April 24Apr 24 Author విద్యుత్తు ఛార్జీలు పెంచంBy Andhra Pradesh News DeskUpdated : 24 Apr 2026 14:47 ISTEeFont size5 min readవిశ్వాసానికి మారుపేరు ఏపీఇదే ఎన్డీయే బ్రాండ్ప్రజా ప్రభుత్వంలో రోజూ పెట్టుబడుల పండుగే2024లో వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా.. లేదా?రెన్యూ ప్రాజెక్టు శంకుస్థాపనలో ముఖ్యమంత్రి చంద్రబాబురెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ భూమిపూజలో సీఎం చంద్రబాబు. చిత్రంలో కొణతాల రామకృష్ణ, బండారు సత్యనారాయణమూర్తి, అయ్యన్నపాత్రుడు, సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, వైశాలి నిగమ్ సిన్హా, సీఎం రమేశ్, సుందరపు విజయకుమార్2019-24 మధ్య పారిశ్రామికవేత్తలు రాష్ట్రం నుంచి పారిపోయారు. అవినీతి, వేధింపులు పెరిగిపోయాయి. విశ్వాసం ఉన్నచోటే పరిశ్రమలొస్తాయి. ఆ విశ్వాసానికి మారుపేరు, చిరునామా ఆంధ్రప్రదేశ్. ఇదే ఎన్డీయే బ్రాండ్. ఉద్యోగాల కోసం బయట రాష్ట్రాలకు వెళ్లక్కర్లేదు. ఇతర రాష్ట్రాల నుంచి ఇక్కడకు ఉద్యోగాలకు వచ్చేలా చేసే బాధ్యత మాది.సీఎం చంద్రబాబుఈనాడు, విశాఖపట్నం - ఈనాడు డిజిటల్, అనకాపల్లి: ‘2019-24 మధ్య విద్యుత్తు రంగం కుప్పకూలిపోయింది. పీపీఏలు రద్దుచేశారు. అధిక ధరలకు విద్యుత్తు కొనడం, అవినీతి, అనాలోచిత నిర్ణయాలతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. విద్యుత్తు సంస్థలపై రూ.1.12 లక్షల కోట్ల భారం మోపారు. తొమ్మిదిసార్లు ఛార్జీలు పెంచారు. ప్రజలపై రూ.32 వేల కోట్ల భారం వేశారు. విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని ఎన్నికల సమయంలో చెప్పిన మాట నిలబెట్టుకుంటున్నాం. గత ప్రభుత్వం ట్రూ అప్ ఛార్జీలు పెడితే.. కూటమి వచ్చాక ట్రూ డౌన్ చేసి యూనిట్‌కు 13 పైసల చొప్పున రూ.4,498 కోట్లు తగ్గించాం. అధికారంలోకి వచ్చిన 22 నెలల్లో 1.13 కోట్ల గృహ వినియోగదారులకు ఒక్క పైసా పెంచలేదు. భవిష్యత్తులోనూ విద్యుత్తు ఛార్జీలు పెంచబోమని హామీ ఇస్తున్నా’ అని ముఖ్యమంత్రి చంద్రబాబు తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో రూ.5,400 కోట్ల పెట్టుబడితో రెన్యూ ఎనర్జీ గ్లోబల్ సంస్థ ఏర్పాటుచేస్తున్న సోలార్ ప్యానెళ్ల తయారీ ప్లాంటు, ఇంగోట్ వేఫర్ ఉత్పత్తి యూనిట్‌కు ఆయన గురువారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన సభలో సీఎం మాట్లాడుతూ.. ‘సీఐఐ భాగస్వామ్య సదస్సులో రెన్యూ ఎనర్జీ ఎంఓయూ చేసుకుని రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చింది. ఇప్పుడీ పరిశ్రమతో రాంబిల్లిలో 2,100 మందికి ప్రత్యక్ష ఉపాధి కలుగుతుంది. దేశంలోనే అత్యంత ధనిక జిల్లాగా పేరుపొందిన రంగారెడ్డి