Jump to content

Current Politicians Scenario


RamaSiddhu J

Recommended Posts

తెలుగు రాష్ట్రాల రాజకీయాలు.

ఏ భజన బ్యాచ్ అయినా కొంచెం దూరంగా ఉండండి.

 

ఈరోజు చంద్రబాబు పరిస్థితి కి చంద్రబాబు నే కారణం. "ఏ ఇజం లేదు ఉండేదంతా టూరిజం " అని విద్యార్థులకు రాజకీయాలు అవసరం లేదని , సమాజం అంటే పట్టని ఓ తరాన్ని తయారు చేశాడు. వాళ్ళంతా విదేశాల్లో, పెద్ద పెద్ద నగరాల్లో ఉన్నారు. ఇప్పుడు గల్లిలో పోరాటం చేయడానికి ఏవరు మిగలలేదు. 😊

 

ఈరోజు కెసిఆర్ పరిస్థితి కీ కూడా ఆయనే కారణం్ ఉద్యమ పార్టీ అని చెప్పుకోవడమే కానీ ఉద్యమకారులు కీ ఏం న్యాయం చేశారు? ఉద్యమం నుంచి వచ్చిన వారిని నాయకులు గా తయారు చేసుకోకుండా ఆపార్టీ, ఈపార్టీ చెత్తంతా పోగేసుకున్నారు. వీళ్ళు ఏందుకు నిబద్దతగా ఉంటారు? ఒక "బూర" పోతే ఇంకో బూర ని తయారు చేసుకోవాలి గాని కాంగ్రెస్ నుండి రవికుమార్ ని తెస్తే బలోపేతం అయిపోతదా? అధికారంలో ఉన్నారు కాబట్టి ఆ ఒకరిద్దరు వస్తున్నారు. ఒక్క సారి తేడా వస్తే చంద్రబాబు పరిస్థితే చాలా నయం .

 

జగన్ రెడ్డి పరిస్థితి కూడా అంతే. స్పెషల్ స్టేటస్, విశాఖ ఉక్కు, రైల్వే జోన్ ల మీద ఎప్పుడైనా " గర్జన, ధర్నా" లు చేశారా? ఆయన చేతిలో ఉన్న మూడు రాజధానుల కోసం డ్రామా లు చేయడం దేనికి? అసలు సంగతి డైవర్షన్ కోసం తప్పితే? ఒక్కసారి అయినా రాష్ట్రానికి రావాల్సిన వాటిని గురించి కనీసం చిన్న మాట ( మెడలు వంచేది మర్చిపోదాంలే) అయినా మాట్లాడారా? ఏందుకంత భయం? అవతల పక్క స్టాలిన్ ఏలా కడిగేస్తున్నారు? పవర్ లో ఉన్నాం కదా దౌర్జన్యం చేస్తే అన్ని సమసిపోతాయి అనుకుంటే ఏంత ఎక్కువ చేస్తే అంత తొందరగా ఇంటికి పోతారు.

 

జనసేన ఓ సినిమా హీరో పిల్ల సేన అంతే.

 

పైన చెప్పిన వాళ్ళంతా పార్లమెంటు లో అడ్డమైన బిల్లుకు వంగి‌, వంగి మద్దతు ఇచ్చిన రాజకీయ బానిసలు🤐

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...