Jump to content

కొలికపూడి శ్రీనివాస్ పై విష ప్రయోగం...


krish2015

Recommended Posts

అందరికీ నమస్కారం🙏
గత రాత్రి 7 గంటల నుండి 9 గంటల వరకు ఏబీఎన్ డిబేట్లో ఉన్నాను.
డిబేట్ తర్వాతఏబీఎన్ స్టూడియోలో పార్కింగ్ లోసోదరుడు జీవి రెడ్డితో కాసేపు లోకేష్ గారి పాదయాత్ర గురించి మాట్లాడుకున్నాం.ఆ సమయంలో ఇద్దరు యువకులు వచ్చి మాతో ఫోటో దిగారు.రాజమండ్రి నుంచి వచ్చామని చెప్పారు.ఆ తర్వాత నేను బయలుదేరి బయటకు వచ్చి దాదాపు 100 మీటర్లు ముందుకు వచ్చాక ఒక వ్యక్తి నా కారు ఆపి నేను మునిరత్నం, మీ అభిమానిని అని పరిచయం చేసుకుని ప్రసాదం అని పులిహోర పెట్టాడు, నేను కొద్దిగా తీసుకొని తిని,అక్కడ ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల హడావుడిగా నా ఫోన్ నెంబర్ ఇచ్చి ఇంటికి వచ్చాను.ఇంట్లో కోడిగుడ్డు టమాటా కూరతో అన్నం తిని,రెండేళ్లుగా నన్ను క్రమశిక్షణతో నడిపిస్తున్న షుగర్ టాబ్లెట్ వేసుకున్నాను. దాని ఎక్స్పైరీ డేట్2024 వరకు ఉంది.
టాబ్లెట్ వేసుకున్న రెండు మూడు నిమిషాల తర్వాత ఒళ్లంతా జిల,దద్దుర్లు,గొంతు తడారిపోయింది,మంచినీళ్లుగొంతు దిగలేదు, విపరీతమైన గొంతు నొప్పి.
వెంటనే నా రూమ్ లో నుంచి హాల్లోకి పరిగెత్తాను,అప్పటికే నా ముఖం నిండా దద్దులు చూసి ,ఏమైందే నీ నా భార్య కంగారుగా అరవడం మొదలు పెట్టింది.
శరీరమంతా నా కంట్రోల్ తప్పుతుంది,మెల్లగా తలుపు తీసుకొని మా ఎదురు ప్లాట్ లోకనాథ్ రెడ్డి తలుపులు కొట్టాను.
లోకనాథ్ రెడ్డి లేడు,అతని భార్య, ఆమె చెల్లి వెంటనే పరిస్థితి అర్థం చేసుకొని,అప్పటికే నడవలేకపోతున్నాను నన్ను 12 ఫ్లోర్ లో నుండి పార్కింగ్ ప్లేస్ లోకి తీసుకొచ్చి,వాళ్ల కారులో నన్ను వెనక సీట్లో పడుకోబెట్టి
ముందు సీట్లో నా భార్యను కూర్చోబెట్టుకొని మా ఇంటి పక్కనే ఉన్న సిటిజన్ హాస్పిటల్ ఎమర్జెన్సీ వార్డులో చేర్చారు
అక్కడ రెండు గంటల ట్రీట్మెంట్ తర్వాత నేను సాధారణ పరిస్థితికి వచ్చాను.
రెండు మూడు గంటల తర్వాత అందరికీ టచ్ లోకి వస్తాను.
🙏🙏🙏
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...