Jump to content

*****యువగళం: లోకేష్ పాదయాత్ర*****


chanu@ntrfan

Recommended Posts

యువగళం @ కడప జిల్లా 

లోకేష్ పాదయాత్రకి టిడిపి శ్రేణులు కూడా ఊహించని రీతిలో సిఎం జగన్ సొంత జిల్లా లో జమ్మలమడుగు ప్రొద్దుటూరు మైదుకూరు కమలాపురం లో భారీ జన నీరాజనం.‌ 

కృష్ణ గుంటూరు లో కమ్మలు ఉభయగోదావరి జిల్లాల్లో కాపులు తరహాలో సీమలో కడప కర్నూలు నెల్లూరు జిల్లాలలో రెడ్ల నాయకత్వం వారిదే ఆధిపత్యం. గత ఎన్నికల్లో మూకుమ్మడిగా జగన్ మోహన్ రెడ్డి కి మద్దతు ఇవ్వడం వలన కడప కర్నూలు నెల్లూరు జిల్లాలు క్లీన్ స్వీప్. అయితే జగన్ నుంచి రెడ్లు ఆశించిన ఫలితం నెరవేరిందా అంటే లేదు అనే చెప్పాలి. 

సీమలో వ్యవసాయం చేసే వారిలో రెడ్లు అధికం. కేవలం రైతు భరోసా తప్ప ఇతర ప్రయోజనాలు రైతులకు నెరవేరలేదు. సాగు నీరు తక్కువ అవసరం అయ్యే రీతిలో సూక్ష్మ సేంద్రియ సేద్యంకి ప్రోత్సాహం ఇచ్చారు బాబు. జగన్ వచ్చాక మూడేళ్ల పాటు ఆ సబ్సిడీలు లేవు.‌ సీమ జిల్లాల్లో జలప్రాజెక్టుల నిర్మాణం ఆర్భాటమే తప్ప ఆచరణ లేదు. అందరి రైతులతో పాటు రెడ్డి రైతులకు పెట్టుబడి పెరిగింది ఆదాయం తగ్గింది. కన్నీరు మిగిల్చింది.‌

వైఎస్ హయాంలో సీమలో ఇబ్బడిముబ్బడిగా పెరిగిన ఇంజనీరింగ్ కాలేజీల యజమానులు అధికశాతం రెడ్లు. జగన్ విద్యాదీవెన విధానం తో వీరు నష్టాలపాలు. వారితో పాటు సిబ్బంది కష్టాలపాలు.‌

వైఎస్ హయాంలో నిర్మాణ రంగం ఊపందుకోవడం రెడ్డి సామాజిక వర్గం గుత్తేదారులు బాగా సంపాదించుకోవడం వారితో పాటు ఇంకో పదిమందికి ఉపాధి కల్పించడం నిజం. జగన్ వలన అంతకుమించి లబ్ది ఉంటుంది అని మద్దతు ఇచ్చారు. తీరా గెలిచాక కొత్త పనులు లేకపోగా పాత పనులు చేసిన కాంట్రాక్టర్లకు బిల్లు చెల్లింపులు సరైన సమయంలో లేవు. వడ్డీలు అదనం. 

వైఎస్ హయాంలో రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంది.‌ ఇపుడు అంతకు మించి అనుకుంటే అసలుకే ఎసరు. 

ఇసుక ధర ఆకాశంలో ఉండటం వల్ల నిర్మాణ రంగం సంబంధించిన బేల్దారి రెడ్డి పెయింటర్ రెడ్డి కూలి రెడ్డి ఇలా అందరికీ చేతినిండా పని లేదు. ఇలా ఒక్కో రంగంలో రెడ్లు జగన్ హయాం లో ఆర్థికంగా నష్టపోయారు. బాధితులుగా మిగిలిపోయారు. 

తమ బాధ లోకేష్ తో వెలిబుచ్చారు. సీమలో రెడ్ల సహకారం లేకపోతే రెడ్డి రాజ్యంలో కమ్మ లోకేష్ కి ఇంత బ్రహ్మరథం సాద్యం అయ్యేది కాదు. కమ్మ కులాన్ని బూచిగా చూపి గత ఎన్నికల్లో జగన్ రాజకీయం చేస్తే ఈ ఎన్నికల్లో బాధితులైన రెడ్లను అక్కున చేర్చుకుని లోకేష్ మనసులు దోచుకుంటున్నాడు.

