Jump to content

మధ్యాహ్నం భోజనం చెయ్యలేదు - బెంచీ మీద కూర్చొని


Cyclist

Recommended Posts

ఒక చెక్క బెంచీ వేశారు విచారణ గది బయట. పొద్దున నుండి అడుగుతున్నారు. మధ్యాహ్నం దాటింది భోజనం చెయ్యలేదు. ఆ బెంచీ మీద కూర్చొని వేచి ఎదురుచూశాడు, విచారణ ఎదుర్కొన్న వ్యక్తి.

సాయంత్రం వరకు ఒకే రోజులో వైఎస్ రాజశేఖర్ రెడ్డి వేయించిన విచారణకు కుప్పంలో చంద్రబాబు నాయుడు సహకరించి, అక్కడ తప్పు జరగలేదని నిరూపించుకున్నాడు. అది నాయుడి బెంచ్ మార్క్ నీతి విషయంలో. కక్షతో అలాంటి కమిటీలు ఎన్నో వేశాడు. కేసులు పెట్టించాడు, వైఎస్సార్. ఒక కమిటీగాని & ఒక్క కేసుగాని ఆయన పాలనలో ఒక్క పొరబాటును ఎత్తి చూపలేదు.

వైఎస్సార్ పోయినా.. ఆయన కొడుకు ఏకంగా తన కన్న తల్లిని పంపాడు కోర్టుకు. అక్కడా కేసు ఉపసంహరించుకొన్నారు. ఏకంగా తాడేపల్లిలో
ఆళ్ల రామక్రిష్ణా రెడ్డిని కోర్టు చెట్టు క్రింద నాయుడి పాలనలపై కేసుల కోసం పెట్టారు. అదే అలవాటై, ఇటీవల ఎస్సీ ఎస్టీ భూ సమీకరణలో అన్యాయం జరిగిందని సిఐడి వద్దకు లెగెత్తుకెళ్లి పెట్టాడు. ఏదీ నిరూపించలేక.. గేదె పేడ పట్టడం నుండి చెట్లు ఎక్కే వరకు ఎన్నో చేష్టలతో ప్రజాసేవలో పిచ్చెక్కిపోతున్నారు. ఫైబర్ నెట్ నుండి ఎన్నో కేసుల కథలు అల్లి జగన్ రెడ్డి అలసిపోతున్నారు, ఇంకా. విసిగిపోయి ఫ్రస్టేషన్ తో ఆయన ఇంటి మీద, పార్టీ ఆఫీసు మీద, అసెంబ్లీలో ఆయన భార్య మీద వ్యక్తిగత దాడి చేసి, ఆనందించారు జగన్ రెడ్డి.

ఇలా పొరబాటున కేసు వేశాం విరమించుకొంటున్నాం అని ఒక్క నాయకుని విషయంలో జరిగింది. దటీజ్ నాయుడు. ఆయన బెంచ్ మార్క్.

కానీ వైఎస్సార్ మీద ఒకే ఒక్క కేసు పెట్టే ముందు, అసెంబ్లీలో ఆ అవినీతి గురించి జగన్ పెంపకం గురించి చర్చించారు, నాయుడు. వైఎస్సార్ ఎదురుదాడి చూసి కేంద్రానికి ఫిర్యాదు చేస్తే పట్టించుకోలేదు. రాష్ట్రపతికి ఫిర్యాదు చేశారు, పట్టించుకోలేదు. వైఎస్ పోయాక శంకర్ రావు హైకోర్టులో వేసిన కేసులో, టీడీపీ తరపున ఎర్రం నాయుడిని ఇంప్లీడ్ చేశారు.

43000 కోట్లా చిల్లర మీద ప్రాథమిక ఆధారాలతో అరెస్ట్ అయ్యి.. దాని మోతాదుతో 16 నెలలు బెయిలు రాలేదు జగన్ రెడ్డికి.

ఆ అరెస్ట్ దశమ వార్షికోత్సవం రేపటి నెలలో వస్తోంది.

ప్రజాప్రతినిధులు విచారణకు ఇంత ఆలస్యమా అని అన్ని కేసులను మానిటర్ చేస్తూ ఇటీవల కాలంలో ఉరుముతున్న సుప్రీంకోర్టుకు, ఇన్ని వేల కోట్ల జగన్ విచారణ మీద సమాధానం చెప్పుకోవాలి కాబట్టి, ముగింపు పలకక తప్పదు. లాలూ తన భార్యకు పగ్గాలు ఇచ్చి జైలుకు వెళ్లారు. అలా ఇక్కడ ముందే మానసికంగా వైకాపా పార్టీని సిద్ధం చేయడానికి ఇటీవలి ఉగాది వేడుకలు, గవర్నర్ ను కలవడం లాంటి సందర్భాలను వాడుకోవడం, మనం గమనించవచ్చు.

కానీ అది కూడా నెరవేరుతుందా అనేది అనుమానం, మనం తమిళనాడులోని జయలలిత కేసులో అరెస్ట్ అయ్యి శిక్ష అనుభవించిన వారి జాబితా చూస్తే.

పోయిన పుణ్యాత్ముడు వైఎస్సార్ బెంచ్ మార్క్ ఇది. ఆయన కుటుంబ బెంచ్ మార్క్ ఇది అని కాలం తప్పక జనం కళ్లు తెరిపిస్తుంది. #చాకిరేవు

 
Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...