Jump to content

Recommended Posts

హే..ఏహేహే..హే..
ఆహా హా హా ఆహా అహా హా

వయసు ముసురుకొస్తున్నదీ..

వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది..
సూది మెరుపులా

వయసు ముసురుకొస్తున్నదీ..
వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది..
సూది మెరుపులా

అయ్య బాబో..య్ ఆగలేనూ..


ఆ ముసురూ.. ఈ విసురూ..

ఆపలేను..ఊ..ఊ

వయసు ముసురుకొస్తున్నదీ..

వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది..
సూది మెరుపులా

అయ్య బాబో..య్ ఆగలేనూ..


ఆ ముసురూ.. ఈ విసురూ..

ఆపలేను..ఊ..ఊ


కన్నుల తెర తీసి..
వెన్నెల వల వేసీ..

కన్నుల తెర తీసి..
వెన్నెల వల వేసీ..

ప్రాణం లాగేసి..పోతే ఎలా...

యేటి కాడ కన్నుకొట్టి..
తోట కాడ చేయిపట్టి..

యేటి కాడ కన్నుకొట్టి..
తోట కాడ చేయిపట్టి..

నా పైట ఈ పూట
నాజూకుగా లాగి పట్టి

మెలికేస్తే..ఎలా..ఎలా..
పెనవేస్తే ఎలా..ఎలా..

అయ్య బాబోయ్ ఆగ లేనూ

ఆ ముసురూ..ఈ విసురూ..

ఆపలేనూ..

వయసు ముసురుకొస్తున్నదీ..

వాన మబ్బులా

సొగసు దూసుకొస్తున్నది..
సూది మెరుపులా..


చెంపలు నిమిరేసీ....
సిగ్గులు కాజేసీ..

చెంపలు నిమిరేసీ....
సిగ్గులు కాజేసీ..

నిప్పులు చెరిగేసి పోతే ఎలా.....

నిన్న కలలో వెన్ను తట్టి..
మొన్న కలలో ముద్దు పెట్టి..

నిన్న కలలో వెన్ను తట్టి..
మొన్న కలలో ముద్దు పెట్టి..

ఆపైనా నాలోన
తీపి సెగలే రగులబెట్టి

ఊరుకుంటే ఎలా..ఎలా..
జారుకుంటే ఎలా..ఎలా..

అయ్యబాబోయ్ ఆగలేనూ..

ఆ ముసురూ...ఈ విసురూ..
ఆప లేనూ..
హే..ఏహేహే..హే..
ఆహా హా హా ఆహా అహా హా
ఆ..ఆహా హా...ఆహా హా...

Link to comment
Share on other sites

(0:31 sec) NTR knows how to sell his 'male appeal' - No director will tell that, he knows how to stamp his aura, be it in Jagadekaveeruni katha with 4 heroines or here in Yamagola with Manjubhargavi -a little nudge, ' hey !  Iam the boss here '

ఆడవే అందాల సురభామిని
ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
గానమేదైనా స్వరములొక్కటే
పనిపస నిసనిగ నిపమగ మపగస మగసని సగని
నాట్యమేదైనా నడక ఒక్కటే
భాష ఏదైనా భావమొక్కటే
అన్ని కళల పరమార్థమొక్కటే అందరినీ రంజింపజేయుటే
ఆ ఆ ఆడవే అందాల సురభామిని

ఓహో రంభా సకల కళానికురంభా
రాళ్ళనైనా మురిపించే జాణవట అందానికి రాణివట
ఏదీ నీ హావభావ విన్యాసం
ఏదీ నీ నాట్యకళాచాతుర్యం
ఆఆఆ ఆఆఆ ఆఆఆఆఆఆ
అరువది నాలుగు కళలందు మేటిని అమరనాథునికి ప్రియ వధూతిని
అరువది నాలుగు కళలందు మేటిని అమరనాథునికి ప్రియ వధూతిని
సరసాలలో ఈ సురశాలలో
సరసాలలో ఈ సురశాలలో సాటిలేని శృంగార వాసిని నిత్యనూతన రాగ స్రవంతిని రసవంతిని జయ జయవంతిని

రసవంతిని జయ జయవంతిని

ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
ఓహో ఊర్వశీ అపురూప సౌందర్య రాశి
ఏదీ నీ నయన మనోహర నవరస లాస్యం
ఏదీ నీ త్రిభువన మోహన రూప విలాసం
మదనుని పిలుపే నా నాదము స్మర కదన శాస్త్రమే నా వేదము
మదనుని పిలుపే నా నాదము స్మర కదన శాస్త్రమే నా వేదము
కనువిందుగా కరగని పొందుగా కోటి స్వర్గాలు చూపించు నా స్నేహము
అంతులేని శృంగార పిపాసిని
తరతరాల మీ ప్రేయసిని చారుకేశిని

ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని

ఓహో మేనకా! మదన మయూఖా
సాగించు నీ రాసలీలా చూపించు శృంగార హేలా
సాగించు నీ రాసలీలా
నగవులతో మేని బిగువులతో
నగవులతో మేని బిగువులతో వగలొలికించు వయ్యారి నెరజాణను
ఏ చోట తాకినా
ఏ గోట మీటినా
మధువులొలికించు మరులు చిలికించు మధురమైన రసవీణను రతిరాజ కళా ప్రవీణను
సారంగలోచనను
ఆడవే అందాల సురభామిని పాడవే కళలన్నీ ఒకటేననీ
ఆడవే అందాల సురభామిని
Link to comment
Share on other sites

పెనుతుఫాన్లలొచ్చినా  ఎంటీవోడి సినిమా చూస్తే కాస్సేపు హాయిగా అన్నీ మర్చిపోవచ్చు - సగటు ఆంధ్రుడి జీవితంతో గాఢంగా పెరిగి అల్లిబిల్లి గా పెనవేసుపోయిన అభిమానం

Link to comment
Share on other sites

అరణ్యకాండ ప్రారంభంలో విరాధుడ్ని చంపేముందు దండకారణ్యం లో రాముడు సీత లక్ష్మణులతో కలిసి ఒక మునుల ఆశ్రమమండలికి  వచ్చినప్పుడు,  ఆ అరణ్యవాసులంతా కళ్ళు విప్పార్చుకుని రాముడ్ని చూస్తా వుంటారు - ఏమిటి ఇంతందంగా ఉన్నాడు, ఈ కాంతి ఏంటి, ఈ వాలకం ఏంటి అని ఆశ్చర్యం....

ఈ పాట చూసినప్పుడల్లా ఒక్క రవ్వ రామాయణంలో అరణ్యకాండ ఫీల్ వస్తది....ఎన్టీఆర్ బాడీ లాంగ్వేజ్ గుంభనంగా సాగే గంగా నదిలా ఒక చోట, వడివడిగా ఒక్కోచోట ....ఏనుగు నడకలా అందంగా బరువుగా ఒక్కోచోట .... మొత్తం ఆహార్యం - రంగరించిన రాజసం ....ఆ  వన్యజనం లో కనిపించే ఇష్టం, ప్రేమతో చేసే నాట్యం, ఎనర్జీ  విన్సెన్ట్ బాగా కాప్చర్ చేసాడు...

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...