April 10Apr 10 Author అమరావతి పక్క నుంచి వెళ్లాలా? ఓఆర్‌ఆర్ మీదుగానా?By Andhra Pradesh News DeskUpdated : 10 Apr 2026 05:17 ISTEeFont size3 min readహైదరాబాద్-అమరావతి-మచిలీపట్నం గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్‌వే నిర్మాణానికి పలు ఆప్షన్లుమూడింటిని పరిశీలిస్తున్న పభుత్వంఈనాడు, అమరావతి: హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతి మీదుగా మచిలీపట్నం పోర్టుకు కనెక్టివిటీ ఉండేలా నిర్మించతలపెట్టిన గ్రీన్‌ఫీల్డ్ ఎక్స్‌ప్రెస్ వే.. ఎటువైపు నుంచి వెళ్లాలనే దానిపై రాష్ట్ర ప్రభుత్వం వివిధ ఆప్షన్లను పరిశీలిస్తోంది. రాజధాని ప్రాంతాన్ని ఆనుకొని వెళ్లాలా? అమరావతి అవుటర్ రింగ్ రోడ్ (ఓఆర్‌ఆర్) మీదుగా మళ్లించాలా? కొంతదూరం ఓఆర్‌ఆర్ మీదుగా వెళ్లి, కొంత రాజధాని ప్రాంతం నుంచి వెళ్లేలా చూడాలా? ఇలా అనేక ఆప్షన్లతో కూడిన అలైన్‌మెంట్లపై అధ్యయనం చేస్తున్నారు. ఈ ఎక్స్‌ప్రెస్ వే కోసం నియమించిన సలహా సంస్థ కొన్ని అలైన్‌మెంట్లను ప్రతిపాదించింది. వీటిలో ఏది మేలు? దూరం ఎంత? ప్రయాణ సమయం ఎంత తగ్గుతుంది? నిర్మాణ వ్యయమెంత అవుతుంది? ఎంత మేరకు భూసేకరణ చేయాల్సి ఉంటుంది? అనేవి కూడా పరిగణనలోకి తీసుకొని ఆప్షన్లను పరిశీలిస్తున్నారు. ప్రధానంగా మూడు ఆప్షన్లపై ప్రభుత్వం మొగ్గుచూపిస్తున్నట్లు తెలిసింది. అవి..మొదటి ఆప్షన్..హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో రేడియల్ రోడ్ నుంచి ఎక్స్‌ప్రెస్ వే మొదలై.. హాలియా మీదుగా అమరావతి అవుటర్ రింగ్ రోడ్ వరకు 199.16 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్‌తో ఉంటుంది. ఓఆర్‌ఆర్‌లో పెదకూరపాడు మండలం జలాల్‌పురం వద్ద కలుస్తుంది. అక్కడి నుంచి ఓఆర్‌ఆర్‌లో 58.84 కి.మీ. వెళ్లి.. తెనాలికి సమీపంలో కంచెర్లపాలెం వద్ద కట్ అవుతుంది. అక్కడి నుంచి మళ్లీ 45.7 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవేగా వెళ్లి.. మచిలీపట్నం సమీపంలోని గూడూరు వద్ద విజయవాడ-మచిలీపట్నం హైవేలో కలుస్తుంది. ఈ అలైన్‌మెంట్ మొత్తం 303.7 కి.మీ. ఇందులో గ్రీన్‌ఫీల్డ్ రోడ్ 244.86 కి.మీ. (తెలంగాణలో 119.14, ఏపీలో 125.72 కి.మీ.) ఉంటుంది. ఈ ప్రాజెక్ట్‌లో భూసేకరణ ఖర్చు రూ.5,500 కోట్లు, నిర్మాణ వ్యయం రూ.8,570 కోట్లు అవుతుందని అంచనా.రెండో ఆప్షన్..హైదరాబాద్ రేడియల్ రోడ్ నుంచి మొదలై.. 226.650 కి.మీ. మేర గ్రీన్‌ఫీల్డ్ హైవేగా ప్రయాణించి.. కాజ సమీపంలో చెన్నై-కోల్‌కతా హైవేలో విజయవాడ బైపాస్ కలిసిన పాయింట్ వద్దకు వచ్చి కలుస్తుంది. అక్కడినుంచి అవుటర్ రింగ్‌రోడ్‌లో తెనాలి వరకు నిర్మిస్తున్న స్పర్ రోడ్‌లో 16.6 కి.