August 17, 20241 yr Author CM Chandra babu: పెట్టుబడుల కోసం టాస్క్‌ఫోర్స్ రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు, అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. Updated : 17 Aug 2024 07:50 IST సీఎం చంద్రబాబుతో సమావేశమైన టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ హాజరైన పలు దిగ్గజ సంస్థల ప్రతినిధులు స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనపై ప్రధానంగా చర్చ మూడున్నర గంటల పాటు కొనసాగిన సమావేశం సీఎం చంద్రబాబుతో టాటా గ్రూప్ ఛైర్మన్ చంద్రశేఖరన్ కరచాలనం ఈనాడు-అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామిక అభివృద్ధికి సూచనలు, సలహాలు, అవసరమైన ప్రణాళికలు రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని ప్రముఖ పారిశ్రామికవేత్తలు, వివిధ రంగాల నిపుణులకు ఇందులో అవకాశం కల్పించాలని ప్రభుత్వం భావిస్తోంది. టాస్క్‌ఫోర్స్ కమిటీకి ఛైర్మన్‌గా సీఎం చంద్రబాబు, కో-ఛైర్మన్‌గా టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్ వ్యవహస్తారు. రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధి, స్వర్ణాంధ్రప్రదేశ్ విజన్ 2047 లక్ష్యాలను సాధించే దిశగా టాస్క్‌ఫోర్స్ ప్రతిపాదనలను రూపొందిస్తుంది. దీంతో పాటు స్వల్పకాలికి ప్రణాళికలో భాగంగా వచ్చే ఐదేళ్లలో సాధించాల్సిన లక్ష్యాలను నిర్దేశిస్తుంది. సీఎం చంద్రబాబును టాటా గ్రూప్ సంస్థల ఛైర్మన్ నటరాజన్ సచివాలయంలో శుక్రవారం కలిశారు. రాష్ట్రంలో పెట్టుబడులను సాధించడమే లక్ష్యంగా వారి సమావేశం జరిగింది. దీంతో పాటు స్వర్ణాంద్రప్రదేశ్ విజన్ 2047 రూపకల్పనపై సీఎం చంద్రబాబు వారితో చర్చించారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. ‘ 2047 నాటికి పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రాన్ని దేశంలో మొదటి స్థానానికి తీసుకెళ్లడమే లక్ష్యం. దానికి అనుగుణంగా మౌలిక సదుపాయాల కల్పన కోసం రాష్ట్రంలో చేపట్టాల్సిన చర్యలపై టాస్క్‌ఫోర్స్ సూచనలు ఇస్తుంది’ అని సీఎం పేర్కొన్నారు. శుక్రవారం ఉదయం నుంచి సుమారు 3.20 గంటల పాటు వివిధ అంశాలపై పారిశ్రామికవేత్తలతో ముఖ్యమంత్రి సుదీర్ఘంగా చర్చించారు. రాష్ట్రానికి వచ్చే పెట్టుబడిదారులకు ఇక మీదట ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌కు (సులభతర వాణిజ్యం) బదులుగా.. