Jump to content

adithya369

Recommended Posts

*పత్తికొండలో టిడిపి అధినేత నారా చంద్రబాబు నాయుడు రోడ్ షో:-*
• పత్తికొండ రోడ్ షోలో పోటెత్తిన ప్రజలు
• కర్నూలు జిల్లాలో అడుగడుగునా ఘన స్వాగతం పలికిన ప్రజలకు ధన్యవాదాలు.
• అనేక సార్లు జిల్లా పర్యటనకు వచ్చినా....ఎన్నడూ చూడని స్థాయిలో జనం తరలివచ్చారు.
• తెలుగు ఆడబిడ్డల ఆత్మస్థైర్యం పెంచాలని నాడు డ్వాక్రా సంఘాలు తెచ్చాను.
• మొన్న వైజాగ్ వచ్చిన ప్రధాని మోదీ సైతం డ్వాక్రా సంఘాలను కొనియాడారు.
• తెలుగు మహిళలంటే నా తోబుట్టువులు. ఆడపిల్లలకు కాలేజీల్లో 33 శాతం రిజర్వేషన్లు పెట్టాను.
• రాష్ట్రం విడిపోయిన సమయంలో నన్ను గెలిపిస్తే...రాత్రింబవళ్లు పనిచేశాను.
• 2029లో ఎపి దేశంలో నెంబర్ వన్ రాష్ట్రంగా ఉండాలి అని ప్రయత్నించాను.
• అయితే జగన్ కు ఇచ్చిన ఒక్కచాన్స్ తో అంతా రివర్స్ లో పోతుంది.
• మీలో చైతన్యం తేవడానికి ఇక్కడికి వచ్చాను. జగన్ ఇచ్చేది గోరంత....దోచేది కొండంత
• అన్ని ధరలు పెరిగాయి...ప్రజలపై పన్నులు పెరిగాయి. నెలకు ఒక్కొ కుటుంబంపై లక్షభారం మోపుతున్నాడు ఈ ముఖ్యమంత్రి
• యువతకు ఒక్క ఉద్యోగం వచ్చిందా.
• టిడిపి హయాంలో 16 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. 30 లక్షల ఉద్యోగాలు వచ్చేవి. అప్పటికే 6 లక్షల ఉద్యోగాలు వచ్చాయి.
• కర్నూలులో ఎయిర్ పోర్ట్ తెచ్చాను....జిల్లాలో సీడ్ పార్క్ తెచ్చాను.
• అనంతపురంలో కియా మోటార్స్ సహా సీమలో అనేక పరిశ్రమలు తెచ్చాను
• టిడిపి అధికారంలో ఉండి ఉంటే కడపలో స్టీల్ ప్లాంట్ కూడా వచ్చేది
• కడపలో స్టీల్ ప్లాంట్ కట్టలేని సిఎం మూడు రాజధానులు కడతారా
• నేను ఈ రోజు మీటింగ్ పెట్టుకుంటే దాన్ని చెడగొట్టే ప్రయత్నం చేశారు.
• పత్తి కొండ ఎమ్మెల్యే పేటిఎం బ్యాచ్ ను పంపింది
• నేను జగన్  నాన్నను చూశా...వాళ్ల నాన్నను చూశా..దేనికీ భయపడను
• టివిలో మాట్లాడే జర్నలిస్టులపైనా కేసులు పెడుతున్నాడు.
• సిఐడి అంటే అక్రమ కేసులు పెట్టడానికేనా
• నాడు బకాసురుడిని అంతం చేసిన భీముడిలా.....రాష్ట్రంలో భూ బకాసురులను, జగన్ రెడ్డిని కట్టడి చెయ్యాలి
• పత్తి కొండ ఎమ్మెల్యే కుటుంబ సభ్యులతో అన్నీ అక్రమాలే
• ఇసుక దందా అని ప్రశ్నిస్తే ఎమ్మెల్యే వారిపై కేసు పెట్టిస్తున్నారు. 
• నేను ధర్మం కోసం పోరాడుతున్నా....ఈ చోటామోటా నాయకులకు భయపడను
• నిబంధనలు పాటించని పోలీసులను జగన్ రెడ్డి కూడా కాపాడలేరు
• పత్తికొండలో టమాటా రోడ్డుపై పారబోసే పరిస్థితి వచ్చింది
• నకిలీ విత్తనాలతో పత్తి రైతులు నష్టపోయారు.
• జగన్ ఒక్క రైతును పరామర్శించాడా....ఒక్క పొలానికి వచ్చాడా
• రాష్ట్రంలో మద్యం కంపెనీలు అన్నీ జగన్ వే....
• జగన్ రాజకీయ వ్యాపారస్తుడు
• వైసిపి ప్రభుత్వంలో ఇరిగేషన్ పనులు అన్నీ నిలిపివేశారు
• సిఎం జగన్ కు రంగుల పిచ్చి. టిడిపి హాయంలో కట్టిన భవనాలకు రంగులు వేసుకుంటాడు
