Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

25/09/22

ఈ రోజు అమరావతి రైతు మహా పాద యాత్ర 14 వ రోజు .రాత్రి విడిది చేసిన వి .కన్వెన్షన్ హాల్ , గుడివాడ నుండి యధావిధి గా దైవ రధము ముందు పూజల అనంతరం ప్రారంభమై జనార్ధన పురము గ్రామము చేరే సరికి అనేక మంది నాయకులతో , వివిధ గ్రామాల నుండి వచ్చిన అమరావతి అభిమానులతో కోలాహలంగా రూపు దిద్దుకున్న  పాద యాత్ర కు గ్రామ       ప్ర జl లు  స్వాగతము పలికి పూలు చల్లి , గ్రామస్తులంతా పోగు చేసి న 36  వేలు రూపాయలు విరాళం ఇచ్చి పాద యాత్ర లో పాల్గొనగా , ఇక పాద యాత్ర నంది వాడ గ్రామము చేర గానే ఆ గ్రామస్తుల  స్వాగతము లందుకొని , మథ్యాన్న భోజన వసతి ఏర్పాటు చేసిన తుమ్మల పల్లి గ్రామము చేరుకోగా , .....ఇక భోజానంతరం పాద యాత్ర తిరిగి ప్రారంభమై వెన్నన పూడి , పెద విరివాడ , రామా పురము , కుదరవల్లి గ్రామాల నుంచి పయనించి చివరకు పెద పాడు మండలము , కొనికి గ్రామము చేరే ముందు శ్రీ చింత మనే ని  ప్రభాకర్ , ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి , జై అమరావతి నినాదాలతో కొ నికి  గ్రామము లోకి తోడ్కొని పో గా ......ఇక కృష్ణా జిల్లా అంటే భూతల స్వర్గం అని అనేక కథనాలు కొన్ని దశాబ్దాలుగా నెలకొన్న నేపథ్యంలో . ...జనార్ధన పురము గ్రామము నుంచి కొ నికి  గ్రామము వరకు ... ఏదో కొద్ది చోట్ల మినహా  ...రోడ్ మొత్తము మోకాలు లోతు పూ టీ గోతులు ...అసలు ఈ రోడ్ ఎప్పటికీ బాగు పడుతుం దొ కూడా నర మానవుడికి తెలియని దౌర్భాగ్యం ...చిల్లర సవాళ్లు ,బజారు  రాజకీయాలు  మినహా ఎక్కడా కనపడని గ్రామీణ వికాసము . ..అన్నీ చెరువులు , రోడ్ల వెంట ముళ్ళ కంప తుమ్మలు ... అక్కడక్కడా జన సంచారము ...ఇక్కడ పరిస్థితి ఇలా ఉంటే ....సైబరాబాద్ ను నిర్మించిన  పెద్ద మనిషి ని ....బొచ్చు పీకావా ?    అంటూ ప్రేలాపనలు ......అందుకే కాబోలు .....majority is always not correct  అని 1977 లో జనతా పార్టీ విజయము పై ఆంధ్ర జ్యోతి దిన పత్రిక  సం పాద కీయములో  శ్రీ నండూరి రామమోహనరావు వ్యాఖ్యానించారు .... Democracy passes into despotism  అంటూ గ్రీక్ తత్వ వేత్త ప్లాటో ఏనాడో చెప్పాడు ....భవిష్యత్ లో రాజ ప్రతినిధులు ( ఈ నాటి సీ ఎం,ఎమ్ ఎల్ ఏ, ఎమ్ పి లు , ప్రభుత్వ ఉద్యోగులు ) ప్రజలను బుక్కా  పకీర్లను చేస్తారని అరిస్టాటిల్ ఏనాడో  చెప్పాడు .. .the blind lead the bilnd   it's the democratic way  అని హెన్రీ  మిల్లర్ చెప్పాడు ....ఇవన్నీ నేడు ఆంధ్రా లో జరుగుతున్న వి ...ఇక పోతే ఈ దిక్కు మాలిన రోడ్ల పై , ఉదయము నుంచి సాయంత్రము వరకు  మండు ఎండలో , పడతా , లె గుస్తూ  .... భూములు ఇచ్చి రోడ్డు న పడ్డ ఆ రైతు మహిళల ను చూస్తే గుండె తరుక్కు  పోవటము మినహా నాకు మరేమి కన పడుట లేదు ....అయినా సరే వంచక ,  దుర్మార్గాన్ని ఎది రిస్తాము అంటున్న సోదరి ల ఆకాంక్ష ఫలించి తీరే దాకా పోరాట ము ఆగదు .... ఎత్తిన జెండా దించేది లేదు  .....!  జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, కొని కి , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

  • Replies 196
  • Created
  • Last Reply

*అమరావతి మహాపాదయాత్ర 2.0 వివరములు:*

*తారీకు:* 26.09.2022 (15వ రోజు)

*రోజు:* సోమవారం 

*ఉదయం:* 08:30 గంటలకు 

*ప్రారంభ ప్రాంతం:* కొనికి (దెందులూరు)

*భోజన విరామం:* పెదపాడు

*ముగింపు ప్రాంతం:* కొత్తూరు(ఏలూరు)

*నడిచే  కిలోమీటర్లు:* 15 కిలోమీటర్లు (సుమారు)

Link to comment
Share on other sites

26/09/22
 

ఈ రోజు ఉదయం ఏలూరు జిల్లా, దెందులూరు నియోజక వర్గం,  కొ ని కి గ్రామములో , అమరావతి రైతు మహా పాద యాత్ర దైవ రధము ముందు శ్రీ బడేటి చంటి , పాలి ప్రసాద్, మాజి మంత్రి శ్రీ జవహర్ , మాజి ఎమ్ పి శ్రీ మాగంటి బాబు, శాసన సభ్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు ,మాజి శాసన సభ్యులు శ్రీ ముద్దర బోయిన వెంకటేశ్వర రావు ,జే ఏ సి నాయకులు, రైతులు , రైతు మహిళలు కొబ్బరి కాయలు కొట్టి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక శ్రీ చింతమనేని ప్రభాకర్ నాయకత్వములో ఆయన అనుచరులు భారీ ఎత్తున వివిధ గ్రామాల నుండి తరలి వస్తూ, పాద యాత్ర పొడవునా ఎక్కడికక్కడ కలుస్తూ పాద యాత్ర ను కడిమికుంట గ్రామము చేరే సరికి ఇక దెందులూరు నియోజక వర్గ పరిధి లో ని పెద వేగి , విజయ రాయి , పెద కడిమి, మోపర్రు ,  వట్లూరు , దుగ్గిరాల ,హనుమాన్ జంక్షన్ మొదలగు గ్రామాల నుంచి వచ్చి పడుతున్న చింతమనేని అభిమానులతో పాద యాత్ర పొడవు అలా అలా మూడు కిమి కి  పెరిగ గా, ఇక  ప్రజా స్పందన ను చూసి విశ్లేషకు ల ను ఆశ్చర్యము లో ముంచగా,  అమరావతి రైతులకు ఎనలేని సంతో షాన్ని కలిగి స్థూ జై అమరావతి నినాదాలతో  సత్య వోలు , నాయుడు గూడెం గ్రామాల  గుండా వెళ్ళి అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని  ,  పెదపాడు గ్రామస్థులు ఏర్పాటు చేసి, ఆతిథ్య మొసగిన భోజన ప్రాంగణము నకు  చేరగా, ఇక అనేక మంది దాతలు లక్షలు , వేలు , వంద లు సమర్పించి అమరావతి  రైతులకు ప్రాణానికి , ప్రాణం గా , వూపిరి లో ఊపిరిగా ,చావో రేవో కడ దాక అమరావతి  నిర్మితం అయ్యే వరకు అండగా వుంటామని అమరావతి రైతులకు భరోసా  చెప్పగా ,ఇక పాద యాత్ర తిరిగి 3 గం.లకు ప్రారంభమై శ్రీ చింతమ నేని , మాగంటి బాబు ల వేలాది అనుచరులతో జై అమరావతి నినాదాలతో సత్యన్నారాయణ పురము గ్రామ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని కొత్తూరు గ్రామం చేరుకుని ఈ రోజు పాద యాత్ర ను విజయవంతం గా ముగించింది      . .జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్,కొత్తూరు , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 28/09/2022
👉రోజు:-  బుధవారం ఉదయం 08:00 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- కొత్తూరు 
👉భోజనవిరామం : ASR స్టేడియం దగ్గర టోబాకో ఫంక్షన్ హాల్, ఏలూరు.
👉ముగింపు ప్రాంతం: కొవ్వలి (దెందులూరు).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