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ (వేగవంతమైన వాణిజ్యం) విధానంలో అనుమతులు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. టాటా సంస్థల ఛైర్మన్ నటరాజన్ చంద్రశేఖరన్‌తో భేటీపై ఎక్స్‌లో సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు. ప్రత్యేక లాజిస్టిక్ పాలసీ ‘రాష్ట్రాన్ని లాజిస్టిక్ హబ్‌గా తీర్చిదిద్దాలి. సరకు రవాణా సేవలు చౌకగా.. సులువుగా అందించే వ్యవస్థను అభివృద్ధి చేస్తాం. క్లస్టర్ విధానాన్ని అభివృద్ధి చేయాలని పారిశ్రామికవేత్తల నుంచి సూచనలు వచ్చాయి. దీనికోసం ప్రత్యేక విధానాన్ని ప్రభుత్వం తీసుకొస్తుంది. అవి ఎక్కడెక్కడ ఏర్పాటు చేయాలనే దానిపై టాస్క్‌ఫోర్స్ సూచనలు చేస్తుంది. ఇందులో వివిధ రంగాలకు చెందిన పారిశ్రామికవేత్తలు.. వారి అవసరాలకు అనుగుణంగా క్లస్టర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందిస్తాం’ అని ముఖ్యమంత్రి అన్నారు. రాష్ట్రంలో 13 స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు బజాజ్ గ్రూప్ ఆసక్తి ‘రాష్ట్రంలో ఉమ్మడి జిల్లాల ప్రాతిపదికగా 13 స్కిల్ సెంటర్ల ఏర్పాటుకు బజాజ్ గ్రూప్ ఆసక్తి చూపుతోంది. భవిష్యత్తులో కృత్రిమ మేథ(ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్) రంగం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఈ దృష్ట్యా ఆ రంగంలో అభివృద్ధికి ప్రణాళికలు రూపొందించాలి. దీనికి అనుగుణంగా యువతలో నైపుణ్యాలను అభివృద్ధి చేయాలి. ప్రత్యేకంగా వారికి శిక్షణ ఇచ్చే కంటే.. ఏఐ అనేది పాఠ్యాంశంలో ఒక భాగంగా చేసే విషయమై ఆలోచన చేయాలి. దీనికోసం నైపుణ్యాభివృద్ధికి విశ్వవిద్యాలయాన్ని ఏర్పాటు చేయడంపై దృష్టి పెడతాం’ అని చంద్రబాబు పేర్కొన్నారు. సీఐఐ ప్రతినిధులతో సమావేశమైన ముఖ్యమంత్రి చంద్రబాబు పారిశ్రామిక వేత్తల నుంచి అందిన సూచనలు రాష్ట్రంలో పెట్టుబడుల ఆకర్షణకు పలువురు పారిశ్రామికవేత్తలు సూచనలు చేశారు. టాస్క్‌ఫోర్స్ ఏర్పాటుపై జరిగిన సమావేశంలో కొన్ని కీలక అంశాలు చర్చకు వచ్చాయి. దేశంలో పలు ప్రముఖ కంపెనీల ప్రతినిధులు సీఎంతో సమావేశమయ్యారు. హైదరాబాద్‌లోని జీనోమ్ వ్యాలీ తరహా ప్రాజెక్టును రాష్ట్రంలో ఏర్పాటు చేయడం వల్ల ఫార్మారంగంలో పరిశోధనలకు ఆస్కారం ఉంటుందని డాక్టర్ రెడ్డీ ల్యాబ్స్ తరఫున సమావేశానికి హాజరైన సతీష్‌రెడ్డి సూచించారు. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంపై మరింత దృష్టి సారించాలని సీఎం చంద్రబాబు ఐటీసీ ప్రతినిధికి సూచించారు. ఫుడ్ చైన్‌ను మరింతగా అభివృద్ధి చేసే విషయమై ప్రతిపాదనలను రూపొందించాలని.. వాల్యూ ఎడిషన్ జోడించే ప్రాజెక్టులకు ప్రాధాన్యం ఇవ్వాలి. రాష్ట్రంలో పర్యాటక ప్రాంతాలకు కనెక్టివిటీ పెంచితే.. మరింత అభివృద్ధికి అవకాశం ఉంది. దీనికోసం ఐటీసీ సంస్థ 10 స్టార్ హోటళ్లను ఏర్పాటు చేసే ప్రతిపాదన ఉంది. టెంపుల్ టూరిజం అభివృద్ధి లక్ష్యంగా వాటిని చేస్తుందని సీఎం పేర్కొన్నారు. జేబీఎం గ్రూప్ తరఫున నిషాంత్ ఆర్యన్, దక్షిణాసియాలో ఆతిథ్యరంగంలో కీలకమైన ఇండియన్ హోటల్స్ గ్రూప్ తరఫున పునీత్ ఛటర్జీ, భారత్ ఫోర్డ్ సంస్థ ఎండీ బాబాసాహెబ్ నీలకంఠ కల్యాణి, ఎనర్జీ అండ్ ఆటోమేషన్ సొల్యూషన్ రంగంలో గుర్తింపు పొందిన ఫోర్బ్స్ మార్షల్ సంస్థ సీఈవో నౌషద్, బజాజ్ సంస్థ నైపుణ్యాభివృద్ధి ప్రాజెక్టులను పర్యవేక్షించే సంజీవ్, ఐటీసీ ఎండీ సంజీవ్ పూరి, సీఐఐ డైరెక్టర్ జనరల్ చంద్రజిత్ బెనర్జీ పాల్గొని పలు సూచనలు చేశారు. టాటా సంస్థ భారీ పెట్టుబడులు ‘టాటా సంస్థ వచ్చే ఐదేళ్లలో రూ.8.5 లక్షల కోట్ల విలువైన పెట్టుబడులు పెట్టాలని లక్ష్యంగా నిర్దేశించుకుంది. అందులో 70 శాతాన్ని దేశంలో పెట్టుబడిగా పెట్టబోతోంది. వాటిలో మెజారిటీ వాటాను రాష్ట్రంలో పెట్టాలని కోరాం. వారికి అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. ఇదే విషయమై సంస్థ ఛైర్మన్‌తో ప్రాథమికంగా చర్చలు జరిగాయి’ అని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిలో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థ: ‘అమరావతిలో సీఐఐ భాగస్వామ్యంతో ‘స్టేట్ ఆఫ్ సెంటర్ ఫర్ గ్లోబల్ లీడర్‌షిప్’ సంస్థను ఏర్పాటు చేస్తాం. ఈ సంస్థ ఏర్పాటులో టాటా గ్రూప్ భాగస్వామిగా ఉంటుంది. విశాఖలో టీసీఎస్ డెవలప్‌మెంట్ సెంటర్ ఏర్పాటుపై ఆ సంస్థ ఛైర్మన్ నుంచి సానుకూలత వ్యక్తమైంది’ అని సీఎం చెప్పారు. రాష్ట్రానికి ఎయిర్ ఇండియా, విస్తారా ఎయిర్‌లైన్స్ సేవల విస్తరణకు సంబంధించిన అంశాలపై టాటా ఛైర్మన్‌తో చర్చలు జరిపినట్లు తెలిపారు.
August 18, 20241 yr Author శ్రీసిటీలో సీఎం పర్యటన.. ఒకే రోజు 15 పరిశ్రమలు ప్రారంభించనున్న చంద్రబాబు ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. Updated : 18 Aug 2024 19:53 IST అమరావతి: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గంలోని శ్రీసిటీలో పర్యటించన్నారు. ఈ సందర్భంగా ఆయన వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. శ్రీసిటీలో 15 సంస్థల కార్యకలాపాలు ప్రారంభించడంతో పాటు మరో 7 సంస్థలకు శంకుస్థాపన చేస్తారు. శ్రీసిటీలో రూ.900 కోట్ల పెట్టుబడితో 2,740 మందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మరో రూ.1,213 కోట్ల పెట్టుబడులకు ప్రభుత్వం ఒప్పందాలు చేసుకోనుంది. శ్రీసిటీ బిజినెస్ సెంటర్‌లో వివిధ కంపెనీల సీఈవోలతో సీఎం భేటీ కానున్నారు. దక్షిణ కొరియాకు చెందిన ఎల్‌జికెమ్, ఇజ్రాయొల్‌కు చెందిన నియోలింక్, జపాన్‌కు చెందిన నైడిక్, ఓజేఐ ఇండియా ప్యాకేజ్, జర్మనీకి చెందిన బెల్ పరిశ్రమలతో పాటు భారత్‌కు చెందిన అడ్మైర్, ఆటోడేటా, బాంబేకోటెడ్ స్పెషల్ స్టీల్స్, ఈప్యాక్, ఇఎస్‌ఎస్‌కేఏవై, ఎవర్‌షైన్, జేజీఐ, త్రినాథ్, జెన్‌లెనిన్‌ను ముఖ్యమంత్రి ప్రారంభించనున్నారు. చైనాకు చెందిన ఎన్‌జీసీ, బెల్జియంకు చెందిన వెర్మేరియన్, జపాన్‌కు చెందిన ఏజీ ఆండ్ పీ పరిశ్రమలకు శంకుస్థాపన చేయనున్నారు. జపాన్‌కు చెందిన రెండు పరిశ్రమలు, యూఏఈ, సింగపూర్‌లతో పాటు మనదేశానికి చెందిన ఒక్కో పరిశ్రమ ఏర్పాటుపై ఒప్పందాలు చేసుకోనున్నారు.
