ సర్క్యూట్లలో ఒకటి రాష్ట్రానికి కేటాయిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. By Andhra Pradesh News DeskPublished : 19 Feb 2025 04:36 IST Ee Font size రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి దుర్గేష్ ఈనాడు, అమరావతి: దేశంలో ఏర్పాటు చేయనున్న బుద్ధిస్ట్ సర్క్యూట్లలో ఒకటి రాష్ట్రానికి కేటాయిస్తామని కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖల మంత్రి గజేంద్రసింగ్ షెకావత్ హామీ ఇచ్చారని రాష్ట్ర పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. దిల్లీలో బుధవారం నిర్వహించే ‘సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్ -2025’లో పాల్గొనేందుకు మంగళవారం దిల్లీ వెళ్లిన ఆయన కేంద్ర మంతిని కలిశారు. ‘నేషనల్ స్కూల్ ఆఫ్ డ్రామా సెంటర్ ఏపీలో ఏర్పాటుకు మంత్రి షెకావత్ సానుకూలంగా స్పందించారు. ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చర్ రిలేషన్స్, లలిత కళా అకాడమీ, జీవీఆర్ మ్యూజిక్, డ్యాన్స్ కళాశాలలో కళాక్షేత్ర ఆడిటోరియం, సాహిత్య అకాడమీ రీజనల్ సెంటర్ ఏర్పాటు చేయాలని కోరాం’ అని మంత్రి దుర్గేష్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
February 19, 20251 yr Author పీపీపీ విధానంలో పర్యాటక రంగం అభివృద్ధి: మంత్రి దుర్గేష్ దిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్-2025 వేదికగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు. By Andhra Pradesh News TeamPublished : 19 Feb 2025 22:32 IST Ee Font size దిల్లీ: దిల్లీలో జరుగుతున్న సౌత్ ఏషియా లీడింగ్ ట్రావెల్, టూరిజం ఎగ్జిబిషన్-2025 వేదికగా ఏపీ పర్యాటకశాఖ మంత్రి కందుల దుర్గేష్ ఇన్వెస్టర్లకు ఆహ్వానం పలికారు. సుస్థిర, సమగ్ర పర్యాటకాభివృద్ధి, ఆర్థిక పురోభివృద్ధి, ఉపాధి కల్పనే ధ్యేయంగా అడుగులు వేస్తున్నామని వివరించారు. పీపీపీ విధానంలో పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రభుత్వం తరఫున ఇన్వెస్టర్లకు మెరుగైన రాయితీలు కల్పించి పూర్తి సహకారం అందిస్తామని భరోసానిచ్చారు. టెంపుల్, అడ్వెంచర్, ఎకో, వెల్‌నెస్, హెరిటేజ్, రిలీజియస్, అగ్రి, మెడికల్, క్రూయిజ్, బీచ్, కోస్టల్, సీప్లేన్, రూరల్, ఫిల్మ్ టూరిజంలను వృద్ధి చేసేలా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులకు గమ్యస్థానంగా ఏపీని తీర్చిదిద్దుతామని తెలిపారు. రాష్ట్ర సందర్శనకు రావాలని ఇన్వెస్టర్లను మంత్రి కోరారు.
Create an account or sign in to comment