28/09/22

 

నిన్న పాద యాత్ర కు విరామము తదుపరి , నేడు కొత్తూరు నుండి ఉదయం 9 గం. లకు శ్రీ బడేటి చంటి, పాలకొల్లు శాసనసభ్యులు శ్రీ నిమ్మల రామా నాయుడు , జే ఏ సి నాయకులు, రైతులు, రైతు మహిళలు  యధా విధిగా దైవ రధము ముందు పూజలు గావించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ఇక కొత్తూరు నుండి అగ్రహారం వై ఎమ్ హెచ్ ఎ రోడ్  మీదుగా తండోప తండాలుగా వచ్చి పడుతున్న అమరావతి  అభిమానులను కలుపుకుంటూ , మెయిన్ రోడ్ మీదుగా ఓల్డ్ క్లబ్ రోడ్ కు వచ్చి అక్కడి నుంచి ఫ్లై ఓవర్ మీదుగా నడిచి గవర్నమెంట్ హాస్పిటల్ మీదుగా నడుస్తూ ఈ లోగా వివిధ పక్షాలైన  జనసే న,ఆమ్ ఆద్మీ పార్టీ, ఏలూరు జిల్లా సి పి ఎం  కార్య కర్తలు , ఇక మాజి మంత్రి శ్రీ మతి పీతల సుజాత , ముళ్ళపూడి బాపి రాజు , మాగంటి బాబు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి మండుటెండలో నడుస్తూ మధ్యాహ్నం భోజన వసతి ఏర్పాటు చేసిన టుబా కో మర్చం ట్స్ ఫంక్షన్ హాల్ కు చేరు కోగా ....ఇక నూ జి వీడు నియోజక వర్గం నుంచి వచ్చిన శ్రీ పి. గంగా ధర్ రూ అయిదు లక్షలు , శ్రీ చిట్టూ రి జానకి రామయ్య రూ యాభై వేలు ,  బెంగళూరు కు చెందిన శ్రీ ఎన్ శ్రీని వాసరావు లక్ష రూపాయలు , ముసునూరు మండలము కా ట్రే ని పాడు గ్రామస్థులు లక్షా పది హెడు వేలు , ఇంకా అనేక మంది దాతలు. తమ శక్తి కొలది విరా లాలిచ్చి  అమరావతి రైతులకు సంఘీ భావము తెలుపగా .  ...ఇక విరామ సమయంలో వివిధ గ్రామాల నుంచి వచ్చి న రైతులు పిచ్చాపాటి గా మాట్లాడుకుంటూ రైతులను ముంచిన అమరావతి ద్రోహులు నీచ మైన చావు  చస్తారని  మొత్తము పాపానికి ఫలితం అనుభవిస్తారు అని  ఏవేవో అనుకున్టు  డగా ....ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై కోమరోలు , పాలగూ డెం , మల్కాపురం  గ్రామాల మీదుగా వెళుతున్నప్పుడు ఆ గ్రామములోని బి. సీ లు , మల్కా. పురం గ్రామములో తూర్పు కాపు మహిళలు పెద్ద ఎత్తున తరలి వచ్చి బిందెలతో దైవ రధము ముందు నీళ్ళు పోస్తూ, పసుపు అద్ది, సాంబ్రాణి కడ్డీలు వెలిగించి  , టెంకాయలు కొట్టి ,హారతులు అద్ది , ఎంతో సంప్రదాయ పద్ధతిలో హృదయ పూర్వక స్వాగతము లివ్వగా , ఇక చింతమనేని ప్రభాకర్, మాగంటి బాబు ల నాయకత్వములో వారి అనుచరులు బ్రహ్మాండమైన స్వాగతము లి చ్చి  పాద యాత్ర కు నిం డు త నము  చేకూ ర్చ గా , ఇక పాద యాత్ర కు కొవ్వలి గ్రామం నుంచి  పెద్ద ఎత్తున రైతులు  ట్రాక్టర్ లు , ఎడ్ల బండ్లు కట్టుకుని వచ్చి గ్రామము లోకి తోడ్కొని పోతుండగా , ఇక దైవ రధము నకు  గ్రామ ఎంట్రన్స్ లో  పోక్లైన్ తో పెద్ద గజ మాలను  వేసి పాద యాత్ర ను గ్రామములో కి తీసుకెళ్లగా ,ఇక రైతు మహిళలు ఎక్కడి కక్కడ  దైవ రధము నకు సాంప్ర దాయ రీతిలో లో పూ జ లొ సగగా  , ఇక పాద యాత్ర జై అమరావతి నినాదాలతో రాత్రి బస కు విజయ వంతంగా చేరుకుంది ..జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! కొవ్వలి  , సెల్ 628111 4344

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 29/09/2022
👉రోజు:-  గురువారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- కొవ్వలి (దెందులూరు).
👉భోజనవిరామం : శ్రీ రామవరం 
👉ముగింపు ప్రాంతం: పెరుగుగూడెం   (దెందులూరు).
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

29/09/22


బులుగు బ్యాచ్ కు  గుండెలు ద డ పుట్టిస్తున్న                                                                                    అమరావతి రైతు మహా పాద యాత్ర ...!                                                  ఈ రోజు రాత్రి బస చేసిన కొవ్వలి గ్రామం నుండి ఉదయం 9 గం.లకు  గ్రామ పెద్దలు , శ్రీ బడేటి చంటి, మాగంటి బాబులు , జే ఏ సి నాయకులు, రైతులు , రైతు మహిళలు దైవ రధము ముందు పూజలు నిర్వహించి పాద యాత్ర ను ప్రారంభించే తరునాన  కొవ్వలి గ్రామస్తులు  ఎనిమిది  లక్షల ఇరవై అయిదు వేల రూపాయల విరాళాన్ని మాగంటి బాబు, చింతమనేని ప్రభాకర్ ల చేతుల మీదుగా రైతు నాయకులకు అందించగా , ఇక పాద యాత్ర జై అమరావతి నినాదాలతో  నడుస్తూ , ఆ గ్రామ కాపురస్తులు , నా మేన మామ అల్లుడు మాగంటి నాగ భూషణము _ సంధ్య లు రూ 70 లక్షలతో  నిర్మించిన శ్రీ వెంకటేశ్వర స్వామి  దేవాలయము చేరుకోగానే  ఆలయము ముందు శ్రీమతి సంధ్య , ఇతర రైతు మహిళలు కొబ్బరి కాయలు కొట్టి , జై అమరావతి నినాదాలతో రైతులకు మద్దతు తెలుపగా ,  .....ఇక పాద యాత్ర ముందుకు వెళుతున్న కొద్దీ చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి పెద్ద ఎత్తున  అమరావతి  అభిమానులు వందల సంఖ్యలో వచ్చి జే రుతూ    దెందులూరు వద్ద నేషనల్ హై వే అండ ర్    పాస్ చేరగానే  ఇక ఒకటే జన సంద్రం .  ....జన ప్రభంజనం ..... అపూర్వం...అమోఘం. ....తోలు కొచ్చిన కిరాయి  బాపతు కాదు .... ఎ క్కడ  దూక మం టే     ...అక్కడ దూకే     చింతమనేని సైన్యము ....it's a real fact ..... ఇక పాద యాత్ర దెందులూరు గ్రామము చేరుకోగానే ఆ గ్రామస్తులు అపూర్వ స్వాగతం పలుకగా , ఇక గ్రామ పెద్దలు శ్రీ మద్దిపాటి రామ మోహన రావు ,వారి కుటుంబ సభ్యులు రూ 7,50,000   / లు , దెందులూరు గ్రామస్తులు రూ నాలుగు లక్షలు రూపాయలు  పాద యాత్ర రైతులకు విరాళంగా  ఇచ్చి తమ సంఘీభావం తెలుపగా , ఇక పాద యాత్ర ముందుకు సాగి,  వచ్చి పడుతున్న దెందులూరు నియోజక వర్గ గ్రామాలైన విజయ రాయి , దుగ్గిరాల , పెదవేగి , పెద కడిమి , కొవ్వలి , చాటపర్రు , జాలిపూడి , రాజు పేట , హనుమాన్ జంక్షన్, వీరవల్లి , వేగివాడ , జానం పేట , జోగన్న పాలెం , గోపన్న పాలెం మొదలగు గ్రామాల నుంచి వచ్చి న రైతులతో భోజనశాల కిట కిట లాడుతు పండుగ వాతావరణం నెలకొల్ప గా ....ఇక భోజన విరామ సమయంలో భద్రాచలం దగ్గర ,గోదావరి పరివాహక ముంపు మండ లాల లో ఒక టై న    కుక్కునూరు మండలము , కుక్కునూరు గ్రామము నుండి 15 వెహికల్స్ లో వచ్చిన దాదాపు వంద మంది చింతమనేని అభిమాను లు  మాటా  మంతీగ  నాతో మాట్లాడుతూ ....బాబాయ్ ...ఇదంతా బాగానే ఉంది కానీ. ...అసలు తాడికొండ లో మీరు వాడిని గెలిపించ ట మేమిట ని    ( ఇదే ప్రశ్న నేను రోజు ఎదుర్కొంటున్నా ను ) ....ఇక నేను మీరు అలా అడిగితే నేనేమీ చెప్పాలి ....అసలు మీ కుక్కునూరు గ్రామము లో ఒకే రోజున , ఓకే సమయాన ఒక ప్రక్క చంద్ర బాబు కూచిపూడి డ్యాన్సు  .   మరో పక్క పక్కన జగన్ కట్  డ్రాయెర్ లతో బ్రేక్ డ్యాన్సు లు ఏర్పాటు చేస్తే మీ వూరి వాళ్లు ఏ డ్యాన్స్ చుస్తానికి పోతా రు అని ప్రశ్నించగా ....వారు ఒక్కసారిగా నవ్వగా .. ఇక నేను ....ఒక్క చాన్సెనగానే  కొందరు దారి తప్పారు , కొందరు మా వాడే , యువకుడు అని కుల గజ్జితో దారి తప్పారు , మరి   కొంత మంది స్థానిక ఎమ్ ఎల్ ఏ తో పొసగక దారి తప్పారు , మరి    కొంత మంది ఇల్లు కూడా కట్టుకున్నా , బాబు కన్నా స్పీడుగా క ట్టేస్తాను   అనగానే దారి తప్పారు , మరి  కొంత మంది బాబు పిసి నారి    , నేను  మరో రెండు వందల గజాలు ఎక్కువ ఇస్తాను అంటే ఆశ పోతులంతా  దారి తప్పారు. ..కర్ణుడు చావుకు వంద కారణాలు     ....మోస పోవటము మానవ నైజము    .   అన్ని తెలిసి నాక  మళ్ళీ తప్పు చేస్తామంటే ...ఇక ఎవడూ బాగు చేయ లే డు ... ఈ లోగా భోజన విరామ సమయం ముగి సి తిరిగి పాద యాత్ర కొనసాగి సమీప గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటు చల్ల చింతల పూడి గ్రామము చేరే సరికి వరుణ దేవుడు ఒక దులుపు దులిపి, ఇక ఆయన దోవన ఆయన పోగానే ఇక పాద యాత్ర మరలా కొనసాగి రాత్రి విడిది గ్రామమైన పెరుగు  గూ డేము న కు  జై అమరావతి నినాదాలతో  విజయ వంతంగా చేరుకుంది ....జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్ , పెరు గు  గూడెం    . సెల్ 628 11 1 4344  .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 30/09/2022
👉రోజు:-  శుక్రవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-పెరుగుగూడెం  (దెందులూరు).
👉భోజనవిరామం : తిమ్మాపురం 
👉ముగింపు ప్రాంతం: ద్వారకతిరుమల  (గోపాలపురం).
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