జిల్లాను మించి అనకాపల్లి ఎదుగుతుంది. సోలార్ ఇంగోట్ వేఫర్ ఉత్పత్తితో మనం విదేశాలపై ఆధారపడే పరిస్థితి పోతుంది. ప్రధాని మోదీ ఆత్మనిర్భర్ భారత్ కల సాకారానికి ఇదే నిదర్శనం’ అన్నారు. రెన్యూ ఎనర్జీ కో ఫౌండర్ వైశాలి నిగమ్ సిన్హాను సత్కరిస్తున్న చంద్రబాబు. చిత్రంలో మంత్రి కొల్లు రవీంద్రఆర్టీసీలో అన్నీ ఈవీ, ఏసీ బస్సులు‘కేంద్రం 500 గిగావాట్ల విద్యుత్తును క్లీన్ ఎనర్జీలో లక్ష్యంగా పెట్టుకుంటే, రాష్ట్రంలో 160 గిగావాట్లు ఉత్పత్తి చేయబోతున్నాం. దీనివల్ల రూ.10లక్షల కోట్ల పెట్టుబడులు, 7.5 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. ఇప్పటికే 90 గిగావాట్లకు మంజూరు, ఎంఓయూలు చేశాం. 22 నెలల్లో 117 ప్రాజెక్టులు ఆమోదించాం. వీటివల్ల రూ.5.95 లక్షల కోట్ల పెట్టుబడులు, 4.76 లక్షల మందికి ఉద్యోగాలు వస్తాయి. భవిష్యత్తులో అన్నీ విద్యుత్ వాహనాలుండాలి. త్వరలోనే ఆర్టీసీలో 1,050 ఈవీ బస్సులు తెస్తున్నాం. రాబోయే మూడేళ్లలో 5వేల ఛార్జింగ్ స్టేషన్లు, ఆర్టీసీలో అన్నీ విద్యుత్ బస్సులే వస్తాయి. అందరూ సహకరిస్తే ఆర్టీసీలో అన్నీ ఏసీ బస్సులు పెడతాం’ అని చంద్రబాబు తెలిపారు.ప్రతి ఇల్లూ విద్యుదుత్పత్తి కేంద్రం కావాలి‘రాష్ట్రంలో ప్రతి ఇంటినీ ఒక విద్యుదుత్పత్తి కేంద్రంగా తయారుచేయాలి. రైతులు పంపుసెట్ల వద్ద విద్యుదుత్పత్తి చేసుకోవాలి. రాబోయే రెండు, మూడేళ్లలో 40 లక్షల ఇళ్లపై సోలార్ యూనిట్లు పెట్టే బాధ్యత తీసుకుంటాం. ఎస్సీ, ఎస్టీలకు రూ.60 వేల విలువైన 2 కిలోవాట్ల రూఫ్‌టాప్ సోలార్ ఉచితం. బీసీలకు రూ.98వేలు, ఇతరులకు రూ.78వేల చొప్పున 3 కిలోవాట్ల వరకు ఉచితంగా ఇస్తాం. ఆపైన ఖర్చు మీరు పెట్టుకోవాలి’ అని సీఎం వివరించారు.ప్రాజెక్టు నమూనాను సీఎంకి వివరిస్తున్న సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హాఏది విధ్వంసం? ఏది వికాసం?ప్రజలు తెలుసుకోవాలి‘22 నెలల క్రితం ఉత్తరాంధ్రలో ఎటు చూసినా అభద్రత, భయం, ఆందోళన, మానసిక క్షోభ ఉన్నాయి. 2024లో మీరు వేసిన ఒక్క ఓటుతో మీ రాత మారిందా.. లేదా? అని అడుగుతున్నా. ఉత్తరాంధ్రలో నాడు పొక్లెయిన్లతో కూల్చివేతలు జరిగితే.. నేడు వాటితో అభివృద్ధి పనులు జరుగుతున్నాయి. ప్రకృతి వనరులను దోచిన పాలకులకు.. వాటిని సంపదగా మార్చే ప్రభుత్వాలకు మధ్య తేడా గుర్తించాలి. ఏది విధ్వంసమో.. ఏది వికాసమో తెలుసుకోవాలి. ప్రజా ప్రభుత్వంలో ఉత్తరాంధ్రలో రోజూ పెట్టుబడుల పండగ జరుగుతోంది. విశాఖకు ఈ నెల 28న గూగుల్ వస్తోంది. భోగాపురం విమానాశ్రయాన్ని జులై మొదటి వారంలో ప్రారంభిస్తాం. వర్షాలు పడగానే గోదావరి నీళ్లను ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా ఇక్కడకు తెస్తున్నాం. మోదీ మద్దతుతో విశాఖ ఉక్కును కాపాడాం. రైల్వేజోన్‌ను త్వరలోనే ప్రారంభిస్తాం. విశాఖ లాగే.. రాజధాని అమరావతి దశ, దిశ మార్చబోతున్నాం’ అని ముఖ్యమంత్రి తెలిపారు.