Jump to content

ఓఎంసీ కేసులో ఐఏఎస్ శ్రీలక్ష్మికి క్లీన్‌చిట్


rajanani

Recommended Posts

హైదరాబాద్: సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మి (Srilaxmi)కి హైకోర్టు (Telangana high court)లో భారీ ఊరట లభించింది. ఓబులాపురం మైనింగ్ కంపెనీ (OMC Case) కేసులో శ్రీలక్ష్మికి హైకోర్టు క్లీన్ చిట్‌ ఇస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ కేసులో శ్రీలక్ష్మిని న్యాయస్థానం నిర్దోషిగా పరిగణించింది. ఐఏఎస్‌ అధికారినిపై ఉన్న అభియోగాల్ని ధర్మాసనం కొట్టివేసింది. ఓఎంసీ నుంచి ముడుపులు తీసుకున్నారని శ్రీలక్ష్మి ఆరోపణలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే. సీబీఐ కేసు నమోదుతో ఏడాది పాటు ఐఏఎస్ అధికారిణి జైలులో గడపాల్సి వచ్చింది. 

2004 - 2009లో శ్రీలక్ష్మి మైనింగ్ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీగా ఉన్న సమయంలో ఈ అక్రమాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొన్నారు. మైనింగ్‌కు పాల్పడిన వారికి శ్రీలక్ష్మి సహకరించారనే ఆరోపణలతో పాటు ముడుపులు కూడా తీసుకున్నారంటూ సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. అయితే తాజాగా... ఎలాంటి సాక్ష్యాధారాలు లేనందున శ్రీలక్ష్మిపై ఉన్న అభియోగాలన్నింటినీ కొట్టివేస్తూ హైకోర్టు క్లీన్‌‌చిట్ ఇచ్చింది. 

కాగా...ఈ కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు క్లీన్‌చిట్ ఇవ్వడంతో శ్రీలక్ష్మి ఏపీ చీఫ్ సెక్రటరీగా నియమితులు అయ్యేందుకు అడ్డంకులు పూర్తిగా తొలగిపోయాయని చెప్పుకోవచ్చు.

Link to comment
Share on other sites

7 hours ago, VisionaryCBN said:

Steps towards becoming a full fledged “Banana” republic… no wonder why many people just want to get out of India

Already a full fledged banana republic bro…. Silent ga mukku mooskoni emi ledu anukuney batch can survive!

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...