Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply

14/10/22


ఈ రోజు ఉదయం మునిపల్లె గ్రామములో దైవ రధము ముందు గ్రామ పెద్దలు, జె ఏ సి నాయకులు , రైతు నాయకులు, రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ఇక పాద యాత్ర లో కి సమీప గ్రామాల నుంచి రైతులు వందలాది మంది శ్రీ బూరుగు పల్లి  శే షా రావు నాయకత్వము లో  జై అమరావతి నినాదాలతో వచ్చి పాద యాత్ర ను నడిపిస్తూ  కోరు పల్లి గ్రామము చేరుకోగా ఇక అక్కడి రైతులు వందలాది మంది అపూర్వ స్వాగతం లు అందించి పాద యాత్ర లో కలిసి కలవ చర్ల గ్రామము చేరగా ఇక అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ  వారిని కూడా కలుపుకొని  డి .ముప్పవరము గ్రామము చేరే సరికి ఇక పాద యాత్ర జైత్ర యాత్ర గా మారి  జై అమరావతి నినాదాలతో నిడద వో లు  పట్టణము చేరగానే ఇక అక్కడ అమరావతి పాద యాత్ర కు నిరసనగా కొంత మంది కిరాయి సన్నాసులు  పిచ్చి పిచ్చి ప్ల కార్డులతో    నుంచుని   , తాగు బోతు విన్యాసాలు చూపించగా ఇక పాద యాత్ర రైతులు ఒక వూదు వూదితే కొట్టుకు పోయే  వాతా వరణం లో  జై అమరావతి నినాదాలతో పట్టణములో కి ప్రవేశించ గా ఇక పట్టణ ప్రజలు, సమీప గ్రామాల అమరావతి  రైతు  అభిమానులు వందల వేల సంఖ్యలో వచ్చి పట్టణ వీధుల గుండా పాద యాత్ర ను నడి పి స్తుం డ గా , ఇక  ఈ రోజు భోజన కార్యక్రమం నకు ముందుగానే వాన దేముడు వచ్చి పడగా ఇక కిరాయి సన్నాసులు చెల్లా చెదు రై పోగా , ఇక పాద యాత్ర రైతులు అలానే వానలో తడుస్తూ జై అమరావతి నినాదాలతో  భోజన వసతి ఏర్పాటు వద్దకు చేరి ఇక అలానే టెంట్ ల కింద భోజనాది కాలు గావించి ఇక భోజన అనంతరము తిరిగి పాద యాత్ర కొనసాగించి బ్రాహ్మణ పల్లె చేరగా ఇక అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు   అందుకుంటూ  పాద యాత్ర కొనసాగించ గా ఇక ఎస్ ముప్పవరము  చేరే ముందు కొవ్వూరు నియోజక వర్గ పరిధి లో కి రాగానే ఆ నియోజక వర్గ పెద్ద లు , అమరావతి అభిమానులు వందల సంఖ్యలో వచ్చి  గ్రామము లోకి తోడ్కొని వెళ్లగా ఇక ఈ రోజు పాద యాత్ర కు మద్దతుగా శ్రీ గన్ని  వీ రాంజ నే యులు , బడేటి చంటి, మాజి మంత్రి జవహర్  తదితర నాయకులు , కార్యకర్తలు పాద యాత్ర లో పాల్గొనగా ఇక విజయ వాడ నుండి కార్పొరేటర్ శ్రీమతి చెన్ను పాటి ఉషా రాని మరి కొంత మంది అమరావతి మహిళా రైతుల వచ్చి పాద యాత్ర లో కలిసి రైతులకు మద్దతు తెలుపగా ఇక ఈ రోజు పాద యాత్ర విజయ వంతంగా ముగించి రాత్రి విడిది బస కు  జై  అమరావతి  నినాదాలతో చేరుకుంది . జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !  జి వి రామ్ ప్రసాద్, ఎస్ ముప్పవరము , 14_10_2022 , సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 15/10/2022
👉రోజు:- శనివారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- S.ముప్పవరం (కొవ్వూరు).
👉భోజనవిరామం : పశివేదల 
👉ముగింపు ప్రాంతం: కొవ్వూరు
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

**నా జిల్లా విజయగరం నా ఊరు రామయ్యపాలెం విశాఖ జిల్లాకు ఆఫ్ కిలోమీటర్,నా రాజధాని అమరావతి* 

*రాజధానిని అమరావతిలోనే ఎందుకు ఉంచాలి...?*

*1* *అమరావతి* 
ఇప్పుడు నడుస్తున్న రాజధాని.

