Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply

19/10/22


మమేకమై తరలి వస్తున్న గ్రామీణులు ...!                                                   ఈ రోజు ఉదయం మోరంపూ డి  జంక్షన్  , రాజమహేంద్ర వరం , శుభమస్తు కళ్యాణ మంటపం వద్ద దైవ రధము ముందు జె ఏ సి నాయకులు, రైతు నాయకులు, రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక శాసన సభ్యులు శ్రీ యుతులు  బుచ్చయ్య చౌదరి, నిమ్మ కాయల చిన రాజప్ప తదితరులు పెద్ద ఎత్తున అనుచరుల తో  తరలి వచ్చి  పాద యాత్ర లో కలిసి జై అమరావతి నినాదాలతో ముందుకు సాగి హుకుం పేట కు చేరగా అక్కడి గ్రామస్తులు మరియు జనసేన నాయకులు శ్రీ దుర్గే ష్ నాయకత్వములో పెద్ద సంఖ్య లో కార్య కర్తలు అమరావతి రైతులపై పూలవర్షం కురిపించి జై అమరావతి నినాదాలతో  పాద యాత్ర లో కలసి ముందుకు సాగి బొమ్మూరు గ్రామమునకు చేరగా ఇక అక్కడ  వూరు వూరంతా ఇళ్ల లో నుంచి బయటకు వచ్చి రైతుల పై పూల వర్షం కురిపించి  , దైవ రధము ముందు మహిళలు  కొబ్బరి కాయలు కొట్టి , హారతుల ధ్ధి జై అమరావతి నినాదాలతో వారు కూడా పాద యాత్ర లో కలిసి  రాజవోలు గ్రామమునకు చేరగా ఇక అప్పటికే సమీప గ్రామాల యిన అంకమ్మ పాలెం, పే రవరం, ఆత్రేయ పురము , ర్యాలీ., కట్టుంగ , వాడ పల్లి , పాటి చెరువు , పులి దిండి., బొబ్బ రలంక , చింతల నామ వరం , మాధవ రాయుడి పాలెం , కొండ గుంటూరు లనుంచి అమరావతి అభిమానులు వందల సంఖ్యలో వచ్చి పాద యాత్ర లో పాల్గొనగా ఇక నాయకులు శ్రీ యుతులు  బండారు సత్యా నంద రావు , పెందుర్తి వెంకటేష్, జవహర్ , వేగుళ్ళ  జో గే శ్వర రావు  లు మరియు సినీ నటుడు తారక రత్న లు వచ్చి పాద యాత్ర రైతులకు తమ సంఘీ భావము తెలుపగా, ఇక అనంత పురము జిల్లా నుంచి అమరావతి అభిమానులు విశేష సంఖ్య లో వచ్చి లక్షా పదహారు వేలు విరాళం ఇచ్చి రైతులకు తమ పూర్తి మద్దతు తెలిపి అమరావ తే ఏకైక రాజధాని అని చెబుతుండగా ఇక పాద యాత్ర మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన శ్రీ కన్వెన్షన్ సెంటర్ కు చేరుకోగా....ఇక భోజన విరామ సమయంలో రైతులంతా నిన్న రాజ మండ్రిలో రైతులపై  జరిగిన  దాడి గురించి వాడిగా వేడి గా మాట్లాడుకోవటం జరిగి ఇక మళ్లీ ఇతను వస్తే  రైతులు చిప్ప... దొ ప్పా పట్టుకోవా  ల్సిందే అని కొందరు , శ్రీలంక అవుతుందని మరి కొంత మంది,  వా లంటీర్లే అన్ని ఉద్యోగాలు చేస్తారు అని మరి కొంత మంది, టీచర్లు కూడా వారే నని .. ఇక దేశములో  అన్ని రాంక్ లు ఆంధ్ర విద్యార్థుల వే నని ...ఇలా ఏవేవో    మాట్లాడు కుంటుండగా ఇక పాద యాత్ర తిరిగి  ప్రారంభమై   రాజా నగరము నియోజక వర్గం లో కి ప్రవేశించి అక్కడ మాజి ఎమ్ ఎల్ ఏ పెందుర్తి వెంకటేష్ నాయకత్వములో కార్య కర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం  పలుకగా ఇక  పాద యాత్ర కొండ గుంటూరు గ్రామము చే రుకో గా అక్కడ ప్రజలు అపూర్వ స్వాగతం ఇచ్చి జై అమరావతి నినాదాలతో  గ్రామము లోకి తోడ్కొని వెళ్లగా ఇక అక్కడ నుంచి  పాద యాత్ర ముందుకు సాగి  పచ్చని పొలాల మధ్య  దిక్కుమాలిన సింగిల్ రోడ్ మీదుగా పడతా లెగుస్తు  , జై అమరావతి నినాదాలతో ఈ రోజు కి   వానా వుంగిడి బెడద లేకుండా కేశవరము గ్రామం చేరుకొని అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని  ఇక ఈ రోజు పాద యాత్ర ను విజయవంతంగా  ముగించి  జై అమరావతి నినాదాలతో విడిది బసకు చేరుకుంది .. జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ ! జి.వి.రామ్ ప్రసాద్,   కేశవరం, 19_ 10_2022, సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 20/10/2022.
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- కేశవరం (మండపేట).
👉భోజనవిరామం : అనపర్తి 
👉ముగింపు ప్రాంతం: రామవరం (అనపర్తి).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14 kms. సుమారు.

