Jump to content

Amaravathi Mahapadayatra 2.0


Uravakonda

Recommended Posts

  • Replies 196
  • Created
  • Last Reply

18/09/22

జైత్ర యాత్ర లా సాగి పోతున్న రైతు మహా పాద యాత్ర  !                                     రాత్రి బస చేసిన శ్రీ వెలగ పూడి రామ కృష్ణ  మెమోరియల్ కాలేజీ వద్ద దైవ రధము  ముందు యధా విధిగా జే ఏ సి నాయకులు శివారెడ్డి , తిరుపతి రావు, రైతు నాయకులు  పూజలు నిర్వహించి , జై అమరావతి నినాదాలతో రైతు మహా పాద యాత్ర ముందుకు సాగింది .. నిన్నటి లాగానే శ్రీ అనగాని  సత్య ప్రసాద్ నాయకత్వములో  వీర కిసో రాల్లాంటి  యువకులు , రైతులు , అభిమానులు , వందల సంఖ్యలో వచ్చి పాద యాత్ర ను నడిపిస్తూండగా ,ఇక బందరు నుంచి శ్రీ కొల్లు రవీంద్ర , బాపట్ల నుంచి శ్రీ నరేంద్ర వర్మ ,  శ్రీ శ్రావణ్ కుమార్ , శ్రీ కొలిక పూడి శ్రీనివాస రావు లాంటి హేమా హే మీలు  ఎక్కడికక్కడ  యాత్ర లో కి వచ్చి   కలుస్తూండగ , ఇక సర్దార్ జీ వేషములో  వచ్చి పడిన శ్రీ జే సి ప్రభాకర్ రెడ్డి  మొత్తము పాద యాత్ర ను జైత్ర యాత్ర గా  చేయగా , ఇక శ్రీమతి రాయపాటి శైలజ  దైవ రధము ను నడు పుతూ ,పాద యాత్ర వెలమ వారి పాలె ము  చేరగానే అక్కడ మహిళలు పూల వర్షం కురిపించి , హారతు లద్ది  జై అమరావతి నినాదాలు గావించగా , ఇక పరిసర గ్రామాలైన బెల్లము వారి పాలె ము  , కొత్త పాలె ము , మంత్రి పాలె ము గ్రామాల రైతులు వచ్చి రైతు మహా పాద యాత్ర రైతులకు మద్దతు తెలుపుతూ . . ఇక వారిలో ఒక రైతు మిత్రుడు నా దగ్గర వున్న వాటర్ బాటిల్ ను అడిగి కొంచెము సేద తీరిన తరువాత నేను మాటలు కలుపగా ,. సార్ ... ఈ రేపల్లె నియోజక వర్గం మొత్తములో 70 పా లె ము గ్రామాలున్నాయి ....వాటిలో 50 పాలె ములు  గౌడ్లు  మెజార్టీ వున్న గ్రామాలు ...తొడ గొట్టి మరీ మళ్లీ సత్య ప్రసాద్ ను గెలిపిస్తారు ...కుతర్కాలు , అహాలు , అసూయలు జాంతా నయి ... ఎలక్షన్ వచ్చేసరికి అవి ఏమీ పనిచేయవు ...అంతా ఓకే మాట .. ఒకే  బాట . చిల్లర రాజకీయాలు సత్య ప్రసాద్ వున్నంత వరకు పని చేయవు అంటూ ఘాలి వారి పాలె ము నకు చెందిన పేరు చెప్పని  ఆ రైతు  చె ప్ఫా రు  ....ఇక రైతు మహా పాద యాత్ర మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసిన సజ్జా  వారి పాలె ము  చేరుకున్న తరువాత , విజయ వాడ , కేశినేని భవన్ నుంచి ముస్లిమ్ మైనారిటీ సోదరులు ,మాజి మంత్రి ఎమ్ .ఎస్  బే గ్ కుమార్డు అయిన శ్రీ ఎమ్ కే బేగ్   నా య క త్వములో  భారీ సంఖ్య లో శ్రీ లింగమ నేని శివరాం ప్రసాద్ సారథ్యంలో  జై అమరావతి నినాదాలు గావిస్తూ . ,.   " ప్రాణాలైనా ఇస్తాము ..అమరావతి ని సాధిస్తా ము " అంటూ తీవ్ర మైన నినాదాలతో భోజన వసతి ప్రాంగణానికి చేరుకొని పాద యాత్ర రైతులకు ఉత్సాహాన్ని , ధైర్యాన్ని సమ కూర్చారు ........ఇక ఈ రోజు రైతులకు సంఘీ భావము గా , డల్లాస్ లో వుంటున్న ప్రకాశము జిల్లా , కందుకూరు కు చెందిన శ్రీ కంచర్ల సుధాకర్ 25 లక్షలు రూపాయలు శ్రీ సత్య ప్రసాద్ చేతుల మీదుగా భూరి విరాళం ఇచ్చారు ...అలాగే గూడవల్లి గ్రామస్తుల 2 లక్షలు , నడింపల్లి గ్రామస్థులు రూ 150516/ లు ,     నల్లూ రి పాలెం గ్రామస్థులు రూ 4 లక్షలు  ,ఇంకా అనేక మంది భారీగా విరాళాలు ఇచ్చి రైతులకు వెన్ను దన్నుగా నిలిచారు .... ఇక పాద యాత్ర భోజనము అనంతరం తిరిగి ప్రారంభమై ఇసుక పాలెం చేరు తుండ గా మాజి మంత్రి శ్రీ ఆలపాటి రాజేంద్ర , డాక్టర్ వేమూరి శేష గిరి రావు ఇంకా తెనాలికి చెందిన ప్రముఖులు యాత్ర లో పాల్గొని రైతులకు మద్దతు ఇచ్చారు .ఇక పాద యాత్ర గుడి కాయ లంక మీదుగా ఇసుక పల్లి _   రేపల్లి ల లో ప్రజల అపూర్వ స్వాగతం లను అందుకుంటూ రాత్రి బస కు జై అమరావతి నినాదాలతో విజయవంతం గా చేరు కుంది .  జై అమరావతి !  జై ఆంధ్ర ప్రదేశ్ !!  జి వి రామ్ ప్రసాద్, రేపల్లె, cell 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 20/9/2022
👉రోజు:- మంగళవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- రేపల్లె 
👉భోజనవిరామం : మోపిదేవి 
👉ముగింపు ప్రాంతం: చల్లపల్లి 
👉నడిచే  కిలోమీటర్లు:- 16kms సుమారు.

