October 30Oct 30 Author మరావతి టవర్లలో పనులకు అనుమతిBy Andhra Pradesh News DeskPublished : 30 Oct 2026 06:36 ISTEeFont size6 min readవర్చువల్ కేబినెట్‌లో పలు అంశాలకు ఆమోదం ఈనాడు, అమరావతి: రాజధాని అమరావతిలో సచివాలయం, విభాగాధిపతుల కార్యాలయాల టవర్లలో ఎలక్ట్రికల్, హెచ్‌వీఏసీ, అగ్నిప్రమాద నివారణ భద్రత, లిఫ్ట్‌లు, ఫైర్ అలారం, పబ్లిక్ అడ్రస్ సిస్టమ్, ప్లంబింగ్ లాంటి పనులు చేసేందుకు ఎల్1 బిడ్‌ను ఆమోదించేందుకు ఏపీ ఏజీఐసీఎల్ మేనేజింగ్ డైరెక్టర్‌కు అధికారం కల్పించే ప్రతిపాదనకు కేబినెట్ ఆమోదం తెలిపింది. జీఏడీ, టవర్-1,2, టవర్-3,4లకు విడివిడిగా టెండర్లు పిలిచారు. కేబినెట్‌లో ఆమోదించిన అంశాలువిజయనగరంలో గ్రీన్ స్టీల్ ప్లాంట్ విజయనగరం జిల్లా శ్రీరాంపురంలో రూ.5,194 కోట్ల పెట్టుబడితో 3వేల మందికి ఉపాధి కల్పించే సామర్థ్యంతో సంవత్సరానికి 10 లక్షల టన్నుల స్పెషాలిటీ గ్రీన్ స్టీల్ ప్లాంట్ ఏర్పాటు. ఏపీ పారిశ్రామిక అభివృద్ధి విధానం కింద స్టీల్ ఎక్స్ఛేంజ్ ఇండియా లిమిటెడ్‌కు ప్రోత్సాహకాలు మంజూరు.విశాఖపట్నం జిల్లా అడవివరం, ముడసర్లోవలో సర్వే నంబరు-27లోని 5.84 ఎకరాల జీవీఎంసీ భూమిని లీజు ప్రాతిపదికన విశాఖ హైపర్ స్కేల్‌డేటా సెంటర్ పార్క్ లిమిటెడ్‌కు కేటాయింపు. వీటికి సమీపంలోని దేవాదాయ శాఖ భూములకు వర్తించే లీజుమొత్తమే వీటికి అమలు.రూ.3,700 కోట్లతో 1,200 మందికి ఉపాధి కల్పించే సామర్థ్యంతో 5జీడబ్ల్యు ఇంటిగ్రేటెడ్ ఫెసిలిటీ సిలికాన్ క్రిస్టల్, వేఫర్ ఉత్పత్తి ప్లాంట్ ఏర్పాటుకు రినైసెన్స్ సోలార్, ఎలక్ట్రానిక్స్ మెటీరియల్ ప్రైవేటు లిమిటెడ్‌కు 91.10 ఎకరాల కేటాయింపు.వాణిజ్య ఉత్పత్తి కాలపరిమితి సవరించడం, మెరుగైన ప్రోత్సాహకాల కోసం 2026 జనవరి 10న జారీ చేసిన జీఓ-7 సవరణకు రాంకో సిమెంట్ చేసిన ప్రతిపాదనకు అంగీకారం.ఎర్లీ బర్డ్ ఇన్సెంటివ్స్ పథకం కింద అర్హత కలిగిన హెచ్‌టీఎల్ మెటల్, సిరావిట్ సెరామిక్స్, సూరజ్ లాజిస్టిక్స్, సింథైట్ ఇండస్ట్రీస్, బిల్డ్‌కాస్ట్ సొల్యూషన్స్, డాక్ల్‌ఫైన్‌కెమ్, గ్రీన్‌కోక్, ఎనర్జీ, విఘ్నేష్ ఎలక్ట్రిక్, జీత్ ఎనర్జీలకు మూలధన సబ్సిడీ.వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగు మండలం ఎస్.ఉప్పలపాడులో 452 ఎకరాలు, కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం ఐపీ గుట్టపాడులో 418.55 ఎకరాలు జైరాజ్ ఇస్పాత్‌కు కేటాయింపు.ఆయుధ సామగ్రి క్లస్టర్‌కు భూమి కేటాయింపు నిబంధనల కోసం ఏపీఐఐసీ చేసిన ప్రతిపాదనలకు ఆమోదం.సన్‌షైన్ ఎనర్జెటిక్స్‌కు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం అల్లంపాడులో 455.91 ఎకరాల కేటాయింపురూ.269.25 కోట్లతో ఎనర్జెటిక్స్ మెటీరియల్స్, కమర్షియల్ ఎక్స్‌ప్లోజివ్స్, ఎక్స్‌ప్లోజివ్ ఫిల్లింగ్ ప్లాంట్ ఏర్పాటు కోసం నెల్లూరు జిల్లా దుత్తలూరు, ఏరుకొల్లులో 250 ఎకరాలు మునిష్ డిఫెన్స్ సొల్యూషన్స్‌కు కేటాయింపు. ఈ నెల 22న జరిగిన ఎస్‌ఐపీబీ సమావేశంలో తీసుకున్న సిఫార్సు మేరకు నిర్ణయం.ఆదిత్య ప్రిసిటెక్‌కు 300ఎకరాలు మంజూరుఓర్వకల్లు మండలం మీదివేములలో 290 ఎకరాలు జాక్సన్ సోలార్ ఇంటిగ్రేటెడ్ సంస్థకు కేటాయిస్తూ నిర్ణయంప్యూర్ సస్టైన్ ఇండస్ట్రియల్ పార్కు అప్పికొండకు ప్రోత్సాహకాలుతిరుపతి జిల్లాలో రాళ్లకుప్పం-ఆరూరురోడ్డు 6.800కి.మీ. నుంచి 7.500కి.మీ., 8.000 కి.