Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 07/10/2022
👉రోజు:- శుక్రవారం ఉదయం 08:00 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  పెదమిరం(ఉండి).
👉భోజనవిరామం : విస్సాకోడేరు.  
👉ముగింపు ప్రాంతం: వీరవాసరం.(భీమవరం).
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

  • Replies 196
  • Created
  • Last Reply

07/10/22


ఈ రోజు ఉదయం 9 గం.లకు అమరావతి పాద యాత్ర దైవ రధము ముందు స్థానిక పెద్దలు , జె ఏ సి నాయకులు రైతు లు , రైతు మహిళలు పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా, ఇక ఉం డి ఎమ్ ఎల్ ఏ శ్రీ రామ రాజు ,ఆయన అనుచరులు , అఖిల భారత ఫార్వర్డ్ బ్లాక్ సభ్యులు శ్రీ లంకా కృష్ణమూర్తి , గాది రాజు నాగ రాజు తదితర నాయకుల ఆధ్వర్యములో  పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి పాద యాత్ర కు స్వాగతము పలికి పాద యాత్ర లో ముందుకు నడుస్తుండగా ఇక సి పి ఐ పార్టీ  కార్యకర్తలు జిల్లా కార్యదర్శి కోణాల భీ మారావు, సీ. ఎచ్ రంగా రావు తదితర నాయకుల ఆధ్వర్యములో పాద యాత్రకు స్వాగతము పలికి రైతులకు మద్దతుగా ర్యాలీ లో నడుస్తూ , ఇక పాద యాత్ర లో కి తండోప తండాలుగా వచ్చి పడుతున్న అమరావతి అభిమానులను కలుపుకుని భీమవరం పట్టణములో కి ప్రవేశించి  స్థానిక జన సేన నాయకులు శ్రీ కొటిక లపుడి గోవింద రావు ,కనక రాజు తదితర నాయకుల ఆధ్వర్యములోకార్యకర్తలు  పాద యాత్ర కు స్వాగతము పలికి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక భీమవరం పట్టణములో శ్రీ అల్లూరి సీతారామరాజు విగ్రహము వద్దకు చేరు కోగానే  ఆ మహా నీయుని విగ్రహము వద్దకు అమరావతి జే ఏ సి నాయకులు శ్రీ గద్దె తిరుపతి రావు, రైతు నాయకులు, రైతు మహిళలు, ఉం డి ఎమ్ ఎల్ ఏ శ్రీ రామ రాజు తదితర పెద్దలు పెద్ద ఎత్తున  ఆ వీరాధి వీరునికి నివాళులు అర్పించి , తిరిగి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక  మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేసిన 4 సీజన్స్ టౌన్ షిప్  కు చేరుకుని ..... ఇక భోజన విరామ సమయంలో  నా పక్కనే కూర్చున్న కొంతమంది తో పిచ్చా పాటి గా మాట్లాడుతు వుండగా  శ్రీ మంతెన కృష్ణంరాజు , ఎమ్. ఎస్ సి. ,ఎమ్.ఎడ్ , రిటైర్డ్ హెచ్ .ఎమ్ మాట్లాడుతూ , పాద యాత్ర మహిళలను కించ పరిచే విధంగా, ధరించే దుస్తుల పై గూడా అసభ్యంగా కామెంట్లు , ఫేక్ అని , అదని _ ఇదని చ వక బారు ఆరోపణలు చేయటం  సమంజసము కాదని , మంచి బట్టలు ధరించటం మన హిందూ సాంప్రదాయం అని , మరి వారి మహిళలు దేవతా వస్త్రాలతో కాలము ఈడ్చు తున్నరేమో నని , ఫేక్ గా పుట్టిన వాళ్ళే వళ్లు  మద ముతో , కొవ్వుతో ,  అధికార మద ముతో  , బే వార్సు ఆరోపణలు  చేస్తారని , భూములు ఇచ్చి రోడ్డు న పడ్డ వారి పై ఆరోపణలు చేసే వాళ్ళు , వారికి _ వీరికి  పుట్టిన వాళ్ళే చేస్తారని , అమరావతి కి అందరి మద్దతు వుందని చెబుతుండగా , రిటైర్డ్ ఎస్ బి ఐ బ్యాంక్ మేనేజర్ శ్రీ బి .వి రావు మాట్లాడుతూ జగన్ కు రాజ్యాంగం ద్వారానే అధికారం వచ్చిందని , కావున రాజ్యాంగ బద్దంగా , కోర్టు తీర్పులను గౌ రవిస్తూ, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా , మాట తప్ప కుండా , మడమ తిప్పకుండా పరి పాలన చేయాలని చెబుతుండగా , మరో పెద్దాయన మాట్లాడుతూ , నా పేరు పాల విద్యా సాగర్ , వయసు 80 సం.లు అని , పంచాయతీ రాజ్ డిపార్ట్మెంట్ లో డ్రైవర్ గా పని చేశానని , శెట్టి బలిజ లమని , వెస్ట్ గోదావరి , ఈస్ట్ గోదావరి జిల్లా ల లో శెట్టి బలిజ లను బి.సి లు గా ఉంచి , కృష్ణా జిల్లాలో ఓ సి లు గా పెట్టాడని , మళ్లీ ఇతను వస్తే  ... మా శెట్టి బలిజ లను ఓ సీలుగా , తెలంగానా లో కే సీ అర్ లాగా ఓ సి లను చేస్తాడని , అసలు కాసు బ్రహ్మానందరెడ్డి ముఖ్యమంత్రిగా పనిచేసి నపుడు కాపులను ఓ సి లు గా చేశాడని , ఆ విషయము ఈ జిల్లాల నాయకులకు తెలుసు నని , అయినా ఒక్కడు నోరు ఎత్తడ ని , దొంగ రాజకీయాలు ఈ జిల్లాలో కూడా ఉన్నాయని చెబుతుండగా , మరో పెద్దాయన శ్రీ గాదిరాజు విశ్వ నాధ రాజు (69)  మాట్లాడుతూ , మాది పాల కో డే రు  గ్రామము , ఉం డి మండలము అని వాలంటీర్ ల ద్వారా పధకాలు  రద్దు చేస్తాం అని బెదిరిం చుతున్నరని , జనమంతా మౌనంగా ఉన్నా రని , ఎలక్షన్ డిక్లేర్ చేయ గానే ఒక్కసారిగా అందరూ బైట పడతారని చెబుతుండగా , మరో రైతు మాట్లాడుతూ నా పేరు సంద క  నాగ రాజు,వోండ్ర గ్రామం ,, ఉం డి మండలం, కాపు సామాజిక వర్గం  రైతు నని , సొంతంగా 4 ఎ కరములు , కౌలుకు 5  ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను అని, వీడు వచ్చినాక ఒక్క రూపాయి అదనంగా  రైతులకు దక్కింది లేదని , పొలము అమ్ముతామనే వారు వున్నారు గానీ , కొనే వారు లేరని , పనులకు ఒక్కడు కూడా రావడం లేదని , బెంగాలీ కూలీల చే పనులు చేయించు తు న్నామని , ఏది ఏమైనా ఈ నియోజక వర్గంలో తిరిగి రామ రాజు గెలుస్తారని చెబుతుండగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై , జిల్లా నాయకులు శ్రీ యుతులు పితాని సత్యనారాయణ, ఎమ్మెల్సీ సత్యన్నారాయణ రాజు , శ్రీమతి సీతా రామ లక్ష్మి , పీతల సుజాత , కేంద్ర బి జే పీ నాయకులు శ్రీ సత్య కుమార్ , పీయూష్ దేశాయ్ తదితర నాయకులు,  కార్యకర్తల తో పాద యాత్ర తిరిగి ప్రారంభమై ఇక పాద యాత్ర ముందుకు సాగి పోతు .. గొరగన ము డి, పెన్నాడ , శ్రుంగవృక్షం, మొదలగు గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ, ఇక నందమూ  రు గ్రామము చేరే సరికి జన సేన కార్యకర్తలు వందలాదిగా స్థానిక జెడ్ పి టి సి నాయకులు శ్రీ జి రమేష్ నాయుడు నాయ క  త్వమలో అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ , జై అమరావతి నినాదాలతో వీరవాసరం కు చేరగా ఇక అక్కడి ప్రజలు పులకించి పోయి , మొత్తము జనమంతా ఇళ్ల లో నుంచి బయటకు వచ్చి , పండుగ వాతావరణం నెలకొన గా , ఇక ఈ రోజు పాద యాత్ర విజయ వంతంగా     ముగి సి , జై అమరావతి నినాదాలతో విడి ది బసకు చేరుకుంది   ....జై అమరావతి! జై ఆంధ్ర ప్రదేశ్ ! జి వి రామ్ ప్రసాద్, వీర వాస రం, సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 08/10/2022
👉రోజు:- శనివారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:-  వీరవాసరం.(భీమవరం).
👉భోజనవిరామం : పొలపల్లి Y జంక్షన్. 
👉ముగింపు ప్రాంతం: పాలకొల్లు.
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