Link to comment
Share on other sites

Just now, Nfan from 1982 said:

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 20/9/2022
👉రోజు:- మంగళవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- రేపల్లె 
👉భోజనవిరామం : మోపిదేవి 
👉ముగింపు ప్రాంతం: చల్లపల్లి 
👉నడిచే  కిలోమీటర్లు:- 16kms సుమారు.

image.thumb.png.4a5f31e4cf8dcbfd370c96a200458820.png

Link to comment
Share on other sites

20/09/22

ఈ రోజు ఉదయం 9 గం.లకు దైవ రధము వద్ద జే ఏ సి నాయకులు , రైతులు , రైతు మహిళలు యధా విధిగా పూజలు నిర్వహించి న అనంతరము  అమరావతి రైతు మహా పాద యాత్ర ముందుకు సాగింది . రేపల్లె నియోజక వర్గం నుండి  అనగాని  సత్య ప్రసాద్ ఆయన  అనుచరులు ,అమరావతి రైతులు కదం కదం కలుపుతూ పెనుమూడి వంతెనకు చేరే సరికి  ఎక్కడ చూసినా ఓ  అపూర్వ  మానవ జన సందో హాలు ...దేవతలు సైతము అచ్చేరువొంది  పుష్ప వర్షము కురిపించే సారు .....కృష్ణ వే నమ్మ పులకించి పోయింది .... ఇక ఢిల్లీ వాళ్ళ మీద తిరగ బడ్డ ఎన్ టీ ఆర్ గడ్డ నుండి సాహితీ బిడ్డ , కృష్ణవే నమ్మ ముద్దు బిడ్డ శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ , ఆంధ్రులు హక్కుల కోసం అరచి అరచి మొర బెట్టుకున్న శ్రీ కొనకళ్ళ నారాయణ రావు , యువ కిశో రాలు  కాగిత క్రిష్ణ ప్రసాద్,  ఆయన అనుచరులు ... ..అసలు ఇక వారధి మీద  భావ దేవర పల్లి నుండి వచ్చిన కర్షక కాపులు , వీర గౌద్లు , యాదవ రాజు లు , నిత్య కృషీ వలురు పల్లె కారులు.      ....ఎవరి చేతిలో చూచినా అమరావతి జెండా లె  , ఎవరి నో ట  విన్నా జై అమరావతి నినాదా లే ... న్యాయ ము, ధర్మము మీద బ్రతుకు సాగించే పల్లె జనాలు .....ఆ నోట ... ఆ నో ట ....అసలు నిజము వారికి చేరింది.   ....భూములు ఇచ్చా రు....రోడ్డున పడ్డారు .....190 మంది రైతులు అకాల మృత్యువు కౌగిట్లోకి వెళ్లారు ....వారి కుటుంబాల మహిళలు  కూడా  ... మండుటెండలో  ..ఆ వజాన  దిక్కు మాలిన రోడ్ల మీద నడుచుకుంటూ వస్తూంటే  ...వారి వారి గుండె తరుక్కు  పోయింది ...వారిని ఎవరూ పిలవలా     ....వాహనాలు సమకూర్చ లా ....బుద్ధ ప్రసాద్ అంత స్తితిమంతు డు  కూడా కాదు ......ఇక కొనకళ్ల నారాయణరావు వారి తండ్రి గణపతి ల సేవల గురించి పల్లె జనాలకు  యావత్తూ తెలుసు .. ఇక వూరు_ వాడ , పిల్లా.. జె ల్లా , పెద్దా _ చిన్నా ,  వున్నోళ్ళు  _లేనోళ్ళు  మొత్తము పేనుమూడి  వంతెన మీద కు వచ్చి పడట ము తో పులకించి పోయింది కృష్ణ వే నమ్మ .....అసెంబ్లీ సాక్షిగా పా లె గాళ్ళు ఆడిన అబద్ధాలు , ప్రాంతీయ , కుల చి చ్చు లు మొత్తము దోపిడీ యవ్వారమంతా అర్థమైపోయింది  పల్లె జనాలకు. తిరగబడితే  ఏ ఒక్కరినీ  సో దెలో లేకుండా తుడిచి వేయగ ల శక్తి మంతులు ...వచ్చి పడ్డారు తండోప తండాలుగా ....పాపము ఇంత మందికి భోజన వసతి ఏర్పాటు చేయ లే రె మో నని ....వారి వారి గ్రామాలకు వెళ్లి భోజనము చేసి మళ్లీ పాద యాత్ర లో పాల్గొన్న వైనము  . .. అ పూర్వము ... ఆమో ఘము ...ఏమైతే నే మి.కృష్ణా జిల్లా అన్ని గ్రామాల నుండి ,ముఖ్యముగా పెనమలూరు, చోడవరం, పోరంకి , తాడిగడప , వుయ్యురు , ముదునూ రు ,గోపువాని పాలెము   ...ఇక అవనిగడ్డ, నాగాయలంక  ,  భావ దేవరపల్లి  (   300 మంది యువకులు మోటర్ బైక్ లపై వచ్చిన వైనం)  రావి వారి పాలె ము , ఇంకా బందరు , పెడ న  అనేక గ్రామాల నుండి రైతులు  వచ్చి అమరావతి రైతులకు సంఘీభావం తెలిపారు ..... ఇక మొత్తము ఈ రోజు  సినారియా తో  ఢిల్లీకి ఏ ఘడియ కు ఆ ఘడియ రిపోర్ట్ లు ....ఇక పల్లె జనాలు రాబోయే 15 నెలలు గడవట మే  తరువాయి ...ఎట్లా వచ్చి నోళ్లను అట్లా పంపించటానికి రెఢీ గా వున్నారు ....ఇక పాద యాత్ర భోజనం చేసిన తరువాత పెద ప్రొలు , కఫ్టాను వారి పాలెం ల మీదు గా  చల్ల పల్లి చేరి అపూర్వ స్వాగతం లు అందుకొని రాత్రి బస కు విజయ వంతంగా చేరింది......జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, చల్లపల్లి , సెల్ _ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 21/09/2022
👉రోజు:- బుధవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- చల్లపల్లి 
👉భోజనవిరామం : లంకపల్లి
👉ముగింపు ప్రాంతం:చిన్నాపురం 
👉నడిచే  కిలోమీటర్లు:- 15kms  సుమారు.