30/09/22


జఫ్ఫా ల   కు , పువ్వులకు  మతులు పోగుడుతున్న  పాద యాత్ర !                                                              పెరుగు గూడెం ఔటర్లో  రాత్రి బస చేసిన ప్రాంగణము లో దైవ రధము ముందు గ్రామ పెద్దలు , జే ఏ సి నాయకులు, రైతు , రైతు మహిళలు పూజలు నిర్వహించి న అనంతరము జై  అమరావతి నినాదాలతో  పాద యాత్ర ముందుకు సాగి  ,మెట్ట పంగిడి గూడెం చేరుకోగానే ....ఇక గోపాలపురం నియోజక వర్గ పెద్ద లు , నాయకులు శ్రీ జవహర్ , ముప్పిడి వెంకటేశ్వర రావు, శ్రీమతి పీతల సుజాత , ముళ్ళపూడి బాపిరాజు , మొడియం శ్రీనివాస్ తదితర నాయకులు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు స్వాగతం పలికి పాద యాత్ర ను పంగి డి గూడెం చే రే  సరికి  ...ఇక  గోపాలపురం నియోజక ర్గంలోని వివిధ గ్రామా లయిన జాజులు కుంట , రాజు పాలెం, మారంపల్లి , తిరణం పాలెం , వేములపల్లి , లక్కవరం ఇంకా అనేక గ్రామాల ప్రజలు తండోతండాలుగా త రలి మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన   తిమ్మాపురం చేరగానే ఇక ఒకటే జనము ....అంతా నిన్నటి లాగానే .... శ్రీ గన్ని వీరాంజ నేయులు , ద్వారక తిరుమల మాజి ప్రెసిడెంట్ శ్రీ  మ ల్లి పెద్ది వెంకటేశ్వర రావు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అమరావతి రైతులకు బాసటగా నిలువగా ....ఇక భోజన విరామ సమయంలో ....రైతులు పిచ్చా పాటీ గా మాట్లాడుకుంటూ ....అసలు లోకములో ఎవరి వా దా నికైనా   ' ధర్మము ' అనేది తల్లి లాంటి దనీ , ఎపుడైతే  దేవాలయము లాంటి అసెంబ్లీ లో జగన్ అమరావతి కి మద్దతు ఇచ్చాడో ,ఇక అప్పటినుంచి ధర్మ దేవత రైతుల వెంటే ఉండి  వారిని కాపాడు తుందని ....అసలు మా గ్రామాల్లో ఏ విషయాలకి ఒక పట్టాన కలసి రాని వారు కూడా ...ఇపుడు అమరావతి రైతులు, రైతు మహిళలు  ఆ వజాన ఎండలో పడి నడుస్తూ వస్తూంటే చలించి పోయి  విరాళాలు తమంత తాముగా సేకరిస్తూ వారి పక్షాన నిల బడటానికి  ముందుకు వస్తుంటే మాకే ఆశ్చర్యము కలుగు తోందని ఓల్డ్ టైమర్స్  విశ్లేషిస్తుం డ గా , ఇక ఎక్కడి కక్కడ యువకులు రైతు మహా పాద యాత్ర రూట్ మ్యాప్ విషయాలను సేకరించి వారి వారి గ్రామాలలో మీటింగు లు పెట్టుకుని , నిధులు సమీకరించుకొంటు ,పాద యాత్ర కు, వారి భోజన , వసతి ,అల్పాహార  ఖర్చులు భరించటానికి ,  ఘన స్వాగతం ఇవ్వటానికి సమాయత్తం అవు తూండగా ఇక వీరికి అన్ని రాజీయపార్టీలు ,జనసెన ,వామ పక్ష పార్టీలు కూడా మద్దతు  ఇస్తుం డ టంతో  జఫ్ఫాలకు , ఢిల్లీ పువ్వులకు మతులు చెడి , మేక పో తు గాంభీర్యం లు ప్రదశిస్తుండగా  , ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై తిమ్మాపురం గ్రామ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని ఆ తరువాత  చింతల పూడి మాజి ఎమ్ ఎల్ ఏ శ్రీ ఘంటా మురళి , జంగా రెడ్డి గూడెం న్యాయ వాదుల స్వాగతము లు అందుకొని   రాత్రి విడిది బస ఏర్పాటు చేసిన ద్వారక తిరుమల కు జై అమరావతి నినాదాలతో  రైతుల పాద యాత్ర విజయ వంతంగా చేరుకుంది. జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, ద్వారక తిరుమల, సెల్ 628111 4344 .

Link to comment
Share on other sites

రైతులు చేస్తున్న మహా పాదయాత్ర 2-10-2022 వ తారీఖున తిరిగి ప్రారంభమవుతుంది. ఎవరైనా రాజధాని మరియు పరిసర గ్రామాల నుంచి వచ్చే రైతులు, మహిళలు, రైతు కూలీలు ఎవరైనా మహాపాదయాత్రకు వచ్చేవారు ఉంటే  పాదయాత్ర 2-10-2022 ఉదయం 5 గంటలకు పెద్దపరిమి, తుళ్లూరు, వెలగపూడి, మందడం, వెంకటపాలెం, కృష్ణా పాలెం, ఎర్రబాలెం గ్రామాల నుంచి బస్సులు బయలుదేరును. మరల తిరిగి 4-10- 2022 సాయంత్రం 5 గంటలకు  రాజధాని గ్రామాలకు తిరిగి బయలుదేరును. కావున 3 రోజులను గమనించి పాదయాత్రకు వచ్చేవారు వారి యొక్క బట్టలు తదితర  వస్తువులు వెంట తెచ్చుకోవాల్సిందిగా కోరుచున్నాము. ఎవరైనా ఈ పాదయాత్రకు వచ్చేవారు వారి యొక్క వివరములు ఈ క్రింది నెంబర్లకు ఫోన్ చేసి తెలియజేయవలసిందిగా కోరుచున్నాము.
ఆలూరి శ్రీనివాసరావు గారు  9392131507.