08/10/22
 

ఎండ నీ, వాన నీ, బులుగునీ ఎదుర్కుంటూ .......                             రైతు మహా పాద యాత్ర జైత్ర యాత్ర !                     ఈ రోజు వీరవాసరం గ్రామములో  ఉదయం 9 గం.లకు దైవ రధము ముందు గ్రామ పెద్దలు, జె ఏ సి నాయకులు, రైతులు, రైతు మహిళలు యధావిధి గా పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా,  ఇక శివ దేవుని చిక్కాల గ్రామము చేరుతుండగా స్థానిక శాసన సభ్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు, వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు మద్దతు తెలుపుతూ, ఇక పాద యాత్ర పొడవును ఒక కి. మీ పెంచగా , జన సేన నాయకులు శ్రీ ఎన్ .నరసింహ స్వామి నాయకత్వము లో వందలాది మంది , పెద్ద  పెద్ద  జెండాలతో  తరలి వచ్చి అమరావతి రైతు పాద యాత్ర లో మమైక్య మై పాద యాత్ర ను తీర్థ యాత్ర గా మార్చగా , ఇక సమీప గ్రామాలు అయిన తిల్ల పూడి , ఆగర్రు , కొంతేరు, అడవి పాలె ము , ఏనుగు వాని పాలె ము,  బాడవ , అగర్తి పాలె ము , బూరుగు పూడి, చింత పర్రుగ్రామాల నుంచి పెద్ద ఎత్తున రైతులు ట్రాక్టర్ ల తో , పచ్చ జెండాలతో తరలి వచ్చి పాద యాత్ర ను జైత్ర యాత్ర గా చేసి , ఇక బల్లి పాడు , దగ్గు లూ రు , లంకల కొడేరు, భగ్గే స్వరము గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని, జై అమరావతి నినాదాలతో ముందుకు సాగి  , ఇక మథ్యా న్నం భోజన  ఏర్పాట్లు చేసిన పూల పాడు గ్రామము చేరు కునే తరుణంలో వరుణ దేవుడు ఓ మోస్తరు తడాఖా చూపించి నానా రొచ్చు చేయగా , ఇక వందల ,వేలాది మంది అమరావతి అభిమానులు అలానే టెంట్ల క్రింద భోజనాది కాలు  ముగించగ ,......ఇక విరామ సమయంలో నా పక్కనే ఉన్న రైతు సొదరు లతో ఆ మాట _ ఈ మాట కలప గా ,. .... ఓ యువకుడు  ... నా పేరు కుక్కల శ్రీనివాస్ , వయసు 24 సం.లు , శెట్టి బలిజ ల ము , టాపి పని చేస్తున్నా..... అన్న వచ్చినాక పనులన్నీ సంక నాకి పోయినాయి ..., ఇసుక , సి మెంట్  ధరలు పెరిగి పోవడముతో  పెద్ద, పెద్ద పనులన్నీ ఆగి పోయి నాయి , ఇక ఆ పనులు _ ఈ పనులు చేస్తూ కాలము గడుపుతున్నా ము అని చెబుతుండగా మరో యువకుడు ....సార్ .. నా పేరు దుర్గా రావు, వయసు 30 సం.లు , పెక్కేటి పాలె ము  మా వూరు ,రియల్ ఎస్టేట్ చేసే వాడిని , బాబు వున్నపుడు దాదాపు 40 బిట్లు అమ్మాను, కొని పించాను ,  అన్న వచ్చి నా క రెండంటే ...రెండు ..., మొత్తము సంక నాకించేసాడు , మేము మొదటి నుంచి టి డి పి నే , మా వూరు లో ఇటీవలే 150 మంది ఎస్ సి లు టి డి పి లో కి జేరి పోయారు ...., అని చెబుతుండగా మరో పెద్దాయన ....నా పేరు ... కాసా కోటేశ్వర రావు , భ గ్గేశ్వ ర ము గ్రామము , కర్ని భక్తుల సామాజిక వర్గం ( వీవర్స్ )....మా వూర్లో  ఎస్ సి లు, బి సి లు ఎక్కువ.   రాజులు , కాపులు కూడా వున్నారు ...రాజులు టిడిపి , కాపులు జనసేన , బి సి లు మొత్తం టీ డి పి నే ,  ఎన్ టీ ఆర్ పార్టీ పెట్టిన నాటి నుంచి నేటి వరకూ మేమంతా టి డి పి నే అని చెబుతుండగా , మరో యువకుడు ...సార్ ... నా పేరు బి దానియేలు   ..., 41 సం.లు , వెల్డర్ పని చేస్తున్నా ,మా వూరు చించి నా డ  ఎస్ సి లు ఎక్కువ, కాపులు , రాజులు కూడా వున్నారు ..., కాపు లం త జన సేన, రాజు ల లో ఎక్కువ మంది టి డి పి , మా ఎస్ సి ల ఇల్లు 60 వున్నాయి , ఈ రోజు ఇంటి కొకడి చొప్పున  కుర్రాళ్ల ము బైక్ లు వేసుకొని 50 మంది మి వచ్చాము , ఇంకా కొంత మంది పెద్ద వాళ్లు కూడా వచ్చారు ,  ..పాపము రైతులు   ...ఇలా రోడ్డున పడట ము  మేము ఇంతకు ముందు చూడ లేదు ..,ఇందరిని ఏ డి పి స్తూ  ఇంత నాశ నానికి ఎందుకు పూను కున్నాడో ....  ఇంతకు ఇంత అనుభవిస్తాడు అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ.... నా పేరు జి .