Link to comment
Share on other sites

21/09/22
 

రాత్రి విడి ది బస  నుండి ఉదయం 9 గం.లకు యధా విధిగా దైవ రధము ముందు జె ఏ సీ  నాయకులు ,రైతు మహిళలు, రైతులు పూజలు నిర్వహించి న అనంతరము జై అమరావతి నినాదాలతో రైతు మహా పాద యాత్ర ముందుకు సాగింది ....మాజి ఎమ్ పి శ్రీ కొనకళ్ళ నారాయణ రావు, శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ మరియు స్తానిక పుర పెద్దలు,  మహిళలు విశేష సంఖ్యలో  హాజరై    ఎర్ర గడ్డ  చల్లపల్లి గడ్డ మీద   జై అమరావతి నినాదాల ఉరుకుల పరుగుల తో , ధర్మ యుద్ధాన రైతులకు   అండగ నిలబడుతున్న శ్రీ కొ లిక   పూడి శ్రీ నివాస  రావు , పులి చిన్నా లాంటి దళిత యువకులు , ఎర్ర సైనికుల ,జన సే న  కార్య కర్తల మద్దతుతో రైతు మహా పాద యాత్ర చల్లపల్లి మెయిన్ రోడ్ మీదుగా  జై అమరావతీ  నినాదాలతో నడుస్తూ చల్లపల్లి  ఓల్డ్  టైమర్స్ అందరినీ  ఆనంద భాష్పాల తో పులకింప చేసిన చారిత్రిక రోజు ...చల్లపల్లి కి పుణ్య దినము ....ఇక పాద యాత్ర చల్ల పల్లి సెంటర్ కు చేర గానే ఆర్య  వైశ్య సంఘము పెద్దలంతా స్వాగతము పలికి , శ్రీ వరదా హరి గోపాల్  నాయకత్వములో పాద యాత్ర రైతులకు తాగి నన్ని కూల్ డ్రింక్స్ ఇచ్చి ,పాద యాత్ర లో నడుస్తూ , ఇక పాద యాత్ర మంగ లా పురము , లక్ష్మి పురము సెంటర్ ల వద్ద అశేష ప్రజల నీరాజ నా లందుకుంటు ముందుకు నడుస్తూ ఘంట సాల మండలము దాలి పర్రు పాయింట్ కు చేరగానే కృష్ణా జిల్లా పరిషత్ మాజి వైస్ చైర్మన్ శ్రీ గొ ర్రి పాటి రామ కృష్ణ ప్రసాద్ నా య కత్వములో  వంద లాది మహిళలు , రైతులు ఎదురేగి పాద యాత్ర రైతులకు స్వాగతం పలికి , దైవ రధము వద్ద కొబ్బరి కాయలు కొట్టి , హార తులద్ది ,జై అమరావతి నినాదాలతో పాద యాత్ర లో నడుస్తూ    మధ్యాహ్న భోజన వసతి ఏర్పాటు చేసిన లంకపల్లి గ్రామ ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ  భోజన ప్రాంగణానికి చేరుకున్నారు .......ఇక భోజనము అనంతరం  ఓ కుర్చీ లో చెరబడగానే ఓ రైతు సోదరుడు నాతో మాట మంతి కలిపి ....నేను సింహాద్రి   సత్య నారాయణ గారికి ఓటు వేసినపుడు యువకుడిని ...అప్పటినుంచి ఇప్పటి వరకు ఎన్నో చూసా ..అమరావతి యధా విధిగా నిర్మింప బ డాలంటే  మళ్లీ ఆయన వస్తేనే సాధ్య మవుతుంది ...ఇక ఏ రాజకీయ వత్తిల్లకు  తల ఒ గ్గినా  ఇంతే సంగతులు ....నేను కాపు సామాజిక వర్గం వాడిని ...  నా పేరు చందన రంగా రావు ,  మోపి దేవి మండలము ,కె కొత్త పాలెం గ్రామ నివాసిని అనిచెప్పి ....ఎది ఏమైనా ఈ సారి బుద్ద ప్రసాద్ గెలుపు ఖాయము అని ఇంకా ఎన్నో విషయా లు చెప్పటం జరిగింది ...ఇక పాద యాత్ర తిరిగి ప్రారంభమై  పాత మాజెరు , కొత్త మాజేరు గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకుంటూ  భోగి రెడ్డి పల్లి , నెలకుర్రు గ్రామాల ప్రజల స్వాగతాలు కూడా అందుకొని చిన్నాపురము  చేరుకొని అక్కడి ప్రజల  స్వాగతా లు పొంది రాత్రి విడిది బసకు జై అమరావతి నినాదాలతో విజయవంతముగా  చేరుకొంది ...జై అమరావతి! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, చిన్నా పూరము  , సెల్  : 628 111 4344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 22/09/2022
👉రోజు:- గురువారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- చిన్నాపురం 
👉భోజనవిరామం : రాజుపేట (షాధీఖాన) ,మచిలీపట్నం.
👉ముగింపు ప్రాంతం: హర్ష కాలేజి (హుస్సేన్ పాలెం) మచిలీపట్నం.
👉నడిచే  కిలోమీటర్లు:- 17kms. సుమారు.