*విశాఖపట్నం* 
మళ్లీ అన్నీ మొదలుపెట్టాలి.

*2  అమరావతి* 
     ముంపు లేదు

*విశాఖపట్నం* 
తుఫానులు వచ్చే అవకాశం ఇప్పటికే హుద్ హుద్ తుఫాను వలన విశాఖపట్నం ఒకసారి కకావికలం అయ్యింది.

*3  అమరావతి*
తీరానికి 80 కిలోమీటర్ల పైగా దూరంగా ఉంది.
రేపు ఏదైనా శత్రుదేశాల తోటి యుద్ధం వచ్చినప్పటికీ రక్షణ పరంగా టార్గెట్ కాదు కాబట్టి భయం లేదు.

*విశాఖపట్నం*
దేశం మొత్తం మీద తూర్పు తీరాన రక్షణ పరంగా ఉన్న అతి కీలకమైన ప్రదేశం.
బోలెడన్ని సైనిక కేంద్ర స్థావరాలు ఉన్నాయి. శత్రుదేశంతో యుద్ధం అంటూ జరిగితే మొదట బలి అయ్యేది విశాఖపట్నమే.

 *4.అమరావతి*
(గుంటూరు జిల్లా) అటు 06జిల్లాలు ఇటు 06 జిల్లాల మధ్యలో ఉంది. 

*ఎమ్మెల్యేలు*
84 ఒకవైపు
74 ఇంకోవైపు 

*ఎంపీలు*  
అటు 12 మంది, 
ఇటు 12 మంది

*దూరం*  
అటు 600 కిలోమీటర్లు 
ఇటు 600 కిలోమీటర్లు.

*జనాభా* 
2.35కోట్లు ఒకవైపు,
2.15కోట్లు ఇంకొక వైపు.

*అమరావతి:* 
మొత్తం రాష్ట్రానికి నడిబొడ్డున ఉంటుంది.                                       
-------------------------------
*విశాఖపట్నం* (జిల్లా)
10జిల్లాలు ఒకవైపు,
02 జిల్లాలు ఒకవైపు.

**దూరం* 
1000 కిలోమీటర్లు ఒకవైపు,
100 కిలోమీటర్ల ఇంకో వైపు

 *జనాభా* 
3.5కోట్ల జనాభా ఒకవైపు 50 లక్షల జనాభా ఇంకొక వైపు 

*ఎమ్మెల్యేలు*
141ఒకవైపు 19 ఇంకోవైపు
 
*ఏ రకంగా చూసినా విశాఖపట్నం అందరికీ అన్నిటికీ దూరంగా ఉంటుంది*

5 *అమరావతి*  
కృష్ణా నది ఒడ్డున ఉంది. నీటికి కొరత లేదు.

*విశాఖపట్నం* 
  నీటి కొరత ఉంది.

6 *అమరావతి* 
ఇప్పటి జనాభా 01లక్షలోపు మాత్రమే. ఎంతపెరిగినా10లక్షలు మించదు.
అలాగే, 
సమగ్రమైన ప్రణాళిక వుంది కాబట్టి కాలుష్యం ఉండదు.

*విశాఖపట్నం* ఇప్పటిజనాభా25లక్షలు.
పెరిగి పెరిగి 50లక్షలు అవుతుంది. ఉన్న ఊరును పెంచుకుంటూ పోవటం వలన అస్తవ్యస్తంగా తయారవుతుంది. కాలుష్యం పెరిగిపోతోంది.

*ఏవిధంగా చూసినా అమరావతిలోని  రాజధానిని  కదిలించడం ముమ్మాటికీ కుటిలమైన రాజకీయ వికృతక్రీడ, మూర్ఖత్వం.**
👉 అమరావతిలో ఉన్నంత విశాలమైన రహదార్లు ఢిల్లీలో కూడా లేవు...

*👉 భూగర్భ కేబుల్ వ్యవస్థతో ఒక్క కరెంటు వైరు కూడా బయటకి కనిపించకుండా నిర్మించారు...*

*👉 భూమికి పాతికఅడుగుల క్రింద నిర్మించిన డ్రైనేజీ వ్యవస్థతో దోమలవలన, అపరిశుభ్రతవల్ల వచ్చే రోగాలు అమరావతి దరిదాపుల్లో వినిపించవు....*

*👉 కనీసం అమెరికాలో కూడా ఇంత పక్కాప్రణాళికతో నిర్మించిన నగరంలేదు...*

*👉 వచ్చే వందేళ్లవరకు నీటికోసం చెన్నై, ముంబై, బెంగుళూరు నగరాల్లా కటకటలాడాల్సిన పనికూడా లేకుండా కృష్ణమ్మఒడ్డున భూదేవిసైతం నివ్వెరపోయేలా..ఆకాశం అచ్చెరువొందేలా ...ప్రపంచదేశాలు మనవైపు చూసేలా, భూతలస్వర్గం అనిపించుకునేలా మన అమరావతి పునర్నిర్మాణం తధ్యం...*
*ఆంధ్రుల రాజధాని అమరావతి...*

*ఆంధ్ర అభివృద్ధిని కోరుకునే ప్రతి ఒక్కరు తప్పకుండా ప్రతి group నకు ఫార్వర్డ్ చేయండ..