రామ కృష్ణ మ రాజు , (43) ,  కొమ్ము చిక్కాల గ్రామము, పితాని సత్యనారాయణ గారి వూరు , కూల్ డ్రింక్స్ షాప్ నిర్వహిస్తుంటా ను , ఒక ఎ కరము  పొలము వుంది , గ్రామ సమస్యలపై నిక్కచ్చి గా ప్రశ్ని స్తూం డ టముతో  మా రాజు లే నా పై ఎస్.సి , ఎస్టీ కేసులు పెట్టించారు ...నాలుగు సం.లు పోరాడి నెగ్గాను ..., పంచాయతీ ఎన్నికల్లో పోటీ చే సి ఒక్కరూపాయి ఖర్చు పెట్టకుండా ,ఒక్క వాటర్ పాకెట్ అన్నా ఇవ్వకుండా ఇండి పెండెంట్ గా నె గ్గాను  . ., ఈ రోజు అ మరా వతి  రైతుల కోసం , అమరావ తే ఏకైక రాజధాని గా వుండటము కోసం రైతులకు మద్దతు గా వచ్చాము .నిమ్మల రామా నాయుడికి మా గ్రామములో 700 ఓట్ల మెజారిటి  వుంది ... ఈ సారి మరింత పెరుగుతుంది ...జన సేన పార్టీ వారు వచ్చి నియోజక వర్గ.స్థాయిలో , జిల్లా స్థాయిలో పడవులిస్తా మన్నారు .... జాన్టానై అన్నాను ....నిమ్మల రామా నాయుడు వున్నంత వరకు  ఆయననే సమర్డిస్తామని చెబుతుండగా  ....మరో యువకుడు మాట్లాడుతూ  నా పేరు  తాళ్ళ నాగ రాజు , అడ్వకేట్ ని, ఎస్ సి ని ,  మా వూరు లో ఎస్ సి లు ఎక్కువ ..., సగం వై సీ పీ, సగము టి డి పి .  , కాపులు 20 ఇళ్లు వున్నాయి , కమ్మలూ అంతే ....కాపులు జన సేన, కమ్మలు టీ డిపి, ఇక బి. సి లు మొత్తము టీ డి పీ నే , డబ్బులు ఎంత గుమ్మరించినా నిమ్మల రామా నాయుడు గెలుపు ఎవరూ ఆప లేరు అని చెబుతుండగా  .   ... ఓ పెద్దాయన ...బాబూ.  .నా పేరు చిలుకూరి పట్టాభి రామ శాస్త్రి, నిడద వో లు,  మా అమ్మాయి పాల కొల్లు లో వుంటాంది,   ఈ రోజు అమరావతి పాద యాత్ర తెలుసుకొని పాలకొల్లు  వచ్చాను ....పాపం ...ఆడ బిడ్డలు అ లా ఎండ వానల్లో పడి నడుస్తుంటే టి.వి.లలో చూస్తుంటే ప్రాణము పోతాంది ....నేను అట్టల కంపెనీలో పని చేసి రిటైర్ అయ్యా ను ..., పెన్షన్ 800 /లు వస్తాంది ..., మాకు ఎన్.టి.ఆర్ ఇచ్చిన మూడు సెంట్లలో 1986 లో ఓ చిన్న బంగ్లా పెంకు టిల్లు  ఏర్పరుచు కున్నా...ఇద్దరు పిల్లలు , అమ్మాయి , అబ్బాయి.., బాబు కి , అల్లు డికి గవర్నమెంట్ ఉద్యోగం లు కాబట్టి అలా నెట్టు కొస్తున్నను అని చెబుతుండగా ....నాకు ప్రాణము ఉసూరు మని పించి  ఆయన ను దైవ రధము వద్దకు తీసుకు వెళ్లి , పురోహితుని చే ఆశీర్వ దింప చేసి ,  ఓ రెండు అరటి పండ్లు ఆయన చేతిలో పెట్టగా ఆయన మొఖము నిండా సంతోషము కన పడటముతో ....నా  బ్రతు క్కి ఈ మంచి పన న్న చేశాను అనే తృప్తి నాకు కలుగగా , ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమవుతుండగా , అనేక మంది నాయకులు శ్రీయుతులు పితాని సత్యనారాయణ, శాసన మండలి మాజి అధ్యక్షుడు జనాబ్ ఎమ్ వి షరీఫ్  , మాజి ఎమ్ ఎల్ ఏ గొల్లపల్లి సూర్యారావు, ఎమ్ ఎల్ సి సత్యన్నారాయణ రాజు, మాజి ఎమ్ ఎల్ ఏ శ్రావణ్ కుమార్, అమరావతి యోదాను యో ధుడు శ్రీ కోలిక పూడి శ్రీనివాస రావు,విజయవాడ నుండి ప్రముఖ న్యాయ వాదులు శ్రీయుతులు బి.వి.లక్ష్మి నారాయణ, దండమూ డి రాజ శేఖర్ , లావు అంకమ్మ చౌదరి తదితర న్యాయ వాదులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు సంఘీ భావము తెలుపగా,  ఇక పాద యాత్ర పట్టణ వీధుల గుండా నడచి , వాన జల్లులు _ ఎండ తీవ్రత ల మధ్య పాద యాత్ర రైతులను ఉక్కిరి బిక్కిరి చేయగా ,ప్రాణాలు పోయినా అమరావ తే  ధ్యేయం గా  భావిస్తూ జై అమరావతి నినాదాలతో హోరెత్తించి , పాద  యాత్ర ను విజయ వంతంగా ముగించి రాత్రి బస కు చేరుకుంది .. జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !  జి వి రామ్ ప్రసాద్, పాల కొల్లు , 8 _ 10 _ 22 , సెల్ 628 1114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 09/10/2022
👉రోజు:- ఆదివారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:-  పాలకొల్లు.
👉భోజనవిరామం : కవిటం.
👉ముగింపు ప్రాంతం: పెనుగొండ 
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

