Jump to content

మందు బాబులూ.. మీకో దండం


Recommended Posts

తాగిన సీసాలు పగలగొట్టి పడేయొద్దు

మందు బాబులకు ఆర్మీ అభ్యర్థుల వేడుకోలు

బహిరంగ ప్రదేశాల్లో మందు సీసాలు ఏరివేత

 

చోడవరం (అనకాపల్లి జిల్లా), జూలై 8: ‘మందు బాబులూ.. మీకు చేతులెత్తి మొక్కుతాం. ఇలా బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా తాగి, ఆ సీసాలు పగులగొట్టి ఎక్కడపడితే అక్కడ పడేసి మమ్మల్ని ఇబ్బంది పెట్టొద్దు. ఆ గాజు పెంకులు గుచ్చుకుని గాయాలపాలవుతున్నాం...’ అంటూ ఆర్మీకి శిక్షణ పొందుతున్న పలువురు అభ్యర్థులు విజ్ఞప్తి చేశారు. అనకాపల్లి జిల్లా చోడవరం శివారు అన్నవరం ప్రాంతంలోని ఒక డిఫెన్స్‌ అకాడమీలో పలువురు అభ్యర్థులు ఆర్మీలో ఎంపిక కోసం శిక్షణ పొందుతున్నారు. వారంతా శుక్రవారం అన్నవరం ప్రాంతంలోని బహిరంగ ప్రదేశాల్లో విచ్చలవిడిగా పడేసిన మద్యం సీసాలు, పగిలిన గాజుపెంకులను ఏరివేశారు. అలా సేకరించిన గాజు పెంకులు, మందు బాటిళ్లను ఒక్కచోట పోగుచేసి మందుబాబులకు దండం పెడుతూ.. తాగిపడేసిన మద్యం సీసాలు, గాజుపెంకుల వల్ల తమకు ఇబ్బంది కలుగుతోందంని ఆవేదన వ్యక్తంచేశారు. గాజు పెంకులు గుచ్చుకుని గాయాల పాలవుతున్నామన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై చర్యలు చేపట్టాలని పోలీసులకు విజ్ఞప్తి చేశారు.

idhi chaalaa serious issue. mandhu seesaalanu pagalakotti polaallo, canals lo, roads meedha padesthunnaaru. manam cheppulu vesukuntaam. cattle, dogs, other stray animals road meedha vellinappudu ee seesaa penkulu guchukuni suffer avuthunnaayi. ee seesaa penkulu guchukunte septic avuthundhi.

animals lovers needs to focus on this issue.

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...