Link to comment
Share on other sites

15/10/22


పరిగెత్తు కొ స్తు న్న పల్లె జనాలు ...!                              ఈ రోజు ఉదయం ఎస్ ముప్పవరం గ్రామములో మహా పాద యాత్ర రథం ముందు స్థానిక పెద్దలు, జె ఏ సి నాయకులు , రైతు నాయకులు, రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ఇక కొవ్వూరు నియోజక వర్గం నకు చెందిన అనేక మంది ప్రముఖులు తమ తమ అనుచరులతో తరలి వచ్చి పాద యాత్ర లో పాల్గొనగా ఇక చుట్టు పక్కల గ్రామాలయిన నందిగం పా డు, చంద్రవరం , వూనగట్ల , గౌరీ పల్లి , డి ముప్పవరం పసివేదల గ్రామాల నుంచి రైతులు భారీ ఎత్తున ట్రాక్టర్లతో వచ్చి పడి పాద యాత్ర ను జైత్ర యాత్ర గా చేసి చాగల్లుకు తీసుకు పోగా ఇక అక్కడ కిరాయి కౌరవ మూక నల్ల  బూరలతో , పనికి మాలిన   స్లోగన్ల      ప్ల కార్డుల పట్టుకొని  తాగుబోతు విన్యాసాలు చేస్తుండగా ఇక పాద యాత్ర రైతులకు చాగల్లు గ్రామస్థులు , చుట్టు ప్రక్కల నుంచి వచ్చిన  ప్రజానీకం  యావత్తూ ప్రాణానికి _ప్రాణంగా, ఊపిరిలో _ ఊపిరిగా , దెబ్బకు _ దెబ్బ తీస్తా ము అన్న రీతిలో వచ్చి అసలు ఒక వూ దు వూదితే కిరాయి మూక ఎటు పోతారో తెలియని వాతావరణం నెలకొని వుండగా ఇక జన సేన కార్య కర్తలు పెద్ద ఎత్తున  శ్రీ పట్టపు వెంకటేష్ నాయకత్వం లో   పెద్ద పెద్ద జెండాలతో , సి ఎం డౌన్ _ డౌన్,జై అమరావతి  నినాదాలతో దద్దరిల్లంప చేయగా ఇక కిరాయి మూక లో కొంత మంది టి.వి . ల లో కన పడటానికి ఎగిరెగిరి పడినప్పటికీ చివరకు చావ లేక నోరు లేప లేక పిచ్చి  సన్నాసుల్ల గుడ్లప్పగించి చూస్తుండగా ఇక పోలీస్ ల సమన్వయము తో అమరావతి రైతు మహా పాద యాత్ర రాజ వైభవము తో , రాజ టీ వి తో జై అమరావతి నినాదాలతో చాగల్లు పుర వీధు ల గుండా నడుస్తుండగా  ఇక  ఓల్డ్        టై మర్స్ అంతా ...ఆహా ..ఏమి అధ్బుతం .... మళ్లీ మంచి రోజులు వస్తాయి అని అనుకుంటున్న సమయాన ఇక పాద యాత్ర చాగల్లు గ్రామము నుండి నెల టూ రు  మీదుగా పసివె  ద ల  గ్రామము చేరుకోగా ఇక ఆ గ్రామస్తులు యావ న్మంది  ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి పూల వర్షం కురిపించి జై అమరావతి నినాదాలతో అక్కడనే ఏర్పాటు చేసిన మధ్యానం భోజన వసతి దగ్గరకు తీసుకు వెళ్ళగా ....ఇక భోజన విరామ సమయంలో ....పక్కనే ఉన్న రైతు ల తో పిచ్చా పాటి గా ఆ మాట _ ఈ మాట కలుపగా ... ఓ యువకుడు మాట్లాడుతూ నా పేరు కరక లవ రాజు , 44 సం.