Link to comment
Share on other sites

22/09/22

 

రాత్రి బస చేసిన గ్రామము  చిన్నాపురం ....బందరు నియోజక వర్గం ....  ఈ రోజు ఉదయం 9 గం.లకు దైవ రధము ముందు గ్రామ ప్రెసిడెంట్ శ్రీ కాగిత గోపాల రావు గారు , మాజి ప్రెసిడెంట్ శ్రీ  నరహరిసెట్టి     అచ్చ్యు తయ్య గారు , మాజి కో ఆప్ బ్యాంక్ ప్రెసిడెంట్ శ్రీ చలమ ల శెట్టి రమణ గారు, జే ఏ సి నాయకులు, రైతులు,  రైతు మహిళలు  జగ  మే రిగిన బ్రాహ్మలు శ్రీ ముదిగొండ శాస్త్రి గారు , రైతులు , రైతు మహిళల పూజల అనంతరం , జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ముందుకు సాగగా , ఇక మాజి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, మాజి ఎమ్ పి శ్రీ కొనకళ్ళ నారాయణ రావు గార్లు , వారి అనుచరులు పెద్ద ఎత్తున తరలి వచ్చి , పాద యాత్ర ను జయ,  జయ  ద్వా న ములతో  ముందుకు  నడుపుతూ , ఇక పాద యాత్ర గుండు పా లె ము గ్రామము చేరగానే , ఆ గ్రామస్థులు పెద్ద ఎత్తున తరలి వచ్చి  రైతు ల పై పూల వర్షం కురిపించి , పాద యాత్ర ను గ్రామము లోకి తోడ్కొని పోతుండగా   , శ్రీ తూమాటి వెంకయ్య గారు, వారింటి మహిళలు వచ్చి దైవ రధము ముందు కొబ్బరి కాయలు కొ ట్టి , హారతుల ద్ధి , లక్ష రూపాయలు విరాళం ఇచ్చి , రైతులకు తమ మద్దతు తెలిపి , పాద యాత్ర లో పాల్గొని , జై అమరావతి నినాదాలతో రుద్రవరము గ్రామ ము చేరుకొని , అక్కడి ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని , తరువాత శారదా నగర్ చేరగానే అక్కడి ప్రజల  మద్దతు కూడా పొంది వారు కూడా  పాద యాత్ర లో కలసి చింత గుంట పాలెము , చింత చెట్టు సెంటర్  చేర గానే  ముస్లిమ్ మైనారిటీ లు పెద్ద ఎత్తున శ్రీ ఖాజా నాయకత్వము లో తరలి వచ్చి , జై అమరావతి నినాదా లు  గావించి , రైతులకు తమ పూర్తి మద్ద తే గాక అసలు ఒకే రాష్ట్రము , ఒకే రాజధాని , అది అమరావ తే అని ఘంటా పథముగా చెబుతూ , పాద యాత్ర ను మధ్యాహ్నము భోజన వసతి ఏర్పాటు చేసిన షా ది ఖానా  వద్దకు తోడ్కొని వెళ్లి పాద యాత్ర కు నిండు దనము  చేకూర్చగా , ఇక ఈ రోజు  అంతా వాతావరణము చల్ల బడి , ఎండ అనేది లేకుండా దేముడు కనికరించడముతో  ఒకింత నడక బడలిక లేకుండా రైతు మహిళలు , రైతులు భోజనానంతరం సేద తీ ర గా     ........ ..