09/10/22

 

ఈ రోజు పాలకొల్లు పట్టణము ఎస్ ఆర్ సి గార్డెన్స్ నుండి ఉదయము 9 గం.లకు దైవ రధము ముందు జే ఏ సి నాయకులు , రైతులు , రైతు మహిళలు  యధావిధి గా పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ఇక పాద యాత్ర వుల్లంపర్రు చేరుకునే సరికి స్థానిక శాసన సభ్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు,  వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాద యాత్ర లో పాల్గొని ముందుకు తీసుకు పోగా ఇక వే డంగి, కవిటం గ్రామాల ప్రజలు అపూర్వ స్వాగతం లు అందుకొని  ఇక పాద యాత్ర మధ్యా న్న భోజన సమయానికి మరలా వాన వచ్చి పడి డిస్టర్బ్ చేయగా , ఇక అలాగే ఆ కిసాటు, నానా రొచ్చు  వాతావరణం లో భోజనాది కాలు  గావించి , వెంటనే తిరిగి పాద యాత్ర ను ప్రారంభించి గా ఇక ఆచంట నియోజక వర్గ ము నుండి శ్రీ పితాని సత్యనారాయణ , బూరుగుపల్లి శేషారావు , మాజి మంత్రి శ్రీ జవహర్, వల వల బాబ్జీ తదితర నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు అపూర్వ స్వాగతం లు పలికి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా మా ర్టేరు వద్ద ఆ గ్రామ ప్రజ లు పూల వర్షం కురిపించి మద్దతు తెలుపుతూ పాద యాత్ర లో పాల్గొనగా ఇక పాద యాత్ర పెనుగొండ కు 
చేరి అక్కడ కూడా ప్రజల అపూర్వ స్వాగతం లు అందు కోగ , ఇక ఈ రోజు ప దే , ప దే వర్షము వలన , సింగిల్ రోడ్ మీదుగా పాద యాత్ర రావటము తో ఒకింత ట్రాఫిక్ ఇబ్బంది గా నడిచి నప్పటికీ   ఈ రోజు పాద యాత్ర విజయవంతముగా జై అమరావతి నినాదాలతో విడిది బసకు చేరుకుంది .జై అమరావతి! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, పెనుగొండ , 9_10_2022, సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

11/10/22

 

