Jump to content

TDP office attack CASE


Recommended Posts

Posted

ముందు సిస్టమ్ ని క్లీన్ చెయ్యకుండా ఏం చేసినా ఉపయోగం లేదు. వాడి మనుషుల ద్వారా నిమిషాల్లో ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకుంటున్నాడు

 

IMG_6975.jpeg

  • Replies 200
  • Created
  • Last Reply
Posted
24 minutes ago, rajanani said:

వెంటనే లోపలెయ్యకుండా, రోజుల తరబడి లీకులు ఇచ్చుకుంటా కూర్చుంటే ఇలాగే జరుగుతుంది. ఇవాళ ఆంధ్రజ్యోతి వాడు అందరినీ ఏకిపారేశాడు. ముఖ్యంగా లోకేష్ ని. ఎన్నికల ముందు ఎవరిమీద ఎక్కువ కేసులుంటే వాళ్ళకి ప్రాధాన్యత ఉంటుంది అని చెప్పారు, కానీ ఇప్పుడు అన్యాయంగా పెట్టిన అవే కేసులు చూపించి కొందరికి పోస్టింగ్స్ ఇవ్వట్లేదంట.

 

IMG_6976.jpeg

CBN ni jail lo vesaka investigation start chesaru..bokkalo sajjala ..nani..Vamsi arrest cheyyadaniki kuda antha home work kaavalaa.. 

Posted

Okandhuku mana manchike..initial days lone sleeper cells ni ereyyataniki chance dorikinattu ayyindi..tarvata govt. as per business smooth ga vellataniki chance dorikindhi..

Posted

రఘురామ ఫిర్యాదు.. ఐపీఎస్‌ అధికారి సునీల్‌కుమార్‌పై కేసు

Jul 12,2024 

గుంటూరు: ఐపీఎస్‌ అధికారి పీవీ సునీల్‌ కుమార్‌పై కేసు నమోదైంది. టిడిపి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఫిర్యాదు మేరకు గుంటూరులోని నగరంపాలెం పోలీసులు కేసు నమోదు చేశారు. వైసిపి ప్రభుత్వ హయాంలో సునీల్‌ కుమార్‌ సీఐడీ డీజీగా పనిచేశారు. ఆ సమయంలో తనను కస్టడీకి తీసుకుని కొట్టడమే కాకుండా హత్యాయత్నం చేశారని రఘురామ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ నేపథ్యంలో సునీల్‌ కుమార్‌తోపాటు సీఐడీ మాజీ ఐజీ సునీల్‌ నాయక్‌, మాజీ డీఎస్పీ పాల్‌పైనా కేసు నమోదు చేశారు.

Posted

గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు బిగుస్తోందా? ఏదో… కేసు పెట్టామంటే పెట్టామన్నట్టుగా కాకుండా… రెడ్‌ బుక్‌ రేంజ్‌లో ఆయన్ని బుక్‌ చేసే వ్యూహాలు సిద్ధమవుతున్నాయా? ఆయన ముఖ్య అనుచరుల మీద తాజా కేసులు, కొన్ని అరెస్ట్‌లే అందుకు సంకేతాలా? నియోజకవర్గానికి దూరంగా ఇప్పుడు వంశీ ఏం చేస్తున్నారు? గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ చుట్టూ ఉచ్చు గట్టిగా బిగించటానికి రంగం సిద్ధమవుతోందట. ఓ పద్ధతి ప్రకారం తప్పుల్ని ఎస్టాబ్లిష్‌ చేసే కార్యక్రమం జరుగుతోందని అంటున్నారు. టీడీపీ తరపున రెండు సార్లు గన్నవరం ఎమ్మెల్యేగా గెలిచిన వంశీ… మూడోసారి వైసీపీ బీఫాం మీద పోటీ చేసి ఓడిపోయారు. రెండోసారి…. అంటే 2019లో టీడీపీ బీ ఫామ్‌ మీదే గెలిచి తర్వాత రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన వైసీపీకి జైకొట్టారాయన. ఆ తర్వాత ఐదేళ్ళ పాటు చంద్రబాబు, లోకేష్‌పై తీవ్ర స్థాయి విమర్శలు చేశారు వంశీ. ఒక దశలో అవి శృతిమించి… అవతలి వాళ్ళు భరించలేనంత వ్యక్తిగత వ్యవహారాల దాకా వెళ్ళాయి. నోటికి అదుపు లేకుండా పోయి… మాటలు మరీ దిగజారిన క్రమంలో టీడీపీ హిట్‌ లిస్ట్‌లో చేరారు గన్నవరం మాజీ ఎమ్మెల్యే. దీంతో ఈసారి పార్టీ అధికారంలోకి వచ్చిన వెంటనే…. టీడీపీ క్యాడర్ పెద్ద ఎత్తున విజయవాడలో ఉన్న వంశీ ఇంటికి వెళ్ళి దాడికి ప్రయత్నించారు. తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిందా ఘటన. ఆ తర్వాత నుంచి గన్నవరం నియోజకవర్గానికి దూరమయ్యారట వల్లభనేని. అప్పట్నుంచి లోకల్‌గా ఎక్కడా కనిపించలేదని అంటున్నారు ఆయన సన్నిహితులు సైతం. తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన నెల రోజుల తర్వాత వంశీపై కేసు బుక్‌ చేశారు పోలీసులు. గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి ఘటనలో నిందితుడిగా ఆయన పేరును చేర్చడంతోపాటు…. మరి కొందరు అనుచరుల్ని కూడా బుక్‌ చేశారు.