కాటా అప్పారావు గారు 9948469548

 జై అమరావతి జై జై అమరావతి.
             ఇట్లు 
      పాదయాత్ర కమిటీ

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 02/10/2022
👉రోజు:-  ఆదివారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- ద్వారకతిరుమల   (గోపాలపురం).
👉భోజనవిరామం : అయ్యవరం 
👉ముగింపు ప్రాంతం: దూబచెర్ల  (గోపాలపురం).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

👆రాత్రిపూట బస కోసం మీ మీ గ్రామాల్లోని ఇళ్లలో ఏర్పాటు కోసం విన్నపం🙏

ప్రవాసాంధ్రులు సహకరించవలసిందిగా వేడుకోలు🙏

#Day29  అనగా అక్టోబర్11 వ తారీకు వరకు పశ్చిమగోదావరి జిల్లాలోనే  పాదయాత్ర పయనం  ఉంటుంది.

ఇది వర్షాకాలం, ఈ వర్షాకాలంలో వానలు, తుఫానులు సర్వసాధారణం. 

మనది గ్రామీణ వాతావరణం కావున అందుకు తగ్గట్టుగా మన గ్రామాల్లో పెద్ద పెద్ద మ్యారేజ్ హాల్స్ అయి ఉండవు. 

గ్రామాల్లో ఇటువంటి వసతులు లేకపోవటం వలన మన పాదయాత్ర చేస్తున్న రైతులు రాత్రిపూట బస కోసం చాలా కష్టపడుతున్నారు.

వచ్చేవాళ్ళు మన రైతులే కాబట్టి, మన గ్రామీణ రైతాంగమంతా అమరావతి రైతులను సోదర భావంతో ఆదరించి ఒక్క రాత్రిపూట బస చేస్తానికి మీ మీ ఇళ్లల్లో పదిమందికి వీలైతే 10 మందికి, 15 మందికి వీలైతే  15 మందికి బస ఇచ్చి ఆదరించమని అర్ధిస్తున్నాను వేడుకుంటున్నాను 🙏

మన గ్రామాలలో మన అమరావతి రైతన్నల కుటుంబాలకు రాత్రి పూట వసతి సదుపాయాలు ఇవ్వదలచిన వారు మీ ఊరి నిర్వాహకులకు తెలియచేయవలసినదిగా కోరుచున్నాము.

Link to comment
Share on other sites

02/10/22

ధర్మము వెంట నడుస్తున్న పల్లె జనాలు...  ..!                                   ఈ రోజు ఉదయం 9 గం.లకు  దైవ రధము ముందు గ్రామ పెద్దలు శ్రీ మల్లిపెద్ది వెంకటేశ్వర రావు , మాజి ఎమ్ పి శ్రీ మాగంటి బాబు, జె ఏ సీ నాయకులు , రైతులు ,  రైతు మహిళలు పూజలు నిర్వహించి కొబ్బరి కాయలు కొట్టి , జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా, ఇక పాద యాత్ర రైతులకు గత రెండు రోజులుగా ఉచిత వసతి , భోజన , అల్పాహార ము లన్నియు సమ కూర్చిన ద్వారకా తిరుమల గ్రామవాసులు , పరిసర గ్రామాల అమరావతి అభిమానులు  వందల ,వేల సంఖ్యలో వచ్చి పాద యాత్ర వెంట నడుస్తూ  ..ఇక పాద యాత్ర ఉగాది మండపము చేరుకోగానే పోలీసులు గ్రామములో కి అనుమతి లేదని అభ్యంతరము తెలిపిన ప్పటికి ...పాద యాత్ర చేసి తీరుతామని లోనికి ప్రవేశించి ,యాత్ర కొనసాగించి తిరిగి మెయిన్ రోడ్డు మీదుగా జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ,ఇక విజయవాడ నుండి హై కోర్టు న్యాయవాదులు శ్రీయుతులు డి. ఎస్.ఎన్ వి ప్రసాద్ , వాసిరెడ్డి ప్రభునాధ్ , రాఘవ రావు , ఎన్ శ్రీనివాస రావు, శ్రీమతి కే కమలా రాణి, గద్దె శ్రీ వాణీ  మరియు జంగా రెడ్డి గూడెం న్యాయ వాదులు  పలువురు వచ్చి పాద యాత్ర రైతుల కు సంఘీభావం తెలప గా , ఇక సమీప గ్రామాలు, చుట్టు పక్కల నియోజక వర్గాల గ్రామాలైన జి.కొత్తపల్లి , లక్కవరం , ఆడమిల్లి , కామవరపుకోట , రామన్న పాలెం, జీలకర్ర గూడెం, దొరసాని పాడు , తడికలపూ డి, వెంకట కృష్ణాపురం , బి.నర్సాపురం , నిమ్మలగుడెం , కొత్తపల్లి , అమ్మపా లెం, గట్టుపోతుల గూడెం, గురవాయి గూడెం, ఏలూరు, దెందులూరు , చింతలపూడి మొదలగు ప్రాంతాల నుంచి భారీ ఎత్తున అమరావతి అభిమానులు తరలివచ్చి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోతుండ గా  , ఇక జిల్లా నాయకులు ముళ్ళ పూడి బాపి రాజు, ఘంటా మురళి, ముప్పిడి వెంకటేశ్వర రావు, బొరగం శ్రీనివాస్ , , మొడియ ము శ్రీనివాస్  వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి రాగా , ఇక పాద యాత్ర రాళ్ల కుంట , తక్కెన్న గూడెం, అయ్యవరం గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని ,ఇక భోజన వసతి ఏర్పాటు చేసిన కొత్త గూడెం గ్రామానికి చేరుకోగా  .....ఇక భోజన విరామ సమయంలో నా పక్కనే కూర్చున్న  పెద్దాయన శ్రీ రఫి వుల్లా బే గ్  ( 82 ) ను నేను పరిచయము చేసుకొని ...సార్ .... ఈ వయసులో  మీరు పాద యాత్ర కు వచ్చారంటే  చాలా సంతోషము అని అనగానే ...ఇక ఆయన .....చూడు నానా ....నేను పుటక తో కాంగ్రెస్స్ వాడిని .., గతము లో వై ఎస్ ఆర్ పాద యాత్ర చేసినపుడు బూరుగు పూడి వద్ద అనారోగ్యము తో వై యస్ ఆర్ ఓ తోట లో అయిదు రోజులు విరామము గావించి నప్పటికీ ఆయన కుమారుడు కనీసము పరామర్శించ  టా నికి   రాలేదు .  ... ఆ తరువాత ... వై ఎస్ ఆర్  సీ ఎం  అయినాక ఇతను నా కుమారుడు అని ఏ ఒక్క కాంగ్రెస్స్ నాయకుడికి  ఆయన పరిచయం  లేదు ....ఇక ఆయన పోయి నాక   ఓదార్పు యాత్ర లు చేసిన  జగన్ ,తన హయాములో అనేక మంది పోగా ఒక్కరి నన్నా పరా మర్సించాడా ? ఇచ్చిన మాట అమరావతి విషయములో నిలుపుకున్నా డా ? ...మా ముస్లిమ్ లకు షా ది ముబారక్, షా ది తోఫా , రంజాన్ తో ఫా లాంటివి ఎత్తి వేసి , సవా లక్ష ఆంక్షలు పెడుతూ , ఇక ఒక రాష్ట్రానికి ఒక రాజధాని ఆవశ్యకత ను కూడా రూపు మాపు తున్నా డాంటే  .. ఇక మా ముస్లిమ్ లము ఎవరు చెప్పినా, ఆఖరకు ఓవైసీ గానీ ,ఆయన బాబు గానీ వచ్చి చెప్పినా ఈ వినాశకుడికి ఓటు వేయ రు అని ఆయన చెప్పగానే ...ఇక పక్కనే ఉన్న  ఓ రైతు ....సార్ ...మాది ఐ ఎస్  రా ఘ వా పురం ..., నా పేరు జీలుగుల సిద్దారావు , కాపు సామాజిక వర్గం వాడిని, మా పంచాయతీలో కాపు వారము ఎక్కువ ...తరువాత ఎస్.సి లు , మేము మొదటి నుంచి టి.డి.పి నే , కానీ మొన్న మొన్నటి ఎన్నికలలో చాలా మంది జగన్ కు ఓటు వేశారు .... ఈ సారి ఆ సీను లేదు ... మొత్తం సమయం కోసము చూస్తున్నారు ...నేను నాలుగు ఎకరాల రైతుని ...నిమ్మ , పామ్ ఆయిల్ తోటలు ....నిమ్మ కిలో ఆరు రూపాయలు పలుకు తోంది ... ఏ ర టా నికి    కూలి కూడా రాదు ...ఇక పామ్ ఆయిల్ టన్ను ఇరవై వే ల  నుంచి పన్నెండు వేలకు చేరింది ... జనము మొత్తము విసుగెత్తి పోయి వున్నారు ...అని ఆయన చెప్పగా నే  అయ్యవరం గ్రామానికి  చెందిన ముతరాసి సామాజిక వర్గం యువకులు అయిన  మణి ప్రకాష్ , తరుణ్ , దుర్గా రావు  లు   మాట్లాడుతూ ...సార్ ...మా గ్రామములో మా వాళ్ళే ఎక్కువ , ఈ రోజు పాద యాత్ర వారికి 60 వేలు పోగు చేసి భోజన ఖర్చులో కొంత ఇచ్చాము, మా వాళ్లంతా ఇపుడు ఇక్కడే వున్నారని  చెప్పగానే , ఇక పక్కనే కొత్త గూడెం గ్రామం నకు చెందిన భాను యాదవ్ , పవన్ తేజ్ యాదవ్ , నాని యాదవ్ మొదలగు యువకులంతా  ...మా గ్రామము లో యాదవ రాజు లము ఎక్కువ ...మొన్న అటు వైపు కొంత మంది పోయారు గానీ ఇపుడు మొత్తం అమరావతి  రైతుల వెంట వచ్చి పడ్డాము ....రైతులను  రైతుల ము ఆదుకో పోతే ఎట్లా సార్   అని చెపుతూ వుండగా ....ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై  దూ బ చర్ల గ్రామము ఎంట్రన్స్ చేరగానే ఆ గ్రామ ప్రెసిడెంట్ శ్రీ తాడి గడప బాలయ్య , తదితర గ్రామ పెద్దలు , గ్రామస్తులు విశేషముగా హాజరై  పూల వర్షం తో స్వాగతం పలికి , ఆపిల్స్ , కూల్ డ్రింక్స్ ఇచ్చి పాద యాత్ర ను గ్రామములో కి తీసు కెళ్లగా , ఇక రైతు మహిళలు ప్రతి ఇంటి ముందూ సాంప్రదాయ పద్ధతిలో బిందెలతో నీళ్ళు  గుమ్మరించి , హారతుల ద్ది , కొబ్బరి కాయలు కొట్టి జై అమరావతి నినాదాలు గావించగా ,  ఇక పాద యాత్ర విజయ వంతంగా జై అమరావతి నినాదాలతో విడిది బసకు చేరుకుంది ....జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, దూబ చర్ల , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 03/10/2022
👉రోజు:-  సోమవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- దూబచెర్ల  (గోపాలపురం).
👉భోజనవిరామం : నల్లజెర్ల 
👉ముగింపు ప్రాంతం: ప్రకాశరావుపాలెం  (గోపాలపురం).
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