లు , కొప్పు వెలమలము , తాపీ మేస్త్రి ని , అన్న వచ్చి నాక అన్నీ గల్లంటై నాయి , ఇసుక 1500 చేసేది ఇపుడు 5000 కు అమ్ము కుంటున్న రు , పెద్ద పెద్ద  పనులు ఆగి పోయి నాయి ,  ఆ పనుల కీ .. ఈ పనుల కీ పోతున్నాను , 20 సం ల క్రితము కొవ్వూరు వచ్చేశాను ,  అసలు మా వూరు పెద పూడి , కాకి నాడ దగ్గర , అక్కడ నాకు 50 సెంట్లు భూమి వున్నది, 50 లక్షలు చేసేది ఇపుడు 30 లక్షలకు కూడా అడగ ట ము  లేదు , ఇద్దరు పిల్లలను చదివిస్తున్న ,  ఇతను ఏ అభివృద్ది చేయడు...తన అభివృద్ది తప్ప ... మీ పాద యాత్ర వస్తున్న ఈ రోడ్ లో అటు ఇటూ వున్న చెట్లకు గత రెండు రోజు ల్లో బులుగు  సున్నాలు వేయించాడు   ... ఈ సారి డిపాజిట్లు కూడా రావు అని చెబుతుండగా ఇక మరో పెద్దాయన మాట్లాడుతూ నా పేరు అయ్య గారి పేరయ్య శాస్త్రి , బ్రాహ్మ  ల ము , కొవ్వూరు పేపర్ మిల్లులో పని చేసి రిటైర్ అయి నా .. నా పి .ఎఫ్ డబ్బులు కూడా ఇంతవరకు రాలేదు ,...అమ్మాయి పెళ్ళి చేయాలి , ఎంతో బరువు నా మీద వున్నది ...భూములిచ్చిన మి మ్ములను రోడ్ల పాలు చేశాడు   ....ఒక్క ఛాన్స్ అన్నాడు ...ప్రజలు కూడా ఒక్కసారిగా చూపించ తానికి రెడీ గా వున్నారు , బయట పడటం లేదు అని చెబుతుండగా ఇక మరో ఇద్దరు పెద్దలు మాట్లాడుతూ నా పేరు గోవింద వజ్జుల సుబ్రమణ్య శర్మ , ఈయన పేరు లంగాల శ్రీనివాస శర్మ , బ్రాహ్మ ల ము , చాగల్లు మా వూరు , అమరావతి  రైతులకు మద్దతు గా వచ్చాము , అమరావ తే ఏకైక రాజధాని , ఈ రోజు మా ఊరు చాగల్లు పండుగ లా వుంది , అసలు మా పార్టీ టి డి పి ...రాసుకోండి ..మాకేమీ భయము లేదు అని చెబుతుండగా ....నేను ...సార్  .. మీ ఆశీస్సులు అమరావతి రైతులకు , ఆంధ్రులకు కావాలి ... సమాజం బ్రష్టు పట్టి పోతాం  ది   అని నేను చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ నా పేరు బో డ పాటి గంగ రాజు , పెద్దే వము మా వూరు, కాపుల ము , 4 ఎ కరములు  సొంతము , 10 ఎ కరములు కౌలు చేస్తున్నాను , టి డి పి ని చంద్ర బాబు పట్టించుకోలేదు , ఎంత సేపు అభివృద్ది అని ఏదేదో  చేస్తూ.   .. ఈ లోగా పార్టీకి జరగాల్సిన నష్టము జరిగినది ...ఇక్కడ గౌడ్ లు ఎక్కువ గా టీ డిపి కి మద్దతు గా వుండే వాళ్ళు , భరత్   ని ఎంపి గా జగన్ పెట్టేసరికి వాళ్ళలో చాలా మంది బోర్డ్ తిప్పేసారు , ఇపుడు కాపుల్లో యువకులంతా జన సేన అంటున్నారు , ఎస్ సి లలో ఎక్కువ వై సీ పీ కే అనుకూలము , అని చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ నా పేరు భూపతి రాజు రవి వర్మ , ఖండవల్లి మా వూరు, అమరావతి జి యా గ్ర ఫిల్గా సెంటర్ పాయిం  ట్లో వుంది , అదే రాజ ధాని గా అందరికీ అందు బాటులో వుంటుంది ....