మీ. నుంచి 8.700 కి.మీ. వరకు ఎలైన్‌మెంట్ మార్పునకు ఆమోదం.తిరుపతిలో రూ.55 కోట్ల పెట్టుబడితో 200 ఉద్యోగాలు కల్పించే టీచ్‌మింట్ టెక్నాలజీస్‌కు భూ కేటాయింపు.అనకాపల్లి జిల్లా అచ్యుతాపురంలో రూ.1,222.6 కోట్లతో 5,350 ఉద్యోగాలు కల్పించే సబ్‌స్ట్రేట్ క్యాపిటల్‌కు ప్రోత్సాహకాలు, భూకేటాయింపు. సాగునీటి పనులకు ప్రాధాన్యం..కుప్పం బ్రాంచ్ కెనాల్‌లోని 0.000కి.మీ. నుంచి 131.200 కి.మీ. వరకు గల ఆఫ్ టెక్ రెగ్యులేటర్లు, ఇతర కీలక ప్రాంతాల్లో 2025 సెప్టెంబరు 16 నుంచి 2026 ఫిబ్రవరి 13 వరకు కాపలా కోసం రూ.49.50 లక్షలకు పరిపాలన అనుమతి. పల్నాడు జిల్లాలోని కారంపూడి సమీపంలోని ఎన్‌ఎస్‌జేసీ కుడి కాల్వ 55.300కి.మీ. సమీపంలో క్రాస్ బండ్ వద్ద ఏర్పడిన గండిని తాత్కాలికంగా పునరుద్ధరించే పనికి రూ.4.25 లక్షలకు పరిపాలన అనుమతి.కృష్ణా జిల్లా విస్సన్నపేట, ముసునూరు, రెడ్డిగూడెం, చాత్రాయ్, నూజివీడు మండలాల ఎగువ భూములు 50 వేల ఎకరాలకు సాగునీటి సౌకర్యం కల్పించేందుకు కోటపాడు ఎత్తిపోతలు, చనుబండ, విస్సన్నపేట స్టేజ్-1,2,3 ఎత్తిపోతల పథకాల పంప్ హౌస్, మెయిన్ కెనాల్, కాల్వల నిర్మాణాన్ని మేఘా సంస్థకు అప్పగించిన రూ.698.90 కోట్ల పనికి ఆమోదం.ఇంధన ప్రాజెక్టులకు ప్రోత్సాహకాలుఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024 కింద చిత్తూరు జిల్లా విజయపురం మండలం కలియాంబాకం గ్రామంలో 12 టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఐరా బయో ఎనర్జీకి ఆమోదం. ప్రోత్సాహకాల పొడిగింపుకర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలంలోని కడివెల్ల, సమీప గ్రామాల్లో 500 మెగావాట్ల పవన విద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటు చేసేందుకు విండోరా ఎనర్జీ ప్రైవేటు లిమిటెడ్‌కు అనుమతి. ప్రాజెక్టు ప్రాంతంలోని ప్రైవేటు భూముల మధ్య ఏమైనా రెవెన్యూ, ఎసైన్డ్ భూములు ఉంటే వాటిని లీజు ప్రాతిపదికన ప్రతి రెండో సంవత్సరానికి 5% పెంపుతో ఎకరానికి రూ.31వేల చొప్పున కేటాయింపుఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ కింద ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి గ్రామంలో టీపీడీ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఆంధ్రా షుగర్స్‌కు అనుమతి. ఈ పాలసీ కింద ప్రోత్సాహకాలు పొడిగింపుఎన్ఎస్ఎల్ రెన్యువబుల్ సీపీపీ ప్రైవేటు లిమిటెడ్ స్వంత వినియోగం కోసం ఏర్పాటు చేసిన 42.90 మెగావాట్ల పవన, 37.20 మెగావాట్ల ఏసీ/52 మెగావాట్ల పీడీసీ సోలార్ సామర్థ్యాలతో కూడిన పవన, సౌర హైబ్రిడ్ సామర్థ్యాన్ని 20 మెగావాట్లకు పెంచడం. మొత్తం సామర్థ్యాన్ని 70 మెగావాట్ల హైబ్రిడ్‌కు పెంపు.ఏపీ ఇంటిగ్రేటెడ్ క్లీన్ ఎనర్జీ పాలసీ-2024కు సవరణజేఎస్డబ్ల్యూ రాయలసీమ స్టీల్ లిమిటెడ్‌కు సంవత్సరానికి 0.025టీఎంసీల నీటి కేటాయింపుఎన్టీటీపీఎస్, డాక్టర్ ఎంవీఆర్ ఆర్‌టీపీపీ యూనిట్ల నిర్వహణకు 3లక్షల మెట్రిక్ టన్నుల విదేశీ బొగ్గు కొనుగోలుఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామ పరిధిలో 713.04 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కు(డిఫెన్స్ క్లస్టర్) ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపు. ఎకరాకు రూ.23.75 లక్షలు.అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం మాసాపేటలో 0.82 ఎకరాల భూమిని గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ నిర్మాణం కోసం 30ఏళ్ల లీజుకు కేటాయింపుకొండెపి నియోజకవర్గంలోని టంగుటూరు మత్స్యకార బాలికల కోసం శాశ్వత పాఠశాల భవనం, హాస్టల్ నిర్మాణం కోసం ఐదేకరాలు కేటాయింపుపారిశ్రామిక పార్కు ఏర్పాటుకు కర్నూలు జిల్లా కృష్ణగిరి మండలం కంబాలపాడు గ్రామ పరిధిలోని 200 ఎకరాలు ఏపీఐఐసీకి అప్పగింత. ఎకరాకు రూ.7.81లక్షల చొప్పున చెల్లింపు.అన్నమయ్య జిల్లా రాయచోటి మండలం సిబ్యాల గ్రామంలో 50 ఎకరాల ప్రభుత్వ భూమిని ఎంఎస్‌ఎంఈ పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి కేటాయింపుచిత్తూరు జిల్లా పూతలపట్టు మండలం పోతుకనుమ గ్రామంలోని 46.22 ఎకరాల భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి అప్పగింతచిత్తూరు జిల్లా కుప్పం మండలం వాసనాడు గొల్లపల్లిలో 6.12 ఎకరాల ప్రభుత్వ భూమి ఏపీఐఐసీకి కేటాయింపు.నెల్లూరు జిల్లా మనుబోలు మండలం వడ్లపూడిలో 29.94 ఎకరాల ప్రభుత్వ భూమిని పారిశ్రామిక పార్కు ఏర్పాటుకు ఏపీఐఐసీకి అప్పగింత.అనంతపురం జిల్లా యాడికి మండలం కమలాపురం, కుందన కోటల్లోని 265.174 ఎకరాల ప్రభుత్వ భూమి కమలాపురం పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టు (950 మెగావాట్లు) ఏర్పాటుకు ఏపీజెన్‌కోకు కేటాయింపు. ఎకరాకు రూ.9.41లక్షలు చెల్లింపు.కాకినాడలో ఎమ్యూజ్‌మెంట్ పార్కుకాకినాడలో మన్ ప్రకృతి గ్రూప్స్ ఆధ్వర్యంలో ‘లాలా ల్యాండ్ వాటర్, అమ్యూజ్‌మెంట పార్కు అభివృద్ధికి ప్రోత్సాహకాలు.‘రాయల్ ఆర్కిడ్స్’ బ్రాండ్ కింద అనంతపురంలో నాలుగు నక్షత్రాల హోటల్ అభివృద్ధి కోసం స్కై రిట్రీట్స్‌కు ప్రోత్సాహకాలు ఆర్‌ఈసీ నుంచి ఏపీపీడీసీఎల్ పొందిన మధ్యకాలిక రుణాలు రూ.500 కోట్లు, రూ.వెయ్యికోట్లకు సంబంధించి ఎస్‌ఆర్‌ఈసీ లిమిటెడ్‌కు రూ.550 కోట్లు, రూ.1100కోట్ల విలువైన రెండు కార్పొరేట్ గ్యారంటీలు ఇచ్చేందుకు ఏపీ జెన్‌కోకు అనుమతి.
October 30Oct 30 Author కర్నూలులో రూ.2,606 కోట్లతో ప్యాకేజ్డ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌ల యూనిట్By Andhra Pradesh News DeskPublished : 30 Oct 2026 05:41 ISTEeFont size1 min readఈనాడు, అమరావతి: కర్నూలు జిల్లా ఓర్వకల్లులో రూ.2,606 కోట్లతో 1,200 మందికి ఉపాధి కల్పించే ప్యాకేజ్డ్ కార్బొనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్, జ్యూస్‌లు, ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ తయారీ యూనిట్‌నుఏర్పాటు చేసేందుకు సవరణ పెట్టుబడికి రిలయన్స్ కన్స్యూమర్ ప్రొడక్ట్స్‌కు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పెట్టుబడి, ప్రోత్సాహకాల సవరణకు ఆమోదించింది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన క్యాంపు కార్యాలయంలో గురువారం వర్చువల్ విధానంలో నిర్వహించిన మంత్రివర్గ సమావేశంలో 48 అంశాలకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అర్నబ్ తుపానుపై మంత్రివర్గం చర్చించింది. 