పీ4లో భాగస్వాములు కండిరెన్యూ గ్రూప్ సీఎస్‌ఆర్ కింద చేసిన కార్యక్రమాల చిత్రాలను వేదిక వద్ద ఏర్పాటుచేశారు. వాటి గురించి సంస్థ ఛైర్మన్ సుమంత్ సిన్హా, కోఫౌండర్ వైశాలి నిగమ్ సిన్హా వివరిస్తుండగా... ‘సీఎస్‌ఆర్ అంటే గుర్తొచ్చింది’ అంటూ సీఎం చంద్రబాబు పీ4 పథకం గురించి చెప్పారు. అదానీ ఏపీలో 25వేల కుటుంబాలను దత్తత తీసుకున్నారని, అలాగే రెన్యూ సంస్థ భాగస్వామ్యం కావాలని కోరారు.ఏపీని సౌరవిద్యుత్తుకు కేంద్రంగా మారుస్తాంరెన్యూ సోలార్ కంపెనీ ఛైర్మన్ సుమంత్ సిన్హాఈనాడు డిజిటల్, అనకాపల్లి - అచ్యుతాపురం, న్యూస్‌టుడే: ‘సౌరవిద్యుత్తుకు ఏపీని కేంద్రంగా మారుస్తాం. నైపుణ్యాభివృద్ధి కేంద్రాలను ఏర్పాటుచేసి.. స్థానికులకు 20% ఉపాధి కల్పిస్తాం’ అని రెన్యూ సోలార్ కంపెనీ ఛైర్మన్ సుమంత్ సిన్హా తెలిపారు. అనకాపల్లి జిల్లా రాంబిల్లిలో సోలార్ ప్లాంట్ ప్రారంభోత్సవం అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘ఇప్పటికే గుజరాత్, రాజస్థాన్ రాష్ట్రాల్లో యూనిట్లున్నా ఏపీలోనే రూ.82 వేల కోట్ల పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించాం. రాష్ట్ర ప్రభుత్వం స్నేహపూర్వక విధానాలు, పరిశ్రమలను ఆహ్వానించే చర్యలు ఆకట్టుకుంటున్నాయి. ఆరు నెలల్లోనే ఇక్కడ యూనిట్ ఏర్పాటుకు స్థలాన్ని కేటాయించి అనుమతులు మంజూరుచేశారు. సెమీకండక్టర్, సోలార్ ప్యానెల్ తయారీకి ఉపయోగించే సిలికాన్ మెటీరియల్ ఇక్కడ ప్లాంట్‌లో తయారుచేస్తాం. దీనికి అనుబంధంగా పవర్‌ప్లాంట్ ఏర్పాటు చేయనున్నాం. రాంబిల్లి యూనిట్ కోసం రూ.4,200 కోట్ల పెట్టుబడులు పెడుతున్నాం. దీనివల్ల 2,400 మందికి ఉపాధి లభిస్తుంది. 2030 నాటికి 6.5 గిగావాట్ల విద్యుదుత్పత్తి లక్ష్యంగా పనిచేస్తాం. అమెరికా అనుబంధ పరిశ్రమలు గ్రీన్ ఎనర్జీని ఎక్కువగా వినియోగిస్తాయి. సమీపంలో గూగుల్ రావడంతో మా ప్లాంట్‌కు ఎక్కువ డిమాండ్ ఉంటుందని భావిస్తున్నాం’ సుమంత్ సిన్హా పేర్కొన్నారు.
Thursday at 06:09 PM3 days Author రాయల్‌సీమకు ఎన్‌ఫీల్డ్By Andhra Pradesh News DeskPublished : 07 May 2026 05:11 ISTEeFont size2 min readరూ.2,508 కోట్లతో తిరుపతిలో పరిశ్రమరూ.