03/10/22


ఏరువా కా  సాగారో  రన్నో  చిన్నన్న  ...        గోదావరి జిల్లా ల పల్లె పట్టుల గుండా సాగుతున్న  అమరావతి రైతు మహా పాద యాత్ర కు  ..                                  దశ ,దశాబ్దాలుగా  ఆంధ్ర రైతాంగ  ఇళ్ళూ _ వాకిళ్లను పాడి _ పంటలతో , పసిడి  పంటలతో , శ్రీ మహా  లక్ష్మి శోభలతో  విలసి ల్లేలా చేసిన  మన ఒంగోలు జాతి .... కోడె గిత్తలతో , ఆవు _ దూడలతో దైవ రధము నకు  తోడుగా వచ్చి చేరిన ఆ నంది దేవుళ్ళ మరో రధము వెంట రాగా . ...                       ఇక దూ బ చర్ల  గ్రామం లో ఈ రోజు ఉదయం 9 _ 30 గం.లకు స్థానిక గ్రామ పెద్దలు , జె ఏ సి నాయకులు, రైతు నాయకులు , రైతు మహిళలు పూజలు నిర్వహించి , కొబ్బరి కాయలు కొట్టి రైతు మహా పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ,      ....ఇక జిల్లా నాయకులు, అమరావతి అభిమానులు అయిన శ్రీ బడేటి చంటి, నిమ్మల రామా నాయుడు, బూరుగుపల్లి శే షా రావు , మాజి మంత్రి శ్రీ జవహర్ , ముళ్ళ పూడి బాపి రాజు తదితర హేమా  హేమీ లంత, తమ తమ అనుచర గణం ల తో పాద యాత్ర లో కలుస్తూ , పాద యాత్ర కు జవము _ జీవము పోస్తూ , జై అమరావతి నినాదాలు గావిస్తుండగా ఇక దెందులూరు నియోజక వర్గం నుండి శ్రీ చింతమ నేని ప్రభాకర్ ఆయన అనుచరులు పెద్ద ఎత్తున వచ్చి  అమరావతి రైతులకు మద్దతు గా పాద యాత్ర లో కద ము  , కదం కలపగా , ఇక చుట్టు ప్రక్కల గ్రామాల, నియోజక వర్గాల రైతాంగ యువకుల చేరికతో   ....పాద యాత్ర జైత్ర యాత్ర గా మారి.... దూ బ చర్ల నుండి పుల్లల పాడు వరకు మూడు కి. మీ ల  పాద యాత్ర జై అమరావతి నినాదాల ఘోష లతో ....అలా ..అలా  గంగా ప్రవాహం లా జాతీయ రహదారిపై ముందుకు సాగుతూ ....ఇక తండోప తండాలుగా సమీప గ్రామాలు , చుట్టు ప్రక్కల నియోజ క వర్గ గ్రామాలైన పుల్లల పాడు , ముసుల్ల కుంట , మారం పల్లి , రాజం పాలెం, చోడవరం, అనంటపల్లి , అచెన్న పాలెం, ఎర్న గూడెం, ప్రకాశరావు పాలెం, నబీ పేట , పోతవరం, చీపురు గూడెం, మద్దూరు, కవులూరు , దేవరపల్లి , దిప్పకాయల పాడు , కొయ్యల గూడెం , సింగ రాజు పాలెం ఇంకా అనేక గ్రామాల నుంచి రైతాంగ శ్రామిక జనాలు  పెద్ద ఎత్తున ట్రాక్టర్ ల తో , ఎడ్ల బండ్లతో  ఎక్కడికక్కడ అపూర్వ స్వాగతం లు ఇస్తూ ఇక పాద యాత్ర నల్ల జర్ల హై వే అండర్ పాస్ చేరగానే  ఇక అంతా జన సంద్రము, ...జన ప్రభంజనం ...రైతులకు కొబ్బరి బొండా లు కొట్టి ,కొబ్బరి నీళ్లు అంద చేసి  .    ....అమరావతి రైతుల పట్ల చూపిన   ..... ఆ ప్రేమ ... ఆ అభిమానాలు ....జన సేన , రైతాంగ సమాఖ్య కార్య కర్తలు చూపిన ప్రేమ ....నభూతో నభవిష్యతి  అన్న చందాన ఇక పాద యాత్ర నల్ల జర్లలో  మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన ప్రాంగణము నకు చేరగా ....ఇక భోజన విరామ సమయంలో నా పక్కనే వచ్చి కూర్చున్న  దేవిన కృష్ణా రావు అనే రైతు నాతో మాట మంతి కలిపి ,మాది అచ్చెన్న పాలెం, , మా వూళ్ళో అన్ని వర్గాల వారున్నారు ...అయితే కమ్మలు , కాపులు ఎగిరెగిరి వై సీ పీ కి ఓట్లు వేశారు ...ఇపుడు అందరూ ...చెంపలు ఎడా పెడా వాయించు కుంటు న్నారు అని చెప్పగా , ఇక చోడవరం గ్రామము నకు చెందిన మాధవ రావు అనే రైతు మాట్లాడుతూ  నేను కోలా ట బృందాలను నిర్వహిస్తూ వుంటానని , అనేక ప్రాంతాల లో తిరుగు తున్టానని   అన్ని చోట్లా వ్యతిరేకత వుందని అయినా వాళ్ళ బలాన్ని తక్కువ అంచనా వేయరా దని చెప్పగా , ఇక యాడాల రవి  యాదవ్ అనే యువకుడు మాట్లాడుతూ మాది నల్లజెర్ల అని, గతములో వై సీ పీ కి ఓటు వేశానని ఈ సారి వేసేది లేదని చెప్పగా ,ఇక మరో రైతు కడ లి  పెద్ద నాగ రాజు అనే ఆయన మాట్లాడుతూ , మాది దేవరపల్లి గ్రామము అని ,శెట్టి బలిజ సామా జిక వర్గ మనీ, నేను మా వాళ్లంతా చాలా మంది వై సీ పీ కి ఓట్లు వేశామ ని , ఇక అదే ఆఖరు అని చెప్పగా , ఇక మరో పెద్దాయన వచ్చి నా పక్కకు రాగానే , ఆయనకు ఓ కుర్చీ తెప్పించి కూర్చోబెట్టి .....బాబాయ్...ఇంత వయసులో  నువు ఎందుకు వచ్చావు ?  ...అని ప్రశ్నించగా .....నా పేరు యేలేటి అచ్చయ్య ...నా వయసు 88 సం.లు , గోపవరం గ్రామము , రెండెకరాల పొలం వుంది, ముగ్గురు ఆడ పిల్లలు, ఒక పిల్లాడు , 6 ఎకరాలు  కవులు కూడా చేస్తున్నాను ... రూ 37 వేలు ఎకరా కవులు , రెండు వరి పంటలు పండిస్తా ను ....80 _ 90 బస్తాలు పండీ స్తా.. .ధాన్యానికి రేటు లేదు ...కొంత మంది కి వీడు ఇంతవరకు డబ్బులు వేయ లేదు .....అసలు పెద్దగా మిగిలి చచ్చేది లేదు ...వీడు ఎప్పుడు పోతాడా అని వూరంతా ఎదురు చూస్తున్నారు ....కానీ బయట పడటం లేదు ...పాపం ...ఆ డ బిడ్డలు ...అలా ఎండలో నడుస్తూ వుంటే ...బాధ కలిగి ఈ రోజు పాద యాత్ర లో కి వచ్చాను  అని చెప్పగా ...ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై నల్ల జర్ల నుండి ప్రకాశ రావు పాలేముకు  చేరగానే అక్కడ రైతుల అపూర్వ స్వాగతం లు అందుకొని ఇక ఈ రోజు పాద యాత్ర ను విజ య వంతంగా ప్రకాశ రావు పాలె ము  లో ముగించి , విడి ది ఏర్పాటు  చేసిన  తాడే పల్లి గూడెంలో ని బసకు జై అమరావతి నినాదాలతో చేరింది .జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, తాడే పల్లి గూడెం , సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 04/10/2022
👉రోజు:-  మంగళవారం ఉదయం 08:00 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  ప్రకాశరావుపాలెం (గోపాలపురం).
👉భోజనవిరామం : తాడేపల్లిగూడెం 
👉ముగింపు ప్రాంతం: పెంటపాడు (తాడేపల్లిగూడెం)
 👉నడిచే  కిలోమీటర్లు:- 14kms. సుమారు.