2026-27 సంవత్సరానికి ధాన్యం కొనుగోలు చేసేందుకు మంత్రివర్గం ఆమోదించింది. అమరావతి క్యాంటమ్ వ్యాలీ, క్వాంటమ్ హార్డ్‌వేర్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్కు ఏర్పాటు, రాజధాని అమరావతి సమీపంలో పల్నాడు జిల్లాలో సుమారు 250 ఎకరాల భూమి సేకరణ, బడ్జెట్‌కు అంగీకారం తెలిపింది. వంటగ్యాస్ సిలిండర్ల పంపిణీకి ఓటీపీ ధ్రువీకరణ నుంచి మినహాయింపుఈనాడు, అమరావతి: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వంటగ్యాస్ సిలిండర్ల డెలివరీకి ఓటీపీ ధ్రువీకరణ నుంచి మినహాయింపు ఇవ్వాలని కేంద్ర పెట్రోలియం, సహజవాయు మంత్రిత్వశాఖ నిర్ణయించింది. 13 జిల్లాల్లో ఈ వెసులుబాటు కల్పించింది. వినియోగదారులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా గ్యాస్ సిలిండర్లు సరఫరా చేయాలని రాష్ట్ర ప్రభుత్వం చేసిన విజ్ఞప్తిపై స్పందించి ఈ నిర్ణయం తీసుకుంది. శ్రీకాకుళం, విజయనగరం, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, అల్లూరి సీతారామరాజు, పోలవరం, విశాఖపట్నం, బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, కాకినాడ, తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి, ఏలూరు, కృష్ణా జిల్లాల్లో ఓటీపీ లేకుండా వంటగ్యాస్ సిలిండర్లు పంపిణీ చేస్తారు.
October 30Oct 30 Author ఏపీలో జాక్సన్ గ్రూప్ రూ.6,863 కోట్ల పెట్టుబడిBy Andhra Pradesh News DeskUpdated : 30 Oct 2026 06:52 ISTEeFont size3 min read10 గిగావాట్ల సిలికాన్ ఇన్‌గాట్.. 5 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతిదేశంలో 114.8 గిగావాట్ల సామర్థ్యం ఉంటే.. ఏపీలోనే 92.8 గిగావాట్ల ప్రాజెక్టులుఈనాడు, అమరావతి: రాష్ట్రంలో జాక్సన్ గ్రూప్ అనుబంధ సంస్థ జాక్సన్ ఇంటిగ్రేటెడ్ సోలార్ లిమిటెడ్ (జేఐఎస్‌ఎల్) రూ.6,863 కోట్ల పెట్టుబడులు పెట్టనుంది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలంలోని మీదివేముల గ్రామంలో ఇంటిగ్రేటెడ్ సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్‌ను ఏర్పాటు చేయనుంది. ప్రాజెక్టు కోసం 290 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఇందులో 10 గిగావాట్ల సిలికాన్ ఇన్‌గాట్, వేఫర్లు, 5 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ ప్లాంట్‌ను సంస్థ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు ద్వారా ప్రత్యక్షంగా 1,937 మందికి, పరోక్షంగా 3 వేల మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థ పేర్కొంది. మూడు దశల్లో ప్రాజెక్టు పూర్తిఉత్తర్ప్రదేశ్లోని నొయిడాకు చెందిన జేఐఎస్‌ఎల్‌కు విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సోలార్, రక్షణ రంగాల ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక గుర్తింపు ఉంది. ఏపీలో ప్రతిపాదించిన ప్రాజెక్టును మూడు దశల్లో ఈ సంస్థ పూర్తి చేయనుంది. మొదటి దశలో రూ.3,055 కోట్లు, రెండో దశలో రూ.1,566 కోట్లు, మూడో దశలో రూ.1,561 కోట్లను పెట్టుబడిగా పెట్టనుంది. మొదటి దశ 2028 మే నాటికి, మిగిలిన రెండు దశలను 2030 మే నాటికి పూర్తి చేయనున్నట్లు ప్రభుత్వానికి అందించిన ప్రతిపాదనలో సంస్థ పేర్కొంది.