Jump to content

సీమ మోసగాళ్ళు


RamaSiddhu J

Recommended Posts

 

మొన్న మా పురుషోత్తం రెడ్డి గారి మీటింగ్ ప్లాప్ అయ్యాక, మా వాళ్ళకి ఆవేశం పెరిగిపోయింది. ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు, ఎన్నాళ్ళని ఇలా ఉంటాం, రాజధాని తెచ్చుకుందాం, లేదంటే విడిపోదాం అని మొదలుపెట్టారు. కొంతమంది అడుగు ముందుకు వేసి, ప్రకాశం నెల్లూరుతో కూడిన సీమ ఏర్పాటు చేయాలని కూడా ఆవేశంగా అరిచేశారు. ఏ నినాదం వెనుక ఎవరి స్వార్థం ఉందొ తెలుసుకోవాలి కదా.

 

ఒక్కొక్కటిగా అన్నీ మాట్లాడుకుందాం విడిపోవడం, నీటి లెక్కలు, సీమ పౌరుషం, సీమకి చేసిన అభివృద్ధి ఇలా అన్నీ మాట్లాడుకుందాం. ఇదేమీ ఐదు రూపాయల కోసం ఐడ్రీమ్ కోసం రాస్తుంది కాదు కదా! నీది, నాది, మన ముందు తరాల కోసం ఆలోచించి చేయాల్సిన పని గురించే కదా. మన తాన లెక్కుంటే కానీ, మనల్ని లెక్క చేయని లోకం ఉంటున్నాం కాబట్టి అన్నిటినీ లెక్కేసుకునే మాట్లాడుకుందాం.

 

విడిపోవడం అంటే ఏదో చిన్న పిల్లల ఆట అయింది మన వాళ్ళకి. ఇంకొక ప్రొఫెసర్ గారైతే ఏకంగా ఉత్తరాంధ్ర, సీమతో కలిసి ప్రత్యేక రాష్ట్రం కావాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర విభజన అడుగుతున్నారు సరే, మన 4 జిల్లాలతో కూడిన రాష్ట్రంతో ఎం చేద్దాం అంటారు? పోనీ, ప్రకాశం నెల్లూరు కలుపుకుందాం అనుకుంటే వాళ్ళు ఒప్పుకుంటారా? ఒప్పుకోవాలంటే వాళ్ళు కూడా, ఆ 2 జిల్లాల్లో ఎదో ఒక జిల్లాలో రాజధాని అడిగితే? రాజధాని వాళ్ళకి ఇవ్వడానికి మనం రేడినా? విడిపోతే మన నీళ్ళు మనం వాడుకోవచ్చు అనే పిచ్చి భ్రమలు తెస్తున్నారు. 2050 వరకూ నీటి కేటాయింపులు జరగవు. అప్పుడు కూడా మనమేమి శ్రీశైలంలో మొత్తం ఆపేసి, తొడుకుంటాం అంటే సాగర్ మీద ఆధారపడి ఉన్న తెలంగాణ ఒప్పుకోదు. వాళ్ళకి శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచీ నీళ్ళు కావాలి, అలానే సాగర్ నుంచీ వాళ్ళకి నల్గొండ హైదరాబాద్ కి నీళ్లు కావాలి. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ నీళ్లు కిందకి పోవాల్సిందే.