ఈ రోజు ఉదయం 9 గం.లకు పెనుగొండ విడిది బస ప్రాంగణములో దైవ రధము ముందు జె ఏ సి నాయకులు , రైతులు, రైతు మహిళలు యధావిధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , అత్తిలి నియోజక వర్గం లో ని వివిధ గ్రామాల నుంచి అమరావతి అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర పొడవును కి. మి కి పెంచగా  ఇక అయితంపూడి గ్రామము దగ్గర , తణుకు  నియోజక వర్గ పరిధి లో కి జెరే ప్రదే శా న  వివిధ గ్రామాల అమరావతి అభిమానులు శ్రీ ఆరుమిల్లి  రాధా కృష్ణ నాయకత్వములో అపూర్వ స్వాగతం పలుకగా ఇక తణుకు పట్టణ జనసేన నాయకులు శ్రీ విడి వాడ రామ చంద్ర రావు పెద్ద ఎత్తున కార్య కర్తల తో , పెద్ద పెద్ద జం డా ల తో  వచ్చి అమరావతి రైతులకు వెన్ను దన్నుగా నిలువగా , ఇక దెందులూరు నియోజక వర్గం నుండి శ్రీ  చింతమనేని ప్రభాకర్ పెద్ద ఎత్తున కార్య కర్తల తో తరలి వచ్చి అమరావతి పాద యాత్ర ను నువ్వా _ నేనా అన్నట్లుగా నడిపిస్తూ , ఇక మంత్రి శ్రీ కె నాగేశ్వర రావు ప్రోద్బలంతో ఓ వంద...నూట యాభై మంది అమరావతి పాద యాత్ర కు నిరసనగా  "అమరావతి వద్దు _ మూడు రాజ దానులే  ముద్దు" , ఇంకా  ఏవేవో పిచ్చి పిచ్చి స్లోగన్లతో ప్లా కార్డులతో నుంచో బెట్టగా ఇక పాద యాత్ర రైతులు ఏ మాత్రం తగ్గ కుండా  జై అమరావతి నినాదాలతో అయితంపూ డి  గ్రామము దాటుకుంటూ నడుస్తుండగా , ఇక నేను మెడలో పచ్చ కండువా తీసి వేసి , నిరసన కారు ల వద్దకు వెళ్ళి , మూడు రాజధానులు ఎక్కడ ? వాటి  పేర్లేంటి అని అమాయకంగా ఓ ఏడెనిమిది ఆడ _ మగ లను ప్రశ్నించగా ఒక్కళ్ళు కూడా తిన్నమైన సమాధానము చెప్పిన పాపాన పోలేదు! .... ఇదీ దగా కో రులు  , దోపిడీ దారులు అజ్ఞానపు ప్రజలతో , కుటిల మేధావులు , అభివృద్ది నిరోధ కు లయిన ఐ వై ఆర్, ఉండవల్లి , తె లకపల్లి ఇంకా మరి కొంత మంది బోకు సన్నాసులు , విశ్లేషకు ల తో ఆంధ్ర ప్రజానీకాన్ని కుల, మత, ప్రాంతీయ చిచ్చు లతో ముడులు వేస్తూ న్న నేపథ్యంలో , ఇక పాద యాత్ర ఏలేటి పాడు , గొల్ల గుంట గ్రామాల మీదుగా  మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన ఇరగవరం గ్రామము చే రుతుండగా  ఇక మరలా వరుణ దేముడు ఓ దు లుపు  దులిపేయగా  ఇక  భోజన ప్రాంగణము కు చేరి , అలానే నుంచుని తలా ముద్ద  తింటుండగా , ఇక  నేను ఓ ఇద్దరు ముగ్గురు రైతులతో ఆ మాట _ ఈ మాట కలుపగా  ఓ పెద్దాయన నా పేరు ఇరగవరపు ప్రభాకర్ , బ్రాహ్మ ల ము , ,రిటైర్డ్ వి ఆర్ వో ని , ఇక్కడ ప్రధాన సామాజిక వర్గం శెట్టి బలిజ, ఎస్ సి లు ......కాపులు , బ్రా హ్మలు  కూడా వున్నారు  ..మా ఇంటి పేరుతోనే  ఈ వూరు పేరు ఏర్పడింది , టి డి పి, వై సీ పీ లు రెండు వైపులా వున్నారు ...ఇక్కడ డబ్బు ప్రభావము ఎక్కువ అని చెబుతుం డ గా , మరో రైతు మాట్లాడుతూ నా పేరు కాగితి శ్రీనివాస రావు , గౌడ్లము , ఎ నభై సెంట్లు సొంత పొలము వుంది, కల్లు గీత కూడా చేస్తుంటాను , ఇక్కడ మేము , శెట్టి బలిజ ల ము ఎక్కువ గా టీ డి పి , ఎస్ సి లు 75 శాతము వై సీ పీ , 25 శాతం టి డి పి , బ్రాహ్మలు మొదటినుంచీ కాంగ్రెస్స్ ,ఇపుడు వై సీ పీ, కాపులు మొదటి నుంచి కాంగ్రెస్స్ , తరువాత వై సీ పీ. , ఇపుడు జన సేన అంటున్నారు అని చెప్పగా , మరో వ్యక్తి మాట్లాడుతూ నా పేరు ఆశ పూ సత్యన్నారాయణ , దే వాంగులము , వేల్పూరు గ్రామము , ఈ వూర్లో కమ్మ , కన్నె బత్తుల , ( లింగ బలిజ ) , పద్మ సాలీలు ,శెట్టి బలిజ లు వున్నారు అసలు బి సీ లు మొదటినుంచీ టీ డి పీ నే , కానీ మొన్న ఒక్క ఛాన్స్ దెబ్బతో మొత్తము చెదిరి పోయింది ....ఇపుడిపుడే సరి అవుతాంది .... ఈ సారి ఆరుమిల్లి గెలుపు ఖా యము  ...ఇపుడు అంతా ఆయన చేసి న అభివృద్ది పనులు గురించి మాట్లాడుకుంటున్నారు అని చెబుతుండగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై ఎ ర్రా యి చెరువు , మహ లక్ష్మి చెరువు గ్రామాల మీదుగా నడిచి ఇక వేల్పూరు గ్రామము చేరుకోగా అక్కడి గ్రామస్తులు ఆరుమిళ్లి రాధా కృష్ణ కు , పితాని సత్యనారాయణ, మంతెన రామ రాజు తదితర నాయకుల కు అపూర్వ స్వాగతం పలికి గ్రామములో కి జై అమరావతి నినాదాలతో తోడ్కొని వెళ్లగా ఇక ఈ రోజు పాద యాత్ర విజయ వంతంగా ముగించి విడిది బసకు చేరుకుంది .                          జై  అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !!       జి వి రామ్ ప్రసాద్, వేల్పూరు ,          11 _ 10 _ 2022 , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 12/10/2022
👉రోజు:- బుధవారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:-  వేల్పూరు.(తణుకు).
👉భోజనవిరామం : పైడిపర్రు.
👉ముగింపు ప్రాంతం: ఉండ్రాజవరం (నిడదవోలు).
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