ఏమైనా సరే ఈ సారి కొవ్వూరు , నిడ ద వోలు ల్లో టి.డి.పి నీ భారీ మెజార్టీ లతో గెలిపిస్తాము అని చెబుతుండగా మరో పెద్దాయన మాట్లాడుతూ నా పేరు బాల నాగు మాణిక్యాల రావు , వై శ్యు ల ము సమిశ్ర గూడెం , బట్టల షాప్ వుంది , అందరూ అమరావతి కే మద్దతుగా వున్నారు ...మీరేమి భయ పడవద్దు ....అందరూ సైలెంట్ గా వున్నారు ...ఒక్క సారిగా చూపిస్తారు అని చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ నా పేరు రేలంగి సూరి బాబు , కోరు పల్లె గ్రామము , గౌడ్లము , 30 ఎక రములు  కౌలు చేస్తున్నాను, అటు సూర్యుడు ఇటు పొడిచినా సరే బాబుని గేలిపిస్తాము , అమరావ తే రాజధాని అని చెబుతుండగా మరో పెద్దాయన మాట్లాడుతూ నా పేరు తేత లి  నాగేశ్వర రావు , 75 సం.లు ,కమ్మ , రిటైర్డ్ మిలటరీ, రిటైర్డ్ ఆర్ టీ సి , డ్రైవర్ గా పని చేశా , మా ఆర్ టీ సి వాళ్లు నాకు కనపడి నప్పుడల్లా వీడిని తెగ తిడుతున్నారు , ప్రయాణికులు కూడా అమ్మనా బూతులు  తిడు తున్నరని చెబుతున్నారు , ...ఇక ఇతను చరిత్ర క్లోజ్ .. ఇక రివర్స్ ... బాబుకి 151 ...ఇతనికి 23 ....అని చెబుతుండగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభ మవ్వగా , ఇక ఈ రోజు పాద యాత్ర కు మద్దతుగా బూరుగు పల్లి శే షా రావు,జవహర్ ఇంకా అనేక మంది కొవ్వూరు నియోజక వర్గ పెద్ద లు అమరావతి రైతులకు మద్దతు గా రాగా ఇక పాద యాత్ర నందమూ రు మీదుగా నడిచి అక్కడ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని  కొవ్వూరు పట్టణములో ని విడిది బసకు జై అమరావతి నినాదాలతో విజయ వంతంగా  చేరుకుంది .జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్ , కొవ్వూరు , 15_10_2022 , సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 17/10/2022.
👉రోజు:- సోమవారం ఉదయం 08:00 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- కొవ్వూరు టౌన్ లో నుండి గామన్ వంతెన (గోదావరి 4 వ వంతెన) మీదగా కాతేరు బైపాస్.
👉భోజనవిరామం : కాతేరు బైపాస్.( రాజమండ్రి).
👉ముగింపు ప్రాంతం: మల్లయపేట. (రాజమండ్రి).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

