sonykongara Posted April 9, 2024 Posted April 9, 2024 DL Ravindrareddy: తెదేపా అభ్యర్థికే నా మద్దతు: మాజీ మంత్రి డీఎల్ తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. Published : 09 Apr 2024 14:51 IST ఖాజీపేట: తెలుగుదేశం, భాజపా, జనసేన కూటమే అధికారంలోకి వస్తుందని మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి అన్నారు. వైయస్‌ఆర్ కడప జిల్లా ఖాజీపేటలోని ఆయన స్వగృహంలో మంగళవారం మీడియాతో మాట్లాడారు. భాజపాతో పొత్తుతో 30 సీట్లలో ప్రభావం చూపుతోందని, జనసేనకు క్యాడర్ లేదన్నారు. తెదేపాకు వ్యతిరేకమైనా స్థానిక రాజకీయాల కారణంగా తెదేపా అభ్యర్థి సుధాకర్‌యాదవ్‌కే మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ అభ్యర్థికి ఓటు వేసే విషయంలో ‘వివేకం’ సినిమా చూసి ఓటు వేయాలని విజ్ఞప్తి చేశారు.
Nfan from 1982 Posted April 28, 2024 Posted April 28, 2024 Full anti undhi Sharmila gattiga dhebba kodutundhi Best occasion for TDP
Rajesh_NBK Posted April 28, 2024 Posted April 28, 2024 Elections oka 2 days mundu chuskovali..doubt unna chota antha local leaders ni konestaru ycp
sonykongara Posted April 28, 2024 Author Posted April 28, 2024 TDP gattiga try chesthe 5 vasthayi anipisthundi
Siddhugwotham Posted April 28, 2024 Posted April 28, 2024 *కడప అసెంబ్లీ రివ్యూ : రాష్ట్రం మొత్తం వైసీపీకి ఎదురుగాలి వీస్తోందని అందరూ చెప్పుకుంటున్నారు. వైసీపీ నేతలు కూడా ఒప్పుకుంటున్నారు. కానీ కడప జిల్లాలో మాత్రం వైసీపీదే అధిపత్యం అన్న నమ్మకంతో ఉన్నారు. జిల్లా మొత్తం పక్కన పెడితే కడప అసెంబ్లీ సెగ్మెంట్ లో వైసీపీ ఓడిపోవడం ఖాయమని వీధివీధినా చెప్పుకుంటున్నారు. మౌత్ టాక్ దెబ్బకు డిప్యూటీ సీఎం అంజాద్ బాషా వైపు అందరూ జాలిగా చూసే పరిస్థితి ఉంది. కడప నుంచి వరుసగా రెండు సార్లు గెలిచిన డిప్యూటీ సీఎం అంజాద్ బాషాపై వైసీపీలోనే కాదు ప్రజల్లోనూ తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది. వైఎస్ ఫ్యామిలీపై అభిమానంతో పార్టీ విజయానికి సహకరించిన కడప కార్పొరేటర్లు.. డిప్యూటీపై తీవ్ర అసంతృప్తితో పార్టీలు మారిపోయారు. ఇటీవలి కాలంలో పెద్ద ఎత్తున వైసీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరారు. కడప అసెంబ్లీ నియోజకవర్గం వైఎస్ హయాం నుంచి కాంగ్రెస్, వైసీపీ కంచుకోటగానే ఉంది. కానీ అంతకు ముందు టీడీపీ హవా ఉంది. మూడు సార్లు విజయం సొంతం చేసుకున్నప్పటికీ 2004 ఎన్నికల నాటి నుంచి సీన్ పూర్తిగా మారిపోయింది. నాలుగు సార్లు వరుసగా వైఎస్ ఫ్యామిలీ ఎవర్ని నిలబడితె వారు గెలిచారు. 