Link to comment
Share on other sites

14 hours ago, Uravakonda said:

Evaru? Tarak Ratna? 

What's the use yaa? Elli, mee mama ni lakkoni vachi Amaravathi padayatra palgonelaga cheyyi

Let him participate, atleast if he work hard janallo Anna perochi tdp ki oka seat rupam lo use avvochu... Janala mind lo manchiga padatam important, but hard work chese type aa kaada anedi thelidu... 

Link to comment
Share on other sites

20/10/22

 

ఉల్లాసంగా ,  ఉ త్సాహముగా                                         సాగుతున్న  పాద యాత్ర !                                           ......ఈ రోజు ఉదయం కే శ వరం గ్రామములో పండుగ వాతావరణం నెలకొని గ్రామస్తులు , చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి వచ్చిన ప్రజానీకం దైవ రధము దగ్గరకు చేరుకోగా ఇక శ్రీమతి నాగళ్ళ పద్మావ తమ్మ గారు వారి కుటుంబ సభ్యులు లక్ష రూపాయలు విరాళం అందించగా ,గామస్తులు యాభై వేలు, మరి కొందరు తమ శక్తి కొలది విరాలాలిచ్చిన తదుపరి జె ఏ సీ నాయకులు , రైతు నాయకులు,రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా  ఇక మండపేట ఎమ్ ఎల్ ఏ శ్రీ వేగుళ్ల జోగేశ్వర రావు ,వారి అనుచరులు భారీ ఎత్తున వచ్చి పాద యాత్ర లో కలువగ ఇక అదే గ్రామానికి చెందిన జన సేన నాయకులు శ్రీ ఉండ మట్ల రామా రావు గారి నాయకత్వములో జన సేన కార్య కర్తలు పెద్ద పెద్ద జండా లతో పెద్ద ఎత్తున  కార్యకర్థలతో   వచ్చి పాద యాత్ర లో  కలసి పాదయాత్ర ను కోలాహలంగా ,కన్నుల పండువగా నడుపుతూ ఇక సమీప గ్రామా ల యి న వెలగ తోడు ,మెర్నిపాడు , ఇప్పన పాడు మొదలగు గ్రామాల నుంచి రైతులు వందలాది మంది ట్రాక్టర్ ల తో తరలి వచ్చి పాద యాత్ర ను జైత్ర యాత్ర గా చేసి ద్వారంపూడి కి చేర్చగ  ,ఇక అక్కడకు వచ్చిన జన ప్రవాహం పూల వర్షం కురిపించి ,వారు కూడా పాద యాత్ర లో కలిసి జై అమరావతి నినాదాలతో అనపర్తి కి చేరగా ఇక అప్పటికే చుట్టు ప్రక్కల గ్రామాలైన కుతుకులూరు,భల భద్ర పురం, బిక్కవోలు , రంగంపేట , వడిసిలేరు , చంగే డు, సింగంపల్లి , దొంతమూరు వెంకటాపురం ,రామవరం మొదలగు గ్రామాల నుంచి రైతులు వందలాది మంది వచ్చి శ్రీ నల్లమిల్లి రామకృష్ణ రెడ్డి నాయకత్వములో బ్రహ్మాండమైన స్వాగతము పలుకగా,ఇక జనసే న నాయకులు శ్రీ మర్రె డ్డి శ్రీనివాస రావు నాయకత్వములో కార్య కర్తలు పెద్ద ఎత్తున వచ్చి పాద యాత్ర లో కలసి  పాద యాత్ర ను అనపర్తి పుర వీధుల గుండా నడిపించి మధ్యాన్న భోజన వసతి ఏర్పాటు చేసిన ప్రాంగణ  మునకు చేరి భోజనా ది కాలు  గావిస్తుం డ గా ....ఇక విరామ సమయంలో నా పక్కనే కూర్చున్న కొంతమంది తో పిచ్చా పాటి గా మాటా  మంతి కలపగా . .. ఓ రైతు మాట్లాడుతూ నా పేరు జనపరెడ్డి ఆనందరావు,70 సం.లు, కాపులం, తాపేశ్వరం, 3 ఎ కరములు పొలము వుంది....అసలు నేను ఇంతవరకు ఇటువంటి గుండా రాజ్యం, దౌర్భాగ్యు ల రాజ్యం ను చూడ లేదు, కోర్టులను కూడా లెక్క చేయ ట ములేదు ,రైతులను రోడ్ల పాలు చేశాడు, ఈ ప్రభుత్వాన్ని గద్దె దించడమే ప్రజలు చేయాల్సిన పని అని  చెబుతుండగా ఇక ఓ యువకుడు మాట్లాడుతూ నా పేరు ఎస్ వి ప్రసాద్, 28 సం.