సీమ గురించి టీడీపీ తరపున ఎవరైనా మాట్లాడిన ప్రతీసారి, సమాధానం చెప్పలేక ఐ డ్రీమ్ బ్యాచ్ తెచ్చే మొదటి వాదన శ్రీశైలం డెడ్ స్టోరేజ్ జీవో. ఆ రోజు ఎటువంటి పరిస్థితుల్లో ఆ జీవో ఇచ్చారో అందరికీ తెలుసు, బచావత్ ట్రిబ్యునల్ ఎప్పుడో ఇచ్చిన అవార్డ్ ప్రకారంగా ఇచ్చిన జీఓ అది. అసలు బచావత్ ట్రిబ్యునల్ విచారణ చేసే టైమ్లో శ్రీశైలం సాగునీటి ప్రాజెక్ట్ గా కాకుండా కేవలం జలవిద్యుత్ కోసం పేర్కొనబడింది. అప్పటికి టీడీపీ పార్టీ కూడా లేదు, పరిపాలన సీమ వాళ్ళ చేతుల్లోనే ఉంది. అప్పుడు అలా ఎలా పెడతారు సీమకి నీరు ఇచ్చేది శ్రీశైలం అని ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే టీడీపీ ఉంటేనే మన వాళ్ళకి నోర్లు లేస్తాయి. సీమకి నీటిని వాడుకుంటూనే, సాగర్ ఆయకట్టు(నల్గొండ, ప్రకాశం జిల్లాలకి తాగునీరు కూడా), కృష్ణా డెల్టా కోసం ఆ రోజున ఆ జీవో ఇచ్చింది. అసలు ఆల్మట్టి ఎత్తు పెంచుతూ, కర్ణాటక ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి అన్యాయం చేస్తుంటే అప్పటికే సీమ నేత సీఎం సీటు కోసం ప్రయత్నాలు చేస్తున్న మహానేత ఎం చేశాడు పార్లమెంట్ లో ఉండి? ఆల్మట్టి ఎత్తు మీద తీర్మానం పెట్టి, పెంచకూడదు అని పార్లమెంట్ లో మాట్లాడింది ఎర్రంనాయుడు. సీఎంల కమిటీ ఏర్పాటు అయ్యేలా చేసి, దాని ద్వారా ఎత్తు పెంచకూడదు అని చెప్పించింది చంద్రబాబు. ఈ మొత్తం మ్యటర్లో మహా మేత ఎక్కడ నిద్రపోతున్నాడు. 

 

మరి నికర జలాల ఆధారంగా ప్రాజెక్టులు ప్లాన్ చేసి, మోబిలైజేషన్ అడ్వాన్సులు ఇచ్చి, తన వాళ్ళకి కాంట్రాక్టుల కోసం కేవలం మట్టిపనులు చేపించి, బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఎదురుగా మా రాష్ట్రానికి నికర జలాలు అవసరమే లేదని చెప్పి, ఉమ్మడి రాష్ట్రం మొత్తానికి బొక్క పెట్టినాయన్ని ఎం అనాలి? ట్రిబ్యునల్ ఎదుట వాదించడానికి కూడా తన సొంత కులం, తన వర్గం మనిషిని పెట్టుకుని, పేలవమైన వాదన కారణంగా 40 ఏళ్ళ పాటు రాష్ట్రానికి పొడిచిన వెన్నుపోటుని మన సీమలో ఎం అంటారో ఆ ఐ డ్రీమ్ మేధావులే చెప్పాలి.

  మరి ఎవడూ కూడా 790 అడుగుల వరకు తొడుకోడానికి వీలుగా బాబు ముచ్చుమర్రి ప్లాన్ చేసాడు అని చెప్పడు. తెలుగుగంగ ఎన్టీఆర్ ఇచ్చాడు అని చెప్పడు.

 

సీమ పౌరుషం గురించి మాట్లాడుతూ వాళ్ళకీ, వీళ్ళకి లొంగి బతికేది ఏంటి అంటూ ఉంటారు. ఒకసారి గత 3 ఏళ్లుగా చూసుకుంటే, పోతిరెడ్డిపాడు కంటే కూడా ముందు కల్వకుర్తి ఎత్తిపోతల నుంచి పంపింగ్ మొదలు అవుతుంది. శ్రీశైలం గేట్లు ఏత్తలంటే తెలంగాణ మంత్రి కూడా ఉండాలి(కానీ సాగర్ గేట్లు అలా కాదు వాళ్ళ ఇష్టం), మన డబ్బులతో కట్టే ప్రాజెక్ట్ ఎటు నుంచీ ఎటు తీసుకుని పోవాలనేది ఆయన చెప్తాడు. ఈ మొత్తంలో ఎక్కడుందబ్బా సీమ పౌరుషం! శ్రీశైలం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ అండర్లో ఉండేది, దాని గేటే ఎత్తుతామో, దబరా గిన్నె మాదిరి పైనుంచి పోస్తామో మన ఇష్టం, దానికి వాళ్ళు గెస్ట్ గా వచ్చేది ఏంది? నువ్వు మా కంటే గొప్పోడివి రా సామి మనమే చెప్తున్నట్లు ఉంది కదా. 