17/10/22

 

గోదావరి వరదలా ఉ రక లె  త్తిన                    రైతు మహా పాద యాత్ర  ..!                                                     ఈ రోజు ఉదయం శ్రీ పరిమి రామా రాయుడు & రత్తమ్మ కళ్యాణ వేదిక , కొవ్వూరులో దైవ రధము ముందు యధా విధిగా జె ఏ సి నాయకులు , రైతు నాయకులు, రైతు మహిళలు  పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ఇక కొవ్వూరు పట్టణములో ని వివిధ వార్డు ల నుండి అమరావతి అభిమానులు తండోప తండాలుగా వచ్చి పాద యాత్ర ను పుంత రోడ్ మీదు గా సాగించి ఇక రోడ్  మలుపు తిరగక ముందే జైత్ర యాత్ర గా చేసి  మెయిన్ రోడ్ కు తీసుకు పోగా  ఇక వివిధ జిల్లాల నుండి హేమా హే మీ  లయిన  శ్రీయుతులు  కొలికపూడి శ్రీనివాస రావు, బూరుగు పల్లి శే షా రావు ,  గన్ని  వీ రాంజ నేయులు  , నిమ్మల రామా నాయుడు , జవహర్ , చింతమ నేని ప్రభాకర్, ముళ్ళ పూడి బాపి రాజు , స్థానిక జన సేన నాయకులు, బి జే పీ, వామ పక్షాల, దళిత సంఘాల నాయకులు వారి అనుచరులు  పెద్ద యెత్తున తరలి వచ్చి పాద యాత్ర లో కలిసి జై అమరావతి నినాదాలతో ముందుకు నడుస్తూ ఇక పాద యాత్ర హై వే అండర్ పాస్ చేరే ముందు మాజి మంత్రి వర్యులు దేవినేని ఉమ, కామినేని శ్రీనివాస్, సుజనా చౌదరి లాంటి వారు పాద యాత్ర లో కలసి గామన్ బ్రిడ్జి మీదుగా వేలాది మంది తో జై అమరా వతి నినాదాలతో ముందుకు సాగుతూ ఇక బ్రిడ్జి అటు వైపు నుండి శ్రీ గోరంట్ల బుచ్చయ్య చౌదరి నాయ కత్వములో  వేలాది అమరావతి అభిమానులు , ముఖ్యంగా మహిళలు వచ్చి అపూర్వ స్వాగతం పలుకగా ఇక ఒక్క మేఘపు నీడ గానీ , చెట్టు నీడ గానీ, భవంతుల నీడ గానీ లేని   బ్రిడ్జి మీదుగా వేసవి ఎండ కు మించి  మండుటెండలో  ఏ మాత్రం జంకకుండా  పట్టు వదలని  విక్ర మా  ర్కుడిలా జై అమరావతి నినాదాలతో పాద యాత్ర  ముందుకు సాగుతూ ఇక బ్రిడ్జి దాటి నాక మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన కాతేరు గ్రామము లోని ఓ ఫంక్షన్ హాల్ ప్రాంగణము నకు చేరే సరికి రెండు  గంట లవ్వగా  ఇక భోజ నాది కాలు ముగించే స రికి  మూడు గంట లవ్వగ ఇక  ఆ తరువాత అమరావతి కి మద్దతు గా వచ్చిన నాయకులతో  రైతులు ఓ  చిన్న పాటి సమావేశ ము ఏర్పాటు చేయగా ఇక జె ఏ సి నాయకులు శ్రీ తిరుపతి రావు స్వాగతము పలుక గా శ్రీ యుతులు  సుజనా చౌదరి, కామినేని శ్రీనివాస్, గోరంట్ల బుచ్చయ్య చౌదరి తదితర నాయకులు ఇత ర వక్తలు   యావన్మంది  అమరావ తే ఏకైక రాజధాని అని చెబుతుండగా ఇక విజయ వాడ నుండి ముస్లిమ్ మైనారిటీ సోదరులు శ్రీ ఫ రుఖ్  షి బ్ లి నాయకత్వములో వచ్చి అమరావతి నే మా ముస్లిమ్ లం త ఆంధ్ర ప్రదేశ్ కు  ఏకైక రాజధాని గా ఉండాలని కోరుకుం టు న్నారని అమరావతి రైతులకు  మా మద్దతు ఉంటుందని భరోసా ఇవ్వగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై మల్లయ్య పేట కు చేరి అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని ఇక ఈ రోజు పాద యాత్ర ను విజయ వంతంగా ముగించి  జై అమరావతి నినాదాలతో  విడిది బసకు చేరుకుంది.  జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ ! జి వి రామ్ ప్రసాద్ , కాతేరు ,  17 _ 10 _ 2022 , సెల్ : 628 111 4344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 18/10/2022.
👉రోజు:- మంగళవారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- మల్లయపేట(రాజమండ్రి).
👉భోజనవిరామం : మున్సిపల్ స్టేడియం.( రాజమండ్రి).
👉ముగింపు ప్రాంతం:మోరంపూడి జంక్షన్.  (రాజమండ్రి).
 👉నడిచే  కిలోమీటర్లు:- 8 kms. సుమారు.

Link to comment
Share on other sites

వైసీపీ కుట్రలను తట్టుకుంటూ రాజధాని రైతుల అమరావతి-అరసవల్లి మహాపాదయాత్ర ప్రజల మద్దతుతో దిగ్విజయంగా కొనసాగుతోంది.ఈరోజు అశేష జనసందోహం,కళాకారుల కోలాటాల నడుమ రాజమహేంద్రవరం,కొవ్వూరు మధ్య గోదావరి నదిపై ఉన్న గామన్‌ బ్రిడ్జి మీదుగా కాతేరులోకి ప్రవేశించారు రైతులు
#AmaravatiFarmersMarch2022

https://twitter.com/JaiTDP/status/1581913938396352512?s=20&t=5i6ALYnXTbiyIAsuUOld6A