లు, శెట్టి బలిజ లము , కార్పెంటర్ గా పని చేస్తున్నా, అన్న   అన్ని రేట్లు పెంచేశాడు , మా వాళ్ళలో చాలా మంది టి డి పి నే అని చెబుతుండగా మరో పెద్దాయన మాట్లాడుతూ నా పేరు షేక్ ఇమామ్ , 52 సం.లు , మండపేట, పరుపుల వ్యాపారము ....అసలు ఎవరికీ మ న:  శాంతి లేదు , వ్యాపారస్తులం త ఇబ్బందులు పడుతున్నారు, భవన  నిర్మాణాలు ఆగి పోయాయి, 10 మందికి డబ్బులు వేసి 90 మంది దగ్గర గుంజు తున్నడు, మా వాళ్లంతా అమరావతి  కే మద్దతుగా వున్నారు అని చెబుతుండగా ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు ఆన్నందేవుల   వెంకటేశ్వర రావు, 39 సం.లు , కాపుల ము,  గెయిల్ కంపెనీ లో పని చేస్తున్న, ...వ్యవస్థను మొత్తం నాశనం చేశాడు, చట్ట సభలో తాను మాట్లాడి న మాటనే మార్చి , మడమ తిప్పి న మొదటి సి ఎం, మొత్తం ఉద్యోగులందరూ వ్యతిరేకముగా వున్నారు , పథకాలు అమలు చేస్తున్న ఇళ్ల లో ఆడ వాళ్ల ఓట్లు ఏమన్నా పడతాయేమో గా ని, మగ వాళ్ళ , పిల్లల ఓట్లు పడవు అని చెబుతుండగా ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు పొట్లూరి శివ ప్రసాద్,39 సం.లు , కమ్మ, కారు డ్రైవర్ గా పని చేస్తున్నా, రాజమండ్రి....మార్పు ఏదొ కొద్ది మంది లో వుంది గానీ , అతను సర్వ శక్తి మంతు డు .. ఊరకనే పో డు అని చెబుతుండగా ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు  తనుకు సురేష్, 23 సం.లు., సొంతము మూడు ఎకరాలు, కౌలు పది ఎకరాలు చేస్తున్నా, యాదవుల ము, మావూరు లో సగం మంది మి యాదవుల మే, కాపులు, బలిజలు కూడా వున్నా రు , ఎస్ సి లు వున్నారు , కాపు ల్లో ఎక్కువ మంది మొదటి నుంచి టి డి పి నే, యాదవుల లో ఎక్కువ మంది టి డి పి నే అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు కడిమి గోవింద రాజులు, 25 సం.లు, శెట్టి బలిజ, 20 ఎ కరములు  కౌలు చేస్తున్నా...అభివృద్ది పనులు అసలు లేనే లేవు.. మా ఊరు ప్రెసిడెంట్ బలిజ నే , వై సీ పీ, ఏదన్నా మాట్లాడితే కేసులు పెట్టిస్తున్నారు అని చెబుతుండగా ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ నా పేరు కే ఎన్ వి ఎస్ గంగాధర రాజు , భ ట్రా జులము ,50 సం .లు, దేవరపల్లి లో బి. ఎస్ ఎన్ ఎల్ లో పని చేశా,  ఇపుడు ఉద్యోగము లే దు, ఏవో చిల్లర వ్యాపారాలు చేస్తూ లాగిస్తున్నా, అపుడు గోపాల పురము నియోజక వర్గం లో వుండగా స్నేహితుడు గదా అని తలారి వెంకట రావు కు ఓటు వేసి చేతులకు మకిలి అంటించుకున్న . .మొత్తము అన్న అధోగతి పాలు చేశాడు... ఓ పాతికేళ్ళు వెనక్కు పోయాము....పాపము ...రైతు మహిళలు ఇలా గోతు ల రోడ్లలో , ఎండా..వానలో చీ   ...చీ...ఇంత దౌర్భాగ్యం ఎవడూ పట్టించ లేదు అని చెబుతుండగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై పొ లమూరు గ్రామము చేరుకొని అక్కడి ప్రజల స్వాగతము లందు కొని  జై అమరావతి నినాదాలతో ముందుకు సాగి రామ వరము చేరుకొని అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని రాత్రి విడిది బస కు ఈ రోజు కొంచెము పెందలకడనే జై అమరావతి నినాదాలతో విజయ వంతంగా చేరుకుంది. జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ ! జి. వి.రామ్ ప్రసాద్, రామవరం, 20_10_2022, సెల్: 6281114344.