2004, 2009 ఎన్నికల్లో వైఎస్ అండదండలతో అహ్మదుల్లా వరుసగా రెండు సార్లు గెలిచి.. మంత్రిగా కూడా పనిచేశారు. ఆయన కాంగ్రెస్‌లోనే ఉండిపోయారు. 2014లో కార్పొరేటర్‌గా ఉన్న అంజాద్ బాషాకు జగన్ చాన్సిచ్చారు 2019 ఎన్నికల్లో రెండోసారి గెలిచి ప్రస్తుతం డిప్యూటీ సీఎం అయ్యారు. పేరుకే ఆయన మంత్రి కానీ ఎప్పుడైనా అధికార విధుల్లో కనిపించింది లేదు. కానీ నియోజకవర్గంలో చేసిన అరాచకాలకు మాత్రం అంతు లేకుండా పోయిందన్న ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. రెడ్డప్పగారి శ్రీనివాసులురెడ్డి భార్య రెడ్డెప్పగారి మాధవీరెడ్డికి టీడీపీ ఇంచార్జ్ బాధ్యతలు ఇచ్చిన తర్వాత రాజకీయం పూర్తిగా మారిపోయింది. ఆమె బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి ప్రజల్లోకి చొచ్చుకెళ్లిపోయారు. ముఖ్యంగా మైనార్టీ వర్గాల మహిళ్లో ఆమె ప్రత్యేకమైన అభిమానం సంపాదించుకున్నారు. ప్రజలను ఆకట్టుకోవడంలో సక్సెస్ అవుతున్నారు. అంజాద్ బాషా నిర్వాకాలపై ప్రజల్లో ఉన్న అసంతృప్తిని బయటకు వచ్చేలా చేసి.. తాను గెలుస్తున్నానన్న ఓ అభిప్రాయాన్ని ప్రజల్లో కల్పించగలిగారు. కడప మున్సిపల్ కార్పొరేషన్‌లలో వైసీపీకి ప్రధాన బలంగా ఉన్న కార్పొరేటర్లు డిప్యూటీ సీఎంపై తీవ్ర అసంతృప్తితో కనిపిస్తున్నారు. తమ డివిజన్లలో అభివృద్ధి పనులకు నిధులు రాక ఎవరిని అడగాలో అర్ధం కాక ఎమ్మెల్యే కూడా పట్టించుకోక పోతుండటంతో వారిలో అసంతృప్తి పెరిగిపోయింది. బలమైన నాయకత్వం ఉంటే వైసీపీకి ఎంత బలమైన సీటులో అయినా టీడీపీ గెలిచే పరిస్థితికి వస్తుందని రెడ్డప్పగారి మాధవి నిరూపిస్తున్నారు. కడపలో ఆమె ప్రచార స్టైల్ చూసిన వారు.. ఖచ్చితంగా ఆమెకు ఓటు వేయాలని అనుకుంటారని టీడీపీ నేతలే ప్రశంసిస్తున్నారు. తన అభిప్రాయాలను బలంగా వినిపించడం బాధితుల పక్షాన ఉండటం.. ప్రతీ విషయంపైనా స్పష్టత ఉండటంతో రెడ్డప్పగారి మాధవి కడప రాజకీయాల్లో సంచలనం సృష్టిస్తారని గట్టి నమ్మకం ఏర్పడింది
narens Posted April 28, 2024 Posted April 28, 2024 6 hours ago, sonykongara said: Eenadu first review na idi! Edaina other districts chesaara before??