ఏపీలోనే 92.8 గిగావాట్ల ప్రాజెక్టులుసోలార్ మాడ్యూల్స్ తయారీ ప్రాజెక్టుల ఏర్పాటు కోసం పెట్టుబడులను ఆకర్షించడంలో ఏపీ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు సాధించింది. ఇప్పటికే 77.8 గిగావాట్ల ప్రాజెక్టుల ఏర్పాటుకు వివిధ సంస్థలకు ప్రభుత్వం అనుమతులు ఇచ్చింది. తాజాగా జేఐఎస్‌ఎల్‌కు అనుమతించిన 15 గిగావాట్ల ప్రాజెక్టులతో కలిపి సోలార్ మాడ్యూల్స్ తయారీ ప్రాజెక్టుల సామర్థ్యం 92.8 గిగావాట్లకు చేరనుంది. తిరుపతి జిల్లా నాయుడుపేటలో ప్రీమియర్ ఎనర్జీస్ ఇప్పటికే ఉత్పత్తి ప్రారంభించింది. మిగిలిన ప్రాజెక్టులు వివిధ దశల్లో ఉన్నాయి. గుజరాత్, మహారాష్ట్రలో 22 గిగావాట్ల సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులు మాత్రమే ఉన్నాయని ఎస్‌ఐపీబీ సమావేశంలో అధికారులు ప్రస్తావించారు. ఏపీలో ఏర్పాటు కానున్న ప్రాజెక్టులురాంబిల్లిలో రెన్యూ సంస్థ రూ.3,700 కోట్లతో 8 గిగావాట్ల ఇన్‌గాట్ అండ్ వేఫర్ల తయారీ ప్రాజెక్టుకు ఇప్పటికే శంకుస్థాపన చేసింది. దీని ద్వారా 1,200 మందికి ఉపాధి లభిస్తుంది.కర్నూలు జిల్లాలో రెనాయిసెన్స్ సోలార్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెటీరియల్స్ సంస్థ రూ.3,700 కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్ల మర్చంట్ సిలికాన్ వేఫర్ల తయారీ యూనిట్ ఏర్పాటుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. తిరుపతిలో ప్రీమియర్ ఎనర్జీస్ 8 గిగావాట్ల సోలార్ సెల్ తయారీ యూనిట్ రూ.4,200.08 కోట్లతో ఏర్పాటైంది. దీని ద్వారా ఎన్‌టైప్ టాప్‌కాన్ సోలార్ సెల్ తయారీని ఇటీవల ప్రారంభించింది.నెల్లూరు జిల్లాలో ఇండోసోల్ రూ.1.32 లక్షల కోట్లతో 20 గిగావాట్ల సోలార్ సెల్, 20 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు సివిల్ పనులు జరుగుతున్నాయి. కర్నూలు జిల్లాలో అగస్త్య సోలార్ సంస్థ రూ.7,799.96 కోట్ల పెట్టుబడితో 5 గిగావాట్ల సోలార్ సెల్, 5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. 2,138 మందికి ఉపాధి లభిస్తుంది. అనకాపల్లిలో జుపిటర్ రెన్యూవబుల్స్ రూ.2,700 కోట్లతో 4.8 గిగావాట్ల సోలార్ సెల్, 1.5 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు అనుమతి ఇచ్చారు. ప్రస్తుతం కేటాయించిన 142 ఎకరాల భూములకు ప్రత్యామ్నాయంగా మరో చోట ఇవ్వాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలిస్తోంది. తిరుపతి జిల్లాలో వోల్ట్సన్ ల్యాబ్స్ రూ.1,743 కోట్ల పెట్టుబడితో 2 గిగావాట్ల సోలార్ సెల్, 2 గిగావాట్ల సోలార్ మాడ్యూల్స్ తయారీ యూనిట్ ఏర్పాటుకు 37 ఎకరాలు కేటాయింపు. అనకాపల్లి జిల్లా పరవాడ ఇండస్ట్రియల్ పార్కులో అక్షత్ గ్రీన్‌టెక్ రూ.1,500 కోట్లతో 3.5 గిగావాట్ల సోలార్ సెల్ త
Thursday at 11:09 PM4 days 17 hours ago, sonykongara said:ee drug park lu pachani kaakinaada, thoorupu kanumallo aento, chakkaga prakasam, seema lo pettochuga. Hyd lo anni konda lu, guttalae, adhoka laabhaam vaallaki. manam thappani sari paristhilalo , pachani konda lu, pachani polaalu vadhileyyalssi vasthundhi. Kakinada, vizag perigithae, thoorupu kanumalaki, ee pachati polaalaki chaala nastam. monna thufaanulathone chaala nastam ayyindhi, chetlu anni poyi