Link to comment
Share on other sites

రాళ్ళు మీద పడినా, జోరు వాన కురిసినా  .... తగ్గే దే లేదు !                                              ఈ రోజు ఉదయం 9 గం.లకు మల్లైయపే ట లో దైవ రధము ముందు జె ఏ సి నాయకులు రైతు నాయకులు , రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను జై అమరావతి నినాదాలతో ముందుకు తీసుకు పోగా ఇక రాజ మండ్రి సి పి ఐ నాయకులు , ఎస్ ఎఫ్ ఐ కార్యకర్తలు అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం లు  పలికి పాద యాత్ర లో జై అమరావతి నినాదాలతో  కలిసి ,ఇక పాద యాత్ర ఆర్యా పురము వచ్చే సరికి జన సేన కార్య కర్తలు పెద్ద పెద్ద జెండాలతో శ్రీ యుతు లు  కందుల దుర్గే ష్ , అనుశ్రీ సత్య నారాయణ నాయ కత్వములో తరలి వచ్చి పాద యాత్ర ను జై అమరావతి నినాదాలతో  హోరెత్తి స్టు ముందుకు నడుస్తుండగా ఇక పట్టణ ప్రజలు వివిధ వార్డుల నుండి వచ్చి పాద యాత్ర లో కలువగా ఇక  పాద యాత్ర   దేవి చౌక్ మీదుగా జాం పేట మునిసిపల్ కాంప్లెక్స్ సెంటర్ కు వచ్చేసరికి అమరావతి పాద యాత్ర కు నిరసన గా  దోపిడీ మూక ల నాయ కత్వములో కిరాయి మూక ప్ల కార్డులతో , నల్ల బూరల్తో  ఖాకీ వారి ని అడ్డు గో డగా పెట్టు కొన్న నేపథ్యంలో అక్కడకు వచ్చిన కళాకారుల బ్రుంద మును   అడ్డుకుని , రమణ మీద ఇతర గాయకుల మీద దురుసుగా ప్రవర్తించగా ఇక రమణ ఏ మాత్రం తగ్గ కుండా పాట లు పాడు తూనే వారిని ఎదురించగ  పోలీసులు కొంత సర్డు మనుగ గా ఇక ఆ తరువాత  పాద యాత్ర రైతులు జాం పేట సెంటర్ కు చేర గానే  కిరాయి మూక లో కొంత మంది సన్నాసులు వాటర్ బాటి ల్లు , వైట్ కిరోసిన్ బాటిల్స్  , రాళ్ళు విసరగా ఓ యువకుడు గాయ పడగా , ఇక పాద యాత్ర లో పాల్గొన్న పట్టణ యువకులు వాటర్  పాకెట్ లు తిరిగి  విసరగా  అప్పుడు మార్గాని భరత్ లేచి నిలబడగా అతనిని పాద యాత్ర లో వారు  గుర్తించగ ఇక పాద యాత్ర రైతులు గాంధేయ పద్దతిలో శాంతి యుత ముగ ముందుకు సాగి పాద యాత్ర ను విరేశ లింగము వంతెన మీదుగా చర్చ్ పేట , గీతా అప్సర థియేటర్  రోడ్ మీదుగా భారత బొమ్మల రోడ్ , శ్యామల సెంటర్ మెయిన్ రోడ్ , వి.టి.కాలేజ్ రోడ్ ఇన్నీసు పేట మీదుగా మునిసిపల్ స్టేడియం గ్రౌండ్స్ లో ఏర్పాటు చేసిన మధ్యానం భోజన వసతి ప్రాంగణం నకు చేరగా ఇక భోజన విరామ సమయంలో నా పక్కనే కూర్చున్న కొంతమంది తో పిచ్చా పాటి గా  మాటా మంతి కలుపగ .... ఓ పెద్దాయన మాట్లాడుతూ నా పేరు పి .విశ్వేశ్వర రావు , రిటైర్డ్ ఆర్ టీ సి ఎంప్లాయ్ ని , గారేజ్ లో పని చేశా , దేవంగులము , ఇంతవరకు మేము ఎరుగని రీతిలో ఆర్ టీ సి స్థలాలు కూడా అమ్మేస్తున్నా డు, ఇంటి పన్ను , కరెంట్ బిల్లులు డబుల్ చేసే సాడు , రాజ ధాని ని ముక్కలు చేస్తున్నాడు ,అసలు ఇపుడున్న చోటనే అన్నీ తవ్వుకు పోతు వుంటే ఏమీ చేయని వాడు మూడు రాజ థా నులు ఎలా కడతాడు అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు ఎ షరీఫ్ , 27 సం.లు వయసు , దూదేకులము ,  వాలంటీర్ గా పని చేస్తున్నా, ఏదో మీటింగ్ వుందని ఈ రోజు రమ్మని చెప్పారు, అది అమరావతి రైతులకు వ్యతిరేకముగా ఏర్పాటు చేసిన దని గ్రహించి వెళ్ళ లేదు , ఉద్యోగము వున్నా వూడినా భాధ లేదు , ,అసలు రాజ మండ్రీ వై సీ పీ లో వర్గ పోరు తార స్థాయి లో వుంది , టి డి పి కి ఇక ఎలాంటి భయము లేదు అని చెబుతుండగా ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు రొట్ట మధు , 22 సం.