August 19, 20241 yr Author AP News: ఏపీలో ఫాక్స్‌కాన్ మెగాసిటీ.. సంస్థతో ప్రభుత్వం ఒప్పందం ఏపీలో భారీగా పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య సూత్రప్రాయ ఒప్పందం జరిగింది. Published : 19 Aug 2024 18:07 IST అమరావతి: ఏపీలో భారీగా పెట్టుబడులకు ఫాక్స్‌కాన్ సంస్థ ముందుకొచ్చింది. ఈ మేరకు మంత్రి నారా లోకేశ్ సమక్షంలో ప్రభుత్వం, సంస్థ ప్రతినిధులు మధ్య సూత్రప్రాయ ఒప్పందం జరిగింది. ఉండవల్లిలోని నివాసానికి వచ్చిన ఫాక్స్‌కాన్ బృందానికి లోకేశ్ స్వాగతం పలికారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి ఉన్న అవకాశాలను మంత్రి లోకేశ్ వారికి వివరించారు. త్వరలోనే దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈవీ, ఎలక్ట్రానిక్ పాలసీలు తీసుకురాబోతున్నట్లు వెల్లడించారు. ఉద్యోగాల కల్పనే లక్ష్యంగా పరిశ్రమలకు రాయితీలు కల్పించే విధానం కూడా రూపొందిస్తున్నామని చెప్పారు. ఏపీలో ఫాక్స్‌కాన్ మెగా మ్యానుఫ్యాక్చరింగ్ సిటీ నిర్మాణం చేయాలని కంపెనీ ప్రతినిధులను లోకేశ్ కోరారు. ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్లు, డిజిటల్ హెల్త్, మ్యానుఫ్యాక్చరింగ్ కంపోనెంట్స్ తయారీకి సంబంధించిన ప్లాంట్లు ఏర్పాటు చేయనున్నట్లు సంస్థ తెలిపింది. సీఎం చంద్రబాబు చొరవతో 2014 నుండి 2019 వరకు ఏపీకి వచ్చిన అనేక కంపెనీల్లో ఫాక్స్‌కాన్ కూడా ఒకటని లోకేశ్ గుర్తు చేశారు. ఈ సంస్థ నిర్మించే మెగా సిటీ ఏర్పాటుకు అవసరమైన పూర్తి సహకారం అందిస్తామని చెప్పారు. ప్రజాప్రభుత్వంలో 20 లక్షల ఉద్యోగాల కల్పన లక్ష్యంగా పెట్టుకున్నామని, ఆ లక్ష్య సాధనలో ఫాక్స్‌కాన్ ప్రధాన భూమిక పోషించాలని మంత్రి ఆకాంక్షించారు. అనుమతుల నుండి ఉత్పత్తి వరకు ఎక్కడా ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రభుత్వం తరపున సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
August 19, 20241 yr Author https://economictimes.indiatimes.com/news/economy/finance/debt-ridden-andhra-woos-investors/articleshow/112635008.cms?from=mdr