8 hours ago8 hr Author 25 రకాల పార్కులు.. రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులుBy Andhra Pradesh News DeskUpdated : 16 Nov 2026 05:29 ISTEeFont size6 min read4.47 లక్షల మందికి ఉపాధి అవకాశాలుపారిశ్రామికాభివృద్ధికి సర్కారు కసరత్తుఈనాడు- అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 25 సెక్టోరియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వీటిద్వారా సుమారు రూ.4 లక్షల కోట్ల పెట్టుబడులు ఆకర్షించాలని భావిస్తోంది. కొన్ని పార్కుల ఏర్పాటుకు ఇప్పటికే చర్యలు చేపట్టగా.. మిగిలిన వాటి స్థాపనకు అవసరమైన భూములను సేకరిస్తోంది.శ్రీకాకుళం జిల్లాలో కెమికల్ పార్కుమూలపేటలో నిర్మాణంలో ఉన్న పోర్టుకు అనుసంధానంగా రూ.6,200 కోట్లతో 2,050 ఎకరాల్లో కెమికల్ పార్కు ఏర్పాటుచేయనుంది. కెమికల్, ప్రాసెస్ ఇంజినీర్లు, ప్లాంటు ఆపరేటర్లు, షిఫ్ట్ టెక్నీషియన్లు, ల్యాబ్ కెమిస్ట్‌లు, క్వాలిటీ కంట్రోల్ అనలిస్ట్‌లు, ఫైర్ సేఫ్టీ ఆఫీసర్లు, ఎలక్ట్రీషియన్లు సుమారు 21,500 మందికి ఉపాధి లభించనుంది.విశాఖపట్నంలో మెడ్‌టెక్ తయారీ పార్కునడుపూరు వద్ద రూ.3 వేల కోట్లతో 405 ఎకరాల్లో మెడ్‌టెక్ పార్కును నిర్మించనుంది. బయోమెడికల్ ఇంజినీర్లు, ఎలక్ట్రానిక్ ఇంజినీర్లు, క్లీన్ రూమ్ అసెంబ్లింగ్ టెక్నీషియన్లు, మెడికల్ డివైజ్ మెషీన్ ఆపరేటర్లు, టెస్టింగ్, స్టెరిలైజేషన్ టెక్నీషియన్లు సుమారు 9 వేల మందికి ఉపాధి దొరకనుంది. కాకినాడలో ఆయిల్ అండ్ గ్యాస్ తయారీ పార్కుకాకినాడ సెజ్‌లో రూ.25 వేల కోట్లతో 1,000 ఎకరాల్లో ఈ పార్కు ఏర్పాటుచేయనుంది. ప్రాసెస్, కెమికల్ ఇంజినీర్లు, మెకానికల్ అండ్ ఇన్‌స్ట్రుమెంటేషన్ ఇంజినీర్లు, వెల్డర్లు, పైప్ ఫిట్టర్లు, హెచ్‌ఎస్‌ఈ ఆఫీసర్లు, టర్మినల్, లాజిస్టిక్ ఆపరేటర్లు 11,800 మందికి ఉపాధికి లభించనుంది.పల్నాడులో క్వాంటమ్ కంప్యూటింగ్, టెక్స్‌టైల్ పార్కులులింగాపురం వద్ద రూ.2,417 కోట్లతో 252 ఎకరాల్లో క్వాంటమ్ కంప్యూటింగ్ పార్కును నిర్మించనుంది. దక్షిణాసియాలో మొదటి ఐబీఎం క్వాంటమ్ సిస్టమ్ ఇదే కానుంది. క్వాంటమ్ అల్గారిథమ్స్/సాఫ్ట్‌వేర్, హార్డ్‌వేర్ అండ్ ప్రాసెసర్ ఇంజినీర్లు, క్రయోజెనిక్స్, ఫొటోనిక్స్, పోస్ట్-క్వాంటమ్ క్రిప్టోగ్రఫీ రంగాల్లో 3,198 మందికి ఉపాధి దొరకనుంది.వెల్దుర్తి వద్ద రూ.2,500 కోట్లతో 500 ఎకరాల్లో మెగా టెక్స్‌టైల్ పార్కు ఏర్పాటుచేయనుంది. వీవింగ్ టెక్నీషియన్లు, డైయింగ్ అండ్ ప్రాసెసింగ్ కెమిస్ట్‌లు, కుట్టుమిషన్ ఆపరేటర్లు, టెక్స్‌టైల్ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్ అండ్ మర్చంటైజర్లు 28,700 మందికి ఉపాధి లభించనుంది.ప్రకాశంలో సోలార్ పీవీ మాడ్యూల్ తయారీ పార్కుకుందూరు వద్ద రూ.8 వేల కోట్లతో 1,037 ఎకరాల్లో పీవీ మాడ్యూల్ తయారీ పార్కును నిర్మించనుంది. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, సోలార్ మాడ్యూల్స్ అండ్ సెల్ లైన్ టెక్నీషియన్లు, బ్యాటరీ అసెబ్లింగ్ ఆపరేటర్లు తదితర రంగాల్లో 12 వేల మందికి ఉపాధి దొరకనుంది.కర్నూలులో డ్రోన్ సిటీఓర్వకల్లులో రూ.2,540 కోట్లతో 600 ఎకరాల్లో డ్రోన్ సిటీని నిర్మించనుంది. ఏరోనాటికల్ ఇంజినీర్లు, ఎంబెడెడ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, డీజీసీఏ ధ్రువీకరించిన డ్రోన్ పైలెట్లు, అసెంబ్లీ టెక్నీషియన్లు, సాఫ్ట్‌వేర్ అండ్ ఏఐ డెవలపర్లు 7,640 మందికి ఉపాధి లభించనుంది.అనకాపల్లిలో ఆరు పార్కులుకె.కోటపాడు సమీపంలో రూ.7,660 కోట్లతో 1,000 ఎకరాల్లో స్టీల్ డౌన్‌స్ట్రీమ్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుచేయనుంది. వెల్డర్లు, ఫ్యాబ్రికేటర్లు, ఫిట్టర్, మెషినిస్ట్‌లు, మెకానికల్, మెటలర్జికల్ ఇంజినీర్లు, సీఎన్‌సీ, ప్రెస్‌లైన్ ఆపరేటర్స్, క్రేన్ ఆపరేటర్లు 19,150 మందికి ఉపాధి లభించనుంది.