Link to comment
Share on other sites

04/10/22

 

ఈ రోజు ఉదయం 9 గం.లకు దైవ రధము ముందు గ్రామ పెద్దలు , జె ఏ సి నాయకులు, రైతు నాయకులు, రైతు మహిళలు పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక తాడే పల్లి గూడెం టి.డి పి ఇంచార్జీ శ్రీ వల వల బాబ్జీ  , ఆయన అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాద యాత్ర లో కలవగా , ఇక పాద యాత్ర వెంకట రామన్న గూడెం కు చేరగానే , జన సేన నాయకులు , వందలాది కార్యకర్తలు  శ్రీ బోలిసెట్టీ శ్రీనివాస రావు నాయకత్వములో  జై అమరావతి నినాదాలతో పాద యాత్ర లో పాల్గొనగా , ఇక పాద యాత్ర వెల్ల మిల్లీ గ్రామము కు  చేరు తున్న సమయములో శ్రీ ముళ్ళ పూడి బాపి రాజు నాయ కత్వములో  పెద్ద ఎత్తున రైతులు,  రైతు కూలీలు , మహిళలు తరలి వచ్చి అమరావతి పాద యాత్ర లో పాల్గొనగా , ఇక పాద యాత్ర రామన్న పాలెం చేరుతున్న సమయములో.శ్రీ చింతమనేని ప్రభాకర్  వందాలది మంది యువకుల తో  వచ్చి పాద యాత్ర లో పాల్గొనగా , ఇక పాద యాత్ర పెద తాడే పల్లి గ్రామము చేరుకోగా నే , ఆ గ్రామ సర్పంచ్ శ్రీ పోతుల  అన్నవరం గౌడ్  నాయకత్వము లో వందలాది గ్రామస్తులు , రైతు మహిళలు పాద యాత్ర కు స్వాగతము పలికి పూల వర్షం కురిపించి , సాం ప్రదాయ రీతిలో దైవ రధము ముందు పూజలు నిర్వహించి పాద యాత్ర కు సంపూర్ణ మద్దతు తెలు పగా , సీ పీ ఎమ్  పార్టీ కార్య కర్తలు, భారతీయ కిసాన్ సంఘ్ కార్య కర్తలు పెద్ద ఎత్తున శ్రీ మేడసాని విజయ భాస్కర్ నాయకత్వములో  అమరావతి పాద యాత్ర రైతుల కు సంఘీభావం తెలిపి పాద యాత్ర ను జైత్ర యాత్ర చేయగా , ఇక సమీప గ్రామాలు అయిన చోడవరం, కొమ్ముగుడెం,  వీరం పాలె ము,  మెట్ట వుప్పర గూడెం, నీలాద్రి పురం, వెల్లమిల్లి , బాదం పూ డి, జగన్నాథ పురం, దూబచర్ల , పుల్లల పాడు , జంగా రెడ్డి గూడెం, తాటి చర్ల, గోపవరం గ్రామము  ల నుంచి అమరావతి అభిమానులు వందల సంఖ్యలో వచ్చి  పాద యాత్ర లో పాల్గొనగా ఇక తాడే పల్లి గూడెం లో ఏర్పాటు చేసిన మధ్యానం భోజన వసతి ప్రాంగణము చేరుకోగా .....                       ఇక భోజన విరామ సమయములో  నా పక్కనే కూర్చున్న కొంతమంది యువకులు నాతో మాట మంతి కలిపి  ....సార్ ...నాది తెలి క చర్ల గ్రామం, నా పేరు కారంకి సూరి బాబు , బి కామ్ చదివా , నాకు 15 ఎకరాల భూమి వున్నది, గౌడ సామాజిక వర్గం వాడిని....మీరెవరో నాకు తెలియదు .. .రోజు ఇక్కడా    ... అక్కడా అనేది లేకుండా అనేక మంది ని టచ్ చేస్తుంటా ...నా దగ్గర పని చేసే కూలీలతో సహా ....అన్ని వర్గాల లోను మార్పు వుంది .., ఎస్ సి ల్లోనూ వుంది .., వీడు మళ్లీ వస్తే బి.సి , ఎస్ సి లే నాశన మయ్యేది .., ఈ విషయం అందరూ గ్రహిస్తు న్నారు ., ఎదో ఒక్క ఛాన్స్ అన్నాడు. ..బోల్తా పడ్డారు .., ఇక సినిమా అయి పోయింది ..., అని చెబుతుండగా , రాజు యాదవ్ అనే మరో  యువకుడు మాట్లాడుతూ ..., సార్ ...మాది మెట్ట వుప్పర గూడెం .., మా గ్రామం అప్పటికి ... ఇప్పటికీ ఒకటే జెండా . . ఈ సారి  మొత్తము తుడిచి పెడతాము ..,అని చెబుతుండగా ...నా పక్కనే ఖాళీ గా వున్న కుర్చీల్లో మరో ముగ్గురు యువకులు వచ్చి కూర్చోగా ..., బాబూ ...అసలు మీకు అమరావతి రాజధానిగా ఇష్టమేనా ...అని ప్రశ్నించగా.     ..., అసలు  మూడు రాజ ధానుల మాటే మి టం డి ...రాష్ట్ర నడి బొడ్డు న , కృష్ణా నది ఒడ్డున, ఊరకనే భూములిచ్చిన చోట రాజ దాని కట్టడము ఇష్టము లేక పొతే ....నాలుగు జిల్లాలతో  వేరే రాష్ట్రము ఏర్పాటు చేసుకొని పులివెందులలో రాజ ధాని పెట్టుకో మనండి ... అంతే గానీ  ఈ చిచ్చు రాజ కీ యా లేమిటి  ? ...నా పేరు ఎ.వెంకటేశ్వర రావు , ఎంటెక్ , శశి ఇంజనీరింగ్ కాలేజీలో ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ లో ఫ్యాకల్టీ గా చేస్తున్న , ఎస్. సీ ని , అని చెబు తుండ గా , ఇక ప్రక్కనే ఉన్న మరో యువకుడు మాట్లాడుతూ నా పేరు ... సి.హెచ్ వసంత్ , అడ్వకేట్ ని, ఎస్. సీ ని, ఇక్కడ జనసేనతో పొత్తు వుంటే ఇంట్లో వుండి గెలుస్తాం, పొత్తు లేక పోయినా టి. డి పి ని గెలిపిస్తాం .., వల వల బాబ్జీ మంచి వ్యక్తి, నిబ్బరం కల వాడు , ఒక వేళ పొత్తు వుంటే జనసేనకు మా దళితులు ఎక్కువ మంది ఓటు వేయరు ...అని చెబుతుండగా మరో యువకుడు మాట్లాడుతూ ...నా పేరు గెడ్డాడ రాజు , దళితుడిని,  పెయింటింగ్ కాంట్రాక్టర్ ని, మా వర్కర్ల నోట్లో మొత్తం దుమ్ము కొట్టాడు .., , మా వాళ్లంతా సాయంత్రానికి ఓ క్వార్టర్ వేయందే నిదుర పోరు ....సన్నాసి మందు అమ్ముతున్నాడు .... ఈ సారి వాళ్ల చేతిలో ఖతం అయి పోతాడు ....అసలు ...రైతు మహిళలు ,రైతులు ఇలా రోడ్డున పడటం మేము ఇంతకు ముందు చూడ లేదు ...అని చెబుతుండగా  ...ఇక పాద యాత్ర మొదలై , అప్పటికే వచ్చి పడిన జిల్లా నాయకులు శ్రీ బడేటి చంటి, గన్ని వీ    రాంజ నెయులు , ఆరుమిల్లి రాధా కృష్ణ, బి జే పీ నాయకులు  ,  ఇక స్థానిక అమరావతి అభిమాన యువకులు . ..గూడెంలో కి వస్తున్నాము ...ఎవ రో స్తారో రండి ...అని ఒకటి కి నాలుగు సార్లు ఛాలెంజ్ చేసి ...పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా ...ఇక జన సేన నాయకులు శ్రీ  బోలి శెట్టి శ్రీనివాస రావు సరి కొత్త  బుల్లెట్  బండి ఎక్కి వందలాది కార్యకర్తల తో పట్టణము లో కి దూసుకు పోగా ఇక అదే స్పూర్తితో ఇతర నాయకులు కూడా పాద యాత్ర ను  తీసుకు పోతుంటే .  .ఇక టౌన్ లో తప్పుడు ఫ్లె క్సీ లు పెట్టిన ఎంగిలి మెతుకుల వాళ్లు  అడ్రస్ లేకుండా పోగా , ఇక జై అమరావతి నినాదాలతో  పట్టణ వీధుల గుండా అశేష  జన సందోహంతో రెండున్నర గంటల పాటు పాద యాత్ర జై అమరావతి నినాదాలతో నడిచి ,ఇక ఈ రోజు సాయంత్రం పాద యాత్ర విజయ వంతంగా విడి ది బసకు చేరింది ..జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 05/10/2022
👉రోజు:- బుధవారం ఉదయం 08:00 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  పెంటపాడు (తాడేపల్లిగూడెం).
👉భోజనవిరామం : వెలగపల్లి.
👉ముగింపు ప్రాంతం: సరిపల్లే (ఉంగుటూరు)
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