12/10/22

మాట ఇచ్చాడు ...మడమ తి ప్పాడు !                              ఈ రోజు ఉదయం వేల్పూరు గ్రామము లో దైవ రధము ముందు శ్రీ ఆరిమిల్లి రాధా కృష్ణ దంపతులు , జే ఏ సి నాయకులు , రైతు నాయకులు , రైతు మహిళలు పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా వేల్పూరు గ్రామ వీధుల వెంబడి  పాద యాత్ర నడుస్తూ , గామ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ పాద యాత్ర పొడవును గ్రామములో నే  కి . మీ  కి పైగా పెంచి జై అమరావతి నినాదాలతో మండ పాక గ్రామము చేరుకుని ఆ గ్రామస్తుల అపూర్వ స్వాగతం లు అందుకొని , వారు కూడా పాద యాత్ర లో కలిసి ఎర్ర నీళ్ళ గుంట గ్రామము చేరుకొని అక్కడ జన సేన కార్యకర్తల, గ్రామస్తుల అపూర్వ స్వాగతం లు అందుకొని జై అమరావతి నినాదాలతో మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన పైడిపర్రు   చేరుకోగా , ఇక రైతులు భోజ నాదికాలు గావిస్తుం డ గా  ...ఇక నేను రైతులతో ఆ మాట .. ఈ మాట కలపగా  ... ఓ రైతు మాట్లాడుతూ ...సార్ ... నా పేరు కడ లి  త్రిమూర్తులు , 35 సం.లు , 7 ఎకరాల మాగాణి భూమి నీ మా వూరు ఎర్ర నీళ్ళ గుంట లో   కౌ లు  చేస్తున్నాను , శెట్టి బలిజ ల ము , మేము మొదటి నుంచి టి డి పి నే, అయితే మొన్నటి ఎన్నికల్లో కొంత మంది దారి తప్పారు ...అయితే ఇపుడు మొత్తము దారిలోకి వస్తున్నారు అని చెబుతుండగా, మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు గన్ని సీతా రామయ్య, 40 సం.లు , కమ్మ కులము , తణుకు,  10 వ వార్డు , డ్రైవర్ గా పని చేస్తున్నా,.  ఆస్తి ఏమి లేదు , రైతులపై అభిమానము తో వచ్చాను అని చెబుతుండగా ఇక మరో వ్యక్తి మాట్లాడుతూ నా పేరు నరసింహ దేవర వెంకట శాస్త్రి , బ్రాహ్మ ల ము , వెలగ దు ర్రు గ్రామము ,  30 సెంట్లు భూమి వున్నది, మేత గడ్డి పెంచుతున్నా ను , ఒక ఆవు , దూడ వున్నా యి , మేము మొదటి నుంచి టి డి పి నే, మా ఆవిడకు జబ్బు చేస్తే శ్రీ బూరుగు పల్లి శే షా రావు గారు సి.ఎమ్ ఫండ్ నుంచి రెండు లక్షలు ఇప్పించి నన్ను ఆదు కున్నారు అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు జోగి వెంకటేష్ , శెట్టి బలిజ ల ము , మూడున్నర ఎకరాలు కౌ లు చేస్తున్నాను   ... అమరావతి  రైతుల కోసం వచ్చాను అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు నెర్ల సత్యన్నారాయణ , వురదాల్ల పాళెము , కాపుల ము, మూడు ఎకరాలు కౌలు చేస్తున్నాను , పె ద్దాల్ల మంతా టి డి పి, కుర్రాళ్ళు జన సేన అంటున్నారు అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు వడ్లమూడి సాంబయ్య , ఇంకొల్లు గ్రామము , యాదవుల ము , అయిదు ఎకరాలు పొలము వుంది, అమరావతి రైతుల కోసం ఇరవై మంది మి వాహ నాల్లో వచ్చాము అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు కేలి భూషణము , 46 సం.లు , కంచుమర్రు గ్రామము , దళితుల ము , 6 ఎకరాలు కౌలు చేస్తున్నాను , 50 మందిమి వచ్చాము , నేను మొదటి నుంచి టి డి పి నే , ఈ రోజు నా వెంట వై సీ పీ కి ఓట్లు వేసిన వాళ్లు కూడా వచ్చారు, మా దళితుల నిధు లన్ని అందరికీ  పంచేస్తున్నాడు ....మా దళితుల్లో చాలా మార్పు వస్తోంది , అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు చల్లా వెంకట రమణ , కాపుల ము , అత్తిలి , కూర గాయల  వ్యాపారం చేస్తుంటాను , 40 సెంట్లు భూమి వుంటే అమ్మాయికి  ఇచ్చేశాను , నేను మొదటి నుంచి టి డి పి నే , ప్రజా రాజ్యం లో కి కూడా పోలేదు , ఇపుడు కుర్రాళ్ళు జన సేన అంటున్నారు, ఏమైనా అభివృద్ది కావాలంటే చంద్ర బాబు ని సమర్థించా లి అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు గారపాటి వెంకట సుబ్బారావు , 59 సం.లు , బల్లిపాడు గ్రామము , కాపులం,  3 ఎకరాలు పొలము వుంది, మెడికల్ షాప్ రన్ చేస్తున్నాను , నేను మొదటి నుంచి టి డి పి నే , ఇపుడు దళితుల్లో  కూడా చాలా మార్పు వస్తోంది, ఈ రోజు 50 మందిమి వచ్చాము, వాళ్ళల్లో దళితులు కూడా వున్నారు అని చెబుతుండగా ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమ వగా , ఇక తణుకు జన సేన నాయకులు శ్రీ విడి వాడ  రామ చంద్ర నాయుడు నాయకత్వములో  పెద్ద ఎత్తున రైతులు వచ్చి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను నడిపిస్తూ ఉండగా ,ఇక  చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి రైతులు వందలాది ట్రాక్టర్ ల తో రాగా , ఇక నాయకులు శ్రీయుతు లు  గన్ని వీరాంజ నేయు లు ,  పితాని సత్యనారాయణ, జవహర్ , బూరుగు పల్లి శే షా రావు , శ్రీమతి పీతల సుజాత మరియు వందల , వేలాది పుర ప్రజలు పాద యాత్ర లో కలిసి మెయిన్ రోడ్డు మీదుగా జై అమరావతి నినాదాలతో నడుస్తుండగా ఇక కోర్టు భవ నాల సముదాయము చేరు కొగా నే ఆల్ ఇండియా లాయర్స్ అసోసియేషన్  న్యాయ వాదులు శ్రీ ఎ లిచేటి  గోవింద రావు నాయ కత్వములో  పాద యాత్ర రైతులకు అపూర్వ స్వాగతం పలుకగా , ఇక పాద యాత్ర నరేంద్ర సెంటర్ కు చేర గానే  అక్కడ మంత్రి శ్రీ కె నాగేశ్వర రావు ప్రోద్బలంతో కొంత మంది కిరాయి గాళ్లతో   ఉదయము నుంచి పాద యాత్ర ను అడ్డుకునే ప్రయత్నం చేస్తూ న్న నేపథ్యంలో ఇక పాద యాత్ర రైతులు  వూదితే  కొట్టుకు పోయే వాతా వరణం కనపడగా ఇక కిరాయి గాళ్ళు పే డి ముఖాలతో నిల్చోగా ఇక పాద యాత్ర మెయిన్ రోడ్డు నుండి  వుండ్రాజ వరము రోడ్ కి తిరిగి పుర వీధుల్లో ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని పాలంగి  కి చేరగానే శ్రీ బూరుగు పల్లి శే షా రావు నాయకత్వము లో వేలాది మంది వుంద్రాజ వరము రైతులు స్వాగతము పలికి, రైతు మహిళలు పూజలు దైవ రధము ముందు అడుగడుగునా నిర్వహించి గ్రామములో కి తోడ్కొని వెళ్లగా ఇక అప్పటికే సమయము దాదాపు ఎనిమిది గంటలు కాగా ఇక పాద యాత్ర రైతులు జై అమరావతి నినాదాలతో విజయ వంతంగా ఈ రోజు పాద యాత్ర ను ముగించి రాత్రి విడిది బస కు చేరుకున్నా రు .                       జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !   !                 జి. వి. రామ్ ప్రసాద్,   వుండ్రాజవరము , 12 _ 10 _ 2022 ,