మీ. వెళ్తుంది. ఆ తర్వాత ఓఆర్‌ఆర్‌లో 4.24 కి.మీ. వెళ్లి, కంచెర్లపాలెం వద్ద కట్ అవుతుంది. అక్కడి నుంచి 45.7 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవేగా వెళ్లి మచిలీపట్నం సమీపంలో గూడూరు వద్ద విజయవాడ-మచిలీపట్నం హైవేలో కలుస్తుంది.ఈ అలైన్‌మెంట్‌లో ఎక్స్‌ప్రెస్‌వే మొత్తం 293.19 కి.మీ. ఇందులో గ్రీన్‌ఫీల్డ్ 272.35 కి.మీ (తెలంగాణలో 119.14 కి.మీ., ఏపీలో 153.21 కి.మీ.) ఉంటుంది. భూసేకరణ ఖర్చు రూ.6,045 కోట్లు, నిర్మాణ వ్యయం రూ.9,530 కోట్లు అవుతుందని అంచనా వేశారు.మూడో ఆప్షన్:హైదరాబాద్ రేడియల్ రోడ్ నుంచి మొదలై.. హాలియా మీదుగా వచ్చి జలాల్‌పురం వద్ద అమరావతి అవుటర్ రింగ్‌రోడ్‌ను క్రాస్ చేసి, నిడుముక్కల, తాడికొండ, నంబూరు మీదుగా వెళ్లి నందివెలుగు సమీపంలో అవుటర్ రింగ్‌రోడ్‌ను రెండో వైపు కూడా క్రాస్ అవుతుంది. మచిలీపట్నం సమీపంలోని గూడురు వద్ద విజయవాడ-మచిలీపట్నం హైవేలో కలిసేలా అలైన్‌మెంట్ ఉంది. ఈ అలైన్‌మెంట్ మొత్తం సుమారు 288.33 కి.మీ. కాగా, ఇదంతా గ్రీన్‌ఫీల్డ్ రహదారిగానే ప్రతిపాదిస్తున్నారు. ఇందులో తెలంగాణలో 119.14 కి.మీ., ఏపీలో 161.66 కి.మీ. ఉంటుంది. ్య ఈ ప్రాజెక్టుకు భూసేకరణ ఖర్చు రూ.6,370 కోట్లు, నిర్మాణ వ్యయం రూ.10,100 కోట్లు అవుతుందని అంచనా వేశారు.
June 28Jun 28 Author 6-7 గంటల్లోనే బెంగళూరుకుBy Andhra Pradesh News DeskUpdated : 28 Jun 2026 13:27 ISTEeFont size3 min readచకచకా కోడూరు-ముప్పవరం గ్రీన్‌ఫీల్డ్ హైవే పనులుఏడాదిలో అందుబాటులోకి వచ్చే అవకాశం343 కి.మీ. ఆరు వరుసలుగా నిర్మాణంఇప్పటికి దాదాపు 68 శాతం పూర్తిమార్కాపురం జిల్లా సీఎస్‌పురం మండలంలో ఎన్‌హెచ్-167బీ హైవేను క్రాస్ చేసే చోట నిర్మిస్తున్న ఇంటర్ ఛేంజ్ఈనాడు-కడప, పుట్టపర్తి, ఒంగోలు, అమరావతి: బెంగళూరు నుంచి రాజధాని అమరావతి, విజయవాడలకు రాకపోకలు సాగించేందుకు వీలుగా నిర్మిస్తున్న కోడూరు-ముప్పవరం యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే-544జీ పనులు వేగంగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్, జులై నాటికి ఈ ఆరు వరుసల రహదారిపై వాహనాల రాకపోకలను ఆరంభించాలనే లక్ష్యాన్ని నిర్దేశించుకొని పనులు చేస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను బెంగళూరు-కడప-విజయవాడ (బీకేవీ) ఎకనమిక్ కారిడార్‌గా ఎన్‌హెచ్‌ఏఐ పేర్కొంటోంది. అయితే.. బెంగళూరు నుంచి విజయవాడ వరకు నేరుగా ప్రత్యేక రోడ్డేమీ నిర్మించరు. బెంగళూరు నుంచి శ్రీసత్యసాయి జిల్లాలోని కొడికొండ చెక్‌పోస్ట్‌కు సమీప కోడూరు వరకు.. ప్రస్తుతం ఉన్న బెంగళూరు-హైదరాబాద్ హైవేలో 110 కి.