• రంజాన్ తోఫాకు డబ్బులు లేవు కానీ.....రంగులకు డబ్బులు ఉంటాయి
• బిసిలకు పథకాలు లేవు...కానీ సాక్షికి మాత్రం కోట్ల ప్రకటనలు 
• సాక్షి ఉద్యోగులకు ప్రభుత్వంలో పదవులు
• సాక్షి గుమస్తా ఇప్పుడు రాష్ట్రంలో సకల శాఖా మంత్రి
• రాష్ట్రంలో మెడపై కత్తి పెట్టి ఆస్తులు ఖాజేస్తున్నారు వైసిపి నేతలు
• ప్రపంచంలో మూడు రాజధానులు ఎక్కడైనా ఉన్నాయా
• పత్తి కొండకు వస్తుంటే రోడ్డు చేశాను...దారుణంగా ఉంది
• పత్తి కొండకు రోడ్డు వేయలేని వ్యక్తి మూడు రాజధానులు కడతాడా
• కర్నూల్ లో మేము కట్టిన ఎయిర్ పోర్ట్ లో జగన్ దిగాడు....మనం తెచ్చిన సోలార్ ప్లాంట్ తాను ప్రారంభించాడు
• కర్నూలుకు హైకోర్టు వస్తే నేను అడ్డుపడుతున్నా అని తప్పుడు ప్రచారం చేస్తున్నారు
• జగన్ మాఫియా సామ్రాజ్యాన్ని విస్తరిస్తున్నాడు
• ప్రతిపక్షాలపై దాడులు చేయించి డిజిపి సమర్థించుకుంటున్నారు
• అలా సమర్థించిన నాటి డిజిపి సవాంగ్ అన్న ఇప్పుడు ఏమయ్యాడు
• నందిగామ వెళితే రాళ్లు వేసి అలజడి సృష్టించే ప్రయత్నం చేశారు
• పూలల్లో రాళ్లు వచ్చాయని నందిగామ ఘటనపై పోలీసులు చెప్పారు. అంటే రేపు పూలల్లో బాంబులు వస్తాయా
• నాకు నా ప్రాణం ముఖ్యం కాదు...రాష్ట్రం ముఖ్యం, ప్రజలు ముఖ్యం
• పవన్ కళ్యాన్ మీటింగ్ కు భూములు ఇస్తే గుంటూరు జిల్లాలో గ్రామస్థులను వేధించారు. రోడ్డు విస్తరణ పేరుతో ఇళ్లు కూలగొట్టారు.
• పవన్ విశాఖ వస్తే అక్కడా ఇబ్బంది పెట్టారు
• నేను అనుకుంటే జగన్ నాడు తిరిగేవాడా
• రాష్ట్రంలో ఎక్కడ అన్యాయం జరిగినా ముందు నేనే స్పందిస్తా
• ప్రజా స్వామ్యాన్ని కాపాడడం సీనియర్ నేతగా నా బాధ్యత
• ఆంబోతుల్లా వ్యవహరిస్తున్న వారిని కంట్రోల్ చెయ్యాల్సి ఉంది
• బాబాయ్ ను చంపి నారాసుర రక్త చరిత్ర అని నాపై రాశాడు
• తండ్రి హత్యపై వివేకా కూతురు సుప్రీం కోర్టుకు వెళ్లి పోరాడుతుంది
• టిడిపి ఎన్నికలకు సిద్దంగా లేదు అని సిఎం అనుకుంటున్నాడు
• 5 వేలు 10 వేలు ఇచ్చి గెలుద్దాం అని జగన్ అనుకుంటున్నాడు
• డబ్బులకు మన జీవితాలు తాకట్టు పెట్టుకుంటామా
• స్థానికంగా పంటల భీమా చెల్లింపులు చెయ్యలేదు
• ధరల స్థిరీకరణ నుంచి ఉల్లి, టమాటా పంటల రైతులను ఆదుకోవాలి
• నకిలీ విత్తనాల కారణంగా పత్తి దెబ్బతిన్నది. దీనికి రైతులకు నష్ట పరిహారం ఇవ్వాలి
• రైతులకు డ్రిప్ సబ్సిడీలు కొనసాగించాలి
• నంద్యాలలో అబ్బుల్ సలాం కుటుంబాన్ని ఎలా వేధించి చంపారో అంతా చూశాం
• మైనారిటీలకు ఇచ్చే అన్ని పథకాలు రద్దు చేశారు
• మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ పెట్టింది టిడిపి. వక్ఫ్ బోర్డు అస్తులు కాపాడింది కూడా టిడిపినే
• అసెంబ్లీ పరిణామాలు చూసి మళ్లీ అసెంబ్లీ కా రాను అని ప్రకటించాను
• మళ్లీ గౌరవ సభలోనే  నేను అడుగు పెడతాను అని చెప్పాను
• ఫిజికల్ గా ఫిట్ గా ఉన్నా...రాష్ట్రాన్ని బాగు చేసి చూపిస్తా.

