Jump to content

what is this Bank


SREE_123

Recommended Posts

ముంబై వచ్చి రిపోర్ట్‌ చేయాలని ఆదేశం

ఏపీ సర్కారుతో కుమ్మక్కు ఫలితం

తప్పుడు అప్పులకు యథేచ్ఛగా సహకారం

ఎస్‌బీఐ కాదన్న ప్రతిపాదనలకూ సై

ఆర్బీఐ హెచ్చరించినా ‘రుణ ప్రేమ’

ఏపీ ప్రభుత్వ పెద్దలతో సంబంధాలు

కన్నేసి ఉంచిన సీనియర్‌ అధికారులు 

అదను చూసి వేటు.. ముంబైకి పిలుపు

బ్యాంకింగ్‌ రంగంలో సంచలనం

 

జగన్‌ సర్కారు ఆర్థిక అరాచకాలు రాష్ట్ర ఆర్థిక వ్యవస్థనే కాదు...  దేశ బ్యాంకింగ్‌ రంగాన్నే కుదిపేస్తున్నాయి. ఏపీ ప్రభుత్వంతో కుమ్మక్కై... అడ్డగోలుగా అప్పులు ఇచ్చిన పాపం.... ఒక పెద్ద బ్యాంకు అధిపతి కొంప ముంచింది. అత్యంత అసాధారణమైన రీతిలో ఆ బ్యాంకు ఏపీ చీఫ్‌ను ఆ పదవి నుంచి తప్పించారు. మరోచోట పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా ముంబై వచ్చి రిపోర్టు చేయాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇలాంటి ఆర్థిక అరాచకాలను సహించబోమనే సంకేతాలు పంపారు.

 

(అమరావతి - ఆంధ్రజ్యోతి)

అడ్డగోలుగా అప్పులు తేవడం! కేంద్రం, కాగ్‌ కళ్లకు గంతలు కట్టడం! ఒక తప్పును ఆర్బీఐ గుర్తించగానే... మరో తప్పుడు మార్గాన్ని కనిపెట్టడం! ఇదీ... జగన్‌ సర్కారు అనుసరిస్తున్న ‘రుణ అవస్థ’! కమీషన్ల కోసం కక్కుర్తో, టార్గెట్లు పూర్తి చేయాలన్న ఆరాటమో తెలియదుకానీ... జగన్‌ సర్కారు తప్పుడు అప్పులకు బ్యాంకులు కూడా బాగా సహకరించాయి. ఆర్బీఐ హెచ్చరికలతో ఎస్‌బీఐ వంటి దిగ్గజ బ్యాంకులు వెనక్కి తగ్గినా... ‘నేనున్నాను’ అంటూ ఒక బ్యాంకు పెద్దాఫీసరు జగన్‌ సర్కారుకు ‘అప్పుల హస్తం’ అందించారు. ఇదేమీ ఆషామాషీ బ్యాంకు కాదు. బ్యాంకుల విలీనం తర్వాత ఇది కూడా బడా బ్యాంకుల సరసన చేరింది. దీని ఉన్నతాధికారే ఇప్పుడు చిక్కుల్లో పడ్డారు. ‘మనవాడే’ అనుకున్నారో, సర్కారు పెద్దల మాయలో పడిపోయారో తెలియదు కానీ... ఏపీ సర్కారుకు విచ్చలవిడిగా అప్పులు ఇచ్చేందుకు సహకరించారు.

 

ఎస్‌బీఐ వెనక్కి తగ్గినా... 

రాష్ట్రాభివృద్ధి కార్పొరేషన్‌ (ఏపీఎ్‌సడీసీ) పేరుతో అప్పులు తేవడం రాజ్యాంగ విరుద్ధమని కేంద్రం తేల్చి చెప్పడంతో... బ్యాంకులు బుద్ధి తెచ్చుకున్నాయి. ఏపీఎస్‌డీసీకి కన్సార్షియం ద్వారా అప్పులు ఇప్పించిన ఎస్‌బీఐ ఇక రాష్ట్రం వైపు చూసేందుకే ఇష్టపడటంలేదు. దాదాపు 8 బ్యాంకులు ఈ వ్యవహారంలో చిక్కుకున్నాయి. దీంతో... దాదాపు బ్యాంకులన్నీ ఏపీ అంటేనే బెంబేలెత్తడం మొదలైంది. అయినప్పటికీ రెండు బ్యాంకులు మాత్రం జగన్‌ సర్కారు రుణ దాహాన్ని తీరుస్తూ వచ్చాయి. అదే సమయంలో... ఏపీని దృష్టిలో ఉంచుకుని ఆర్బీఐ విడుదల చేసిన సర్క్యులర్‌ బ్యాంకింగ్‌ రంగంలో కల్లోలం సృష్టించింది. ‘‘కార్పొరేషన్లకు అప్పులు ఎలా ఇస్తున్నారు? తిరిగి చెల్లించగల సామర్థ్యం వాటికి ఉందో లేదో చూడరా? నిబంధనలు పాటించరా? కార్పొరేషన్లకు ఇచ్చిన అప్పుల రీపేమెంట్‌ ఆ రాష్ట్ర బడ్జెట్‌ నుంచి జరగకూడదు! ఆ కార్పొరేషన్‌ సొంత ఆదాయ వనరుల ద్వారానే జరగాలి. అప్పులు ఇచ్చే ముందు ఇవన్నీ జాగ్రత్తగా పరిశీలించండి’’ అని ఆర్బీఐ స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. దీంతో అప్పటిదాకా జగన్‌ సర్కారుకు సహకరిస్తూ వచ్చిన రెండు జాతీయ బ్యాంకుల్లో ఒక బ్యాంకు పక్కకు తప్పుకొంది. మరో బ్యాంకు మాత్రం తప్పుడు అప్పులు ఇచ్చేందుకు సహకరిస్తూనే ఉంది. దీనికి కారణం... సదరు బ్యాంకు ఉన్నతాధికారి జగన్‌ సర్కారుతో అంటకాగడమే!