మీ. ప్రయాణించాలి. కోడూరు వద్ద యాక్సెస్ కంట్రోల్ గ్రీన్‌ఫీల్డ్ హైవే మొదలై.. 343.24 కి.మీ. కొనసాగి.. ప్రకాశం జిల్లాలోని ముప్పవరం వద్ద చెన్నై-కోల్‌కతా రహదారిలో కలుస్తుంది. అక్కడి నుంచి చెన్నై-కోల్‌కతా రహదారిలో 115 కి.మీ. ప్రయాణించి విజయవాడకు చేరుకోవాలి. అంటే మధ్య 342.24 కి.మీ. గ్రీన్‌ఫీల్డ్ హైవే ఉంటుంది. దానికి అటూఇటూ ఇప్పుడున్న హైవేల్లో 225 కి.మీ. ప్రయాణించాలి. ప్రస్తుతం బెంగళూరు-విజయవాడ మధ్య ప్రయాణ సమయం 12-13 గంటలు ఉండగా.. ఈ ప్రాజెక్ట్ పూర్తయితే 6-7 గంటల్లోనే చేరుకోవచ్చు. ఈ రోడ్డును శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, మార్కాపురం, ప్రకాశం జిల్లాల్లో నిర్మిస్తున్నారు. రూ.14 వేల కోట్ల నిర్మాణ వ్యయంతో భారతమాల పరియోజన మొదటి దశ కింద ఈ ప్రాజెక్టు చేపట్టారు. ఈ పనులు జరుగుతున్న తీరును ‘ఈనాడు’ బృందం క్షేత్రస్థాయిలో పరిశీలించింది. శ్రీసత్యసాయి జిల్లాలో నవాబుపేట నుంచి నల్లమాడ మధ్య పూర్తయిన రహదారిపనులు జరుగుతున్న తీరిది..ఈ రహదారి శ్రీసత్యసాయి జిల్లాలో చిలమత్తూరు, గోరంట్ల, ఓడీసీ, పుట్టపర్తి, నల్లమాడ, ముదిగుబ్బ మీదుగా తలుపుల మండలంలోని నామాలగుండు వద్ద వైఎస్సార్ కడప జిల్లాలోకి ప్రవేశిస్తుంది. ఈ 75 కి.మీ.లో 60 శాతానికి పైగా పనులు పూర్తయ్యాయి. పుట్టపర్తి మండలం సాతర్లపల్లి పరిధిలో కొండను తొలిచే పనులు నెమ్మదిగా సాగుతున్నాయి. నల్లమాడ నుంచి మలకవేముల క్రాస్ వరకు 15 కి.మీ. మేర రహదారి పూర్తయింది. మలకవేముల క్రాస్ వద్ద రైల్వే బ్రిడ్జి పనులు కొనసాగుతున్నాయి. మలకవేముల క్రాస్ నుంచి కొండగట్టుపల్లి వరకు బీటీ లేయర్ వేస్తున్నారు. వైఎస్సార్ కడప జిల్లాలో వేముల, పులివెందుల, ఎర్రగుంట్ల, కమలాపురం, చాపాడు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా ఈ హైవే వెళ్తోంది. కమలాపురం మండలం కంచెన్నగారిపల్లె వద్ద పెన్నా నదిపై, చాపాడు మండలం అల్లాడుపల్లి వద్ద కుందూ నదిపై భారీ వంతెనల నిర్మాణం, మిగిలిన ప్రాంతాల్లో రోడ్ల పనులు జరుగుతున్నాయి. ఈ జిల్లాలో కొన్నిచోట్ల భూసేకరణ సమస్యలతో పనులు జాప్యమవుతున్నాయి. ఉమ్మడి ప్రకాశం జిల్లా అత్యధికంగా 140 కి.మీ. ఉంది. సింగరాయకొండ నుంచి మైదుకూరు వైపు వెళ్లే ఎన్‌హెచ్-167బీ వద్ద ఇంటర్ ఛేంజ్ పనులు చేస్తున్నారు. మర్రిపూడి నుంచి సోమవరప్పాడు వరకు 13వ ప్యాకేజీలో పనులు చాలావరకు పూర్తయ్యాయి. ఈ ప్రాజెక్ట్‌లో 5.31 కి.మీ. మేర ఏడు సొరంగాలు నిర్మిస్తున్నారు. నెల్లూరు జిల్లా సీతారామపురం మండల సరిహద్దులోని 3.67 కి.మీ. పొడవైన సొరంగం ప్రాజెక్ట్‌లో అతి పెద్దది.వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలం వనిపెంట అటవీ ప్రాంతంలో సొరంగాల పనులు