#SaveRayalaseema 
#RayalaseemaTDP

Link to comment
Share on other sites

  • Replies 74
  • Created
  • Last Reply
1 hour ago, adithya369 said:

Yeah, paina konni statements are good, like Sakshi, Thofa……. baagunnaayi 

Statements ivvakkara ledu. Just compare his govt lo vunna rates etc.. to current govt. janalu roju ibbandi pade issues like taxes, rates,roads etc… that’s all he need to talk

Link to comment
Share on other sites

2 hours ago, Mobile GOM said:

Statements ivvakkara ledu. Just compare his govt lo vunna rates etc.. to current govt. janalu roju ibbandi pade issues like taxes, rates,roads etc… that’s all he need to talk

CBN time lo Evari brathuku vaallu prasaantham gaa brathikaaru. ippudu Basic needs like roads, drainage, drinking water ki maintenance ledhu

Link to comment
Share on other sites

చంద్రబాబు పర్యటన: నవంబర్ 30 నుండి

ప్రోగ్రాం: ఇదేం ఖర్మ మన రాష్ట్రానికి

నియోజకవర్గాలు: దెందులూరు, చింతలపూడి, పోలవరం, కోవూరు, , నిడదవోలు, తాడేపల్లిగూడెం

దెందులూరు, చింతలపూడి, కొవ్వూరు, నిడదవోలు లో ఆధిక్యం లో ఉన్న TDP

పోలవరంలో వైసీపీ ఆధిక్యం

తాడేపల్లిగూడెం లో ముక్కోణపు పోటీ.....

Link to comment
Share on other sites

నవంబర్ 30 నుంచి మూడు రోజుల పాటు పశ్చిమగోదావరి జిల్లాలో బాబుగారి పర్యటన వుంది 
ఆ పర్యటన తరవాత ఇంకేతమంది పదవులు వూడతాయో?

6E014CA7-E0EE-459B-B07A-5368306A5092.jpeg

Link to comment
Share on other sites

సీమజనంలో ఎందుకీ మార్పు?

తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో పర్యటిస్తున్నప్పుడు జనం తండోపతండాలుగా వస్తున్నారు. టిడిపి నేతల అభిప్రాయాలను పక్కన బెడితే, ఏ రాజకీయ పార్టీతోనూ అనుబంధం లేని వారు కూడా ఈ విషయాన్ని అంగీకరిస్తున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి సభలకు డ్వాక్రా మహిళలు, కాలేజీల విద్యార్థులే గతి అవుతున్నారు. అదీ, బస్సులు పెట్టి తరలించవలసివస్తోంది. పైగా సభ మధ్యలో వీరు వెళ్లిపోవడం కూడా జరుగుతున్నది.

చంద్రబాబు సభలకు రాష్ట్రంలో ఇతర ప్రాంతాల్లో జనం రావడం పెద్ద ఆశ్చర్యమేమీ కాదు గానీ, జగన్మోహన్ రెడ్డి కాణాచిగా వైసీపీ నాయకులు భావించే రాయలసీమలోని కర్నూలు జిల్లా, మరీ సీమకు గుండెకాయ లాంటి పశ్చిమ ప్రాంతంలో ఇటీవల చంద్రబాబు పర్యటిస్తే, ఆయన తిరిగిన అన్ని నియోజకవర్గాల్లో జనం పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. చీకటిపడిన తర్వాత కూడా మహిళలు సభసాంతం ఉన్నారు. కర్నూలు న్యాయరాజధాని చేస్తానన్న జగన్మోహన్ రెడ్డి హామీ ప్రభావం కూడా చంద్రబాబు పర్యటనపై పెద్దగా లేదు. మరోవైపు చంద్రబాబు అమరావతిలోనే రాజధాని, హైకోర్టు అనే వాదననుండి వైదొలగలేదు, అదే ధోరణిలో ప్రసంగాలు సాగిస్తున్నారు. కర్నూలు జిల్లా పశ్చిమప్రాంతంలో చంద్రబాబు పర్యటన పెట్టుకున్న రోజే సీమ అస్తిత్వం కోసం పోరాడే పలు ప్రజాసంఘాల సమన్వయ వేదిక ఆధ్వర్యంలో శ్రీబాగ్ ఒడంబడిక అమలు కోసం విజయవాడలో ధర్నా జరిగింది. సీమ ఉద్యమకారులనుండి కాకున్నా న్యాయరాజధాని హామీ ప్రభావం వల్ల చంద్రబాబుకు ఎంతో కొంత ప్రతిఘటన తప్పదని కొందరు భావించినమాట నిజం. కానీ, చంద్రబాబు పర్యటించిన అన్ని నియోజకవర్గాల్లో టీడీపీ నాయకుల అంచనాలకు మించి జనం ఎందుకు వచ్చారు?.