రూ.2.15 లక్షల కోట్ల పెట్టుబడులతో 1,150 ఎకరాల్లో ఏఐ డేటా పార్కును నిర్మించనుంది. దీనిద్వారా డేటా సెంటర్/క్లౌడ్, పవర్ సిస్టమ్స్, హెచ్‌వీఏసీ/కూలింగ్, నెట్‌వర్క్/సైబర్ సెక్యూరిటీ, ఆపరేటర్స్ టెక్నీషియన్లు 6,240 మందికి ఉపాధి దొరకనుంది.నక్కపల్లి వద్ద రూ.11,542 కోట్లతో 2,002 ఎకరాల్లో బల్క్‌డ్రగ్ పార్కు ఏర్పాటుచేయనుంది. ఫార్మా కెమిసిస్ట్స్, కెమికల్ ఇంజినీర్లు, క్వాలిటీ కంట్రోల్, రెగ్యులేటరీ ఎఫైర్స్, ఇతర టెక్నీషియన్లు 24,367 మందికి ఉపాధి లభించనుంది.మాకవరపాలెంలో రూ.2,250 కోట్లతో 500 ఎకరాల్లో ఆర్గానిక్ ఫుడ్ పార్కు నిర్మించనుంది. ఫుడ్ టెక్నాలజిస్ట్‌లు, క్వాలిటీ కంట్రోల్ అండ్ ల్యాబ్ ఎనలిస్టులు, ప్రాసెసింగ్ లైన్ ఆపరేటర్లు, కోల్డ్ చైన్ టెక్నీషియన్లు, ప్యాకింగ్ అండ్ ఎక్స్‌పోర్ట్ సిబ్బంది 15,666 మందికి ఉపాధి దొరకనుంది. నక్కపల్లిలో రూ.1,500 కోట్లతో 581 ఎకరాల్లో టాయ్ పార్కు ఏర్పాటుచేయనుంది. కుట్టుమిషన్లు, ఆపరేటర్లు, టాయ్ అండ్ ప్రొడక్ట్ డిజైనర్లు, మౌల్డ్, టూల్ మేకర్స్, టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ టెక్నీషియన్లు, ప్యాకింగ్, ఎక్స్‌పోర్ట్ లాజిస్టిక్ రంగాల్లో 30 వేల మందికి ఉపాధి లభించనుంది.పైడిపాల సమీపంలో రూ.15 వేల కోట్లతో 1,000 ఎకరాల్లో రేర్ ఎర్త్ అండ్ క్రిటికల్ మినరల్ పార్కు నిర్మించనుంది. మెటలర్జిస్ట్‌లు, కెమికల్ ఇంజినీర్లు, సాల్వెంట్-ఎక్స్‌ట్రాక్షన్ ప్లాంట్ ఆపరేటర్లు, రేడియేషన్-సేఫ్టీ ఆఫీసర్లు, ల్యాబ్ అనలిస్టులు, మ్యాగ్నెట్ ప్రాసెస్ టెక్నీషియన్లు 10 వేల మందికి ఉపాధి దొరకనుంది.శ్రీసత్యసాయి జిల్లాలో రోబోటిక్స్, ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్కులుఈనాడు- అమరావతి: రాష్ట్రంలో పారిశ్రామికాభివృద్ధిని ప్రోత్సహించేందుకు 25 సెక్టోరియల్ పార్కులు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా శ్రీసత్యసాయి జిల్లా గుడిపల్లిలో రూ.3,536 కోట్లతో 300 ఎకరాల్లో రోబోటిక్స్ అండ్ అడ్వాన్స్‌డ్ టెక్నాలజీ పార్కు ఏర్పాటుచేయనుంది. మెకట్రానిక్స్ అండ్ రోబోటిక్స్ ఇంజినీర్లు, ఎంబెడెడ్ అండ్ సాఫ్ట్‌వేర్ డెవలపర్లు, సీఎన్‌జీ మెకానిక్‌లు, ఎలక్ట్రానిక్స్ అసెంబ్లీ టెక్నీషియన్లు, టెస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ ఇంజినీర్లు 18,750 మందికి ఉపాధి దొరకనుంది.ఇదే జిల్లా టేకులోడు వద్ద రూ.1,550 కోట్లతో 500 ఎకరాల్లో ఏరోస్పేస్ అండ్ డిఫెన్స్ పార్కును నిర్మించనుంది. ఏరోస్పేస్ ఇంజినీర్లు, ప్రెసిషన్ మెకానిక్‌లు, ఏవియానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, క్వాలిటీ అండ్ సర్టిఫికేషన్, ఎంఆర్‌ఓ (మెయిన్‌టెనెన్స్, రిపేర్లు, ఓవర్‌హాలింగ్) టెక్నీషియన్లు 3,720 మందికి ఉపాధి లభించనుంది.కడపలో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ (వైఎస్‌ఆర్ ఈఎంసీ)కొప్పర్తిలో రూ.10వేల కోట్లతో 801 ఎకరాల్లో ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ (వైఎస్‌ఆర్ ఈఎంసీ)ని ఏర్పాటుచేయనుంది. ఎస్‌ఎంటీ లైన్ ఆపరేటర్లు, ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, అసెంబ్లీ టెక్నీషియన్లు, టెస్టింగ్ అండ్ క్వాలిటీ కంట్రోల్ సిబ్బంది, సప్లయ్ చైన్ అండ్ ప్రొడక్షన్ మేనేజర్ రంగాల్లో లక్ష మందికి ఉపాధి దొరకనుంది.