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 21/10/2022.
👉రోజు:- శుక్రవారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- రామవరం (అనపర్తి).
👉భోజనవిరామం : పసలపూడి 
👉ముగింపు ప్రాంతం: రామచంద్రపురం (రామచంద్రపురం).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14 kms. సుమారు.

Link to comment
Share on other sites

16 hours ago, ramntr said:

Let him participate, atleast if he work hard janallo Anna perochi tdp ki oka seat rupam lo use avvochu... Janala mind lo manchiga padatam important, but hard work chese type aa kaada anedi thelidu... 

Nenu valla mama annadhi evarinoo meeku artham ayyindha mastaru? Visa Reddy ni

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 22/10/2022.
👉రోజు:- శనివారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:- రామచంద్రపురం.
👉భోజనవిరామం : హసన్నబాద్ 
👉ముగింపు ప్రాంతం: విజయరాయుడుపలెం(కాకినాడ రూరల్).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14 kms. సుమారు.

Link to comment
Share on other sites

ఇట్లు ...
సద్గురు జగ్గివాసుదేవ్ చౌదరి ...
C/O ఇషా చౌదరి ఫౌండేషన్ ...
29 కమ్మవారి ఊర్లు  ..   
ఇంకా అలవాటు లేని జిల్లా పేరు … 
అప్పుల ప్రదేశ్ రాష్ట్రం ....