August 23Aug 23 Author ఖరగ్‌పుర్-అమరావతి హైస్పీడ్ రోడ్ కారిడార్‌కు ఓకేBy Andhra Pradesh News DeskPublished : 23 Aug 2026 04:43 ISTEeFont size2 min readఏపీ ప్రభుత్వం సూచించిన ఎలైన్‌మెంట్‌కు ఆమోదంమొత్తం దూరం 1,107 కి.మీ.. ఏపీలో 457 కి.మీ.ఈనాడు, అమరావతి: పశ్చిమ బెంగాల్‌లోని ఖరగ్‌పుర్ నుంచి అమరావతి ఔటర్ రింగ్ రోడ్డు వరకు కొత్తగా నిర్మించనున్న నాలుగు వరుసల హైస్పీడ్ రోడ్ కారిడార్‌లో మన రాష్ట్ర పరిధిలో ఎలైన్‌మెంట్‌కు ఆమోదం లభించింది. ఏపీలోని 457 కి.మీ.లకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం సూచించిన మార్గానికి కేంద్ర రవాణా, జాతీయ రహదారుల మంత్రిత్వశాఖ (మోర్త్)లోని ఎలైన్‌మెంట్ అప్రూవల్ కమిటీ (ఏఏసీ) తాజాగా ఆమోదం తెలిపింది. ఈ కారిడార్‌ను పశ్చిమబెంగాల్, ఝార్ఖండ్, ఒడిశా, ఏపీలలో కలిపి మొత్తం 1,107 కి.మీ. మేర నిర్మిస్తారు. మన రాష్ట్రంలో కురుపాం, పార్వతీపురం, సాలూరు, మక్కువ, అరకు, పాడేరు, చింతపల్లి, గోకవరం, కన్నాపురం, జంగారెడ్డిగూడెం, లక్కవరం, దేవరపల్లి, కామవరపుకోట, ద్వారకా తిరుమల, నూజివీడులను అనుసంధానిస్తూ ఆగిరిపల్లి సమీపంలో అమరావతి ఔటర్‌రింగ్ రోడ్‌లో కలిసేలా 457 కి.మీ. రహదారి ప్రతిపాదనకు రాష్ట్ర ప్రభుత్వం సమ్మతి తెలిపింది. భూసేకరణకు కసరత్తు మొదలుఈ కారిడార్ పార్వతీపురం మన్యం, అల్లూరి సీతారామరాజు, పోలవరం, తూర్పుగోదావరి, ఏలూరు జిల్లాల మీదుగా వెళ్తుంది. ఆయా జిల్లాల్లో హైవేకి అవసరమైన భూసేకరణకు సంయుక్త కలెక్టర్, డిప్యూటీ కలెక్టర్ వంటి అధికారుల్లో ఎవరినైనా భూసేకరణ అధికారి (కాలా)గా నియమించాల్సి ఉంటుంది. మన్యం, తూర్పుగోదావరి జిల్లాలకు భూసేకరణ అధికారులను ఎంపిక చేశారు. వారిని అధికారికంగా గుర్తించి, గెజిట్ జారీ చేసేందుకు వీలుగా ఆ వివరాలను మోర్త్ ఉన్నతాధికారులకు పంపారు. మిగిలిన జిల్లాల అధికారుల పేర్లను ఈ వారంలో పంపనున్నారు.ఏపీలో అంచనా వ్యయం రూ.32 వేల కోట్లునాలుగు రాష్ట్రాల్లో కలిపి ఈ కారిడార్ 1,107 కి.మీ. ఉంటుంది. 90 మీటర్ల వెడల్పుతో భూసేకరణ చేస్తారు. గంటకు 100-120 కి.మీ. వేగంతో వాహనాలు వెళ్లేలా డిజైన్ ఉంటుంది.10,630 హెక్టార్ల భూమి సేకరించాల్సి ఉంటుంది. 2,371 హెక్టార్ల అటవీ భూమి అవసరమవుతుంది.భూసేకరణ, పునరావాసానికి కలిపి రూ.8,982 కోట్ల వ్యయమవుతుంది.సివిల్ పనుల విలువ రూ.55,772 కోట్లు ఉండనుంది.ఇతర అనుమతులు, తదితరాలకు అయ్యే ఖర్చుతో కలిపితే మొత్తం ప్రాజెక్ట్ వ్యయం రూ.75,629 కోట్లు.