లు , బి. ఎస్ సి చదివాను , లాబ్ టెక్నీషియన్ గా పని చేస్తున్నా, బి సి ని, మేదరలము, మా అమ్మ, నాన్న టి డి పి నే, మా అమ్మమ్మ వై సీ పీ , నాకు ఓటు ఇంతకు ముందు రాలేదు , ఇపుడు వచ్చింది , టీ డి పి కే వేస్తాను , అమరావ తే రాజధాని గా బాగుంటుంది అని చెబుతుండగా ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు డి .విజయ రాజు , ఎస్ . టి ల ము , ఎరుకలము, 35 సం.లు , రోజు వారి వ డ్డి చేస్తాను అని చెప్పగా ... ఏ విధముగా అని నేను అడుగ గా ...8500 లు ఇచ్చి 10000 లు వసూలు చేస్తాము అని చెప్పగా ...ఎన్ని రోజులలో అని అడు గ గా , పార్టీ నీ, అమౌంట్ ని బట్టి  అని చెబుతూ ...ఇక అన్న ఎలక్షన్ వచ్చేసరికి మీ అమరావతి కడతాను అంటాడు ....మొత్తము దగాకోరు , దోపిడీ ఎ వ్వా రమే ...ఏదైనా జరగవచ్చు అని చెబుతుండగా ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ నా పేరు సత్తు పల్లి రాజ , పద్మ సా లీ లము , వరి  కోత మిషన్ నడుపుతుంటా ను , మాకు వుమ్మడి మీద 10 ఎ కరములు పొలము వుంది, ముగ్గురము అన్న దమ్ములము , మేము మొదటి నుంచి బుచ్చయ్య చౌదరి గారి వెంటే వుంటాము అని చెబుతుండగా మరో వ్యక్తి మాట్లాడుతూ నా పేరు కణితి రాజా రావు, గౌడ్ల ము , కూలి పని కి వెళుతుంటా ను, అన్న మీద ఫుల్లుగా వ్యతిరేకత వుంది, అంతా కత్తి మీద కత్తి వేసి సాన నూరు తున్నారు , బైట పడట ము  లేదు, మీ రైతుల ఉసురు తగులుతుంది  అని చెబుతుండగా ఇక మరో పెద్దాయన మాట్లాడుతూ నా పేరు లొ ల్ల విశ్వేశ్వర రావు,  ఎం ఎ, బి.ఇ  డి , రిటైర్డ్ హెచ్ .ఎం  , పద్మ సాలీ లము , ...ఎప్పుడు పోతాడా అని జనమంతా ఎదురు చూస్తున్నారు, అమరావతి సెంట్రల్ పాయింట్ లో వుంది ,అంతకన్నా మంచి ప్రదేశము ఎక్కడ దొరుకతుం ది ? విలువైన భూములు ఇచ్చి న వారికి అన్యాయము చేయడము , రాష్ట్రానికి సరైన రాజధాని లేకుండా చేయడం ...అసలు ఇలాంటి పనులు ఇంగిత జ్ఞానం వున్న వారు ఎవరూ చేయరు ...ఇంత మెజార్టీ ఇవ్వడము ప్రజలు చేసిన తప్పు అని చెబుతుండగా ఇక పాద యాత్ర మొదలు పెట్ట బోతుండగా వర్షము మొదలై నుంచో బెట్టి ఓ దుక్కి కి పైగా కురవగా ఇక అందరూ అలా టెంట్ ల క్రిందే వుండి పోయి , వాన వెలి సి నాక పాద యాత్ర ప్రారంభించి స్టేడియం రోడ్ , తాడి తోట రోడ్ , శీలం నూక రాజు రోడ్ ల మీదుగా ఎ వి అప్పా రావు రోడ్ కు వచ్చేసరికి మరలా వర్షము కుండ పోతగా గుమ్మ రించగా ఇక వర్షము లో అలానే తడుస్తూ , జె ఎన్ రోడ్ , వి ఎల్ పురముల మీదుగా రాత్రి విడిది బస ఏర్పాటు చేసిన శుభమస్తు కళ్యాణ మంటపం నకు  జై అమరావతి నినాదాలతో విజయ వంతంగా చేరుకుంది . జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !  జి వి రామ్ ప్రసాద్ ,  18 _ 10_2022 , సెల్ .628 1114344.

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 19/10/2022.
👉రోజు:- బుధవారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- మోరంపూడి జంక్షన్. (రాజమండ్రి).
👉భోజనవిరామం : రాజవోలు 
👉ముగింపు ప్రాంతం: కేశవరం. (మండపేట).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14 kms. సుమారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...