తిరుపతిలో నాలుగు పార్కులురౌతుసురమాలలో రూ.11,065 కోట్లతో 4,918 ఎకరాల్లో స్పేస్ సిటీని నిర్మించనుంది. ఏరోస్పేస్, మెకానికల్ ఇంజినీర్లు, ప్రొపల్షన్ స్పెషలిస్ట్‌లు, కాంపోజిట్ అండ్ ప్రెసిషన్ మెషినిస్ట్‌లు, ఎవియానిక్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్లు, టెస్ట్ అండ్ క్యూఏ ఇంజినీర్లు 8,300 మందికి ఉపాధి లభించనుంది.కడూరు వద్ద రూ.13,287 కోట్లతో 357 ఎకరాల్లో కొరియన్ ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుచేయనుంది. ఆటోమోటివ్ అండ్ మెకానికల్ ఇంజినీర్లు, ఎలక్ట్రానిక్స్ టెక్నీషియన్లు, ఇంజక్షన్-మౌల్డింగ్ ఆపరేటర్లు, క్వాలిటీ ఇంజినీర్లు, కొరియన్ భాష సంధానకర్తలు 33,231 మంది ఉపాధి దొరకనుంది.రెడ్డిపల్లెలో రూ.20వేల కోట్లతో 495 ఎకరాల్లో సెమీకండక్టర్ తయారీ పార్కును నిర్మించనుంది. వీఎల్‌ఎస్‌ఐ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీర్స్, క్లీన్‌రూమ్ టెక్నీషియన్స్, ప్రాసెస్ అండ్ మెటీరియల్స్ ఇంజినీర్స్, ఎక్విప్‌మెంట్ మెయిన్‌టెనెన్స్ టెక్నీషియన్స్, టెస్ట్ అండ్ ప్యాకింగ్ ఆపరేటర్లు 12,500 మందికి ఉపాధి లభించనుంది.మనవల్లిలో రూ.1,500 కోట్లతో 500 ఎకరాల్లో నిర్మాణ రంగానికి చెందిన ఎక్విప్‌మెంట్ పార్కు ఏర్పాటుచేయనుంది. వెల్డర్లు, ఫ్యాబ్రికేటర్లు, హైడ్రాలిక్స్ టెక్నీషియన్లు, మెకానికల్ ఇంజినీర్లు, అసెంబ్లీ ఫిట్టర్స్, ఫౌండ్రీ అండ్ క్యాస్టింగ్ వర్కర్స్ 6 వేల మందికి ఉపాధి దొరకనుంది.నెల్లూరులోనూ నాలుగు పార్కులుక్రిస్ సిటీలో రూ.4వేల కోట్లతో 200 ఎకరాల్లో స్పోర్ట్ మాన్యుఫ్యాక్చరింగ్ పార్కు నిర్మించనుంది. ఫుట్‌వేర్ స్టిచ్చింగ్ అండ్ లాస్టింగ్ ఆపరేటర్స్, స్పోర్ట్స్ దుస్తులు కుట్టే టైలర్లు, ప్రొడక్ట్ డిజైనర్లు, ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ టెక్నీషియన్లు, ఎక్స్‌పోర్ట్ ప్యాకర్స్ 20 వేల మందికి ఉపాధి లభించనుంది. కొండగుంటలో రూ.4,700 కోట్లతో 1,006 ఎకరాల్లో ఫర్నిచర్ పార్కు ఏర్పాటుచేయనుంది. కార్పెంటర్లు, సీఎన్‌సీ ఆపరేటర్లు, ఫర్నిచర్ డిజైనర్లు, ఫినిషింగ్ అండ్ పాలిషింగ్ టెక్నీషియన్స్, ఎక్స్‌పోర్ట్ ప్యాకర్స్ 15 వేల మందికి ఉపాధి దొరకనుంది. ఆనేమడుగులో రూ.20వేల కోట్లతో 907 ఎకరాల్లో పెట్రోకెమికల్ పార్కు నిర్మించనుంది. పాలిమర్ అండ్ కెమికల్ ఇంజినీర్లు, ల్యాబ్ కెమిస్ట్‌లు, ఇనుస్ట్రుమెంటేషన్ టెక్నీషియన్స్, హెచ్‌ఎస్‌ఈ అధికారులు18 వేల మందికి ఉద్యోగాలు లభిస్తాయి.దుత్తలూరులో రూ.3 వేల కోట్లతో 2,350 ఎకరాల్లో అమ్యునేషన్ పార్కు ఏర్పాటుచేయనుంది. కెమికల్ అండ్ ఎక్స్‌ప్లోజివ్ ఇంజినీర్లు, మెకానికల్ అండ్ మెటలర్జికల్ ఇంజినీర్లు, ఫిల్లింగ్ అండ్ అసెంబ్లీ ఆపరేటర్స్, క్వాలిటీ అండ్ పీఈఎస్‌ఓ స్పెషలిస్ట్‌లు 3,300 మందికి ఉపాధి దొరకనుంది. ఐదు జిల్లాల్లో ఉద్యాన పంటల పార్కులుఅనంతపురం, శ్రీసత్యసాయి, మార్కాపురం, ప్రకాశం, అన్నమయ్య జిల్లాల్లో రూ.2,500 కోట్లతో 500 చొప్పున ఎకరాల్లో ఉద్యాన పంటల పార్కులు ఏర్పాటుచేయనున్నారు. ఫుడ్ టెక్నాలజిస్ట్స్, హార్టికల్చరిస్ట్స్, టిష్యూ కల్చర్ టెక్నీషియన్స్, కోల్డ్ చైన్ ఆపరేటర్స్, పార్క్ హౌస్ వర్కర్స్, క్వాలిటీ కంట్రోల్ ల్యాబ్ ఎనలిస్ట్‌లు 8,750 మందికి ఉపాధి లభించనుంది.
Create an account or sign in to comment