😜😅😂

6456B9E1-3708-4532-8795-CB36F7D62DA7.jpeg

Link to comment
Share on other sites

ఇది ఏడుపు కాదు నా తెలంగాణ సోదరీసాదరుల్లారా మీకున్న సమైక్యతా భావనతోనే మీ తెలంగాణ రాష్ట్రం ఇలా కొత్త సెక్రటేరియట్ కట్టుకుంటుంది. మాకున్న ప్రాంతీయ వాదం ఎక్కడా ఇటుకనేది పడకుండా మూడు ముక్కలాట ఆడుతుంది. అభివృద్ది చెందిన హైదరాబాద్ లోనే నూతనంగా నిర్మించబోయే సెక్రటేరియట్ ని ఎందుకు నిర్మించాలి? అన్న వాధన బహుశా ఏ తెలంగాణ పౌరునికి రాలేదు కాబోలు అందుకే అభివృద్ధి చెందని తమ ప్రాంతంలో నిర్మించాలని ఉత్తర తెలంగాణ జిల్లాలు కోరలేదు తూర్పు ఈశాన్య తెలంగాణ జిల్లాలు కోరలేదు పడమర, దక్షిణ తెలంగాణ జిల్లాలు కోరలేదు. రాజధాని అనేది ఏ రాష్ట్రానికైనా ఒక ఉనికి. ఏ రాష్ట్రమైనా ప్రపంచం మొత్తం తన వైపే చూడాలన్నా, తన ఉనికిని ప్రపంచానికి చాటుకోవాలన్నా తనకు తానుగా ఒక గుర్తింపు కోసం పాలనా వ్యవస్థతో రూపు దిద్దుకునే ఒక ఐకానిక్ నగరమే రాజధాని. అలాంటి రాజధాని నగరాన్ని నిర్మించుకోవడం చేతకాక నేడు నా ఆంధ్రుడు అధముడై అన్నీ చదివిన పండితుడు పంచాంగం చదమంటే పరమబూతులు చదివాడన్నట్లు, అన్నీ తెలుసు అన్నవాడికే మూడుచోట్ల అంటుంతుంది అన్నట్లు తెలివైన నా ఆంధ్రుడు నేడు చేస్తుంది ఏంటి మూడు ప్రాంతాల్లో ప్రాంతీయ వాదాన్ని భుజాన వేసుకుని ఆ ప్రాంతీయవాదంలో రగిలే మంటలను చలికాచుకుంటూ నేడు మూడు ముక్కలాటతో రాజధానికి ఎక్కడా ఇటుకనేది వేయకుండా శోధ్యం చూస్తున్నాడే తప్ప ఇప్పటికి నీ రాజధాని నగరం ఏదీ అని అడిగితే ఏదీ చెప్పుకోలేని పరిస్థితిల్లోనే ఉయ్యాలలూగుతున్నాడు.

శభాష్ నా ఆంధ్రుడా ఇలా మూడు రాజధానుల మూడుముక్కలాటలో సగటు మనిషిగా ఇలానే ప్రాంతీయ ఉద్యమం పేరుతో దినసరి ఉపాధితోనే కాలం గడిపేయి. నీ బిడ్డల భావితరాల భవితతో నీకేం పని నీకు నేడు ఉపాధి దొరికిందా లేదా అన్నదే నీవు చూసుకో....😡😡😡😡

BC488D6C-0E53-4DBB-8393-9C9E8A05130F.jpeg

Link to comment
Share on other sites

అమరావతి రైతులకు శుభవార్త:

- *అమరావతి రైతుల పాదయాత్ర ని రద్దు చేయాలని జగన్ ప్రభుత్వం వేసిన పిటీషన్ ని డిస్మిస్ చేసిన హైకోర్టు* ధర్మాసనం  

- అమరావతి రైతుల పాదయాత్రను గతంలో మానవేంద్రరాయ్ గారు ఇచ్చిన ఆర్డర్ ప్రకారమే కొనసాగించేలా ఉత్తర్వులు 

- అమరావతి రైతులు పాదయాత్ర చేసుకునే తప్పుడు వేరే ఎవరు వీళ్ళకి అడ్డంకులు కలిగించకుండా పోలీసులు తగు జాగ్రత్తులు తీసుకోవాలి... 

- రైతులకి కావలసిన గుర్తింపు కార్డులు పోలీసులు యాత్రలోనే అందించేలా చర్యలు తీసుకోవాలి...

- సంఘీభావం తెలిపేవారిపై కూడ గతంలో తెలిపిన ఆంక్షలు ఎత్తివేత

Link to comment
Share on other sites

2/11/22
అమరావతి రైతుల పాదయాత్ర పునఃప్రారంభంపై నేడు హైకోర్టులో విచారణ - పాదయాత్రలో రెండు వేల మంది రైతులకు అనుమతి ఇవ్వాలంటూ రైతుల పిటిషన్ - రైతుల పిటిషన్ పై నేడు హైకోర్టు డివిజన్ బెంచి ఎదుట విచారణ - రాజధానికి భూములిచ్చిన వారికి పాదయాత్ర చేసే హక్కు ఉంటుందన్న రైతులు - హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా పాదయాత్ర పునః ప్రారంభం…

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...