ఏపీలోని 457 కి.మీ.లకు రూ.32 వేల కోట్లు అవుతుందని అంచనా.మార్చి నాటికి ప్రాజెక్ట్ మంజూరు!ఈ ప్రాజెక్ట్‌ను ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలోనే మంజూరు చేయడంపై కేంద్రం దృష్టిపెట్టింది. పశ్చిమబెంగాల్, ఒడిశాలలో కూడా ఎలైన్‌మెంట్‌పై స్పష్టత వచ్చాక డీపీఆర్ ఖరారు చేయనున్నారు. మార్చి నాటికి ఈ ప్రాజెక్ట్‌ను మంజూరు చేయాలని భావిస్తున్నారు.
September 1Sep 1 Author హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం హైవే విస్తరణలో ముందడుగుBy Andhra Pradesh News DeskUpdated : 01 Sep 2026 04:19 ISTEeFont size3 min readక్లియరెన్స్ ఇచ్చిన పీపీపీఏసీకేంద్ర ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ ఆమోదమే తరువాయిమూడు ప్యాకేజీలుగా 284 కి.మీ. విస్తరణఅంచనా వ్యయం రూ.12 వేల కోట్లుహైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి ఈనాడు, అమరావతి: హైదరాబాద్-విజయవాడ-మచిలీపట్నం జాతీయ రహదారి (ఎన్‌హెచ్-65)ని ఆరు వరుసలుగా విస్తరించే ప్రాజెక్ట్‌కు కీలక అనుమతి లభించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్య అప్రైజల్ కమిటీ (పీపీపీఏసీ) ఈ ప్రాజెక్ట్‌కు ఆమోదం తెలిపింది. జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) ప్రతిపాదనకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇక ప్రధాని నేతృత్వంలోని ఆర్థిక వ్యవహారాల క్యాబినెట్ కమిటీ (సీసీఈఏ) ఆమోదం వస్తే ఈ ప్రాజెక్ట్ మంజూరైనట్లే. సెప్టెంబరులో ఈ అనుమతి కూడా లభించనున్నట్లు ఎన్‌హెచ్‌ఏఐ వర్గాలు చెబుతున్నాయి.284 కి.మీ.లు.. మూడు ప్యాకేజీలుహైదరాబాద్ శివారు మల్కాపూర్ నుంచి విజయవాడలోని గొల్లపూడి బైపాస్ వరకు 226 కి.మీ.లను నాలుగు వరుసల హైవేని ఆరు వరుసలుగా విస్తరిస్తారు.హైదరాబాద్ నుంచి నందిగామ వరకు ఒక ప్యాకేజీ, నందిగామ నుంచి గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ వరకు మరో ప్యాకేజీగా పనులు చేస్తారు. దీనిని నిర్మించు, నిర్వహించు, బదలాయించు (బీవోటీ) విధానంలో విస్తరిస్తారు.విజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవే విస్తరణలో భాగంగా.. కానూరు సిద్ధార్థ కళాశాల నుంచి దావులూరు టోల్‌ప్లాజా దాటిన తర్వాత అమరావతి ఔటర్ రింగ్‌రోడ్డు (ఓఆర్‌ఆర్) క్రాస్ అయ్యే ప్రాంతం వరకు 14 కి.మీ.లలో ఇప్పుడు నాలుగు వరుసలకు.. ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు.ఓఆర్‌ఆర్ క్రాసింగ్ ప్రాంతం నుంచి మచిలీపట్నం వరకు 44 కి.మీ. ఆరు వరుసలుగా విస్తరిస్తారు.