లక్ష కోట్లతో విశాఖలో రిలయన్స్ డేటాసెంటర్సీఎం చంద్రబాబు అధ్యక్షతన 17వ ఎస్‌ఐపీబీ సమావేశం రూ.2,00,964 కోట్లతో వివిధ పెట్టుబడుల ప్రతిపాదనలకు ఆమోదంవాటి ద్వారా 38,722 మందికి ఉపాధి ఈనాడు - అమరావతిఎస్ఐపీబీ సమావేశంలో మాట్లాడుతున్న సీఎం చంద్రబాబు. చిత్రంలో మంత్రులు అచ్చెన్నాయుడు, టీజీ భరత్, సుభాష్, అధికారులుబుల్లెట్ బండి ఇక రాష్ట్రం నుంచే డగ్ డగ్ మంటూ వచ్చేస్తోంది. తిరుపతిలో రూ.2,508 కోట్ల పెట్టుబడితో రాయల్ ఎన్‌ఫీల్డ్ సంస్థ బుల్లెట్ మోటార్‌సైకిళ్ల తయారీ పరిశ్రమను ఏర్పాటు చేయనుంది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి(ఎస్‌ఐపీబీ) బుధవారం అమోదం తెలిపింది. దీంతోపాటు విశాఖపట్నంలో రిలయన్స్ సంస్థ రూ.1,08,010 కోట్ల పెట్టుబడితో డేటాసెంటర్ ఏర్పాటు చేయనుంది. ఇంకా.. శ్రీసత్యసాయి జిల్లాలో రూ.51వేల కోట్లతో సోలార్ పవర్ ప్లాంట్, బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్‌ను ఆ సంస్థ ఏర్పాటు చేయనుంది. కడప జిల్లాలో రూ.12వేల కోట్ల పెట్టుబడితో అదానీ హైడ్రో ఎనర్జీ పంప్డ్ స్టోరేజ్ ప్రాజెక్టును ఏర్పాటు చేయనుంది. పలు సంస్థలకు చెందిన రూ.2,00,964.10 కోట్ల పెట్టుబడుల ప్రతిపాదనలకు రాష్ట్ర పెట్టుబడుల ప్రోత్సాహక మండలి (ఎస్‌ఐపీబీ) బుధవారం ఆమోదం తెలిపింది. వాటి ద్వారా 38,722 మందికి ఉపాధి కల్పించనున్నట్లు సంస్థలు ప్రతిపాదనల్లో పేర్కొన్నాయి. ప్రతి ప్రతిపాదనా.. ఒప్పందంగా మారాలిరాష్ట్రానికి వచ్చిన ప్రతి పెట్టుబడుల ప్రతిపాదనా ఒప్పందంగా మారాలని, ప్రతి ఒప్పందం పెట్టుబడిగా రూపాంతరం చెందాలని అధికారులకు సీఎం చంద్రబాబు సూచించారు. ఎస్‌ఐపీబీ సమావేశంలో మాట్లాడుతూ.. ‘ఒక పెట్టుబడి, పరిశ్రమ రాష్ట్రానికి వచ్చే విషయంలో అనుమతుల నుంచి శంకుస్థాపన, ప్రారంభోత్సవం వరకు నిర్దేశిత గడువులోగా పూర్తవ్వాలి. ప్రభుత్వం నుంచి అనుమతులు ఒక్కరోజూ జాప్యం కాకూడదు. పోటీ ప్రపంచంలో పెట్టుబడులు ఆకర్షించాలంటే ఇతరుల కంటే మనం ప్రత్యేకత చూపాలి. రాష్ట్రంలో అనుమతులు పొందడం ఎంత సులభతరమన్నది చాటిచెప్పాలి. రాష్ట్రానికి ప్రాజెక్టులు రావాలన్న తపన ఉన్న అధికారులను అనుమతులిచ్చే స్థానాల్లో నియమించాలి’ అని సీఎం సూచించారు. ఎంఎస్‌ఎంఈలకు ప్రాధాన్యంపెట్టుబడుల విషయంలో భారీ పరిశ్రమలకు ఎంత ప్రాధాన్యం ఇస్తున్నామో.. ఎంఎస్‌ఎంఈలకూ అంతే ప్రాధాన్యం ఉండాలని సీఎం చంద్రబాబు సూచించారు. ‘ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్త లక్ష్యంలో ఎంఎస్‌ఎంఈలు కీలకపాత్ర పోషిస్తాయి. ఫుడ్ ప్రాసెసింగ్ రంగంలో అవకాశాలను సద్వినియోగం చేసుకుని పెట్టుబడులు గ్రౌండ్ అయ్యేలా చూడాలి. మన రాష్ట్రంలో ఉద్యాన, వాణిజ్యపంటల ఉత్పత్తులకు విలువ జోడింపు జరగాలి. ఆయిల్‌పాం, మామిడి, కొబ్బరి, కోకో సహా పలు పంటలకు ఇలా చేస్తే రైతులకు మేలు జరుగుతుంది’ అని సీఎం పేర్కొన్నారు. సమావేశంలో మంత్రులు టీజీ భరత్, అచ్చెన్నాయుడు, సుభాష్, వర్చువల్ విధానంలో మంత్రి కేశవ్ పాల్గొన్నారు.
Create an account or sign in to comment