పోయిన 5 ఏళ్ళలో ఏ రోజు అయినా ముచ్చుమర్రి, మాల్యాల పంపింగ్ స్టేషన్ల మీద తెలంగాణ ఏమైనా అభ్యంతరం చెప్పిందా? వాళ్ళు చెప్పింది కేవలం పట్టిసీమ నుంచీ వచ్చే 80 టీఎంసీలలో 45 టీఎంసీలు వాళ్ళకి ఇవ్వాలని. అది వాళ్ళ గొడవ(అంటే కృష్ణా గుంటూరు వాళ్ళకి). అంతే కానీ ఏ రోజు కూడా ఎవరూ ముచ్చుమర్రి మాల్యాల గురించి గట్టిగా మాట్లాడింది లేదు. మరి ఇప్పుడు అవి కూడా KRMBకి కట్టబెట్టాం కదా.

సీమకి చేసిన అభివృద్ధి గురించి మాట్లాడుకుందాం. ఈ ప్రభుత్వంలో మూడింట ఒక వంతు సీట్లు మనమే ఇచ్చాం. అంటే మనకి పెట్టుబడులు, కంపెనీలు కూడా ఎక్కువే రావాలని కోరుకుంటాం కదా. మరి ఇప్పుడు అలానే జరుగుతుందా? ఎంత సేపూ ఎక్జిక్యూటివ్ రాజధానిని వైజాగ్ తీసుకుని పోయే యావే తప్ప ఇక్కడ వాటి గురించి ఎవరైనా మాట్లాడతారా? చెప్పాలంటే పోయిన ప్రభుత్వం ఉన్న 5 ఏళ్ళ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడుల్లో 45% సీమలోనే పెట్టడం జరిగింది. కీయాతో కూడా కలుపుకుని 30వేల కోట్ల రూపాయల భారీ పెట్టుబడులు సీమలో పెట్టడం జరిగింది. పోనీ మన దగ్గర అన్నీ వనరులు ఉన్నాయనే మన దగ్గరికి వచ్చారు అనుకోవాలి అంటే 2019-20 లో కర్నూల్, కడపకి వచ్చిన ఇన్వెస్ట్మెంట్లు 0, 20-21 లో కర్నూల్, కడప, అనంతపురం కి వచ్చింది 0. ఇవన్నీ ప్రభుత్వం ఇచ్చిన లెక్కలే ఎకనామిక్ సర్వేలో. ఇప్పుడు సీమ మేధావులే చెప్పాలి ఎవరు సీమని అభివృద్ధి చేశారు, ఎవరు చేయలేదు అనేది.

మొన్న సభలో నీటిపారుదల శాఖ మంత్రి 2 ఏళ్ళ కాలంలో ఎంత ఖర్చు పెట్టారో చెప్పారు అందరం చూశాం కదా. గత ప్రభుత్వంలో గాలేరు నగరి, హంద్రీనీవా కోసం దాదాపుగా 15వేల కోట్లు ఖర్చు పెట్టారు. వాళ్ళు పట్టిసీమ అని పబ్లిసిటీ చేసుకున్నారు కానీ,హంద్రీనీవా 

గురించి చెప్పుకోలేదు. పంపింగ్ మొదలయిన సమయానికి ప్రపంచ రికార్డు సొంతం చేసుకుంది హంద్రీనీవా. దానిలో భాగంగానే ముచ్చుమర్రి, మళ్ళీ ఎక్కడ కేసి కెనాల్ కి నీళ్లు తగ్గుతాయో అని మాల్యాల ఇలా సీమ రైతుల కోసం పని చేసిన వాళ్ళకి మనం ఇచ్చింది 3 సీట్లు.

 

ఇప్పుడు జ్యుడిషియల్ అకాడమీ కాజా దగ్గర పెడుతున్నారు అంట మొన్నటి దాకా కర్నూలు అని ఎగిరారు. ఇప్పుడు అదేంటి అని ఎవడూ అడగడు. నిజానికి సీమ కోసం పని చేస్తూ, సీమ ప్రజలకి మంచి చేస్తున్న టీడీపీని ఓడిస్తూ సీమకి అన్యాయం చేస్తుంది సీమ ప్రజలే. మన చేత్తో మన కళ్ళే పొడుచుకుంటున్నాం.

 

Sumanth Tummala

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...