August 20, 20241 yr Author ఏపీలో మరో 15వేల ఉద్యోగాల కల్పన దిశగా హెచ్‌సీఎల్ అడుగులు ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. Published : 20 Aug 2024 17:58 IST అమరావతి: ఏపీలో తన కార్యకలాపాలను భారీగా విస్తరించేందుకు హెచ్‌సీఎల్ సన్నాహాలు చేస్తోంది. ఐటీశాఖ మంత్రి నారా లోకేశ్‌తో భేటీ అయిన హెచ్‌సీఎల్ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శివశంకర్, అసోసియేట్ వైఎస్ ప్రెసిడెంట్ శివప్రసాద్‌లు మరో 15వేల ఉద్యోగాల కల్పనకు సుముఖత వ్యక్తం చేశారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏపీలో కార్యకలాపాలు ప్రారంభించిన హెచ్‌సీఎల్ సంస్థలో 4,500 మందికి ఉద్యోగాలు లభించాయి. విస్తరణ ద్వారా రాష్ట్రంలో మరో 5,500 మందికి ఉద్యోగాలు కల్పించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు సంస్థ ప్రతినిధులు మంత్రికి వివరించారు. ఫేజ్ -2లో భాగంగా నూతన కార్యాలయం నిర్మాణం చేపట్టి మరో 10వేల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని వెల్లడించారు. ఐటీలో ప్రస్తుతం అంతర్జాతీయంగా చోటుచేసుకున్న ట్రెండ్స్‌కు అనుగుణంగా అధునాతన సాంకేతిక సేవలను అందుబాటులోకి తేవడం ద్వారా పెద్ద ఎత్తున ఉద్యోగాలు కల్పించడానికి ప్రణాళికలు సిద్ధం చేస్తున్నట్టు వారు తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టబోతున్న స్కిల్ సెన్సస్, సిల్క్ డెవలప్‌మెంట్‌లో తాము కూడా భాగస్వామ్యం వహిస్తామని ప్రకటించారు. రాష్ట్రంలో 20లక్షల మందికి ఉద్యోగాలు కల్పించాలన్న ప్రభుత్వ లక్ష్యానికి తమవంతు సహాయ, సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. విస్తరణకు కావాల్సిన కొన్ని అనుమతులు, గత ప్రభుత్వం నిలిపివేసిన రాయితీలు విడుదల చేయాల్సిందిగా హెచ్‌సీఎల్ ప్రతినిధులు మంత్రి లోకేశ్ ని కోరారు.
September 9, 20241 yr Author తీసుకున్న భూముల్లో.. పరిశ్రమలు పెట్టాల్సిందే! న్యాయ వివాదాల్లో చిక్కుకొని, ఏళ్లుగా వినియోగంలోకి రాని భూములను గుర్తించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ప్రత్యేక నిపుణుల కమిటీతో వివాదాలను పరిష్కరించి ఆ భూములను పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. Published : 09 Sep 2024 03:36 IST పారిశ్రామికవేత్తలతో ఏపీఐఐసీ సంప్రదింపులు కేసుల పరిష్కారానికి న్యాయ నిపుణుల బృందం ల్యాండ్ బ్యాంకును పెంచుకునేలా చర్యలు ఈనాడు - అమరావతి న్యాయ వివాదాల్లో చిక్కుకొని, ఏళ్లుగా వినియోగంలోకి రాని భూములను గుర్తించాలని ఏపీఐఐసీ నిర్ణయించింది. ప్రత్యేక నిపుణుల కమిటీతో వివాదాలను పరిష్కరించి ఆ భూములను పరిశ్రమల ఏర్పాటుకు వీలుగా అందుబాటులోకి తేవాలని భావిస్తోంది. ఏపీఐఐసీ నుంచి భూములు