 

అదను చూసి వేటు... 

ఆర్బీఐ హెచ్చరించినా, కేంద్రం అప్రమత్తం చేసినా... ఆ ఒక్క బ్యాంకు అధికారి మారకపోవడాన్ని ఆ బ్యాంకు జాతీయ స్థాయి ఉన్నతాధికారులు గుర్తించారు. ఆయన కదలికలు, చర్యలను గమనిస్తూ వచ్చారు. ప్రభుత్వ పెద్దలతో ఆయనకున్న అనుబంధాన్ని దృష్టిలో పెట్టుకుని... ఆచితూచి వ్యవహరించారు. ఆయనను బదిలీ చేసినా, చర్యలు తీసుకున్నా ప్రభుత్వ పెద్దలు ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్‌ చేసి... మళ్లీ అదే అధికారిని, అదే స్థానంలో కూర్చోబెట్టగలరని గ్రహించారు. అందుకే... అదునుకోసం వేచి చూశారు. ఇటీవల సదరు అధికారి అనుమతుల్లేకుండా విదేశీ యాత్రలకు వెళ్లడం, మరో ప్రాజెక్టుకు అడ్డగోలుగా రుణాలు మంజూరు చేయడంలాంటి ఘటనలు జరిగాయి. ‘ఇదే తగిన సమయం’ అనుకుని ఆ అధికారిని ఏపీ వ్యవహారాల నుంచి తప్పించారు. బయట ఎక్కడా పోస్టింగ్‌ కూడా ఇవ్వలేదు. ముంబై హెడ్‌ ఆఫీసులో రిపోర్టు చేయాలని ఆదేశించారు. సాధారణంగా ఇలాంటి తప్పిదాలకు అంత పెద్ద శిక్ష వేయరు. స్థానచలనంతో సరిపెడతారు. కానీ... పోస్టింగ్‌ కూడా ఇవ్వకుండా పక్కకు తప్పించడం గమనార్హం. ఇది... బ్యాంకింగ్‌ రంగంలో అసాధారణమని, జగన్‌ సర్కారుతో అంటకాగినందుకే ఆ అధికారిపై వేటు పడిందని చెబుతున్నారు. తనను ఏపీ బాధ్యతల నుంచి తప్పించారని సమాచారం అందగానే ఆ హెడ్‌ వెంటనే ఏపీ ప్రభుత్వ పెద్దలను కలిసినట్టు ఆ బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి. 

 

చేసిన తప్పులు ఇవే.. 

కేంద్రం నుంచి వివిధ పథకాల కోసం ప్రతి ఏటా ఏపీకి రూ.16,000 కోట్ల దాకా నిధులు వస్తాయి. రాష్ట్ర ప్రభుత్వం మ్యాచింగ్‌ గ్రాంట్‌ కింద రూ.10 వేల కోట్ల నుంచి రూ.12 వేల కోట్లు భరించాల్సి ఉంటుంది. కానీ... తనవాటా నిధులు ఇవ్వకపోగా, కేంద్రం పంపే నిధులను పీడీ ఖాతాల్లో పెట్టి, సొంతానికి వాడుకుంటూ వస్తోంది. దీనిపై కేంద్రానికి భారీగా ఫిర్యాదులు వచ్చాయి. దీంతో... ప్రతి పథకానికీ విడివిడిగా బ్యాంకులో ఖాతా తెరవాల్సిందే అని కేంద్రం చెప్పడంతో...  రాష్ట్రం ఎస్‌బీఐని సంప్రదించింది. ‘కేంద్రం నుంచి  పథకాల కోసం మీ బ్యాంకుకు ఏటా రూ.17,000 కోట్ల వరకు వస్తాయి. ఆ మొత్తాన్నే  హామీగా భావిస్తూ... రాష్ట్రం ఇవ్వాల్సిన మ్యాచింగ్‌ గ్రాంటును ఓడీ రూపంలో ఇచ్చేయండి’ అంటూ ‘అతితెలివి’ ప్రతిపాదన చేసింది.  ఈ ప్రతిపాదన అసాధారణంగా, వింతగా ఉండడం... అప్పటికే ఏపీఎ్‌సడీసీ విషయంలో దెబ్బతినడంతో ఎస్‌బీఐ ఇందుకు ‘ససేమిరా’ అంది. అదే సమయంలో... ‘మనోడే’ స్టేట్‌ చీఫ్‌గా ఉన్న మరో బడా బ్యాంకు అధికారి ‘ఆపన్న హస్తం’ అందించారని, ఎస్‌బీఐ ‘నో’ చెప్పిన ప్రతిపాదనకు ఆయన ‘ఎస్‌’ చెప్పారని తెలిసింది.

 

ఇటీవల ఏపీ ప్రభుత్వం పంటల మార్కెట్‌ ఫీజులు పెంచి అదనపు ఆదాయం అంటూ ఒక జీవో ఇచ్చిన సంగతి తెలిసిందే. ఆ అదనపు ఆదాయాన్ని చూపి మార్క్‌ఫెడ్‌ ద్వారా రూ.1700 కోట్ల అప్పు తెచ్చారు. దీనికి కూడా అదే బ్యాంకు అధికారి సహకరించారు. ఇలాంటివి ఇంకా చాలా ఉదంతాలున్నాయని ఆ బ్యాంకు వర్గాలు చెబుతున్నాయి.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...