సీమలో ప్రధానంగా టిడిపికి నాయకత్వ సమస్య. అండగా నిలబడే నాయకులు తక్కువ. బాధితులను ఓటర్లుగా మార్చుకోగరిగితే కడప సహా నెల్లూరు కర్నూలు జిల్లాలో కొన్ని సీట్లు అయినా దక్కే అవకాశం ఉంది.
 

fb post 

Link to comment
Share on other sites

కుప్పంలో ఒక్కడిగా మొదలై కోట్లాది మందికి చేరువై సాగిపోతున్న Nara Lokesh  గారి Yuvagalam  పాదయాత్ర 5 కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా కడప శివారు అలంఖాన్ పల్లె వద్ద 1500 కి.మీ. మైలురాయిని చేసుకున్న సందర్భంగా నారా లోకేశ్ గారికి శుభాభినందనలు.

జగన్మోహన్ రెడ్డి కంచుకోటగా చెప్పుకునే కడపలో దారిపొడవునా వివిధ వర్గాల ప్రజలు జన సముద్రాన్ని తలపించేలా  ఆత్మీయ నీరాజనాలతో లోకేష్ గారికి స్వాగతం పలుకుతున్నారు...

ప్రతీ చోటా ప్రజలకు భరోసా కల్పిస్తూ, అడుగడుగునా అన్ని వర్గాల వారినీ కలుస్తూ వారి కష్టాలను అడిగి తెలుసుకుంటూ వాళ్ళ మద్దతు కూడగట్టుకుంటున్నారు.. సాయం కోసం వచ్చిన వారిని నిరాశపరచకుండా అప్పటికప్పుడు సాయం చేస్తూ ముందుకు సాగిపోతున్నారు..

రాయలసీమ సమగ్ర అభివృద్ది కోసం యువత ఆలోచనలు, అభిప్రాయాలను, మీ మనోభావాలను నేరుగా వాట్సాప్ నెంబర్లో
తనకు తెలియజేయాలని చెప్పి యువహృదయ నేతగా నిలిచారు.

యువత, మహిళలు, రైతులు, వ్యాపారులు, ఉద్యోగులు, కార్మికులు, విద్యార్థులు, వివిధ సామాజికవర్గాల ప్రతినిధులతో ముఖాముఖి సమావేశాలు ఏర్పాటు చేస్తూ.. అధికారంలోకి వస్తే ఆయా వర్గాలకు తాము ఏం చేస్తామనేది స్పష్టం చేస్తూ ముందుకెళుతున్నారు....
కాళ్లకు బొబ్బలు వచ్చినా వాటిని సైతం లెక్కచేయకుండా ముందుకు సాగిపోతూ 1500 కిలోమీటర్లు పూర్తి చేసుకున్నారు

వైసీపీ ప్రభుత్వ పాలనలో అతలాకుతలమైన రాష్ట్రాన్ని మళ్ళీ దేశంలో అగ్రగామిగా.. సస్యశ్యామలంగా రాష్ట్రానికి పూర్వవైభవాన్ని తేవాలన్న లక్ష్యం తో ప్రారంభమైనా ఈ యువగళం ఇప్పుడు 5 కోట్ల మంది "జనగళంగా" మారింది.
రాష్ట్ర ప్రజలందరి ఆశ, ఆకాంక్షలతో మీరు ముందుకు సాగిపోవాలని.. మీ 4000 కిలో మీటర్ల గమ్యం దిగ్విజయంగా పూర్తిచేయాలని మనసారా కోరుకుంటున్నాను..
#yuvagalam #yuvagalampadayatra #naralokesh #NaraLokeshForPeople
Ganta Srinivasa Rao fb post 

Link to comment
Share on other sites

Create an account or sign in to comment

You need to be a member in order to leave a comment

Create an account

Sign up for a new account in our community. It's easy!

Register a new account

Sign in

Already have an account? Sign in here.

Sign In Now
  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...