19 hours ago, Nfan from 1982 said:

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 05/10/2022
👉రోజు:- బుధవారం ఉదయం 08:00 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  పెంటపాడు (తాడేపల్లిగూడెం).
👉భోజనవిరామం : వెలగపల్లి.
👉ముగింపు ప్రాంతం: సరిపల్లే (ఉంగుటూరు)
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

🙏🙏

Link to comment
Share on other sites

05/10/22

 

అమరావతి రైతులకు  బ్రహ్మ రధము !              అసలు , లోకములో ఎవరు నోరు తెరచి  అన్యా యాన్ని ఎదురించ లేక మౌనముగా వుంటా రో  వారే తల్ల క్రిందులై దోషులవుతారు ....రవీంద్ర నాథ్ టాగోర్                                                  .మనకెందుకులే అనే స్త బ్ద త , జడత్వం, ఆంటీ ముట్టని మనస్తత్వాన్ని సంఘ్ఘ  విద్రోహులు ,దోపిడీ దారులు రాజ కీయ ముసుగు లో  దొరబడి కుల ,మత , ప్రాంతీయ చిచ్చు లను రేపి ఆంధ్ర లో అమలు పరుస్తూ రాజధానికి భూములిచ్చిన రైతుల ను బలి గావిస్తున్న అమరావతి హంతకుల అన్యా యాల్ని  ఆంధ్ర ప్రజానీకానికి  వివరిస్తూ జరుపుతున్న  అమరావతి రైతు మహా పాద యాత్ర కు ఆంధ్ర గ్రామీణ ప్రజానీకం  ఉవ్వెత్తున తరలి వస్తూ నేడు పెంటపాడు గ్రామము కు వచ్చి దైవ రధము ముందు  ,సనాతన స్వదేశ సేన సభ్యులతో , జే ఏ సి నాయకుల తో , రైతు మహిళలు, రైతుల తో కలిసి ప్రార్థనలు చేసి , కొబ్బరి కాయలు కొట్టి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక శ్రీయుతులు వల వల బాబ్జీ, మాగంటి బాబు తదితర నాయకులు వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి పాద యాత్ర ను ముందుకు తీసుకు వచ్చి కస్పా పెంట పాడు గ్రామము చేర గానే ఆ గ్రామస్తుల అపూర్వ స్వాగతంలు  పలుకగా, ఇక పాద యాత్ర రైతులు , మహిళలు స్థానిక వేణు గోపాల స్వామి ఆలయంలో పూజలు నిర్వహించి, 101 కల శాల లతో జమ్మి చెట్టూ ప్రదక్షిణలు చేసి , తాము ఫేక్ రైతుల ము కాదని , అసెంబ్లీ లో మాట ఇచ్చి, మడమ తిప్పి న వాళ్ళే ఫేక్ గాళ్ళు అని , వాళ్లు_ వారిని సమర్థించే అమరావతి హంతకులు మా వుసురు  తగిలి కుటుంబాలతో సహా సర్వ నాశనము అయి పోతా రు అని ,  ఏమయి నా సరే అన్యాయము పై చివరి కంటా పోరాడుతామని  ఆలయములో శ పథము చేసి   తిరిగి పాద యాత్ర లో కలిసి ముందుకు నడుస్తుండగా, ఇక  సి పి ఐ నాయకులు శ్రీ ముప్పాళ్ళ నాగేశ్వర రావు పెద్ద ఎత్తున కార్య కర్తల తో తరలి వచ్చి అమరావతి రైతులకు సంఘీ భావము తెలు పు తూ జై అమరావతి నినాదాలతో ముందుకు సాగగా ,ఇక పాద యాత్ర యానాల పల్లె , పరిమెళ్ళ , జల్లి కొమ్మెర  మొదలగు గ్రామాల ప్రజల స్వాగతము లు అందుకుంటూ , వెలగ పల్లె గ్రామములో ఏర్పాటు చేసిన మధ్యానం భోజన వసతి దగ్గరకు  చేరగా ...ఇక భోజన విరామ సమయంలో వెను వెంటనే వచ్చి పడిన వానతో , కొంచెము డిస్టర్బ్ అయి పోవగా , ఇక వాన అనంతరము తిరిగి పాద యాత్ర మొదలై ,ఇక  శ్రీ గన్ని వీరాన్ జ నేయు లు ,వారి మద్దతు దారులు ట్రాక్టర్ల తోను , వందలాది బైక్ ల పై వచ్చిన అమరావతి అభిమానులతో పాదయాత్రను గణ పవరము  పట్టణము గుండా అపూర్వ రీతి లో నడిపించి , బులు గు గణాల కు బెదురు పుట్టించి ,పాద యాత్ర ను సరిపల్లేకు చేర్చ గా , ఇక నేటి పాద యాత్ర వాన జల్లుల మధ్యలో నడిచి విజయ వంతంగా జై అమరావతి నినాదాలతో ముగించి ,విడి ది బసకు చేరింది .జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ ! జి వి రామ్ ప్రసాద్, గణప వరము , సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 06/10/2022
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  సరిపల్లే (ఉంగుటూరు).
👉భోజనవిరామం : పాములపర్రు 
👉ముగింపు ప్రాంతం: పెదమిరం(ఉండి)
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

12 hours ago, Nfan from 1982 said:

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 06/10/2022
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-  సరిపల్లే (ఉంగుటూరు).
👉భోజనవిరామం : పాములపర్రు 
👉ముగింపు ప్రాంతం: పెదమిరం(ఉండి)
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

ivanni oka pusthaka roopam lo mudrinchandi. 