ఇక పాద యాత్ర 3  గం లకు ప్రారంభ మై  ముందు , బందర్ బార్ అసోసియేషన్ అధ్యక్షులు శ్రీ పుప్పాల శివ రామ క్రిష్ణ ప్రసాద్ నాయ కత్వ ములో పెద్ద ఎత్తున న్యాయ వాదులు తరలి వచ్చి  జై అమరావతి నినాద ము లు  గావించి  పాద యాత్ర మహిళలకు , రైతులకు కొండంత అండ గా నిలిచి పాద యాత్ర ను ముందుకు తీసుకు పోగా , ఇక రైతు మహా పాద యాత్ర ఆజాద్ రోడ్ మీదుగా కోనేరు సెంటర్ కు చేరు కోగానే  శ్రీ కొనకళ్ళ నారాయణ రావు, శ్రీ కొల్లు రవీంద్ర, శ్రీ బూర గడ్డ  వేద వ్యా స్ , శ్రీ కొలికపూడి శ్రీ నివాస్ లాంటి హేమా హేమీలు  జై అమరావతి నినాదాలతో మెయిన్ రోడ్ మీదుగా పాద యాత్ర ను నడిపిస్తూ బందరు పట్టణములో వెలుగు కిరణాలు తిరిగి జాజ్వలమయ్యే రీతిలో ప్రజలకు భరోసా కల్పిస్తూ ఓ సరి క్రొత్త అనుభూతిని , జాగృతిని కల్పించగ    .....ఇక ఈ రోజు నాకు కాళ్ళకు చెప్పులు క రచటముతో  నడక ఇబ్బందై  , స్కూటర్ మీద వెళుతున్న ఓ అపరి చితు డిని లిఫ్ట్ ఇవ్వమని కోరగా   .....ఆయన వెంటనే నన్ను బండి మీద ఎక్కించుకొని కొంచెము దూరము పోయినాక ....మీది ఏ వూరు ? ఎన్ని ఎకరాలు లాండ్ పూలింగ్ కు ఇచ్చారు ?  అని ప్రశ్నించగా    ...... సర్ ...నాకు అమరావతి లో ఒక్క గజము లేదు .. అయినా అమరావతి  యావత్ తెలుగు ప్రజలందరికీ మంచి అడ్రస్ కల్పించే రాజధానిగా , నగరంగా ఏర్పడు తుంది గావున , అది ఇలా  నాశన మవుతుంటే నేను సహించ లేక పోతున్నాను అని చెప్పగానే ......జగన్ వున్నంత కాలము అది జరిగే పని కాదని  ఆయన కామెంట్ చేసి ...వెంటనే డబ్బులకు ఆశ పడే ఓటర్లు వున్నంత కాలము  ...ఇక మీరు పెద్ద ఆశలు పెట్టుకో మాకం డి అని వ్యాఖ్యా నించగా .... నేను  వాళ్ళ సంగతి సరే ... అన్నీ తెలిసి , చదువుకున్న మేధావులు ముఖ్యముగా  ఎంప్లాయిస్ చేసిన , చేస్తున్న సమర్ధనలు ఏమిటి అని ప్రశ్నించగా  ...సర్   ఈ సారి ఎంప్లాయిస్ 90 శాతం ఓట్లు వేయరు ....నేను గవర్నమెంట్ ఉద్యో గిని     ... కడుపుమంట తో సమయము కోసము ఎదురు చూస్తున్నారు అని చెప్పగా .... సర్ 90 శాతం అవసరము లేదు ,50 శాతం మారినా చాలు ...ఆంధ్రులు ఒడ్డున పడతారు అని అనగానే ...నేను చెప్పేది జరిగి తీరుతుంది అని చెప్పగా నా మనసు కొంత వూరట చెందింది ... ఇక రైతు మహా పాద యాత్ర   అనేక ప్రాంతాల నుండి వచ్చిన అమరావతి అభిమానులతో , జై అమరావతి నినాదాలతో సాయంత్రం విడి దికి విజయవంతం గా చేరుకొంది .జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్, మచిలీపట్నం .సెల్ 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 23/09/2022
👉రోజు:-  శుక్రవారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- హర్ష కాలేజి 
👉భోజనవిరామం : వడ్లమన్నాడు 
👉ముగింపు ప్రాంతం: కౌతవరం
👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