రాజశేఖరరెడ్డి వారసత్వంతో రాయలసీమ కోనసీమ కాకున్నా, సాగునీటి ప్రాజెక్టుల విషయంలో ఎంతో కొంత పురోగతి ఉంటుందని ఆశించిన వారి ఆశలు ఏడాదిలోనే అడియాసలైనాయి. గొంతు తడారిపోతున్న సీమలో లక్షలాదిమంది సామాన్యులకు సాగునీరు మాట అటుంచి, తుదకు తాగునీరు కూడా ఇవ్వకుండా, చేతినిండా పని కల్పించకుండా మూడేళ్లు గడిపేశారు జగన్. భావోద్వేగంతో కూడిన హైకోర్టు ప్రతిపాదన సైతం సమాజంలోని పైవర్గాలను మాత్రమే సంతృప్తిపరిచింది. భావోద్వేగాలకు సులభంగా లొంగిపోయే యువకుల్లో కూడా ఈ విషయంలో ఏకాభిప్రాయం లేదు. జగన్మోహన్ రెడ్డి చెబుతున్న అధికార వికేంద్రీకరణ పైవర్గాలకు నచ్చినా సదరు అభివృద్ధి వికేంద్రీకరణ కనుచూపుమేర లేకపోవడంతో సామాన్యప్రజలు తమదారి తాము ఎన్నుకొనే పరిస్థితి సీమలో నెలకొంది. తుంగభద్ర దిగువ కాలువకు వేదవతిపై వున్న అక్విడెక్ట్ దెబ్బతిన్న ఫలితంగా వేలాది ఎకరాల్లో పెట్టిన పంటలు దెబ్బతింటుంటే, హంద్రీనీవా ఎత్తిపోతలు నిలుపుదల చేసినందున పత్తికొండ నియోజకవర్గంలో పంటలు ఎండిపోతుంటే, రాష్ట్రస్థాయిలో విద్యార్థి యువజన రైతుసంఘాలు పెట్టుకొన్నవారు నినాదాలకు పరిమితమయ్యారే గాని, రైతులను సమాయత్త పరిచి, ఆందోళన చేయలేకపోయారు. గ్రామాలకు గ్రామాలు వలసలుపోయే రాయలసీమ దుర్భర జీవితం కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతంలో నేటికీ చూడగలం. ఈ ప్రమాదంలోని దాదాపు ఏడు నియోజకవర్గాల్లోని ప్రజలు తాగునీటికి కరువై దుర్భర జీవితాన్ని గడుపుతున్నారు.

చంద్రబాబు హయాంలో టెండర్లు పిలిచి పనులు మొదలుపెట్టిన వేదవతి ఎత్తిపోతలు కొండెక్కింది. ఆర్డీయస్ కుడి కాలువ పనులు ఆగిపోయాయి. టిడిపి హయాంలో రాయలసీమలో చంద్రబాబు సాగునీటి ప్రాజెక్టులను పూర్తిచేయలేకపోయినా, ఆయన అయిదేళ్ల కాలంలో చేసిన వ్యయం, ఫలితంగా జరిగిన పనులను జగన్మోహన్ రెడ్డి మూడేళ్ల కాలంతో సరిపోల్చితే నక్కకూ నాకలోకానికి ఉన్నంత తేడా రాయలసీమ ప్రజలకు తెలుస్తున్నది. తాజాగా సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా కర్నూలులో హైకోర్టు పెట్టే ఆలోచన లేదని ఏపీ తరపున వాదించిన సీనియర్ అడ్వకేట్ వేణుగోపాల్ ఇచ్చిన హామీతో నేడు రాయలసీమ వాసులకు వైసీపీ ప్రభుత్వం అసలు రంగు పూర్తిగా అర్థమైంది. న్యాయరాజధాని కూడా తమకు లేదన్న వార్త వారిపై పిడుగులు కురిపించింది. ప్రజలు కూడా ఒక దఫా నమ్ముతారు. మోసపోయామని గ్రహిస్తే, గ్రక్కున విడువంగ... అనే సుమతి శతకం సూక్తి అమలు చేస్తారు.

వి. శంకరయ్య

విశ్రాంత పాత్రికేయులు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...