Link to comment
Share on other sites

06/10/22


ఈ రోజు రైతు మహా పాద యాత్ర  సరి పల్లి గ్రామము నుండి ఉదయం 9 గం.లకు దైవ రధము ముందు జె ఏ సి నాయకులు, రైతులు, రైతు మహిళలు  యధావిధిగా పూజలు నిర్వహించి జై అమరావతి నినాదాలతో ముందుకు సాగగా ,  పాద యాత్ర ఆరేడు గ్రామము చేరు తుండ గా  ఉం డి ఎమ్ ఎల్ ఏ శ్రీ మంతెన రామ రాజు , ఎమ్ ఎల్ సి  శ్రీ స త్యన్నారా యణ రాజు పెద్ద ఎత్తున అనుచరులతో తరలి వచ్చి పాద యాత్ర  ముందు వుండి నడి పిస్తూ పాందువ , కోల మురు గ్రామాల మీదుగా వెళుతున్నప్పుడు వాన జల్లులు పెద్ద ఎత్తున పడుతు ,ఇబ్బంది  పెడుతున్న ప్ప టి కి  చుట్టు ప్రక్కల గ్రామాల నుంచి ప్రజలు తండోప తండాలుగా తరలి వచ్చి పాద యాత్ర కు నిండు త నము  తగ్గ నీ యకుం డా జై అమరావతి నినాదాలతో నడిపిస్తూ  , ఇక పాద యాత్ర మధ్యానం భోజన వసతి ఏర్పాటు చేసిన పాముల పర్రుకు చేరగా , ....ఇక ఏదో రైతు లతో పిచ్చాపాటి జరుపుతున్నప్పుడు ....సార్ ...మీరు అమరావతి రైతా అని ఒకరు నన్ను  ప్రశ్నించగా ....రైతు నే కానీ , అమరావతి రైతును కాను .... అయినా అమరావతి  నాకు _ మీ లాంటి సర్వ ఆంధ్రులకు  అవసరమైన ఓ గొప్ప సన్ రైజ్ కాపిటల్ ... ప్రాంతీయ ద్వే షు లైన నాగు పాముల కాట్ల తో విల _ విల లాడుతోంది ...    .. అసలు కొత్తగా ఏర్పాటైన రాష్ట్రానికి ఓ  రాజ ధాని అవసరము లేదా ? ఇపుడు చదువు కుంటున్న వేలాది , లక్ష లాదీ  విద్యార్థులు ఎక్కడి కి  పోయి ఉద్యోగాలు చేస్తారు ?  చెన్నై  లోనా ? బెంగళూరు లో నా ? హైదరాబాద్ లో నా ? ..అసలు జగనూ...చంద్ర బాబు లు ఇవ్వాళ వుంటారు ...రేపు పోతారు ...కానీ రాజధాని అనేది శాశ్వతము ,  సర్వాంద్రులకు అవసరం అయినది  ... అందరికీ అందు బాటులో వున్న చోట  రాజధాని నిర్మించ టా నికి  జగన్  కళ్ళల్లో నిప్పులు ఎందుకు పోసుకుంటున్నడు  ? పరి పాలన కావాలి ... పెత్తనం కావాలి ...రెవెన్యూ కావాలి ...కానీ రాజ థా ని మాత్రము ఇక్కడ ఉండ కూడదు ...ఇది పా లె గాండ్ర అజెండా ....వాల్లేసే ఎంగిలి మెతుకులు తింటున్న వాళ్లు  రాజధాని రైతులను  ఫేక్ అ నట మేమి టి ? అని కొంచెము ఆవేశంగా చెబుతున్నపుడు ... మరో రైతు అయిన యువకుడు  అందుకుని  ...సార్ నా పేరు రుద్రరాజు   యువరాజు ...భూములిచ్చిన రైతుల ను ఫేక్ అనే సన్నాసులు అసలు 151 మంది లో వాళ్లు గానీ , వాళ్ళ బాబు లు గానీ ప్రభుత్వానికి ఎప్పుడన్నా భూము లిచ్చారా ? అని చెబుతుండగా  మరో యువకుడు మాట్లాడుతూ  ...సార్ నేను లిక్కర్ గోడౌన్ లో గుమస్తాని , నా పేరు కోరాడ వెంకట రామా రావు, ఉం డి,  తూర్పు కాపుల ము ,  మేమూ రైతుల మే , ఈ రోజు ఇక్కడ కు వచ్చిన వారిని ఎవరూ పిలవటం గానీ , డబ్బు లు ఇవ్వట ము గానీ జరుగ లేదు ...మా వూళ్ళో తూర్పు కాపు లు , రాజులు , ఎస్ సి లు ఎక్కువ ... మాలో మొదటి నుంచి టి డి పి ఎక్కువ ... వై సీ పీ కొంచెమే , పవన్ అభిమానులు యువకులు  ఇపుడు కన పడుతున్నారు ...అయినా మళ్ళీ ఇక్కడ రామ రామ రాజు గారు గెలవటం ఖాయము అని చెబుతుండగా మరో రైతు మాట్లాడుతూ ...మాది వుప్పులూ రు  గ్రామము,నా పేరు యర్రా చెన్న కేశవ , రాజ్య సభ సభ్యురాలు శ్రీ మతి  సీతా మహాలక్ష్మి మా గ్రామ ఆడ బడుచు ....ఎంపి లాడ్స్ నిధులతో చాలా అభివృద్ది పనులు చేసింది ... వై సీ పీ,పవన్ కళ్యాణ్ ఎఫెక్ట్ లు మా గ్రామములో వుండవు అని చెబుతుండగా ,మరో  యువకుడు  మాట్లాడుతూ సార్ నా పేరు మద్దాడ నరేష్ , ఆకివీడు నుంచి నేను ,మా ఫ్రెండ్స్ అంద రము  కలసి ఇక్కడకు వచ్చాము , దళితుల ము , మా వాళ్ళను పక్కాగా మోసము చేశాడు జగన్ ...చిన్న మాస్క్ అడిగినందుకు మా దళిత డాక్టర్ ని హతము చేశారు ...మా వాళ్ళ యువకుల్లో చాలా మార్పు వస్తోంది అని చెబుతుండగా ,మరో యువకుడు మాట్లాడుతూ సార్ నా పేరు   చికట పల్లి చిన్నయ్య , లారీ డ్రైవర్ నీ , దళితుడిని  , రొయ్యలు బొంబాయి, తూత్తు కుడి , బాలసుర్ , చెన్నై బెంగళూరు లకు  తోలుతుంటాను ,  అసలు ఈ నియోజవర్గ ములో  డబ్బు ప్రభావం ఎక్కువ , అడగ కుండానే ఇస్తుంటారు , రొయ్యలు ,చేపల చెరువుల ఆ సా ము లు ....బస్తా లకు ...బస్తాలు ...డబ్బు ఎవ్వరికీ లెక్క తె లీ దు  ... నేను ఇంతకు ముందు టిడి పి కే వేసాను ....ఇక్కడ మరలా టి.డి.పి నే వస్తుంది అని చెబుతుండగా ...ఇక పాద యాత్ర మరలా కొనసాగి వాన జల్లుల మధ్య అలా ...అలా  నడుస్తూ జై అమరావతి నినాదాలతో వుండి కి చేరు కొని పట్టణ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని విజయ వంతంగా రాత్రి బసకు చేరుకొంది ...జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, ఉం డి, 6_ 10 _ 2022 , సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...