23/09/22


ఈ రోజు హర్ష కాలేజ్ , అరిసేపల్లి , బందర్ నుండి ఉదయం 9 గం. ల కు ......దైవ రధము ముందు  రాత్రి పాద యాత్ర రైతులకు టిఫిన్  ఏర్పాట్లు చేసిన బందరు పట్టణ పెద్దలు , వితరణ సీ లురు  శ్రీయుతులు సిహెచ్  కోటేశ్వర రావు, ఆర్ శ్రీనివాస్, ఎన్ టాగోర్ లు దైవ రధము ముందు కొబ్బరి కాయలు     కొ ట్టగా , జే ఏ సి నాయకులు, రైతులు, రైతు మహిళలు  ఆ దేవ దేవునికి నమస్కరించి పాద యాత్ర ను ప్రారంభించగా , ఇక మాజి లోక్సభ  సభ్యులు శ్రీ కొనకళ్ళ నారాయణ రావు, మాజి మంత్రి శ్రీ కొల్లు రవీంద్ర, పెదన నియోజక వర్గ ఇంచార్జీ శ్రీ కాగిత క్రిష్ణ ప్రసాద్, బందరు మాజి మేయర్ శ్రీ బాబా ప్రసాద్ ,  శ్రీ కొ లిక పూడి శ్రీనివాస రావు , పుర పెద్దలు శ్రీ ముదిగొండ శాస్త్రి  అంతా కలిసి జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ప్రారంభించగా , ఇక పాద యాత్ర చిట్టి పాలె ము  గ్రామము చేరగానే  ఆ గ్రామస్థులు పెద్ద ఎత్తున  జై అమరావతీ నినాదాలతో స్వాగతము పలికి పాద యాత్ర ను పెడన పట్టణమునకు చేర్చుతుండగా , ఇక అప్పటికే నిరీక్షిస్తున్న వందల , వేలాది రైతు జనావలి పెద్ద పెద్ద ఆకు పచ్చ జెండాలతో, మెడలో ఆకు పచ్చ కం డు వాలతో   , జై అమరావతి నినాదాలతో పాద యాత్ర ను పె డ న పట్టణములో కి తోడ్కొని పోయి పెడ న పట్టణాన్ని ఆకు పచ్చ సముద్రము గావించి న తీరు న భూతో భవిష్య టి గా చేసి  ....ఇక  బంటుమిల్లి మండలములోని 21 పంచాయతీ గ్రామాలైన లక్ష్మి నారాయణ పురము , రామవరపు మో డి ,  చో రంపూడి, మల్లం పూ డి  , నాగన్న చెరువు , మల పర్రు   , ఆముదాల పల్లి, పెద తుమ్మి డి, చి న  తుమ్మి  డి తదితర గ్రామాల నుంచి కృష్ణ ప్రసాద్ ,బూర గడ్డ ల యువ సేన కార్య కర్తలు పాద యాత్ర వెంట రాగా , ఇక గూడూరు మండలం పో ల వరము  , మ ల్లవోలు , అయిదు గుళ్ల పల్లి , తుమ్మల పాలె ము ,కలప ట ము  , మంచా కోడూరు , తరక టూ రు , ఆకుల మన్నాడు , కప్పల దొడ్డి తదితర గ్రామాల నుంచి రైతులు స్వచ్ఛందంగా తరలి రాగా, ఇక కృత్తివెన్ను మండలములోని 16 పంచాయతీ లయిన లక్ష్మీపురం, నిడమర్రు , దర్శి పూడి , చిన పాండ్రాక , చిన గొల్ల పాలె ము  తదితర గ్రామాల నుండి బి సి, ఎస్సీలె కాకుండా  ఈ పాలనపై విసుగు చెందిన వారంతా వందల , వేలాది మంది వచ్చి పె డ న పట్టణాన్ని ముంచె టాగా , ఇక పెడ న ఆర్య వై శ్య లంతా  హృదయ పూర్వక మద్దతు పలికి , ఈ సారి మావాల్లం త్టా    రాష్ట్రము మొత్తంగా విప్లవాన్ని స్పృష్టించటానికి రెడీ గా వున్నారని , ఇపుడు బైట పడడానికి సమయము కాదని , అనేక ఇబ్బందులున్నా యని , అమరావతి చిర కాలము వర్ధిల్లాలని , పేరు చెప్పటానికి ఇష్ట పడని నా వయసు గల ఆర్య వై స్య పెద్ద ఒకరు నాకు చెప్పగా , ఇక పాద యాత్ర నవులూరు,  గ్రామము చేరే సరికి పాద యాత్ర నిడివి నాలుగు కి .మి పొడవున వుండి పాద యాత్ర రైతులకు  ఓ వూపు , ఉత్సాహము తీసుకు  వచ్చి , అదే ఊపుతో రెడ్డి పాలె ము  రాగానే  ఇక గుడివాడ నియోజక వర్గ పరిధి లో అడుగిడ గానే శ్రీ  రావి వెంకటేశ్వర రావు, ఇంకా గుడివాడ ప్రముఖులు పెద్ద ఎత్తున తరలి వచ్చి అపూర్వ స్వాగతం పలికి పాద యాత్ర రైతులను మాధ్యాన్న భోజన వసతి ఏర్పాట చేసిన గ్రామ మైన వడ్ల మ న్నాడుకు తోడ్కొని రాగా...... ఇక భోజన కార్య  క్రమం అయినాక 3 గం లకు పాద యాత్ర తిరిగి ప్రారంభమై వడ్లమన్నడు గ్రామములో కి చేర గానే ఆ గ్రామస్థులు అందరూ పూల వర్షం కురిపించి , గ్రామస్థులు అందరూ కలిసి పోగు చేసి న రూ..86 వే లు    విరాళం ఇచ్చి ,జై అమరావతి నినాదాలు గావించి గా , ఇక పాద యాత్ర  వేమ వరము , కొందాలమ్మ గుడి గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని కవుతరము గ్రామము చేరగానే అక్కడి గ్రామస్థులు పూల వర్షం కురిపించి  గ్రామములో తోడ్కొని రాగా , ఇక  అమరావతి పాద   యాత్ర కవుతరము గ్రామము వద్ద విజయ వంతంగా ముగిసిన ది . ఇక రేపు ఇదే గ్రామము నుంచి పాద యాత్ర ఉదయము 9 గం.  లకు ప్రారంభమై గుడివాడ కు చేరుతుంది .... ఈ రోజు పా లె గాం డ్ర సేవకుల హడావుడి అంతగా కనపడలేదు .  నాగరిక గ్రామాలలో అనాగరిక , ఫ్యాక్షన్   సన్నాసి రాజకీయా ల్ని తీసుకు వచ్చి కోస్తా ప్రాంతాన్ని కలుషిత ము గావించటాన్ని పలువురు ఓల్డ్    టై మెర్స్ విచారము వ్యక్తము    చే స్తు , అమరావతి వర్ధిల్లాలని , ఆంధ్ర యువకులకు  మంచి భవిష్యత్ క లుగాలని ఆకాంక్షించారు .  జి వి రామ్ ప్రసాద్ , క వుతరము , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 24/09/2022
👉రోజు:-  శనివారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:- కౌతవరం
👉భోజనవిరామం : బొమ్ములూరు (గుడివాడ).
👉ముగింపు ప్రాంతం: V కన్వెన్షన్ , నాగవరప్పాడు(గుడివాడ).
👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