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 13/10/2022
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు.
👉ప్రారంభ ప్రాంతం:-  ఉండ్రాజవరం.(నిడదవోలు).
👉భోజనవిరామం : వేలివెన్ను 
👉ముగింపు ప్రాంతం: మునిపల్లె (నిడదవోలు).
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

13/10/22

ధర్మము వెంటే గ్రామీణులు ....!                                ధర్మము లేని రాజ కీయ ము మహా పాప మన్నాడు మోహన్ దాస్ కరంచంద్ గాంధీ ....అపారమైన బలమున్నా ధర్మము లేక ఓడి పోయాడు కురు క్షేత్ర మహా సంగ్రామంలో దుర్యోధనుడు ...( అపుడు ఆంధ్రులు ఇప్పటి లాగానే కౌరవుల పక్షాన నిలిచారు )  ...                        ఇక ఈ రోజు మహా  పాద యాత్ర వుండ్రాజవరములో  దైవ రధము ముందు గ్రామ పెద్దలు శ్రీ గన్నమని సుబ్రమణ్యం , జే ఏ సి నాయకులు , రైతు నాయకులు, రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోయే సమయములో అప్పటికే సమీప గ్రామాలయిన తాడి పర్రు, తీపర్రు , వెలగ దుర్రు , చివటం, చిలక పాడు , మోర్త , దమ్మెన్ను , వే లివెన్ను  ,  కాల్దరి మొద లగు గ్రామాల నుంచి రైతులు వుండ్రాజవరమునకు చేరుకోగా , ఎన్ని వందల వేల మంది వచ్చినా లేదనే ప్రసక్తి లేకుండా టిఫిన్  ఏర్పాట్లు గావించిన ఉండ్రాజ వరము గ్రామస్థులు , అసలు మొత్తము వూరు వూరంతా ఇళ్ల బయిటకు వచ్చి అమరావతి రైతు మహా పాద యాత్ర ను తిలకించి పూల వర్షం కురిపించ టా నికి   సమాయత్తమైన తరుణంలో పాద యాత్ర జై అమరావతి నినాదాలతో గ్రామ ము గుండా నడుస్తుంటే ... ఆ  గ్రామీణ రై తుల స్పందన .ఆ దృశ్యం ...  దేవతలు సైతము కిందకు దిగి పూల వర్షం కురిపించిన వేళ ....ధర్మము జేజేలు అందుకుంటూ పాద యాత్ర ముందుకు సాగి , మొర్త, ధమ్మెన్ను గ్రామాల మీదుగా న డుస్తూ  పూల వర్షాలతో , జై అమరావతి నినాదాలతో స్వాగతము లు అందుకొని ఇక మధ్యాహ్నము భోజన ఏర్పాటు చేసిన వేలి వెన్ను గ్రామము చేరగా ...ఇక అక్కడ కనీ ..వినీ ఎరుగని రీతిలో పక్కాగా భోజనశాల , విరామ టెంట్లు అమర్చిన తీరు న భూతో న భవిష్య టి రీ తిలో   వుండగా ...ఇక రైతులు భోజనాది కా లు గావించు చుండగా .... ఇక నేను రైతులతో ఆ మాట .. ఈ మాట కలపగా .... ఓ రైతు మాట్లాడుతూ . . సార్ ... నా పేరు కనికెళ్ళ చిన్నా ..రావుల పాలెం గ్రామము ,నిడ ద వొలు నియోజక వర్గం , దళితు డిని , ఒక ఎ కరము సొంతము , మూడు ఎకరాలు కౌ లు చేస్తున్నాను, ఈ రోజు రైతు లకు మద్దతుగా   30 మందిమి వ చ్చినా ము, అన్ని కులాల వారము వున్నాము , మా గ్రామములో   కాపులు ఎక్కువ  80 శాతం జనసేన , ఇక మిగి లిన వారు  టి డి పి, వై సీ పీ ల కు మద్దతు గా వుంటారు అని చెబుతుండగా ఇక మరో  యువకుడు మాట్లాడుతూ నా పేరు వీ రవల్లి  యువ రాజు , Fhar Med  Ltd  కంపెనీ లో  మెడికల్ రిప్రజెన్ టేటి వ్ గా పని చేస్తున్నా  , శెట్టి బలిజ లము, ముక్కామల గ్రామము , నిడద వోలు నియోజక వర్గం , అనేక ప్రాంతాల లో తిరుగుతున్నా , ...ఎట్లా వచ్చాడో అట్లాగే పోతాడు ....ఈ జిల్లాలో మొత్తము టీ డి పి స్వీప్ చేస్తుంది ...అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు  దాసం బాపన్న నాయుడు , కానూరు అగ్రహారం మా వూరు, ఎమ్ ఎస్ సి డబుల్ గ్రాడ్యుయేట్ ని , మాథ్స్ , కంప్యూటర్స్ ,  కాపులము , మా వూరు లో పౌల్ట్రీ , వ్యవసాయము చేస్తున్న ,  44 సం.లు , అసలు రాజధాని విషయము ఆల్ రెడీ అమరావతి గా  నిర్ధారణ అయింది, ఇపుడు మళ్లీ మూడు రాజధానుల మాటేమిటి ?   వై జాగ్ రక్షణ రంగానికి , ప్రైవేట్ పరిశ్రమ ల కు మాత్రమే అనుకూలము , నీటి కొరత , వాతా వరణ ప్రతి కులాంశాలు కూడా వున్నాయి , అరాజక దోపిడీ రాజకీయ వ్యవస్థను ఆ శాంతి యుత నగరానికి తరలిం చ రాదు ... అసలు ఇతను మళ్లీ వస్టే ఆంద్రా వాళ్లు వేరే రాష్ట్రాలకు పోవాల్సిందే ... తెలంగాణ కూడా అధ్వాన్న మయ్యే పరిస్థితులు వస్తున్నాయి ...ఆంద్రా వాళ్లు అక్కడకు వెళ్లి నా భవిష్యత్ లేదు అని ఖరా ఖండీ గా చెబుతుంటే  ఇక మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు చీలి సతీష్ ,  32 సం.