తీసుకున్న కొందరు పారిశ్రామికవేత్తలు నిర్దేశిత వ్యవధిలో పరిశ్రమలను ఏర్పాటు చేయలేదు. అలాగని వాటిని వెనక్కీ ఇవ్వలేదు. ఏపీఐఐసీ నిబంధనల ప్రకారం గడువులోగా పరిశ్రమలు నెలకొల్పని వారి కేటాయింపులను రద్దు చేసి, ఆ భూములను వెనక్కి తీసుకోవాలి. కానీ, కొందరు పారిశ్రామికవేత్తలు న్యాయస్థానాన్ని ఆశ్రయించి స్టే ఉత్తర్వులు తీసుకోవడం వల్ల స్వాధీనం చేసుకోలేకపోతోంది. స్థలాలు వృథాగా పడి ఉండటం వల్ల వాటి అభివృద్ధికి చేసిన ఖర్చుతో పాటు, పెట్టుబడుల రూపేణా నష్టం వాటిల్లుతోందని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా ఏపీఐఐసీ భూముల్లో సుమారు 20 వేల ఎకరాలు న్యాయ వివాదాల్లో చిక్కుకొని, వృథాగా ఉన్నాయని అధికారుల అంచనా. వివాదం ఏంటి? ఒప్పందంలోని ఏ నిబంధనపై కోర్టును ఆశ్రయించారు? ఆ భూములను విడిపించడమెలా? భవిష్యత్తులో వివాదాలు తలెత్తకుండా ఒప్పందాల్లో చేయాల్సిన మార్పులేంటి? స్థలాలను తిరిగి వినియోగంలోకి తెచ్చేదెలా? అన్న అంశాలపై దృష్టి సారించిన ఏపీఐఐసీ.. ఇందుకు ప్రత్యేకంగా న్యాయ నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. ఈ బృందం భూకేటాయింపు ఒప్పంద నిబంధనలను పరిశీలిస్తుంది. న్యాయ వివాదాలను కేటగిరీల వారీగా విభజించనుంది. ఎక్కువ విస్తీర్ణంలో భూములు పొంది, పరిశ్రమలు గ్రౌండింగ్ కాని కేసుల పరిష్కారానికి తొలి ప్రాధాన్యమివ్వనుంది. పారిశ్రామికవేత్తలో చర్చించి, ఆ భూములను వినియోగంలోకి తెచ్చేందుకు ఆసక్తి ఉందా, లేదా అన్న స్పష్టత తీసుకుని తదుపరి చర్యలకు ఉపక్రమించనుంది. 4పి విధానంలో... ప్రస్తుతం ఏపీఐఐసీ ఆధీనంలో సమారు 46 వేల ఎకరాల భూనిధి ఉంది. కోర్టు వివాదాల్లోని భూములూ అందుబాటులోకి వస్తే ల్యాండ్ బ్యాంక్ 66 వేల ఎకరాలకు చేరుతుంది. పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ప్రభుత్వం త్వరలోనే కొత్త పారిశ్రామిక విధానాన్ని తీసుకురానుంది. కొత్తగా 4పి (పబ్లిక్, ప్రైవేట్, ప్రజల భాగస్వామ్యం) విధానంలో పారిశ్రామిక పార్కులను అభివృద్ధి చేయనుంది. ఈ దృష్ట్యా వీలైనంత ఎక్కువ ల్యాండ్ బ్యాంక్‌ను సిద్ధం చేయాలని ఏపీఐఐసీని ప్రభుత్వం ఆదేశించింది. న్యాయ వివాదాలను పరిష్కరించి, పరిశ్రమల ఏర్పాటుకు భూములను అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా ఏపీఐఐసీలోని న్యాయ విభాగాన్ని బలోపేతం చేస్తామని మంత్రి టీజీ భరత్ తెలిపారు.
Create an account or sign in to comment