24/09/22


అమరావతిని  నిర్మిస్తాం ..                        అమరావతి పాద యాత్ర 13 వ రోజు      ...................                          13 అంకె  యూ రోపియన్లకు  దుర్డినము ...                                       మన  అంగలూరు బిడ్డ  త్రిపురనేని రామస్వామి కి సుదినము  . ...చదువు కోసము ఐర్లాండ్ దేశము డబ్లిన్ నగరము కు వెళ్లి హోటల్ లో 13 నంబర్ రూము అడిగిన మూడ విశ్వాస వినా శ కుడు   త్రిపురనేని  గడ్డ మీదుగా  ....13 వ రోజు నడచిన అమరావతి మహా పాద యాత్ర  .........                                        చరిత్ర తిరగ రాసిన రోజు ...   ..                చరణ్ సింగ్ కిసాన్  ర్యాలీ ......                     ఎన్ టి ఆర్ చైతన్య  యాత్ర ...                  అద్వానీ ర ధ  యాత్ర ... ..      వాటి సరసన నేడు గుడివాడలో జరిగిన అమరావతి రైతు మహా పాద యాత్ర  .......                                     ఒకా నొకప్పుడు  యూ రప్లో ....ఆల్  రో డ్స్ లీడ్ టు రోమ్ ... నేడు ఆంధ్ర లో  ....      ఆల్ రోడ్స్ లీడ్ టు గుడివాడ   ... అటు శ్రీ కాకులం  నుంచి ఇటు అనంత పురము వరకు , అటు నిజామాబాద్ నుంచి ఇటు చిత్తూరు జిల్లా వరకు ....ఎక్కడ తెలుగు వారున్న ...అక్కడి నుంచి  నేడు గుడి వాడ కు రాని వారంటూ లేరు ....పట్టణము లేదు .... పల్లె లేదు ...ప్రాంతము లేదు .... నిష్కళంక మైన మనసులు గల వారు , పవిత్రమైన హృదయాలు గల వారు , అభివృద్ది పురోగామికులు , సంస్కార వం తులు  , గౌరవంగా బ్రతికే వారంతా  .....నేడు గుడివాడ పట్టణము లో కదం , కదం తొక్కి జై అమరావతి నినాదాలు గావించి  ' జాగ్రత్త  సుమా '  అని ఆంధ్రులు తాఖీదులు పంపిన రోజు  ......   పూర్వ అపూర్వ  వైభవాన్ని ఆంధ్రులకు తిరిగి తీసుకొచ్చిన రోజు  ..,..                            ఈ వూరు లేదు ... ఆ వూరు లేదు ... వున్నో ళ్లు లేదు .... లే నోళ్ళు లేదు ,.  చిన్నా లేదు ..పెద్దా లేదు ,      ఆడా లేదు ...మగా  లేదు ...,  జనము మొత్తము తండోప తండాలుగా   గుడి వాడకు తరలి వస్తుంటే ....ఖాకీలకు  ఆదేశాల మీద  ఆదేశాలు ..., వాలంటీర్లకు  సందేశాల మీద సందేశాలు ....జనాన్ని రా నీ య  కూడదు అని  ...ఇవన్నీ దాటుకుని ఆంధ్ర  పల్లె జనాలు ఉరుకులు పరుగులతో వచ్చి పాద యాత్ర లో కలసిన వైనం .......    ఈ రోజు ఉదయం 9 గం.