లు , దళితుడిని , వే లివెన్ను గ్రామము , ఆటో తోలు తున్టాను  ..రోజు కి 300 లు అద్దె చెల్లించాలి , మొన్న వై సీ పీ కి ఓటు వేసాను ..ఇపుడు రెండు చెంపలు రోజు వాయించు కుంటు న్నాను  . ఈ రోజు నా అంతట నేనే పాద యాత్ర రైతులకు మద్దతు గా వచ్చా ను అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు నంబూరి రామ భద్రం రాజు , పెండ్యాల గ్రామము , 64 సం.లు , రిటైర్డ్ ఎస్ బి ఐ ఉద్యోగిని , మా వూరు లో రాజులు ,కాపులు గౌడ్లూ వున్నారు , రాజులు సగము టి డి పి, సగము వై సీ పీ , గౌడ్ ల లో ఎక్కువ టీ డి పి, కాపులలో 80 శాతం జనసేన, మిగతా వి టీ డి పి, వై సీ పీ ...అని చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ నా పేరు సి.హెచ్ కాశీ విశ్వ నాధ రాజు, కమ్మ , పురుషోత్తం పల్లె మా వూరు, 8 ఎకరాలు పొలము వుంది, మొదటి నుంచి మా వూరు టి డి పి నే, కానీ 2019 లో దాదాపు సగము మంది  కమ్మలు వై సీ పీ కి ఓట్లు వేశారు, బీ సీ లు చీలా రు గానీ వాళ్లు ఎక్కువ మంది టి డి పి నే , ఎస్ సి లలో వై సీ పీ నే ఎక్కువ అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు ధూళి పాళ్ళ రవి తేజ , 25 సం.లు , సాప్ట్ వేర్ ఇంజినీర్ నీ , 60 వేలు జీతము , బి సి ని, మేదరలము,  వేలి వెన్ను గ్రామము  ఈ ఊరిలో మా నాలుగు  కుటుంబాలు టీ డి పీ నే , ఈ రోజు పాద యాత్ర రైతులకు మద్దతు గా ఫ్లెక్సీ లు కూడా కట్టించాను అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు ముదునూరి సత్యన్నారాయణ రాజు , రాజుల ము ,   డ్రైవర్ గా శ్రీ బూరుగు పల్లి శే షా రావు గారీ అన్నయ్య వద్ద పని చేస్తున్నా , వేలి వెన్ను మా వూరు , మేము టీ డి పీ నే , కానీ ఈ ఊరిలో టి డి పీ , వై సీ పీ లు సమాన బలముగా వుంటాయి అని చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ నా పేరు బలుసు వెంకటేశ్వర రావు ,50 సం.లు , కోరు మామిడి మా వూరు, కమ్మ , మా వూరు ఎన్ టి ఆర్ పార్టీ పెట్టిన నుంచి టి డి పి నే , కానీ మొన్న 2019 లో ముఠా తగాదాలు వచ్చి 40 శాతం జగన్కు మద్దతు గా ఓటు వేశారు ... బి సి ల లో కూడా కొంత చీలిక వచ్చింది , ఇపుడు అందరి లోను మార్పు వస్తోంది కానీ బయట పడటం లేదు అని చెబుతుండగా ఇక మరో రైతు మాట్లాడుతూ నా పేరు రాగు లక్ష్మి నారాయణ , తాటిపర్రు గ్రామము , కాపుల ము, అర ఎకరం భూమి వున్నది, నాలుగు ఎకరాలు కౌలు చేస్తున్నాను , కమ్మలు, కాపులు, గౌడ్ లు ఎక్కువ మొత్తం మీద టీ డి పీ నే ఎక్కువ అని చెబుతుండగా ఇక పాద యాత్ర భోజన విరామ ము అనంతరము తిరిగి ప్రారంభమై కొంత దూరము సాగి నాక మళ్ళీ వరుణ దేవుడు  పాద యాత్ర రైతులను వళ్ళంతా తడిపి ముంచి లేప గా ఇక అలానే వానలో  కిందా మీదా పడతా లెగుస్తు, జై అమరావతి నినాదాలతో  పాద యాత్ర ను కొనసాగించి నడ కుద ట  ప ల్లి గ్రామము దాటుకుని కానూరు గ్రామము చేరుకొని ఆ గ్రామ సర్పంచ్ శ్రీ బూరుగు పల్లి శ్రీనివాస రావు నాయకత్వములో బ్రహ్మాండమైన స్వాగతము లందు కొని  ఇక ఆ గ్రామములోని యావన్మంది ప్రజలు ఇళ్ళల్లో నుంచి బయటకు వచ్చి పూల వర్షం కురిపించి , దైవ రధము ముందు రైతు మహిళలు పూజలు నిర్వహించ గా ఇక పాద యాత్ర అక్కడి నుంచి మునిపల్లె కు చేరు కో గా ఇక ఈ రోజు పాద యాత్ర విజయ వంతంగా జై అమరావతి నినాదాలతో ముగించి విడి ది బసకు చేరుకుంది ... జై అమరావతి! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, ముని పల్లె , 13 _ 10_2022 , సెల్: 6281114344 .

Link to comment
Share on other sites

*అమరావతి మహాపాదయాత్ర వివరములు:*

👉తారీకు:- 14.10.2022

👉రోజు:- శుక్రవారం ఉదయం 08:30 గంటలకు.

👉ప్రారంభ ప్రాంతం:- మునిపల్లె (నిడదవోలు).

👉భోజనవిరామం : నిడదవోలు.

👉ముగింపు ప్రాంతం:    S.ముప్పవరం. (కొవ్వూరు).

 👉నడిచే కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

 

అమరావతి పాదయాత్ర రైతుల కు ఘన స్వాగతం పలికిన తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గం మునిపల్లి గ్రామ ప్రజలు ...

Image

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...