Jump to content

7వ సారి ఇచ్చిన షాక్ తో, కొంచం కొంచం నయం అవుతోంది.


Cyclist

Recommended Posts

ఇంటికి వెళితే హాలులో ట్యూబ్ లైటు వెలగడం లేదు అన్నారు. ట్యూబును & చౌక్ ను త్రిప్పినా లైటు వెలగలేదు. ట్యూబును చూడగా ఓ వైపు నల్లగా కనిపించింది.

హార్డ్వేర్ షాపుకు వెళ్లి, ట్యూబ్ అడిగా. చేతిలో బిల్టిన్ ఎల్ఇడి సెట్ పెట్టారు. కాదండి ట్యూబ్ మాత్రం చాలు అన్నా. అవి రావండి, ఇప్పుడు ఇది సెట్ గా వస్తుంది, తీసుకెళ్లి కనెక్ట్ చేసి స్విచ్ వేసుకోండి అన్నారు. చాలా లైట్ వైట్. మూడు వందలా చిల్లర చెప్పారు.

అంతకు ముందు 2015లో కేంద్రం ఎల్ఇడి బల్బులు పథకం ప్రకటిస్తే, ఆంధ్రా అందిపుచ్చుకొని, కేవలం 10 రూపాయలకు ఒక బల్బు చొప్పున, ఇంటికి రెండేసి బల్బులు ఇచ్చింది. అలా సుమారు రెండు కోట్ల బల్బులు పంపిణీ చేశాక, వదిలిపెట్టలేదు. ఒక సర్వే చేశారు ఆంధ్రాలో. నలభై రెండు కోట్లా పది లక్షల యూనిట్లు ఆదా అయ్యింది అని ప్రకటించారు. ఇప్పటి సరాసరి యూనిట్ ధర 8 వేసుకొన్నా 336 కోట్లు ఆదా అయ్యింది.

వీధుల్లో కూడా అమర్చారు. ఏకంగా వైజాగ్ లో సెన్సార్లు కూడా పెట్టారు. కొనడానికి & అమలు చేయడానికి పెట్టిన ఖర్చులు లాభంలా మారింది. అలాంటి సంస్కరణలు అమలుచేస్తూ.. ఉత్పత్తి పెంచుతూ.. 2018 వచ్చేసరికి దేశంలో ఏ రాష్ట్రామూ సాధించలేనన్ని 105 జాతీయ అవార్డులను సాధించింది ఆంధ్ర.

అదే సంవత్సరం మరో 3 జాతీయ అవార్డులు వచ్చి 108 అవార్డులు అయ్యాయి.

ఆ మూడు అవార్డులు ఎందుకో తెలుశా? దేశంలో 24 x 7 క్వాలిటీ & రిలయబుల్ పవర్ సప్లై చేసినందుకు ఆంధ్రాకు ఆ గౌరవాలు ఇచ్చారు.

దేశంలో ఏ సిఎంకూ సాధ్యం కాని ఆ పనితనం చూపడమే కాదు, ప్రజల మీద కనికరంతో, తాను పాలించిన 5 ఏళ్లు ఒక్క సారి కూడా నాయుడు కరెంటు చార్జీలు పెంచలేదు.

అలాంటి పాలనలో ఒక పాటగాడు ప్రజల్లోకి వచ్చాడు బాదుడే బాదుడు అనే తప్పుడు కూతల రాగాల పల్లవితో. పిచ్చి జనం వెఱ్రెక్కిపోయారు. ఆ తప్పుడు కూతలకు పరవశిస్తూ మదపిచాచాలు కొన్ని మగాడు అని వెనుక పాడారు.

జనం తమ కర్మను మరోలా వ్రాసుకొన్నారు.

వెఱ్రెక్కిన జనంకు ముచ్చటగా మూడేళ్లకే 7వ సారి కూడా భారీగా కరెంటు షాక్ ఇచ్చారు. కొంచం కొంచం నయం అవుతోంది.

మంచికి చెడుకు
ధర్మానికి అధర్మానికి
న్యాయానికి అన్యాయానికి
అనుభవానికీ అవినీతికి

కొంచం కొంచం తేడా తెలిసివస్తోంది అని అక్కడక్కడా పెడుతున్న గోలలను బట్టి అర్థం అవుతోంది. #చాకిరేవు

Link to comment
Share on other sites

Archived

This topic is now archived and is closed to further replies.

  • Recently Browsing   0 members

    • No registered users viewing this page.
×
×
  • Create New...