లకు కవుతరము  గ్రామము నుండీ దైవ రధము ముందు గ్రామ పెద్దలు , జె ఏ సి నాయకులు, రైతు మహిళలు, రైతులు ఆ దేవ దేవునికి నమస్కరించి  పాద యాత్ర ను జై అమరావతి నినాదాలతో ప్రారంభించగా , ఇక పాద యాత్ర గుడ్లవల్లేరు కు చేర గానే ఆ గ్రామ బిడ్డ , పొలవరపు వారి ఆడబడుచు శ్రీ మతి గద్దె అనురాధ  ఎన్నో ఆటంకాలు , అవరోధాలు అధిగ మించి పాద యాత్ర  లో కలసి  పాద యాత్ర ను   జై అమరావతి నినాదాలతో నడి పిస్తుండగా ఇక తరంగ తరంగాలుగా వచ్చి పడుతున్న గ్రామీణ ప్రజానీకం ను కలుపుకొని  చంద్రాల , అంగలూరు , సిద్దాంతము గ్రామాల ప్రజల అపూర్వ స్వాగతం లు అందుకొని మద్యాన్న భోజన వసతి ఏర్పాటు చేసిన బొమ్ములూరు చేరుకునేసరికి  జనమే జనము ..... జన ప్రభంజనం ...ఇక విరా లా ల వెల్లువ ... శ్రీ పిన్నమనేని వెంకటేశ్వర రావు, బాబ్జీ  లు  రూ 5  లక్షలు , శ్రీ పిన్నమ నేని వీరయ్య చౌదరి ( కోటేశ్వర రావు గారీ కుమారుడు ) రూ 50000 / లు , సీతా పురము కాలనీ, పోరంకి  నివాసితులు శ్రీ వల్లభ నేని రణ ధీర్ నాయకత్వములో 2 లక్షలు , ఎస్ ఎల్ వి గ్రీన్ మెడోస్ , కేసరపల్లి వారు శ్రీ ఎమ్ బి వి ప్రసాద్ నాయకత్వములో 270000 / లు , ఇంకా అనేక మంది దాతలు విరాళాలు ఇవ్వగా .   ఇక పాద యాత్ర భోజన అనంతరము ప్రారంభమై.   బో మ్ములూరు నుంచి గుడివాడ చేరే సరికి  ఇక యోధాను యోధులు శ్రీ కొ  లికపూడిశ్రీనివాస రావు , కొనకొల్ల నారాయణ రావు. కైకలూరు మాజి ఎమ్ ఎల్ ఏ శ్రీ జయమంగళ ము వెంకట రమణ , కొల్లు రవీంద్ర,  కాగిత కృష్ణ ప్రసాద్ , మాచర్ల నుండి సరి క్రొత్త పల్నాటి సింహము జూలకంటి బ్రహ్మానం ద రెడ్డి , గురజాల నుండి యరపతినేని శ్రీనివాసరావు , దెందులూరు నుండి శ్రీ చింత మనేని , శ్రీ మాగంటి బాబు , పోరంకి నుండి శ్రీ  బోడే ప్రసాద్ , దేవినేని ఉమా వారి అనుచరులు మొత్తము ఆంధ్ర జనావలి     అంతా  పాద యాత్ర రైతుల వెంట నడుస్తుంటే  ..ఇక అమరావతి  అభిమానులు .'  వాడేవ డ న్నా  .... వీ   డే వ డ న్నా  .   . .అమరావతికి అడ్డేవ డ న్నా .. లాంటి  నినాదాలు గావిస్టూ  శ్రీ రావి వెంకటేశ్వర రావు మరియు పట్టణ ప్రజానీకం అంతా పాద యాత్ర రైతుల వెంట జై అమరావతి నినాదాలతో నడవగా  నేడు గుడి వాడ పట్టణము పులకించి పోగా , ఇక పాద యాత్ర విజయవంతముగా రాత్రి బస కు చేరుకుంది .....జై అమరావతి ! జై ఆంధ్ర ప్రదేశ్ !! జి వి రామ్ ప్రసాద్ , గుడివాడ , సెల్ : 6281114344 .

Link to comment
Share on other sites

అమరావతి మహాపాదయాత్ర వివరములు :
👉తారీకు:- 25/09/2022
👉రోజు:-  ఆదివారం ఉదయం 08:30 గంటలకు 
👉ప్రారంభ ప్రాంతం:-V కన్వెన్షన్ (నాగవరప్పాడు) గుడివాడ.
👉భోజనవిరామం : తుమ్మలపల్లి 
👉ముగింపు ప్రాంతం: కొనికి        (దెందులూరు)
 👉నడిచే  కిలోమీటర్లు:- 15kms. సుమారు.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.

×
×
  • Create New...