Mobile GOM Posted April 28, 2024 Posted April 28, 2024 17 minutes ago, narens said: Eenadu first review na idi! Edaina other districts chesaara before?? Ippude modalu pettaru reviews raayatamu mari
Siddhugwotham Posted May 1, 2024 Posted May 1, 2024 *ప్రొద్దుటూరు రివ్యూ : పెద్దాయన వరదరాజుల రెడ్డికి అడ్వాంటేజ్!* ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీకి ఈ సారి గతంలో ఉన్నంత సానుకూల పరిస్థితి కనిపిండం లేదు. కనీసం నాలుగు నియోజకవర్గాల్లో టీడీపీ అభ్యర్థులు ముందున్నారన్న విశ్లేషణలు బలంగా ఉన్నాయి. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల ప్రకారం చూస్తే.. ప్రొద్దుటూరులో టీడీపీ అభ్యర్థి వరదలరాజుల రెడ్డి గెలుపు మౌత్ టాక్ సాధించారు. ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాదరెడ్డి అక్రమాలు అరాచకాలు ఆయన బావమరిది బంగారురెడ్డి నిర్వాకాలతో వ్యాపారులు, ప్రజలు విసుగెత్తిపోయారు. ఇలాంటి సమయంలో సీనియర్ నేత వరదరాజులరెడ్డి బరిలోకి దిగారు. ఆయనంటే ప్రజల్లో గౌరవం ఉంది. చివరి సారి ఎన్నికల్లో పోటీ చేస్తున్నానని ఆయన చెబుతున్నారు. ప్రొద్దుటూరు బరిలో సిట్టింగ్ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి, టీడీపీ తరపున కురువృద్ధుడైన మాజీ ఎమ్మెల్యే ఎన్.వరదరాజులరెడ్డి ముఖాముఖి తలపడుతున్నారు. ఒకప్పుడు వరదరాజులరెడ్డి అనుచరుడు రామచల్లు. ప్రొద్దుటూరులో వరదరాజులరెడ్డికి భారీ బలగం ఉంది. ఆయన ఐదు సార్లు ఎమ్మెల్యే గెలిచారు. అవినీతి ఆరోపణలు, దౌర్జన్యాలు వంటి రికార్డు లేదు. పెద్దాయనగా గౌరవం పొందుతున్నారు. చివరి ఎన్నిక సెంటిమెంట్ తోనూ పాత ఆప్తులందర్నీ దగ్గరకు తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 2.20 లక్షలు ఓటర్లు ఉన్నారు. ప్రొద్దుటూరు అర్బన్, రాజుపాలెం మండలాలు ఉన్నాయి. ప్రొద్దుటూరులో పెద్దసంఖ్యలో అర్బన్ ఓటర్లు ఉన్నారు. రాజుపాలెం మండలం సహజంగా టీడీపీ ఆధిక్యత కలిగిన ప్రాంతం , అర్బన్‌లో రాచమల్లు అరాచకాలతో వైశ్య వర్గం విసిగిపోయింది. ఈ కారణంగా వైశ్య సామాజికవర్గంలో సానుకూలత ఉండడం టీడీపీకి అడ్వాంటేజ్ గా మారింది. రాచమల్లు ప్రసాదరెడ్డిపథకాలపైనే ఎక్కువ ఆశలు పెట్టుకున్నారు. లబ్దిదారులు ఓటేస్తారని అనుకుంటున్నారు. రాచమల్లు శివప్రసాద్‌రెడ్డికి వైసీపీ నేతలతో సరిపడటం లేదు. మేజర్ పంచాయతీల సర్పంచ్‌లతో ఎమ్మెల్యే సున్నం పెట్టుకున్నారు. ఫలితంగా కొంత మంది టీడీపీలో చేరిపోయారు. చంద్రబాబు ప్రొద్దుటూరు పర్యటన సందర్బంగా పలువురు నేతలు టీడీపీలో చేరారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలో మైనార్టీ ఓటర్లు గణనీయ సంఖ్యలో ఉన్నారు. వీరిలో ముస్లిములు, క్రిస్టియన్లు ఉన్నారు. మైనార్టీ ఓట్లు గత ఎన్నికల్లో వైసీపీకి పడ్డాయి. ఈ సారి కాంగ్రెస్ వైపు ఎక్కువ వెళ్తాయన్న ప్రచారం జరుగుతోంది. అదే జరిగితే వైసీపీ తీవ్రంగా నష్టపోయే అవకాశం ఉంది
sonykongara Posted May 2, 2024 Author Posted May 2, 2024 kadapa roadshow kuda guntur style lone unnadi
Telugunadu Posted May 2, 2024 Posted May 2, 2024 On 4/28/2024 at 2:12 AM, sonykongara said: TDP gattiga try chesthe 5 vasthayi anipisthundi Kadapa lo 5 vaste, alliance ki 140+ and TDP alone 120+ vastaayi.
Recommended Posts
Archived
This topic is now archived and is closed to further replies.