దీన్ని ఒకే ప్యాకేజీగా.. హైబ్రిడ్ యాన్యుటీ (హ్యామ్) విధానంలో చేపడతారు.భవానీపురం వరకు లేకుండానే..హైదరాబాద్ నుంచి విజయవాడ వరకు హైవేని తొలుత అమరావతి ఓఆర్‌ఆర్ క్రాస్ అయ్యే కంచికచర్ల వరకే 198 కి.మీ. విస్తరించేలా ప్రతిపాదించారు. దీనిపై సీఎం చంద్రబాబు స్పందించి కేంద్రమంత్రి గడ్కరీకి గతంలో లేఖ రాశారు. కంచికచర్ల వద్ద ఆపేయకుండా గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ క్రాస్ అయ్యేవరకు విస్తరించాలని కోరారు. దీంతో విజయవాడ బైపాస్ వరకు 226 కి.మీ. విస్తరణతో డీపీఆర్ సిద్ధం చేశారు. గొల్లపూడి నుంచి భవానీపురం మీదుగా వచ్చే హైవే నాలుగు వరుసలుగా ఉండగా, అది రద్దీగా మారే అవకాశం ఉండటంతో.. దాన్నీ విస్తరించాలని స్థానిక ప్రజాప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. దీంతో గొల్లపూడి వద్ద విజయవాడ బైపాస్ నుంచి భవానీపురం వద్ద కనకదుర్గ ఫ్లైఓవర్ వరకు 5 కి.మీ. మేర హైవేని కూడా ఆరు వరుసలుగా విస్తరించేలా ప్రతిపాదించారు. అంటే మొత్తం 231 కి.మీ. విస్తరించాలి. కానీ పీపీపీఏసీలో మాత్రం చివరి 5 కి.మీ.లకు అనుమతివ్వలేదు. హైదరాబాద్ నుంచి విజయవాడ బైపాస్ (గొల్లపూడి) వరకే 226 కి.మీ. విస్తరణకు ఆమోదం తెలిపారు.పై వంతెనను పక్కన పెట్టారువిజయవాడ నుంచి మచిలీపట్నం వరకు హైవే విస్తరణలో భాగంగా బెంజ్ సర్కిల్ నుంచి ఈడుపుగల్లు కూడలి వరకు ఆరు వరుసల రహదారితో కూడిన పైవంతెనకు ప్రతిపాదించారు. పీపీపీఏసీలో దీనికి ఆమోదం తెలపలేదు. కానూరు నుంచి దావులూరు టోల్‌ప్లాజా దాటాక ఓఆర్‌ఆర్ క్రాస్ అయ్యేచోట వరకు నాలుగు వరుసలుగానే హైవే ఉండనుంది. కొత్తగా దానికి ఇరువైపులా సర్వీస్ రోడ్లు నిర్మిస్తారు. ఓఆర్‌ఆర్ క్రాసింగ్ ప్రాంతం నుంచి మచిలీపట్నం వరకే ఆరు వరుసలుగా హైవే విస్తరించే ప్రాజెక్ట్‌కు పీపీపీఏసీ పచ్చజెండా ఊపింది. రూ.12 వేల కోట్లతో పీపీపీఏసీ ఓకేహైదరాబాద్-విజయవాడ మధ్య 226 కి.మీ., విజయవాడ-మచిలీపట్నం మధ్య 58 కి.మీ. కలిపి మొత్తం 284 కి.మీ. విస్తరణ ప్రాజెక్ట్‌పై ఆగస్టు 8న పీపీపీఏసీ సమావేశం జరిగింది. గతంలో లేవనెత్తిన అభ్యంతరాలకు ఎన్‌హెచ్‌ఏఐ ఇచ్చిన వివరణలు పరిగణనలోకి తీసుకున్నారు. అనంతరం ఈ ప్రాజెక్ట్‌కు పీపీపీఏసీ తాజాగా ఆమోదం తెలిపింది. భూసేకరణ, నిర్మాణ వ్యయం అన్నింటికీ కలిపి రూ.12వేల కోట్ల మేర అంచనాలకు ఆమోదం తెలిపినట్లు సమాచారం. ఇప్పుడీ ప్రాజెక్ట్ సీసీఈఏ ముందుకు వెళ్తుంది. భారీ ప్రాజెక్టులకు ఈ కమిటీయే తుది ఆమోదం తెలపాలి. అది వచ్చాక ప్రాజెక్ట్‌కు భూసేకరణ, ప్యాకేజీల వారీగా టెండర్లు పిలవడం తదితర ప్రక్రియ మొదలుకానుంది.
Create an account or sign in to comment