ఇక తాజాగా ఎమ్మెల్యే యార్లగడ్డ వెంకట్రావు నియోజకవర్గంలో తొలిసారి అధికారులతో కలిసి ప్రజాదర్బార్‌ నిర్వహించారు. అందులో కూడా వంశీ అనుచరులపై భారీగా ఫిర్యాదులు అందాయట. మట్టి తవ్వకాల్లో అక్రమాలు, ఎస్సీల భూముల ఆక్రమణ, నకిలీ పత్రాలతో ఇతరుల భూములు రిజిస్ట్రేన్స్‌ చేయించుకోడం లాంటి రకరకాల ఫిర్యాదులు వచ్చినట్టు తెలిసింది. ఇప్పుడు వాటన్నిటినీ… పరిశీలించి కేసులు నమోదు చేయటానికి అధికారులు సిద్ధమవుతున్నట్టు సమాచారం. ఈ క్రమంలో ఇకపై వంశీతోపాటు ఆయన అనుచరులపై కూడా వరుస కేసులు ఉంటాయన్న చర్చ జరుగుతోంది పొలిటికల్ సర్కిల్స్‌లో. తన ఇంటి మీద దాడి ప్రయత్నం జరిగినప్పటి నుంచి అందుబాటులో లేరు మాజీ ఎమ్మెల్యే. నియోజకవర్గానికి దూరంగా ఉంటూనే… తన అనుచరులపై వరుసగా కేసులు నమోదవటం, కొందరు అరెస్ట్ అవడం లాంటి పరిణామాలను తెలుసుకుంటున్నారట. అలాగే తనకు అత్యంత సన్నిహితంగా ఉండే కొందరితో తరచూ మాట్లాడుతూ… స్థానిక పరిస్థితుల మీద అవగాహనకు వస్తున్నట్టు తెలుస్తోంది. నెల రోజుల్లో తాను తిరిగి గన్నవరం వస్తానని, ఆందోళన చెందవద్దని క్యాడర్‌కు భరోసా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నట్టు చెప్పుకుంటున్నారు. కానీ… ఆ మాటలు వారిలో ధైర్యం నింపలేకపోతున్నట్టు సమాచారం. తమ నాయకుడు ఎంత చెబుతున్నా…వాళ్ళు మాత్రం డీలా పడుతున్నారన్నది లోకల్‌ టాక్‌. ఎప్పుడు ఏ కేసు పెడతారా అన్న ఆందోళన పెరుగుతోందట గన్నవరంలోని వంశీ అనుచరుల్లో. అదే సమయంలో టీడీపీ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తోందని, పక్కా సాక్ష్యాధారాలతో నేరుగా వంశీ చుట్టూనే ఉచ్చు బిగిస్తోందన్న వార్తలు వాళ్ళని ఇంకా కలవరపెడుతున్నాయట. దీంతో రాబోయే రోజుల్లో గన్నవరం రాజకీయం యమ ఘాటుగా మారే అవకాశం గట్టిగానే కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు.

  • 2 weeks later...
Posted

గన్నవరం టీడీపీ కార్యాలయంపై దాడి కేసులో మరో ఐదుగురికి రిమాండ్ ఐదుగురు నిందితులను గన్నవరం కోర్టులో హాజరుపర్చిన పోలీసులు ఐదుగురు నిందితులకు రిమాండ్ విధించిన న్యాయస్థానం నెల్లూరు కేంద్ర కారాగానికి నిందితులను తరలించిన పోలీసులు

Posted

గన్నవరం తెదేపా ఆఫీస్‌పై దాడి కేసు.. నిందితుల రిమాండ్‌ పొడిగింపు

కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది.

Published : 07 Aug 2024 14:18 IST
 
 
 
 
 
 

124145664_070824gannavaram1a.jpg

గన్నవరం: కృష్ణా జిల్లా గన్నవరం తెదేపా కార్యాలయంపై దాడి కేసులో నిందితులకు రిమాండ్‌ను కోర్టు పొడిగించింది. 18 మంది నిందితులను పోలీసులు స్థానిక కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ చేపట్టిన న్యాయస్థానం.. ఈనెల 21వ వరకు రిమాండ్‌ పొడిగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. అనంతరం నిందితులను నూజివీడు, గన్నవరం సబ్‌ జైలుకు తరలించారు.

Posted

AP High Court: పక్కా ప్రణాళికతోనే తెదేపా కార్యాలయంపై దాడి: సుప్రీంకోర్టు న్యాయవాది లూథ్రా

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది.

Published : 08 Aug 2024 19:52 IST
 
 
 
 
 
 

08cort-1a.jpg

అమరావతి: తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయంపై దాడి కేసులో వైకాపా నేతలు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్లపై గురువారం హైకోర్టు విచారణ జరిపింది. తెదేపా తరఫున సుప్రీంకోర్టు సీనియర్‌ న్యాయవాది సిద్దార్థ లూథ్రా వాదనలు వినిపించారు. ఉద్దేశ పూర్వకంగా, పక్కా ప్రణాళికతోనే తెదేపా కార్యాలయంపై దాడికి పాల్పడ్డారని లూథ్రా న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లారు. తదుపరి విచారణను న్యాయస్థానం ఈనెల 14కి వాయిదా వేసింది. తెదేపా కేంద్ర కార్యాలయంపై దాడి చేసిన కేసులో తమకు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయాలని కోరుతూ వైకాపా నేతలు లేళ్ల అప్పిరెడ్డి, తలశిల రఘురాం, దేవినేని అవినాష్‌ తదితరులు ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్లు దాఖలు చేశారు.

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...